Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

అయ్యో.. ఉప్పెక్కడ పెట్టానో కనిపించడం లేదే.. కప్‌బోర్డ్‌లో ఎక్కడో ఒకచోట ఉప్పు డబ్బా పెట్టడం, ఇలా రోజూ దాని గురించి వెతకడం ప్రత్యూషకు అలవాటే. నేహ తన కిచెన్‌లో పప్పులన్నీ ఒకే తరహా డబ్బాల్లో భద్రపరుస్తుంటుంది. అయితే అవి ట్రాన్స్‌పరెంట్‌గా లేకపోవడంతో ఏ పప్పు ఏ డబ్బాలో ఉందో పదే పదే మూత తీసి చూడాల్సిందే! రాగిణి ఆఫీసుకెళ్లే హడావిడిలో గిన్నెలన్నీ తోమి ఆదరాబాదరాగా ఓ టబ్‌లో వేసేస్తుంది. ఇక సాయంత్రం ఇంటికొచ్చాక అందులో టీ గిన్నె ఎక్కడుందో వెతుక్కోవడానికి రోజూ కాస్త సమయం వృథా అవుతుందంటోంది. ఇలా మనం కిచెన్‌ని ఎంత చక్కగా సర్దుకున్నా.. కొన్ని కొన్ని పదార్థాలు, వస్తువుల కోసం రోజూ వెతుక్కుంటూ ఉంటాం. మరి, ఇలాంటి కన్‌ఫ్యూజన్‌కి చెక్‌ పెట్టాలంటే ‘కిచెన్‌ ర్యాక్స్‌’ని మన వంటింట్లో భాగం చేసుకోవాల్సిందే! గరిటలు, గిన్నెల దగ్గర్నుంచి పప్పులు, స్పైసెస్‌.. వంటి పదార్థాల వరకు అన్నీ వేటికవే సెపరేట్‌గా అమర్చుకోవడానికి ప్రస్తుతం ఇలాంటి బోలెడన్ని మల్టీ పర్పస్‌ ర్యాక్స్‌ మార్కెట్లో అందుబాటులోకొచ్చేశాయి. ఏ ర్యాక్‌లో సర్దేవి ఆ ర్యాక్‌లో అరేంజ్‌ చేస్తే పని తగ్గడంతో పాటు సమయమూ ఆదా అవుతుంది.. అంతేనా.. కిచెన్‌ కూడా నీట్‌గా కనిపిస్తుంది.. పైగా వీటికంటూ ప్రత్యేకంగా కాస్త స్పేస్‌ కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. గోడలు, చిన్న చిన్న ఖాళీ ప్రదేశాల్లో ఇట్టే ఇమిడిపోయే ఇలాంటి కొన్ని విభిన్న కిచెన్‌ ర్యాక్స్‌/మల్టీ పర్పస్‌ ర్యాక్స్‌ గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..

‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు’ అని ఓ సామెత ఉంది. నిజమే పొట్టనిండా పోషకాలు నింపుకున్న ఉల్లిపాయ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. గుండె జబ్బుల నివారణకు, రక్త ప్రసరణ మెరుగుపడడానికి, కేశ సంపదకు.. ఇలా అటు ఆరోగ్యపరంగా, ఇటు అందానికీ ఉల్లి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఏ వంటకమైనా సరే రుచిగా రావాలంటే అందులో ఉల్లిపాయల్ని వేయాల్సిందే! అయితే వీటికోసం మార్కెట్లకు పరుగులు పెట్టే వారు కొందరైతే.. ఇంట్లోనే సాగు చేసుకునే వారు మరికొందరు. ఇలా ఇంట్లోనే ఉల్లిపాయల్ని పెంచుకోవడం వల్ల ఉల్లిధరలు ఆకాశాన్నంటినప్పుడు కూడా ఎలాంటి కొరతా లేకుండా వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇంట్లో ఉల్లి సాగా.. కాస్త కష్టంగా ఉంటుందేమో.. అనుకుంటే పొరపాటే! ఎందుకంటే కాస్త ఓపిక, శ్రద్ధ పెడితే ఇంటి వరండాలోనే ఎంచక్కా ఉల్లిపాయల్ని సాగు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

మట్టిపాత్రలు.. వీటిని చూస్తే మనం చిన్నతనంలో అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్లింట్లో భోజనం చేసిన రోజులు గుర్తుకొస్తాయి. అయితే కాలక్రమేణా గ్యాస్‌ స్టౌ, స్టీల్‌ పాత్రలు, నాన్‌స్టిక్‌ కుక్‌వేర్‌.. ఇలా వంట చేసుకునే పద్ధతుల్లో మార్పులు చోటుచేసుకోవడంతో మట్టిపాత్రలు క్రమక్రమంగా కనుమరుగైపోయాయి. అయితే ప్రతి ఒక్కరిలో ఆరోగ్య స్పృహ పెరుగుతోన్న నేటి రోజుల్లో మట్టి పాత్రలు వాడే వారు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలోనే టెర్రకోటాతో రూపొందించిన మట్టిపాత్రలు ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఒక్క వండుకునే పాత్రలే కాదు.. టీ కప్స్‌ దగ్గర్నుంచి డిన్నర్‌ సెట్‌ దాకా.. వంటింటిని మొత్తం మట్టి పాత్రలతో నింపేలా ప్రతి ఒక్కటీ టెర్రకోటాతో అందంగా తీర్చిదిద్ది మన ముందుకొచ్చేస్తున్నాయీ మట్టి వస్తువులు. మరి, టెర్రకోటాతో రూపొంది, ఆధునికతో హంగులద్దుకొని ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తోన్న కొన్ని మట్టి పాత్రల గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..

లలిత: ఏంటమ్మా ఇది.. ఇంట్లో ఉండేది ఇద్దరే అయినా, ఇంటి ఖర్చు మాత్రం నలుగురున్న కుటుంబానికి సరిపడేలా ఉంది.. శ్రీజ: ఎందుకో తెలియట్లేదమ్మా.. ఖర్చులు మాత్రం పెరిగిపోతున్నాయి. ఎంత తగ్గిద్దామన్నా కుదరట్లేదు. ఎక్కడ తగ్గించాలో అర్థం కావట్లేదు. లలిత: నీకే కాదు.. నీలా కొత్తగా పెళ్త్లెన వాళ్లందరికీ ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. ఖర్చులు ఎక్కువవుతుంటాయి. వృథా మాత్రం ఎక్కడ జరుగుతుందో అర్థం కాదు. కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇది జరుగుతుంది. ఆ పొరపాట్లని సరిదిద్దుకోనంత కాలం ఇంటి బడ్జెట్ పరిమితి దాటిపోతూనే ఉంటుంది. నిజమే.. శ్రీజలాంటి వారు ఎంతోమంది ఉంటారు. ఇలాంటివారు అసలు తాము ఏమేం ఖర్చులు పెడుతున్నాం, డబ్బు ఎక్కడ వృథా అవుతోందని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ క్రమంలో సాధారణంగా ఎక్కువ మంది ఎలాంటి విషయాల్లో వృథాగా ఖర్చు పెడతారో ఓసారి తెలుసుకుందామా..

‘నువ్విప్పుడు అన్నం తినకపోతే బూచాడు పట్టుకుపోతాడు..’, ‘చూడు చూడు చందమామ నిన్నే చూస్తున్నాడు..’, ‘నువ్వు అన్నం తినకపోతే.. ఇదిగో ఈ బుజ్జి కుక్కపిల్ల నీ అన్నమంతా తినేస్తుంది..’ పిల్లల చేత గోరుముద్దలు తినిపించేటప్పుడు తల్లులు ఇలా ఎన్నెన్ని కబుర్లు చెబుతారో మనకు తెలిసిందే. ఇలా వాళ్ల చేత కాస్త బలవంతంగా తినిపించాలని చూసినా.. అన్నం గిన్నెను నెట్టేస్తారు. అంతే అందులోని అన్నమంతా నేలపాలు. అంతేకాదు.. ఎవరికి వారు సొంతంగా తినే పిల్లలైనా సరే.. ఎంతో రుచికరంగా వండి వడ్డించినా తిననంటూ మారాం చేస్తుంటారు. దీంతో తల్లులకు విసుగొచ్చేస్తుంటుంది. మరి పిల్లలు తల్లులకు ఎలాంటి కష్టం కలిగించకుండా అన్నం తినాలన్నా.. వాళ్లు తినే గిన్నె నెట్టేసినా, బోర్లించినా అందులోని పదార్థం కిందపడకుండా ఉండాలన్నా.. అందుకోసం బోలెడన్ని గ్యాడ్జెట్లు మార్కెట్లోకొచ్చేశాయి. మరి, చిన్నారులకు ఆహారం తినిపించే లేదా వారే స్వయంగా ఆహారం తినే పనిని మరింత ఈజీ చేసేసిన అలాంటి కొన్ని గ్యాడ్జెట్ల గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..

కాయగూరలు తరగడానికైనా, పండ్లను ముక్కలుగా కట్‌ చేయాలన్నా.. చాపింగ్‌ బోర్డ్‌ తప్పనిసరి. ఒక్కమాటలో చెప్పాలంటే చాపింగ్‌ బోర్డ్‌ లేని కిచెన్‌ అసంపూర్ణమనే చెప్పుకోవాలి. అంతలా వంటింట్లో కీలక పాత్ర పోషిస్తోందీ బోర్డ్‌. అయితే చాపింగ్‌ బోర్డ్ అనగానే మనందరికీ ఫ్లాట్‌గా ఉండే సాధారణ కటింగ్‌ బోర్డులే గుర్తొస్తాయి. కానీ వాటిని తలదన్నే వెరైటీ చాపింగ్‌ బోర్డులు ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. చూడడానికి ఆకర్షణీయంగా ఉండడమే కాదు.. అందుబాటు ధరల్లోనే లభిస్తోన్న ఈ బోర్డులతో కాయగూరల్ని తరిగే పని కూడా కాస్త ఈజీగా పూర్తవుతుంది. మరి, అలాంటి కొన్ని విభిన్న చాపింగ్‌ బోర్డులు, అవి మనకెలా ఉపయోగపడతాయో ఈ వారం తెలుసుకుందాం రండి..