Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

కరోనా రక్కసిపై త్రీడీ పోరుకు సిద్ధమమయ్యారామె. వైద్యులకు అండగా త్రీడీ మాస్కులు, ఫేస్‌షీల్డ్‌లు తయారు చేశారు. భవన నిర్మాణంతో పాటు వివిధ రంగాల్లో విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన త్రీడీ ప్రింటింగ్‌ సాంకేతికతను ఉపయోగించి వీటిని ఆవిష్కరించారు జేఎన్‌టీయూ నానోసైన్స్‌ విభాగం సహాయ ఆచార్యులు సీహెచ్‌ శిల్పాచక్ర. మాస్కులకు డిమాండ్‌ పెరిగిన వేళ.. పునర్వినియోగించుకునేలా వీటిని రూపొందించారు. కరోనా బాధితులకు చికిత్స అందించే డాక్టర్లు వీటిని ధరిస్తే వైరస్‌ సోకకుండా మరింత భద్రత లభిస్తుందని చెబుతున్నారామె. ఫేస్‌షీల్డ్‌ ముఖమంతటికీ రక్షణ కల్పిస్తుంది. రోగిని పరీక్షిస్తున్న సమయంలో నోటి తుంపర్లు ముఖంపై పడకుండా అడ్డుకుంటుంది. ఇప్పటికే త్రీడీ ప్రింటర్‌ సాయంతో 30 ఫేస్‌షీల్డ్‌లు తయారు చేశారామె. వైద్యుల అభ్యర్థన మేరకు మరో 200 తయారు చేస్తున్నామన్నారు. ఒక ప్రింటర్‌ సాయంతో ఒక్కరోజులో 60 ఫేస్‌షీల్డ్‌లు తయారు చేయొచ్చని వివరిస్తున్నారామె.

చైనాలో పుట్టిన ‘కరోనా’ వైరస్‌(కొవిడ్‌-19) ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇటీవలే భారత్‌లో కూడా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దాని బారిన పడకుండా ఉండేందుకు చాలామంది సాధారణ మాస్క్‌లతో పాటు, ఎన్‌-95 మాస్క్‌లను వాడుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలో మాస్క్‌ల కొరత ఏర్పడింది. కొన్ని చోట్ల లభించినా ధర అధికంగా వసూలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఫలితంగా మాస్కులు దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సామాజిక అంశాల్లో ప్రజలను చైతన్య పరచడంలో ముందుంటుంది మెగా కోడలు ఉపాసన కొణిదెల. ఇటీవలే కరోనా వైరస్‌కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఓ వీడియోని పోస్టు చేశారామె. తాజాగా ఫేస్‌ మాస్క్‌లను ఇన్‌స్టంట్‌గా ఎలా తయారు చేసుకోవాలో వీడియో రూపంలో సోషల్‌ మీడియా వేదికగా వివరించారు ఉపాసన. అంతేకాకుండా మనకి కానీ మన చుట్టూ ఉన్నవారికి కానీ కరోనా లక్షణాలున్నప్పుడు మాత్రమే మాస్క్‌లను ధరించాలని ఆమె సూచించారు.