Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

‘ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా..’ ఈ పాట విడుదలై దాదాపు 21 సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఈ పాట బాలీవుడ్‌ ఎవర్‌గ్రీన్‌ లిస్ట్‌లో ముందుంటుందనడంలో సందేహం లేదు. ఈ పాట వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బాలీవుడ్‌ బ్యూటీ మలైకా అరోరానే. ఓ టీవి ఛానల్‌లో వీడియో జాకీగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన మలైకా.. ‘దిల్‌ సే’ చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌తో పాపులర్‌ అయిపోయింది. ఆపై అంచెలంచెలుగా ఎదుగుతూ.. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ మూవీలో ‘మున్నీ బద్‌నామ్‌ హుయి’ పాటతో మరోసారి సంచలనానికి తెరలేపిందీ మున్నీ. బాలీవుడ్‌ ఫేమస్‌ స్టార్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న మలైకా.. దాదాపు 29 సంవత్సరాల క్రితం మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టిన సమయంలో తను ఎదుర్కొన్న సమస్యల గురించి, అలాగే వీగన్‌గా మారడం వల్ల ఉన్న ఉపయోగాల గురించి చెప్పుకొచ్చింది. మరి ఆ విశేషాలను తన మాటల్లోనే విందాం రండి..

ఫస్ట్‌ జాబ్‌, ఫస్ట్‌ శాలరీ.. ఇవి అందుకున్న వారు ప్రపంచాన్నే ఏలినంతగా సంబరపడిపోతారు.. ప్రపంచపు సంకెళ్లను తెంచుకొని స్వేచ్ఛాలోకంలో విహరిస్తుంటారు. తమ సంపాదనతో నచ్చిన డ్రస్సులు కొనుక్కోవడం, ఫ్రెండ్స్‌తో సినిమాలు-షికార్లకు వెళ్లడం, ఇష్టమైన ఆహారం లాగించేయడం.. ఇలా వారి లైఫ్‌స్టైలే వేరుగా ఉంటుంది. ఒకప్పుడు తానూ ఇలాంటి జీవితాన్నే ఆస్వాదించానని చెబుతోంది కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్‌. తనకెంతో ఇష్టమైన న్యాయవాద వృత్తిని చేపట్టిన తర్వాత వచ్చిన సంపాదనతో విలాసవంతమైన, ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతూ తాను స్థూలకాయం బారిన పడిన విషయాన్ని కూడా విస్మరించానని చెబుతోందీ ముద్దుగుమ్మ.

ఆఫ్‌స్క్రీన్‌లో ఎలా ఉన్నా.. ఆన్‌స్క్రీన్‌పైకి రావాలన్న ఆలోచన వచ్చిందంటే అందంగా, ఫిట్‌గా మారాల్సిందే! అది నాలుగైదు కిలోలైనా సరే.. ఆ బరువును తగ్గించుకొని నాజూగ్గా కనిపించాల్సిందే! అందుకోసమే నిరంతరం చక్కటి డైట్‌, వ్యాయామాలతో తమ శరీరాకృతిని కాపాడుకుంటారు మన ముద్దుగుమ్మలు. కెరీర్‌ ప్రారంభంలో తానూ ఇలానే చేశానంటోంది టాలీవుడ్‌ అందాల తార రాశీ ఖన్నా. సినిమాల్లోకి రాకముందు మరీ అంత చబ్బీగా లేకపోయినా.. ఆన్‌స్క్రీన్‌పైకి వచ్చాక ఆరు కిలోల దాకా బరువు తగ్గానని.. అందుకోసం తాను చేసిన చిన్నపాటి వ్యాయామాలే గొప్ప సత్ఫలితాలను అందించాయని అంటోందీ ముద్దుగుమ్మ. అంతేకాదు.. బరువు తగ్గాలంటే జిమ్‌లో గంటలకు గంటలు కష్టపడడం కాకుండా.. ఏకాగ్రతతో ఓ గంట లేదా రెండు గంటల పాటు చిన్నపాటి వ్యాయామాలు చేసినా అదే ఫలితాన్ని పొందచ్చని తన ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపుతోందీ క్యూట్‌ బ్యూటీ.

మనం తీసుకునే ఆహారం, పాటించే లైఫ్‌స్త్టెల్‌లో భాగంగా మనకు తెలిసీ తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పలు రకాల వ్యాధుల బారిన పడుతుంటాం. అందులో క్యాన్సర్ మహమ్మారి కూడా ఒకటి. దీన్ని తొలి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని, కానీ చాలామంది చివరి దశలో గుర్తించి తమ జీవితాన్నే కోల్పోతున్నారని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఏటా ఫిబ్రవరి 4న 'ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం'గా జరుపుకుంటున్నాం. అయితే కేవలం చక్కటి జీవనశైలిని పాటించడమే కాదు.. కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా క్యాన్సర్ ముప్పును తప్పిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకొని వాటిని రోజువారీ మెనూలో చేర్చుకుంటే మనమూ క్యాన్సర్‌కు దూరంగా ఉండచ్చు.

ప్రతి అమ్మాయి జీవితంలోనూ వివాహం అతి ముఖ్యమైన సందర్భంగా నిలిచిపోతుంది. ఆ సమయంలో నవవధువుగా అందంగా, అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించేందుకు కొన్ని రోజుల ముందు నుంచే ప్రత్యేక ప్రణాళికను అనుసరిస్తారు పెళ్లికి సిద్ధమైన అమ్మాయిలు. తినే ఆహారం దగ్గరి నుంచి మేకప్ ఉత్పత్తుల వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకొంటారు. బ్యూటీపార్లర్‌లో ప్రత్యేకంగా మసాజ్, ఫేషియల్, పెడిక్యూర్, మానిక్యూర్ లాంటివి కూడా చేయించుకొంటారు. దీంతో పెళ్లికూతురు మండపంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోతుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ చాలామంది వివాహమైన తర్వాత కూడా ఆ మెరుపును కొనసాగించడంలో విఫలమవుతుంటారు. దీంతో వారి అందం కాస్త తగ్గినట్లుగా కనిపిస్తుంది. ఇలా కాకుండా.. వివాహమైన తర్వాత కూడా తమ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మరి అవేంటో తెలుసుకొందామా..

మనం వేసుకునే దుస్తుల విషయంలోనే కాదు.. మన శరీరాకృతి గురించి కూడా నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోవడం అప్పుడసప్పుడూ మనం వింటూనే ఉంటాం. ఇక సోషల్‌ మీడియా వచ్చిన దగ్గర్నుంచి ఆన్‌లైన్‌లోనూ ఇలాంటి విమర్శలకు తావే లేకుండా పోతోంది. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా ఫొటో పోస్ట్‌ చేస్తే చాలు.. డ్రస్‌ బాలేదని ఒకరు, లావుగా ఉందని మరొకరు, ఛాయ తక్కువగా ఉందని ఇంకొకరు.. ఇలా మనల్ని ఇబ్బంది పెట్టే కామెంట్లు చాలానే వస్తుంటాయి. ఒకానొక సమయంలో ఇలాంటి విమర్శలు తనకూ తప్పలేదంటోంది బాలీవుడ్‌ అందాల భామ అవికా గోర్‌. ‘బాలికా వధూ’ (తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’) సీరియల్‌తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన ఈ ముంబై భామ.. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆపై ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’.. వంటి సినిమాలతో మెప్పించిన ఈ అందాల రాశి.. గతేడాది ‘రాజు గారి గది - 3’తో మన ముందుకొచ్చింది. ఇలా కేవలం తన నటనతోనే కాదు.. సోషల్‌ మీడియా పోస్టులతోనూ తన ఫ్యాన్స్‌కు ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుందీ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఒకప్పుడు బొద్దుగుమ్మగా ఉన్న తాను స్లిమ్మీ బ్యూటీగా ఎలా మారింది? లావుగా ఉన్న సమయంలో తానెదుర్కొన్న విమర్శలు, తన వెయిట్‌ లాస్‌ సీక్రెట్స్‌.. వంటి విషయాలను సోషల్‌ మీడియా పోస్టుల ద్వారా, పలు ఇంటర్వ్యూల్లో భాగంగా పంచుకుంటూ నేటి తరం మహిళలందరిలో స్ఫూర్తి నింపిందీ బబ్లీ గర్ల్‌. అవే విషయాలను తన ‘ఫ్యాట్‌ టు ఫిట్‌’ స్టోరీలో భాగంగా మరోసారి మనతో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చిందీ లవ్లీ గర్ల్‌.

ఎటు చూసినా స్వర్ణ దేవాలయాలు, పచ్చపచ్చని ప్రకృతి అందాలతో అలరారుతోన్న ఆ దేశపు సౌందర్యాన్ని చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యటకులు క్యూ కడుతుంటారు. అలా అక్కడికొచ్చిన వారు ఆ దేశపు అందాలతో పాటు అక్కడి మగువల సౌందర్యానికి కూడా ముగ్ధులవుతున్నారు. అంతేనా.. కొందరైతే ఆ దేశపు అతివల సౌందర్య రహస్యాల్ని తెలుసుకునే ప్రయత్నం సైతం చేస్తున్నారంటే అది అతిశయోక్తి కాదు. మరి ఇంతకీ ప్రకృతి రమణీయతతో పాటు.. తమ అపురూప లావణ్యంతో ప్రపంచం దృష్టిని తమవైపు తిప్పుకుంటోంది మరెవరో కాదు.. ‘మయన్మార్‌’ మగువలు. తమ పూర్వీకులు పాటించిన సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులనే తామూ పాటిస్తూ.. వయసు వారిని మరిచిపోయిందేమో అన్నంత నవయవ్వనంగా మెరిసిపోతున్నారీ ముద్దుగుమ్మలు. మరి, మయన్మార్‌ సుందరాంగుల వెనకున్న ఆ సౌందర్య రహస్యాలేంటో మనమూ తెలుసుకొని పాటించేద్దామా!!

మనం బాగా లావుగా ఉన్నప్పటి ఫొటోను ఇప్పుడు చూసుకుంటే ‘అమ్మో! అప్పుడు ఎంత లావున్నానో.. ఈ ఫొటోలో నన్ను నేను చూసుకుంటుంటే అదోలా అనిపిస్తుంది.. థ్యాంక్‌ గాడ్‌.. ఇప్పటికైనా సన్నబడ్డాను..’ అంటూ మనల్ని మనం తక్కువ చేసి మాట్లాడుకోవడం సహజమే. అయితే తాను మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం అంటోంది బాలీవుడ్‌ బబ్లీ బ్యూటీ జరీన్‌ ఖాన్‌. చదువుకునే రోజుల్లో దాదాపు వంద కిలోల బరువుండే ఆమె.. సినిమాల్లోకి వచ్చాక సగానికి సగం బరువు తగ్గింది. ఇప్పటికీ తాను లావుగా ఉన్నప్పటి ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ‘నేను లావుగా ఉన్న ఈ ఫొటోల్ని చూస్తుంటే నాకెంతో గర్వంగా అనిపిస్తోంది.. అయినా నా శరీరం నా ఇష్టం.. నా శరీరాకృతి గురించి ఇతరులు ఏమనుకుంటే నాకేంటి?’ అంటూ తనలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తుంటుందీ ముద్దుగుమ్మ.