Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

‘బార్బీ బొమ్మ’ ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే.. సన్నజాజి నడుము, అందమైన చిరునవ్వు, ఆకర్షణీయమైన కళ్లు, మెరిసే జుట్టుతో ఉన్న ఫ్యాషనబుల్‌ అమ్మాయిలా అని సమాధానమిస్తాం. అయితే ఇది ఒకప్పటి మాట..! ఇప్పుడు బార్బీ డాల్‌ అంటే కేవలం అందం మాత్రమే కాదు.. ధైర్యం, జ్ఞానం, పోరాట స్ఫూర్తి, సేవా దృక్పథం.. మొదలైన లక్షణాలున్న వనితలంతా బార్బీ బొమ్మలే. అంతేకాదు మనం తెలుపా నలుపా, లావా సన్నమా అన్నది పట్టించుకోకుండా; తమలోని లోపాల గురించి ఆందోళన చెందకుండా.. లక్ష్యసాధనకై ధైర్యంగా ముందుకు సాగుతూ నలుగురికీ ఆదర్శంగా నిలిచే ప్రతి యువతీ అపురూప సౌందర్యవతే.. అని బార్బీ సంస్థ తమ బొమ్మల ద్వారా ప్రపంచానికి చాటే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో కొత్త దశాబ్దం ప్రారంభమైన సందర్భంగా బార్బీ ఫ్యామిలీ నుంచి మరికొన్ని వినూత్న బొమ్మలను విడుదల చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా వెల్లడించింది.

నువ్వు నాకు నచ్చావ్‌ సినిమాలో హీరో వెంకటేష్‌ భోజనానికి ముందు చేసిన ప్రార్థన సన్నివేశాన్ని తెలుగు ప్రేక్షకులెప్పటికీ మర్చిపోరు. ‘దేవుడా.. ఓ మంచి దేవుడా !’ అంటూ మొదలుపెట్టి ప్రపంచంలోని అందరికీ బ్రెడ్డు, బటరు, జామ్‌.. ఇలా ఏదుంటే అదివ్వమని ఆయన పండించిన హాస్యం అందరికీ ఆల్‌టైం ఫేవరెట్‌ సన్నివేశమనే చెప్పాలి. అయితే ఇంత అమాయకంగా నిజజీవితంలో ఎవరైనా ప్రార్థన చేస్తారా ? అంటే... పెద్దవాళ్లెవరూ అలా చేయకపోవచ్చు.. కానీ ముద్దులొలికే పిల్లలు మటుకు తప్పకుండా అలానే ప్రార్థిస్తారని చెప్పాలి. అందుకు ఉదాహరణే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే బుడతలు. ఒకరేమో ‘దేవుడా మాకంత శక్తినివ్వు..’ అంటూ స్కూల్‌లో ఓ వైపు ప్రార్థన చదువుతూ.. మరోవైపు ఎంచక్కా చేతిలో ఉన్న లాలీపాప్‌ను లాగించేస్తుంటే... మరొకరు భోజనానికి ముందు అచ్చం వెంకీని గుర్తుకు తెస్తూ ముద్దుముద్దుగా పలికారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ చిన్నారుల చిలిపి ప్రార్థనలు వైరల్‌ అవుతుండగా.. వీటిని చూసిన ప్రతి ఒక్కరూ తమ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. మరి వీరి ప్రార్థనలను మీరూ ఓసారి ఆలకించండి !

ఎన్ని సమస్యలు వచ్చినా నవ్వుతూ ఉండాలని చెప్పడం చాలా తేలిక. చేసి చూపించడం కష్టం. అది కొందరికి మాత్రమే సాధ్యపడుతుంది. వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి స్మృతి ఇరానీ గురించి. ఇంట్లో నలుగురు బంధువులు వచ్చి కాస్త బాధ్యత పెరిగితేనే ఏదో ఓ సందర్భంలో చికాకు పడతాం. మరి ఇటు భావి పౌరుల బాధ్యతతో పాటు, అటు మహిళా సాధికారతకు బాట వేసే బాధ్యత ఎంత తలనొప్పిగా ఉంటుందో చెప్పండి ! కానీ ఏ సమయంలోనూ చిరాకుకు చోటివ్వరు స్మృతి. అందుకు కొంతమంది బాలికలతో కలిసి ఆమె ఆడిపాడిన ఈ వీడియోనే సాక్షి. ఎంత నలతగా ఉన్నా పెదవులపై చిరునవ్వు పూయించే ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లే నిదర్శనం. కావాలంటే మీరే చూడండి !

చెట్లకు కూడా ప్రాణముంటుందని జగదీశ్ చంద్రబోస్ ఏనాడో చెప్పారు. అయితే వాటికి మనలా కాళ్లు లేవు కాబట్టి మనం నరకడానికి వెళ్తున్నా కదల్లేవు. కొమ్మలను నరికినప్పుడు, మొదళ్ల నుండి పెకిలించినప్పుడు అవెంత బాధపడతాయి ? అని ప్రశ్నిస్తే... చాలామందికి ఇది అర్థం కాని విషయం. అయితే ఆ బాధను అర్థం చేసుకొన్న ఓ చిన్నారి తాను ఎదిగేసరికి చెట్లకు కాళ్లు రావాలని కోరుకుంది. ఆ ఆలోచనే గూగుల్‌ను ఫిదా చేసి ఆమెకు ఐదు లక్షల రూపాయల నగదు బహుమతిని ఇప్పించింది. అంతేనా... ఆమె చదివే స్కూలుకి కూడా సాయమందించేలా చేసింది. ఆ చిన్నారి ఎవరో కాదు దిల్లీ పబ్లిక్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న దివ్యాన్షి సింఘాల్.

«Õ©ãx-X¾Û«Ûy ©Ç¢šË «ÕÍŒa-©äE «ÕÊ-®¾Õ¹×, E†¾ˆ-©t†¾„çÕiÊ *ª½Õ-Ê-«ÛyÂ¹× EŸ¿-ª½zÊ¢ *¯Ão-ª½Õ©Õ. „ÃJ «áŸ¿Õl-«áŸ¿Õl «Ö{-©Åî ‡¢ÅŒ ÂîX¾¢©ð …Êo „ÃJ-¯çj¯Ã ®¾êª ƒ˜äd ÊNy¢-Íä-®¾Õh¢-šÇª½Õ. Æ¢Åä¯Ã.. Æ«Öt-¯ÃÊo, Åî¦Õ-{Õd-«Û©Õ, “’âœþ-æX-骢šüq, ƒª½Õ-’¹Õ-¤ñ-ª½Õ’¹Õ „Ã@ÁÙx.. ƒ©Ç ÅŒ«Õ ÍŒÕ{Öd …Êo „ÃJ Ÿ¿’¹_-ª½Õo¢* ¦ð©ã-œ¿Eo N†¾-§ŒÖ©Õ ¯äª½Õa-¹ע-šÇª½Õ ¹؜Ä..! ƒ©Ç¢šË *šËd-¤ñšËd *¯Ão-ª½Õ©¢Ÿ¿JF ŠÂ¹ˆ-Íî{ ÍäJa, „ÃJÂË ‡¢Åî ‚Ê¢-ŸÄEo X¾¢Íä ªîèä '¦Ç©© C¯î-ÅŒq«¢Ñ. ¨ ªîVÊ „ÃJ ¤Äª¸½-¬Ç-©©ðx ‡¯îo ‚{©Õ, ¤Ä{©Õ, ²Ä¢®¾ˆ%-A¹ Âê½u-“¹-«Ö©Õ Eª½y-£ÏÇ-®¾Õh¢-šÇª½Õ. ƪáÅä OšËÅî ¤Ä{Õ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©Õ’à OÕª½Õ Â¹ØœÄ ¨ ªîVÊ OÕ XÏ©x-©Â¹× ÂíEo N©Õ-«©Õ ¯äJpÅä.. ÆN „ÃJ ¦µ¼N-†¾u-ÅŒÕhÂ¹× ‡¢ÅŒ-’Ã¯î Ÿî£¾ÇŸ¿¢ Íä²Ähªá ¹Ÿ¿Ö..! ƒ©Ç Í䧌՜¿¢ «©x '¯äšË ¦Ç©©ä êªX¾šË ¤ùª½Õ©ÕÑ ÆE ÍÃÍà ¯ç“£¾Þ ÍçXÏpÊ «Ö{Lo OÕ XÏ©x© ŸÄyªÃ E•¢ Íä®ÏÊ „ê½-«Û-Åê½Õ. Æ¢Åä-Âß¿Õ.. ‚ ªîV „ÃJÂÌ ‡X¾p-šËÂÌ ’¹Õª½Õh¢-œË-¤ò-ŌբC. ƒ¢ÅŒÂÌ ¦Ç©© C¯î-ÅŒq«¢ ªîVÊ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ *¯Ão-ª½Õ-©Åî Íäªá¢-ÍÃ-LqÊ ‚ X¾ÊÕ-©ä¢šË? ÆN XÏ©x-©Â¹× ÅŒ«Õ ¦µ¼N-†¾u-ÅŒÕh©ð ‡©Ç …X¾-§çÖ-’¹-X¾-œ¿-Åêá? ª½¢œË Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..