Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

సాధారణంగా ఎవరినైనా చూస్తే.. కాస్త అటూ ఇటుగా వారి వయసును అంచనా వేయచ్చు. కానీ ఈ దేశ అతివల వయసును అంచనా వేయడం కష్టమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ టీనేజర్స్‌కి, కాస్త వయసు మీద పడిన వారికి మేని మెరుపులో, అందంలో పెద్దగా తేడా కనిపించదు. అందుకే వయసు పైబడుతున్నా వన్నె తరగని అందానికి చిరునామాగా నిలుస్తున్నారు ‘మలేషియా’ మగువలు. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన బీచ్‌లను కలిగిన ఈ దేశం పర్యటక పరంగానే కాదు.. విదేశీ అతివలకు సౌందర్య పాఠాలనూ నేర్పడంలోనూ ముందే ఉంది. అందుకు వారు తరతరాలుగా పాటిస్తోన్న సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులే ప్రధాన కారణం. మరి, ఎంతో సింపుల్‌ చిట్కాలతోనే అపురూప సౌందర్య రాశులుగా విలసిల్లుతున్న మలేషియా భామల సౌందర్య రహస్యాలేంటో తెలుసుకుని మనమూ పాటిద్దాం రండి..

‘జగాన అతిశయాలు ఏడైనా... ఓ మాట్లాడే పువ్వా... నువ్వు ఎనిమిదో అతిశయమే.. నింగి లాంటి నీ కళ్లు.. పాలుగారే చెక్కిళ్లు.. తేనెలూరే అధరాలు అతిశయమే..’ అంటూ మగువల సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలక పాట రూపంలో వర్ణించాడో సినీ కవి. ఇంతటి అపురూప లావణ్యానికి తామేమీ తీసిపోమని, అందుకు పూర్వీకుల నుంచి తరతరాలుగా పాటిస్తూ వస్తోన్న సహజసిద్ధమైన సౌందర్య ఉత్పత్తులే కారణమంటున్నారు ‘స్పెయిన్‌ అతివలు’. బామ్మల సౌందర్య చిట్కాలను క్రమం తప్పకుండా అనుసరిస్తూ తమ అందానికి మెరుగులు దిద్దుతున్నారు. మరి, స్పెయిన్‌ ముద్దుగుమ్మల ఆ న్యాచురల్‌ బ్యూటీ సీక్రెట్సేంటో మనమూ తెలుసుకుందాం రండి..

అందమంటే.. తెల్లగానే ఉండాలని ఎవరన్నారు? తీరైన ముఖాకృతి, కళ ఉట్టిపడే మోము, కలువల్లాంటి కళ్లు, తీర్చిదిద్దినట్లుండే ముక్కు, దొండపండు లాంటి అధరాలు.. ఉన్న వారే అసలైన అందగత్తెలని అంటున్నారు టాంజానియా మగువలు. అందానికి అసలు సిసలైన నిర్వచనమిచ్చే ఈ ప్రమాణాలన్నీ తమలో ఉన్నాయని అంటున్నారీ సుందరాంగిణులు. వారి ఛాయ నలుపే అయినా.. అపురూప సౌందర్యం వారి సొంతం. అందుకే అందరిచేతా ‘డస్కీ బ్యూటీస్‌’గా ప్రశంసలందుకుంటున్నారు. మరి, ప్రపంచాన్నే నివ్వెరపరుస్తోన్న వారి అందం వెనకున్న రహస్యమేంటో తెలుసా! ప్రకృతి సహజసిద్ధంగా ప్రసాదించిన వరాలే! అవేంటో తెలుసుకోవాలని మీకూ ఆతృతగా ఉంది కదూ!! అయితే ఆలస్యమెందుకు... అసలు విషయంలోకి వెళ్దాం పదండి.

ఎటు చూసినా స్వర్ణ దేవాలయాలు, పచ్చపచ్చని ప్రకృతి అందాలతో అలరారుతోన్న ఆ దేశపు సౌందర్యాన్ని చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యటకులు క్యూ కడుతుంటారు. అలా అక్కడికొచ్చిన వారు ఆ దేశపు అందాలతో పాటు అక్కడి మగువల సౌందర్యానికి కూడా ముగ్ధులవుతున్నారు. అంతేనా.. కొందరైతే ఆ దేశపు అతివల సౌందర్య రహస్యాల్ని తెలుసుకునే ప్రయత్నం సైతం చేస్తున్నారంటే అది అతిశయోక్తి కాదు. మరి ఇంతకీ ప్రకృతి రమణీయతతో పాటు.. తమ అపురూప లావణ్యంతో ప్రపంచం దృష్టిని తమవైపు తిప్పుకుంటోంది మరెవరో కాదు.. ‘మయన్మార్‌’ మగువలు. తమ పూర్వీకులు పాటించిన సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులనే తామూ పాటిస్తూ.. వయసు వారిని మరిచిపోయిందేమో అన్నంత నవయవ్వనంగా మెరిసిపోతున్నారీ ముద్దుగుమ్మలు. మరి, మయన్మార్‌ సుందరాంగుల వెనకున్న ఆ సౌందర్య రహస్యాలేంటో మనమూ తెలుసుకొని పాటించేద్దామా!!

వారి అందానికి పరవశించని హృదయం ఉండదు. ఆ ముగ్ధమనోహర మోముకు ఫిదా అవని మనసుండదు. గోధుమ రంగు మేనిఛాయతో.. నీలి కళ్లతో.. ఒత్తైన జాలువారే కురులతో.. అందానికి పర్యాయపదంలా మెరిసిపోతున్న ‘పర్షియా’ భామల ‘సొగసు చూడతరమా!’ అనడంలో సందేహం లేదు. మరి, అంతటి అపురూప లావణ్యం వారికెలా సొంతమైంది అనుకుంటున్నారా? అందుకు తాము పాటించే సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులే అంటున్నారీ సుందరీమణులు. వీరు వాడే న్యాచురల్‌ రెమెడీస్‌ వినడానికి, పాటించడానికి ఎంత సింపుల్‌గా అనిపిస్తాయో.. అంతే ఎక్కువ ఫలితాల్ని అందిస్తాయి కూడా! మరి చక్కటి సహజసిద్ధమైన ఉత్పత్తులతో చూపుతిప్పుకోలేని అందాన్ని తమ సొంతం చేసుకున్న పర్షియా ముద్దుగుమ్మల సౌందర్యం వెనకున్న ఆ రహస్యాల గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..

వారి మేని సొగసును చూస్తుంటే.. అందం వారి దేశంలోనే పుట్టిందేమో అనిపించకమానదు. ఇక వారి ఒత్తైన కురుల సోయగం .. నయాగరా జలపాతాన్ని తలపిస్తుంది. ఇలా ప్రపంచంలోని అందాన్నంతా ఒకచోట పోతపోసి ‘ఇటలీ’ మహిళలుగా మలచాడా సృష్టికర్త. మరి, అంతటి అపరంజి బొమ్మలాంటి సౌందర్యం వారికెలా సాధ్యమైంది అంటే.. అదంతా బామ్మల నాటి సౌందర్య చిట్కాలు పాటించడం వల్లే పొందగలిగామంటున్నారా దేశపు మగువలు. అలాగని అవి వారి దేశంలో లభించే సౌందర్య ఉత్పత్తులే అనుకుంటే పొరపాటే! ప్రకృతి అందించే ఆ వంటింటి సాధనాలు ప్రపంచమంలో ఎక్కడైనా లభిస్తాయి. మరి, ఇంతకీ ఇటలీ అందాల వెనకున్న ఆ సహజసిద్ధమైన సౌందర్య రహస్యాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

వారి సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలక.. ప్రేమకు, సౌందర్యానికి ప్రతీకగా నిలిచే గ్రీక్‌ దేవత ‘అఫ్రోడైట్‌’తో పోల్చాడు ప్రముఖ జర్మన్‌ కవి హెన్రిచ్‌ హెయిన్‌. అంతటితో ఆగకుండా ‘భువిపై పుట్టిన దేవతలు’ అంటూ వారి పట్ల తన ఆరాధన భావానికి అక్షరరూపమిచ్చాడు. ఇంతకీ కవుల కలాన్ని సైతం పులకరింపజేసిన ఆ సౌందర్యరాశులెవరో తెలుసా..? పోలండ్‌ భామలు. పొడుగు కాళ్ల సుందరీమణులుగా పేరుగాంచిన వీరి సోయగం వెనక గల రహస్యాలు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది కదూ! ప్రకృతి ప్రసాదించే వనరులే మా సౌందర్యానికి రక్షణ కవచం అంటున్నారీ ముద్దుగుమ్మలు. మరి ప్రకృతినే వారి సోయగానికి రక్షణగా ఏర్పాటుచేసుకున్న పోలండ్‌ సొగసుల సౌందర్య రహస్యాలేంటో తెలుసుకొని మనమూ పాటించేద్దాం రండి..!

అందాన్ని నిర్వచించాలంటే.. ఒక్కసారి హంగరీ అమ్మాయిల్ని చూపిస్తే చాలని అనడంలో అతిశయోక్తి లేదు. నిజంగానే వారిని చూస్తుంటే దివి నుంచి దిగొచ్చిన దేవకన్యలే ఈ దేశంలో ఉండిపోయారేమో అనిపించకమానదు. అంతటి సౌందర్యం, సోయగం తమ సొంతం చేసుకోవడానికి సహజసిద్ధమైన పద్ధతులు తప్ప వేరే ఎటువంటి మ్యాజిక్‌ లేదంటున్నారు హంగరీ ముద్దుగుమ్మలు. ఈ క్రమంలో వారు తమ సౌందర్య పోషణకు వాడే పద్ధతులు చూస్తే ఇంతేనా.. చాలా సింపుల్‌గా ఉన్నాయే! అనిపించకమానదు. కానీ అలాంటి సింపుల్‌ అండ్‌ స్వీట్‌ బ్యూటీ ట్రీట్‌మెంట్స్‌తోనే మచ్చలేని చందమామల్ని తలపిస్తోన్న ఈ అందాల రాశుల వెనుకున్న ఆ సౌందర్య రహస్యాలేంటో మనమూ తెలుసుకుని పాటించేద్దామా మరి..!