Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

ముఖ సౌందర్యంలో కళ్ల పాత్ర తక్కువేం కాదు. చూడగానే ఆకట్టుకునేవి కళ్లే అయితే ఈ క్రమంలో ముఖానికి వేసుకునే మేకప్‌ ఓ ఎత్తైతే.. కళ్లకు వేసుకునే మేకప్‌ మరో ఎత్తు. ఐ-మేకప్‌ని అందంగా తీర్చిదిద్దగలిగితే.. సాధారణ మేకప్‌ కూడా హైలైట్‌ అవుతుందనడంలో సందేహం లేదు. కానీ ఎవరికి వారు స్వయంగా కళ్లకు అంత చక్కగా మేకప్‌ చేసుకోవాలంటే అదంత ఈజీ కాదు. అందుకే చాలామంది బ్యూటీపార్లర్లలోనో లేదా డిఫరెంట్‌ గ్యాడ్జెట్స్‌ని ఉపయోగించో కళ్లకు మేకప్‌ చేసుకుంటారు. ఎంత చక్కగా మేకప్‌ వేసుకున్నా ఒక్కోసారి వాతావరణం వల్లో.. మన అజాగ్రత్త వల్లో చెరిగిపోతుంటుంది. కళ్ల మేకప్‌ చెరిగిపోతే.. ఇక అమ్మాయిల లుక్‌ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇలాంటి సమస్యలన్నీ దృష్టిలో ఉంచుకుని కళ్లకు మేకప్‌ వేసుకుకోకుండానే అలాంటి లుక్కిచ్చే గ్యాడ్జెట్స్‌ని డిజైన్‌ చేశారు. ఏంటి.. మేకప్‌ చేసుకోకుండానే కళ్లకు అటువంటి లుక్కా.. వింటుంటేనే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది కదూ! వాడితే ఇంకా బాగుంటుంది. మరి మీ కళ్ల అందాన్ని ఇనుమడింపజేసే ఈ కళ్ల స్టిక్కర్స్‌ కథేంటో తెలుసుకుందామా..

ఫ్యాషన్‌ షోలు, అవార్డ్స్‌ సెలబ్రేషన్స్‌.. అంటూ వరస కార్యక్రమాలతో బాలీవుడ్‌ తారా లోకం బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇటీవలే లాక్మే ర్యాంప్‌పై హొయలొలికించిన అందాల భామలు.. ఫిలింఫేర్‌ అవార్డ్స్‌లో తమదైన స్టైల్స్‌తో రెడ్‌ కార్పెట్‌ని హీటెక్కించారు. తాజాగా ‘నైకా ఫెమినా బ్యూటీ అవార్డ్స్‌-2020’ ప్రదానోత్సవంలో తమ డిఫరెంట్‌ అటైర్స్‌తో ఫ్యాషన్‌ ప్రియుల మతులు పోగొట్టారు. నైకా ఆధ్వర్యంలో ఫెమినా నిర్వహించిన ఈ అవార్డ్స్‌ ప్రదానోత్సవం సందర్భంగా బాలీవుడ్‌ ముద్దుగుమ్మలంతా ఒకచోట చేరి తమ అందచందాలతో అభిమానులకు కనువిందు చేశారు. అటు అవార్డులతో మురిసిపోతూ.. ఇటు తమ ఫ్యాషనబుల్‌ లుక్స్‌తో అదరగొట్టిన బాలీవుడ్‌ అందాల తారలపై మనమూ ఓ లుక్కేద్దాం రండి..

అందమంటే ముఖం, చేతులు, జుట్టు.. వీటిపైనే ఎక్కువ శ్రద్ధ పెడతాం. కానీ పాదాల విషయానికొచ్చే సరికి అంతగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటాం. కొంతమందైతే కనీసం నెలకొకసారి కూడా పాదాల్ని సరిగా శుభ్రం చేసుకోరు. కానీ, వాటిని అలాగే వదిలేయడం వల్ల వాతావరణంలోని దుమ్ము, ధూళి చేరి పాదాలు పొడిబారిపోయి అంద విహీనంగా కనిపించడం, కాలి వేళ్ల మధ్య అలర్జీలు రావడం.. వంటి పలు సమస్యలు తలెత్తే అవకాశముంటుంది. ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలంటే పాదాల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ముఖ్యం. అందుకోసమే ప్రస్తుతం విభిన్నమైన పెడిక్యూర్‌ గ్యాడ్జెట్స్‌ మార్కెట్లోకి అందుబాటులోకొచ్చేశాయి. అవి పాదాల సమస్యల్ని తొలగించడంతో పాటు పాదాలకు మెరుపును కూడా అందిస్తాయి. మరి, ఏంటా గ్యాడ్జెట్స్‌? వాటిని ఎలా ఉపయోగించుకోవాలి? రండి.. తెలుసుకుందాం..

ఫస్ట్‌ జాబ్‌, ఫస్ట్‌ శాలరీ.. ఇవి అందుకున్న వారు ప్రపంచాన్నే ఏలినంతగా సంబరపడిపోతారు.. ప్రపంచపు సంకెళ్లను తెంచుకొని స్వేచ్ఛాలోకంలో విహరిస్తుంటారు. తమ సంపాదనతో నచ్చిన డ్రస్సులు కొనుక్కోవడం, ఫ్రెండ్స్‌తో సినిమాలు-షికార్లకు వెళ్లడం, ఇష్టమైన ఆహారం లాగించేయడం.. ఇలా వారి లైఫ్‌స్టైలే వేరుగా ఉంటుంది. ఒకప్పుడు తానూ ఇలాంటి జీవితాన్నే ఆస్వాదించానని చెబుతోంది కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్‌. తనకెంతో ఇష్టమైన న్యాయవాద వృత్తిని చేపట్టిన తర్వాత వచ్చిన సంపాదనతో విలాసవంతమైన, ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతూ తాను స్థూలకాయం బారిన పడిన విషయాన్ని కూడా విస్మరించానని చెబుతోందీ ముద్దుగుమ్మ.

సాధారణంగా ఎవరినైనా చూస్తే.. కాస్త అటూ ఇటుగా వారి వయసును అంచనా వేయచ్చు. కానీ ఈ దేశ అతివల వయసును అంచనా వేయడం కష్టమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ టీనేజర్స్‌కి, కాస్త వయసు మీద పడిన వారికి మేని మెరుపులో, అందంలో పెద్దగా తేడా కనిపించదు. అందుకే వయసు పైబడుతున్నా వన్నె తరగని అందానికి చిరునామాగా నిలుస్తున్నారు ‘మలేషియా’ మగువలు. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన బీచ్‌లను కలిగిన ఈ దేశం పర్యటక పరంగానే కాదు.. విదేశీ అతివలకు సౌందర్య పాఠాలనూ నేర్పడంలోనూ ముందే ఉంది. అందుకు వారు తరతరాలుగా పాటిస్తోన్న సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులే ప్రధాన కారణం. మరి, ఎంతో సింపుల్‌ చిట్కాలతోనే అపురూప సౌందర్య రాశులుగా విలసిల్లుతున్న మలేషియా భామల సౌందర్య రహస్యాలేంటో తెలుసుకుని మనమూ పాటిద్దాం రండి..

‘జగాన అతిశయాలు ఏడైనా... ఓ మాట్లాడే పువ్వా... నువ్వు ఎనిమిదో అతిశయమే.. నింగి లాంటి నీ కళ్లు.. పాలుగారే చెక్కిళ్లు.. తేనెలూరే అధరాలు అతిశయమే..’ అంటూ మగువల సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలక పాట రూపంలో వర్ణించాడో సినీ కవి. ఇంతటి అపురూప లావణ్యానికి తామేమీ తీసిపోమని, అందుకు పూర్వీకుల నుంచి తరతరాలుగా పాటిస్తూ వస్తోన్న సహజసిద్ధమైన సౌందర్య ఉత్పత్తులే కారణమంటున్నారు ‘స్పెయిన్‌ అతివలు’. బామ్మల సౌందర్య చిట్కాలను క్రమం తప్పకుండా అనుసరిస్తూ తమ అందానికి మెరుగులు దిద్దుతున్నారు. మరి, స్పెయిన్‌ ముద్దుగుమ్మల ఆ న్యాచురల్‌ బ్యూటీ సీక్రెట్సేంటో మనమూ తెలుసుకుందాం రండి..

ప్రతి అమ్మాయి జీవితంలోనూ వివాహం అతి ముఖ్యమైన సందర్భంగా నిలిచిపోతుంది. ఆ సమయంలో నవవధువుగా అందంగా, అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించేందుకు కొన్ని రోజుల ముందు నుంచే ప్రత్యేక ప్రణాళికను అనుసరిస్తారు పెళ్లికి సిద్ధమైన అమ్మాయిలు. తినే ఆహారం దగ్గరి నుంచి మేకప్ ఉత్పత్తుల వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకొంటారు. బ్యూటీపార్లర్‌లో ప్రత్యేకంగా మసాజ్, ఫేషియల్, పెడిక్యూర్, మానిక్యూర్ లాంటివి కూడా చేయించుకొంటారు. దీంతో పెళ్లికూతురు మండపంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోతుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ చాలామంది వివాహమైన తర్వాత కూడా ఆ మెరుపును కొనసాగించడంలో విఫలమవుతుంటారు. దీంతో వారి అందం కాస్త తగ్గినట్లుగా కనిపిస్తుంది. ఇలా కాకుండా.. వివాహమైన తర్వాత కూడా తమ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మరి అవేంటో తెలుసుకొందామా..