Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

కళాశాల అంటేనే చదువుల్లో, ఆటపాటల్లో ఒక విద్యార్థితో మరో విద్యార్థికి పోటీ ఉంటుంది. ఈక్రమంలో ఒకరిలో ఏమాత్రం లోటుపాట్లు కనిపించినా చాలామంది విద్యార్థుల చేత సదరు విద్యార్థి హేళనకు గురి కావాల్సి ఉంటుంది. ఇలా బుల్లీయింగ్‌కి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు చాలామందే ఉన్నారు. అటువంటిది అబ్బాయిలు హీరోల్లా ముస్తాబై వచ్చే కళాశాల ట్రెడిషన్‌ డేలో భాగంగా కావాలని చీర కట్టుకొచ్చారు ముగ్గురు యువకులు. తమకు చీరకట్టుకోవడం రాకపోయినా కళాశాల విద్యార్థిని సహాయం తీసుకొని మరీ చీరకట్టులో వేడుకకు హాజరయ్యారు. అధ్యాపకుల నుంచి విద్యార్థుల వరకు కళాశాలలో వారినలా చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఎవరూ కూడా వారిని హేళన చేయలేదు. అసలు విషయం తెలుసుకొని వారిని మెచ్చుకున్నారు. ఎందుకంటే...

ఎవరు అవునన్నా.. కాదన్నా ప్రపంచంలో ఎక్కువ ఉద్యమాలు చేసింది స్త్రీలే. అదీ ఎందుకో తెలుసా ? మృగంలా మారుతున్న కొంతమంది మగవారిని మనిషిగా మారమని కోరేందుకు.. ఆడవాళ్లనీ ఓ మనిషిలా గౌరవించాలని తెలిపేందుకు..! ‘చైతన్యం మార్పు వల్లే సాధ్యమవుతుంది... మార్పు ఉద్యమంతోనే మొదలవుతుంది’ అని ఓ తత్త్వవేత్త అన్నట్లు... మానవత్వంతో సాటి మనిషికి విలువివ్వాలనే చైతన్యం అందరిలో కలగాలంటే... మనిషి ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి.... అలా జరగాలంటే ఆ ఆలోచన ఉన్న ప్రతిఒక్కరూ ఉద్యమించాలి. ఈ విషయాన్ని తెలపడానికే తరతరాలుగా మహిళలు అలుపు లేకుండా ఉద్యమిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కేరళకు చెందిన మహిళలు కూడా ఇదే చేస్తున్నారు.

ఏ స్త్రీకైనా మాతృత్వం ఓ వరం. కానీ కొన్ని సార్లు అదే శాపంలా మారుతుంటుంది. కావాలని తల్లిగా మారడం వరమైతే.. అనుకోకుండా గర్భం ధరించాల్సి రావడం శాపం. ఇలా ఈ ప్రపంచంలో క్షణికానందం కోసం కాలు జారి ఆ శాపాన్ని అనుభవించే మహిళలు చాలామందే ఉన్నారు. మరికొంతమంది ఒకరి బలవంతం కారణంగా గర్భం ధరిస్తున్నారు. ఒక్కోసారి ప్రాణాంతకమైన అబార్షన్‌లకు పాల్పడుతున్నారు. ఇందుకు కారణం గర్భ నిరోధంపై సరైన అవగాహన లేకపోవడం ఒకటైతే... అందుకు సంబంధించిన పద్ధతులు అందుబాటులో లేకపోవడం మరొకటి. అయితే ఇప్పుడు మన దేశ మహిళలు ఈ విషయంలో బాగానే అవగాహన పెంచుకున్నారు. ‘మార్నింగ్‌ ఆఫ్టర్‌ పిల్‌’ వంటి గర్భ నిరోధక మాత్రలను వినియోగించుకుంటూ ఇతర దేశాల మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏటా ఈ మహిళల శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. అయితే బ్రిటన్‌కు చెందిన మహిళలు మటుకు తమకు ఈ మాత్రలు అందుబాటులో లేవంటున్నారు. ఎందుకో తెలుసుకుందాం రండి !

స్త్రీకి అనేక రూపాలున్నాయి. మొదట కూతురిగా ఈ భూమ్మీద అడుగుపెట్టే ఆమె తర్వాత అక్కగా, చెల్లిగా, చెలిగా, భార్యగా, అమ్మగా, బామ్మగా తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తుంది. అటువంటి స్త్రీకి నాయకత్వం పెద్ద కష్టమా ? ఒక ఇంటిని క్రమపద్ధతిలో ఉంచే ఆమెకు ఒక ఊరిని, ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని సక్రమంగా నడిపించే పటిమ లేదా ? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే అగ్ర రాజ్యం అమెరికాకు ఎనిమిదేళ్ల పాటు అధ్యక్షుడిగా సేవలందించిన బరాక్‌ ఒబామా మాటలు వినాల్సిందే ! ఎందుకంటే ఆయన వైట్‌హౌస్‌ కార్యాలయంలో కూర్చొని చాలాసార్లు స్త్రీ నాయకత్వం గురించే ఆలోచించారట. ఇటీవల సింగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఒక స్త్రీకి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందో తెలియజేశారు.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. కానీ చాలా దేశాలతో పోలిస్తే అక్కడ నమోదయ్యే నేరాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ప్రపంచ జనాభా లెక్కల విశ్లేషకుల ప్రకారం ఒక మిలియన్‌ జనాభాకు అక్కడ 0.62 హత్యలు నమోదవుతున్నాయంటే చైనా ప్రభుత్వం చట్టాలను ఎంత కఠినంగా అమలు చేస్తోందో అర్థమవుతోంది. అందుకే అక్కడి నేరాల సంఖ్య దాదాపు నలభై శాతానికి పడిపోయిందని చైనా ప్రభుత్వం తెలుపుతోంది. ఈక్రమంలో స్త్రీల భద్రతపై కూడా చైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుండగా, వివిధ దేశాల మహిళలు కూడా చైనాలో పర్యటించడం సురక్షితం అంటున్నారు. మరి అంతలా చైనా ప్రభుత్వం స్త్రీల రక్షణ కోసం ఏం చేస్తోంది ? తెలుసుకుందాం రండి !

సమస్త సృష్టికి మూలాధారం స్త్రీ. ఆమె తలచుకుంటే ఇంటిని చక్కబెట్టడమే కాదు... దేశ రూపురేఖలు కూడా మార్చగలదు. బిడ్డకు జన్మనిచ్చి వారిని సమాజంలో గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దే స్త్రీకి అవకాశం రావాలే కానీ గొప్ప పరిపాలన కూడా అందించగలదు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఇటీవల ఫోర్బ్స్‌ ప్రకటించిన ‘ప్రపంచ 100 మంది అత్యంత శక్తిమంతమైన మహిళల’ జాబితా. ప్రభుత్వ పాలన, వ్యాపారం, మానవ సేవ... ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా పురుషులతో సమానంగా... కాదు.. కాదు.. వారికంటే మిన్నగానే రాణిస్తున్నారు మహిళలు. అందుకే ఈ జాబితా ప్రకటించిన ఫోర్బ్స్‌ కూడా ‘ఈ శక్తిమంతమైన మహిళలతో ఎవరూ పెట్టుకోవద్దు’ అంటోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అభివృద్ధికి సరికొత్త బాట వేస్తోన్న ఈ శక్తిమంతమైన మహిళల్లో మన భారతీయ మహిళలు కూడా నలుగురు ఉన్నారు. మరి వారెవరో చూద్దాం రండి !

అప్పుడు ఆ అమ్మాయి వయసు పదేళ్లు. ఒక వృద్ధుడు తరచూ ఆమె ఇంటికి వస్తుండేవాడు. ఆమె తల్లిదండ్రులు కూడా అతడిని అభిమానించేవారు. దాన్ని అలుసుగా తీసుకున్న ఆ వ్యక్తి అమాయకురాలైన ఆ అమ్మాయిపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఇరవై ఏళ్లున్న ఆ అమ్మాయి మానసికంగా ఎంతో కుంగిపోయింది. అందుకే దీనంతటికీ కారణమైన అతడిపై ‘ది రేపిస్ట్‌ ఈజ్‌ యూ’ అంటూ రోడ్డుపైకి వచ్చి నినదిస్తోంది. ‘అతడు నా జీవితాన్ని నాశనం చేశాడు. ఎన్నోసార్లు నన్ను నిందల పాలు చేశాడు. కానీ తప్పు చేసింది నేను కాదు. ఇప్పుడది గట్టిగా చెప్పాల్సిన సమయం వచ్చింది’ అంటూ ఉక్రోషంగా పాట పాడుతోంది. ఈ పాడటం ఏంటి... అనుకుంటున్నారా ? ఆమే కాదు ఆమెలా పురుషుల చేతిలో అత్యాచారానికి గురైన చాలామంది మహిళలు ‘ది రేపిస్ట్‌ ఈజ్‌ యూ’ అంటూ రోడ్లపైకి వచ్చి పాట పాడుతున్నారు. ఎందుకో తెలుసుకుందాం రండి !

బహుభార్యత్వం మనదేశంలో చట్ట విరుద్ధం. కానీ ఇప్పటికీ చాలా చోట్ల దీన్నో ఆచారంలా భావించే వారున్నారు. అయితే అలా కాకుండా అవసరం కోసం తమ భర్తకు మరో పెళ్లి చేసిన భార్యామణుల గురించి మీకు తెలుసా ? ఒక సినిమాలో చూపించినట్లు తన భర్తకు తన సొంత చెల్లినే ఇచ్చి పెళ్లి చేసిందో గ్రామ సర్పంచ్‌. ఈ వివాహానికి కుటుంబ సభ్యులంతా హాజరై దీవించడం విశేషం. మరో చోట కేవలం మంచి నీళ్లు తీసుకురావడానికి ఇబ్బంది కలుగుతోందని తన భర్తకు రెండు పెళ్లిళ్లు చేసిందో సతీమణి. చిన్న అనుమానాల కారణంగా ఒక పెళ్లితోనే మనస్పర్థలొచ్చి విడిపోతున్న జంటలున్న ఈ కాలంలో ఈ అభినవ భార్యామణులు తమ భర్తకు మరో పెళ్లి చేసి కూడా సుఖంగా జీవిస్తున్నారు. మరి వీరిలా ఎందుకు చేశారో తెలుసుకుందాం రండి !

పాతికేళ్లు వచ్చేసరికి చాలామందికి ఎదురయ్యే సాధారణ ప్రశ్న ‘పెళ్లి ఎప్పుడు ?’... అదే తల్లిదండ్రులనైతే ‘మీ అమ్మాయికి పెళ్లెప్పుడు చేస్తున్నారు ?’ అని. ఈ కాలం అమ్మాయిలు ఒక ఆశయాన్ని పెట్టుకొని ఏదో సాధించాలని తపన పడుతుంటే ఇరుగుపొరుగు వారి నుంచి వచ్చే ఈ ప్రశ్నలు తెగ విసిగించేస్తుంటాయి. అదే సెలబ్రిటీ హోదాలో ఉన్న స్త్రీలకైతే చెవిలో జోరీగలా మీడియా ప్రతిసారీ ఈ ప్రశ్నను సంధిస్తూనే ఉంటుంది. ఇలా మగవారికైతే ‘ఎప్పుడు స్థిరపడతావు ?’ అని.. ఆడవారికైతే ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్‌ ?’ అని అడగడానికి తామేమీ పిల్లల్ని కనే మెషీన్లం కాదంటోంది పాప్‌ గాయని టేలర్‌ స్విఫ్ట్‌. ఇంతకీ ఆమె అలా ఎందుకందో తెలుసా ?

ఇటీవల దిశ ఉదంతం అనంతరం మగవారిలో మార్పు తీసుకొచ్చేందుకు గతంలో మర్ద్‌ (మెన్‌ ఎగైనెస్ట్‌ రేప్‌ అండ్‌ డిస్క్రిమినేషన్‌) ఉద్యమం కోసం మహేశ్‌ బాబు చెప్పిన మాటలు ప్రస్తుతం అంతర్జాలంలో బాగా వైరల్‌ అవుతున్నాయి. ఆయన మాటల్లో చెప్పాలంటే... ‘‘ఎవరి కళ్ల్లల్లో సంస్కారం సూర్య కాంతిలా మెరుస్తుందో.. ఎవరి మాట మన్ననగా ఉంటుందో.. ఎవరి మనసు మెత్తగా ఉంటుందో.. ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో.. ఎవరికి ఆడవాళ్లంటే హృదయంలో అభిమానం, సమాజంలో గౌరవం ఉంటాయో.. ఎవరు వారి శరీరానికి, మనసుకి, ఆత్మకి విలువిస్తారో.. వారి ఆత్మగౌరవానికి తోడుగా నిలుస్తారో.. ఎవరు మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మర్చిపోరో.. స్త్రీకి శక్తి ఉంది, గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉండాలని ఎవరు మనస్ఫూర్తిగా అనుకుంటారో.. ఎవరికి దగ్గరగా ఉంటే ప్రమాదం దూరంగా పారిపోతుందనే నమ్మకం ఉంటుందో.. అలాంటి వాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు.. సహచరుడు.. ఆత్మీయుడు ! ఒక్కమాటలో చెప్పాలంటే.. వాడే మగాడు !’’. ఈ మాటలకు అక్షర సత్యంగా నిలుస్తున్నారు మియా ఖాన్‌, షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయేద్‌. ఇంతకీ ఎవరు వీళ్లు ? ఏం చేశారు ? తెలుసుకుందాం రండి !