Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

జీవితంలో ఒక ఆశయం పెట్టుకొని విజయం సాధించిన చాలామంది చెప్పే మాట ఒకటే... ‘ఆశయసాధనలో విజయం సాధించడం ముఖ్యం కాదు.. ఆ విజయం కోసం పడే తపనే ముఖ్యం.’ అని. ఎందుకంటే ఆ తపనే పదుగురికి స్ఫూర్తిగా నిలిచి మనల్ని విజయానికి చేరువ చేస్తుంది. ఇలా ఫుట్‌బాల్‌ క్రీడలో విజయం సాధించాలని అనుక్షణం తపన పడింది ఓ మహిళ. ఈక్రమంలో తాజాగా ఓ అరుదైన గౌరవాన్ని అందుకుంది. ఓ విదేశీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ తరఫున కాంట్రాక్ట్‌ అందుకున్న తొలి భారత మహిళా ఫుట్‌బాలర్‌గా చరిత్ర సృష్టించింది. ఫుట్‌బాల్‌ క్రీడ అంటే కేవలం పురుషుల క్రీడే కాదని కనువిప్పు కలిగిస్తూ.. ఫుట్‌బాల్‌ అంటే ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ సరైన ప్రోత్సాహం లేని స్త్రీలకు తన నిరంతర తపనతో స్ఫూర్తిని రిగిలిస్తోంది. ఆమె మరెవరో కాదు... మణిపూర్‌ మణిపూస నంగొమ్‌ బాలాదేవి !

సముద్రపు అలల్లో గొప్ప జీవిత సత్యం దాగుంది. తీరం దాటేందుకు నిరంతరంగా అవి సాగించే ప్రయాణం... ఆశయసాధనలో మనమెప్పుడూ ప్రయత్నం మానకూడదని తెలుపుతుంది. ఇలా అలల నుంచి స్ఫూర్తి పొందింది కాబట్టే పరాజయాలు ఎదురైనా నిరంతరం విజయం వైపు అడుగులు వేస్తూనే ఉంది ఓ యువతి. ఈక్రమంలోనే ఓ అద్భుతమైన ఘనతను సాధించింది. భారత సెయిలింగ్‌ క్రీడ (పడవ నడపడం)లో మహిళా సాధికారతకు మణిహారంగా నిలుస్తూ భావితరాలకు స్ఫూర్తిగా మారింది. ఆమె మరెవరో కాదు తాజాగా సెయిలింగ్‌ వరల్డ్‌ కప్‌లో పతకం సాధించిన మొట్టమొదటి భారత మహిళ నేత్రా కుమనన్‌. సెయిలింగ్‌ అంటేనే పురుషుల క్రీడ అన్న భావనను చెరిపేస్తూ.. పరాజయాలు ఎదురైనా తీరంతో పోరాడుతున్న అలలా ఆమె ఈ రంగంలో తనకంటూ ఓ గుర్తింపును సాధిస్తోంది. మరి మొన్నటి వరకూ ఎవరికీ పెద్దగా పరిచయం లేని నేత్ర ఈరోజు అందరికీ సుపరిచితురాలు అవడం వెనుక ఉన్న కథేంటో చూద్దాం రండి !

నటి, గాయని జెన్నిఫర్‌ లోపెజ్‌ గురించి మన తెలుగు వారికి పరిచయమే. ఎందుకంటే.. ‘జెన్నిఫర్‌ లోపెజ్‌ స్కెచ్‌ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి..’ అని ‘జల్సా’గా తెలుగు ప్రేక్షకులు కూడా పాడుకునే అందం ఆమెది. ఇక ప్రియాంక చోప్రా గురించి చెప్పాలంటే పిల్లాడిని అడిగినా బయోడేటా మొత్తం పూస గుచ్చినట్లు చెప్పేస్తుంటాడు. అంతటి నట ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ ఆమె సొంతం. మరి అటువంటి జెన్నిఫర్‌ ఒకవైపు, ప్రియాంక మరోవైపు ఒకే వేడుకలో ఉండగా మరొకరి మీదకి మన దృష్టి వెళ్తుందా చెప్పండి ! కానీ వెళ్లింది.. ఓ 18 ఏళ్ల యువ సంగీత కెరటం ఆ తారల్ని మరిపించి అందర్నీ ఆకర్షించింది. ఆమే.. సంగీతంతో శ్రోతల్ని హిప్నటైజ్‌ చేసే బిల్లీ ఐలిష్‌. ఇటీవల జరిగిన 62వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అయిదు అవార్డులు గెలుచుకుని ప్రపంచ సంగీత ప్రియులతో ఔరా అనిపించింది. మరింతకీ ఈమె ఎవరు ? అంతలా ఆమె సంగీతంలో ఏముంది ? తెలుసుకుందాం రండి !

ఈ రోజుల్లో చాలామంది ఉపాధ్యాయులు చదువు చెప్పడమంటే పుస్తకాలను కంఠస్తం చేయించడమే అన్నట్లు పనిచేస్తుంటారు. కానీ కొంతమంది ఉపాధ్యాయులు ఇందుకు భిన్నంగా ఉంటారు. విద్యార్థులకు విద్య నేర్పడమంటే తాము సంపాదించిన జ్ఞానాన్ని అందరికీ పంచడంగా భావిస్తారు. విద్యను కష్టంగా కాక ఇష్టంగా నేర్చుకునేలా చేస్తారు. అందుకు విద్యకు ఆటను జోడించి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతారు. ఈక్రమంలో విద్యార్థులు నేర్చుకునే ఏ విషయమైనా నిద్రలో లేపి అడిగినా గుర్తుండేలా బోధిస్తారు. అందుకే అటువంటి ఉపాధ్యాయులకు మన హృదయాల్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా శాశ్వత స్థానాన్ని ఇస్తాం. అటువంటి ఉపాధ్యాయుల గురించే మీరిప్పుడు తెలుసుకోబోతున్నారు. ఆనంద్‌ మహీంద్రా, షారుఖ్‌ ఖాన్‌ వంటి వారి చేత సైతం తమకు ఇటువంటి టీచర్‌ ఎందుకు లేదో అని ఒక టీచర్‌ అనిపిస్తే, ఇక మరికొందరు విద్యార్థులకు జ్ఞనాన్నే కాదు ప్రేమను కూడా పంచి శెభాష్‌ అనిపించుకుంటున్నారు. మరి ఈ ఆదర్శవంతమైన ఉపాధ్యాయుల గురించి మనమూ తెలుసుకుందాం రండి !

కేరళ అంటేనే భూలోక స్వర్గంలా ఉంటుందంటారు పర్యటకులు. ప్రకృతి అందాలతో స్వర్గధామంలా ఉండే అటువంటి ప్రాంతంలో పుట్టి పెరిగిన వారికి ప్రపంచాన్ని చుట్టి రావాలనే కోరిక ఉండడం సహజం. అలా తన సహజ గుణాన్ని ఓ శక్తిగా మలచుకున్నారు గీతూ మోహన్‌దాస్‌. ఇంతకీ ఈవిడెవరు ? అని ఆలోచిస్తున్నారు కదూ ! ట్రెక్కింగ్‌ వస్తువులను తయారు చేసే ప్రముఖ స్వీడన్‌ సంస్థ ‘ఫల్‌ రావెన్‌’ ఈ ఏడాది చేపట్టిన ఆర్కిటిక్‌ యాత్రకు భారత్‌ నుంచి ఎంపికైన ఏకైక పర్యటకురాలు గీతూ. అంతేకాదు ఈ యాత్రలో పాల్గొంటున్న మొట్టమొదటి భారత మహిళ కూడా ఆమే ! అయితే ఆమె ఈ ఘనత సాధించడానికి ముందు ఎంతో మానసిక సంఘర్షణకు గురి కావాల్సి వచ్చింది. కొంతమంది పోటీదారులు ఆమెకు డబ్బులిచ్చి యాత్ర నుంచి తప్పించే ప్రయత్నం కూడా చేశారట ! మరప్పుడు ఆమె ఏం చేశారో తెలుసా ?

ప్రపంచానికి వెలుగునివ్వడంలో సూర్యుడికి ఎవరూ సహకరించరు. లోలోన తనని తాను దహించుకుంటూ సమస్త జగత్తుకీ వెలుగునిస్తాడు. సాధించాలన్న తపన ఉన్న మనిషి కూడా అంతే. తనలోని తపనను రగిల్చి స్ఫూర్తి అనే కిరణాలను ఇతరులపై ప్రసరింపజేస్తారు. ఇలా ఎందరికో మార్గదర్శకురాలయ్యారు చైనాకు చెందిన లియాంగ్‌ జున్‌ అనే మహిళ. మన భారతీయులకు ఈమె గురించి పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ చైనీయులకు ఈమె ఆరాధ్యురాలు. చైనాలోని ఒక యువాన్‌ నోటుని (కరెన్సీ నోటు) చూస్తే ఆమె విలువ ఏపాటిదో తెలుస్తుంది. ఏ పాఠశాలలో ఏ విద్యార్థిని అడిగినా తమ పాఠ్యపుస్తకంలోని ఆమె గొప్పతనాన్ని వల్లెవేస్తారు. అటువంటి ఆమె ఇటీవలే స్వర్గస్తులయ్యారు. మరి 12 ఏళ్లకే ఒక ముసలి జమీందారుకి భార్యగా వెళ్లిన ఆమె అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎలా ఎదిగారు ? తెలుసుకుందాం రండి !

మార్పు అనేది మాటల్లో చూపించేది కాదు చేతల్లో రుజువు చేసేది. వట్టి మాటలతోనే సమాజం సన్మార్గంలో పయనిస్తుందనుకుంటే.. అదెప్పుడో జరిగేది. అందుకే ‘వట్టి మాటలు కట్టిపెట్టవోయ్‌ గట్టి మేల్‌ తలపెట్టవోయ్‌’ అన్నారు పెద్దలు. ఈ మాటలను అక్షర సత్యం చేస్తూ మహిళా స్ఫూర్తికి అద్దం పడుతున్నారు బీఎంటీసీ (బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి.శిఖ. బెంగళూరు ప్రయాణికుల కోసం కొత్తగా తెచ్చిన వోల్వో బస్సులను స్వయంగా నడిపి పరీక్షించారామె. అందుకు సంబంధించిన వీడియో అంతర్జాలంలో చక్కర్లు కొడుతుండగా, డ్రైవింగ్‌పై ఆసక్తి ఉన్న స్త్రీలకు ఈ వీడియో ఎంతో స్ఫూర్తినిస్తోంది. అధికారి అంటే ఇలానే ఉండాలని చాటుతోంది. అయితే కొంతమంది మటుకు శిఖా చేసింది తప్పంటున్నారు. ఎందుకో చూద్దాం రండి !

27 ఏళ్ల వయసంటే.. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కని వాటిని నిజం చేసుకోవాలని తాపత్రయపడే దశ. అలాంటిది ఉన్నట్టుండి తాను త్వరలోనే చనిపోతానని తెలిస్తే మిగిలిన కొద్దిపాటి జీవితం నరకప్రాయంగా మారుతుంది. ఓ యువతి కూడా ఇలాంటి బాధనే అనుభవించింది. అయితే తన చావుకి కారణం మనిషి తెలియక చేస్తోన్న తప్పే అని గ్రహించిన ఆ యువతి, తన మిగిలిన జీవితమంతా ఆ తప్పును సరిదిద్దుతూ మనుషుల్లో చైతన్యం తీసుకురావడానికి అంకితమిచ్చింది. ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతూ భావితరాల ఉన్నతికి బాసటగా నిలుస్తోంది. ఇంతకీ ఆమెందుకు చావుకు దగ్గరైంది? మనిషి తెలియక చేస్తోన్న ఆ తప్పేంటి? ఏ విధంగా ఆమె ఆ తప్పును సరిదిద్దుతోంది? తెలుసుకుందాం రండి!

సమస్త సృష్టికి మూలాధారం స్త్రీ. ఆమె తలచుకుంటే ఇంటిని చక్కబెట్టడమే కాదు... దేశ రూపురేఖలు కూడా మార్చగలదు. బిడ్డకు జన్మనిచ్చి వారిని సమాజంలో గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దే స్త్రీకి అవకాశం రావాలే కానీ గొప్ప పరిపాలన కూడా అందించగలదు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఇటీవల ఫోర్బ్స్‌ ప్రకటించిన ‘ప్రపంచ 100 మంది అత్యంత శక్తిమంతమైన మహిళల’ జాబితా. ప్రభుత్వ పాలన, వ్యాపారం, మానవ సేవ... ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా పురుషులతో సమానంగా... కాదు.. కాదు.. వారికంటే మిన్నగానే రాణిస్తున్నారు మహిళలు. అందుకే ఈ జాబితా ప్రకటించిన ఫోర్బ్స్‌ కూడా ‘ఈ శక్తిమంతమైన మహిళలతో ఎవరూ పెట్టుకోవద్దు’ అంటోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అభివృద్ధికి సరికొత్త బాట వేస్తోన్న ఈ శక్తిమంతమైన మహిళల్లో మన భారతీయ మహిళలు కూడా నలుగురు ఉన్నారు. మరి వారెవరో చూద్దాం రండి !

73 ఏళ్ల వయసు. పైగా భర్త మరణించారు. ఈ పరిస్థితుల్లో ఎవరున్నా ఒంటరితనంతో సావాసం చేస్తూ మోక్షం కోసం ఎదురుచూస్తుంటారు. అటువంటిది ఓ బామ్మ కిలోమీటర్లకు కిలోమీటర్లు జాగింగ్‌ చేస్తోంది. పైగా ఒకరోజో రెండ్రోజులో కాదు సంవత్సరాల తరబడి చేస్తోంది. ఎందుకో తెలుసా ? దీనులను ఆదుకునేందుకు ! అదేంటి.. ఎవర్నైనా ఆదుకోవాలంటే ఏ అన్నదానమో చేయాలి.. లేదంటే ఎంతో కొంత డబ్బివ్వాలి. కానీ ఇలా జాగింగ్‌ చేస్తే ఏమొస్తుంది ? ఆమెకు నీరసం.. చూసే వారికి నవ్వు తప్ప ! అని అనుకుంటారేమో ! ఆమె జాగింగ్‌ వెనుక గొప్ప సదుద్దేశమే ఉంది. అది వింటే మీరూ నిజమే అని ఆమెతో పాటు జాగింగ్‌ చేసినా ఆశ్చర్యం లేదు. మరైతే ఈ బామ్మ జాగింగ్‌ వెనుక రహస్యం ఏంటో తెలుసుకుందాం పదండి !