Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

ఇటు బాలీవుడ్‌లోనూ, అటు హాలీవుడ్‌లోనూ నటిస్తూ గ్లోబల్‌ స్టార్‌గా పేరు సంపాదించుకున్న లవ్లీ బ్యూటీ ప్రియాంక చోప్రా. యువతలో ఈ ముద్దుగుమ్మకున్న క్రేజ్‌ అంతాఇంతా కాదు. ఇక సోషల్‌ మీడియాలో యమ చురుగ్గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలను ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌తో పంచుకుంటుందీ స్టార్‌ హీరోయిన్‌. తాజాగా ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 50 మిలియన్లకు చేరుకుంది. అంతేకాదు.. భారతీయ సెలబ్రిటీల్లో ఇంతమంది సోషల్‌ మీడియా ఫాలోవర్లు విరాట్‌ కోహ్లీ తర్వాత మన పీసీకే ఉండడం విశేషం. 50.3 మిలియన్ల ఫాలోవర్లతో కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా, ప్రియాంక.. 50 మిలియన్‌ ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలిచింది. మరి గ్లోబల్‌ స్టారా మజాకానా! వీరిద్దరి తర్వాత బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణెను 44.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

‘ఆర్‌ఎక్స్‌100’ సినిమాలో విలక్షణ నటన, అందంతో యువ హృదయాలను కొల్లగొట్టింది నటి పాయల్‌ రాజ్‌పుత్‌. ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన ఈ చిన్నది ‘వెంకీమామ’ చిత్రంతో మరో మెట్టెక్కింది. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్‌మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది పాయల్‌. తన వ్యక్తిగత విషయాలతోపాటు లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఇక తాజాగా షార్ట్‌ హెయిర్‌లో సరికొత్త లుక్‌లో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన పాయల్‌.. ‘మళ్లీ స్కూల్‌ రోజుల్లోకి తిరిగి వెళ్లినట్లుంది... ఈ లుక్‌లో నేను బాగున్నానా? బాలేనా?’ అంటూ రాసుకొచ్చింది.

బాలీవుడ్‌ లవ్లీ కపుల్‌ రణ్‌వీర్‌ సింగ్‌- దీపికా పదుకొణెలు తమ పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ‘83’. భారత దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణ్‌వీర్‌.. కపిల్‌ దేవ్‌ పాత్రలో, దీపిక.. కపిల్‌ దేవ్‌ భార్య రోమీ దేవ్‌ పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. 1983 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం భారీ అంచనాలతో తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్రంలో భాగంగా విడుదలైన రణ్‌వీర్‌ సింగ్‌ ఫస్ట్‌ లుక్‌ అటు క్రికెట్‌ అభిమానులను.. ఇటు సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకోగా.. తాజాగా రోమీ దేవ్‌ పాత్రలో నటిస్తున్న దీపిక ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఇద్దరూ ఒకరినొకరు చూస్తూ నవ్వుతోన్న ఈ లవ్లీ లుక్‌ను దీప్‌వీర్‌ తమ ఇన్‌స్టా ఖాతాల ద్వారా పంచుకున్నారు. కాగా దీనిపై స్పందించిన దీప్స్‌.. ‘క్రీడా చరిత్రలో అత్యద్భుతమైన క్షణాలను రంగరించి రూపొందించిన ఈ గొప్ప చిత్రంలో ఒక భాగమైనందుకు నాకెంతో గర్వంగా ఉంది. ఒక భార్య తన భర్త వృత్తిపరమైన, వ్యక్తిగత ఆకాంక్షలను నెరవేర్చుకొని విజయం సాధించడంలో ఎంతటి ముఖ్య పాత్ర పోషిస్తుందో మా అమ్మను చూసి తెలుసుకున్నాను. ఇప్పుడు నేను నటించిన ఈ ‘83’ చిత్రం.. తమ భర్త కలలను తమవిగా భావించి ఆయనకు అనుక్షణం అండగా నిలిచే ప్రతి మహిళ కోసం రూపొందించినది..’ అనే చక్కటి, అర్థవంతమైన క్యాప్షన్‌ను రాసుకొచ్చిందీ బ్యూటిఫుల్‌ వైఫీ.

డబ్‌స్మాష్‌లతో మొదలై షార్ట్‌ ఫిలిమ్స్‌తో నెటిజన్లకు పరిచయమైంది దీప్తి సునైనా. ఆ తర్వాత ‘బిగ్‌బాస్‌’ సీజన్‌2తో బుల్లితెర ప్రేక్షకులకూ దగ్గరైందీ అందాల తార. బిగ్‌బాస్‌ హౌస్‌లో తనదైన అల్లరి పనులతో అందరినీ ఆకట్టుకున్న దీప్తి ప్రస్తుతం పలు లఘు చిత్రాల్లో నటిస్తోంది. ఇక సోషల్‌ మీడియాలోఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోలను షేర్‌ చేసుకోవడం ఈ అమ్మడికి అలవాటు. ఈక్రమంలో తాజాగా పసుపు రంగు చీరలో స్విమ్మింగ్‌ పూల్‌ పక్కన కూర్చున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘నేను ఎప్పటికీ కోల్పోని... తిరిగి పొందాలనుకునే వ్యక్తి.. నేనే!’ అని ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించిందీ షార్ట్‌ ఫిలిం క్వీన్‌.

బాలనటిగా వెండితెరకు పరిచయమై.. అగ్ర కథా నాయికల్లో ఒకరిగా పేరు సంపాదించుకుంది నటి మీనా. దక్షిణ సినిమా పరిశ్రమకు చెందిన దాదాపు అందరు అగ్ర హీరోలతో ఆడిపాడిందీ అందాల తార. ఇక 2009లో విద్యాసాగర్‌ను పెళ్లాడిన ఈ తార.. అనంతరం అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. తాజాగా ‘కరోలిన్‌ కామాక్షి’ అనే వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ బ్యూటిఫుల్‌ హీరోయిన్‌. ఇదిలా ఉంటే ఇప్పటికీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు అంటూ బిజీగా ఉంటున్న మీనా.. సోషల్‌ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులకు రెగ్యులర్‌గా టచ్‌లోనే ఉంటోంది. తన పాత జ్ఞాపకాలతో పాటు ఇటీవల పలు సందర్భాల్లో దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తున్న మీనా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్ చేసింది. హాఫ్‌వైట్‌ డ్రస్‌లో కుందనపు బొమ్మలా ఉన్న ఫొటోను పోస్ట్‌ చేసిన ఈ అల్లరి పిల్ల.. ‘ఎప్పుడూ నవ్వుతూ ఉండండి..’ అనే క్యాప్షన్‌ను జోడించింది.

ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ.. తన ఇద్దరు చిన్నారుల ఆలనా పాలన చూస్తూ.. ఎంతో ధైర్యంగా ముందుకు వెళుతుంది నటి, నిర్మాత రేణూ దేశాయ్‌. ఓవైపు కుటుంబ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తూనే.. మరోవైపు తన సినీ కెరీర్‌పై దృష్టి సారిస్తోందీ ధీర వనిత. అయితే మనం ఎంత నిబద్ధతతో ఉన్నా.. మనపై తప్పుడు ప్రచారాలు, నెగెటివ్‌ కామెంట్లు చేసేవారు కూడా ఉంటారు. తాజాగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది రేణు. అయితే తనపై వస్తోన్న ఇలాంటి వార్తలకు ఎంతో బాధపడ్డ ఆమె.. ఆ అంశంపై సోషల్‌మీడియా వేదికగా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. తన ఆస్తిత్వాన్నే ప్రశ్నించే విధంగా ఉన్న ఆ వార్తలపై ఫేస్‌బుక్‌లో సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టిందీ సింగిల్‌ మామ్‌. ఎంతో భావోద్వేగంతో రేణు చేసిన పోస్ట్‌ అందరినీ ఆలోచింపజేస్తోంది..

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు - అందాల భామ నమ్రతల ముద్దుల తనయ సీతా పాపకు ఎంతమంది అభిమానులున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే, ఈ క్యూట్‌ డాల్‌ ఎంత బాగా డ్యాన్స్‌ చేస్తుందో మనందరికీ తెలిసిందే. సితార చేసిన డ్యాన్స్‌ వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ మురిసిపోతుంటారు ఆమె పేరెంట్స్‌ మహేష్‌-నమ్రతలు. ఈ క్రమంలో తాజాగా చిన్నారి సితార ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌ ‘డ్యాంగ్‌.. డ్యాంగ్‌..’ పాటకు డ్యాన్స్‌ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను నమ్రత ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ ‘నా డ్యాన్సింగ్‌ క్వీన్‌’ అనే హ్యష్‌ట్యాగ్‌ను జతచేసి, ‘ఎంత అద్భుతంగా చేసిందో..’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది. ఎంతో చూడముచ్చటగా డ్యాన్స్‌ చేస్తున్న సితార అచ్చం తమన్నాలాగే స్టెప్పులేసి ఇరగదీసిందంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరి, ఈ క్యూట్‌ కిడ్‌ చేసిన డ్యాన్స్‌ వీడియోను మీరూ ఓసారి చూసేయండి.