Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

‘ఆర్‌ఎక్స్‌100’ సినిమాలో విలక్షణ నటన, అందంతో యువ హృదయాలను కొల్లగొట్టింది నటి పాయల్‌ రాజ్‌పుత్‌. ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన ఈ చిన్నది ‘వెంకీమామ’ చిత్రంతో మరో మెట్టెక్కింది. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్‌మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది పాయల్‌. తన వ్యక్తిగత విషయాలతోపాటు లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఇక తాజాగా షార్ట్‌ హెయిర్‌లో సరికొత్త లుక్‌లో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన పాయల్‌.. ‘మళ్లీ స్కూల్‌ రోజుల్లోకి తిరిగి వెళ్లినట్లుంది... ఈ లుక్‌లో నేను బాగున్నానా? బాలేనా?’ అంటూ రాసుకొచ్చింది.

రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెన్నిస్‌ కోర్టులోకి రీఎంట్రీ ఇచ్చింది సానియా మీర్జా. ఆడిన మొదటి టోర్నమెంట్‌లోనే విజేతగా నిలిచి తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించిందీ టెన్నిస్‌ సెన్సేషన్‌. అయితే ఈ ఘనమైన పునరాగమనం వెనుక ఎంతో కఠోర శ్రమ దాగుంది. చాలామంది మహిళల్లాగే అమ్మయ్యాక బరువు పెరిగిన సానియా...ఆటమీద మమకారంతో మళ్లీ ఫిట్‌నెస్‌ సాధించేందుకు తీవ్రంగా శ్రమించింది. ఓ వైపు కుమారుడి ఆలనాపాలన చూస్తూనే, మరోవైపు బరువు తగ్గేందుకు కసరత్తులు చేసింది. జిమ్‌లో వర్కవుట్లు, వ్యాయామాలు చేస్తూ డెడ్‌లైన్‌ పెట్టుకుని మరీ 89 కిలోల నుంచి 63 కిలోల బరువుకు చేరుకుంది. ఈ క్రమంలో ఈ టెన్నిస్‌ బ్యూటీ తాజాగా ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

ఆశయ సాధనలో నిరంతరం తపించే స్త్రీలకు మాతృత్వం అడ్డంకి కానే కాదు. అదో మధురమైన విరామం మాత్రమే. మరింత శక్తిమంతంగా తయారవడానికి... తమ తోటి స్త్రీలకు స్ఫూర్తిగా నిలిచేందుకు దొరికే చక్కని అవకాశం. ఇది నిజమని నిరూపిస్తున్నారు ప్రముఖ టెన్నిస్‌ ప్లేయర్స్‌ సానియా మీర్జా, కిమ్ క్లియస్టర్స్‌. ఏ స్త్రీకైనా తల్లిగా మారిన తర్వాత మానసికంగా ఎంత సంతోషంగా ఉంటుందో శారీరకంగా అంతే కష్టంగా ఉంటుంది. కాకపోతే తమ పిల్లల బోసి నవ్వులతో ఆ కష్టాన్ని మర్చిపోతుంటారు. సానియా, కిమ్‌ కూడా అలానే ఆ మధురమైన కష్టాన్ని అనుభవించి ఇప్పుడు తమ తోటి స్త్రీలకు స్ఫూర్తినివ్వడం కోసం మరోసారి రాకెట్‌ చేపట్టబోతున్నారు. మరి తమ పునరాగమనం గురించి ఈ వరల్డ్‌ నం 1 ప్లేయర్స్‌ ఏం చెబుతున్నారో ఓసారి తెలుసుకుందాం రండి !

టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇందులో భాగంగా సానియా సోదరి ఆనమ్‌ మీర్జా, మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ కుమారుడు అసదుద్దీన్‌ల వివాహానికి సంబంధించిన ప్రి వెడ్డింగ్‌ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆనమ్‌- అసద్‌ల వివాహానికి సంబంధించి గత అక్టోబర్‌లో అధికారిక ప్రకటన చేసింది సానియా. ఈ క్రమంలో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్న తన చెల్లి కోసం అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటోంది సానియా. ఇంకా ‘నిఖా’ ముహూర్తం ఖరారు కానప్పటికీ ప్రి వెడ్డింగ్‌ హంగామా వేడుకల్లో భాగంగా బ్రైడల్‌ షవర్‌ , మెహందీ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను తమ సోషల్‌ మీడియా అకౌంట్లలో షేర్‌ చేశారీ అక్కాచెల్లెళ్లు.

భారత క్రీడా చరిత్రలో నం.1 టెన్నిస్ క్రీడాకారిణిగా వెలుగొందిన ధృవతార సానియా మీర్జా. తన కెరీర్‌లో ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్.. ఆసియా కామన్వెల్త్‌, ఆఫ్రో-ఏషియన్ లాంటి పోటీల్లో 14 పతకాలు (అందులో 6 స్వర్ణాలు).. మొదలైనవి గెలుచుకోవడంతో పాటు డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోనే నం. 1 స్థానంలో నిలిచిన తొలి భారత క్రీడాకారిణి సానియా. తను సాధించిన ఈ ఘనత తనకంత సులభంగా రాలేదు. దీని వెనుక ఎంతో కృషి, దీక్ష, పట్టుదల ఉన్నాయి. ఒక దశలో సానియాను చూసి మన దేశంలో చాలామంది తల్లిదండ్రులు తమ కూతుళ్లను టెన్నిస్ వైపు ప్రోత్సహించే వారంటే.. తను సాధించిన విజయాలు ఎంతమందికి స్ఫూర్తినిచ్చాయో అర్థం చేసుకోవచ్చు. నవంబర్ 15న సానియా పుట్టినరోజు. ఈ సందర్భంగా తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..!