Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

మిస్‌ వరల్డ్‌.. అందాల పోటీలకు సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే టైటిల్స్‌లో ఇది కూడా ఒకటి. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల సుందరాంగిణులు పాల్గొనే ఈ పొటీల్లో విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతుంటారు పోటీదారులంతా! ఈ క్రమంలో ఎన్నో వడపోతలు, మరెన్నో రౌండ్లను చాకచక్యంగా దాటుకుంటూ ‘ప్రపంచ సుందరి’ కిరీటం అందుకోవాలంటే అంత సులభమేమీ కాదు. కానీ 18 ఏళ్ల వయసులోనే ఈ కిరీటాన్ని దక్కించుకుని ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకుంది బాలీవుడ్‌ అందాల తార ప్రియాంక చోప్రా. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకొని సరిగ్గా నేటికి(ఫిబ్రవరి 14) రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో అప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ షేర్‌ చేసిందీ గ్లోబల్‌ బ్యూటీ.

నటి, గాయని జెన్నిఫర్‌ లోపెజ్‌ గురించి మన తెలుగు వారికి పరిచయమే. ఎందుకంటే.. ‘జెన్నిఫర్‌ లోపెజ్‌ స్కెచ్‌ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి..’ అని ‘జల్సా’గా తెలుగు ప్రేక్షకులు కూడా పాడుకునే అందం ఆమెది. ఇక ప్రియాంక చోప్రా గురించి చెప్పాలంటే పిల్లాడిని అడిగినా బయోడేటా మొత్తం పూస గుచ్చినట్లు చెప్పేస్తుంటాడు. అంతటి నట ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ ఆమె సొంతం. మరి అటువంటి జెన్నిఫర్‌ ఒకవైపు, ప్రియాంక మరోవైపు ఒకే వేడుకలో ఉండగా మరొకరి మీదకి మన దృష్టి వెళ్తుందా చెప్పండి ! కానీ వెళ్లింది.. ఓ 18 ఏళ్ల యువ సంగీత కెరటం ఆ తారల్ని మరిపించి అందర్నీ ఆకర్షించింది. ఆమే.. సంగీతంతో శ్రోతల్ని హిప్నటైజ్‌ చేసే బిల్లీ ఐలిష్‌. ఇటీవల జరిగిన 62వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అయిదు అవార్డులు గెలుచుకుని ప్రపంచ సంగీత ప్రియులతో ఔరా అనిపించింది. మరింతకీ ఈమె ఎవరు ? అంతలా ఆమె సంగీతంలో ఏముంది ? తెలుసుకుందాం రండి !

నితిన్‌, రష్మిక మందన జంటగా ‘భీష్మ’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా పాటల చిత్రీకరణ ఇటలీలోని పొజిటానో అనే నగరంలో జరుగుతోంది. ఈ క్రమంలో షూటింగ్‌ విరామ సమయంలో బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్‌ రోషన్‌ చిత్రం ‘వార్‌’లోని ‘గుంగ్రూ’ అనే పాటకు నితిన్‌, రష్మిక కాలు కదిపారు. ఈ పాటలో పాపులర్‌ అయిన లెగ్‌ స్టెప్‌ను అనుకరిస్తూ వీళ్లిద్దరూ చేసిన డ్యాన్స్‌ వీడియోను రష్మిక ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ ‘హృతిక్‌ సర్‌... ఈ వీడియో ద్వారా మా ప్రేమను మీకు అందిస్తున్నాం..!’ అని హృతిక్‌ను ట్యాగ్‌ చేసింది. ఇక హృతిక్‌ తాజాగా ఈ ట్వీట్‌పై స్పందించడం విశేషం. ‘స్వీట్‌..! థ్యాంక్యూ సో మచ్‌ రష్మిక, నితిన్‌. భీష్మ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా..! లవ్‌ యూ గాయ్స్‌’ అంటూ ట్వీట్‌ చేశాడీ హ్యాండ్సమ్‌ హంక్‌.

అందం..అభినయంతో ఆకట్టుకునే మన బాలీవుడ్‌ హీరోయిన్ల ప్రతిభా పాటవాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలామంది హీరోయిన్లు హాలీవుడ్‌లో సైతం దూసుకెళుతూ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకుంటున్నారు. తమదైన అభినయంతో అవార్డులు అందుకోవడమే కాదు ప్రముఖ మ్యాగజీన్ల ముఖ చిత్రాలపై దర్శనమిస్తున్నారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన పలు పత్రికలు విడుదల చేసే ఆయా జాబితాల్లో చోటు దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బ్రిటిష్‌ వార పత్రిక ‘ఈస్టర్న్‌ ఐ’ తాజాగా విడుదల చేసిన ‘ది సెక్సీయెస్ట్‌ ఏషియన్‌ వుమన్‌’ జాబితాలో పలువురు బాలీవుడ్‌ హీరోయిన్లు స్థానం సంపాదించారు. ఈ ఏడాది ‘గల్లీబాయ్‌’ సినిమాతో అదరగొట్టిన అలియా భట్‌ ఈ జాబితాలో అగ్రస్థానం సాధించడం విశేషం. గతేడాది టాప్‌ ర్యాంక్‌లో నిలిచిన దీపిక ఈ సారి రెండోస్థానంలో నిలిచింది. అయితే ఈ దశాబ్దానికి సంబంధించి ’ది మోస్ట్‌ సెక్సీయెస్ట్‌ ఏషియన్‌ వుమన్‌ ’ జాబితాలో దీపికదే అగ్రస్థానం కావడం విశేషం.

సమాజహితం కోరి చేసే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎప్పుడూ ముందుంటుంది గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంకా చోప్రా. ఈ క్రమంలో UNICEF, CROCS (ప్రముఖ షూ కంపెనీ) సంయుక్తంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రియాంక పాల్గొంది. ఇందులో భాగంగా బెలీజ్‌ దేశానికి చెందిన స్కూల్‌ పిల్లలకు షూస్‌ పంచిపెట్టారు. ఈ సందర్భంగా తీసిన ఓ వీడియోను ప్రియాంక సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ‘ఈ కార్యక్రమం నాకెంతో ప్రత్యేకమైంది. UNICEF, CROCS సంయుక్తంగా చేస్తోన్న ఈ కార్యక్రమంలో నేనూ భాగమైనందుకు గర్వంగా ఉంది. ఈ క్రమంలో మేము దాదాపు 50,000 పాదరక్షలను పేద పిల్లలకు పంచిపెట్టాం. ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన పేద పిల్లలకు పాదరక్షలను అందజేస్తామని ఆశిస్తున్నాం..!’ అని రాసుకొచ్చింది ప్రియాంక.