Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

కొన్ని దశాబ్దాల క్రితం స్త్రీ అంటే సేవకురాలిగానే ఉండేది. కానీ ఇప్పుడు ఆమెలోని అనంతమైన శక్తి నలుదిశలా ప్రసరిస్తోంది. గతంలో అవకాశం లేక పురుషాధిక్యం ప్రబలిందే కానీ అవకాశం ఇస్తే పురుషులను మించగలం అని నిరూపిస్తోంది. ఇంటి బాధ్యతలతో పాటు వృత్తి బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వర్తిస్తూ.. స్త్రీలు తమకంటే మిన్న కాదు అన్న పురుషుల చేతే శభాష్‌ అనిపించుకుంటోంది. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు జపాన్‌ మహిళలు. స్త్రీలంటే పిల్లలను కనిపెట్టి, ఇంటిని శుభ్రంగా ఉంచే సేవకురాలు అనే సంప్రదాయ భావాన్ని చెరిపేసిన వీరు, అదే పురుషాధిక్య ప్రపంచంతో ‘వృత్తిలోనూ మీ భాగస్వామ్యం కావాలి’ అనిపిస్తున్నారు. అందుకు జపాన్‌ ప్రభుత్వం వర్కింగ్‌ ఉమెన్‌పై చేసిన ఓ సర్వే అద్దం పడుతోంది.

దేశంలో 71వ గణతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సందర్భంగా మన దేశ శ్రేయస్సు కోసం తమ జీవితాలనే త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులను మనమంతా గుర్తు చేసుకున్నాం. మతాలు, ప్రాంతాలు, భాషలు, సంప్రదాయాలు.. ఇలా ప్రజల మధ్య ఎన్ని అంతరాలున్నా మనమంతా ఎప్పటికీ ఒక్కటే అంటూ మరోసారి చాటి చెప్పాం. చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు.. త్రివర్ణ పతాకానికి సెల్యూట్‌ చేస్తూ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. అంతేకాదు, వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా తోటి భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ క్రమంలో గణతంత్ర దినోత్సవానికి సంబంధించి టిక్‌టాక్‌లో ఓ హ్యాష్‌ట్యాగ్‌ వైరల్‌గా మారింది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తూ వీడియోలు రూపొందించి అప్‌లోడ్‌ చేశారు. మరి ఆ విశేషాలేంటో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..!

‘దిల్లీకి రాజైనా తల్లికి మాత్రం కొడుకే’ అంటారు. కొడుకు ఎంత గొప్పవాడైనా, ఎన్ని అద్భుతాలు సాధించినా సరే.. తల్లికి మాత్రం ఎప్పుడూ ఓ చిన్నపిల్లాడిలానే కనిపిస్తాడు. అందుకే బయటకు వెళుతుంటే చాలు వంద జాగ్రత్తలు చెబుతుంది తల్లి. ‘అబ్బా.. నాకు తెలుసమ్మా.. నువ్వు అంతగా చెప్పాలా?’ అని అన్నా సరే తల్లి మనసు బిడ్డల క్షేమం కోసం పరితపిస్తూనే ఉంటుంది. ఇలాగే ప్రణవ్‌ సప్రా అనే ఓ కుర్రాడికి కూడా తన తల్లి నిత్యం జాగ్రత్తలు, సలహాలు చెబుతుంటుంది. అయితే అందరూ ఆ సలహాల్ని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే.. ప్రణవ్‌ మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించాడు. ఈ క్రమంలోనే తన తల్లి చెప్పే జాగ్రత్తలను ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు. ఇందుకోసం సోషల్‌ మీడియానే వేదికగా ఎంచుకున్నాడు. ఇంతకీ ప్రణవ్‌ ఏం చేశాడనేగా మీ డౌట్‌.? అయితే స్టోరీలోకి వెళ్లాల్సిందే...

ఈ సృష్టిలో ప్రతి మనిషికీ తొలి గురువు తల్లే. ఎవరైనా సరే.. పుట్టిన క్షణం నుంచి తల్లితోనే తన ప్రయాణాన్ని మొదలు పెడతారు.. ఆమె ప్రేమ, ఆప్యాయతలను ఆస్వాదిస్తూ ఆమె ఆలనలో ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. అందుకే ప్రపంచంలో తల్లి ప్రేమకు ప్రత్యామ్నాయం మరొకటి ఉండదని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇలా తల్లి తన పిల్లలకు కేవలం ప్రేమానురాగాల్ని పంచడమే కాదు.. తన చిన్నారుల కోసం ఎన్నో పాత్రలను పోషిస్తుంటుంది. బిడ్డ ఏడిస్తే లాలి పాట పాడే గాయనిగా మారుతుంది.. అన్నం తిననని మారాం చేస్తే కథలు చెప్పే గురువు అవుతుంది.. తప్పు చేస్తే మందలించే శ్రేయోభిలాషిగా మారుతుంది.. చివరికి ఆడుకోవడానికి ఫ్రెండ్స్‌ ఎవరూ లేకపోతే ఒక స్నేహితురాలిగా మారి తన బిడ్డను ఆడించే ప్లేయర్‌గానూ అవతారం ఎత్తుతుంటుంది. ఇందుకు తాజా ఉదాహరణే.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఓ వీడియో. తల్లీకొడుకులు మధ్య అనురాగానికి, స్నేహబంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందీ వీడియో. ఇంతకీ ఏముందా వీడియోలో..?

ఆశయ సాధనలో నిరంతరం తపించే స్త్రీలకు మాతృత్వం అడ్డంకి కానే కాదు. అదో మధురమైన విరామం మాత్రమే. మరింత శక్తిమంతంగా తయారవడానికి... తమ తోటి స్త్రీలకు స్ఫూర్తిగా నిలిచేందుకు దొరికే చక్కని అవకాశం. ఇది నిజమని నిరూపిస్తున్నారు ప్రముఖ టెన్నిస్‌ ప్లేయర్స్‌ సానియా మీర్జా, కిమ్ క్లియస్టర్స్‌. ఏ స్త్రీకైనా తల్లిగా మారిన తర్వాత మానసికంగా ఎంత సంతోషంగా ఉంటుందో శారీరకంగా అంతే కష్టంగా ఉంటుంది. కాకపోతే తమ పిల్లల బోసి నవ్వులతో ఆ కష్టాన్ని మర్చిపోతుంటారు. సానియా, కిమ్‌ కూడా అలానే ఆ మధురమైన కష్టాన్ని అనుభవించి ఇప్పుడు తమ తోటి స్త్రీలకు స్ఫూర్తినివ్వడం కోసం మరోసారి రాకెట్‌ చేపట్టబోతున్నారు. మరి తమ పునరాగమనం గురించి ఈ వరల్డ్‌ నం 1 ప్లేయర్స్‌ ఏం చెబుతున్నారో ఓసారి తెలుసుకుందాం రండి !

‘అమ్మ’ అనే పిలుపు మన ప్రపంచాన్నే మార్చేస్తుంది. అంతేనా.. పాపాయి ఆలనా పాలనలో పడిపోయి, ఆ బోసి నవ్వులను ఆస్వాదిస్తూ మనం గడిపే ఆ క్షణాలు మాటలకు అందనివి. ప్రతి మహిళా పొందాలని పరితపించే వెలకట్టలేని అనుభూతి ఇది. ప్రస్తుతం ఇదే అనుభూతిని ఆస్వాదిస్తూ.. పూర్తి సమయాన్ని తన ఇద్దరు చిన్నారుల కోసం కేటాయిస్తూ ఆనందంగా గడుపుతోందీ బాలీవుడ్‌ మామ్‌ సమీరా రెడ్డి. మరోవైపు సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ.. ఎప్పటికప్పుడు బాడీ పాజిటివిటీ, బ్రెస్ట్‌ ఫీడింగ్‌, బాడీ షేమింగ్‌.. వంటి అంశాలపై పోస్టులు పెడుతూ.. ఎంతోమంది మహిళలకు ప్రేరణగా నిలుస్తోందీ బ్యూటిఫుల్‌ మామ్‌.. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్య్వూలో భాగంగా మాట్లాడుతూ.. తాను తొలిసారి తల్లయ్యాక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని, ఎంతో మానసిక వేదనకు గురయ్యానని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. దాన్ని తాను ఎలా గుర్తించిందో, బయటపడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో కూడా తెలియజేస్తూ మరోసారి తల్లులందరిలో స్ఫూర్తి నింపింది సమీర. మరి, పోస్ట్‌ పార్టమ్‌ డిప్రెషన్‌ గురించి ఈ బ్యూటిఫుల్‌ మామ్‌ పంచుకున్న అనుభవాలేంటో తన మాటల్లోనే విందాం రండి..