Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

రోజురోజుకీ పెరిగిపోతున్న ఈ ఎండల్లో ఎంత కాదనుకున్నా బయటికి వెళ్లక తప్పదు. పోనీ ఇంటిపట్టునే ఉందామనుకున్నా వాతావరణంలో వేడి వేధించక మానదు. ఒక్క ఏసీ గదుల్లో తప్ప మరెక్కడా ఉండలేమంటారా..? ఉండగలం..! ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా ఎండ ప్రభావం నుంచి శరీరాన్ని రక్షించుకోడానికి అనేక మార్గాలున్నాయి.. వాటిలో నోరూరించే పుచ్చకాయ ఒకటి.. చుట్టూ సూర్య ప్రతాపం చెలరేగినా..ఇది మాత్రం చల్లగా కడుపులో చేరి, ఆ వడదెబ్బ నుంచి కాపాడుతుంది. మరి అలాంటి పుచ్చకాయని క్షణాల్లో తరిగేయడానికి, పిల్లలకు నచ్చేలా రకరకాల ఆకారాల్లో కట్ చేయడానికీ రకరకాల గ్యాడ్జెట్స్ ఒచ్చేశాయి.. అవేంటో చూసేద్దామా మరి..!

ప్రస్తుతం చదువులు, ఉద్యోగాలు అంటూ చాలామంది తమ కుటుంబాలకు దూరంగా హాస్టల్స్‌లో, రూమ్స్‌లో ఉండడం కామనైపోయింది. ఇలా బయట ఉండాల్సి వచ్చినపుడు ఒక్కోసారి సరైన ఆహారం లభించక చాలా ఇబ్బందిపడుతుంటారు. హాస్టల్స్‌లో ఉంటే ఫుడ్‌ గురించి ఆలోచించాల్సిన పనిలేదని చాలామంది భావిస్తుంటారు. కానీ అక్కడే సమస్యంతా మొదలవుతుంది. హాస్టల్‌లో పెట్టే ఫుడ్ తినలేక .. అలాగని ప్రతి రోజూ బయటి ఫుడ్‌ తినాలంటే.. ఖర్చుతో పాటు అనారోగ్యం పాలవడం ఖాయం. కేవలం హాస్టలే కాదు.. రూమ్‌లో ఉండే వారి పరిస్థతి కూడా అంతే. ప్రతి రోజు రెస్టరంట్లో తింటూ పోతే మిగిలేది ఏమీ ఉండదు... పైగా వాటి వల్ల ఆరోగ్యం చెడి అదనపు ఖర్చులవుతాయి. అందుకే ఈ కాలంలో ఆడ, మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్వయంపాకానికే ఓటేస్తున్నారు. కానీ ఇంట్లోలా పెద్ద పెద్ద గ్యాస్‌ స్టౌలు రూమ్స్‌, హాస్టల్స్‌లో పెట్టుకోలేం. అలాంటి వారి కోసమే ఈ ‘పోర్టబుల్‌ గ్యాస్‌ బర్నర్స్‌’ ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. మరి అవెలా ఉంటాయో.. ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలంటే ఇది చదవండి..

కుక్కర్‌.. ఇది లేని వంటిల్లు ఉండదనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఉన్న బిజీ జీవితంలో తొందరగా వంట ముగించాలంటే కుక్కర్‌ తప్పక ఉండాల్సిందే. మరి ప్రతి వంటింట్లో ముఖ్య భాగమైన ఈ కుక్కర్‌లో.. ఇప్పుడు కేవలం అన్నం, కూరలు మాత్రమే కాదండోయ్‌.. అన్ని రకాల వంటకాలూ చేసేసుకోవచ్చు. అందుకోసమే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకొచ్చాయ్‌ ‘మల్టీ ఫంక్షనల్‌ కుక్కర్స్‌’. ఇవన్నీ ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్స్‌లా కరెంట్‌తోనే పనిచేస్తాయి. వీటిని కొని మన వంటింట్లో చేర్చుకున్నామంటే అన్నం, కూరలతో పాటు ఆమ్లెట్‌, పాస్తా, పిజా, దోశ.. ప్రతి ఒక్కటీ ఈజీగా చేసేసుకోవచ్చు. అరే భలే బాగున్నాయే.. ఈ కుక్కర్స్‌ అనుకుంటున్నారా? మరి ఇంత ఉపయోగకరంగా ఉన్న ఈ మల్టీ పర్పస్‌ కుక్కర్స్‌ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది కదూ!! అయితే ఆలస్యమెందుకు.. అసలు విషయంలోకి వెళ్దాం పదండి..

టీవీ చూసేటప్పుడైనా.. థియేటర్‌లో సినిమా మధ్యలో బ్రేక్‌ వచ్చినా.. ఫ్రెండ్స్‌తో బాతాఖానీ వేసేటప్పుడైనా.. టైంపాస్‌గా ఏదైనా తిందాం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే స్నాక్‌ ఐటమ్‌ ‘పాప్‌కార్న్‌’. ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించే అద్భుతమైన రుచి వీటి సొంతం. అలాగని బయట చేసిన పాప్‌కార్న్‌ తెచ్చుకుంటారా ఏంటి? ఆ అవసరం లేకుండానే ఇంట్లోనే చిటికెలో వీటిని తయారుచేసుకోవచ్చు. అలాంటి బోలెడన్ని పాప్‌కార్న్‌ మేకింగ్‌ గ్యాడ్జెట్స్‌ ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయ్‌. వాటిలో కార్న్‌ గింజలు వేసి సర్వింగ్‌ బౌల్స్‌ చేతిలోకి తీసుకునేలోపే ఇవి సిద్ధమైపోతాయి. అంత త్వరగా పాప్‌కార్న్‌ను తయారుచేస్తాయీ గ్యాడ్జెట్స్‌. ఇక వీటిలో కావాలంటే నూనె వేసుకోవచ్చు.. లేదంటే ఆయిల్‌ ఫ్రీగా కూడా రుచికరమైన పాప్‌కార్న్‌ తయారుచేసుకోవచ్చు. మరి, చిటికెలో పాప్‌కార్న్‌ను సిద్ధం చేసే కొన్ని పాప్‌కార్న్‌ మేకర్స్‌ గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..

అయ్యో.. ఉప్పెక్కడ పెట్టానో కనిపించడం లేదే.. కప్‌బోర్డ్‌లో ఎక్కడో ఒకచోట ఉప్పు డబ్బా పెట్టడం, ఇలా రోజూ దాని గురించి వెతకడం ప్రత్యూషకు అలవాటే. నేహ తన కిచెన్‌లో పప్పులన్నీ ఒకే తరహా డబ్బాల్లో భద్రపరుస్తుంటుంది. అయితే అవి ట్రాన్స్‌పరెంట్‌గా లేకపోవడంతో ఏ పప్పు ఏ డబ్బాలో ఉందో పదే పదే మూత తీసి చూడాల్సిందే! రాగిణి ఆఫీసుకెళ్లే హడావిడిలో గిన్నెలన్నీ తోమి ఆదరాబాదరాగా ఓ టబ్‌లో వేసేస్తుంది. ఇక సాయంత్రం ఇంటికొచ్చాక అందులో టీ గిన్నె ఎక్కడుందో వెతుక్కోవడానికి రోజూ కాస్త సమయం వృథా అవుతుందంటోంది. ఇలా మనం కిచెన్‌ని ఎంత చక్కగా సర్దుకున్నా.. కొన్ని కొన్ని పదార్థాలు, వస్తువుల కోసం రోజూ వెతుక్కుంటూ ఉంటాం. మరి, ఇలాంటి కన్‌ఫ్యూజన్‌కి చెక్‌ పెట్టాలంటే ‘కిచెన్‌ ర్యాక్స్‌’ని మన వంటింట్లో భాగం చేసుకోవాల్సిందే! గరిటలు, గిన్నెల దగ్గర్నుంచి పప్పులు, స్పైసెస్‌.. వంటి పదార్థాల వరకు అన్నీ వేటికవే సెపరేట్‌గా అమర్చుకోవడానికి ప్రస్తుతం ఇలాంటి బోలెడన్ని మల్టీ పర్పస్‌ ర్యాక్స్‌ మార్కెట్లో అందుబాటులోకొచ్చేశాయి. ఏ ర్యాక్‌లో సర్దేవి ఆ ర్యాక్‌లో అరేంజ్‌ చేస్తే పని తగ్గడంతో పాటు సమయమూ ఆదా అవుతుంది.. అంతేనా.. కిచెన్‌ కూడా నీట్‌గా కనిపిస్తుంది.. పైగా వీటికంటూ ప్రత్యేకంగా కాస్త స్పేస్‌ కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. గోడలు, చిన్న చిన్న ఖాళీ ప్రదేశాల్లో ఇట్టే ఇమిడిపోయే ఇలాంటి కొన్ని విభిన్న కిచెన్‌ ర్యాక్స్‌/మల్టీ పర్పస్‌ ర్యాక్స్‌ గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..

‘నువ్విప్పుడు అన్నం తినకపోతే బూచాడు పట్టుకుపోతాడు..’, ‘చూడు చూడు చందమామ నిన్నే చూస్తున్నాడు..’, ‘నువ్వు అన్నం తినకపోతే.. ఇదిగో ఈ బుజ్జి కుక్కపిల్ల నీ అన్నమంతా తినేస్తుంది..’ పిల్లల చేత గోరుముద్దలు తినిపించేటప్పుడు తల్లులు ఇలా ఎన్నెన్ని కబుర్లు చెబుతారో మనకు తెలిసిందే. ఇలా వాళ్ల చేత కాస్త బలవంతంగా తినిపించాలని చూసినా.. అన్నం గిన్నెను నెట్టేస్తారు. అంతే అందులోని అన్నమంతా నేలపాలు. అంతేకాదు.. ఎవరికి వారు సొంతంగా తినే పిల్లలైనా సరే.. ఎంతో రుచికరంగా వండి వడ్డించినా తిననంటూ మారాం చేస్తుంటారు. దీంతో తల్లులకు విసుగొచ్చేస్తుంటుంది. మరి పిల్లలు తల్లులకు ఎలాంటి కష్టం కలిగించకుండా అన్నం తినాలన్నా.. వాళ్లు తినే గిన్నె నెట్టేసినా, బోర్లించినా అందులోని పదార్థం కిందపడకుండా ఉండాలన్నా.. అందుకోసం బోలెడన్ని గ్యాడ్జెట్లు మార్కెట్లోకొచ్చేశాయి. మరి, చిన్నారులకు ఆహారం తినిపించే లేదా వారే స్వయంగా ఆహారం తినే పనిని మరింత ఈజీ చేసేసిన అలాంటి కొన్ని గ్యాడ్జెట్ల గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..

కాయగూరలు తరగడానికైనా, పండ్లను ముక్కలుగా కట్‌ చేయాలన్నా.. చాపింగ్‌ బోర్డ్‌ తప్పనిసరి. ఒక్కమాటలో చెప్పాలంటే చాపింగ్‌ బోర్డ్‌ లేని కిచెన్‌ అసంపూర్ణమనే చెప్పుకోవాలి. అంతలా వంటింట్లో కీలక పాత్ర పోషిస్తోందీ బోర్డ్‌. అయితే చాపింగ్‌ బోర్డ్ అనగానే మనందరికీ ఫ్లాట్‌గా ఉండే సాధారణ కటింగ్‌ బోర్డులే గుర్తొస్తాయి. కానీ వాటిని తలదన్నే వెరైటీ చాపింగ్‌ బోర్డులు ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. చూడడానికి ఆకర్షణీయంగా ఉండడమే కాదు.. అందుబాటు ధరల్లోనే లభిస్తోన్న ఈ బోర్డులతో కాయగూరల్ని తరిగే పని కూడా కాస్త ఈజీగా పూర్తవుతుంది. మరి, అలాంటి కొన్ని విభిన్న చాపింగ్‌ బోర్డులు, అవి మనకెలా ఉపయోగపడతాయో ఈ వారం తెలుసుకుందాం రండి..

వేపుళ్లు, పులుసు కూరలు, సలాడ్స్‌పై గార్నిష్‌ చేయడానికి.. ఇలా మనం ఇంట్లో చేసుకునే ఎలాంటి వంటకానికైనా అమోఘమైన రుచిని అందించే పదార్థాలు మన వంటింట్లో బోలెడుంటాయి. అందులో కొబ్బరి తురుముది ప్రత్యేక స్థానం. అయితే దీన్ని ఇంట్లో తయారుచేసుకునే సమయం లేకపోవడంతో చాలామంది బయట ప్యాకెట్లలో దొరికే కొబ్బరి తురుమును ఉపయోగిస్తుంటారు. కానీ దీనివల్ల వంటలకు అంత రుచి రాకపోవచ్చు. పైగా ఎప్పటికప్పుడు తాజాగా తయారుచేసుకుంటేనే కూర మరింతగా రుచిస్తుంది. మరి, ఏ రోజుకారోజు తాజాగా కొబ్బరి తురుమును తయారుచేసుకోవడం కాస్త కష్టమే.. పైగా అంత సమయం మాకు లేదంటారా? అలాగని బయట దొరికే తురుముతో రాజీ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే క్షణాల్లో కొబ్బరిని తురిమి పెట్టడానికి మార్కెట్లో బోలెడన్ని కొకోనట్‌ గ్రేటర్స్‌ అందుబాటులోకొచ్చేశాయి. కేవలం కొబ్బరిని తురమడం మాత్రమే కాదు.. చిప్ప నుంచి కొబ్బరిని వేరు చేయడం దగ్గర్నుంచి ఆ కొబ్బరి ముక్కల్ని తురమడం, కొబ్బరి బోండాకు రంధ్రం చేసి అందులోని నీటిని తాగడం వరకు.. ఇలా ప్రతి పనినీ ఎంతో సులభతరం చేస్తున్నాయ్‌ ఈ వెరైటీ కొకోనట్‌ టూల్స్‌. మరి, అవేంటో తెలుసుకొని మనమూ మన వంటింట్లో వాటిని భాగం చేసుకుందాం రండి..

వంట గది అంటేనే బోలెడు పని. ఉదయం అల్పాహారం ప్రిపేర్‌ చేయడం దగ్గర్నుంచి రాత్రి భోజనం సిద్ధం చేయడం వరకు మహిళలు ఎక్కువగా గడిపేది కిచెన్‌లోనే. ఇక కూరగాయలు కోయడం నుంచి పాత్రలు కడగడం వరకు ఇలా ప్రతి ఒక్క పని చేతులతో చేయాల్సిందే. ఇలా ఎక్కువ సమయం నీళ్లలో గడపడం వల్ల అనేక చర్మ సమస్యలు వస్తుంటాయి. అదే విధంగా ఆఫీసుకు ఆలస్యమవుతుందనో, పిల్లలకు స్కూల్‌ లేటవుతుందనో ఆదరబాదరాగా కూరగాయలు కోసే సమయంలో వేళ్లు తెగిన సందర్భాలు ఎన్నో. అంతేనా.. వేడి పాత్రను స్టౌ మీద నుంచి దించే క్రమంలో చేతులు కాల్చుకోవడం పరిపాటే. మరి, ఇంట్లోవారందరికీ అన్నం పెట్టే మహిళల చేతులను సురక్షితంగా ఉంచడానికి ప్రస్తుతం మార్కెట్లో రకరకాల గ్లౌజ్‌లు అందుబాటులోకి వచ్చాయి. మరి ఆ గ్లౌజ్‌లేంటీ..? వాటి ఉపయోగాలేంటో తెలుసుకుందామా..?

చికెన్‌, మటన్‌, చేపలు, రొయ్యలు.. ఇలా వరుసపెట్టి నాన్‌వెజ్‌ వంటకాల గురించి చెబుతుంటేనే నోట్లో నీళ్లూరుతుంటాయి చాలామందికి. మాంసాహారమంటే అందరికీ అంత ఇష్టం మరి! అందుకే కేవలం వారాంతాల్లోనే కాకుండా వారం మధ్యలో కూడా నాన్‌వెజ్‌ వంటకాల్ని ఆస్వాదిస్తుంటారు మాంసాహార ప్రియులు. అయితే రుచి చూడడం వరకు బాగానే ఉంది కానీ వాటిని వండే క్రమంలోనే అసలు చిక్కు ఎదురవుతుంటుంది. సరిగ్గా ఉడకట్లేదని, ఉప్పు-కారం మాంసం ముక్కలకు పట్టలేదని.. ఇలా మాంసాహారం వండే క్రమంలో ఒక్కొక్కరికీ ఒక్కో అనుభవం ఎదురవుతుంటుంది. నాన్‌వెజ్‌ వండేటప్పుడు మీరూ ఇలా విసుక్కుంటున్నారా? అయితే ఈ నాన్‌వెజ్‌ టూల్స్‌ని మీ కిచెన్‌లో చేర్చుకోవాల్సిందే! మాంసం ముక్కలను ఎంత పరిమాణంలో కావాలంటే అంత పరిమాణంలో కట్‌ చేసుకోవడం దగ్గర్నుంచి వీటితో చేసే స్నాక్స్‌ దాకా.. ప్రతి పనినీ ఎంతో సులభతరం చేస్తున్నాయీ టూల్స్‌. ఇంతకీ ఏంటా టూల్స్‌? వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుసుకోవాలనుకుంటే ఇది చదివేయండి.