Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

బాలీవుడ్‌ లవ్లీ కపుల్‌ రణ్‌వీర్‌ సింగ్‌- దీపికా పదుకొణెలు తమ పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ‘83’. భారత దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణ్‌వీర్‌.. కపిల్‌ దేవ్‌ పాత్రలో, దీపిక.. కపిల్‌ దేవ్‌ భార్య రోమీ దేవ్‌ పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. 1983 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం భారీ అంచనాలతో తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్రంలో భాగంగా విడుదలైన రణ్‌వీర్‌ సింగ్‌ ఫస్ట్‌ లుక్‌ అటు క్రికెట్‌ అభిమానులను.. ఇటు సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకోగా.. తాజాగా రోమీ దేవ్‌ పాత్రలో నటిస్తున్న దీపిక ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఇద్దరూ ఒకరినొకరు చూస్తూ నవ్వుతోన్న ఈ లవ్లీ లుక్‌ను దీప్‌వీర్‌ తమ ఇన్‌స్టా ఖాతాల ద్వారా పంచుకున్నారు. కాగా దీనిపై స్పందించిన దీప్స్‌.. ‘క్రీడా చరిత్రలో అత్యద్భుతమైన క్షణాలను రంగరించి రూపొందించిన ఈ గొప్ప చిత్రంలో ఒక భాగమైనందుకు నాకెంతో గర్వంగా ఉంది. ఒక భార్య తన భర్త వృత్తిపరమైన, వ్యక్తిగత ఆకాంక్షలను నెరవేర్చుకొని విజయం సాధించడంలో ఎంతటి ముఖ్య పాత్ర పోషిస్తుందో మా అమ్మను చూసి తెలుసుకున్నాను. ఇప్పుడు నేను నటించిన ఈ ‘83’ చిత్రం.. తమ భర్త కలలను తమవిగా భావించి ఆయనకు అనుక్షణం అండగా నిలిచే ప్రతి మహిళ కోసం రూపొందించినది..’ అనే చక్కటి, అర్థవంతమైన క్యాప్షన్‌ను రాసుకొచ్చిందీ బ్యూటిఫుల్‌ వైఫీ.

‘మహానటి’ సినిమాతో యావత్‌ భారతీయ సినీ పరిశ్రమను ఒక్కసారి తనవైపు తిప్పుకుంది నటి కీర్తిసురేష్‌. తన అసమాన నటనతో అలనాటి నటి ‘సావిత్రి’ పాత్రకు ప్రాణం పోసిన కీర్తి ఈ సినిమాతో ‘జాతీయ ఉత్తమ నటిగా’ ఎంపికైన విషయం తెలిసిందే. ఇక తాజాగా ‘మిస్‌ ఇండియా’ అనే మరో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలో నటిస్తోందీ చెన్నై చిన్నది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌, ‘ఓ లచ్చా గుమ్మడి’ పాట సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఇదిలా ఉంటే తాజాగా చిత్రయూనిట్‌ సినిమాలోని మరో లిరికల్‌ పాటను విడుదల చేసింది. ‘కొత్తగా.. కొత్తగా.. కొత్తగా.. రంగులే నింగిలో పొంగే సారంగమై..!’ అని సాగే పాటలోని చరణాలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. థమన్‌ ట్యూన్‌ కంపోజ్‌ చేసిన ఈ పాటకు కళ్యాణ్‌ చక్రవర్తి లిరిక్స్‌ రాశారు. ఇక శ్రేయా ఘోషల్‌ గొంతుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మరి ఈ పాటను ఓసారి మీరూ వినేయండి..

మన బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె, టాలీవుడ్‌ బ్యూటీ నిత్యా మేనన్‌లు మంచి స్నేహితులట..! అవును, సినీపరిశ్రమలో ఉన్న బెస్ట్‌ ఫ్రెండ్స్‌ జాబితాలో ఇప్పుడు ఈ ఇద్దరు భామలు కూడా చేరిపోయారు. ఈ విషయాన్ని దీపిక ట్విట్టర్‌ ద్వారా స్వయంగా అభిమానులతో పంచుకుంది. ఇటీవలే జరిగిన ‘ఛపాక్‌’ సినిమా ప్రమోషన్స్‌కు నిత్యా మేనన్‌ కూడా హాజరైంది. ఈ సందర్భంగా వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోను దీపిక పోస్ట్‌ చేస్తూ ‘ఈ విషయం తెలియని వారికి (తను చెప్పేంత వరకూ నాక్కూడా తెలియదనుకోండీ..!).. మేమిద్దరం ఒకే నగరానికి చెందిన వాళ్లమే కాదు.. ఒకే కాలేజీలో చదువుకున్న వాళ్లం కూడా (ఫన్నీ ఎమోజీని జతచేస్తూ)..! నీ ప్రేమకు కృతజ్ఞతలు నిత్య..!’ అంటూ రాసుకొచ్చిందీ ‘ఛపాక్‌’ బ్యూటీ.

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు కన్నుల పండువగా జరిగాయి. మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రిస్మస్‌ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రిస్మస్‌ చెట్టు, స్టార్స్‌, లైట్స్‌, బెలూన్స్‌.. మొదలైన వాటితో ఇంటిని అందంగా అలంకరించి, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్‌ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. అంతేకాదు.. తమ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ క్రిస్మస్‌ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ క్రమంలో సినిమా పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం సోషల్‌ మీడియా ద్వారా తమ అభిమానులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. మరి ఆ విశేషాలేంటో మీరూ చూసేయండి..!

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తారల్లో నటి రేణూ దేశాయ్‌ ఒకరు. తన వ్యక్తిగత విషయాలతో పాటు తన అభిప్రాయాలను, సూచనలను ఈ వేదిక ద్వారా అభిమానులతో పంచుకొంటుంటుందీ తార. ఈక్రమంలో రేణూ తాజాగా కొన్ని ఫొటోలను పోస్ట్‌ చేస్తూ ‘మన మనసుకు నచ్చిన ఆహారాన్నే మితంగా తీసుకోవాలని నేనెప్పుడూ చెబుతుంటాను. దానితో పాటు మనం తరచూ యోగా, వర్కవుట్లు వంటివి చేస్తుండాలి. మన జీవితం చాలా చిన్నది. అందుకే మన ఆత్మను సంతృప్తి పరిచే పనులు మాత్రమే చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో మద్యం, మత్తు పదార్థాలకు బానిసలుగా మారకండి. చివరి ఫొటో నేను ఆహారం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నప్పుడు తీసింది.’ అని రాసుకొచ్చింది.

ÆE©ü ªÃN-X¾ÜœË Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð «Õæ£Ç-†ý-¦Ç¦Õ £ÔǪî’à Å窽-éÂ-¹׈-ÅîÊo *“ÅŒ¢ '®¾J-©äª½Õ FéÂ-«yª½ÕÑ. ¨ *“ÅŒ¢©ð ÊšË N•-§ŒÕ-¬Ç¢A ‹ ÂÌ©-¹-¤Ä-“ÅŒ©ð ʚ˲òhÊo ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ¨ “¹«Õ¢©ð N•-§ŒÕ-¬Ç¢AE …Ÿäl-P®¾Öh «Õæ£Ç†ý ÅÃèÇ’Ã ‹ šÌyšü Íä¬Çœ¿Õ. 'ƒŸ¿¢Åà ƒÂ¹ˆœ¿ „ç៿-©ãj¢C..! 1989©ð Å窽-éÂ-ÂËˆÊ 'Â휿ÕÂ¹× CClÊ ÂÃX¾Ûª½¢Ñ ®ÏE«Ö †¾àšË¢’û 定üq©ð B®ÏÊ ¤¶ñšð ƒC. 30 \@Áx ÅŒªÃyÅŒ '®¾J-©äª½Õ FéÂ-«yª½ÕÑÅî «ÕSx N•-§ŒÕ-¬Ç¢A ’ÃJÅî ʚˢÍä Æ«-ÂìÁ¢ ©Gµ¢-*¢C. °NÅŒ¢ ŠÂ¹ ÍŒ“ÂÃEo ®¾¢X¾Üª½g¢’à X¾ÜJh Íä®Ï¢C..!Ñ ÆE «Õæ£Ç†ý ÆX¾pšË ¤¶ñšðÊÕ æ†ªý Íä¬Çœ¿Õ. «Õæ£Ç†ý šÌyšüåXj N•-§ŒÕ-¬Ç¢A ®¾p¢C®¾Öh 'Âé’¹-«Õ-Ê¢©ð ®¾¢«-ÅŒq-ªÃ©Õ «ÖªíÍŒÕa.. ÂÃF «Õæ£Ç†ý¦Ç¦Õ «uÂËhÅŒy¢©ð ‡©Ç¢šË «Öª½Õp ©äŸ¿Õ..! Æ¢Ÿ¿-„çÕiÊ «ÕÊ®¾Õ, ¦ÕCl´ ‚§ŒÕ-ÊÂ¹× Æ®¾-©ãjÊ ‚¦µ¼-ª½-ºÇ©Õ..! 1989©ð «ÕÊ ÂâG-¯ä-†¾¯þ©ð ®ÏE«Ö ªÃ«-œÄ-EÂË «á¢Ÿ¿Õ.. ƒŸä ªîVÊ 1980©ð ¯äÊÕ ®¾ÖX¾-ªý-²Ädªý ¹%†¾g ’ÃJÅî ʚˢ-*Ê 'Â˩ǜΠ¹%†¾ßgœ¿ÕÑ *“ÅŒ¢Åî ¯Ã ®ÏF “X¾§ŒÖº¢ „ç៿-©ãj¢C. ¹@ÁÂ¹× Æ¢ÅŒ¢ ©äŸ¿Õ..! ÆC OÕ©Ç¢šË „Ã@Áx ͌՘äd Aª½Õ-’¹Õ-Ōբ-{Õ¢C..! „ê½-®¾ÅŒy¢ ŠÂ¹ N©Õ-„çjÊ ECµ..!Ñ ÆE ªÃ®¾Õ-Âí-ÍÃaª½Õ. 2006©ð Nœ¿Õ-Ÿ¿-©ãjÊ '¯Ã§Œá-œ¿«ÕtÑ *“ÅŒ¢ ÅŒªÃyÅŒ „碜Ë-Åç-ª½Â¹× Ÿ¿Öª½-„çÕiÊ N•-§ŒÕ-¬Ç¢A.. «ÕSx 13 ®¾¢«-ÅŒq-ªÃ© ÅŒªÃyÅŒ '®¾J-©äª½Õ FéÂ-«yª½ÕÑ *“ÅŒ¢Åî ¹„þÕ-¦ÇuÂú ƒ«y-ÊÕ¢C. ¨ *“ÅŒ¢ «Íäa \œÄC ®¾¢“ÂâA ®¾¢Ÿ¿-ª½s´¢’à Nœ¿Õ-Ÿ¿© ÂÃÊÕ¢C.