Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

దేశమంటే మట్టి కాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌ ! అన్నారు గురజాడ. దేశం కోసం ప్రాణాలర్పించే సైనికులను చూస్తే ఎవరైనా ఆయన మాటలు అక్షర సత్యం అనాల్సిందే ! జవాన్‌ అంటే సరిహద్దు అవతల శత్రువుని మట్టుబెట్టేవాడే కాదని... సరిహద్దు ఇవతల కూడా మనుషుల ప్రాణాలను కాపాడేవాడని ఒప్పుకోవాల్సిందే ! ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఇండియన్‌ ఆర్మీకి సంబంధించిన ఓ వీడియో ! ప్రకృతిలో వచ్చే మార్పు కారణంగా ఓ తల్లీబిడ్డకు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడితే ఓ సైన్యంలా కదిలి వెళ్లి వారిని కాపాడారు. ఆర్మీ డే నాడు చోటుచేసుకున్న ఈ వీడియోను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్‌లో షేర్‌ చేయగా దేశ వ్యాప్తంగా సాహో సైనికా ! అంటున్నారు. మరి ఈ విషయం విని మీరూ మన సైనికులకు జేజేలు కొట్టండి !

‘సంసారమనే సాగరంలో భార్యాభర్తలిద్దరూ సమానమే..కానీ భర్త కొంచెం ఎక్కువ సమానం’..బాపు దర్శకత్వంలో వచ్చిన ‘రాధాగోపాళం’ సినిమాలో బాగా పాపులరైన డైలాగ్‌ ఇది. అందుకేనేమో తమ జీవిత భాగస్వామి కంటే ఎక్కువ సంపాదించినా..ఎక్కువ పేరు ప్రఖ్యాతులు పొందినా చాలా మంది మహిళలు భర్త చాటు భార్యల్లాగానే ఉంటారు. ఎక్కడి కెళ్లినా వారి వెనకే ఉండి అడుగులేస్తుంటారు. అంతెందుకు పెళ్లి వేడుకనే ఉదాహరణగా తీసుకోండి. ఆ వేడుకలో భాగంగా ఏడడుగులు వేసేటప్పుడు ముందు భర్త..అతని వెనకే భార్య ఉంటుంది. పెళ్లనే కాదు..ఎక్కడి కెళ్లినా భర్త వెనకే ఉండి అడుగులేస్తుంది భార్య. ఈ క్రమంలో అసలు ఆడవాళ్లు ఎందుకు మగవాళ్ల వెనకే నడుస్తారు? ఇదేమైనా సంప్రదాయమా? లేక వేరేదేమైనా ఉందా? అన్న అనుమానాలకు తనదైన శైలిలో చమత్కారంగా సమాధానమిచ్చారు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ.

అతనేమో ఇండియన్‌ క్రికెట్‌ టీంలో యంగ్‌ అండ్‌ డైనమిక్‌ ఆల్‌రౌండర్‌..ఆమేమో అందం, అభినయంతో పాటు డ్యాన్స్‌లో మెరుపులు మెరిపించే మోడల్‌. పవర్‌ హిట్టింగ్‌ బ్యాటింగ్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే అతని పరుగుల ప్రవాహానికి ఆ మోడల్‌ తడిసి ముద్దయితే..ఆ హీరోయిన్‌ అందానికి, డ్యా్న్స్‌కు క్లీన్‌ బౌల్డయ్యాడు ఆ క్రికెటర్‌. మాటలతో మొదలైన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆ తర్వాత ఎక్కడికెళ్లినా చెట్టపట్టాలేసుకొని కనిపించిన వీరు....వీలైనంత త్వరగా తమ ప్రేమ బంధాన్ని శాశ్వతం చేసుకోవాలనుకున్నారు. అందుకే సముద్ర జలాల సాక్షిగా ఉంగరాలు మార్చుకున్నారు. వారే హ్యాండ్‌సమ్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా- బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ నటాషా స్టాంకోవిచ్‌. గత కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ తాజాగా నిశ్చితార్థం చేసుకుని, ఈ కొత్త సంవత్సరం వేళ కొత్త జీవితంలోక అడుగుపెట్టేందుకు రడీ అయ్యారు.

సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ.. సెలవులు లేని సేవకుల్లా దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంటారు మన సైనికులు. సుస్తీ చేసినా..ప్రాణాలమీద కొచ్చినా..కంటి మీద కునుకు లేకుండా గస్తీ కాస్తుంటారీ గ్రేట్‌ సోల్జర్స్‌. దేశ ప్రజల రక్షణే ప్రధాన కర్తవ్యంగా భావించే సైన్యం.. ఎక్కడైనా, ఎలాంటి ప్రకృతి వైపరీత్యం సంభవించినా..క్షణాల్లో ప్రత్యక్షమై సహాయ సహకారాలు అందిస్తుంటుంది. ఈ క్రమంలో ఇండియన్‌ ఆర్మీకి చెందిన ఇద్దరు మహిళా కెప్టెన్లు మానవత్వానికి మారుపేరులా నిలిచారు. కదులుతున్న రైళ్లో పురిటి నొప్పులతో బాధపడుతున్న తోటి ప్రయాణికురాలికి ప్రసవం చేసి తల్లీ బిడ్డకు పునర్జన్మనిచ్చారు.

బ్యాంకాక్‌ పేరు చెబితే మొదటగా అందరికీ గుర్తొచ్చేది ‘థాయ్‌ మసాజ్’. సంప్రదాయ టెక్నిక్‌ను ఉపయోగించి శరీరంపై మర్దన చేయడం ద్వారా శారీరక, మానసిక సమస్యలను దూరం చేసే ఈ మసాజ్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. శరీరానికి కొంచెం పని కల్పించే ఈ ట్రెడిషనల్‌ టెక్నిక్‌తో ఆరోగ్యమొక్కటే కాదు..అందమూ ఇనుమడిస్తుంది. మానసిక ఒత్తిళ్లు మాయమై మనసుకు చాలా రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది. అంతేకాదు పలు రోగాల బారి నుంచి రక్షణనిస్తుంది. ఒకటా...రెండా..ఇలా బహుళ ప్రయోజనాలున్నాయి కాబట్టే థాయ్‌ల్యాండ్‌ వెళ్లిన వారు ఈ మసాజ్‌ చేయించుకోకుండా వెనుదిరగరు. ఈ క్రమలోనే ఈ మసాజ్‌ అన్ని దేశాల్లోనూ విస్తరించి ప్రాచుర్యం పొందింది. అందుకే సుమారు 2000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ థాయ్‌ మసాజ్‌కు తాజాగా అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద (వరల్డ్‌ హెరిటేజ్‌ లిస్ట్‌) జాబితాలో థాయ్‌ మసాజ్‌ను చేర్చింది.

లండన్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ అందించిన సర్వే ప్రకారం మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాలో భారత్‌ మొదటి స్థానంలో ఉంది. మహిళల రక్షణలో సిరియా, అఫ్గానిస్తాన్‌ వంటి దేశాలను కాదని భారత్‌ ఈ దుస్థితిలో ఉండడం భారతీయులందరికీ శోచనీయం. ఇక అమెరికాకు చెందిన మరో విశ్వవిద్యాలయం 167 దేశాల్లో నుంచి మహిళలకు శాంతి, రక్షణ కల్పించే దేశాల జాబితా తీస్తే భారత్‌ 133వ స్థానంలో నిలిచింది. భారత్‌ అంటే భిన్నత్వంలో ఏకత్వం అంటూ ఎప్పుడూ గొప్పగా ఊహించుకునే వివిధ దేశాల ప్రజలు ఇప్పుడు ఈ సర్వేలను చూసి భయపడుతున్నారు. ఈక్రమంలో యు.కె., యు.ఎస్‌.కు చెందిన ప్రభుత్వాలు భారత్‌ వెళ్లాలనుకునే తమ దేశ మహిళలకు ఏమని చెబుతున్నాయో తెలుసా ?

చాలామంది ఎంతో ఆశగా కావాలనుకునే ఉద్యోగం ఏదైనా ఉందంటే అది రైల్వే ఉద్యోగమే. ఎందుకంటే ఎనిమిదో తరగతి విద్యార్హతకే ఇక్కడ ట్రాక్ వుమెన్, స్వీపర్ కమ్ పోర్టర్ వంటి ఉద్యోగాలకు ప్రారంభ జీతం దాదాపు 20,000 రూపాయల వరకు ఉంటోంది. వీటికే గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు పోటీ పడుతుండడం విశేషం. మరిక ఆపై ఉద్యోగాలకు పోటీ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే చాలామంది మహిళలు ఇప్పుడు పురుషులతో సమానంగా రైల్వే ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోందే తప్ప తరగడం లేదు. ఇండియన్ రైల్వేస్ మొత్తం మీద ఇప్పుడు మహిళా ఉద్యోగుల సంఖ్య లక్ష పైమాటే. అయితే వారి భద్రత మటుకు చాలా రంగాల్లోలానే ఇక్కడ కూడా అరకొరగానే ఉంది. అందుకే దక్షిణమధ్య రైల్వే ఓ ఉపాయాన్ని ఆలోచించింది.