Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి నందితా శ్వేత. ఈ సినిమాలో దెయ్యం పాత్రలో కనిపించి ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు తన అందంతో మెస్మరైజ్‌ చేసింది. ‘శ్రీనివాస కళ్యాణం’, ‘బ్లఫ్‌ మాస్టర్‌’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైందీ కన్నడ బ్యూటీ. ఇక తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనూ నటిస్తోన్న నందిత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు ఫొటోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఈక్రమంలోనే తాజాగా నందిత ఓ ఫొటోను పోస్ట్‌ చేసింది. చేతిలోని పువ్వును తదేకంగా చూస్తున్న ఓ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను పోస్ట్‌ చేస్తూ ‘మిమ్మల్ని మీరు ఒక పువ్వులా భావించండి..! ప్రతిరోజూ కొత్తగా అనిపిస్తుంది.,!’ అనే క్యాప్షన్‌ను జోడించింది. ఇక మరో ఫొటోను పోస్ట్‌ చేసిన నందిత ‘మీరు చేయాలనుకుంటున్న దానిపైనే దృష్టి పెట్టండి. ఇతరులు ఏం చేస్తున్నారన్న దానిపై కాదు..!’ అని రాసుకొచ్చింది.

2019కి గుడ్‌బై చెప్పడానికి ఇంకా కొన్ని గంటలే మిగిలున్నాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానించేందుకు ప్రపంచమంతా సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఒక విధంగా ఆలోచిస్తే మనం కేవలం 2019 సంవత్సరానికి మాత్రమే కాదు.. ఒక దశాబ్దానికి కూడా ముగింపు పలకబోతున్నాం. అవునండీ.. 2010 నుంచి 2019 వరకు పది సంవత్సరాలు.. అంటే ఒక దశాబ్దం పూర్తయిందన్నమాట. ఇక ఇప్పుడు కొత్త దశాబ్దం ఆరంభం కానుంది. గడిచిన దశాబ్దంలో మనిషి జీవన విధానం దగ్గర నుంచి.. వాతావరణ పరిస్థితుల వరకు ఎన్నో రకాలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదేవిధంగా ఈ దశాబ్దం (2010-2019) మన టాలీవుడ్‌ నటీమణుల్లో కూడా ఎంతో మార్పును తీసుకొచ్చింది. ఈ క్రమంలో కొందరు తారలు ‘సాధారణ నటి’ స్థాయి నుంచి ‘సూపర్‌ స్టార్‌’ స్థాయికి ఎదిగితే.. కొంతమంది మాత్రం పెళ్లి చేసుకొని తమ వివాహ జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. వీరిలో కొంతమంది అగ్ర తారల దశాబ్ది ప్రయాణం గురించి ఒకసారి నెమరు వేసుకుందాం..!

చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు 16 ఏళ్లు దాటినప్పటికీ ఇంకా స్టార్‌ హీరోయిన్‌గా అభిమానుల చేత నీరాజనాలు అందుకొంటోన్న నటి నయనతార. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా పరిశ్రమకు వచ్చి సూపర్‌ స్టార్‌గా ఎదిగిన తారల్లో నయన్‌ కూడా ఒకరు. 2003లో ‘మనస్సినక్కరే’ అనే మలయాళ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. సినిమాల్లోకి రాక ముందు నయనతార ఓ మలయాళ టీవీ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేసేది. తను యాంకర్‌గా వ్యవహరించిన అప్పటి కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో నయన్‌ను గుర్తుపట్టడం చాలా కష్టమే..! 13 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో నయన్‌ తన పేరు డయానా అని చెప్పడం గమనార్హం. అవును.. ఈ తళుకు తార అసలు పేరు డయానా మరియం కురియన్‌. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘టీవీ యాంకర్‌గా పని చేసే స్థాయి నుంచి లేడీ సూపర్‌ స్టార్‌గా ఎదిగిన నయన్‌ జీవితం ఎందరికో ఆదర్శం’ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.

తన అందం, అభినయంతో ఇటు టాలీవుడ్‌తో పాటు.. అటు బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలతో దూసుకెళ్తోన్న తార పూజా హెగ్డే. సినిమాల్లోకి రాక ముందు మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ.. 2010లో జరిగిన ‘మిస్‌ యూనివర్స్‌’ పోటీల్లో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. 2014లో విడుదలైన ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’ సినిమాలతో పూజ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత తను నటించిన ‘దువ్వాడ జగన్నాథమ్‌’, ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్‌’.. తదితర చిత్రాలు పూజను తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా నిలబెట్టాయి. పూజ వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులకు తరచూ టచ్‌లోనే ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు.. తన లేటెస్ట్‌ సినిమా అప్‌డేట్స్‌, ఫొటోషూట్స్‌, వర్కవుట్‌ వీడియోలు.. మొదలైన విశేషాలను ఎప్పటికప్పుడు అందులో పోస్ట్‌ చేస్తుంటుందీ అమ్మడు. ఈ క్రమంలో పూజ ఇన్‌స్టాలో షేర్‌ చేసిన కొన్ని ఆసక్తికర పోస్టులు, వాటికి తను జత చేసిన క్యాప్షన్స్‌ మీకోసం..!

అర్జున్ రెడ్డి రీమేక్ 'కబీర్ సింగ్'లో ప్రీతిగా నటించి బాలీవుడ్‌లో స్టార్ హాదాను సంపాదించింది కియారా. బాలీవుడ్‌లో సోలోగా నటిస్తూనే ఇటు తెలుగుతో పాటు బాలీవుడ్ పెద్ద హీరోలతో కూడా బిజీ అయిపోయింది. అక్షయ్‌కుమార్, కరీనా కపూర్‌లతో కలిసి ఆమె నటించిన 'గుడ్ న్యూస్' ముగింపు దశకు చేరుకుంది. ఈ చిత్రం డిసెంబర్ 27న విడుదలవుతుండగా ప్రచారంలో భాగంగా ఇటీవలే ఒక పోస్టర్‌ను విడుదల చేశారు చిత్ర నిర్మాతలు. ఇందులో కరీనాతో పాటు కియారా గర్భవతిగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చూస్తూ ఈ డబుల్ ట్రబుల్ గురించి తెలుసుకోవాలంటే డిసెంబర్ 27 వరకు ఆగాల్సిందే అంటోంది. క్రిస్మస్ సందర్భంగా విడుదలవుతున్న ఈ చిత్రం సల్మాన్ ఖాన్ 'దబాంగ్ 3'తో పోటీ పడుతుండడం విశేషం.

'X¾{Õd <ª½©ðx ÍŒ¢Ÿ¿«Ö«Õ.. \œ¿Õ «¯ço©ðx „ç¯ço©«Õt.. ¹¯ço ª½Ö¤Ä©ðx ÂîÊ-®Ô«Õ.. ÂîšË Å꽩ðx «áŸ¿Õl-’¹Õ«Õt..!Ñ.. ¨ ¤Ä{ N¢˜ä «ÕÊ Â¹@Áx «á¢Ÿ¿Õ ¹Ÿ¿-©Çœä ª½ÖX¾¢ ÂÕ-©üC Âù ƒ¢éÂ-«-JC. 2007©ð '©ÂÌ~t ¹@Çuº¢Ñ *“ÅŒ¢Åî „ç¢œË-Åçª½Â¹× X¾J-ÍŒ-§ŒÕ-„çÕiÊ ¨ ¦µÇ«Õ.. 'ÍŒ¢Ÿ¿-«Ö«ÕÑ, '«Õ’¹-Dµª½Ñ, '‚ª½u 2Ñ, 'œÄJx¢’ûÑ, '¦%¢ŸÄ-«Ê¢Ñ, 'G>-¯ç-®ý„äÕ¯þÑ, '˜ã¢X¾ªýÑ, '‘ãjD Ê¢. 150Ñ.. ÅŒCÅŒª½ *“ÅÃ-©Åî ÆGµ-«Ö-ÊÕ© £¾Ç%Ÿ¿§ŒÖ©ÊÕ \©ÕÅî¢C. X¾J-“¬Á-«ÕÂ¹× «*a 12 \@ÁÙx ŸÄšË¯Ã “æX¹~-¹שðx ÂÕ©üÂ¹× …Êo “êÂèü \«Ö“ÅŒ¢ ÅŒ’¹_-©äŸ¿Õ. ÅŒÊ æXª½Õ OÕŸ¿ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð 'ÂÕ-L-•„þÕÑ Æ¯ä ŠÂ¹ ¤¶Äu¯þ “’¹ÖXý Â¹ØœÄ …¢Ÿ¿¢˜ä.. ÂÕ©üÂË \ ²Änªá©ð ¤¶Äu¯þ ¤¶Ä©ð-ªá¢’û …¢Ÿî ƪ½l´¢ Í䮾Õ-Âî-«ÍŒÕa. ÂÕ©ü Â¹ØœÄ ²ò†¾©ü O՜˧ŒÖ ŸÄyªÃ ÅŒÊ ÆGµ-«Ö-ÊÕ-©Â¹× ÅŒª½ÍŒÖ {Íý©ð …¢{Õ¢-{Õ¢C. ÅŒÊÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê N¬ì-³Ä-©ÊÕ ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ Æ¢Ÿ¿Õ©ð ¤ò®ýd Í䮾Õh¢-{Õ¢D ÍŒ¢Ÿ¿-«Ö«Õ. ¨ “¹«Õ¢©ð ÂÕ©ü ƒ¯þ-²Äd-“’ÄþÕ©ð ¤ò®ýd Íä®ÏÊ ÂíEo ‚®¾-ÂËh-¹ª½ ¤ò®¾Õd©Õ OÕ Â¢.