Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

చిన్నపిల్లలు ఎక్కువగా ఆడుకునే బొమ్మల్లో చిన్న కిచెన్‌ సెట్‌ను మనం చూసే ఉంటాం. ఈ సెట్‌లో స్టౌవ్‌, గిన్నెలు, గరిటెలు, ప్లేట్లు.. మొదలైన వంట సామగ్రి అంతా పిల్లలు ఆడుకునేందుకు వీలుగా చాలా చిన్నగా ఉంటాయి. వాటిని ఉపయోగిస్తూ పిల్లలు నిజంగానే వంట చేసినట్లుగా ఊహించుకొని సరదా పడుతుంటారు. ఒకవేళ అలాంటి చిట్టి చిట్టి వంట సామాన్లను ఉపయోగిస్తూ నిజంగానే వంట చేస్తే ఎలా ఉంటుంది..? వినడానికి బాగున్నా.. అలా చేయడం అసాధ్యం అనుకుంటున్నారు కదూ..! కానీ, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది తమిళనాడుకు చెందిన ఓ జంట. ఇందుకోసం వీళ్లు ఓ చిట్టి కిచెన్‌ సెటప్‌ని రూపొందించి అందులో రకరకాల వంటలు తయారు చేస్తున్నారు. అంతేకాదు, యూట్యూబ్‌లో ‘ది టైనీ ఫుడ్స్‌’ పేరుతో ఓ ఛానల్‌ను ప్రారంభించి తమ కుకింగ్‌ వీడియోలను అందులో అప్‌లోడ్‌ చేస్తుండడం విశేషం. ఈ క్రమంలో మన దేశంలో తొలి మినియేచర్‌ కుకింగ్‌ ఛానల్‌గా గుర్తింపు సంపాదించుకుంది ‘ది టైనీ ఫుడ్స్‌’. మరి వీళ్లకు ఈ ఆలోచన ఎందుకొచ్చింది..? వీళ్లు ఇప్పటివరకు తయారు చేసిన రెసిపీలేంటి..?.. మొదలైన విషయాలను తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఏటా జనవరి 14 లేదా 15న వచ్చే సంక్రాంతి పండగను తెలుగు ప్రజలు ఎంత సంబరంగా జరుపుకొంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటిరోజు భోగిమంటలు వేసి, వాటి దగ్గర చలి కాచుకుంటారు. బుజ్జి పాపాయిలకు భోగిపండ్లు పోస్తారు. రెండో రోజు రంగురంగుల ముగ్గులతో వాకిలంతా నింపేసి, కొత్త బట్టలు, చక్కెర పొంగలి, పిండివంటలు, పతంగులతో సందడి చేస్తారు. ఇక మూడోరోజు కూడా పండగ హడావిడి ఏమాత్రం తగ్గకుండా కోడిపందేల జోరును కొనసాగిస్తారు. అయితే ఇదంతా తెలుగు రాష్ట్రాల్లో కనిపించే సంక్రాంతి సందడి. ఈ పండగను కేవలం ఇక్కడే కాకుండా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల సంప్రదాయం ప్రకారం ఘనంగా నిర్వహిస్తారు. ఈక్రమంలో దేశవ్యాప్తంగా సంక్రాంతిని ఎలా జరుపుకొంటారో మనమూ తెలుసుకుందామా..

పండగలంటేనే ఆనందోత్సాహాల హరివిల్లు.. అలాంటి పండగలన్నింటిలోనూ ముఖ్యమైన పెద్ద పండగ సంక్రాంతి.. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, పతంగుల హడావిడితో పాటు పండగంటే నోరూరించే పిండివంటలు, ప్రత్యేక వంటకాలే గుర్తొస్తాయి. అవును.. బంధుమిత్రులంతా కలిసి ఎన్నో సంతోషాల మధ్య చేసుకునే పండగ ఇది.. అయితే మదినిండా ఆనందంతో పాటు ఎంతో కొంత అపరాధ భావనను కూడా కలిగిస్తుందీ పండగ. ఎందుకంటారా? సంక్రాంతి సందర్భంగా అంతా ఒక్కచోట చేరి హాయిగా ఏది పడితే అది లాగించేయడం కామనే.. ఆ తర్వాత పెరిగిన బరువును, షుగర్, బీపీ స్థాయులను తలచుకొని తప్పు చేశామని భావించడమూ సహజమే.. మరి, ఇలా జరగకుండా ఈ పండగ సీజన్‌లో ఆనందంగా గడుపుతూనే, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలిగితే బాగుంటుంది కదా.. మన పోషకాహార నిపుణులు చెప్పే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఇదేమంత పెద్ద విషయం కాదులెండి.. మరి, అవేంటో తెలుసుకుందాం రండి..

‘నువ్విప్పుడు అన్నం తినకపోతే బూచాడు పట్టుకుపోతాడు..’, ‘చూడు చూడు చందమామ నిన్నే చూస్తున్నాడు..’, ‘నువ్వు అన్నం తినకపోతే.. ఇదిగో ఈ బుజ్జి కుక్కపిల్ల నీ అన్నమంతా తినేస్తుంది..’ పిల్లల చేత గోరుముద్దలు తినిపించేటప్పుడు తల్లులు ఇలా ఎన్నెన్ని కబుర్లు చెబుతారో మనకు తెలిసిందే. ఇలా వాళ్ల చేత కాస్త బలవంతంగా తినిపించాలని చూసినా.. అన్నం గిన్నెను నెట్టేస్తారు. అంతే అందులోని అన్నమంతా నేలపాలు. అంతేకాదు.. ఎవరికి వారు సొంతంగా తినే పిల్లలైనా సరే.. ఎంతో రుచికరంగా వండి వడ్డించినా తిననంటూ మారాం చేస్తుంటారు. దీంతో తల్లులకు విసుగొచ్చేస్తుంటుంది. మరి పిల్లలు తల్లులకు ఎలాంటి కష్టం కలిగించకుండా అన్నం తినాలన్నా.. వాళ్లు తినే గిన్నె నెట్టేసినా, బోర్లించినా అందులోని పదార్థం కిందపడకుండా ఉండాలన్నా.. అందుకోసం బోలెడన్ని గ్యాడ్జెట్లు మార్కెట్లోకొచ్చేశాయి. మరి, చిన్నారులకు ఆహారం తినిపించే లేదా వారే స్వయంగా ఆహారం తినే పనిని మరింత ఈజీ చేసేసిన అలాంటి కొన్ని గ్యాడ్జెట్ల గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..