Forgot Password
New User
Name
Gender
MaleFemale
Age
Email
Phone
Location
Address
Close
Your Password Has Been Sent To Your Registered EMail
²ù¢Ÿ¿ª½u ©£¾ÇJ
¤¶Äu†¾¯þ èð¯þ
’¹Õœþ-å£Ç©üh
X¶Ïšü-¯ç®ý «Õ¢“ÅŒ
'®ÔyšüÑ J©ä-†¾¯þq
£¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
'„碜Ë-Åçª½Ñ OÊ®ý
„çÕª½ÕX¾Û B’¹©Õ
£¾Çô„þÕ NÕE-®¾dªý
XÏ©x© åX¢X¾Â¹¢
Æ©¢-¹%ÅŒ
©ãjX¶ý-å®kd©ü
«Õ£ÏÇ@Ç '«ÕFÑ
éÂKªý & é’jœç¯þq
టాలీవుడ్ నటి తేజస్వీ మదివాడ తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘౫ ఏళ్లు.. అదే ఇల్లు.. జీవితం నేను అనుకున్నదానికంటే భిన్నంగా ఉంది. అందుకే ఎక్కువ ప్రణాళికలు వేసుకోకండి. జీవితాన్ని ప్రేమిస్తూ మీకు ఏం కావాలో వాటిపై దృష్టి పెట్టండి’ అంటూ తన అనుభవాలను అభిమానులతో పంచుకుంది.
గాయని శ్రేయా ఘోషల్ తను తల్లి కాబోతున్న విషయాన్ని తెలుపుతూ ఓ ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘బేబీ శ్రేయాదిత్య (శ్రేయాఘోషల్+షీలాదిత్య) రాబోతోంది. షీలాదిత్య, నేనూ ఈ శుభవార్తను మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. జీవితంలో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతోన్న ఈ తరుణంలో మీ ప్రేమాభిమానాలు, ఆశీస్సులు మాకెంతో అవసరం’ అని రాసుకొచ్చింది.
బాలీవుడ్ నటి షమితా శెట్టి ‘మండే మోటివేషన్’ అంటూ ఓ ఉడత యోగా చేస్తోన్న ఫన్నీ వీడియోని పోస్ట్ చేసింది. దీనికి ‘ఉడతకుండే గుబురు తోక, పెద్ద కళ్ల రహస్యాన్ని నేను కనుగొన్నాను.. అంటూ ఉడత కపాలభాతి’ అని రాసుకొచ్చింది. కపాలభాతి అనేది ప్రాణాయామంలో ఓ భాగం. మరి, ఉడత చేసిన ఈ ప్రాణాయామాన్ని మీరూ ఓసారి చూసేయండి...
అందాల తార లక్ష్మీ రాయ్ ‘వెడ్డింగ్ వైబ్స్’ అంటూ కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘భారతీయ వస్త్రధారణలో ఏదో తెలియని గొప్పతనం ఉంది’ అని రాసుకొచ్చింది.
అందాల తార దియా మీర్జా ముంబయికి చెందిన వ్యాపారవేత్త వైభవ్ రేఖితో తాజాగా పెళ్లి పీటలెక్కింది. ఈ సందర్భంగా దిగిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
వారంతా 30 ఏళ్ల లోపు వయసు వారే. అయినా తమ వయసుతో సంబంధం లేకుండా ఆయా రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. తమ సృజనాత్మకతతో, శక్తి సామర్థ్యాలతో, సామాజిక దృక్పథంతో నలుగురిలో ‘ఒక్కరి’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వినూత్న ఆలోచనలతో పిన్న వయసులోనే ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారు. ఈక్రమంలో ముచ్చటగా 30 ఏళ్లు కూడా నిండకుండానే తమ ప్రతిభతో నలుగురికీ ఆదర్శంగా నిలుస్తోన్న యువకెరటాలను గుర్తించి వారికి ఏటా తమ జాబితాలో చోటు కల్పిస్తోంది ‘ఫోర్బ్స్ ఇండియా’. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ పేరుతో ఓ జాబితాను విడుదల చేసిందా సంస్థ. మరి, ఈ లిస్టులో చోటు సంపాదించి నేటి యువతకు స్ఫూర్తినిస్తోన్న ఆ యువకెరటాల గురించి మనమూ తెలుసుకుందాం రండి...
కార్తీక మాసం.. శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడిని పూజిస్తారు. అనేక వ్రతాలు, నోములు ఆచరిస్తారు. సూర్యోదయానికి ముందే లేవడం, చన్నీటితో స్నానం, నదిలో దీపాలు వదలడం, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టడం, కాళ్లకు పసుపు రాసుకోవడం, ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేయడం.. ఇలా
కొంతమంది చేతులు మామూలుగానే పొడిబారినట్లు కనిపిస్తుంటాయి. ఇటువంటివారు చలికాలంలో మరింత ఇబ్బందిపడే అవకాశాలున్నాయి. శీతల గాలుల ప్రభావం కారణంగా చర్మం మరింత పొడిబారి, నిర్జీవంగా మారి పొట్టు రాలుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ కాలంలో కొన్ని సహజసిద్ధమైన స్క్రబ్లను ఉపయోగించడం ద్వారా ఈ సమస్య నుంచి సులభంగా బయటపడచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. మరి, ఆ స్క్రబ్లు ఏంటో మనమూ చూద్దాం రండి..
అందంగా కనిపించాలని, తన ముఖంపై ఎలాంటి మచ్చలు, మొటిమలు లేకుండా మెరిసిపోవాలని ఏ అమ్మాయికి ఉండదు చెప్పండి. అందుకోసమే రకరకాల క్రీములు, సౌందర్య సాధనాల్ని వాడుతున్నారు ఈ తరం అమ్మాయిలు. అయితే మరికొందరు ఫేషియల్స్ కోసం బ్యూటీ పార్లర్ల బాట పడుతుంటారు. ఎంతో ఖర్చుపెట్టి మరీ రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటారు. మరి, ఇలాంటి అధిక ఖర్చుతో పని లేకుండా మీరెప్పుడైనా ఫేషియల్ని ఇంట్లోనే ట్రై చేశారా? లేదా? అయితే ఈసారి ట్రై చేసి చూడండి. బ్యూటీ పార్లర్లలో వేల కొద్దీ డబ్బు ఖర్చు పెట్టే బదులు తక్కువ ఖర్చుతో, అది కూడా సహజసిద్ధంగా లభించే పదార్థాలతో ఇంట్లోనే సులభంగా ఫేషియల్ చేసుకోవచ్చు. మాకంత టైం లేదంటారా? అందుకోసం ఎక్కువ సమయం వెచ్చించాల్సిన పని కూడా లేదు.. బ్యూటీ పార్లర్కి వెళ్లే సమయాన్ని ఇంట్లో ఫేషియల్ చేసుకోవడానికి కేటాయిస్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఫేషియల్ చేసుకోవడమెలాగో ఇప్పుడు చూద్దాం..
'దీపం జ్యోతి పరబ్రహ్మ.. దీపం జ్యోతి మహేశ్వర.. దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే..' అంటూ దీపారాధన చేసి సకల దేవతలను పూజించడం మనందరికీ తెలిసిన విధానమే. దీపారాధన ఎంతో శ్రేష్టమైనది. ఇది సకల శుభాలను కలిగిస్తుంది. జీవితంలో వెలుగులు నింపుతుంది. అందుకే ప్రతి ఒక్కరికీ దీపారాధన ఎలా చేయాలో తెలిసి ఉండాలి. మరి, ఈ దీపావళి సందర్భంగా దీపం ప్రాముఖ్యం గురించి, దీపారాధన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.
Facebook
Twitter
   Google +
Pratibha.net