Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

కాలం మారుతోంది... కంప్యూటర్ల యుగం వచ్చేసింది... అంతా ఆధునిక భారతమంటూ ఎంతో గొప్పగా మాట్లాడుకుంటున్నాం. అయితే మహిళల విషయంలో ఇప్పటికీ కొన్ని చోట్ల కనిపిస్తున్న అనాగకరిక ఆచారాలు, మూఢనమ్మకాలు ఇంకా మనల్ని మధ్యయుగం నాటి మనుషులేనని గుర్తుచేస్తున్నాయి. ముఖ్యంగా నెలసరి విషయంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష అంతా ఇంతా కాదు. పిరియడ్స్‌ సమయంలో మహిళలను ఇంట్లోకి రానివ్వకుండా అందరికీ దూరంగా ఉంచుతుంటారు. ఇంకొన్ని చోట్ల అయితే వారిని అంటరానివారిగా భావిస్తూ వూరి బయటే ఉండాలని కట్టుబాట్లు విధిస్తున్నారు. ఈ క్రమంలో పిరియడ్స్‌పై విద్యార్థినులకు అవగాహన కల్పించాల్సిన ఓ విద్యా సంస్థే అమ్మాయిలతో అమానుషంగా వ్యవహరించింది. మహిళల్లో సహజంగా జరిగే కొన్ని జీవక్రియల్లాగే ఇది కూడా ఒక సహజ ప్రక్రియ అని విద్యాబుద్ధులు నేర్పాల్పిన సిబ్బందే అమానవీయంగా ప్రవర్తించారు.

కళాశాల అంటేనే చదువుల్లో, ఆటపాటల్లో ఒక విద్యార్థితో మరో విద్యార్థికి పోటీ ఉంటుంది. ఈక్రమంలో ఒకరిలో ఏమాత్రం లోటుపాట్లు కనిపించినా చాలామంది విద్యార్థుల చేత సదరు విద్యార్థి హేళనకు గురి కావాల్సి ఉంటుంది. ఇలా బుల్లీయింగ్‌కి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు చాలామందే ఉన్నారు. అటువంటిది అబ్బాయిలు హీరోల్లా ముస్తాబై వచ్చే కళాశాల ట్రెడిషన్‌ డేలో భాగంగా కావాలని చీర కట్టుకొచ్చారు ముగ్గురు యువకులు. తమకు చీరకట్టుకోవడం రాకపోయినా కళాశాల విద్యార్థిని సహాయం తీసుకొని మరీ చీరకట్టులో వేడుకకు హాజరయ్యారు. అధ్యాపకుల నుంచి విద్యార్థుల వరకు కళాశాలలో వారినలా చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఎవరూ కూడా వారిని హేళన చేయలేదు. అసలు విషయం తెలుసుకొని వారిని మెచ్చుకున్నారు. ఎందుకంటే...