Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

కాలమేదైనా అందంగా మెరిసిపోవాలని అమ్మాయిలు ఆరాటపడడం సహజం. అందుకోసమే ఇటు ఇంట్లో సహజసిద్ధమైన సౌందర్య చికిత్సల్ని ఫాలో అవుతూనే అటు బ్యూటీ పార్లర్లను కూడా ఆశ్రయిస్తుంటారు. అయినప్పటికీ ఆయా కాలాల్లో ఎదురయ్యే వాతావరణ పరిస్థితులు అతివల సౌందర్యాన్ని దెబ్బతీస్తూనే ఉంటాయి. ఇక ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండే చలికాలంలో అయితే ఈ సమస్యలు మరింత తీవ్రమవుతుంటాయి. పొడి చర్మం, మడమల్లో పగుళ్లు, జుట్టు నిర్జీవమవడం.. వంటి ఎన్నో సౌందర్య సమస్యలు ఈ కాలంలో అమ్మాయిల పాలిట శాపంగా మారుతున్నాయి. అందుకే వీటన్నింటి నుంచి బయటపడడంతో పాటు ఈ కాలంలో శరీరానికి వెచ్చదనాన్ని అందించడానికి కొన్ని సహజసిద్ధమైన స్పా ట్రీట్‌మెంట్లు ఉత్తమం అని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. అంతేకాదు.. వీటివల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయట! మరి, అవేంటో తెలుసుకొని మనమూ వాటిని ఫాలో అవుదాం రండి..

శీతాకాలం వచ్చిందంటే చాలు.. సౌందర్య సంరక్షణ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మాయిశ్చరైజర్ రాసుకొన్నప్పటికీ చర్మం పొడిబారిపోవడం, పెదవులు పగలడం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలా చర్మం విషయంలో మాత్రమే కాదు.. జుట్టు విషయంలో కూడా ఈ కాలంలో కొన్ని సమస్యలు తప్పవు. ముఖ్యంగా శీతాకాలంలో కురుల సంరక్షణ విషయంలో ఎక్కువగా వేధించే సమస్య చుండ్రు. ఈ సమయంలో చర్మం మాదిరిగానే కుదుళ్ల భాగం కూడా పొడిగా తయారవుతుంది. ఫలితంగా చుండ్రు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. దీని కారణంగా జుట్టు రాలిపోవడం మాత్రమే కాదు తలలో దురద, ముఖంపై చిన్న చిన్న మొటిమలు కూడా వస్తుంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే చలికాలంలో వేధించే చుండ్రు సమస్యను ఇట్టే వదిలించుకోవచ్చు. మరి దానికోసం ఏం చేయాలో తెలుసుకుందామా..

ముట్టుకుంటే కందిపోయే అందం, బంగారు వర్ణంలో జాలువారే కురులు, రంగు పులుముకోకుండానే గులాబీ వర్ణంలో మెరిసే అధరాలు.. ఇలా అపురూప లావణ్యానికే నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు కేట్‌ మిడిల్డన్‌, మేగన్‌ మార్కల్‌.. వంటి బ్రిటిష్‌ రాయల్‌ బ్యూటీస్‌. వారినే ఫాలో అవుతూ ఇతర దేశాల మగువలకు బ్యూటీ పాఠాలు నేర్పుతున్నారు అక్కడి సాధారణ మహిళలు. ‘మరి, ఇంతటి మేని సౌందర్యం వారికి ఎలా సొంతమైంది..?’ అనేగా మీ సందేహం. అందుకు వారు తరతరాలుగా పాటిస్తూ వస్తోన్న సహజసిద్ధమైన సౌందర్య రహస్యాలే కారణం. ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం దగ్గర్నుంచి కోమలమైన పాదాల దాకా.. ఇలా నఖశిఖపర్యంతం అందంగా మెరిసిపోవడానికి ప్రకృతి ప్రసాదించిన బ్యూటీ ఉత్పత్తుల్నే వాడుతున్నారీ ముద్దుగుమ్మలు. మరి, ఇంతకీ ఈ రాయల్‌ బ్యూటీస్‌ అందం వెనకున్న ఆ అపురూప సౌందర్య రహస్యాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చలికాలం.. చాలామంది ఈ కాలాన్ని పెద్దగా ఇష్టపడరు. దీనికి ఇతరత్రా ఇబ్బందులకంటే చలికాలంలో చర్మానికి ఎదురయ్యే సమస్యలే ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు. మిగిలిన కాలాల్లో అందంగా తయారై, నీట్‌గా డ్రస్ చేసుకునే అమ్మాయిలు ఈ కాలంలో స్వెటర్లు, క్యాప్‌లతో శరీరాన్ని, జుట్టును కవర్ చేసుకుంటూ వాటిని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ ఉంటారు. అయినా సరే.. చర్మం పొడిబారి నిర్జీవంగా మారడం, పాదాల పగుళ్లు, పొడిబారిన జుట్టు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వీటన్నింటినీ ఎదుర్కొనేందుకే చలికాలంలో ఏ తరహా చర్మతత్వం ఉన్నవారు ఎలాంటి సౌందర్య చిట్కాలను పాటించాలో చెబుతున్నారు ప్రముఖ బ్యూటీ ఎక్స్‌పర్ట్ షెహనాజ్ హుస్సేన్.. మరి, ఆమె చెప్పిన ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందామా?