Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

తల్లి సారికలోని అందాన్ని, తండ్రి కమల్‌ హాసన్‌లోని ప్రతిభను పునికిపుచ్చుకుంది నటి శృతి హాసన్‌. తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ బహుముఖ ప్రతిభా పాటవాలతో తనకంటూ ఓ ప్రత్యే గుర్తింపును సంపాదించుందీ అందాల తార. కమల్‌ హాసన్‌ నటించిన ‘హేరామ్‌’ చిత్రంలో అతిథి పాత్రతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతి, 2009లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం ‘లక్‌’ ద్వారా హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక 2011లో సిద్ధార్థ్‌ హీరోగా ప్రకాశ్‌ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అనంతరం తమిళం, తెలుగుతో పాటు హిందీలోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన శృతి దేశవ్యాప్తంగా విశేష అభిమానులను సంపాదించుకుంది. కేవలం నటనకే పరిమితం కాకుండా సింగర్‌గా మంచి పేరు సంపాదించుకుందీ ముద్దుగుమ్మ. ఆరేళ్ల వయసులోనే ఏకంగా సినిమాలో పాట పాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందీ లవ్లీ గర్ల్‌. ప్రస్తుతం విజయ్‌సేతుపతి హీరోగా తెరకెక్కుతోన్న ‘లాభం’ అనే తమిళ చిత్రంలో నటిస్తోందీ బ్యూటీ. ఇక సినిమాలు, మ్యూజిక్‌ షోలతో బిజీగా ఉండే శృతి సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. తన సినిమాలు, మ్యూజిక్‌ షోలతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటుందీ ముద్దుగుమ్మ. జనవరి 28 శృతి హాసన్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా శృతి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన కొన్ని ఆసక్తికరమైన పోస్టులు, వాటికి తానిచ్చిన క్యాప్షన్లపై ఓ లుక్కేద్దామా..!

‘మీ కుటుంబ సభ్యుల్లో వయసులో అందరికంటే పెద్దవాళ్లు ఎవరు?’ అని అడిగితే.. సాధారణంగా అమ్మమ్మ, నాన్నమ్మ, తాత అంటూ సమాధానమిస్తారు. చిన్నపిల్లలైతే తాతమ్మలు, ముత్తాతలు అని చెబుతారు. అదేవిధంగా చాలామందికి అప్పుడప్పుడు ‘ప్రపంచంలోనే వయసులో అందరికంటే పెద్దవారు ఎవరు?’ అన్న సందేహం వస్తుంటుంది. అందుకు సమాధానమే జపాన్‌కు చెందిన బామ్మ ‘కానె తనక’. 117 ఏళ్ల వయసుతో ప్రపంచంలోనే బతికున్న వారిలో అత్యధిక వయస్కురాలిగా తన రికార్డును తానే బద్దలు కొట్టారీ గ్రాండ్‌ ఓల్డ్‌ వుమన్‌. తాజాగా 117వ ఏటలోకి అడుగుపెట్టిన ఈ బామ్మ..తన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మరి అత్యధిక వయసుతో ప్రపంచంలో అందరికీ అమ్మమ్మగా మారిన ‘కానె’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

పర్యావరణ పరిరక్షణ కోసం పాఠశాల పుస్తకాలను పక్కన పెట్టి మరీ పోరాడుతోంది గ్రెటా థున్‌బర్గ్‌. ‘స్కూల్‌ స్ట్రైక్‌ ఫర్‌ ది క్లైమేట్’, ‘యూత్‌ ఫర్‌ క్లైమేట్‌’ పేరుతో ఉద్యమాలను మొదలు పెట్టి అంతర్జాతీయ మేధావుల ప్రశంసలు సైతం అందుకుందీ స్వీడిష్‌ టీనేజర్‌. పర్యావరణంపై ప్రేమతో గ్లోబల్‌ వార్మింగ్‌ నుంచి భూమిని పరిరక్షించే బాధ్యతలను చిన్న వయసులోనే భుజాన వేసుకున్న గ్రెటా.. తన భావోద్వేగ ప్రసంగాలతో అందరిలో స్ఫూర్తి రగిలిస్తోంది. ఉద్యమంలో భాగంగా తనను విమర్శించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ లాంటి వారికి కూడా తనదైన శైలిలో సమాధానాలిస్తోందీ యువకెరటం. ఈ క్రమంలో గ్రెటా తాజాగా 17 వ ఏటలోకి అడుగుపెట్టింది. అయితే పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతో చిత్తశుద్ధితో ఉద్యమిస్తున్న ఈ యువతేజం అందరిలా పుట్టినరోజు సంబరాలు చేసుకోలేదు. మరేం చేసిందో మీరే చదవండి.

మంచు మనోజ్‌ హీరోగా నటించిన ‘శ్రీ’ చిత్రంతో 2005లో తెలుగు తెరకు పరియమైంది మిల్కీ బ్యూటీ తమన్నా. అనంతరం శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ‘హ్యాపీడేస్‌’ సినిమాతో నటిగా గుర్తింపు సంపాదించుకున్న ఈ ముంబయి చిన్నది.. అనతికాలంలోనే తెలుగుతో పాటు తమిళ, కన్నడ హిందీ సినిమా పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాదు.. ఇటు దక్షిణ పరిశ్రమతో పాటు అటు బాలీవుడ్‌లోనూ పలువురు అగ్ర హీరోల సరసన నటించి లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుందీ భామ. ఇటీవల చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాలో లక్ష్మి పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. నిత్యం సినిమాలతో బిజీగా ఉండే ఈ బ్యూటీ.. సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులను తరచూ పలకరిస్తుంటుంది. డిసెంబర్‌ 21 తమన్నా పుట్టిన రోజు. ఈ సందర్భంగా తను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన కొన్ని ఆసక్తికరమైన పోస్ట్‌లు మీకోసం...

తన అందచందాలతో కుర్రకారు మతి పోగొడుతోన్న హాట్‌ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌. బుల్లితెర నటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ భామ.. సినిమాల్లోకి రాకముందు పలు సీరియళ్లలో నటించింది. 2017లో ‘చెన్నా మేరాయా’ అనే పంజాబీ చిత్రంతో పాయల్‌ సినిమా పరిశ్రమలోకి అరంగేట్రం చేసింది. ‘RX100’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ తార.. ఇందులో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న ఛాలెంజింగ్‌ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించడం విశేషం. పాయల్‌ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ తార తనకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకొంటుంది. డిసెంబర్‌ 5 పాయల్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా తను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన కొన్ని ఆసక్తికర పోస్టులు మీకోసం..!

అందం, అభినయం, ఆత్మవిశ్వాసం.. కలిగిన నటీమణుల్లో స్మైలింగ్‌ బ్యూటీ యామీ గౌతమ్‌ కూడా ఒకరు. ‘ఉల్లాస.. ఉత్సాహ’ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ తార.. తెలుగు, కన్నడ, తమిళ, పంజాబీ, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. తన తోటి హీరోయిన్లు గ్లామర్‌ పాత్రలకే పరిమితమైనప్పటికీ.. యామీ మాత్రం తన కెరీర్‌ ప్రారంభం నుంచి విభిన్నమైన పాత్రలు ఎంచుకొంటూ వరుస విజయాలతో దూసుకెళ్తుండడం విశేషం. ఈ క్రమంలో తను నటించిన ‘విక్కీ డోనార్‌’, ‘బద్లాపూర్’, ‘సనమ్‌ రే’, ‘కాబిల్‌’, ‘సర్కార్‌ 3’, ‘ఉరి’, ‘బాలా’.. తదితర చిత్రాలే ఇందుకు ఉదాహరణ. సినిమాల పరంగానే కాదు సోషల్‌ మీడియాలోనూ యామీకి మంచి క్రేజ్‌ ఉంది. నవంబర్‌ 28 యామీ పుట్టినరోజు. ఈ సందర్భంగా తను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన కొన్ని ఆసక్తికర పోస్టులు, వాటికి తను జత చేసిన క్యాప్షన్స్‌ మీకోసం..!

‘జెర్సీ’.. ఈ సినిమా పేరు వినగానే.. చాలా రోజుల తర్వాత మంచి ఎమోషనల్‌ మూవీని చూశాం అని ప్రతి ఒక్కరూ అనకమానరు. ఈ సినిమాలో నాని తండ్రి పాత్రలో అందరినీ అంతలా కదిలించాడు. ఈ సినిమాని హిందీలో షాహిద్‌ రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నాని పాత్ర ఎంత ముఖ్యమో.. తెలుగులో శ్రద్ధా శ్రీనాధ్‌ నటించిన ‘సారా’ పాత్ర కూడా అంతే ముఖ్యం. మరి అంత ప్రాముఖ్యమున్న పాత్రను హిందీలో దక్కించుకుంది మృణాల్‌ ఠాకూర్‌. ‘సూపర్‌ 30’, ‘బట్లా హౌస్‌’ చిత్రాలలో తన నటనకు ప్రశంసలు అందుకున్న మృణాల్‌కి ఈ అవకాశం దక్కింది. ‘ఈ సినిమాలో నటించే అవకాశం రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది.. అదీ షాహిద్‌కి జోడీగా..’ అంటూ డ్యాన్స్‌ చేస్తున్న ఎమోజీస్‌ని పెట్టి తన ఆనందాన్ని ట్విట్టర్‌ వేదికగా తెలియజేసిందీ డస్కీ బ్యూటీ.