హాయ్ డాక్టర్. నాకు పీసీఓఎస్, అధిక బరువు సమస్యలున్నాయి. మేం రెండో బేబీ కోసం ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం. నేను గర్భం ధరించాలంటే ఏయే రోజుల్లో కలయికలో పాల్గొనాలి? (బర్త్ క్యాలిక్యులేటర్ని ఎలా కౌంట్ చేయాలి?)? సలహా ఇవ్వండి.
జ: మీకు పీసీఓఎస్, అధిక బరువు సమస్యలున్నాయని రాశారు. ముందుగా బరువు తగ్గే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అధిక బరువు వల్ల పీసీఓఎస్ ఉన్నప్పుడు అండం విడుదల కానే కాదు. అటువంటప్పుడు ఏ రోజుల్లో కలిస్తే గర్భం వస్తుందనేది చెప్పడం కూడా వీలు కాదు. ఎందుకంటే నెలసరి సక్రమంగా రానప్పుడు, అండం విడుదల కానప్పుడు ఫలానా రోజుల్లో కలయిక జరిగితే గర్భం వస్తుందన్నది చెప్పలేం. అందుకే మీరు ముందుగా బరువు తగ్గి, నెలసరి సక్రమంగా వస్తూ ఉంటే (అంటే 28-30 రోజుల రుతుచక్రం అయితే).. గర్భధారణకు అనువైన రోజుల్లో అంటే నెల మధ్యలో 10-20వ రోజు వరకు రోజు విడిచి రోజు కలయికలో పాల్గొన్నప్పుడు గర్భం ధరించే అవకాశం ఉంటుంది.