scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'బావే నమ్మించి మోసం చేశాడు..!'

'మన దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా లైంగిక వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ బాధితుల్లో చిన్నపిల్లలు కూడా ఉండడం చింతించాల్సిన విషయం. అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే.. అసలు తాము వేధింపులకు గురవుతున్నట్లు కూడా ఆ చిన్న వయసులో కొందరికి తెలియకపోవడం! ఫలితంగా పురుషుల్లో ఎవరిని నమ్మాలన్నా మనసులో భయం గూడుకట్టుకొని పోతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నుంచే బయటపడిన ఓ అమ్మాయి యుక్తవయసుకు వచ్చిన తర్వాత మరొక అబ్బాయిని నమ్మింది. గాఢంగా ప్రేమించింది.. కానీ అతడు కూడా ఆమెను వంచించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఆమె మనసు పలికే హృదయరాగం వినాల్సిందే..'

Know More

Movie Masala

 
category logo

అపోహలు తొలగిద్దాం.. అవగాహన పెంచుకుందాం..

aids Myths and Facts about the deadly disease

మానవ జాతిని వణికిస్తోన్న ప్రాణాంతక వ్యాధుల్లో ఎయిడ్స్ కూడా ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఈ వ్యాధికి మందు కనుగొనేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నా ఇప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. అలాగని హెచ్ఐవీ ఏమీ అంటువ్యాధి కాదు. ఈ వ్యాధి కేవలం కొన్ని మార్గాల ద్వారా మాత్రమే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. కానీ కొందరు ఎయిడ్స్, హెచ్ఐవీలపై ఉన్న అపోహల కారణంగా ఈరోజుల్లో కూడా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ; వారిని దూరం పెడుతూ ఉంటారు. ఇవే కాదు.. మన సమాజంలో హెచ్ఐవీ గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. వాటిని తొలగిస్తూ; వ్యాధి గురించి అందరికీ పూర్తి అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 1ని 'ప్రపంచ ఎయిడ్స్ దినం'గా ప్రకటించింది. ఈ ఏడాది ‘ఎండింగ్‌ ది హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ ఎపిడమిక్‌ : రీసైలెన్స్‌ అండ్‌ ఇంపాక్ట్‌’ అనే నినాదంతో ఈ వ్యాధిపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తోంది. ఈ సందర్భంగా ఎయిడ్స్/హెచ్ఐవీ వ్యాధి పట్ల ఉన్న కొన్ని అపోహల గురించి తెలుసుకొని; మరింత అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం రండి.

HIVmythsgh650.jpg
అపోహ: కండోమ్స్ ధరిస్తే హెచ్ఐవీ రాదు..
హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వ్యక్తితో శృంగారంలో పాల్గొనేటప్పుడు కండోమ్ ధరిస్తే చాలు.. ఆ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. శృంగారం సమయంలో కండోమ్ చిరిగిపోవడం, జారిపోవడం, లీక్ అవ్వడం వంటివి జరిగే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటివి జరిగితే హెచ్ఐవీ సోకే ప్రమాదం చాలా ఎక్కువ. అవతలి వారికి హెచ్ఐవీ లేదు అనుకొని కండోమ్ లేకుండా శృంగారంలో పాల్గొనాలనుకున్నా.. ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే కొంతమందికి హెచ్‌ఐవీ సోకినా తాము ఆ వ్యాధితో బాధపడుతున్నామన్న సంగతి తెలియట్లేదని కొన్ని గణాంకాలు రుజువు చేస్తున్నాయి. ఇలాంటివారితో అసురక్షిత లైంగిక చర్యలో పాల్గొంటే హెచ్ఐవీ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇది వెజైనల్ సెక్స్‌కి మాత్రమే కాదు.. యానల్, ఓరల్ సెక్స్‌కి కూడా వర్తిస్తుంది. ఓరల్ సెక్స్ ద్వారా హెచ్ఐవీ వచ్చే అవకాశాలు తక్కువే అయినా పూర్తిగా రాదని చెప్పలేం. అందుకే జాగ్రత్తలు వహించడం మంచిది.
అపోహ: హెచ్ఐవీ సోకితే ఎయిడ్స్ వచ్చినట్లే..
హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ (హెచ్ఐవీ) రక్తంలో ఉండే తెల్ల రక్తకణాల్లో భాగమైన సీడీ4 అనే కణాలను నాశనం చేస్తుంది. ఇవి శరీరంలో ఉండే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ అనారోగ్యానికి గురి కాకుండా మనల్ని కాపాడతాయి. ఈ కణాలు నాశనం కావడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి.. పలు అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉంటుంది. సాధారణంగా హెచ్ఐవీ సోకిన తర్వాత ప్రారంభంలో గుర్తించకుండా అలాగే దీర్ఘకాలం పాటు వదిలేస్తే అది ఎయిడ్స్‌గా రూపాంతరం చెందుతుంది. ఈ క్రమంలోనే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో సీడీ4 కణాల సంఖ్య 200 కంటే తక్కువకు పడిపోతుంటుంది. ఫలితంగా వారిని రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి.
అపోహ: తాకినా హెచ్ఐవీ వ్యాపిస్తుంది..
హెచ్ఐవీ చాలా సున్నితమైన వైరస్. ఇది మన రక్తంలో కాకుండా బయట ఏమాత్రం జీవించలేదు. బాహ్య వాతావరణంలోకి వచ్చిన సెకన్ల వ్యవధిలోనే ఈ వైరస్ మరణిస్తుంది. అందుకే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులతో కలిసి ఆహారం తిన్నా, వారిని తాకినా ఈ వైరస్ వ్యాప్తి చెందదు. అంతేకాదు.. చెమట, విసర్జితాలు.. వంటి వాటి ద్వారా కూడా ఇది ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదు. కాబట్టి ఎయిడ్స్ బాధితులు ఉపయోగించిన వస్తువులను ఎవరైనా నిరభ్యంతరంగా వినియోగించవచ్చు. అంతేకాదు.. వారిని కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం, వ్యక్తిగత వస్తువులు పంచుకోవడం వంటివి చేసినా ఇది సోకదు. అయితే ఈ వ్యాధి ఉన్న వారు ఉపయోగించే సూదులు మాత్రం వాడకూడదు. అలాగే శృంగారంలో పాల్గొనే సమయంలో తప్పకుండా కండోమ్ ఉపయోగించాలి. ఇలా చేయడం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తిని కొంతవరకూ అరికట్టవచ్చు. ఒకవేళ గర్భం ధరించిన తర్వాత హెచ్ఐవీ పాజిటివ్ అని తేలితే వైద్యుల సలహా మేరకు కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. తద్వారా ఆ వైరస్ బిడ్డకు సంక్రమించకుండా కాపాడుకోవచ్చు. అయితే ఈ వ్యాధి తల్లిపాల ద్వారా కూడా సోకే ప్రమాదం ఉంది కాబట్టి ప్రసవం జరిగిన తర్వాత బిడ్డకు పాలు పట్టకుండా ఆ తల్లి జాగ్రత్తపడాల్సి ఉంటుంది

HIVmythsgh650-1.jpgఅపోహ: హెచ్ఐవీ సోకితే వెంటనే మరణిస్తారు..
గతంలో హెచ్ఐవీ వ్యాధి సోకిందంటే చాలు.. ఇక మరణం కోసం వేచి చూడడం తప్ప మరే ఇతర మార్గం లేదని భావించేవారు. కానీ ఇప్పుడు వైద్యశాస్త్రం కూడా ఎంతగానో అభివృద్ధి చెందింది. హెచ్ఐవీని సమూలంగా, శాశ్వతంగా తగ్గించలేకపోయినప్పటికీ ఆ వ్యాధితో పోరాడేందుకు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను బలపరిచేందుకు చాలా మందులు ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. ఏఆర్‌టీ - యాంటీ రెట్రోవైరల్ థెరపీ తీసుకోవడం ద్వారా హెచ్ఐవీ బాధితులు కూడా ఎక్కువ కాలం పాటు జీవించే అవకాశం ఉంది. అంతేకాదు.. ఎప్పటికప్పుడు వైరల్ లోడ్, సీడీ4 కౌంట్ పరీక్షలు చేయించుకుంటూ; ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తూ తదనుగుణంగా మందులు వాడాల్సి ఉంటుంది. సమస్య తగ్గుముఖం పట్టిన తర్వాత మందులు ఉపయోగించడం ఆపేయడం వల్ల ఈ వ్యాధి తిరిగి మళ్లీ మొదటికే వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు.. హెచ్ఐవీ వ్యాధి సోకిన వారిలో చాలామందికి హెచ్‌సీవీ (హెపటైటిస్ సి వైరస్) వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి దాని కోసం కూడా తరచూ పరీక్షలు చేయించుకుంటూ; తగిన చికిత్స తీసుకోవడం వల్ల కాస్త ఎక్కువ రోజులు జీవించే వీలుంటుంది.

అపోహ: భార్యాభర్తలిద్దరికీ హెచ్ఐవీ ఉంటే కండోమ్ వాడాల్సిన అవసరం లేదు..
భార్యాభర్తలిద్దరికీ హెచ్ఐవీ ఉన్నప్పటికీ కండోమ్ ఉపయోగించకుండా అంటే అసురక్షితమైన లైంగిక చర్యలో పాల్గొనడం ఏమాత్రం సరికాదంటున్నారు వైద్యులు. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో ఉన్న హెచ్ఐవీ వైరస్ ఒకే రకమైనది కాకపోవచ్చు. హెచ్ఐవీలో కూడా రకాలున్నాయి కాబట్టి భాగస్వామి నుంచి మరో రకం వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది. ఫలితంగా హెచ్ఐవీ చికిత్స నిమిత్తం ఉపయోగిస్తున్న మందు ఆ వైరస్‌కు తగినది కాకపోతే శరీరంలో వైరల్ లోడ్ పెరిగిపోతుంది. తద్వారా వ్యాధి మరింత ముదిరే అవకాశం ఉంటుంది. కాబట్టి హెచ్ఐవీ సోకిన తర్వాత భాగస్వామితో శృంగారంలో పాల్గొనే సమయంలో కూడా కండోమ్ తప్పనిసరిగా వినియోగించాల్సి ఉంటుంది.

HIVmythsgh650-3.jpg

అపోహ: హెచ్ఐవీ సోకితే కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు..
హెచ్ఐవీ సోకిన తర్వాత ఆ వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి ఒక్కొక్కరికి ఒక్కోలా సమయం పడుతుంది. ఎందుకంటే మన రోగనిరోధక వ్యవస్థ ఎంత బలంగా ఉంటే ఈ వ్యాధి లక్షణాలు అంత ఆలస్యంగా బయటపడతాయి. అందుకే ఈ వైరస్ సోకిన వెంటనే ఎలాంటి లక్షణాలు 
కనిపించవు. ఒకవేళ హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ సోకిందన్న అనుమానం ఉంటే కనుక ప్రతి మూడు నెలలకోసారి పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యాధి వచ్చిందా? రాలేదా?? అన్నది నిర్ధరించుకోవచ్చు.

అపోహ: ఒకసారి నెగెటివ్ వస్తే ఇక హెచ్ఐవీ లేనట్లే..
హెచ్ఐవీ వచ్చిన వారితో అసురక్షిత లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత లేదా హెచ్ఐవీ బాధితులు ఉపయోగించిన సూదులు వాడడం, వారి రక్తం మరొకరికి ఎక్కించడం వంటివి జరిగిన తర్వాత శరీరంలో హెచ్ఐవీ యాంటీబాడీలు ఏర్పడేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది. హెచ్ఐవీ వైరస్ ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది కాబట్టి ఇప్పటివరకూ ఉన్న పరీక్షలన్నీ.. హెచ్ఐవీ వచ్చిన తర్వాత శరీరం విడుదల చేసే యాంటీబాడీలనే పరీక్షిస్తున్నాయి. వీటిని విడుదల చేయడం కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు. అందుకే ఒక్కసారి పరీక్షలో నెగెటివ్ వస్తే మూడు నెలల పాటు వేచి చూసి మరోసారి టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది.

HIVmythsgh650-4.jpg

అపోహ: వైరల్ లోడ్ తగ్గిపోతే ఇక వ్యాధి వ్యాపించదు..
ఏఆర్‌టీ ఉపయోగించిన తర్వాత ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో వైరల్ లోడ్ రోజురోజుకీ తగ్గిపోయి.. చివరకు పరీక్షల్లో గుర్తించలేని స్థాయికి చేరిపోతుంది. ఇలాంటప్పుడు చాలామంది వ్యాధి తగ్గిపోయిందనే ఉద్దేశంతో మందులు ఉపయోగించడం ఆపేయడమే కాదు.. అసురక్షిత 
లైంగిక చర్యలోనూ పాల్గొంటూ ఉంటారు. కానీ ఇది సరైంది కాదు. ఎందుకంటే శరీరంలో వైరల్ లోడ్ తగ్గితే వ్యాధి సంక్రమించే అవకాశాలు కూడా చాలావరకు తగ్గుతాయి. అంతమాత్రాన ఈ వ్యాధి సంక్రమించే అవకాశం పూర్తిగా లేదని చెప్పలేం. కాబట్టి వైరల్ లోడ్ పూర్తిగా తగ్గినా బాధితులు సదా జాగ్రత్తగా ఉండాల్సిందే!

యువతా మేలుకో!

హెచ్‌ఐవీ సోకగానే జీవితం ముగిసిపోదుదాన్ని నయం చేసే మందులు ప్రపంచంలో ఇప్పటికీ ఏ వైద్య విధానంలోనూ ఆవిష్కృతం కాలేదుఅందువల్ల మోసపూరిత ప్రకటనల పట్ల రోగులు అప్రమత్తంగా ఉండాలిశాస్త్రీయంగా ఇప్పటివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీఏ ఇతర ప్రముఖ ఆరోగ్య సంస్థలు కానీ ఆయుర్వేద మందులులేహ్యాల్నిఇతర ప్రత్యామ్నాయ మందుల్ని అధికారికంగా ఎయిడ్స్‌ చికిత్స కోసం గుర్తించలేదుఅయినా కొందరు కేరళ వైద్యమనిహైదరాబాద్‌ లేహ్యమనికోల్‌కతా మందులనిపాము విషమని ప్రచారం చేస్తూ రోగులను మోసం చేస్తున్నారుహెచ్‌ఐవీ ఉందని తెలిసినప్పటికీ ప్రామాణికమైన ఏఆర్‌టీ (యాంటీ రెట్రోవైరల్‌ థెరపీమందులు వాడకుండావైద్య పరీక్షలు చేయించుకోకుండా అవయవాలు పాడై పోయి చర్మ వ్యాధులకు గురవుతున్నారుకొందరు అందవికారంగా మారిపోతున్నారురోగ నిరోధక శక్తి క్షీణించిటీబీక్యాన్సర్లకు గురయ్యే వరకూ రోగులు హెచ్‌ఐవీ నిపుణుల వద్దకు గానీఏఆర్‌టీ కేంద్రాల వద్దకు గానీ వెళ్లడం లేదుహెచ్‌ఐవీ అని తెలియగానే సీడీ-4 కణాల సంఖ్య తగ్గేంత వరకు అశ్రద్ధ చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో ఆధునిక వైద్య సేవలు పొందితే 75 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవనం సాగించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారుఎయిడ్స్‌ రోగులూ మధుమేహంబీపీఆస్తమా రోగుల మాదిరిగానే ఔషధాల వాడకం ద్వారా ఆరోగ్యంగా ఉండచ్చుహెచ్‌ఐవీ ఉన్న దంపతులు తగిన సమయంలో ఏఆర్‌టీ మందులు వాడి హెచ్‌ఐవీ లేని సంతానాన్ని కనచ్చుతగిన చికిత్స పొందితే భార్య నుంచి భర్తకుభర్త నుంచి భార్యకు వ్యాధి సంక్రమించకుండా నివారించవచ్చు

భాగస్వామికి సోకకుండా..!

భార్యాభర్తలిద్దరిలో ఒకరు పాజిటివ్‌ఒకరు నెగెటివ్‌ అయినా (సీరో డిస్కార్డెంట్‌ దంపతుల్లోనూఒకరి నుంచి మరొకరికి వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించే వైద్యం నేడు అందుబాటులోకి వచ్చిందిఅలాగే హెచ్‌ఐవీ నెగెటివ్‌ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నా భాగస్వామికీ హెచ్‌ఐవీ సోకకుండా నివారించే మందులుపుట్టే పిల్లలకు ఈ వ్యాధి రాకుండా చేసే అధునాతన చికిత్స ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిందిప్రస్తుత పరిస్థితుల్లో హెచ్‌ఐవీ పాజిటివ్‌ సోకినా నివారణకు అధునాతన మందులు అందుబాటులోకి వచ్చాయిమూడు దశాబ్దాల క్రితం ఉన్న భయం ఇప్పుడు అవసరం లేదుకాబట్టి ప్రభుత్వాలుస్వచ్ఛంద సంస్థలు ఈ విషయాలపై విస్తృత ప్రచారం నిర్వహించి అందరిలో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతో ఉందియువత కూడా అనవసరమైన ఆందోళనలు మాని ఈ వ్యాధిపై మరింత లోతుగా తెలుసుకొనే ప్రయత్నం చేయాలి.





women icon@teamvasundhara
foods-to-overcome-nutrient-deficiencies-for-pregnant-woman-in-telugu

పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే ఈ పోషకాలు తప్పనిసరి!

కాబోయే అమ్మలు ‘నాకు పుట్టబోయే బిడ్డ ముద్దుగా, ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలి’ అనుకుంటుంటారు. ఇందుకోసమే నవమాసాలు చక్కటి ఆహారనియమాలు పాటిస్తుంటారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటూ పోషకాహారం తీసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే గర్భం ధరించినప్పటికీ వృత్తి, ఉద్యోగాలు, ఇంటి పనుల బిజీలో పడిపోయి చాలామంది మహిళలు ఆహారం విషయంలో అశ్రద్ధ చూపుతున్నారు. ‘ఈ పూటకి ఏదో ఒకటి తిన్నామా.. కడుపు నిండిందా..’ అన్న ధోరణితో వ్యవహరిస్తుంటారు. అయితే ఈ నిర్లక్ష్యమే క్రమంగా పోషకాహార లోపానికి దారి తీస్తుందని, దీని ప్రభావం ప్రత్యుత్పత్తి వ్యవస్థపై పడుతుందని, అంతిమంగా ఇది పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే ఈ పోషకాహార లోపాన్ని అధిగమించడానికి చక్కటి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-over-bleeding-in-telugu

విపరీతంగా బ్లీడింగ్ అవుతోంది.. పరిష్కారమేంటి?

హలో డాక్టర్‌. నా వయసు 22. ఎత్తు 5’3’’. బరువు 55 కిలోలు. నాకు పీసీఓఎస్‌ ఉంది. డాక్టర్‌ మూడు నెలల కోర్సు ఇచ్చారు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత రెండు నెలలు పిరియడ్స్‌ బాగానే వచ్చాయి. ఆ తర్వాత ఒక నెల పిరియడ్స్‌ రాలేదు. తర్వాతి నెలలో వచ్చినా బ్లీడింగ్‌ అవ్వలేదు. ఆపై నెలలో పిరియడ్స్‌ రెండు రోజుల ముందే వచ్చాయి.. పది రోజుల పాటు బ్లీడింగ్‌ అయింది. కానీ ఇప్పుడు ఐదు రోజుల ముందే నెలసరి వచ్చింది.. బ్లీడింగ్‌ ఎక్కువగా ఉంది.. ఇలా పిరియడ్స్‌ విషయంలో రెగ్యులారిటీ అంటూ లేదు. బ్లీడింగ్‌ కూడా విపరీతంగా అవుతోంది.. నా సమస్యకు పరిష్కారమేంటి? - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
hinakhan-reveals-how-she-starts-her-day-in-telugu

ప్రతి రోజూ ఆ కాఫీ.. ఆ జ్యూస్.. ఎందుకో తెలుసా?

కరోనా వచ్చాక అందరిలో ఆరోగ్య స్పృహ పెరిగిపోతోంది. ఈ మహమ్మారి బారిన పడకూడదని ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా చాలామంది తమకు తెలిసిన ఇంటి చిట్కాలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రత్యేకించి ఆహారం విషయంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇంట్లో వండిన పదార్థాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అది కూడా పోషకాలు పుష్కలంగా లభించే వాటికే ఓటేస్తున్నారు. అలాంటి వారందరికీ తన మార్నింగ్‌ రొటీన్‌ని పరిచయం చేసింది బాలీవుడ్‌ బ్యూటీ హీనా ఖాన్‌. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో తాను పాటిస్తోన్న ఈ అలవాట్లతో అందంతో పాటు ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చంటోంది. ఈ క్రమంలో తన రోజు మొదలయ్యే తీరు గురించి తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
golden-rules-to-keep-your-kidneys-healthy-in-telugu

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

శరీరంలోని అత్యంత సున్నితమైన, ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు కూడా ఒకటి. ఇవి మన రక్తంలోని మలినాలన్నింటినీ వడకడుతూ... శరీరానికి అత్యంత రక్షణ కలిగిస్తాయి. అందుకే వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకసారి కిడ్నీల పనితీరు మందగిస్తే మళ్లీ పూర్తిగా నయం చేయడం చాలా కష్టం. పైగా డయాలసిస్‌ లాంటి చికిత్సలకు ఎంతో ఖర్చవుతుంది. ఇక దెబ్బతిన్న మూత్ర పిండాన్ని మార్పిడి చేయించుకోవాలంటే దాతలు అంత సులభంగా దొరికే పరిస్థితి లేదు. అదే సమయంలో అనారోగ్యకరమైన జీవనశైలి, అలవాట్ల కారణంగానే చాలామంది అతి తక్కువ వయసులోనే కిడ్నీ సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో రక్తాన్ని శుద్ధి చేసే మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందేనంటున్నారు.

Know More

women icon@teamvasundhara
common-nutrition-myths-busted!-in-telugu
women icon@teamvasundhara
natural-ways-to-reduce-migraine-pain-in-telugu

మైగ్రెయిన్‌తో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే!

మైగ్రెయిన్.. దీని గురించి తెలియని వాళ్లు చాలా తక్కువమందే అని చెప్పుకోవాలి. లైట్, సౌండ్ సెన్సిటివిటీ వల్ల ఇది ఎక్కువగా వస్తుంటుంది. తలనొప్పితో పాటు వికారం, నీరసాన్ని కూడా మోసుకొచ్చే ఈ ఆరోగ్య సమస్య వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలామంది తమ తమ పనుల పట్ల శ్రద్ధ పెట్టలేక ఇంటికే పరిమితమవుతున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇక మన భారత్‌లో అయితే 12-15 శాతం మంది దీని బారిన పడి అటు తమ రోజువారీ పనులు చేసుకోలేక, ఇటు ఇంట్లో ప్రశాంతంగా ఉండలేక సతమతమవుతున్నారట! మరి, దీన్నుంచి బయటపడే మార్గమే లేదా? అంటే ఉందంటున్నారు వైద్యులు. కొన్ని ఆహార పదార్థాలను మన రోజువారీ మెనూలో చేర్చుకోవడంతో పాటు మరికొన్ని సులభమైన చిట్కాల్ని పాటించడం వల్ల మైగ్రెయిన్ నుంచి కాస్త ఉపశమనం పొందచ్చు. మరి, మీరూ మైగ్రెయిన్‌తో బాధపడుతున్నారా? అయితే ఆ చిట్కాలేంటో చూసేయండి.

Know More

women icon@teamvasundhara
why-eat-a-hand-pounded-chutney-thrice-a-week---a-new-post-by-celebrity-nutritionist-rujuta-diwekar

అందుకే రోట్లో రుబ్బుకున్న పచ్చళ్లే మంచివట!

పల్లీ చట్నీ, నువ్వుల చట్నీ, కొబ్బరి చట్నీ, కరివేపాకు చట్నీ, వివిధ రకాల కాయగూరలు-ఆకుకూరలతో చేసుకునే చట్నీలు.. ఇలా ఏదో ఒక పచ్చడి లేనిదే మన భోజనం పూర్తి కాదు. బయట హోటల్లో భోంచేసినప్పుడు కూడా ఏదో ఒక చట్నీ వడ్డించడం మనం చూస్తూనే ఉంటాం. మన ఆహారపుటలవాట్లలో చట్నీకి ఉండే ప్రత్యేకత అలాంటిది! మరి, అలాంటి చట్నీని తయారుచేసుకోవడానికి మనం ఏం ఉపయోగిస్తాం..? మిక్సీ లేదంటే వెట్‌ గ్రైండర్‌ అనే అంటారంతా! సులభంగా, త్వరగా చట్నీ చేయడం పూర్తవుతుంది కాబట్టే అందరూ వీటి పైనే ఆధారపడుతుంటారు. కానీ అదే సమయంలో రోట్లో రుబ్బుకున్న పచ్చడి అందించే రుచిని ఇది అందించలేదని కూడా అంటుంటారు మన ఇళ్లల్లో ఉండే పెద్దవాళ్లు.

Know More

women icon@teamvasundhara
here-are-some-foods-that-are-good-for-your-brain-power-in-telugu

మెదడు చక్కగా పని చేయాలంటే ఇవి తినాల్సిందే!

కరోనా విరామం తర్వాత ఇప్పుడిప్పుడే పాఠశాలలు, విద్యాసంస్థలు ప్రారంభమవుతున్నాయి. దీంతో పిల్లలు మళ్లీ స్కూలుకెళ్లి పుస్తకాలు పట్టుకునే సమయం ఆసన్నమైంది. అయితే ఇన్ని రోజుల కరోనా విరామాన్ని కవర్‌ చేస్తూ ఇంత తక్కువ సమయంలో విద్యా సంవత్సరాన్ని పూర్తి చేయాలంటే కత్తి మీద సామే. ఈ క్రమంలో సెలవులు లేకుండా తరగతులు కొనసాగించడం, వరుసగా పరీక్షల తేదీలు కూడా ప్రకటిస్తుండడంతో చాలామంది విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉంది. పోషకాహార లోపంతో మెదడు సంబంధిత సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే ఇలాంటి ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవడంతో పాటు మెదడు పనితీరును మెరుగుపరుచుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మరి కేవలం పిల్లలకే కాదు...పెద్దల విషయంలోనూ మెదడు పనితీరుపై ప్రభావం చూపే ఆ ఆహార పదార్థాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-iui-treatment-in-telugu
women icon@teamvasundhara
tips-to-eradicate-sound-pollution-in-telugu

సౌండెక్కువైతే చివరికి అసలు సౌండే వినలేం.. జాగ్రత్త..!

ప్రస్తుతం భూమిపై జీవించే ప్రాణులు రకరకాల కాలుష్యాలను ఎదుర్కొంటున్నాయి. వీటిలో శబ్ద కాలుష్యం కూడా ఒకటి. మనల్ని ఉదయాన్నే నిద్రలేపే అలారం దగ్గర నుంచి.. పడుకునే ముందు చూసే టీవీ వరకు రోజూ రకరకాల తీవ్రతలు గల శబ్దాలు వింటుంటాం. అయితే మన చెవిలో చాలా సున్నితమైన కణాలుంటాయి. ఇవి శబ్ద తీవ్రతను కొంతవరకు మాత్రమే తట్టుకోగలవు. కానీ.. మనం వినే మితిమీరిన శబ్దాలు ఈ కణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ఈక్రమంలో మనం పూర్తిగా వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పైగా ఇలా కోల్పోయిన వినికిడి శక్తిని తిరిగి మనం పొందగలిగే అవకాశాలు చాలా తక్కువని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో అధిక బరువు సమస్యను వ్యాయామాలు, డైటింగ్‌లతో ఎలాగైతే పరిష్కరిస్తామో.. శబ్ద తీవ్రత సమస్యను కూడా 'నాయిస్ డైటింగ్'తో నియంత్రించవచ్చు. అది ఎలాగో చూద్దాం..!

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-breast-lumps-in-women
women icon@teamvasundhara
tips-for-balancing-hormones-naturally-in-telugu
women icon@teamvasundhara
gynecologist-advice-on-unwanted-hair-in-telugu
women icon@teamvasundhara
tips-to-take-care-of-your-breasts-in-telugu

వీటి విషయంలో జాగ్రత్త వహిస్తున్నారా..?

తీరైన శరీరాకృతిలో వక్ష సంపదది కూడా కీలకపాత్రే. అయితే వివిధ కారణాల వల్ల వాటి ఆకృతిలో, పరిమాణంలో తేడాలు చోటుచేసుకుని సాగిపోయినట్లుగా కనిపిస్తుంటాయి. దీనివల్ల ఒక్కోసారి వయసు పైబడిన వారిగానూ కనిపించే అవకాశం ఉంది. ఫలితంగా కొందరిలో ఇది న్యూనతకూ దారితీస్తుంది. అయితే వక్షోజాల్లో ఇలాంటి తేడాలు ఎందుకొస్తాయి..? అని మీరెప్పుడైనా ఆలోచించారా..? ఎందుకంటే మనం రోజూ చేసే కొన్ని కొన్ని పనులు కూడా వీటి అందం, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి అవేంటో తెలుసుకొని మహిళలంతా తమ ఎద సంపదను ఆరోగ్యంగా ఉంచుకోవడం తప్పనిసరి. అందుకు రోజువారీ ఆహారపుటలవాట్లే కాదు.. వ్యాయామం కూడా తోడ్పడుతుంది. ఈ క్రమంలో ఆరోగ్యవంతమైన వక్ష సంపదను పొందాలంటే గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
shilpa-shetty-shares-homemade-recipe-to-boost-immunity-and-digestion

ఇమ్యూనిటీని పెంచే సూపర్ డ్రింక్!

కరోనా వచ్చిన దగ్గర్నుంచి అందరికీ వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై ఎక్కడ లేని శ్రద్ధ పెరిగిపోతోంది. ఈ మహమ్మారి బారిన పడకూడదని ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా చాలామంది తమకు తెలిసిన ఇంటి చిట్కాలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఇమ్యూనిటీని పెంచుకోవడానికి చాలామంది సెలబ్రిటీలు కూడా తాము పాటిస్తోన్న చిట్కాలను సోషల్‌ మీడియా వేదికగా అందరితో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ బ్యూటీ శిల్పాశెట్టి కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడే ఓ అద్భుతమైన డ్రింక్‌ను, దాని రెసిపీని తాజాగా ఇన్‌స్టా వీడియో రూపంలో పంచుకుంది. అంతేకాదు.. రోజూ ఈ పానీయం తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయంటోందామె. మరి, ఇంతకీ ఏంటా డ్రింక్‌? అదెలా తయారుచేస్తారో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
list-of-protein-rich-food-for-vegetarians-in-telugu

మీరు శాకాహారులా? అయితే ఈ ప్రొటీన్ ఫుడ్ మీ కోసమే!

శరీరంలోని జీవక్రియలు సక్రమంగా జరగాలన్నా, కండరాలు బలోపేతం కావాలన్నా ప్రొటీన్లు ఎంతో అవసరం. ప్రత్యేకించి ఉదయాన్నే నిద్ర లేచింది మొదలు... ఊపిరి సలపని పనులతో నిత్యం బిజీగా ఉండే వారు అలసట కలగకుండా ఉండాలంటే ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీర కండర వ్యవస్థ దృఢమవుతుంది. దీంతో ఎలాంటి ఒత్తిడి, అలసట లేకుండా సునాయాసంగా అన్ని పనులు చేసుకోవచ్చు. అలాగే ప్రొటీన్లు గుండె బలంగా ఉండేందుకు, రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకూ దోహదం చేస్తాయి. తగినన్ని ప్రొటీన్లు లభించే ఆహారం తీసుకుంటే తక్కువ క్యాలరీలతోనే కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది.

Know More

women icon@teamvasundhara
kajal-aggarwal-penned-about-being-diagnosed-with-bronchial-asthma-at-the-age-of-five

ఐదేళ్లున్నప్పుడు ఆ సమస్యతో బాధపడ్డా!

మాటల్లో, చేతల్లో తామెంత ఆరోగ్యంగా ఉన్నామో చెప్పుకోవడానికి వెనకాడరు.. కానీ తమలోని అనారోగ్యాల గురించి బయటికి చెప్పడానికి మాత్రం చాలామంది సంకోచిస్తుంటారు. కారణం.. ఫలానా ఆరోగ్య సమస్య ఉందంటే చుట్టూ ఉన్న వారు తమ గురించి ఏమనుకుంటారోనన్న భయమే! అయితే కొంతమంది మాత్రం తమ అనారోగ్యాల గురించి చెబుతూనే అలాంటి సమస్యలతో బాధపడే వారిలో అవగాహన పెంచాలనుకుంటారు. సామాన్యులే కాదు.. కొంతమంది సెలబ్రిటీలూ ఇందుకు అతీతులు కాదు.. అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ కూడా ఈ కోవలోకే వస్తుంది. చిన్నతనంలో తాను ఎదుర్కొన్న ఓ అనారోగ్యం గురించి తాజాగా బయటపెట్టిన ఈ టాలీవుడ్‌ బ్యూటీ.. ఈ క్రమంలో తాను పాటించిన ఓ చిట్కా గురించి కూడా చెప్పుకొచ్చింది. ఇలా తన ఆరోగ్య సమస్యకు సంబంధించి ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్‌ తాజాగా వైరలవుతోంది.

Know More

women icon@teamvasundhara
irregular-periods-problem-in-telugu

నా ఇర్రెగ్యులర్ పిరియడ్స్‌కి ఆ మాత్రే కారణమా?

నమస్తే డాక్టర్. నా వయసు 39. ఈమధ్య తిరుమల వెళ్లాల్సి రావడం, మా ఇంటి గృహ ప్రవేశం వంటి సందర్భాల్లో నెలసరి రాకుండా ఉండేందుకు మూడు Primolut-N మాత్రలు వేసుకున్నా. అవి ఆపేశాక ఒకసారి పిరియడ్స్ మామూలుగానే వచ్చినా, ఆ తర్వాత నుంచీ రెగ్యులర్‌గా రావడం లేదు. నాకు సాధారణంగా 28 రోజులకే నెలసరి వస్తుంటుంది. ఈ క్రమంలో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లాను. Sysron-N 5mg ట్యాబ్లెట్స్ మూడు రోజులకు రాసిచ్చారు. మొదటి ట్యాబ్లెట్ వేసుకున్న మూడు గంటలకు కొద్దిగా బ్లీడింగ్ అయింది. డాక్టర్‌కి ఫోన్ చేసి అడిగితే ట్యాబ్లెట్ ఆపేయమన్నారు. ఆ తర్వాత ఒక రోజు గడిచినా బ్లీడింగ్ కాకపోయేసరికి మళ్లీ డాక్టర్‌కి ఫోన్ చేస్తే మిగతా ట్యాబ్లెట్స్ వేసుకోమన్నారు. కోర్సు పూర్తయినా ఒక రోజు గడిచినా బ్లీడింగ్ మాత్రం కావట్లేదు. నేను పిరియడ్ రాకుండా ట్యాబ్లెట్స్ వాడడం ఇదే తొలిసారి. ప్రతినెలా నాకు పిరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయి. ఇప్పుడే ఎందుకిలా జరుగుతుందో అర్థం కావట్లేదు. మళ్లీ నాకు పిరియడ్స్ రెగ్యులర్ అవ్వాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
screening-tests-for-cancers-in-telugu

క్యాన్సర్ నిర్ధరణకు మార్గాలివిగో!

మనకు తెలియకుండా చాప కింద నీరులా వ్యాపిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. శరీరంలో కణవ్యవస్థ పనితీరు అదుపు తప్పడం వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. అయితే క్యాన్సర్ వస్తే ఇక అంతేనని.. దీనికి మందు లేదని.. చాలామంది భయపడుతుంటారు. కానీ క్యాన్సర్‌ని ప్రారంభంలోనే గుర్తిస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య పరిజ్ఞానంతో దానిని నయం చేయవచ్చంటున్నారు వైద్యులు. ఇందుకోసం ముందు నుంచీ కొన్ని పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుంది. నేడు 'ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం'. ఈ సందర్భంగా మహిళల్లో వచ్చే పలు క్యాన్సర్లు, వాటి నిర్ధరణ మార్గాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
foods-to-prevent-cancer-in-telugu

క్యాన్సర్ ముప్పు తగ్గించే ఆహారం!

మనం తీసుకునే ఆహారం, పాటించే లైఫ్‌స్త్టెల్‌లో భాగంగా మనకు తెలిసీ తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పలు రకాల వ్యాధుల బారిన పడుతుంటాం. అందులో క్యాన్సర్ మహమ్మారి కూడా ఒకటి. దీన్ని తొలి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని, కానీ చాలామంది చివరి దశలో గుర్తించి తమ జీవితాన్నే కోల్పోతున్నారని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఏటా ఫిబ్రవరి 4న 'ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం'గా జరుపుకుంటున్నాం. అయితే కేవలం చక్కటి జీవనశైలిని పాటించడమే కాదు.. కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా క్యాన్సర్ ముప్పును తప్పిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకొని వాటిని రోజువారీ మెనూలో చేర్చుకుంటే మనమూ క్యాన్సర్‌కు దూరంగా ఉండచ్చు.

Know More

women icon@teamvasundhara
step-by-step-guide-for-performing-a-breast-self-examination-in-telugu
women icon@teamvasundhara
sonam-kapoor-shares-recipe-for-her-breakfast-smoothie-and-it-includes-chocolate

సోనమ్‌ చెప్పిన ఈ చాక్లెట్‌ స్మూతీని మీరూ ట్రై చేయండి!

క్యాలరీలు, కెఫీన్‌ అధికంగా ఉండే డార్క్‌ చాక్లెట్‌ తింటే బరువు పెరుగుతారన్న అపోహ చాలామందిలో ఉంటుంది. అందుకే నోరూరిస్తున్నా చాలామంది వీటిని తినకుండా తమ నోరు కట్టేసుకుంటుంటారు. అయితే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉండే ఈ చాక్లెట్‌ స్మూతీని తన బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకుంటానంటోంది బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా సోనమ్‌ కపూర్‌. పీసీఓఎస్‌ సమస్య కారణంగా గత కొన్నేళ్లుగా చక్కెర పదార్థాలకు దూరంగా ఉంటోందీ అందాల తార. ఈ క్రమంలో తాను ఉదయాన్నే తీసుకునే షుగర్‌ ఫ్రీ చాక్లెట్‌ స్మూతీ తయారీ విధానాన్ని ఇన్‌స్టా స్టోరీస్‌ ద్వారా అందరితో షేర్‌ చేసుకుందీ ముద్దుగుమ్మ.

Know More