scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

రొమ్ము క్యాన్సర్‌ చికిత్స తర్వాత లైంగికాసక్తి తగ్గుతోందా?

Ways to live a fulfilling life after Breast Cancer Treatments in Telugu

ఇటీవలే రొమ్ము క్యాన్సర్‌ బారిన పడిన భార్గవికి చికిత్సలో భాగంగా మ్యాస్టెక్టమీ చేశారు. దీంతో ఎడమ రొమ్మును కోల్పోయిన ఆమె.. తీవ్ర మానసిక ఒత్తిడిలోకి కూరుకుపోయింది.. దీన్ని ఒక శారీరక లోపంగా భావిస్తూ నలుగురిలోకీ వెళ్లడానికి ఇష్టపడట్లేదామె.
జాహ్నవికి ప్రస్తుతం 40 ఏళ్లు. రొమ్ము క్యాన్సర్‌ చికిత్స తర్వాత రాన్రానూ తనలో లైంగికాసక్తి క్రమంగా తగ్గుతోంది. ఇది ఆమెను మరింత ఒత్తిడికి గురి చేస్తోంది.
రొమ్ము క్యాన్సర్‌ చికిత్స తర్వాత చాలామంది మహిళల్లో ఇలాంటి సమస్యలు తలెత్తడం సహజమే. అయితే ఈ మహమ్మారి బారి నుంచి బయటపడ్డామన్న ఆనందం కంటే.. జీవితంలో ఏదో కోల్పోయామన్న బాధే చాలామందిలో కనిపిస్తుంటుంది. కానీ ఈ సమయంలో అలాంటి ప్రతికూల ఆలోచనలు తగవంటున్నారు నిపుణులు. పాజిటివిటీని పెంచుకొని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. తద్వారా త్వరగా కోలుకోవడంతో పాటు మరోసారి ఈ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అక్టోబర్‌ను ‘ప్రపంచ రొమ్ము క్యాన్సర్‌ అవగాహన మాసం’గా జరుపుకుంటోన్న నేపథ్యంలో రొమ్ము క్యాన్సర్‌ చికిత్స తర్వాత తిరిగి త్వరగా కోలుకోవాలంటే, జీవితాన్ని మళ్లీ గాడిలో పెట్టాలంటే కొన్ని నియమాలు పాటించాలంటున్నారు నిపుణులు.
రొమ్ము క్యాన్సర్‌.. చాపకింద నీరుగా విస్తరిస్తూ చాలామంది మహిళలపై విషం చిమ్ముతోందీ మహమ్మారి. మహిళల అందంలో ప్రధాన పాత్ర పోషించే వక్షోజాలపై ప్రతికూల ప్రభావం చూపే ఈ క్యాన్సర్‌ కారణంగా ఒక్కోసారి వాటిని పూర్తిగా తొలగించాల్సిన అవసరం కూడా ఏర్పడచ్చు. ఈ చికిత్సనే మ్యాస్టెక్టమీగా పిలుస్తున్నారు. అదీ తొలి దశల్లో క్యాన్సర్ కణితిని గుర్తించినప్పుడే ఈ చికిత్స సాధ్యపడుతుందంటున్నారు నిపుణులు. ఫలితంగా ఒక శరీర అవయవాన్ని కోల్పోయి మహిళలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. అయితే క్యాన్సర్‌ మళ్లీ రాకుండా చేయడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన చికిత్స అని.. శరీరంలో ఓ భాగాన్ని కోల్పోవడం బాధాకరమే అయినా, అంతకు మించి ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యమని క్యాన్సర్‌ను జయించిన మహిళల్లో ధైర్యం నింపుతున్నారు నిపుణులు.

lifeafterbreastcanergh650-1.jpg
బలవంత పెట్టద్దు!
క్యాన్సర్‌ చికిత్స తర్వాత అలసట, నీరసం.. వంటివి సహజంగా ఎదురయ్యేవే! అలాంటి సమయంలో ఇంటి పనులు, ఆఫీస్‌ పనులు అంటే కష్టమే అని చెప్పుకోవాలి. ఈ క్రమంలో కొంతమంది మహిళలు ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆయా పనులు చేయడానికి తమ శరీరాన్ని బలవంత పెడుతుంటారు. దానివల్ల మరింత నీరసించిపోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.. కాబట్టి క్యాన్సర్‌ చికిత్స తర్వాత ఏ పనైనా శరీరంపై ఒత్తిడి పడకుండా నెమ్మదిగా ప్రారంభించాలని చెబుతున్నారు. ఇలా రోజురోజు కొద్దికొద్దిగా పనిని పెంచుకుంటూ, ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే ఒత్తిడి లేకుండా సాఫీగా పనులన్నీ పూర్తవుతాయి.. తద్వారా కొన్ని రోజులకు గతంలోలాగే అన్ని పనులు చకచకా చేసుకోగలుగుతారు. మీ జీవితం కూడా ఒక గాడిలో పడుతుంది.

lifeafterbreastcanergh650-4.jpg
ఆహారంతో పునరుత్తేజం!
ఎలాంటి అనారోగ్యం నుంచైనా బయటపడేసే శక్తి ఆహారానికి ఉందనడంలో సందేహం లేదు. అందుకే ఆయా చికిత్సల తర్వాత త్వరగా కోలుకోవడానికి పోషకాహార ఛార్ట్‌ని పేషెంట్స్‌కి అందిస్తుంటారు వైద్యులు. మ్యాస్టెక్టమీ, లంపెక్టమీ (రొమ్ములో ఏర్పడిన క్యాన్సర్ కణితిని తొలగించే చికిత్స).. వంటి క్యాన్సర్‌ చికిత్సల తర్వాత త్వరగా కోలుకోవడంలో కూడా ఆహారపుటలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో టొమాటో, బ్లూబెర్రీ, వాల్‌నట్స్‌, బ్రొకోలీ, ఆకుకూరలు.. వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభించే ఆహార పదార్థాల్లో క్యాన్సర్‌తో పోరాడే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తరచూ మెనూలో చేర్చుకుంటే తిరిగి క్యాన్సర్‌ రాకుండా జాగ్రత్తపడడంతో పాటు క్యాన్సర్‌ చికిత్స వల్ల తగ్గిన శరీర బరువును సైతం తిరిగి పొందచ్చు.

lifeafterbreastcanergh650-3.jpg
ఎలాంటి వ్యాయామాలు మంచివి?
కారణమేదైనా.. నీరసించిపోయిన శరీరాన్ని తిరిగి పునరుత్తేజితం చేయాలంటే అందుకు వ్యాయామం చక్కగా దోహదం చేస్తుంది. అందులోనూ క్యాన్సర్‌ చికిత్స తర్వాత వర్కవుట్‌ని తమ రొటీన్‌లో భాగం చేసుకున్న వారిలో మళ్లీ రొమ్ము క్యాన్సర్‌ తలెత్తే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పలు పరిశోధనలు సైతం స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి శ్వాస సంబంధిత వ్యాయామాలు, భుజాలు-చేతులతో చేసే చిన్న పాటి వ్యాయామాలు ఈ సమయంలో చేయడం మంచిదంటున్నారు నిపుణులు. అలాగే శారీరక శక్తిని తిరిగి పొందడానికి జుంబా లాంటి వర్కవుట్స్‌ చేయడం ఉత్తమం అని సలహా ఇస్తున్నారు. అయితే క్యాన్సర్‌ సర్జరీ తర్వాత వ్యాయామాలు ఎప్పుడు ప్రారంభించాలి? కుట్లపై ప్రభావం పడకుండా ఎలాంటి వ్యాయామాలు చేయాలి? వంటి విషయాలు మాత్రం మీ ఆరోగ్య స్థితిని బట్టి ముందుగానే నిపుణులను అడిగి తెలుసుకొని ఆపై ఆచరించడం మంచిది. లేదంటే ఇతర ఇబ్బందులు తలెత్తే ప్రమాదమూ లేకపోలేదు.

lifeafterbreastcanergh650.jpg
లైంగికాసక్తి తగ్గకుండా!
ఏదైనా అనారోగ్యం ఏర్పడినప్పుడు లైంగికాసక్తి తగ్గిపోవడం అనేది చాలామందిలో సహజంగా జరిగేదే! క్యాన్సర్‌ చికిత్స తర్వాత కూడా ఎక్కువ మంది మహిళల్లో ఇలాంటి సమస్యే వస్తుందంటున్నారు నిపుణులు. అందుకు ఆ చికిత్స వల్ల సుదీర్ఘకాలం పాటు అలసట-నీరసం వేధించడం, శారీరక మార్పులనే తలచుకుంటూ ఒత్తిడికి గురవడం.. వంటివి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. కాబట్టి వీటిని అధిగమించడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే అందుకు శృంగారం చక్కటి సాధనం అంటున్నారు నిపుణులు. మరి, దీనిపై ఆసక్తి పెరగాలంటే భాగస్వామికి దగ్గరగా ఉండడం, కౌగిలించుకోవడం-చుంబనం.. వంటి చిన్న చిన్న రొమాంటిక్‌ చిట్కాలతో అది సాధ్యమేనంటున్నారు నిపుణులు. అలాగే క్యాన్సర్‌ చికిత్స వల్ల శరీరమంతా పొడిబారిపోతుంది.. దీని ప్రభావం వెజైనాపై కూడా పడుతుంది. కాబట్టి ఈ క్రమంలో కలయిలో పాల్గొన్నప్పుడు నొప్పి లేకుండా లూబ్రికెంట్స్‌, మాయిశ్చరైజర్స్‌ వాడచ్చు.

lifeafterbreastcanergh650-5.jpg
ఎలా ఉన్నా అంగీకరించండి!
మ్యాస్టెక్టమీ చికిత్సలో భాగంగా క్యాన్సర్‌ బారిన పడిన రొమ్మును పూర్తిగా తొలగించడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు చాలామంది మహిళలు. శరీరంలో ఓ భాగాన్ని కోల్పోయామన్న బాధతో; సిగ్గు-బిడియంతో నలుగురిలోకీ వెళ్లడానికి జంకుతున్నారు. ఇలాంటప్పుడే మన శరీరాన్ని మనం అంగీకరించాలని, ప్రేమించుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ప్రాణాంతక మహమ్మారిని జయించే క్రమంలో ఇది సర్వసాధారణమే అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే శరీరంలో, జీవితంలో వచ్చిన మార్పుల్ని స్వీకరించాలి. అప్పుడే మన ఆలోచనలు సానుకూలత వైపు మళ్లుతాయి. మానసిక ఒత్తిడీ తగ్గుతుంది. ఇది తిరిగి కొత్త జీవితానికి బాటలు పరుస్తుంది.. జీవితంపై కొత్త ఆశలు చిగురించేలా, సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకునేలా చేస్తుంది.

ఇలా వక్షోజాన్ని తిరిగి పొందచ్చు!

lifeafterbreastcanergh650-2.jpg

క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా వక్షోజం/వక్షోజాలు కోల్పోయిన వారు దాని స్థానంలో తాత్కాలిక రొమ్మును/రొమ్ములను అమర్చుకోవచ్చు. దీన్ని ‘బ్రెస్ట్ రీకన్‌స్ట్రక్షన్ సర్జరీ’ అంటారు. ఇందులోనూ రెండు ఆప్షన్లున్నాయి. ఒకటి - ప్లాస్టిక్‌ సర్జరీ ద్వారా వక్షోజం ఆకృతి వచ్చేలా చేయడం.. రెండోది - బ్రెస్ట్ ప్రోస్థసిస్ ఉపయోగించడం. ఈ రెండింట్లోనూ మొదటి పద్ధతి ప్రభావవంతమైనదే అయినా చాలా ఖర్చుతో కూడుకున్నది.. కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది కూడా! అప్పటికే క్యాన్సర్‌ చికిత్సతో నీరసించిపోయిన వారు మళ్లీ ప్లాస్టిక్‌ సర్జరీ అంటే మరింత డల్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది.. కాబట్టి అవసరమైనప్పుడు బ్రెస్ట్ ప్రోస్థసిస్ ఉపయోగిస్తూనే.. అవసరం లేనప్పుడు సాధారణంగా ఉండడమే మంచిదన్నది నిపుణుల అభిప్రాయం.

రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్న తర్వాత తిరిగి జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలంటే, నూతనోత్సాహాన్ని కూడగట్టుకోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకున్నారు కదా! కాబట్టి శరీరంలో, జీవితంలో వచ్చిన మార్పుల వల్ల ఆత్మన్యూనతకు గురికాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి.. శరీరాన్ని ప్రేమించుకోండి.. నలుగురికీ ఆదర్శంగా నిలవండి! అప్పుడే అసలైన క్యాన్సర్‌ విజేతలవుతారు.





women icon@teamvasundhara
complete-details-of-thyroid-on-national-thyroid-awareness-month

జాగ్రత్తగా ఉంటే.. థైరాయిడ్ ఏం చేస్తుంది?

హలో అండీ.. నిన్న షాపింగ్‌కి వెళ్లినప్పుడు నా ఫ్రెండ్స్ సునీత, శ్రావణి, భవాని కనిపించారు. ఎంత ఆనందమేసిందో వాళ్లను చూసి..! మేం కలిసి దాదాపు ఆరు నెలలకు పైగానే అయింది. అయితే అప్పటికీ, ఇప్పటికీ వాళ్లలో చాలా మార్పు. ముగ్గురూ చాలా లావయ్యారు. ఆ తర్వాత మాటల్లో తెలిసింది.. వాళ్ల ముగ్గురికీ థైరాయిడ్ సమస్య ఉందని. నిజమేనండీ.. ఇటీవలి కాలంలో మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య థైరాయిడ్. పిరియడ్స్ రెగ్యులర్‌గా రాకపోవడం, బరువు పెరగడం, ఇతర అనారోగ్యాలు.. ఇలా ఒక్కటేమిటి థైరాయిడ్‌తో వచ్చే అనారోగ్యాలు అనేకం. ‘జాతీయ థైరాయిడ్‌ అవగాహన మాసం’ సందర్భంగా అసలీ థైరాయిడ్ ఎందుకొస్తుంది? దీన్ని అదుపులో ఉంచుకోవడం ఎలా? వంటి ప్రశ్నలన్నింటికీ నిపుణులు చెబుతోన్న సమాధానాలు ఏంటో తెలుసుకుందామా?

Know More

women icon@teamvasundhara
super-foods-that-celebrity-nutritionist-pooja-makhija-eats-every-day

రోజూ నేను తినే సూపర్‌ఫుడ్స్‌ ఇవే!

ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా చిన్న చిన్న అనారోగ్యాల దగ్గర్నుంచి దీర్ఘకాలిక వ్యాధుల దాకా మనపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి. మరి, అలాంటి అనారోగ్యాల బారిన పడి బాధపడడం కంటే ముందుగానే జాగ్రత్తపడడం మంచిది కదా! ఈ క్రమంలోనే చక్కటి పోషకాహారం మనకు ఎంతగానో తోడ్పడుతుందని చెబుతున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు పూజా మఖిజ. మన రోజువారీ ఆహారపుటలవాట్లలో భాగంగా కొన్ని పదార్థాల్ని తప్పనిసరిగా భాగం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో ముందుకు సాగచ్చని, తానూ ఇదే సిద్ధాంతాన్ని పాటిస్తున్నానంటున్నారామె. ఈ క్రమంలో తాను తీసుకునే రోజువారీ ఆహార పదార్థాలు, వాటిలో దాగున్న పోషక విలువలు, అవి అందించే ఆరోగ్య ప్రయోజనాలేంటో వీడియోల రూపంలో వివరించారామె. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోలు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Know More

women icon@teamvasundhara
gynaecology-expert-advice-on-sexual-intercourse-in-telugu
women icon@teamvasundhara
home-remedies-for-food-poisoning-in-telugu

women icon@teamvasundhara
celebrity-nutritionist-rujuta-diwekar-explained-how-using-iron-vessels-can-help-counter-its-deficiency

అందుకే ఇనుప పాత్రల్లో వండుకోవాలట!

సంతాన లేమి, తరచూ గర్భస్రావాలు, థైరాయిడ్‌, పీసీఓఎస్‌, హార్మోన్ల అసమతుల్యత.. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే సమస్యలకు లెక్క లేదు. గత కొన్నేళ్లుగా ఇలాంటి ప్రత్యుత్పత్తి సమస్యలతో బాధపడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే వీటన్నింటికీ మూలకారణం రక్తహీనతే అంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. ఇలాంటి అనారోగ్యాలు మహిళల్ని అటు శారీరకంగానే కాదు.. ఇటు మానసికంగానూ కుంగదీస్తున్నాయంటున్నారామె. మరి, దీనికి పరిష్కారం లేదా అంటే.. ‘ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌’ సిద్ధాంతాన్ని పాటిస్తూ పూర్వకాలపు పాకశాస్త్ర పద్ధతుల్ని అలవర్చుకోవడమే దీనికి అత్యుత్తమ మార్గమని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే రక్తహీనతను ఎలా తగ్గించుకోవాలో వివరిస్తూ ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారామె.

Know More

women icon@teamvasundhara
do-you-know-about-these-egg-freezing-myths-and-facts?-in-telugu

పిల్లలు వద్దనుకున్నప్పుడు ఎగ్‌ ఫ్రీజింగ్‌.. మంచిదా? కాదా?

‘ముందు జీవితంలో సెటిలవ్వాలి.. ఆ తర్వాతే పెళ్లి, పిల్లలు’ ఇది ఈ తరం అమ్మాయిల ఆలోచనా ధోరణి. అయితే ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా పిల్లల్ని కనడం వాయిదా వేసే వారు చాలామందే ఉంటారు. ఇలాంటి మహిళలకు ఎగ్‌ ఫ్రీజింగ్‌ (శీతలీకరణ పద్ధతిలో అండాల్ని నిల్వ చేసుకోవడం) పద్ధతి ఓ వరమని చెప్పాలి. యుక్త వయసులో ఉన్నప్పుడు తమ అండాల్ని నిల్వ చేసుకొని.. ఇక ఎప్పుడంటే అప్పుడు పిల్లల్ని కనే అద్భుత అవకాశాన్ని అందిస్తోందీ పద్ధతి. అయితే మహిళలకు ఏ వయసులోనైనా సంతాన భాగ్యాన్ని ప్రసాదించే ఈ పద్ధతి గురించి చాలామందిలో చాలా అపోహలే నెలకొన్నాయని చెప్పచ్చు. అసలు ఇలా నిల్వ చేసిన అండాల వల్ల పిల్లలు ఆరోగ్యంగా పుడతారా?, దీనివల్ల ఇటు తల్లికి, అటు పుట్టబోయే బిడ్డకు ఏదైనా ప్రమాదముంటుందేమో?, ఏ వయసులో ఉన్నప్పుడు అండాల్ని శీతలీకరించుకోవడం మంచిది? ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పద్ధతి గురించి మహిళల్లో నెలకొన్న సందేహాలెన్నో! అయితే ఏది ఎలా ఉన్నా కూడా ఎగ్‌ ఫ్రీజింగ్‌ పద్ధతి సురక్షితమైనది, ఎంతో ప్రభావవంతమైందని చెబుతున్నారు నిపుణులు. ఈ పద్ధతి గురించి మహిళల్లో నెలకొన్న సాధారణ అపోహలు, సందేహాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా మహిళల్లో 30 దాటితే అండాల నిల్వ క్రమంగా తగ్గిపోతుంటుంది.. ఇలా వయసు పెరిగే కొద్దీ ఉత్పత్తయ్యే అండాలు కూడా అంత ఆరోగ్యకరంగా ఉండవని, వాటితో గర్భం దాల్చితే పిల్లల్లో అవకరాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతుంటారు నిపుణులు. అందుకే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పిల్లల్ని కనడం వాయిదా వేసుకోవాలనుకుంటోన్న వారు యుక్త వయసులోనే తమ అండాల్ని నిల్వ చేసుకునేందుకు ఎగ్‌ ఫ్రీజింగ్‌ పద్ధతిని ఎంచుకోమని సూచిస్తున్నారు. పైగా ఇది సురక్షితమైందని, ప్రభావవంతమైందని కూడా సలహా ఇస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-urine-infection-in-telugu
women icon@teamvasundhara
natural-way-to-relieve-gas-and-bloating

ఈ చిట్కాలతో గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం!

'రాళ్లు తిని అరిగించుకోవాల్సిన వయసులో ఈ అరుగుదల సమస్యలేంటర్రా..?' - అంటూ పెద్దవాళ్లు వాపోతున్నారు.. కానీ ఏం చేయగలం..? చదువులూ, ఉద్యోగాల కోసం పరుగులు తీసే హడావుడిలో బయట దొరికే ఆహారం తినక తప్పదు. అలాంటప్పుడు దానివల్ల కలిగే జీర్ణ సమస్యలూ తప్పవు కదా మరి..! ఇంట్లో తయారు చేసే ఆహారం కూడా వందశాతం ఆరోగ్యకరమైనదే అని చెప్పలేం. విషపూరితమైన కూరగాయలు, కల్తీ సరుకులు మన ఆహారాన్ని కలుషితం చేస్తున్నాయి. నగరాలలో ఈ సమస్య మరీ ఎక్కువ. పెరిగే హాస్పిటళ్ల సంఖ్యకీ, తరిగి పోతున్న మన ఆరోగ్యానికీ ఇదే కారణం. అలాగని తినకుండా ఉండలేం కదా.. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటనేగా మీ ప్రశ్న..? అయితే జీర్ణ సమస్యలని నివారించే ఈ వంటింటి చిట్కాలను పాటించండి.

Know More

women icon@teamvasundhara
reasons-why-you-should-have-gajar-ka-halwa-this-winter

చలికాలంలో క్యారట్‌ హల్వా అందుకే తినాలట!

ఇంట్లో క్యారట్లు మిగిలిపోతే క్యారట్‌ హల్వా చేసుకుంటాం.. సాధారణ హల్వా బోర్‌ కొట్టినా క్యారట్‌ హల్వాకే ఓటేస్తుంటారు చాలామంది. సులభంగా, ఇన్‌స్టంట్‌గా చేసుకునే ఈ హల్వాతో తీపి తినాలన్న కోరికను తీర్చుకునే వారూ ఎంతోమంది! ఇలాంటి యమ్మీ స్వీట్‌ రుచిలోనే కాదు.. ఆరోగ్యంలోనూ మేటి అని చెబుతున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా చలికాలంలో క్యారట్‌ హల్వా తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు సైతం చేకూరతాయని సలహా ఇస్తున్నారు. శరీరానికి శక్తినివ్వడం దగ్గర్నుంచి రోగనిరోధక శక్తిని పెంచే దాకా, బరువు తగ్గించడంతో మొదలుపెట్టి చర్మ ఆరోగ్యాన్ని కాపాడే దాకా.. ఇలా ఈ సీజన్‌కు క్యారట్‌ హల్వాకు అవినాభావ సంబంధం ఉందట! మరి, ఇంతకీ చలికాలంలో క్యారట్‌ హల్వా తినడం వల్ల చేకూరే ఆ ఆరోగ్య ప్రయోజనాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
why-it’s-a-bad-idea-to-use-room-heaters-this-winter?

రూమ్‌ హీటర్లు వాడుతున్నారా? అయితే ఇవి గుర్తుపెట్టుకోండి!

శరీరాన్ని గిలిగింతలు పెట్టే చలిని తట్టుకోవడానికి పొద్దెక్కేదాకా ముసుగుతన్ని పడుకోవడం మనలో చాలామందికి అలవాటే! అయితే ఈ కాలంలో ఇంకాస్త వెచ్చదనం కోరుకునే వారు పడకగదిలో హీటర్లను కూడా ఏర్పాటు చేసుకుంటుంటారు. నిజానికి ఇలాంటి హీటర్లు చలిని తరిమికొట్టడం వరకు బాగానే పనిచేసినా.. ఆరోగ్యపరంగా మాత్రం ఎన్నో సమస్యల్ని తెచ్చిపెడతాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. రూమ్‌ హీటర్ల వల్ల అనుకోని అగ్ని ప్రమాదాలు కూడా సంభవించచ్చని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వాటిని వాడే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మరైతే చలికాలంలో హీటర్లు వాడడం మంచిదా? కాదా?, అవి ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతాయి? వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర విషయాల గురించి తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

Know More

women icon@teamvasundhara
immunity-boosting-foods-for-over-40-in-telugu

40ల్లోకి ప్రవేశించారా?ఈ ఆహారంతో ఇమ్యూనిటీని పెంచుకోండి!

మెనోపాజ్‌ వల్ల కావచ్చు.. జీవనశైలిలో మార్పుల వల్ల కావచ్చు.. ఇలా కారణమేదైనా నలభైల్లోకి అడుగుపెట్టిన మహిళలు వయసుతో పాటు ఉన్నట్లుండి బరువు పెరుగుతుంటారు. ఈ క్రమంలో పెరిగిన బరువును తగ్గించుకోవడానికి శరీరం సహకరించదని అనుకునే వారూ లేకపోలేదు. ఇలా శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం, చక్కటి ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల ఈ వయసులో వివిధ అనారోగ్యాలు చుట్టుముడతాయి. మరి, వీటి బారిన పడకూడదన్నా, పడినా వీటిని సమర్థంగా ఎదుర్కోవాలన్నా రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండడం ముఖ్యం. అందుకోసం కొన్ని ఆహార పదార్థాలు చక్కగా ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. మరి, నలభైల్లో ప్రవేశించిన మహిళల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆ ఆహార నియమాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
tasty-foods-which-can-reduce-your-iron-deficiency

రుచికరంగా ఐరన్ పొందండి..!

ఇనుము.. మన శరీరంలో ఎంతో ముఖ్యమైన ఖనిజంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఐరన్ లోపం ఉంటే హెమోగ్లోబిన్ తగ్గడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఓ సర్వే ప్రకారం భారత్‌లో 52 శాతం మంది స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారట. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ సమస్య ఉన్నవారే.. దీనికి ఐరన్ సప్లిమెంట్లు అందిస్తుంటారు వైద్యులు. కానీ సప్లిమెంట్ల ద్వారా హెమోగ్లోబిన్ శాతం పెరిగినా అది కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది కానీ శాశ్వతంగా కాదు.. అందుకే ఈ ఆహారపుటలవాట్లలో మార్పులు చేర్పులు చేసుకొని ఈ సమస్య నుంచి విముక్తి పొందాలి. ఐరన్ అనగానే పాలకూర, తోటకూర లాంటివి తినాలి.. అవి రుచికరంగా ఉండవు అంటూ కొంతమంది బాధపడుతుంటారు. అయితే కొన్ని రుచికరమైన పదార్థాల్లోనూ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అవేంటో తెలుసుకొని మన శరీరంలో ఇనుము లోపం లేకుండా చేసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
expert-suggestion-on-lump-in-breast
women icon@teamvasundhara
tips-for-buying-spices-in-telugu

ఇవి తిన్నారా.. అంతే సంగతులు!

కారం మరీ ఎర్రగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుందా? పసుపు పచ్చగా చూడగానే ఆకట్టుకునేలా ఉందా? ఉప్పు తెల్లగా పిడారబోసినట్లు కనిపిస్తుందా? ఇలా మనం మార్కెట్లో కొనే సరుకులు చూడగానే ఆకట్టుకునేలా ఉండడంతో వెనకా ముందూ ఆలోచించకుండా వాటిని కొనేస్తుంటాం. తీరా వాటిని తరచూ కూరల్లో భాగం చేసుకోవడం వల్ల లేనిపోని అనారోగ్యాల పాలవుతాం. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? అంటే.. మీరు కొన్న ఉప్పు, కారం.. వంటి నిత్యావసరాలు అసలువి కాదు.. కల్తీవి కాబట్టి! ప్రస్తుతం ఇలా కల్తీ ఉత్పత్తులు మార్కెట్లో బోలెడన్ని లభిస్తున్నాయి. కాబట్టి వీటిని కొనే విషయంలో జాగ్రత్త వహించాలి.

Know More

women icon@teamvasundhara
natural-ways-to-control-high-blood-pressure
women icon@teamvasundhara
sweet-resolutions-for-healthy-new-year-in-telugu

ఈ ‘స్వీట్‌’ రిజల్యూషన్స్‌ తీసుకున్నారా?

స్వీట్‌.. ఈ పేరు చెప్పగానే నోరూరిపోతుంది. చక్కెర తినకూడదని నోరు కట్టేసుకున్న వారు కూడా ‘రేపట్నుంచి మానేద్దాంలే!’ అని తమ లక్ష్యాన్ని పక్కన పెట్టేస్తుంటారు. ఇలా రోజూ రేపు అని వాయిదా వేస్తూ ఉంటే కొన్ని రోజులకు బీపీ, మధుమేహం, అధిక బరువు, గుండె సంబంధిత సమస్యలు.. వంటి దీర్ఘకాలిక వ్యాధులు తప్పవని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతోన్న నేటి రోజుల్లో చక్కెరతో కూడిన తీపి పదార్థాలు తీసుకునే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, లేదంటే చేజేతులా ముప్పును కొనితెచ్చుకున్న వారవుతారంటున్నారు. అయితే కొత్త ఏడాదిలో ఆరోగ్యపరంగా కొత్త తీర్మానాలు చేసుకుంటున్న వారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవడం మంచిది. మరి, ఇంతకీ ఈ ‘స్వీట్‌’ రిజల్యూషన్స్‌ ఎలా సెట్‌ చేసుకోవాలి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

Know More

women icon@teamvasundhara
food-trends-that-ruled-amid-covid-19-pandemic

‘ఆహారంతో ఆరోగ్యం’... ఇదే 2020 మంత్రం!

మనలో చాలామంది ఏ విషయంలోనైనా రాజీ పడతారేమోగానీ తీసుకునే ఆహారం విషయంలో మాత్రం అస్సలు రాజీ పడరు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త రుచుల్ని టేస్ట్‌ చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. అందుకోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి రడీగా ఉంటారు. అలా ఆహార ప్రియుల అభిరుచులకు తగ్గట్లుగా ఏటికేడు సరికొత్త వంటకాలు, కొత్త కొత్త రుచుల్ని పరిచయం చేస్తుంటారు ఛెఫ్‌లు. అయితే ఈ ఏడాది మాత్రం అందరూ రుచి కంటే ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యమిచ్చారు.. బయటి కంటే ఇంటి ఆహారానికే ఓటేశారు. దీనికంతటికీ కారణం కరోనా మహమ్మారి. నిజానికి ఇది మనల్ని పట్టి పీడిస్తోందని తిట్టుకుంటున్నాం కానీ.. ఒక రకంగా చెప్పాలంటే మనందరికీ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసింది. మన ఆరోగ్యాన్ని పెంపొందించే గుణాలున్న ఆహారం ఎక్కడో లేదు.. మన వంటింట్లోనే ఉందని మనందరికీ తెలియజెప్పింది. మరి, అలా ఈ ఏడాదంతా తమ హవాను కొనసాగించిన కొన్ని హెల్దీ ఫుడ్‌ ట్రెండ్స్‌ ఏంటో ఓసారి నెమరువేసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
reasons-for-irregular-periods-if-you-are-not-pregnant

అందుకే పిరియడ్స్ రావట్లేదేమో.. చెక్ చేసుకోండి!

మనల్ని నెలనెలా పలకరించిపోయే నెలసరి సరైన సమయానికి వస్తే ఎలాంటి సమస్యా ఉండదు. అదే ఒక్కోసారి కాస్త ముందుగా రావడం, మరోసారి కాస్త ఆలస్యమవడం, ఇంకోసారి నెలలకు నెలలే రాకుండా ఉండడం.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తేనే అసలు సమస్యేంటో అర్థం కాక చిరాగ్గా అనిపిస్తుంటుంది. ఇలాంటి అనుభవాలు మనలోనూ చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. అయితే గర్భం ధరించినప్పుడు కాకుండా మిగతా సమయాల్లో ఇలా నెలసరి క్రమం తప్పుతోందంటే అందుకు బోలెడన్ని కారణాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో నిర్ధారించుకొని ఆదిలోనే పసిగడితే నెలసరి సమస్యల్ని పరిష్కరించుకోవడంతో పాటు ఇతర అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తపడచ్చని సూచిస్తున్నారు. మరి, ఇంతకీ గర్భం ధరించకపోయినా పిరియడ్స్‌ మిస్సవుతున్నాయంటే/సక్రమంగా రావట్లేదంటే అందుకు అసలు కారణమేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
foods-to-eat-when-you-have-a-cold-or-the-flu

women icon@teamvasundhara
black-pepper-tea-benefits-in-telugu
women icon@teamvasundhara
types-and-benefits-of-fasting-in-telugu

ఉపవాసంలోనూ ఎన్నో రకాలు !

ముక్కోటి ఏకాదశి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉపవాసం. దైవారాధనలో దీన్ని ఓ దీక్షలా పాటిస్తారంతా! అయితే ఉపవాసం పేరుతో కేవలం దైవాన్ని ఆరాధించడమే కాదు.. దాని అంతర్లీన పరమార్థం ఆరోగ్యమనే చెప్పాలి. ఉపవాసం పేరుతో కడుపు మాడ్చుకోవడం కాకుండా ఆరోగ్యంగా ఆ దీక్షను పాటిస్తే.. దానివల్ల చేకూరే ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఉపవాస దీక్షలో చాలా రకాలున్నాయన్న సంగతి మనకు తెలిసినా.. ఎలా ఉపవాసం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయనే విషయం తెలిసింది మాత్రం కొందరికే అని చెప్పుకోవచ్చు! మరి, ఇంతకీ ఈ ఉపవాస దీక్షను ఎలా ఆచరించాలి? దానివల్ల కలిగే ప్రయోజనాలేంటి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
the-risks-of-a-cesarean-delivery-include-in-telugu
women icon@teamvasundhara
health-benefits-of-paneer-in-telugu
women icon@teamvasundhara
health-benefits-of-capsicum-in-telugu

మధుమేహాన్నీ అదుపుచేసే 'క్యాప్సికం'!

చాలామంది మొహం చిట్లించుకుంటూ తినే కూరగాయల్లో 'క్యాప్సికం' కూడా ఒకటి. మరి కొంతమందైతే ఈ కూర చేసినప్పుడు ఉపవాసం కూడా చేస్తారు. ఇది పెద్ద సైజు మిరపకాయను పోలి ఉండడంతో కొంతమంది కారంగా ఉంటుందేమోనని తినకుండా ఉండిపోతారు. కానీ క్యాప్సికం అసలు కారమే ఉండదు.. పైగా ఇందులో శరీరానికి కావలసిన విటమిన్ సి, పీచు, యాంటీఆక్సిడెంట్లు.. తదితర పోషకాలు, ఇతర ఖనిజాలు అధికంగా లభిస్తాయి. కాబట్టి కనీసం ఇప్పటి నుంచైనా ఇంట్లో క్యాప్సికం కూర చేసినప్పుడు పస్తులుండకుండా హ్యాపీగా తినేయండి. మరి ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాం..

Know More

women icon@teamvasundhara
what-you-need-to-know-about-frequent-urination?
women icon@teamvasundhara
home-remedies-for-throat-issues-in-telugu
women icon@teamvasundhara
winter-care-tips-pregnant-women-need-to-follow-for-mental-physical-well-being

కాబోయే అమ్మలూ.. చలికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి!

రిధిమకు ఇప్పుడు ఐదో నెల. తనకు ముందు నుంచీ ఇమ్యూనిటీ అంతంత మాత్రమే! దాంతో పదే పదే జలుబు, దగ్గు బారిన పడుతుంటుందామె. ఇక ఈ సమస్యలు ఇప్పుడామెకు సవాళ్లుగా మారాయి. ఇటీవలే నెల తప్పిన మృదులకు చలికాలమంటే అస్సలు పడదు. ఎందుకంటే ఈ సమయంలో తన చర్మం విపరీతంగా పొడిబారిపోతుంటుంది. దీంతో పొట్ట పెరిగే క్రమంలో చర్మం సాగి ఇంకెంత దురద పుడుతుందోనని తన భయం! ఏదేమైనా చలికాలంలో ఇలాంటి సమస్యలు చాలామందికి కామనే. అసలే చలికాలంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరు మందగిస్తుందంటే.. గర్భిణుల్లో ఆ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. తద్వారా వారు ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఎక్కువ! ఇక వీటికి తోడు ప్రస్తుతం కరోనా ముప్పు కూడా పొంచి ఉంది. కాబట్టి ఈ సీజన్‌లో కాబోయే తల్లులు తమ ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని సలహా ఇస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
tips-to-healthy-in-winter-months

చలికాలంలో ఇలా ఆరోగ్యంగా ఉండండి!

శీతాకాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్న కొద్దీ వేడివేడిగా ఆహారం తీసుకోవాలన్న కోరిక పెరుగుతూ ఉంటుంది. అయితే వేడివేడి ఆహారం లాగించాలనుకోవడం మంచిదే.. కానీ అది ఇంట్లో కాకుండా బయటి పదార్థాలకు, ముఖ్యంగా జంక్‌ఫుడ్ తీసుకుంటే మాత్రం అనారోగ్యం బారిన పడక తప్పదు. పైగా ఈ కాలంలో చలికి ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల బ్రేక్‌ఫాస్ట్, లంచ్.. ఇలా అన్నీ ఆలస్యంగానే జరుగుతుంటాయి. వీటికి తోడు 'అసలే బయట చలిగా ఉంటే ఇక వ్యాయామం ఏం చేస్తాంలే..' అంటూ చాలామంది ఎక్సర్‌సైజ్‌ను వాయిదా వేస్తుంటారు. చలికాలంలో ఎదురయ్యే ఇలాంటి పరిణామాల వల్ల పలు అనారోగ్య సమస్యల బారిన పడక తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే శీతాకాలంలోనూ సరైన పోషకాహారం తీసుకోవడం ఎంతో అవసరమంటున్నారు. మరి, ఈ కాలంలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
health-benefits-of-ghee

అందుకే రోజూ నెయ్యి తీసుకోవాల్సిందే !

వేడివేడి అన్నం, పప్పు లేదా ఆవకాయ.. దాంట్లో కాస్త నెయ్యి.. చెబుతుంటేనే నోరూరిపోతోంది కదూ! మరి తింటేనో.. రుచి అదిరిపోవాల్సిందే! బహుశా దీని రుచి తెలియని తెలుగు వారు దాదాపు ఎవరూ ఉండరేమో! మరి దీనికి అంతటి రుచి దేనివల్ల వచ్చిందంటారు..? సందేహమేముంది? అక్షరాలా నెయ్యి వల్లే అంటారా..? అవును మీరన్నది నిజమే. అందుకే భారతీయ సంప్రదాయ వంటకాల్లో, పండగలకు, ప్రత్యేక సందర్భాలకు తయారుచేసే పిండివంటల్లో, వివిధ రకాల స్వీట్ల తయారీలో నెయ్యిని తప్పనిసరిగా వాడతారు. అయితే దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అనవసర కొవ్వులు పెరిగి లావవుతామేమోనని కొందరు, గుండెకు మంచిది కాదని మరికొందరు, ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తాయని ఇంకొందరు.. ఇలా నెయ్యిని ఆహారంలో భాగంగా తీసుకోవడానికి చాలామంది వెనకాడుతూ ఉంటారు. కానీ ఎన్నో విటమిన్లు, మరెన్నో ఖనిజాలతో మిళితమైన నెయ్యి వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయంటున్నారు వైద్యనిపుణులు. అవేంటో తెలుసుకుంటే మనం కూడా నెయ్యిని నిస్సంకోచంగా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.

Know More

women icon@teamvasundhara
feeling-pregnant-but-tests-showing-negative?-here-some-possible-reasons-behind-it

నెల తప్పినా ప్రెగ్నెన్సీ పరీక్షలో నెగెటివ్ వస్తోందా?

సృజనకు మామూలుగా నెలసరి సరైన సమయానికే వస్తుంటుంది. అయితే ఈసారి నెల దాటినా ఇంకా పిరియడ్‌ రాకపోయేసరికి గర్భం దాల్చానేమో అని టెస్ట్‌ చేసుకుంది.. కానీ ఫలితం మాత్రం నెగెటివ్‌గా వచ్చేసరికి నిరాశపడిపోయిందామె. మృదుల కూడా అంతే! ఈసారి ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్‌ అవుతుందన్న నమ్మకంతో ఉంది. దీనికి తోడు వికారం, రొమ్ముల్లో నొప్పి కూడా మొదలైంది. ఇవి కచ్చితంగా ప్రెగ్నెన్సీకి సూచనలే అని భావించిన ఆమె ఆనందంతో ఇంట్లోనే పరీక్ష చేసుకుంది. ఫలితం నెగెటివ్‌ రావడంతో తన ఆనందమంతా ఆవిరైంది. ఇలాంటి అనుభవాలు మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటాయి. పిరియడ్‌ మిస్సవడం, వికారంగా అనిపించడం, రొమ్ముల్లో నొప్పితో కూడిన అసౌకర్యం.. వంటివి గర్భధారణకు ముందస్తు సూచనలుగా చెబుతున్నారు నిపుణులు. దీంతో ఇవి కనిపించిన వెంటనే ఇంట్లోనే ప్రెగ్నెన్సీ పరీక్ష చేసుకుంటుంటారు చాలామంది. అయితే ఇందులో కొంతమందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినా, ఇంకొంతమందికి మాత్రం గర్భధారణ జరిగినా ఫలితం నెగెటివ్‌గా వస్తుంటుంది. అందుకు ఇతరత్రా అంశాలతో పాటు పరీక్ష చేసుకునే క్రమంలో మనకు తెలియకుండా మనం చేసే కొన్ని పొరపాట్లు కూడా కారణం కావచ్చంటున్నారు వైద్యులు. మరి, అవేంటో తెలుసుకొని సరిదిద్దుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
expert-suggestion-on-frequent-abortions
women icon@teamvasundhara
tips-to-reduce-post-pregnancy-tummy

women icon@teamvasundhara
effective-tips-for-getting-pregnant-with-pcos
women icon@teamvasundhara
aids-myths-and-facts-about-the-deadly-disease

అపోహలు తొలగిద్దాం.. అవగాహన పెంచుకుందాం..

మానవ జాతిని వణికిస్తోన్న ప్రాణాంతక వ్యాధుల్లో ఎయిడ్స్ కూడా ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఈ వ్యాధికి మందు కనుగొనేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నా ఇప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. అలాగని హెచ్ఐవీ ఏమీ అంటువ్యాధి కాదు. ఈ వ్యాధి కేవలం కొన్ని మార్గాల ద్వారా మాత్రమే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. కానీ కొందరు ఎయిడ్స్, హెచ్ఐవీలపై ఉన్న అపోహల కారణంగా ఈరోజుల్లో కూడా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ; వారిని దూరం పెడుతూ ఉంటారు. ఇవే కాదు.. మన సమాజంలో హెచ్ఐవీ గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. వాటిని తొలగిస్తూ; వ్యాధి గురించి అందరికీ పూర్తి అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 1ని 'ప్రపంచ ఎయిడ్స్ దినం'గా ప్రకటించింది. ఈ ఏడాది ‘ఎండింగ్‌ ది హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ ఎపిడమిక్‌ : రీసైలెన్స్‌ అండ్‌ ఇంపాక్ట్‌’ అనే నినాదంతో ఈ వ్యాధిపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తోంది. ఈ సందర్భంగా ఎయిడ్స్/హెచ్ఐవీ వ్యాధి పట్ల ఉన్న కొన్ని అపోహల గురించి తెలుసుకొని; మరింత అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం రండి.

Know More

women icon@teamvasundhara
fssai-suggests-these-post-festivity-tips-to-resume-a-healthy-routine

ఈ చిట్కాలతో మీ శరీరాన్ని డీటాక్స్‌ చేసుకోండి!

ప్రస్తుతం పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. ఇలాంటి ప్రత్యేక సందర్భాలంటే నోరూరించే విభిన్న వంటకాలతో కూడిన విందులే గుర్తొస్తాయి. తలచుకుంటేనే నోరూరిపోతోంది కదూ! అయితే ఇలాంటి విందు భోజనం ఆరంగించేటప్పుడు బాగానే ఉంటుంది.. కానీ అమితంగా లాగిస్తే మాత్రం అజీర్తి, గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఏదేమైనా ఇలాంటి ప్రత్యేక వంటకాల ద్వారా ఎంతో కొంత మొత్తంలో కొవ్వులు, చక్కెరలు, శీతల పానీయాలు.. వంటివి మన శరీరంలోకి చేరిపోతాయి. నిజానికి ఇవి మన శరీరానికి మంచి కంటే చెడే ఎక్కువ చేస్తాయి. కాబట్టి మన శరీరంలో చేరిన ఇలాంటి విషతుల్యాలను తొలగించుకొని తిరిగి సాధారణ ఆహార నియమాలకు అలవాటు పడాలంటే కొన్ని చిట్కాలు పాటించాలంటోంది ‘భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (FSSAI)’.

Know More

women icon@teamvasundhara
leave-these-health-habits-in-your-20s

ఇరవైల్లో ఉన్నారా? అయితే ఇలా చేయద్దు...

ఇరవయ్యేళ్ల వయసు.. టీనేజ్ దాటేశాం అన్న పెద్దరికం ఓవైపైతే.. పూర్తి చేయాల్సిన చదువులు.. కెరీర్‌లో చేరాల్సిన తీరం.. ఇంకా చేయాల్సింది చాలానే ఉందంటూ మనల్ని చిన్నవారిగా మారుస్తాయి. ఓ మహిళ జీవితంలో ఇరవై నుంచి ముప్ఫై ఏళ్ల వయసు చాలా మార్పులనే తీసుకొస్తుంది. కెరీర్‌లో తాము కావాలనుకున్న స్థాయికి చేరుకోవాలన్నా.. అంతకుమించిన ఉన్నత చదువులు చదవాలన్నా.. నచ్చిన వరుడిని పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాలన్నా ఈ పదేళ్లలోనే జరగడం పరిపాటి.. అందుకే ఈ పదేళ్ల సమయం మహిళల జీవితంలో చాలా ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. కానీ చాలామంది ఈ వయసులో ఆరోగ్యంపై సరైన శ్రద్ధ చూపకపోవడం వల్ల వివిధ అనారోగ్య సమస్యల బారిన పడడమే కాకుండా.. జీవితంలో ముందుముందు మరిన్ని ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టేలా తమ జీవన శైలిని మార్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఇరవైల వయసులో ఉన్న అమ్మాయిలు ఆరోగ్యం విషయంలో చేసే కొన్ని తప్పులేంటో తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
expert-suggestion-on-frequent-ivf-failures
women icon@teamvasundhara
things-to-avoid-during-periods

పిరియడ్స్ సమయంలో కలయిక మంచిదేనా?

పిరియడ్స్.. రోజు కంటే ఈ ఐదు రోజులూ కాస్త భిన్నం.. నొప్పి, చిరాకు, మూడ్ స్వింగ్స్.. వంటివి ఈ సమయంలో కామన్. అయితే కొంతమంది నెలసరి సమయంలో నొప్పితో ఏమీ చేయాలనిపించక సైలెంట్‌గా ఉండిపోతారు. మరికొందరేమో రోజూ లాగే అన్ని పనులూ చేసేస్తుంటారు. కానీ నెలసరి సమయంలో చేయకూడని కొన్ని పనులు కూడా ఉన్నాయంటున్నారు గైనకాలజిస్టులు. వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లిపోతే ఆ ప్రభావం మన ప్రత్యుత్పత్తి వ్యవస్థపై పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ, పిరియడ్స్ సమయంలో చేయకూడని ఆ పనులేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
ways-to-avoid-getting-sick-in-winter-season
women icon@teamvasundhara
best-foods-to-boost-your-brain-and-memory-in-telugu

women icon@teamvasundhara
expert-suggestion-on-seizures-in-pregnancy-in-telugu

ప్రెగ్నెన్సీలో ఫిట్స్‌ వస్తే ఎలాంటి సమస్యలొస్తాయి?

నమస్తే డాక్టర్‌. నా వయసు 33 ఏళ్లు. గర్భం ధరించిన తర్వాత మూడో నెలలో నాకు ఫిట్స్‌ (సీజర్స్‌) వచ్చాయి. ఆ తర్వాత ఒక్కోసారి రోజులో నాలుగైదు సార్లు వచ్చేవి. న్యూరాలజిస్ట్‌ని సంప్రదిస్తే ఎక్కువ డోస్‌ మందులు వాడమన్నారు. నాకు ఏడో నెలలోనే సిజేరియన్‌ అయింది. బాబు పుట్టాడు. ఐదేళ్ల క్రితం నేను MTS బ్రెయిన్‌ సర్జరీ చేయించుకున్నా. ఆ తర్వాత ఫిట్స్‌ సమస్య క్రమంగా తగ్గిపోయింది. అయితే అప్పుడప్పుడూ టెన్షన్‌ పడితే మళ్లీ సమస్య తలెత్తుతోంది. ఇలాంటి సమయంలో నేను రెండో బేబీ కోసం ప్లాన్‌ చేసుకోవచ్చా? పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడా? దయచేసి చెప్పండి. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
foods-that-will-keep-you-warm-during-winter-in-telugu