scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

మెనోపాజ్ దశలోకి ప్రవేశిస్తున్నారా? అయితే ఇది చదవండి..

Menopause symptoms, Precautions in Telugu

మెనోపాజ్.. చాలామంది పెద్ద వయసులో ఎదురయ్యే ఇబ్బందిగా భావిస్తారు. అయితే నిజానికిది ఇబ్బంది కాదు.. ప్రమాద సూచన మాత్రమే.. లేటు వయసులో మనకెదురవబోతున్న సమస్యలన్నింటికీ అలారంలా పనిచేసి వాటిపై మనం దృష్టి సారించేలా చేస్తుంది. అందుకే మెనోపాజ్ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా అదుపులో ఉంచే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తే జీవితాంతం ఆనందంగా గడపొచ్చు.. అక్టోబర్‌ను ‘ప్రపంచ మెనోపాజ్‌ అవగాహన మాసం’గా జరుపుకుంటోన్న నేపథ్యంలో దీని గురించి అవగాహన పెంచుకుందాం...
మెనోపాజ్.. చాలా సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా వచ్చిన నెలసరి ఆగిపోయే టైమ్. స్త్రీ పునరుత్పత్తి వయసు అయిపోయిందనడానికి ఇది సూచన అన్నమాట. అర్థం కాలేదా? ప్రతి ఆడపిల్లా పుట్టినప్పుడు దాదాపు పది నుంచి ఇరవై లక్షల అండాలతో పుడుతుంది. ఇవి రోజులు గడిచే కొద్దీ తగ్గుతూ ఉంటాయి. రుతుక్రమం ప్రారంభమయ్యే సమయానికి మూడు నుంచి నాలుగు లక్షల అండాలు మాత్రమే మిగులుతాయి. ఇలా ప్రతి నెలా కొన్ని అండాలు విడుదలవుతూ, మెనోపాజ్ నాటికి ఈ నిల్వ పూర్తిగా తరిగిపోతుంది. తర్వాత అండాశయాల నుంచి ఇక అండం విడుదల కాదు. దాంతో పాటే హార్మోన్ల విడుదల కూడా ఆగిపోతుంది.

menopausealarmgh650-1.jpg

అయితే ఈ ప్రక్రియ అంతా ఒక్కసారిగా ఏం జరిగిపోదు.. మెనోపాజ్‌కి 5-7 సంవత్సరాలకు ముందు నుంచే ఈ మార్పులు ప్రారంభమవుతాయి. హార్మోన్ల స్థాయి కూడా నెమ్మదిగానే తగ్గుతుంది. ఆ సమయంలో పిట్యూటరీ గ్రంథి నుంచి గొనడోట్రోపిన్ లాంటి హార్మోన్ల విడుదల ఎక్కువై శారీరకంగా మార్పులు జరుగుతాయి. దాంతో మెనోపాజ్ దశకు చేరుకుంటారు. సాధారణంగా 47 నుంచి 53 సంవత్సరాల లోపు ఈ ప్రక్రియ జరుగుతుంది. మెనోపాజ్ సగటు వయసు 51 సంవత్సరాలు. అలాకాకుండా మెనోపాజ్ మరీ 40 కంటే ముందే వస్తే దాన్ని 'ప్రిమెచ్యూర్ మెనోపాజ్' అంటారు.
లక్షణాలతో గుర్తించొచ్చు..
మెనోపాజ్‌ని ఎలా గుర్తించాలి? ఆ సమయంలో ప్రతి ఒక్కరికీ కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. వాటి ద్వారా మెనోపాజ్ దశకు చేరుకున్నామని గుర్తించొచ్చు. వీటిల్లో కొన్ని లక్షణాలు ఒక్కసారిగా దాడి చేస్తే మరికొన్ని ఆలస్యంగా మొదలవుతాయి. వెంటనే, ఉన్నట్టుండి మొదలయ్యే లక్షణాల్లో.. శరీరమంతా లేదా కొన్ని భాగాల్లో అంటే తల, మెడ, ఛాతీ దగ్గర చర్మం అంతా కందిపోయినట్టు ఎర్రగా తయారవుతుంది. ఈ భాగాల్లో చాలా వేడిగా కూడా ఉంటుంది. చెమటలు కారిపోతూ ఉంటాయి. వీటి 'హాట్ ఫ్లషెస్' అంటాం.. నిద్రలోనూ చెమటలు పట్టి, పక్కంతా తడిసిపోయి ఉన్నట్టుండి మెలకువ వచ్చేస్తుంది. ఇలా ఎక్కువసార్లు జరగడం వల్ల దాని ప్రభావం దినచర్యపై పడి చిరాకు, కోపం, అసహనం లాంటివి పెరిగిపోతూ ఉంటాయి. ఓ రకంగా చూస్తే ఇది మొదటి లక్షణం.. ఈ లక్షణాలు మరీ విపరీతంగా ఉన్నప్పుడు డాక్టర్లు ఈస్ట్రోజెన్ హార్మోన్‌ని సూచిస్తారు. అయితే కొన్ని సంవత్సరాల ముందు నుంచే ప్రాణాయామం, ధ్యానం, యోగా లాంటివి చేసే వారిలో ఈ లక్షణాలు తక్కువగా కనిపిస్తాయి. హార్మోన్ తీసుకోవడానికి వీల్లేని వారికి యాంటీ డిప్రెసెంట్లు మరో ప్రత్యామ్నాయం.
రెగ్యులర్ పిరియడ్స్ కోసం..
మెనోపాజ్‌ని సూచించే మరో లక్షణం నెలసరిలో తేడా.. మెనోపాజ్‌కు ఏడాది, రెండేళ్ల ముందు నుంచీ నెలసరి క్రమం తప్పుతుంది. కొన్నిసార్లు త్వరగా వచ్చేస్తే, మరికొన్నిసార్లు ఆలస్యంగా రెండు మూడు నెలలకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఆ సమయంలో కూడా రక్తస్రావం మరీ ఎక్కువగా లేదా మరీ తక్కువగా ఒక పద్ధతంటూ లేకుండా వచ్చి ఇబ్బంది పెడుతుంది. ఒకటి, రెండు నెలలు నెలసరి రాకపోయే సరికి ఒక్కోసారి గర్భం అనుకొని చాలామంది భయపడుతూ ఉంటారు. అలాంటి తేడాలుంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. డాక్టర్లు గర్భనిరోధక మాత్రలను సూచిస్తారు. చాలామంది వీటిని వాడటానికి సందేహిస్తూ ఉంటారు కానీ ఇవి ఒక విధంగా మనకు మేలే చేస్తాయని అనుకోవచ్చు. ఎందుకంటే వాటిని వాడటం వల్ల నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది. అదే సమయంలో ఈ మాత్రలు ఎముకలకు రక్షణగా పనిచేస్తాయి. ఎండోమెట్రియల్, అండాశయ క్యాన్సర్ల బారి నుంచి కూడా రక్షిస్తాయి. వీటన్నింటి వల్లా అవాంఛిత గర్భం వస్తుందనే భయం కూడా ఉండదు.

menopausealarmgh650-2.jpg
సమస్యకు స్వాంతన
మెనోపాజ్ ప్రభావం మూత్రవ్యవస్థ, జననేంద్రియాలపైన కూడా పడుతుంది. ఎందుకంటే మెనోపాజ్ ముందు వరకు యోని, మూత్రనాళం, మూత్రకోశాల్లో ఈస్ట్రోజెన్ రిసెప్టర్లు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఈస్ట్రోజెన్ తగ్గుతుందో అప్పుడు ఆ కణజాలం బలహీనమై, పొడిబారిపోతుంది. అదే అసౌకర్యానికి, మంటకు దారితీస్తుంది. ఇక మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కలయిక సమయంలో నొప్పి వంటివి సాధారణంగా వచ్చే సమస్యలే.. ఇలాంటి సమస్యలను తగ్గించడానికి హార్మోన్లు తీసుకోవడమే మంచి పద్ధతి. దాన్నే హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ 'హెచ్ఆర్‌టీ' అంటారు. ఒకవేళ హార్మోన్లు వద్దనుకుంటే ఈస్ట్రోజెన్‌ను ఆయింట్‌మెంట్ రూపంలో వాడొచ్చు. అలాగే వెజైనల్ క్రీములు కూడా డాక్టర్ సలహాతో ఎంచుకోవచ్చు. కలయిక సమయంలో కలిగే అసౌకర్యాన్ని తగ్గించుకోడానికి ల్యూబ్రికెంట్ జెల్లీలు కొంతవరకు ఉపయోగపడతాయి.
కొన్ని సమస్యలు ఆలస్యంగా..
అండాశయాల నుంచి హార్మోన్ల విడుదల ఆగిపోవడం, ముఖ్యంగా ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గడం వల్ల కొన్ని సమస్యలు కనిపిస్తూ ఉంటాయి.
* ఎముక లోపల క్యాల్షియం, విటమిన్ 'డి' నిల్వలు తగ్గి అవి బలహీనంగా మారతాయి. ఈ దశను 'ఆస్టియోపీనియా' అంటారు. ఎముకలు క్రమంగా గుల్లబారి మెత్తగా తయారవుతాయి. అదే ఆస్టియోపోరోసిస్.. కొన్నిసార్లు ఒళ్లంతా నొప్పులుగా అనిపించడం, చిన్న దెబ్బ తగిలినా ఫ్రాక్చర్లు కావడం లాంటివి ఆస్టియోపొరోసిస్‌ను సూచిస్తాయి. ఎముకల సాంద్రత తగ్గకుండా ఈస్ట్రోజెన్‌తో పాటు క్యాల్షియం, విటమిన్ 'డి' తీసుకోవాలి. ఒకవేళ ఎముకల బలం విపరీతంగా తగ్గితే వాటిని పెంచేందుకు మందులు వాడొచ్చు.
* మెనోపాజ్ ప్రభావం మానసిక ఆరోగ్యం పైనా పడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. మగవారితో పోలిస్తే ఆడవారిలో అల్జీమర్స్ సమస్య ఎక్కువని తేలింది. ఈస్ట్రోజెన్‌కి నాడీ వ్యవస్థను కాపాడే లక్షణం ఉంటుంది. ఎప్పుడైతే ఆ హార్మోన్ స్థాయి తగ్గుతుందో సమస్య మొదలవుతుంది. అలాగే కండరాలు కూడా బలహీనమైపోతాయి.
* మెనోపాజ్ వచ్చే వరకు స్త్రీలలో గుండెపోటు చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ యాభై సంవత్సరాలు దాటిన తర్వాత పురుషులతో సమానంగా మహిళలు కూడా గుండెపోటు ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. ఎందుకంటే అప్పటివరకు ఈస్ట్రోజెన్ గుండెను, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అదీ కాక యాభై దాటిన తర్వాత రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల అవి సన్నగా మారిపోతాయి.

foodshungry650.jpg
లైఫ్‌స్త్టెల్ మార్పులతో..
మెనోపాజ్ దశలో వచ్చే సమస్యలను అధిగమించాలంటే జీవనశైలి పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి..
* ఈ సమయంలో సోయాబీన్స్, బీన్స్ జాతి గింజలు, వాటితో దొరికే ఇతర పదార్థాలు, ఎక్కువగా తీసుకోవాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయల మోతాదును పెంచాలి.
* యాంటీ క్యాన్సర్ పదార్థాలుగా పరిగణించే టొమాటో, గుమ్మడి, క్యారెట్, బొప్పాయి లాంటి వాటికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.
* జ్ఞాపక శక్తి కోసం ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా లభించే అవిసె గింజలు, డ్రైఫ్రూట్స్, చేపల్ని తరచుగా తినాలి. ఫైబర్, ప్రొటీన్లుండే పదార్థాలను ఎక్కువగా ఎంచుకోవాలి. అదే సమయంలో కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, జంక్‌ఫుడ్, ప్రిజర్వేటివ్స్ కలిపినవి తగ్గించాలి.
* వ్యాయామం వల్ల కొవ్వు తగ్గడమే కాకుండా కండరాలు బలహీనపడకుండా ఉంటాయి. అలాగే ఎముకలకు క్యాల్షియం చేరేలా చేయడంలోనూ వ్యాయామం పాత్ర చాలా కీలకం. రోజూ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల ఎముకల్లోకి క్యాల్షియం చేరుతుంది. అలాగే రక్తప్రసరణ కూడా చక్కగా జరిగి.. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
* 'యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్' అనే మాట వినే ఉంటారు. ఏదైనా సరే దీర్ఘకాలం పాటు వాడకపోతే, అది పనిచేయడం మానేస్తుంది. ఈ మాట మన మెదడుకు చక్కగా వర్తిస్తుంది. మెనోపాజ్ సమయంలో ఎదురయ్యే కొన్ని చికాకులతో కొంతమంది నిర్లిప్తంగా మారిపోతుంటారు. ఇలా కావడం వల్ల మెదడు పనితీరు కూడా తగ్గిపోతుంది. దాన్ని అధిగమించాలంటే మెదడుకు కూడా తగినంత పని చెప్పాలి. చురుగ్గా ఉండాలి. అలాంటప్పుడే మానసిక ఆరోగ్యం మన సొంతమవుతుంది.
* మనం ఆరోగ్యంగా ఉన్నామా? లేదా? అని నిర్ధరించుకోవడం కూడా ఈ సమయంలో ముఖ్యమే.. దీనికోసం చేయించుకోవాల్సిన పరీక్షలు కొన్నున్నాయి. 40 సంవత్సరాలు వచ్చిన దగ్గర్నుంచి మమోగ్రామ్, పాప్‌స్మియర్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్ టెస్ట్, బీపీ చెకప్.. లాంటివి చేయించుకుంటూ ఉండాలి. మెనోపాజ్ వచ్చిన తర్వాత ఐదేళ్లకోసారి బోన్ డెన్సిటీ టెస్ట్ కూడా చేయించుకోవాలి..
ఈ విధంగా జీవనశైలిలో కొన్ని మార్పులు పాటిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే మెనోపాజ్ దశలోనూ మామూలుగానే ఉండటానికి అవకాశం ఉంటుంది.

women icon@teamvasundhara
leave-these-health-habits-in-your-20s

ఇరవైల్లో ఉన్నారా? అయితే ఇలా చేయద్దు...

ఇరవయ్యేళ్ల వయసు.. టీనేజ్ దాటేశాం అన్న పెద్దరికం ఓవైపైతే.. పూర్తి చేయాల్సిన చదువులు.. కెరీర్‌లో చేరాల్సిన తీరం.. ఇంకా చేయాల్సింది చాలానే ఉందంటూ మనల్ని చిన్నవారిగా మారుస్తాయి. ఓ మహిళ జీవితంలో ఇరవై నుంచి ముప్ఫై ఏళ్ల వయసు చాలా మార్పులనే తీసుకొస్తుంది. కెరీర్‌లో తాము కావాలనుకున్న స్థాయికి చేరుకోవాలన్నా.. అంతకుమించిన ఉన్నత చదువులు చదవాలన్నా.. నచ్చిన వరుడిని పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాలన్నా ఈ పదేళ్లలోనే జరగడం పరిపాటి.. అందుకే ఈ పదేళ్ల సమయం మహిళల జీవితంలో చాలా ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. కానీ చాలామంది ఈ వయసులో ఆరోగ్యంపై సరైన శ్రద్ధ చూపకపోవడం వల్ల వివిధ అనారోగ్య సమస్యల బారిన పడడమే కాకుండా.. జీవితంలో ముందుముందు మరిన్ని ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టేలా తమ జీవన శైలిని మార్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఇరవైల వయసులో ఉన్న అమ్మాయిలు ఆరోగ్యం విషయంలో చేసే కొన్ని తప్పులేంటో తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
how-to-reduce-my-breast-size?
women icon@teamvasundhara
things-to-avoid-during-periods

పిరియడ్స్ సమయంలో కలయిక మంచిదేనా?

పిరియడ్స్.. రోజు కంటే ఈ ఐదు రోజులూ కాస్త భిన్నం.. నొప్పి, చిరాకు, మూడ్ స్వింగ్స్.. వంటివి ఈ సమయంలో కామన్. అయితే కొంతమంది నెలసరి సమయంలో నొప్పితో ఏమీ చేయాలనిపించక సైలెంట్‌గా ఉండిపోతారు. మరికొందరేమో రోజూ లాగే అన్ని పనులూ చేసేస్తుంటారు. కానీ నెలసరి సమయంలో చేయకూడని కొన్ని పనులు కూడా ఉన్నాయంటున్నారు గైనకాలజిస్టులు. వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లిపోతే ఆ ప్రభావం మన ప్రత్యుత్పత్తి వ్యవస్థపై పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ, పిరియడ్స్ సమయంలో చేయకూడని ఆ పనులేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
expert-suggestion-on-irregular-periods-in-telugu
women icon@teamvasundhara
best-foods-to-boost-your-brain-and-memory-in-telugu

women icon@teamvasundhara
expert-suggestion-on-seizures-in-pregnancy-in-telugu

ప్రెగ్నెన్సీలో ఫిట్స్‌ వస్తే ఎలాంటి సమస్యలొస్తాయి?

నమస్తే డాక్టర్‌. నా వయసు 33 ఏళ్లు. గర్భం ధరించిన తర్వాత మూడో నెలలో నాకు ఫిట్స్‌ (సీజర్స్‌) వచ్చాయి. ఆ తర్వాత ఒక్కోసారి రోజులో నాలుగైదు సార్లు వచ్చేవి. న్యూరాలజిస్ట్‌ని సంప్రదిస్తే ఎక్కువ డోస్‌ మందులు వాడమన్నారు. నాకు ఏడో నెలలోనే సిజేరియన్‌ అయింది. బాబు పుట్టాడు. ఐదేళ్ల క్రితం నేను MTS బ్రెయిన్‌ సర్జరీ చేయించుకున్నా. ఆ తర్వాత ఫిట్స్‌ సమస్య క్రమంగా తగ్గిపోయింది. అయితే అప్పుడప్పుడూ టెన్షన్‌ పడితే మళ్లీ సమస్య తలెత్తుతోంది. ఇలాంటి సమయంలో నేను రెండో బేబీ కోసం ప్లాన్‌ చేసుకోవచ్చా? పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడా? దయచేసి చెప్పండి. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
foods-that-will-keep-you-warm-during-winter-in-telugu

women icon@teamvasundhara
winter-2020-fruits-to-include-in-your-diet-to-boost-immunity

women icon@teamvasundhara
ways-to-make-diwali-diabetes-friendly

షుగర్ ఉంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

పండగ ఏదైనా ఆ పండక్కి సంబంధించిన పూజలు, వ్రతాలతో పాటు ఆ సందర్భంగా చేసుకునే పిండి వంటలూ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తాయి. అందులోనూ దీపావళి పిండి వంటలనగానే ముందుగా గుర్తొచ్చేవి స్వీట్లు. ఈ పండక్కి మిఠాయిలను ఇంట్లో తయారుచేయడమే కాదు.. బయట నుంచి కొనుగోలు చేయడం, వాటిని నలుగురికీ పంచుతూ ఆనందించడం మన సంప్రదాయం. అయితే నోరూరించే ఈ స్వీట్లను చూడగానే మనసును అదుపు చేసుకోవడం కాస్త కష్టమే. ఎప్పుడెప్పుడు వాటిని రుచి చూస్తామా అన్న ఆతృతే మనలో ఎక్కువగా ఉంటుంది. మరి, మనమే ఇలా ఉంటే నిత్యం స్వీట్లకు ఆమడ దూరంలో ఉండే మధుమేహుల పరిస్థితి ఏంటి..? 'పండగే కదా కాస్త రుచి చూస్తే ఏం కాదులే..' అంటూ వారూ కొద్దికొద్దిగా స్వీట్లను లాగించేస్తుంటారు. కానీ అది వారి ఆరోగ్యానికి ఎంత మాత్రమూ మంచిది కాదు. కేవలం స్వీట్లే కాదు.. ఈ పండక్కి చేసే ఇతర పిండి వంటలూ అధికంగా తినడం వల్ల వారి ఆరోగ్యానికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం, ప్రత్యామ్నాయ మార్గాల్ని అనుసరించడం.. వంటివి చేస్తే ఈ దీపావళి వారికీ మరింత తియ్యదనాన్ని పంచుతుంది.

Know More

women icon@teamvasundhara
ways-to-healthy-in-winter-season
women icon@teamvasundhara
tips-to-convenient-in-periods-in-telugu

ఇలా చేస్తే ఆ 'ఇబ్బంది' ఉండదు!

నెలసరి.. ఆడవారిని నెలనెలా పలకరించే ఈ పిరియడ్స్ వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఎదురవడం సహజం. కడుపునొప్పి, నడుంనొప్పి, చికాకు, ఒత్తిడి, ఆందోళన.. ఇలా ఈ సమయం మహిళల్ని చాలా రకాలుగానే ఇబ్బంది పెడుతుంటుంది. అయితే ప్రతి నెలా ఎదురయ్యే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి కొందరు మాత్రలు వేసుకోవడం మనం గమనిస్తూనే ఉంటాం. కానీ ఇలా ప్రతి చిన్నదానికీ తరచూ మాత్రలు వేసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి నెలసరి సమయంలో సౌకర్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవన్నీ ఆ సమయంలో ఎదురయ్యే అనారోగ్యాల నుంచి మనకు విముక్తి కలిగేలా చేస్తాయి. ఇంతకీ సౌకర్యవంతమైన పిరియడ్స్ కోసం ఏం చేయాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
i-didnt-get-periods-after-family-planning-in-telugu
women icon@teamvasundhara
why-sooji-halwa-is-healthy-for-this-festive-season?-a-new-post-by-celebrity-nutritionist-rujuta-diwekar

అందుకే పండగ సీజన్లో ఈ హల్వా తినాలట!

పండగంటే చాలు.. దేవుడికి నైవేద్యంగా సమర్పించే పదార్థాల్లో రవ్వ కేసరి/హల్వా తప్పకుండా ఉంటుంది. పాలు, నెయ్యి, నట్స్‌, డ్రైఫ్రూట్స్‌.. వంటి ఎన్నో ఆరోగ్యకరమైన పదార్థాలు మిళితం చేసి చేసే ఈ హల్వాను దేవుడికి నైవేద్యం పెట్టాక ఎప్పుడెప్పుడు ప్రసాదంగా స్వీకరిస్తామా అని ఆతృతగా ఎదురుచూస్తుంటాం.. కానీ కొంతమంది ఇందులో వాడే చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదంటూ దీన్ని తినడమే మానేస్తుంటారు. అలాంటి అపోహను వీడమంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. బయట దొరికే ప్రాసెస్డ్‌ ఫుడ్ కంటే ఇంట్లో చేసుకున్న ఏ పదార్థమైనా ఆరోగ్యకరమే అంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టారామె. అంతేకాదు.. ఏదైనా అతిగా తింటే విషం, మితంగా తింటే అమృతం అన్న మాటను మరోసారి గుర్తుచేశారు కూడా! మరి, ఈ పండగ సీజన్లో రుజుత హల్వా ఎందుకు తినమంటున్నారో? దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో? తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
abdominal-pain-may-be-a-symptom-of-other-health-problems-in-woman

ఈ నొప్పుల విషయంలో అశ్రద్ధ వద్దు!

సాధారణంగా మహిళల్లో నెలసరి సమయంలో పొత్తికడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. కేవలం పిరియడ్స్ అప్పుడే కాకుండా మరికొన్ని సందర్భాల్లో కూడా కడుపునొప్పి రావడం మనం గమనిస్తూనే ఉంటాం. దీనికి సరైన కారణమేంటో చాలామందికి తెలియకపోవచ్చు. పైగా ఇది చిన్న సమస్యే కదా అని దాన్ని అశ్రద్ధ చేయడం లేదా గృహచిట్కాలు పాటించడం.. అదీ కాదంటే మాత్రలు వేసుకోవడం.. ఇలా దాన్నుంచి ఏదోలాగా ఉపశమనం పొందుతుంటాం. అయితే ఇలా చేసే ముందు నొప్పి వస్తున్న విధానాన్ని బట్టి అది మనలో ఎలాంటి ఆరోగ్య సమస్యలకు సూచనో తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. తద్వారా నొప్పిని గుర్తించి, దాన్ని వైద్యులకు వివరించి సరైన చికిత్స పొందే అవకాశం కూడా ఉంటుంది.

Know More

women icon@teamvasundhara
home-remedies-for-sore-throat

గొంతునొప్పికి వీటితో చెక్‌ పెట్టేయండి !

ఎండాకాలం, వానాకాలం, శీతాకాలంలో.. ఏ కాలం ఎక్కువ ఇష్టం ? అని ఎవరినైనా అడిగితే.. చాలామంది చెప్పే సమాధానం శీతాకాలమే ! తెల్లని పొగ మంచు పరిచే చల్లదనంలో.. వెచ్చదనం కోసం వెతికే ఆరాటం చాలామందికి మహా సరదాగా ఉంటుంది. అయితే ఈక్రమంలో కొన్ని ఇబ్బందులు మన ఆనందానికి అవరోధంగా మారుతుంటాయి. వాటిలో ఎక్కువ బాధించేది ఒకటుంది. అదే గొంతు నొప్పి ! చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఏమైనా తాగాలన్నా, తినాలనిపించినా గొంతులో ముల్లు దిగినట్లనిపిస్తుంటుంది. కొంతమందికైతే మాట్లాడటానికి మాట కూడా రానివ్వకుండా చేస్తుందీ గొంతునొప్పి. మరిలా ఇబ్బంది పెట్టే ఈ గొంతు నొప్పిని దూరం చేసుకోవడం ఎలా ? ట్యాబ్లెట్‌ వేసుకుంటే సరి అంటారా ? సైడ్‌ ఎఫెక్టులతో ఎందుకొచ్చిన ఇబ్బంది ! చక్కగా ఈ హోమ్‌ రెమెడీస్‌ని ఫాలో అయిపోండి.

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-ovary-problems-in-telugu
women icon@teamvasundhara
pregnant-kareena-kapoor-khan-shares-her-diet-tips-for-expectant-moms-in-an-interview

women icon@teamvasundhara
how-to-avoid-morning-sickness-during-pregnancy-in-telugu

‘వేవిళ్లు’ తగ్గాలంటే ఇలా చేయండి!

చాలామంది మహిళల్లో గర్భం ధరించిన మొదట్లో (సుమారు ఆరు నుంచి పన్నెండు వారాల మధ్యలో) వాంతులవడం, నీరసంగా అనిపించడం.. వంటి పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. దీన్నే 'మార్నింగ్ సిక్‌నెస్' అంటారు. సాధారణ భాషలో దీనినే 'వేవిళ్లు'గా వ్యవహరిస్తారు. ఈ సమయంలో శరీరంలో హార్మోన్లలో కలిగే మార్పులు, విటమిన్ల లోపం, ఒత్తిడి, ఆందోళన, మలబద్ధకం, వ్యాయామం లోపించడం.. వంటి వివిధ కారణాల వల్ల ఈ సమస్య ఎదురవుతుంటుంది. దీంతో ఏమవుతుందో ఏమోనని కొంతమంది మహిళలు భయాందోళనలకు గురవుతుంటారు. ఈ క్రమంలో 'మార్నింగ్ సిక్‌నెస్' సమస్యను సహజసిద్ధంగా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-stomach-pain-in-pregnancy-in-telugu

ఆ ప్రమాదం వల్ల రెండోసారి ప్రెగ్నెన్సీలో సమస్యలొస్తాయా?

నమస్తే డాక్టర్‌. నా వయసు 35 ఏళ్లు. ప్రస్తుతం నేను ఏడో నెల గర్భవతిని. రెండేళ్ల క్రితం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆరో నెలలో బాత్రూమ్‌లో జారిపడ్డాను. అప్పుడు కడుపులోని బేబీ మాయ నుంచి సెపరేట్‌ అయింది. Hysterotomy సర్జరీ ద్వారా బాబుని బయటికి తీశారు. కానీ బాబు చనిపోయాడు. అయితే ముందు జరిగిన ప్రమాదం వల్ల ఇప్పుడు దుష్ప్రభావాలేమైనా ఎదురవుతాయా? గర్భం ధరించినప్పటి నుంచి నేను బెడ్‌ రెస్ట్‌లోనే ఉన్నాను. ఈ మధ్య నాకు అప్పుడప్పుడూ పొట్టలో ఎడమవైపు కాస్త నొప్పి వస్తుంది. స్కాన్‌ చేసి చూసి సమస్యేమీ లేదన్నారు. అయినా భయంగానే ఉంది.. సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
how-to-boost-immunity-during-pregnancy-amid-pandemic-in-telugu
women icon@teamvasundhara
health-benefits-of-custard-apple-in-telugu

మధుర ఫలం.. ‘ఇమ్యూనిటీ’కి బలం!

ప్రకృతి ప్రసాదించే అద్భుతమైన పండ్లలో సీతాఫలం కూడా ఒకటి. సాధారణంగా ఈ పండ్లు సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్య ఎక్కువగా లభిస్తాయి. కొన్ని గుండ్రంగా, కొన్ని హృదయాకారంలో.. ఉండే ఈ పండ్లను ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. ఎంతో రుచికరంగా ఉండే సీతాఫలాలు ఆరోగ్యానికీ ఎంతో అవసరం. ఇందులో ఎ, సి, బి6 వంటి విటమిన్లతో పాటు కాపర్, పొటాషియం, పీచు.. వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. పైగా ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది కూడా! కాబట్టి ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఈ పండు తినడం శ్రేయస్కరం. మరి, ఈ మధుర ఫలంలో ఉన్న పోషకాలేంటి? అవి ఆరోగ్యానికి ఏ విధంగా ఉపకరిస్తాయో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
how-to-cope-with-early-menopause?-in-telugu
women icon@teamvasundhara
top-10-winter-super-foods-by-celebrity-nutritionist-rujuta-diwekar-in-telugu

శీతాకాలంలో ఈ సూపర్‌ఫుడ్స్‌ ఎందుకు తీసుకోవాలో తెలుసా?

కాలాలు మారుతున్న కొద్దీ మనలో రోగనిరోధక వ్యవస్థ పనితీరు మందగించి పలు అనారోగ్యాలు తలెత్తడం సహజం. అయితే ఆయా కాలాల్లో వచ్చే వాతావరణ మార్పులకు మన శరీరం అలవాటు పడడానికి కొంత సమయం పట్టడమే అందుకు కారణం. ముఖ్యంగా శీతాకాలంలో వాతావరణ ప్రభావం మన ఆరోగ్యంపై తీవ్రంగానే ఉంటుంది. ఈ క్రమంలో జలుబు, దగ్గు, ఆస్తమా.. వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యల దగ్గర్నుంచి చర్మం పొడిబారడం, జుట్టు రాలిపోవడం.. వంటి సౌందర్య సమస్యల దాకా పలు రకాల అనారోగ్యాలు ఇబ్బంది పెడుతుంటాయి. దీనికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కూడా మన రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపేందుకు రడీగా ఉంది. మరి, ఇలాంటి సమయంలో మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడమంటే కత్తి మీద సామే అని చెప్పాలి.

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-second-time-pregnancy-in-telugu
women icon@teamvasundhara
rujuta-diwekar-shares-some-tips-to-prevent-health-problems-while-eating-festival-meal
women icon@teamvasundhara
how-iron-deficiency-affect-your-menstrual-flow?-diet-tips-to-overcome-this-problem

నెలసరి సమస్యలు తగ్గాలంటే ఐరన్ తీసుకోవాల్సిందే!

నెలసరి సమయంలో బ్లీడింగ్‌ ఎక్కువగా అవడం వల్ల రక్తహీనత తలెత్తడం మనకు తెలిసిందే. అందుకే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇనుము అధికంగా లభించే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అది సరే కానీ.. మరి రక్తహీనత ఉన్నప్పుడు కూడా నెలసరి సమయంలో మన శరీరంలో నుంచి ఎక్కువ మొత్తంలో రక్తం బయటికి వెళ్లిపోతుంటుంది.. అలా ఎందుకు జరుగుతుంది? అనే సందేహం మనలో చాలామందికి వచ్చే ఉంటుంది. నెలసరికి, రక్తహీనతకు మధ్య ఉన్న అవినాభావ సంబంధమే అందుకు కారణమంటున్నారు నిపుణులు. మరి, ఇంతకీ ఏంటా సంబంధం? ఐరన్‌ లోపం తలెత్తకుండా, తద్వారా పిరియడ్‌ సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వంటి విషయాల గురించి తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
follow-these-safety-guidelines-while-eating-in-the-office-cafeteria-in-telugu
women icon@teamvasundhara
fasting-guidelines-for-auspicious-navratri-festival-in-telugu

నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే!

ఏదైనా పండగొచ్చిందంటే చాలు.. మనలో చాలామంది ఉపవాసానికి ఉపక్రమిస్తుంటారు. అయితే వీరిలోనూ కొంతమంది చాలా నిష్ఠగా ఉండాలని రోజంతా ఏమీ తినకుండా కడుపు మాడ్చుకుంటుంటారు. నిజానికి ఉపవాసం పేరుతో అలా కడుపు మాడ్చుకోవడం వల్ల లేనిపోని అనారోగ్యాల బారిన పడతామంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు నమామీ అగర్వాల్‌. నిర్ణీత వ్యవధుల్లో సాత్వికాహారం తీసుకుంటూ అటు శరీరానికి శక్తిని అందిస్తూనే, ఇటు ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు. దసరా నవరాత్రోత్సవాలు ప్రారంభమైన సందర్భంగా ఈ తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉంటూ అమ్మవారిని కొలిచే అతివల కోసం కొన్ని చిట్కాలను సైతం అందించారామె. మరి, నవరాత్రుల్లో ఆరోగ్యానికి లోటు లేకుండా, ఉత్సాహం తగ్గకుండా ఉపవాసం ఉండాలంటే నమామి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
ankita-konwar-shares-blue-tea-recipe-its-health-benefits-in-telugu

ఈ బ్లూ టీతో ఎన్నో ప్రయోజనాలున్నాయట!

రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి, పనులతో కలిగే అలసటను తీర్చుకోవడానికి, చదువుకునేటప్పుడు నిద్ర రాకుండా ఉండడానికి.. ఇలా ప్రతి సందర్భంలోనూ టీ లేదా కాఫీ తాగడం చాలామందికి అలవాటు. నిజానికి రోజుకు ఒకటి లేదా రెండు కప్పులైతే పర్లేదు కానీ కొంతమంది వీటిని మరీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దీంతో వీటిలోని కెఫీన్‌ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే వీటికి బదులుగా హెర్బల్‌ టీ తాగడం మేలని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఆ కోవకు చెందిందే శంఖు పుష్పంతో చేసిన ఛాయ్‌ (బ్లూ టీ). ఇక ఈ టీతో ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలున్నాయని చెబుతోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. తాను ఈ బ్లూ టీ తాగుతోన్న ఫొటోను ఇటీవలే ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. దాన్నెలా తయారు చేసుకోవాలి? ఇందులో దాగున్న ఆరోగ్య రహస్యాలేంటో సుదీర్ఘ పోస్ట్‌ రూపంలో రాసుకొచ్చింది మిసెస్‌ సోమన్.

Know More

women icon@teamvasundhara
masaba-gupta-shares-her-immunity-drink-and-her-healthy-food-habits-in-telugu

ఇలా ఇమ్యూనిటీని పెంచుకుంటా!

అందం, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌.. ఈ విషయాల గురించి మనమే ఎంతో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామంటే.. ఇక ఎప్పుడూ కెమెరా కంటికి చిక్కే సెలబ్రిటీలు ఇంకెంత శ్రద్ధగా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పైగా కరోనా వచ్చిన దగ్గర్నుంచి ఆరోగ్యం విషయంలో ఏమాత్రం రాజీ పడట్లేదు చాలామంది ప్రముఖులు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వారు పాటించే ఇమ్యూనిటీ టిప్స్‌, ఆరోగ్య రహస్యాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తమ ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపుతున్నారు. ప్రముఖ ఫ్యాషనర్‌ మసాబా గుప్తా కూడా తాజాగా అదే పని చేసింది. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి తాను తీసుకుంటోన్న ఓ ఇమ్యూనిటీ షాట్‌ రెసిపీని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకుంది.. అంతేనా.. తాను పాటించే రోజువారీ ఆహార నియమాలేంటో కూడా చెప్పుకొచ్చిందీ ఫ్యాషన్‌ డిజైనర్.

Know More

women icon@teamvasundhara
painful-periods?-rujuta-diwekar-shares-some-super-foods-to-deal-with-pms-and-period-pain

ఈ సూపర్‌ ఫుడ్స్‌తో నెలసరి నొప్పుల్ని తగ్గించుకుందాం!

నెలసరి దగ్గర్లో ఉందంటే చాలు.. చాలామంది మహిళల్లో ఏదో తెలియని నిరుత్సాహం, నిస్సత్తువ ఆవహిస్తుంటాయి. ఇందుకు కారణం ఆ సమయంలో తలెత్తే అనారోగ్యాలే! ముఖ్యంగా పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి, మూడ్‌ స్వింగ్స్.. ఇలాంటివన్నీ నెలనెలా పిరియడ్స్‌ సమయంలో మనం ఎదుర్కొనేవే! అయితే వీటి ప్రభావం అటు వ్యక్తిగతంగా, ఇటు వృత్తిపరంగా తీవ్రంగానే ఉంటుందని చెప్పాలి. అందుకే ఈ నెలసరి నొప్పుల్ని అధిగమించడానికి కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. ఇటీవలే ఓ వెబినార్‌లో పాల్గొన్న ఆమె.. నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి తీసుకోవాల్సిన కొన్ని సూపర్‌ ఫుడ్స్‌ గురించి చెప్పుకొచ్చారు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
these-home-remedies-may-cure-vaginal-white-discharge-in-telugu
women icon@teamvasundhara
common-myths-and-facts-about-vegetarian-diets-in-telugu

శాకాహారం గురించి మీకూ ఇలాంటి అపోహలు ఉన్నాయా?

మమతకు చిన్నతనం నుంచి పర్యావరణమన్నా, మూగ జీవాలన్నా ఎనలేని ప్రేమ. అందుకే పుట్టినప్పట్నుంచి తను నాన్ వెజ్ మొహం చూసింది లేదు. తనే కాదు.. తన కుటుంబ సభ్యుల్ని కూడా శాకాహారులుగానే మార్చేసిందామె. అయితే వెజిటేరియన్‌ డైట్‌తో పోషకాలన్నీ అందవని తన ఫ్రెండ్‌ చెప్పగా విని అది ఎంత వరకు నిజమో తెలుసుకోవడానికి న్యూట్రిషనిస్ట్‌ని సంప్రదించింది. సమత గ్యాస్ట్రిక్‌, ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతోంది. దీంతో డాక్టర్‌ సలహా మేరకు కొన్ని రోజుల దాకా మాంసాహారానికి దూరంగా ఉండాలనుకుంది. అయితే శాకాహారంతో పూర్తి ప్రొటీన్లు పొందలేనేమో అని సందేహిస్తోంది.

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-vaginal-itching-in-telugu
women icon@teamvasundhara
daily-habits-that-harm-the-heart-in-telugu

మీ గుండె పదిలమేనా? చెక్ చేసుకోండి..

గుండె.. శరీరంలో ఇది ఎంత ముఖ్యమైన భాగమో అందరికీ తెలిసిందే! అయితే మనకి ఉండే కొన్ని చిన్న చిన్న అలవాట్లే దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయట! ఎక్కువ సమయం అదే పనిగా కూర్చుని టీవీ చూడడం దగ్గర్నుంచి ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోకపోవడం వరకు రకరకాల అలవాట్లు హృదయ సంబంధిత సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. ఇంతకీ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆ చిన్న చిన్న అలవాట్లు ఏంటో ఓసారి మనమూ తెలుసుకుందాం రండి.. శరీరం అంతటికీ రక్తాన్ని సరఫరా చేసే ముఖ్య అవయవం గుండె. రక్తం ద్వారా ఆయా శరీర భాగాలకు ఆక్సిజన్ అందించడంలో దీని పాత్ర చాలా కీలకమైంది. అందుకే గుండె ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే మనకి ఉండే కొన్ని చిన్న చిన్న అలవాట్లే దీర్ఘకాలంలో హృదయం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి దాని పనితీరుని దెబ్బతీసే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.

Know More

women icon@teamvasundhara
foods-to-take-for-a-healthy-heart-in-telugu
women icon@teamvasundhara
natural-ways-to-stop-burping-in-telugu
women icon@teamvasundhara
is-pains-after-birth-normal?-in-telugu
women icon@teamvasundhara
natural-remedies-to-cure-mouth-ulcers-in-telugu

నోటి పూతతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి..!

మనం తీసుకునే ఆహారంలో పోషకాలు తగ్గిపోతే రకరకాల ఆరోగ్య సంబంధ సమస్యలు తలెత్తుతాయి. అందులో నోటిపూత కూడా ఒకటి. శరీరంలో వేడి ఎక్కువవడం, అధిక ఒత్తిడికి గురవడం, డీహైడ్రేషన్.. ఇలా పలు కారణాల వల్ల నోటి లోపల చిగుళ్లపై, బుగ్గలకు లోపలి వైపు గాయం మాదిరిగా ఏర్పడతాయి. ఇవి చూడడానికి గుండ్రంగా, చుట్టూ ఎర్రగా ఉండి దాని మధ్యలో తెల్లగా లేదా బూడిద రంగులో ఉంటాయి. వీటివల్ల వచ్చే నొప్పి మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. బ్రష్ చేసుకునేటప్పుడు, ఏదైనా తిన్నప్పుడు.. ఆఖరికి తియ్యటి పదార్థం తిన్నా సరే.. ఈ గాయానికి తగిలితే చాలు.. చాలా నొప్పి వస్తుంది. ఫలితంగా అసౌకర్యంగా, ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ క్రమంలో సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని సహజసిద్ధమైన మార్గాలున్నాయి. అవేంటో చూద్దామా??

Know More

women icon@teamvasundhara
ways-to-overcome-stress-eating

ఒత్తిడిలో ఎక్కువగా తినేస్తున్నారా?

'వాడిని చంపేయాలి.. అస్సలు నేనంటే లెక్కేలేదు..' అని తిట్టుకుంటూ ప్యాకెట్ల మీద ప్యాకెట్లు చిప్స్ ఖాళీ చేసేస్తోంది నా ఫ్రెండ్ మాధవి.. విషయమేంటా అని కనుక్కుంటే తన లవర్‌తో ఓ చిన్న గొడవ. ఆ తర్వాత నేను సర్దిచెప్పడం, తను ఫోను చేసి నార్మల్‌గా మాట్లాడటం జరిగిపోయాయనుకోండి.. కానీ మాధవికున్న ఓ అలవాటు తనని తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. ఎవరి మీదైనా కోపంగా ఉన్నప్పుడు లేదా ఒంటరిగా ఫీలైనప్పుడు ఏదోటి తింటూ ఉండటం తనకలవాటు..! మాధవిలాంటి వాళ్లు చాలామందే ఉండొచ్చు.. వీళ్లనే 'ఎమోషనల్ ఈటర్స్' అంటారట.. మూడ్ బాగోలేనప్పుడు ఏదోటి తింటూ ఉండటం వల్ల తొందరగా బరువు పెరిగిపోతారు. ఇలాంటి సందర్భాల్లో తినాలన్న కోరికను అదుపు చేసుకోవాలి. ఒకవేళ అది సాధ్యం కాదనుకున్నప్పుడు జంక్‌ఫుడ్ జోలికి పోకుండా, మన మూడ్ మారడంతో పాటు, ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహారాన్ని తీసుకోవాలి.

Know More