scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

gynecologist Ask Gynecologist Expert
ఓ సోదరి.

ఫైబ్రాయిడ్ ఉంది.. ఏ చికిత్స మంచిది?

హాయ్‌ డాక్టర్‌. నా చెల్లెలి వయసు 44 ఏళ్లు. తను Schizophrenia పేషెంట్‌. ఇప్పుడు నార్మల్‌ కండిషన్‌లోనే ఉంది. తనకు ఇప్పుడు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. అయితే ఇటీవల పిరియడ్స్‌లో హెవీ బ్లీడింగ్‌, కడుపులో నొప్పి రావడంతో డాక్టర్‌ని సంప్రదించాం. డాక్టర్‌ సలహా మేరకు స్కానింగ్‌ తీయించాం. గర్భాశయం లోపల ఫైబ్రాయిడ్‌ ఏర్పడిందని చెప్పారు. దాని పరిమాణం 7.3×7.2×7.1 సెంటీమీటర్‌గా ఉంది. అయితే డాక్టర్‌ మాకు రెండు సలహాలిచ్చారు. ఒకటి - నాలుగు నెలల వరకు ఇంజెక్షన్‌ ద్వారా హార్మోన్లను తాత్కాలికంగా అదుపు చేయడం.. అలా చేయడం వల్ల ఫైబ్రాయిడ్‌ పరిమాణం తగ్గుతుంది.. ఆ తర్వాత మయోమా చేయచ్చన్నారు. రెండోది - ఫైబ్రాయిడ్‌ ఎంబోలైజేషన్‌ చేయడం. అయితే నా సందేహం ఏంటంటే.. ముందుగా తాత్కాలికంగా హార్మోన్లను కంట్రోల్‌ చేసి (ఆపి), ఫైబ్రాయిడ్‌ పరిమాణం తగ్గిన తర్వాత ఫైబ్రాయిడ్‌ ఎంబోలైజేషన్‌ చేయచ్చా? ఈ రెండు చికిత్సల్లో దేనివల్లనైనా దుష్పరిణామాలు ఎదురవుతాయా? అలాగే భవిష్యత్తులో నా చెల్లికి పిల్లలు పుట్టే అవకాశం ఉందా? చెప్పండి.


Know More

Video Gallery

Movie Masala

 
category logo

ఇంట్లోనే ఈ పోషకాలుండగా.. కరోనా వేళ అమ్మకు భయమేల?!

National Nutrition Month, Nutritional Diet for Pregnant women in Telugu

శ్రీనిత ఈమధ్యే నెల తప్పింది. కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో భయంభయంగానే రెగ్యులర్‌ చెకప్స్‌కి వెళ్తోంది. అయితే ఇది తనకు తొలుచూరు గర్భం కావడంతో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తనకు సరిగ్గా అవగాహన లేదు.. పైగా ఆహారం విషయంలో ఆమెకు కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి.
శ్రీవల్లికి ఇప్పుడు ఏడో నెల.. తనకు ముందునుంచీ రక్తం కాస్త తక్కువగా ఉండడంతో డాక్టర్‌ సలహా మేరకు ఐరన్‌ సప్లిమెంట్స్‌ వాడుతోంది.. ఇంజెక్షన్స్‌ తీసుకుంటోంది. వీటితో పాటు ఐరన్‌ ఎక్కువగా లభించే ఆహార పదార్థాల కోసం ఆన్‌లైన్‌లో వెతికింది. కానీ వాటిలోనూ తనకెన్నో అనుమానాలు..
ఇలా కాబోయే అమ్మలు వేసే ప్రతి అడుగులోనూ ఎన్నో సందేహాలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా తమ కడుపులో పెరుగుతోన్న బిడ్డ ఎదుగుదల గురించే అనుక్షణం ఆలోచిస్తుంది అమ్మ మనసు. అయితే ఇలా కాబోయే తల్లులందరికీ తాము తీసుకునే పోషకాహారం విషయంలో పూర్తి అవగాహన ఉండచ్చు.. ఉండకపోవచ్చు! అలాగని దీని గురించి అంతగా ఆలోచించాల్సిన, భయపడాల్సిన పనిలేదని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మన వంటింట్లోనే వివిధ పోషకాలతో కూడిన పదార్ధాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మరి, ‘జాతీయ పోషకాహార మాసం’ సందర్భంగా కాబోయే తల్లులు తీసుకోవాల్సిన కొన్ని పోషకాలేంటో తెలుసుకుందాం రండి..
ఇటు ఇంటి పని, అటు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. మహిళలకు క్షణం కూడా తీరిక లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో వారు ప్రశాంతంగా భోజనం చేసేందుకు కూడా సమయం దొరకడం లేదు. దీనికి తోడు సమయం లేక వ్యాయామంపై దృష్టి పెట్టలేకపోతున్నారు కొందరు స్త్రీలు. ఇలాంటి బిజీ లైఫ్‌స్టైల్‌ వల్ల చాలామంది మహిళలు రక్తహీనత, థైరాయిడ్‌, మధుమేహం.. వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల్ని ఎదుర్కొంటున్నారు. ఇక గర్భం ధరించాక ఈ సమస్యలు వారికి, వారి కడుపులోని బిడ్డకు పెను శాపాలుగా మారుతున్నాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ముందు నుంచి పోషకాహారం తీసుకోవడంతో పాటు ప్రెగ్నెన్సీ సమయంలోనూ చక్కటి ఆహారపుటలవాట్లు అలవర్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

pregnantdietgh650-3.jpg
‘ఫైబర్‌’తో ఆ సమస్యకు చెక్!
గర్భం ధరించిన మహిళల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య మలబద్ధకం. అయితే పీచు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఇందుకోసం పప్పులు, బీన్స్‌, బఠానీ, బెర్రీ పండ్లు, నట్స్‌, డ్రైఫ్రూట్స్‌.. వంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే కొంతమంది సలాడ్స్‌లో భాగంగా పీచు ఎక్కువగా ఉండే క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌.. వంటివి పచ్చిగానే తీసుకుంటుంటారు. ఇలా వీటిని పచ్చిగానే తీసుకోవడం వల్ల వీటిలో ఉండే రాఫినోస్‌ అనే ట్రైశాకరైడ్‌ సమ్మేళనాలు విచ్ఛిన్నం చెందక కడుపులో గ్యాస్ట్రిక్‌ సమస్యకు కారణమవుతాయి. అందువల్ల వీటిని ఉడికించుకొనే తీసుకోవాలి.. అలా చేయడం వల్ల ట్రైశాకరైడ్‌ సమ్మేళనాలు విచ్ఛిన్నం చెంది త్వరగా జీర్ణమవుతాయి.

pregnantdietgh650-1.jpg
క్యాల్షియం కోసం..!
పుట్టబోయే బిడ్డ ఎముకల్ని దృఢంగా తయారుచేసేందుకు క్యాల్షియం సహకరిస్తుంది. గర్భం ధరించిన మహిళలు, పాలిచ్చే తల్లులు.. తల్లీబిడ్డలిద్దరి శారీరక అవసరాలను దృష్టిలో ఉంచుకొని క్యాల్షియం తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ క్రమంలో వీరు రోజుకు వెయ్యి మిల్లీగ్రాముల క్యాల్షియం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే చిన్న వయసులో గర్భం ధరించిన మహిళలకు రోజుకు 1300 మిల్లీగ్రాముల క్యాల్షియం అవసరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం పాలు, పాల పదార్థాలు, ఆకుకూరలు, గుడ్లు, సపోటా, చేపలు.. వంటివి తల్లులు తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి. అయితే ఒకవేళ తల్లి వీగన్‌ అయితే.. పాలకు బదులుగా సోయా పాలు, డ్రైఫ్రూట్స్‌, బ్రొకోలి, ఆకుకూరలు.. వంటివి తప్పనిసరిగా డైట్‌లో చేర్చుకోవాలి.

pregnantdietgh650-4.jpg
‘ఐరన్‌’ లోపం లేకుండా..!
కాబోయే తల్లుల్లో ఐరన్‌ లోపం వల్ల రక్తహీనత తలెత్తడం మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం. తద్వారా నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడం, అది కూడా తక్కువ బరువుతో పుట్టడం, ఒక్కోసారి తల్లుల్లో ఉండే ఈ రక్తహీనత బిడ్డకు ప్రాణాంతకం కావడం.. వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ముందునుంచే ఐరన్‌ లోపం లేకుండా చూసుకోమని నిపుణులు సలహా ఇస్తుంటారు. ఈ క్రమంలోనే ఆప్రికాట్స్‌, కోడిగుడ్లలోని పచ్చసొన, చేపలు, డ్రైఫ్రూట్స్‌, ఆకుకూరలు, ఆకుపచ్చటి కాయగూరలు, ఓట్స్‌, చిరుధాన్యాలు, గోధుమలు.. వంటివి తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. అయితే మాంసం ద్వారా లభించే ఐరన్‌ కంటే కాయగూరలు, పండ్ల ద్వారా వచ్చే ఐరన్‌ను శరీరం త్వరగా గ్రహిస్తుంది. కాబట్టి మాంసం, గుడ్లు.. వంటివి తీసుకున్నప్పటికీ వాటిని కాయగూరలతో కలిపి తీసుకుంటే శరీరానికి ఐరన్‌ను త్వరగా గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. ఒకవేళ మీకు మరీ రక్తహీనత ఎక్కువగా ఉంది.. సప్లిమెంట్స్‌, ఇంజెక్షన్స్‌ వాడాలనుకుంటే మాత్రం వైద్యుల సలహా మేరకే వాడాలన్న విషయం గుర్తుపెట్టుకోండి.

pregnantdietgh650-5.jpg
ఇవి కూడా!
* పుట్టబోయే బిడ్డ నాడీ వ్యవస్థ అభివృద్ధిలో అయొడిన్ పాత్ర కీలకం. గర్భిణిగా ఉన్న సమయంలో తల్లులు రోజుకు కనీసం 220 మిల్లీగ్రాముల అయొడిన్ ను తీసుకోవడం వల్ల బిడ్డలు చిన్నతనం నుంచే అద్భుతమైన తెలివితేటల్ని కలిగి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం జున్ను, పెరుగు, బంగాళాదుంపలు.. వంటి అయొడిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే చేపలు వంటి సముద్రపు ఆహారం తీసుకున్నా వారానికి పావు కిలో కంటే మించకుండా చూసుకోవడం మంచిదన్నది నిపుణుల సలహా!
* కడుపులో పెరుగుతోన్న బిడ్డ మెదడు, వెన్నెముకలో ఎలాంటి లోపాలు లేకుండా ఉండాలంటే తల్లులు ముందు నుంచే ఫోలికామ్లం అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. ఇందుకోసం ఆకుకూరలు, బ్రొకోలి, తర్బూజా, నట్స్‌, బీన్స్‌.. వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే వీటితో పాటు వైద్యుల సలహా మేరకు ఫోలికామ్లం సప్లిమెంట్స్‌ని కూడా వాడాల్సి ఉంటుంది.
* గర్భం ధరించిన మహిళలు రోజూ 80-85 మిల్లీగ్రాముల విటమిన్‌ ‘సి’ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో టొమాటో, ద్రాక్ష, నిమ్మజాతి పండ్లు, క్యాప్సికం, కివీ.. వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.

ఇవి గుర్తుంచుకోండి!

* గర్భస్థ సమయంలో బిడ్డ ఎదుగుదలకు ఎన్నో ప్రొటీన్లు, విటమిన్లతో కూడిన మాంసాహారం తినడం మంచిదే! అయితే కరోనా విజృంభిస్తోన్న ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో మాంసం, కోడిగుడ్లు.. వంటివి బాగా ఉడికించుకొని తీసుకోవడం మంచిది. తద్వారా అవి త్వరగా జీర్ణమవుతాయి కూడా!
* ఆహారం ఏ పూటకు ఆ పూటే వేడివేడిగా వండుకొని తీసుకోవాలి. ఉదయం వండినవి సాయంత్రం, రాత్రి వండినవి మరుసటి రోజు వేడి చేసుకొని తినకపోవడమే మంచిది.

pregnantdietgh650-2.jpg
* గర్భస్థ సమయంలో మహిళలు పెరిగే బరువు ఆరోగ్యకరంగానే ఉండాలి తప్ప అనారోగ్యకరంగా ఉండకూడదు. ఎందుకంటే అనారోగ్యకరమైన బరువు తల్లీబిడ్డలిద్దరిలో స్థూలకాయానికి దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో జంక్‌ఫుడ్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌, చిప్స్‌, బిస్కట్స్‌.. వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే స్వీట్స్‌.. మోతాదుకు మించకుండా చూసుకోవాలి.. లేదంటే వాటిలోని కొవ్వులు, చక్కెరలు తల్లీబిడ్డలిద్దరి ఆరోగ్యానికి మంచివి కావు.
* రోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం మంచిది. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో చల్లటి నీళ్ల కంటే బాగా మరిగించి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే నీళ్లు తాగడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.
* వీటితో పాటు నిపుణుల సలహా మేరకు, మీ ఆరోగ్య స్థితిని బట్టి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే శరీరం యాక్టివ్‌గా ఉంటుంది.
* అలాగే ఫీటల్‌ స్కానింగ్‌, రెగ్యులర్‌ చెకప్స్‌కి వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతులు శానిటైజ్‌ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

గమనిక:
గర్భం ధరించిన మహిళలు తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన పోషకాహారం గురించి తెలుసుకున్నారు కదా! అయితే ఇవన్నీ ఇంట్లోనే లభించినప్పటికీ, పోషకాలు నిండి ఉన్నప్పటికీ.. ఇంకా వీటిలో కొన్ని తీసుకోవాలా? వద్దా? అన్న సందేహాలు కొంతమంది మహిళల్లో తలెత్తుతుంటాయి. అంతేకాదు.. వీటిలోనూ అన్నీ అందరి శరీరతత్వాలకు సరిపడచ్చు.. సరిపడకపోవచ్చు..! కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవాల్సిన ఆహారం గురించి మీకున్న సందేహాలను మీలోనే దాచుకోకుండా.. సంబంధిత నిపుణులను సంప్రదించి నివృత్తి చేసుకోవడం శ్రేయస్కరం!





gynecologist Ask Gynecologist
ఓ సోదరి.

ఫైబ్రాయిడ్ ఉంది.. ఏ చికిత్స మంచిది?

హాయ్‌ డాక్టర్‌. నా చెల్లెలి వయసు 44 ఏళ్లు. తను Schizophrenia పేషెంట్‌. ఇప్పుడు నార్మల్‌ కండిషన్‌లోనే ఉంది. తనకు ఇప్పుడు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. అయితే ఇటీవల పిరియడ్స్‌లో హెవీ బ్లీడింగ్‌, కడుపులో నొప్పి రావడంతో డాక్టర్‌ని సంప్రదించాం. డాక్టర్‌ సలహా మేరకు స్కానింగ్‌ తీయించాం. గర్భాశయం లోపల ఫైబ్రాయిడ్‌ ఏర్పడిందని చెప్పారు. దాని పరిమాణం 7.3×7.2×7.1 సెంటీమీటర్‌గా ఉంది. అయితే డాక్టర్‌ మాకు రెండు సలహాలిచ్చారు. ఒకటి - నాలుగు నెలల వరకు ఇంజెక్షన్‌ ద్వారా హార్మోన్లను తాత్కాలికంగా అదుపు చేయడం.. అలా చేయడం వల్ల ఫైబ్రాయిడ్‌ పరిమాణం తగ్గుతుంది.. ఆ తర్వాత మయోమా చేయచ్చన్నారు. రెండోది - ఫైబ్రాయిడ్‌ ఎంబోలైజేషన్‌ చేయడం. అయితే నా సందేహం ఏంటంటే.. ముందుగా తాత్కాలికంగా హార్మోన్లను కంట్రోల్‌ చేసి (ఆపి), ఫైబ్రాయిడ్‌ పరిమాణం తగ్గిన తర్వాత ఫైబ్రాయిడ్‌ ఎంబోలైజేషన్‌ చేయచ్చా? ఈ రెండు చికిత్సల్లో దేనివల్లనైనా దుష్పరిణామాలు ఎదురవుతాయా? అలాగే భవిష్యత్తులో నా చెల్లికి పిల్లలు పుట్టే అవకాశం ఉందా? చెప్పండి.


Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-vaginal-itching-in-telugu

అక్కడ మంట, దురద.. కలయికలో నొప్పి.. ఎందుకిలా?

నమస్తే డాక్టర్‌. నా వయసు 32 ఏళ్లు. ఎత్తు 5’2’’. బరువు 55 కిలోలు. నాకు పిల్లల్లేరు. గత 12 ఏళ్లుగా టైప్‌-1 డయాబెటిస్‌, నాలుగేళ్లుగా బీపీ, Proteinuriaతో బాధపడుతున్నా. నాకు ఒక్కోసారి షుగర్‌ స్థాయులు అదుపు తప్పుతుంటాయి. కలయికలో పాల్గొన్నప్పుడు నొప్పిగా అనిపిస్తోంది. వెజైనా దగ్గర దురదగా, మంటగా ఉంటుంది. Labia Majora Itching వల్ల వెజైనా దగ్గర చర్మం గరుకుగా తయారైంది. యాంటీఫంగల్‌ క్రీమ్స్‌, మాత్రలు వాడినా సమస్య తగ్గట్లేదు. అలాగే పది నెలల నుంచి ఈ దురద వల్ల నాకు వెజైనా దగ్గర చిన్న చిన్న గడ్డల్లాగా వస్తున్నాయి. ఒక్కోసారి ఆ గడ్డ పెద్దదై చీము, రక్తం కూడా కారుతోంది. నా సమస్యకు పరిష్కారమేంటో తెలుపగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
soups-for-monsoons-in-telugu
women icon@teamvasundhara
fruits-which-help-to-be-healthy-in-this-rainy-season

ఈ పండ్లతో ఆరోగ్యం పదిలం!

రెండు మూడు రోజుల నుంచి వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. భారీ వర్షాలతో ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. అల్ప పీడన ప్రభావంతో చాలా ప్రాంతాలు తడిసి ముద్దవుతున్నాయి. సాధారణంగా వానాకాలం వచ్చిందంటే చాలు.. ఎన్నో రకాల వ్యాధులు ప్రబలుతుంటాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ ఎప్పుడో ఒకసారి అనారోగ్యం బారిన పడుతూనే ఉంటారు. దీనికి తోడు ప్రస్తుతం కరోనా కూడా విలయ తాండవం చేస్తోంది. ఈ క్రమంలో- వ్యక్తిగత, పరిసరాల శుభ్రత ఎంత ముఖ్యమో, రోగనిరోధక శక్తిని పెంచుకోవడమూ అంతే ముఖ్యం. అందుకే ప్రకృతి మనకు ఈ కాలంలో రోగ నిరోధకశక్తిని పెంచి, వివిధ రకాల వ్యాధులను తగ్గించే పండ్లను అందుబాటులో ఉంచింది. ఈ కాలంలో లభించే తాజాపండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండచ్చు. మరి అలాంటి కొన్ని పండ్లతో పాటు, వాటివల్ల కలిగే ప్రయోజనాలను కూడా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
tips-to-reduce-post-pregnancy-tummy-in-telugu

women icon@teamvasundhara
benefits-of-drinking-water-in-telugu
women icon@teamvasundhara
tips-for-balancing-hormones-naturally-in-telugu
women icon@teamvasundhara
these-are-the-benefits-while-you-stop-wearing-a-bra-in-telugu

వీటి విషయంలో సౌకర్యమే ప్రధానం!

చక్కటి ఎద సౌష్ఠవానికి, సాగినట్లుగా కనిపించే వక్షోజాలను పట్టి ఉంచడానికి అమ్మాయిలంతా బ్రా ధరించడం కామనే. అందుకే అతివల వార్డ్‌రోబ్‌లో వీటికి ప్రత్యేకమైన షెల్ఫ్‌ కూడా ఉంటుంది. ఆయా దుస్తులకు తగినట్లుగా సాధారణ బ్రా, స్ట్రాప్‌లెస్‌, బ్రాలెట్‌, స్పోర్ట్స్‌ బ్రా.. వంటివి ఎంచుకొని కూల్‌గా, కంఫర్టబుల్‌గా కనిపించేస్తుంటారు అమ్మాయిలు. అయితే వీటిని ఇష్టపడి ధరించే వారి కంటే.. ‘తప్పదు.. వేసుకోవాల్సిందే..’ అంటూ అయిష్టంగా ధరించే వారే ఎక్కువమంది ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ లోదుస్తులు ఎద భాగానికి పట్టినట్లుగా ఉండడం, తద్వారా ఛాతీలో నొప్పి రావడం, ఆ ప్రదేశంలో చెమట వచ్చి రాషెస్‌లా ఏర్పడడం.. వంటి స్వీయానుభవాలే వారి ఫీలింగ్‌కి ప్రధాన కారణం. మరి, ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రా ధరించాల్సిందేనా? ఇది వేసుకోకపోతే నష్టమేంటి? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. అయితే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో తప్ప మరీ అసౌకర్యంగా అనిపిస్తే బ్రా ధరించకపోయినా ఎలాంటి నష్టం ఉండదంటున్నారు సంబంధిత నిపుణులు. ఇంకా చెప్పాలంటే అత్యవసరం కానప్పుడు బ్రా వేసుకోకపోతే ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు వారు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-for-c-section-woman-in-telugu
women icon@teamvasundhara
food-guide-for-pcos-women-in-telugu

పీసీఓఎస్ ఉంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

హార్మోన్ల అసమతుల్యత.. ఇది మన శరీరంలో ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది. ముఖ్యంగా దీని కారణంగా పీసీఓఎస్‌ (పాలిసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌)తో బాధపడే మహిళల సంఖ్య ఏటా పెరిగిపోతోంది. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే ఈ సమస్య మనదేశంలో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక ప్రపంచంలోనైతే దాదాపు 60-70 శాతం మంది స్త్రీలు దీని బారిన పడి ప్రత్యుత్పత్తి వ్యవస్థలో సమస్యలు ఎదుర్కొంటున్నారని పరిశోధకులు చెబుతున్నారు. అయితే చక్కటి జీవనశైలి, ఆహారపుటలవాట్లను పాటిస్తే పీసీఓఎస్‌ను అదుపులో ఉంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు. సెప్టెంబర్‌ మాసాన్ని ‘పీసీఓఎస్‌ అవగాహన మాసం’గా జరుపుకుంటోన్న నేపథ్యంలో ఈ సమస్యతో బాధపడే మహిళలు పాటించాల్సిన కొన్ని ఆహార నియమాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
fears-and-facts-about-pickles-a-new-post-shared-by-celebrity-nutritionist-rujuta-diwekar

పచ్చళ్ళు తినడం మంచిదా, కాదా? కొన్ని అపోహలు, వాస్తవాలు..

ఏదైనా సరే మితంగా తింటే అమృతం.. అతిగా తింటే విషం అంటారు. పచ్చళ్లకూ ఇది వర్తిస్తుంది. అయితే కొందరు రుచిగా ఉందని అన్నమంతా పచ్చడితోనే లాగించేస్తారు.. ఆ తర్వాత ఎక్కువ తినేశానే అని బాధపడిపోతుంటారు. ఇంకొందరు పచ్చడి తినడం ఆరోగ్యానికి మంచిది కాదేమోనన్న సందిగ్ధంలో ఉండిపోయి తినడమే మానేస్తుంటారు. పచ్చళ్ల గురించి ఇలాంటి భయాలు, సందేహాలు, అపోహలు.. అందరిలో సహజమే. అలాంటి అపోహలకు తన తాజా పోస్ట్‌తో చెక్‌ పెట్టారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్. ఊరగాయలు, నిల్వ పచ్చళ్ల గురించి సాధారణంగా ఉండే కొన్ని అపోహలు, వాస్తవాలను వివరిస్తూ ఆమె పెట్టిన పోస్ట్‌ పచ్చళ్ల గురించి అందరిలో ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
benefits-of-eating-eggs-in-telugu

పోషకాల గని.. ఆరోగ్యపు నిధి.. 'కోడిగుడ్డు'!

ఉడికించిన కోడిగుడ్డు, పాలు అల్పాహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. ఇతర అల్పాహారాల్లో లభించని పోషకాలు ఇందులో నిక్షిప్తమై ఉండడమే ఇందుకు కారణం. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు.. ఇవన్నీ కోడిగుడ్డులో పుష్కలంగా లభిస్తాయి. ఇలా ఎన్నో రకాల పోషకాలు కలిగిన చవకైన ఆహారం కాబట్టే ఎక్కడ చూసినా రోజుకు కొన్ని లక్షల గుడ్ల వినియోగం జరుగుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొన్ని ఇతర దేశాలతో పోల్చితే ఇది తక్కువే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో కోడిగుడ్డులో ఉండే పోషకాలేంటి? అవి మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
consume-rich-sources-of-vitamin-d-foods-to-prevent-corona-virus

డి-విటమిన్ లోపంతోనూ కరోనా ముప్పు.. మరేం చేయాలి?

జలుబు దగ్గర్నుంచి జ్వరం దాకా, ఒంటి నొప్పుల దగ్గర్నుంచి శరీర అవయవాలను దెబ్బతీయడం దాకా.. మాయదారి మహమ్మారి కరోనా వైరస్‌కు లేని లక్షణమంటూ లేదేమో అన్నట్లుగా తయారయ్యాయి ప్రస్తుత పరిస్థితులు. అసలే ఎటు నుంచి కరోనా ముప్పు ముంచుకొస్తుందో తెలియని అయోమయంలో ఉన్న మనందరికీ ఈ వైరస్‌ గురించి రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. ఆ లిస్టులో తాజాగా మరో అంశం చేరిపోయింది. రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్‌-డి పాత్ర కీలకమని, అది లోపించిన వారే ఎక్కువగా వైరస్‌ బారిన పడుతున్నట్లు తాజా అధ్యయనంలో భాగంగా వెల్లడించారు పరిశోధకులు. అందుకే ఈ విటమిన్‌ లోపించకుండా జాగ్రత్తపడమని చెప్పకనే చెబుతున్నారు వారు. ఈ నేపథ్యంలో విటమిన్‌-డి లోపం లేకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏయే ఆహార పదార్థాల్ని మెనూలో చేర్చుకోవాలి? రండి.. తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
foods-to-eat-with-pcos-in-telugu

వీటితోనూ పీసీఓఎస్‌ను తగ్గించుకోవచ్చు!!

పీసీఓఎస్.. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ప్రస్తుతం చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్లో అతి ముఖ్యమైంది. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు, ఇన్సులిన్ స్థాయులు పెరిగినప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. తద్వారా స్త్రీలలో నెలసరి సక్రమంగా రాకపోవడం, అధిక బరువు, మొటిమలు, సంతానలేమి, అవాంఛిత రోమాలు వంటి పలు సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి. పీసీఓఎస్ సమస్యను ఎంత త్వరగా నయం చేసుకుంటే అంత మంచిది.. లేదంటే గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం.. వంటి ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదమూ లేకపోలేదు. మరి ఇందుకోసం డాక్టర్ సూచించిన మందులతో పాటు వ్యాయామం, సరైన పోషకాహారం.. వంటివి తప్పనిసరి. వీటితో పాటు ఇంట్లో దొరికే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలనూ ఉపయోగించడం వల్ల పీసీఓఎస్ నుంచి తొందరగా విముక్తి పొందచ్చని చెబుతున్నారు నిపుణులు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
national-nutrition-week-various-diet-trends-and-their-health-benefits-in-telugu

వీటిలో మీ ‘డైట్‌ ట్రెండ్‌’ ఏమిటి?

‘ఏదో ఒకటి కడుపులో పడితే చాలు.. ఈ పూటకి ఆకలి తీరుతుంది..’ ఆహారం విషయంలో చాలామంది భావన ఇదే! కానీ కడుపు నిండడం కంటే.. శరీరానికి కావాల్సిన మోతాదులో పోషకాలు అందాయా? లేదా? అన్నదే ముఖ్యమంటున్నారు నిపుణులు. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇలాంటి పోషకాలు పుష్కలంగా లభించే డైట్‌ ట్రెండ్స్‌ బోలెడన్ని ఉన్నాయి. అటు ఆరోగ్యానికైనా, ఇటు బరువు తగ్గడానికైనా చాలామంది వివిధ రకాల డైట్‌ ట్రెండ్స్‌ని పాటిస్తుంటారు. మరి, ‘జాతీయ పోషకాహార మాసం’ సందర్భంగా ఆయా ఆహార పద్ధతుల గురించి, వాటితో చేకూరే ప్రయోజనాల గురించి తెలుసుకుందామా?!

Know More

women icon@teamvasundhara
tip-to-overcome-sleeping-disorder-in-telugu

మధ్య రాత్రి మెలకువ వస్తోందా??

'ఏంటి వసూ చాలా చిరాగ్గా ఉన్నావ్..' 'అవును రీతూ.. గత నాలుగు రోజుల నుంచి అర్ధరాత్రి మెలకువ వస్తుంది. తర్వాత నిద్ర పట్టడం లేదు.. అందుకే ఈ చిరాకు..' ఈ సమస్య కేవలం వసూకే కాదు.. చాలామందికి ఎదురవుతుంటుంది. కొంతమందికి పడుకునేటప్పుడు ఇలా పడుకోగానే అలా నిద్ర పడుతుంటుంది. కానీ మధ్య రాత్రి మెలకువ వచ్చేస్తుంది. ఇక అంతే సంగతులు.. ఎంత ప్రయత్నించినా అస్సలు నిద్ర పట్టదు. గడియారం వైపు చూస్తూ ఉదయం ఎప్పుడవుతుందా అని గంటలూ, నిమిషాలు, సెకన్లతో సహా లెక్కపెడుతుంటారు. దీనివల్ల అటు ప్రశాంతంగా నిద్రపోయినట్లూ ఉండదు.. ఇటు మెలకువతో ఉన్నట్లూ ఉండదు.. సరిగ్గా నిద్రలేక చిరాకు ఆవహిస్తుంది. ఫలితంగా తెల్లారాక ఏ పనీ సరిగా చేయలేం. మరి ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలో చూద్దాం...

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-uterus-fibroid-treatment-in-telugu

ఫైబ్రాయిడ్ ఉంది.. ఏ చికిత్స మంచిది?

హాయ్‌ డాక్టర్‌. నా చెల్లెలి వయసు 44 ఏళ్లు. తను Schizophrenia పేషెంట్‌. ఇప్పుడు నార్మల్‌ కండిషన్‌లోనే ఉంది. తనకు ఇప్పుడు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. అయితే ఇటీవల పిరియడ్స్‌లో హెవీ బ్లీడింగ్‌, కడుపులో నొప్పి రావడంతో డాక్టర్‌ని సంప్రదించాం. డాక్టర్‌ సలహా మేరకు స్కానింగ్‌ తీయించాం. గర్భాశయం లోపల ఫైబ్రాయిడ్‌ ఏర్పడిందని చెప్పారు. దాని పరిమాణం 7.3×7.2×7.1 సెంటీమీటర్‌గా ఉంది. అయితే డాక్టర్‌ మాకు రెండు సలహాలిచ్చారు. ఒకటి - నాలుగు నెలల వరకు ఇంజెక్షన్‌ ద్వారా హార్మోన్లను తాత్కాలికంగా అదుపు చేయడం.. అలా చేయడం వల్ల ఫైబ్రాయిడ్‌ పరిమాణం తగ్గుతుంది.. ఆ తర్వాత మయోమా చేయచ్చన్నారు. రెండోది - ఫైబ్రాయిడ్‌ ఎంబోలైజేషన్‌ చేయడం. అయితే నా సందేహం ఏంటంటే.. ముందుగా తాత్కాలికంగా హార్మోన్లను కంట్రోల్‌ చేసి (ఆపి), ఫైబ్రాయిడ్‌ పరిమాణం తగ్గిన తర్వాత ఫైబ్రాయిడ్‌ ఎంబోలైజేషన్‌ చేయచ్చా? ఈ రెండు చికిత్సల్లో దేనివల్లనైనా దుష్పరిణామాలు ఎదురవుతాయా? అలాగే భవిష్యత్తులో నా చెల్లికి పిల్లలు పుట్టే అవకాశం ఉందా? చెప్పండి.

Know More

women icon@teamvasundhara
beauty-and-health-benefits-of-coconut-water-in-telugu

అందుకే రోజుకి కనీసం ఓ కొబ్బరి బోండం తాగేయాలి!

'తక్కువ క్యాలరీలు.. నాలుగు అరటిపండ్లలో ఉండే పొటాషియం కంటే ఎక్కువ పొటాషియం.. కొలెస్ట్రాల్ ఫ్రీ.. సహజసిద్ధమైన కొవ్వులు..' ఇదే కొబ్బరి నీళ్ల ఫార్ములా. ఇందులో చక్కెర, ఎలక్ట్రోలైట్‌ల రూపంలో ఉండే కార్బోహైడ్రేట్ వల్ల మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అలాగే చర్మాన్ని పునరుత్తేజితం చేయడంలో కీలకపాత్ర వహిస్తుంది. పైగా అందరూ ఇష్టపడి తాగే న్యాచురల్ డ్రింక్ కూడా.. ఎలాంటి ఆరోగ్య సమస్యలెదురైనా సరే.. కొబ్బరి నీళ్లు తాగితే చాలు.. సమస్య నుంచి సగం విముక్తి పొందినట్లే.. మరి అంతటి ఔషధ గుణాలున్న కొబ్బరి నీళ్ల వల్ల అందానికి, ఆరోగ్యానికీ ఇంకా బోలెడన్ని లాభాలున్నాయ్!!

Know More

women icon@teamvasundhara
body-changes-after-delivery-in-telugu

ప్రసవం తర్వాత ఈ మార్పులు సహజమే!

గర్భం ధరించిన తర్వాత మహిళల శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో.. అలాగే ప్రసవానంతరం కూడా శారీరకంగా కొన్ని మార్పులు రావడం సహజం. అయితే తొలిసారి బిడ్డకు జన్మనిచ్చిన వారిలో చాలామంది ఇలాంటి మార్పులు జరగడం వల్ల కంగారు పడుతుంటారు. కానీ ప్రసవం తర్వాత జుట్టు రాలిపోవడం, కాళ్లలో వాపు, స్థనాల్లో పెరుగుదల.. వంటి పలు శారీరక మార్పులు సహజమేనని, అందుకు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవన్నీ కొన్ని రోజుల వరకు కొనసాగి, ఆ తర్వాత పరిస్థితి సాధారణమవుతుందంటున్నారు వారు. మరి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లి శరీరంలో జరిగే ఆ మార్పులేంటో మనం కూడా తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
home-remedies-for-throat-issues-in-telugu
women icon@teamvasundhara
home-quarantine-doctors-suggest-these-precautions-if-there-is-a-child-in-the-house

కరోనా నుంచి పిల్లలను కాపాడుకోండిలా!

కరోనా సోకినా, కొవిడ్‌ లక్షణాలు కనిపించినా ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవచ్చంటూ భారత ప్రభుత్వం ఇటీవల కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, వైరస్‌ తీవ్రత అధికంగా ఉంటే తప్ప హోం క్వారంటైన్‌లోనే ఉండి వైద్యం తీసుకోవచ్చునని ఆ గైడ్‌లైన్స్‌లో సూచించింది. ఈమేరకు కొవిడ్‌ బాధితుల్లో చాలామంది ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండి వైద్యుల సూచనలు పాటిస్తూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే కొవిడ్‌ బాధితులున్న ఇంట్లో చిన్నారులుంటే మరింత అప్రమత్తత అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శానిటైజేషన్‌కి సంబంధించి పిల్లల్లో ఎలాంటి అవగాహనా ఉండదని, ఈ క్రమంలో వారు కూడా వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
these-lifestyle-changes-boost-your-immune-function-amid-pandemic-in-telugu

శృంగారం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందా?!

ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే మన వద్ద ఉన్న ఒకే ఒక్క ఆయుధం రోగనిరోధక శక్తి. దీన్ని మెరుగుపరచుకోవడానికే చాలామంది కషాయాలు తయారుచేసుకొని తాగడం, చక్కటి పోషకాహారం తీసుకోవడం, కొత్త వంటకాలు చేసుకొని తినడం.. ఇలా ఎవరికి తోచినట్లుగా వాళ్లు చేస్తున్నారు. అయితే కేవలం ఆహారంతోనే ఇమ్యూనిటీని పెంచుకోవచ్చా? అంటే.. దాంతో పాటు ఇంకా బోలెడన్ని అంశాలు ఇందుకు దోహదం చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మనం అనుసరించే జీవనశైలి ప్రభావం కూడా రోగనిరోధక వ్యవస్థపై ఉంటుందంటున్నారు. అందుకే ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ని అనుసరించాలని సూచిస్తున్నారు. మరి, ఇంతకీ మన రోగనిరోధక వ్యవస్థను పటిష్ట పరిచే ఆ జీవనశైలి మార్పులేంటో తెలుసుకుందామా?!

Know More

women icon@teamvasundhara
copper-vessels-and-its-health-benefits-in-telugu

ఇవి వాడితే బరువు కూడా తగ్గుతుందట!

నీటిని శుద్ధి చేసుకోవడానికి వివిధ రకాల వాటర్ ఫిల్టర్లు, ప్యూరిఫైయర్లు పుట్టుకొస్తున్నాయి.. కానీ పూర్వకాలంలో ఇలాంటివన్నీ ఎక్కడివి? పైగా 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అన్నట్లు ఆ కాలానికి చెందిన వారే ఎలాంటి అనారోగ్యాలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేవారు కూడా! మరి ఎందుకలా? వారి ఆరోగ్య రహస్యమేంటి.. అంటారా? ఇంకేముంది 'రాగి' పాత్రలే! నీటిని నిల్వ చేసుకోవడానికైనా, ఆహారాన్ని వండుకోవడానికైనా, వండిన ఆహారం తినడానికైనా.. ఇలా ప్రతి దానికీ వారు రాగి పాత్రలనే ఉపయోగించేవారు. అందులోని సకల పోషకాలు తీసుకునే ఆహారంలో చేరి.. అవి శరీరంలోని ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాతో పోరాడి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా కాపాడేవి. అయితే ఆ రాగి పాత్రలు ఇప్పుడు కాస్త రూపురేఖల్ని మార్చుకొని మళ్లీ మన ముందుకొచ్చేశాయి. అంతేకాదు.. వాటిని ఉపయోగించే వారూ నానాటికీ పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగడం, రాగి పాత్రల్లో ఆహారం తినడం.. వంటి వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-irregular-periods-in-telugu
women icon@teamvasundhara
samantha-akkineni-shares-recipe-for-healthy-morning-smoothie-in-telugu

ఈ హెల్దీ స్మూతీతో నా రోజు మొదలవుతుంది!

కరోనా రావడమేమోగానీ అందరిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ఇంట్లో వండిన ఆహారమే.. అది కూడా పోషకాలు అధికంగా లభించే పదార్థాలకే ఓటేస్తున్నారు. అలాంటి వారందరికీ తన మార్నింగ్‌ రెసిపీని పరిచయం చేసింది టాలీవుడ్‌ బ్యూటీ సమంత. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో గార్డెనింగ్‌ చేస్తూ సేదదీరుతోన్న ఈ భామ.. తాను పండించిన కాయగూరలు, ఆకుకూరల ఫొటోలను, ఈ క్రమంలో తనకెదురైన అనుభవాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటోంది. అంతేనా.. తాను పాటిస్తోన్న ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను సైతం పోస్టుల రూపంలో పంచుకుంటూ అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలంటూ చెప్పకనే చెబుతోందీ బ్యూటీ. అలా తాజాగా తాను రోజూ ఉదయాన్నే తీసుకునే ఓ హెల్దీ స్మూతీ రెసిపీ, దాని తయారీని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేసింది సామ్‌.

Know More

women icon@teamvasundhara
rujuta-diwekar-new-insta-post-on-health-benefits-of-modak-in-telugu

ఆవిరి కుడుములు తింటే ఇన్ని ప్రయోజనాలున్నాయా?

ఆవిరి కుడుములంటే గణనాథుడికి మహా ఇష్టం. అందుకే వినాయక చవితి రోజున అందరూ మోదకాలు చేసి ఆ పార్వతీ నందనుడికి నివేదిస్తారు. అయితే కేవలం పండగరోజునే కాదు.. నవరాత్రులూ భూమిపై పూజలందుకునే గణేషుడికి రోజుకో నైవేద్యం సమర్పించడం మనకు తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ మళ్లీ మోదకాలు తయారుచేసి గణపతికి నైవేద్యంగా సమర్పించే వారూ చాలామందే! అయితే ఎంతో అమోఘమైన రుచిని నింపుకొన్న ఈ ఆవిరి కుడుములు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూర్చుతాయంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. ఈ క్రమంలోనే మోదకాలతో ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయో వివరిస్తూ ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టారామె. మరి, మోదక ప్రియుడికి నివేదన చేసే ఈ ఆవిరి కుడుముల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-ivf-success-rate
women icon@teamvasundhara
shilpa-shetty-made-besan-coconut-barfi-this-ganesh-chaturthi-in-telugu

బుజ్జి గణపయ్య బొజ్జను ఈ స్పెషల్ స్వీట్‌తో నింపేయండి!

బొజ్జ గణపయ్యను మనసారా కొలుచుకొని, రుచికరమైన వంటకాలతో ఆ దేవదేవుడిని సంతృప్తి పరిచే ‘వినాయక చవితి’ పండగ రానే వచ్చింది. అయితే ఈసారి పండగ అన్నింటికంటే భిన్నం. ఎందుకంటే కరోనా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మండపాల్లో పూజలకు బదులు అందరూ ఇంట్లోనే బుజ్జి గణపయ్యను ప్రతిష్టించుకొని పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అందరూ ఆరోగ్యకరమైన పిండి వంటలు, స్వీట్స్‌ తయారుచేసి ఆ పార్వతీ నందనుడికి నైవేద్యంగా సమర్పించడానికి రడీ అయిపోయారు. అలాంటి వారికి ఓ హెల్దీ రెసిపీని పరిచయం చేసింది బాలీవుడ్‌ అందాల అమ్మ శిల్పా శెట్టి. విభిన్న ఆరోగ్యకరమైన వంటకాలతో మనల్ని అలరించే ఈ ముద్దుగుమ్మ.. పండగ సందర్భంగా ఓ సూపర్బ్ స్వీట్‌ రెసిపీ చేసి చూపించింది. ఈ వంటకం వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరికీ ముందుగానే పండగ శుభాకాంక్షలు తెలిపింది శిల్ప.

Know More

women icon@teamvasundhara
i-have-pcos-problem-how-to-take-contraceptive-pills?-in-telugu

పీసీఓఎస్ ఉంది.. గర్భ నిరోధక మాత్రలు ఎన్నాళ్లు వాడాలి?

హాయ్‌ డాక్టర్‌. నా వయసు 21. ఇటీవలే నాకు పీసీఓఎస్‌ ఉందని తెలిసింది. నాకు పిరియడ్స్‌ సక్రమంగా రావడానికి డాక్టర్‌ సలహా మేరకు గర్భనిరోధక మాత్రలు వాడుతున్నాను. అయితే నేను ఇంటర్నెట్‌లో ఈ మాత్రల గురించి మరింత సమాచారం తెలుసుకునే క్రమంలో ఈ మాత్రలు వాడుతున్న కొంతమంది మహిళల ఫీడ్‌బ్యాక్ చదివాను. చాలా సంవత్సరాల నుంచి వారు ఈ మాత్రలు వాడుతున్నా వారికి ఇంకా పిరియడ్స్‌ సక్రమంగా రావట్లేదని చాలామంది రాశారు. డాక్టర్‌ నాకు సూచించిన మాత్రలు నా పిరియడ్‌ పూర్తయ్యాక వేసుకుందామనుకున్నా.. సాధారణంగానైతే నాకు ఐదు రోజులకు పిరియడ్‌ పూర్తవుతుంది. కానీ పది రోజులైనా బ్లీడింగ్‌ ఇంకా తగ్గకపోవడంతో మందులు వేసుకోవడం ప్రారంభించాను. నాకు నెలసరి సక్రమంగా రావాలంటే నేను ఎన్నాళ్ల పాటు ఈ మాత్రలు వాడాలి? వీటివల్ల దుష్ప్రభావాలు ఏమైనా ఉంటాయా?

Know More

women icon@teamvasundhara
simple-tips-to-get-flatter-belly-in-telugu

పొట్టభాగంలో కొవ్వు తగ్గాలంటే..

ఇటీవలి కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది వూబకాయానికి గురవుతున్నారు. కొంతమందిలో అయితే ఉదరభాగంలో కొవ్వు చేరుతుంది. దీనివల్ల తమ శరీరాకృతిని కోల్పోవడమే కాకుండా వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే చాలామంది తమ శరీరం పూర్వస్థితికి చేరుకొనేందుకు రకరకాల వర్కవుట్లను ఆశ్రయిస్తే.. మరికొందరు వాకింగ్, జాగింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. ఇంకొందరు ఈ సమస్య నుంచి బయట పడటానికి డైటింగ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల కొత్త రకాల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే రోజూ మనం తినే ఆహారాన్ని తగ్గించకుండానే.. చేస్తున్న వ్యాయామానికి తోడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉదరభాగంలో చేరిన అదనపు కొవ్వుని తగ్గించుకొని చక్కటి శరీరాకృతిని పొందవచ్చంటున్నారు నిపుణులు. అయితే వాటి గురించి తెలుసుకుందామా మరి..

Know More

women icon@teamvasundhara
these-tricolor-foods-to-boost-your-immunity-to-fight-against-corona-virus

ఈ మువ్వన్నెల పదార్థాలు ఇమ్యూనిటీని పెంచేస్తాయ్!

రోగ నిరోధక శక్తి.. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ దీని గురించే ఆలోచిస్తున్నారు. ఇమ్యూనిటీని పెంచుకునేందుకు వివిధ పదార్థాల్ని ఆహారంగా తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని చిట్కాల గురించి ఇంటర్నెట్‌లో శోధిస్తున్నారు. బహుశా.. కరోనా వచ్చిన దగ్గర్నుంచి ఆన్‌లైన్‌లో ఎక్కువమంది వెతికిన అంశం ఏదని సర్వే చేస్తే రోగ నిరోధక శక్తి గురించే అని తేలడం ఖాయం. కరోనా వల్ల అంత పాపులరైందీ టాపిక్‌. నిజానికి మన భారతీయుల్లో రోగ నిరోధక శక్తి స్థాయులు ఎక్కువే! అయితే కరోనా రోజురోజుకీ తన రూపం మార్చుకొని విరుచుకుపడుతుండడంతో దానికి తగ్గట్లుగా ఇమ్యూనిటీ స్థాయులు పెంచుకొని కరోనా కొమ్ములు వంచడానికే ఈ ప్రయత్నమంతా..! అయితే మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు వివిధ రకాల పదార్థాలను మనం రోజూ తీసుకుంటూనే ఉంటాం. కానీ వాటి రంగుల్ని మీరెప్పుడైనా సునిశితంగా పరిశీలించారా? ఇమ్యూనిటీని పెంచే చాలా రకాల కాయగూరలు, పండ్లు మన జెండా రంగుల్ని పోలి ఉంటాయన్న విషయం మీరెవరూ గమనించి ఉండరు కదా! అవును.. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ.. ఇలా జెండా రంగుల్లో ఉన్న కాయగూరల్లో-పండ్లలో బోలెడన్ని పోషకాలు దాగున్నాయి. అవి మన రోగ నిరోధక శక్తినీ మెరుగుపరుస్తాయి. మరి, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇమ్యూనిటీని పెంచే ఆ మువ్వన్నెల పదార్థాలేంటో తెలుసుకుందామా?

Know More

women icon@teamvasundhara
shilpa-shetty-cooks-healthy-idli-with-oats-in-telugu

ఈ హెల్దీ-టేస్టీ ఓట్స్‌ ఇడ్లీ చేయడం చాలా ఈజీ..!

ఓట్స్‌... పోషకాలు పుష్కలంగా దొరికే ఈ పదార్థాన్ని చిన్నారులు చాలా ఇష్టంగా తీసుకుంటారు. వీటిలో ఉండే బీటా గ్లూకాన్స్‌ శరీరంలోని బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడే శక్తినిస్తాయి. ఫలితంగా కరోనా కాలంలో చిన్నారుల రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. అయితే రోజూ ఒకే రకంగా ఓట్స్‌ని అందిస్తే పిల్లలకు కూడా బోర్‌ కొడుతుంది. అందుకే ఓట్స్‌తో చేసే విభిన్న వంటకాల్ని పిల్లల చేత తినిపిస్తే వారికి రుచితో పాటు ఆరోగ్యం కూడా అందించవచ్చు. ఈక్రమంలో కొద్ది రోజుల క్రితం ఓట్స్‌ ఉప్మా తయారుచేసిన శిల్పాశెట్టి.. తాజాగా ఓట్స్‌ ఇడ్లీ ఎలా చేయాలో చెప్పుకొచ్చింది. మరి ఈ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ను ఎలా తయారుచేయాలో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
natural-remedies-to-control-mouth-ulcers-in-telugu

నోటిలో పుండ్ల సమస్యకు కొన్ని వంటింటి చిట్కాలు!

మనం తీసుకున్న ఆహారం జీర్ణమై, తక్షణ శక్తినందించేందుకు పటిష్టమైన జీర్ణవ్యవస్థ అవసరం. అయితే ఆ జీర్ణవ్యవస్థకు ఆరంభ దశ నోటి నుంచి ప్రారంభమవుతుంది. అలాంటి భాగానికి ఏదైనా ఇబ్బంది ఎదురైతే, ఆహారాన్ని ఘన రూపంలో కాదుకదా, కనీసం ద్రవరూపంలో తీసుకోవడం కూడా చాలా కష్టంగా మారుతుంది. ఇలాంటి సమస్యే 'నోటి అల్సర్లు'. ఒక్కసారి ఈ సమస్య వచ్చిందంటే చాలు.. 24 గంటలు నొప్పి, మంటను భరిస్తూనే ఉండాలి. ఎంతటి తీపిపదార్థాలు తిన్నా, నోట్లో కారం వేసినట్లు మంట పుడుతుంది. అందుకే ఇలాంటి సమస్యకు చెక్ పెట్టడానికి సహజపద్ధతుల్లో ఏమేం చేయచ్చో ఓసారి చూద్దామా..

Know More

women icon@teamvasundhara
foods-to-avoid-while-breastfeeding-in-telugu
women icon@teamvasundhara
breastfeeding-precautions-during-corona-virus-pandemic-by-gynecology-expert-dr-savitha-devi

కరోనా సోకితే తల్లి బిడ్డకు పాలివ్వచ్చా? నిపుణులేమంటున్నారు?

వైష్ణవికి ఇప్పుడు తొమ్మిదో నెల. ఈమధ్యే కాస్త జ్వరంగా ఉందంటూ కరోనా పరీక్షలు చేయించుకోగా తాజాగా ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆమెకు రేపో, మాపో డెలివరీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు వైద్యులు. అయితే వైష్ణవి భయమంతా.. తన వల్ల తన బిడ్డకు ఎక్కడ వైరస్‌ సోకుతుందో, ప్రసవం తర్వాత తాను తన చిన్నారికి పాలివ్వచ్చో, లేదోనని! దివ్యత మూడు నెలల బాబుకు తల్లి. ఇటీవలే ఆమెకు ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌ రావడంతో ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స తీసుకుంటోంది. అయితే ఈ క్రమంలో తన బాబుకు పాలు పట్టచ్చో, లేదో.. ఒకవేళ పడితే తన చనుబాల ద్వారా తన బిడ్డకు ఇన్ఫెక్షన్‌ ఎక్కడ సోకుతుందోనని విపరీతంగా భయపడిపోతోంది.

Know More

women icon@teamvasundhara
a-special-story-on-breastfeeding-in-telugu

అందుకే అమ్మ పాలే అమృతం..!

తల్లి పాలు.. బిడ్డకు అమృత తుల్యం.. తల్లీబిడ్డల మధ్య అనుబంధం బలపడటానికి అమ్మ అందించే పాలే కీలకం. ప్రసవానంతరం గంటలోపు తాగించే మాతృ క్షీరం సంజీవని లాంటిది. వీటినే ముర్రుపాలు (కొలస్ట్రమ్) అంటారు. సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత మూడు నుంచి ఆరు రోజుల వరకూ ఇవి లభిస్తాయి. ఈ పాలు కేవలం ఆకలి తీర్చేవి మాత్రమే కాదు.. బిడ్డకు దీర్ఘాయుష్షునిచ్చే అమృత ధారలు.. అమ్మకు, బిడ్డకు అందం, ఆరోగ్యాన్నందించడం తల్లిపాల ప్రత్యేకత. కానీ చాలామంది రకరకాల అపోహలతో, లేక వివిధ కారణాలతో బిడ్డలను ఆ పాలకు దూరం చేస్తున్నారు. దీన్ని నివారించడానికే ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పిల్లలకు తల్లిపాలు ఎంత అవసరం? అసలు పిల్లలకు పాలు ఎలా పట్టాలి? అన్న విషయాలు తెలుసుకుందాం.. అంతే కాదు.. పాలు పట్టడం గురించి ఉన్న అపోహలను కూడా దూరం చేసుకుందాం..

Know More

women icon@teamvasundhara
foods-to-increase-breast-milk-production-in-telugu

ఇవి తింటే బాలింతల్లో పాలు బాగా పడతాయి !

పాపాయి ఆరోగ్యానికి తల్లిపాలు ఎంత ముఖ్యమో.. బిడ్డకు పాలివ్వడం తల్లి ఆరోగ్యానికి కూడా అంతే ముఖ్యం. పాలలోని కొవ్వులు, ప్రొటీన్లు, నీరు, చక్కెర.. వంటి పోషకాలు పాపాయికి అందడం ద్వారా వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదిగే అవకాశం ఉంటుంది. అలాగే తల్లిపాల వల్ల అలర్జీ, ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు.. వంటివేవీ పిల్లల దరిచేరకుండా కాపాడుకోవచ్చు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా కనీసం ఆరు నెలలు వచ్చే వరకైనా పిల్లలకు తల్లిపాలు అందించాలని చెబుతోంది. అయితే ఎదిగే కొద్దీ చిన్నారులకు తల్లిపాలు సరిపోవాలంటే తల్లుల్లో పాల ఉత్పత్తి మెండుగా ఉండాలి. అందుకు కొన్ని సహజసిద్ధమైన ఆహార పదార్థాలు తోడ్పడతాయంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
breastfeeding-benefits-to-infants-and-mothers

తల్లిపాలు ఎందుకు మంచివో తెలుసా?

తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. సకల పోషకాల మిళితమైన ఈ పాలు పసిపిల్లల్ని బాలారిష్టాల నుంచి రక్షించడంలో తోడ్పడతాయి. అయితే కొంతమంది తల్లులు ఉద్యోగం, ఇతర కారణాల రీత్యా చంటి పిల్లలకు పాలివ్వడం కొన్ని నెలల్లోనే ఆపేసి డబ్బా పాలను ఆశ్రయిస్తుంటారు. ఇది ఆరోగ్యపరంగా అటు బిడ్డకు, ఇటు తల్లికి మంచిది కాదు. అందుకే బిడ్డకు తల్లిపాల ఆవశ్యకత గురించి మహిళల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా ఆగస్టు మొదటివారంలో (ఆగస్టు 1 నుంచి 7 వరకు) తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పిల్లలకు పాలివ్వడం వల్ల ఇటు బిడ్డకి, అటు తల్లికి కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడంతో పాటు, తల్లులంతా పిల్లలకు పాలిచ్చేలా ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తల్లిపాల వల్ల పిల్లలకు, పాలివ్వడం వల్ల తల్లికి కలిగే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
monsoon-diet-tips-by-celebrity-nutritionist-radhika-karle

ఈ అయిదు చిట్కాలతో.. వర్షాకాలంలో సంపూర్ణ ఆరోగ్యం!

మారుతున్న కాలాన్ని బట్టి వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం సహజమే. దానికి తగినట్లుగా మన శరీరాన్ని సిద్ధం చేసుకోకపోతే రోగనిరోధక శక్తి తగ్గిపోయి వివిధ రకాల వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఎక్కువ. పైగా ఇది వర్షాకాలం.. సీజనల్‌ వ్యాధులతో పాటు కరోనా మహమ్మారి ముప్పు కూడా ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ వర్షాకాలానికి తగినట్లుగా మన శరీరాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అందుకు ఐదు చిట్కాలు పాటించాలంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రాధికా కర్లె. ఆహారం, ఆరోగ్యం, వ్యాయామం.. తదితర విషయాల్లో తరచూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ ఆరోగ్యాన్ని అందరికీ చేరువ చేసే ఈ న్యూట్రిషనిస్ట్‌.. వర్షాకాలంలో సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే చేసుకోవాల్సిన ఐదు మార్పులేంటో ఇటీవలే ఇన్‌స్టా పోస్ట్‌ రూపంలో వివరించారు.

Know More

women icon@teamvasundhara
high-blood-pressure-after-childbirth-in-telugu