పోషకాలు ఇవీ!

ఉడికించిన కోడిగుడ్డు నుంచి రోజూ మన శరీరానికి అందే పోషకాల శాతం ఎంతో మీకు తెలుసా? * ఫోలేట్ - 5 శాతం * సెలీనియం - 22 శాతం * ఫాస్ఫరస్ - 9 శాతం * విటమిన్ ఎ - 6 శాతం * విటమిన్ బి2 - 15 శాతం * విటమిన్ బి5 - 7 శాతం * విటమిన్ బి12 - 9 శాతం అలాగే 60 గ్రాముల కోడిగుడ్డు నుంచి ప్రొటీన్ - 7.9 గ్రాములు, శక్తి - 103 కేలరీలు, ఇనుము - 1.26 మి.గ్రా, ఫాస్పరస్ - 132 మి.గ్రా, క్యాల్షియం - 36 గ్రా, కొవ్వులు - 7.9 గ్రా లభిస్తాయి. వీటితో పాటు క్యాల్షియం, జింక్.. వంటి ఖనిజాలు; బి6, డి, ఇ, కె.. విటమిన్లు కూడా కోడిగుడ్లలో సమృద్ధిగా లభిస్తాయి.
 * పిల్లలకు అందించే ఆహారంలో కోడిగుడ్డు తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో ఉండే విటమిన్ ఎ; ల్యూటిన్, జియాక్సాంథిన్.. లాంటి యాంటీఆక్సిడెంట్లు కంటి సంబంధిత సమస్యలు రాకుండా కాపాడడంతో పాటు రేచీకటి నుంచి విముక్తి కలిగిస్తాయి. * ఒక కోడిగుడ్డులో 1.5 గ్రాముల పచ్చసొన, 213 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్, 75 క్యాలరీలు ఉంటాయి. మనం రోజూ తీసుకునే ఆహారంలో కొలెస్ట్రాల్ 300 మిల్లీగ్రాములకు మించకూడదు. కాబట్టి రోజూ ఒక గుడ్డు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్లో అధిక మొత్తం లభించినట్లే. * జీవక్రియలు సక్రమంగా సాగడంతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి కోడిగుడ్డులోని ప్రొటీన్లే కారణం. అలాగే ఇందులో విటమిన్ సి తప్ప మిగిలిన అన్ని విటమిన్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. * తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రొటీన్లు, ఖనిజాలు ఉండే కోడిగుడ్డు.. ఎముకలు, కండరాలు.. దృఢంగా తయారు కావడానికి తోడ్పడుతుంది. ఎత్తు పెరిగేందుకు సహాయపడుతుంది. * కోడిగుడ్డులోని తెల్లసొనలో ప్రొటీన్లు, నియాసిన్, రైబోఫ్లేవిన్, క్లోరిన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, సల్ఫర్, జింక్.. వంటి ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అలాగే పచ్చసొనలో విటమిన్ ఎ, డి, ఇ అధికంగా ఉంటాయి. వీటితో పాటు ఫోలికామ్లం, ఐరన్, క్యాల్షియం, కాపర్, సల్ఫర్లు కూడా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా అవసరం. అలాగే గుడ్డులో లభించే ఐరన్ శరీరంలో సులభంగా కలిసిపోతుంది. * శరీరం, గుండె ఆరోగ్యానికి అవసరమైన ఒమేగా - 3 ఫ్యాటీ ఆమ్లాలు గుడ్డులో అధిక మొత్తంలో ఉంటాయి.
|