Image for Representation
నమస్తే డాక్టర్. నాకు 14 నెలల బాబున్నాడు. నాకు సిజేరియన్ అయిన తర్వాత బాగా లావయ్యాను. నాకు టీఎస్‌హెచ్ - 4 గా ఉంది. ప్రస్తుతం నేను లావు తగ్గాలనుకుంటున్నాను. అలాగే బాబుకు ఫీడింగ్ ఇస్తున్నాను. ఇలాంటి సమయంలో నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అలాగే బరువు తగ్గడానికి తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటో చెప్పండి?- ఓ సోదరి
జ: మీకు థైరాయిడ్ నార్మల్‌గానే ఉంది. కాబట్టి మీరు లావు తగ్గాలి అనుకుంటే ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం చేయడం తప్ప వేరే మార్గం లేదు. బాబుకు 14 నెలలు కాబట్టి ఇప్పటికి ఘనాహారం పెడుతూనే ఉంటారు. అందుకే ఇప్పుడు మీరు ఫీడింగ్ మానేసినా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పాలిస్తున్నప్పుడు సాధారణంగా మన కుటుంబాల్లో ఎక్కువగా అన్నం, బ్రెడ్డు ఇలాంటి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్లే ఈ బరువు పెరుగుతుంది. బరువు తగ్గాలంటే తప్పనిసరిగా ఆహారంలో కార్బోహైడ్రేట్లు తగ్గించి, ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవాలి. మీరు ఎవరైనా న్యూట్రిషనిస్ట్‌ని సంప్రదిస్తే మీరెంత బరువున్నారో చెక్ చేసి ఎంత తగ్గాలో దాన్ని బట్టి మీకు సరైన ఆహారపుటలవాట్లు సూచిస్తారు.