scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నేను ఏ తప్పూ చేయలేదు.. అయినా నాకెందుకీ శిక్ష!'

'ఎయిడ్స్.. నిరోధక మార్గాలు తప్ప పూర్తిస్థాయి చికిత్స లేని వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి సోకిందని తెలిస్తే చాలు.. వారు తప్పు చేశారు కాబట్టే ఆ వ్యాధి వచ్చిందని చుట్టుపక్కల ఉన్న వారు బలంగా నమ్ముతారు. ఈ క్రమంలో బాధితులను వారి మాటలతో మానసికంగానూ హింసిస్తారు. ఓ మహిళ తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ మహమ్మారి బారిన పడి ఒకానొక దశలో జీవితాన్ని ముగించేసుకోవాలనుకుంది.. కానీ ఆమెకు వచ్చిన ఓ ఆలోచన ఆ నిర్ణయాన్ని మార్చేసింది. అంతేకాదు.. ఈ సమాజంలో ఆమె ఎదుర్కొన్న మాటల ఈటెలు, బాధాకరమైన సంఘటనలు.. తనని మానసికంగా మరింత బలంగా తీర్చిదిద్దాయి.. దాంతో ఆమె ఎయిడ్స్‌పై పోరాడడమే కాదు.. చుట్టుపక్కల వారికీ అవగాహన కల్పిస్తూ తోటి వ్యాధిగ్రస్తులకు అండగానూ నిలుస్తోంది. అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం రండి.. నమస్కారం.'

Know More

Movie Masala

 
category logo

కరోనా సమయంలో ఈ గ్యాడ్జెట్లు మన దగ్గర ఉండాల్సిందే!

Here is a list of essential medical gadgets to have at home in this COVID time

పావని ఏడు నెలల గర్భిణి. ప్రెగ్నెన్సీకి ముందు నుంచే తనకు మధుమేహం ఉంది. డాక్టర్‌ సలహా మేరకు ఇన్సులిన్‌ తీసుకుంటూ షుగర్‌ లెవెల్స్‌ని అదుపులో ఉంచుకుంటోంది. అయితే కరోనా కారణంగా తను ఈసారి షుగర్‌ చెకప్‌కు వెళ్లలేకపోయింది. ఇంట్లోనే చెక్‌ చేసుకుందామంటే గ్లూకోమీటర్‌ అందుబాటులో లేకపోవడంతో కాస్త టెన్షన్‌ పడుతోంది.

శ్రావణి బరువు 70 కిలోలు. తన ఎత్తు ప్రకారం 55 కిలోలుండాలని డాక్టర్లు సూచించడంతో ప్రస్తుతం తాను అదనంగా ఉన్న 15 కిలోలు తగ్గే పనిలో పడింది. గత రెండు నెలలుగా జిమ్‌కి వెళ్లలేక, ఇంట్లో సరైన పరికరాలు లేకపోవడంతో చిన్న పాటి కసరత్తులు చేస్తోంది. మరి, తానెంత బరువు తగ్గానో చూసుకుందామంటే వెయింగ్‌ మెషీన్‌ కూడా తనకు అందుబాటులో లేదు.
ఇలాంటి అనుభవాలు మనలో చాలామందికి ఎదురయ్యే ఉంటాయి. ‘హా.. ఏముందిలే ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఎలాగో బరువు చెక్‌ చేసుకుంటాం కదా..! అంతమాత్రానికి వెయింగ్‌ మెషీన్‌ ఇంట్లో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి?’, ‘జ్వరమొచ్చినట్లనిపిస్తే ఎలాగూ డాక్టర్‌ దగ్గరికెళ్తే శరీర ఉష్ణోగ్రత చెక్‌ చేస్తారు కదా..’ అంటూ చాలామంది కొన్ని అత్యవసర గ్యాడ్జెట్లను కొనుగోలు చేసే విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. తద్వారా అప్పటికప్పుడు తమ ఆరోగ్య స్థితి ఎలా ఉందో తెలుసుకోవాలన్న అవసరం వస్తే తప్ప వాటి ప్రాధాన్యమేంటో అర్థం కాదు. ఈ కరోనా రోజుల్లోనూ చాలామంది ఇలాంటి అత్యవసర గ్యాడ్జెట్లు అందుబాటులో లేక అవస్థలు పడుతున్నారు. మరి, ఈ నేపథ్యంలో మనతో పాటు తప్పకుండా ఉండాల్సిన కొన్ని హెల్త్‌ గ్యాడ్జెట్లేంటో తెలుసుకొని ఇకనైనా వాటికి మన ఇంట్లో చోటిచ్చేద్దాం రండి..


డిజిటల్‌ థర్మామీటర్‌

ఒంట్లో కాస్త నలతగా అనిపించినప్పుడల్లా ముందు మన మదిలో మెదిలే సందేహం.. ‘నాకు జ్వరముందేమో’ అని! పిల్లలు నీరసంగా ఉన్నా మనకు ఇదే సందేహం వస్తుంది. మరి, ఈ విషయం తెలుసుకోవాలంటే థర్మామీటర్‌ ఉండాల్సిందే! కానీ చాలామంది ఇళ్లలో ఇది అందుబాటులో ఉండకపోవచ్చు. పైగా ఈ కరోనా సమయంలో అయితే ఏ చిన్న అనారోగ్యం ఎదురైనా అది కరోనా లక్షణమేమో అని భయపడిపోతున్నారు. ఆ సమయంలోనూ శరీర ఉష్ణోగ్రత ఎంత ఉందో తెలుసుకోవాలనుకునే వారు చాలామందే! మరి, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఆసుపత్రికి వెళ్లే అవసరం లేకుండా మన శరీర ఉష్ణోగ్రతను మనమే తెలుసుకోవాలంటే ఒక థర్మామీటర్‌ మన ఇంట్లో ఉండాల్సిందే!

HealthGadgetsgh650-1.jpg

ఫొటోలో చూపించినట్లుగా పిస్తోల్‌ మాదిరిగా ఉంటుందిది. దాన్ని నుదుటిపై చూపిస్తే.. అందులో ఉండే సెన్సర్‌ ద్వారా మన శరీర ఉష్ణోగ్రత వెనక ఉండే డిస్‌ప్లేపై చూపిస్తుంది. ఆఫీసులు, ఆస్పత్రులు, సూపర్‌ మార్కెట్లు మొదలైన చోట్ల చేసే థర్మల్‌ స్క్రీనింగ్‌లో వీటిని వాడుతుండడం మనకు తెలిసిందే. ఇలా ప్రస్తుతం బోలెడన్ని డిజిటల్‌ థర్మామీటర్స్‌ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటి నాణ్యత, డిజైన్‌ను బట్టి ధర రూ. 299 నుంచి రూ. 3,499 వరకు ఉంది.


డిజిటల్‌ వెయింగ్‌ మెషీన్‌

HealthGadgetsgh650-2.jpgబరువు తగ్గాలనుకునే వారైనా, పెరగడానికి ప్రయత్నిస్తున్న వారైనా, పిల్లలైనా, గర్భిణి స్త్రీలైనా.. ఇలా ఎవరైనా సరే.. ఎప్పటికప్పుడు తమ బరువును కొలుచుకోవడం సహజమే. అలాగని బరువెంతో తెలుసుకోవాలనిపించినప్పుడల్లా ఆసుపత్రికో, జిమ్‌ సెంటర్‌కో పరిగెత్తలేం. పైగా ఈ కరోనా లాక్‌డౌన్‌ సమయంలో జిమ్‌ సెంటర్స్‌ కూడా మూతపడ్డాయి. కాబట్టి ఇంట్లో బరువు కొలిచే మెషీన్‌ లేకపోతే.. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. ఒక వెయింగ్‌ మెషీన్‌ని బుక్‌ చేసుకోండి. ఇందులోనూ అనలాగ్‌ మెషీన్‌ కంటే డిజిటల్‌ది అయితే కచ్చితమైన బరువును సూచిస్తుంది. అలాంటి డిజిటల్‌ వెయింగ్‌ మెషీన్స్‌ ప్రస్తుతం మార్కెట్లో విభిన్నమైన డిజైన్లలో లభ్యమవుతున్నాయి. వాటి నాణ్యత, డిజైన్‌ను బట్టి ధర రూ. 525 నుంచి రూ. 1,132 వరకు ఉంది. ఈ మెషీన్‌ ద్వారా కేవలం మన బరువే కాదు.. మనం ఇంట్లో ఉపయోగించే ఇతర వస్తువుల బరువును కూడా కొలుచుకోవచ్చు.


బీపీ మానిటర్‌

ప్రస్తుతం ఇటు వ్యక్తిగతంగా, అటు వృత్తి ఉద్యోగాల పరంగా వివిధ రకాల ఒత్తిళ్లు, ఆందోళనలు ఎదురవుతూనే ఉన్నాయి. ఫలితంగా చిన్న వయసులోనే రక్తపోటులో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. పెద్ద వయసున్న వారికైతే ఈ సమస్యలు కామనే. ఇలా ఎవరైనా సరే.. పదే పదే బీపీ చెక్‌ చేసుకుంటూ తమ ఆరోగ్య పరిస్థితి పట్ల అలర్ట్‌గా ఉండడం చాలా ముఖ్యం. అయితే అందుకోసం ప్రతిసారీ క్లినిక్‌కు వెళ్లాలంటే కుదరకపోవచ్చు. కాబట్టి ఇంట్లోనే ఓ బీపీ మానిటర్‌ని తెచ్చి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఎవరంటే వాళ్లు స్వయంగా రక్తపోటును చెక్‌ చేసుకోవచ్చు.

HealthGadgetsgh650-3.jpg
ఫొటోలో చూపించినట్లుగా ఆసుపత్రిలో ఉండే బీపీ మెషీన్‌లాగే ఉంటుందిది. చేతికి చుట్టుకునే బెల్టు, దానికి అనుసంధానమైన డిజిటల్‌ మానిటర్‌ ఒకటి ఉంటుంది. ముందుగా చేతికి బెల్టును బిగించుకొని.. మానిటర్‌ ముందు భాగంలో ఉన్న స్టార్ట్‌ బటన్‌ని నొక్కితే చాలు.. సెకన్ల వ్యవధిలోనే మీ రక్తపోటు ఎంత ఉందో మానిటర్‌పై చూపిస్తుంది. అంతేకాదు.. అందులో గుండె కొట్టుకునే వేగాన్ని మానిటర్‌ చేసే ఆప్షన్‌ కూడా ఉంటుంది. సో.. ఇన్ని ఉపయోగాలున్న ఈ డిజిటల్‌ బీపీ మానిటర్‌ కూడా ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన గ్యాడ్జెట్‌. దీని డిజైన్‌, నాణ్యతను బట్టి ధర రూ. 858 నుంచి రూ. 2,698 వరకు ఉంటుంది.


పల్స్‌ ఆక్సీమీటర్‌

గుండె కొట్టుకునే వేగంతో పాటు శరీరానికి సరైన మొత్తంలో ఆక్సిజన్‌ అందుతోందో, లేదో మానిటర్‌ చేసేదే పల్స్‌ ఆక్సీమీటర్‌. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న ఈ తరుణంలో ఈ పల్స్‌ ఆక్సీమీటర్‌కి విపరీతమైన డిమాండ్‌ పెరిగిందంటున్నారు నిపుణులు. శరీరంలో ఆక్సిజన్‌ స్థాయులు పడిపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కరోనా లక్షణాల్లో ఇది కూడా ఒకటి. మరి, దీన్ని గుర్తించాలంటే నిర్ణీత వ్యవధుల్లో మన శరీరంలో ఆక్సిజన్‌ స్థాయుల్ని మానిటర్‌ చేసుకోవడం మంచిది. ఏదైనా అసాధారణంగా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించవచ్చు. కాబట్టి ప్రతి ఇంట్లో పల్స్‌ ఆక్సీమీటర్‌ తప్పకుండా ఉండాల్సిందే!

HealthGadgetsgh650-4.jpg
ఫొటోలో చూపించినట్లుగా చిన్న క్లిప్‌ మాదిరిగా ఉంటుందిది. దానిపై భాగంలో ఒక చిన్న మానిటర్‌ ఉంటుంది.. ఇప్పుడు ఈ పరికరం మధ్య భాగంలో ఉండే ఖాళీలో మన చూపుడు వేలిని ఉంచి.. దానిపై ఉండే బటన్‌ని నొక్కితే, నిర్ణీత వ్యవధిలో మానిటర్‌పై గుండె కొట్టుకునే వేగం, ఆక్సిజన్‌ స్థాయులు డిస్‌ప్లే అవుతాయి. ఈ పరికరం నాణ్యత, డిజైన్‌ను బట్టి మార్కెట్లో దీని ధర రూ. 1,799 నుంచి రూ. 4,750 వరకు ఉంది.


గ్లూకోమీటర్‌

మధుమేహంతో బాధపడే వారికి ఇది చాలా అవసరం. డయాబెటిస్‌ ఉన్న గర్భిణులు కూడా తమ చక్కెర స్థాయుల్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తినడానికి ముందు, తర్వాత షుగర్‌ లెవెల్స్‌ చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగని ప్రతిసారీ షుగర్‌ లెవెల్స్‌ చెక్‌ చేసుకోవడానికి ఆసుపత్రికి వెళ్లలేం. ఈ కరోనా సమయంలో అయితే గర్భిణులు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతోన్న వారైతే ఇంట్లోనే ఉండాలి. అత్యవసరమైతే తప్ప అడుగు బయట పెట్టకూడదు. కాబట్టి శరీరంలో చక్కెర స్థాయుల్ని ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవడానికి వీలుగా ఓ గ్లూకోమీటర్‌ని కొనేసుకోండి.

HealthGadgetsgh650-5.jpg
ఫొటోలో చూపించినట్లుగా పైభాగంలో మానిటర్‌ ఉండి.. దానికి బ్లడ్‌ గ్లూకోజ్‌ టెస్ట్‌ చేసుకునే స్ట్రిప్‌ అనుసంధానించుకునే వీలుంటుంది. ఇలాంటి స్ట్రిప్స్‌ గ్లూకోమీటర్‌తో పాటు చాలానే వస్తాయి. షుగర్‌ టెస్ట్‌ చేసుకున్న ప్రతిసారీ కొత్త స్ట్రిప్‌ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇంట్లోనే గ్లూకోజ్‌ పరీక్ష చేసుకోవడానికి వీలుగా ఉండే ఈ గ్లూకోమీటర్స్‌ ప్రస్తుతం మార్కెట్లో విభిన్న డిజైన్లలో లభ్యమవుతున్నాయి. వాటి ఆకృతి, నాణ్యత, ఆ ప్యాక్‌లో ఉన్న స్ట్రిప్స్‌ సంఖ్యను బట్టి ధర రూ. 659 నుంచి రూ. 1,799 వరకు ఉంది.


నెబ్యులైజర్‌

చిన్న పిల్లల్లో తరచూ జలుబు చేయడం, ముక్కు దిబ్బడేయడంతో శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాగే ఆస్తమాతో బాధపడే వారిలోనూ వాతావరణాన్ని బట్టి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటప్పుడు తక్షణ ఉపశమనం కోసం ఇంట్లో ఓ నెబ్యులైజర్‌ ఉండాలంటున్నారు నిపుణులు. ఫొటోలో చూపించినట్లుగా కంప్రెసర్‌, దానికి అనుసంధానించుకునేందుకు వీలుగా ట్యూబ్‌, మాస్క్‌, మెడికేషన్‌ ట్యాంక్‌, వేపొరైజర్‌ హెడ్‌.. వంటివన్నీ ఉంటాయి. ఈ నెబ్యులైజర్‌తో పాటు వచ్చిన హ్యాండ్‌బుక్‌ సూచనల మేరకు దీన్ని కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఇప్పుడు వైద్యులు సూచించిన పరిమాణంతో మెడిసిన్‌ లిక్విడ్‌ను మెడికేషన్‌ ట్యాంక్‌లో వేసి దానికి వేపొరైజర్‌ హెడ్‌, మాస్క్‌, ట్యూబ్‌.. వంటివన్నీ కనెక్ట్‌ చేసుకొని కంప్రెసర్‌ బటన్‌ని నొక్కాలి. తద్వారా ఆవిర్లు మాస్క్‌ నుంచి ముక్కు రంధ్రాలు, నోటి ద్వారా గొంతులోకి, ఊపిరితిత్తుల్లోకి చేరి.. ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

HealthGadgetsgh650-6.jpg
ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పద్ధతి ఆవిరి పట్టడంలా ఉంటుంది. చిన్న పిల్లలు మనలా పొగలు కక్కే వేడినీటితో ఆవిరి పట్టుకోలేరు కాబట్టి ఈ నెబ్యులైజర్‌ వారికి అనువుగా ఉంటుంది. అయితే వైద్యుల సూచనల మేరకు మాత్రమే దీన్ని వాడాల్సి ఉంటుంది. అలాగే ఇందులో వాడే మెడిసిన్‌ని కూడా వారు సూచించినట్లుగానే ఉపయోగించాలి. అంతేకాదు.. పదే పదే చిన్నారులకు దీన్ని ఉపయోగించడం కూడా ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు.. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే, అది కూడా వైద్యుల సలహా మేరకే ఈ నెబ్యులైజర్‌ వాడాల్సి ఉంటుంది. దీని డిజైన్‌, నాణ్యత, ఆటోమేటిక్‌ కంప్రెసర్‌ లేదంటే కరెంట్‌తో నడిచేది.. ఇలా దానికుండే ఫీచర్లను బట్టి ధర రూ. 899 నుంచి రూ. 2,447 వరకు ఉంది.

గమనిక: ఇంట్లో ఉండాల్సిన కొన్ని ముఖ్యమైన హెల్త్‌ గ్యాడ్జెట్లేంటో తెలుసుకున్నారుగా! అయితే ఇవి అప్పటికప్పుడు మీ ఆరోగ్య స్థితిని తెలియజేస్తాయి.. కాబట్టి వీటి ద్వారా మీ ఆరోగ్యాన్ని తరచూ మానిటర్‌ చేసుకుంటూనే.. అత్యవసర సమయాల్లో మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. లేదంటే మీ ఆరోగ్యాన్ని మీరే రిస్క్‌లో పెట్టుకున్న వారవుతారు. అలాగే నాణ్యత పరంగా ఎంత మంచివైనప్పటికీ ఒక్కోసారి ఈ గ్యాడ్జెట్లు కచ్చితమైన ఫలితాలను చూపించకపోవచ్చు. ఈక్రమంలో ఫలితాల విషయంలో అసాధారణ తేడాలు కనిపించినప్పుడు కేవలం వాటిపైనే ఆధారపడకుండా వెంటనే సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించడం అవసరం. అలాగే వీటి వాడకం విషయంలో ఏమాత్రం సందేహం ఉన్నా మీ ఫ్యామిలీ డాక్టర్‌ని ఫోన్‌ ద్వారా సంప్రదించడం లేదంటే మీరు చెకప్‌కి వెళ్లినప్పుడు వీటి గురించి పూర్తిగా తెలుసుకోవడం ఉత్తమం.

women icon@teamvasundhara
precautions-to-take-during-monsoon-to-prevent-viral-infections

చిటపట చినుకుల కాలంలో ఈ జాగ్రత్తలే మన రక్షణ కవచాలు!

రోజులు గడుస్తున్నా, కాలాలు మారుతున్నా ఇప్పుడు అందరి దృష్టి కరోనా పైనే ఉంది. ఎందుకంటే ఎటు నుంచి ఈ మహమ్మారి ముంచుకొస్తుందో తెలియని భయంతోనే అందరూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక మరోవైపు వృత్తిఉద్యోగాల రీత్యా బయటికి వెళ్లాల్సి వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే తమ తమ పనులను కొనసాగిస్తున్నారు చాలామంది. అయితే ఈ వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ కారణంగా బ్యాక్టీరియా, వైరస్‌, ఇతర ఇన్ఫెక్షన్లు త్వరగా విస్తరించే ప్రమాదం ఉంది. ఫలితంగా జలుబు, దగ్గు, జ్వరం.. వంటివి మరింత వేగంగా ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటాయి. అసలే కరోనాతో సతమతమవుతున్న ఈ రోజుల్లో మనం అప్పుడో ఇప్పుడో తుమ్మినా, దగ్గినా అది కరోనానేమో అని భయపడిపోతున్నాం. మరి, ఇలాంటి గడ్డు కాలంలో ఎలాంటి ఫ్లూ లక్షణాలు మన దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి, అవేంటో తెలుసుకొని మనమూ పాటించేద్దామా?

Know More

women icon@teamvasundhara
health-tips-for-new-moms-in-telugu
women icon@teamvasundhara
bollywood-serial-actress-mohena-kumari-singh-finally-tests-covid-19-negative-after-a-month

మొత్తానికి నెల రోజుల తర్వాత నెగెటివ్‌ వచ్చింది!

‘గెలుపు పొందే వరకూ అలుపు లేదు మనకు’ అన్నాడో సినీ కవి. ‘కొవిడ్‌ సోకినా నెగెటివ్‌ వచ్చేంత వరకూ మనో నిబ్బరాన్ని కోల్పోకు..’ అంటోంది బాలీవుడ్‌ బుల్లితెర బ్యూటీ మోహెనా కుమారి సింగ్‌. తనతో పాటు తన ఏడుగురు కుటుంబ సభ్యులు కరోనా బారిన పడి కోలుకొని ఇంటికి చేరుకున్నా.. ఆమెకు మాత్రం పదే పదే పాజిటివ్‌ రావడంతో కాస్త టెన్షన్‌ పడ్డానంటోందామె. అయినా గుండె ధైర్యంతో నెల రోజుల తర్వాత కరోనా నుంచి పూర్తిగా కోలుకొని తాజాగా ఇంటికి చేరుకుంది మోహెనా. ఈ క్రమంలో తనకు వైద్య సేవలందించిన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టిందీ బ్యూటిఫుల్‌ బేబ్‌. అంతేనా.. కొవిడ్‌ నుంచి కోలుకునే క్రమంలో తాను పాటించిన జాగ్రత్తలు, తీసుకున్న ఆహార పదార్థాలు.. వంటివన్నీ మరో పోస్ట్‌లో పంచుకుంటూ తన ఫ్యాన్స్‌లో ధైర్యం నింపిందీ అందాల తార. ఇలా మోహెన పెట్టిన ఈ రెండు ఇన్‌స్టా పోస్టులు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
these-are-the-benefits-while-you-stop-wearing-a-bra

‘బ్రా’ వేసుకోవడం మంచిదా? కాదా?

చక్కటి ఎద సౌష్ఠవానికి, సాగినట్లుగా కనిపించే వక్షోజాలను పట్టి ఉంచడానికి అమ్మాయిలంతా బ్రా ధరించడం కామనే. అందుకే అతివల వార్డ్‌రోబ్‌లో వీటికి ప్రత్యేకమైన షెల్ఫ్‌ కూడా ఉంటుంది. ఆయా దుస్తులకు తగినట్లుగా సాధారణ బ్రా, స్ట్రాప్‌లెస్‌, బ్రాలెట్‌, స్పోర్ట్స్‌ బ్రా.. వంటివి ఎంచుకొని కూల్‌గా, కంఫర్టబుల్‌గా కనిపించేస్తుంటారు అమ్మాయిలు. అయితే వీటిని ఇష్టపడి ధరించే వారి కంటే.. ‘తప్పదు.. వేసుకోవాల్సిందే..’ అంటూ అయిష్టంగా ధరించే వారే ఎక్కువమంది ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ లోదుస్తులు ఎద భాగానికి పట్టినట్లుగా ఉండడం, తద్వారా ఛాతీలో నొప్పి రావడం, ఆ ప్రదేశంలో చెమట వచ్చి రాషెస్‌లా ఏర్పడడం.. వంటి స్వీయానుభవాలే వారి ఫీలింగ్‌కి ప్రధాన కారణం. మరి, ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రా ధరించాల్సిందేనా? ఇది వేసుకోకపోతే నష్టమేంటి? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. అయితే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో తప్ప మరీ అసౌకర్యంగా అనిపిస్తే బ్రా ధరించకపోయినా ఎలాంటి నష్టం ఉండదంటున్నారు సంబంధిత నిపుణులు. ఇంకా చెప్పాలంటే అత్యవసరం కానప్పుడు బ్రా వేసుకోకపోతే ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు వారు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
celebrity-nutritionist-rujuta-diwekar-shares-5-food-tips-for-children-pursuing-school-from-home

ఆన్‌లైన్‌ క్లాసులు... ఈ అయిదు పదార్ధాలూ మీ డైట్ లో ఉన్నాయా?

కరోనా మనకు శారీరకంగా, మానసికంగా ఎంతో కీడు చేస్తున్నా.. టెక్నాలజీ విషయంలో మాత్రం మనల్ని ఓ మెట్టు ఎక్కించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటిదాకా ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ ఆప్షన్‌ లేని సంస్థలు సైతం తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాయి. అలాగే రోజూ స్కూలుకెళ్లి పాఠాలు నేర్చుకునే పిల్లలు కూడా ఇప్పుడు ఇంటిపట్టునే ఉంటూ ఆన్‌లైన్‌లోనే క్లాసులు వింటున్నారు. అయితే ఎలాగూ ఇంటి నుంచే క్లాసులు వింటున్నాం కదా అని బద్ధకిస్తూ, చదువు విషయంలో అశ్రద్ధ వహిస్తే.. పాఠాలు బుర్రకెక్కవు సరికదా తోటి పిల్లల కంటే వెనకబడే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లలు ఆన్‌లైన్‌ క్లాసులపై శ్రద్ధ వహించాలంటే వారికి అందించే ఆహారం పట్ల కూడా తల్లులు జాగ్రత్త వహించాలంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ పాఠాలు వింటోన్న పిల్లలు, యువత ఐదు రకాల పదార్థాలను రోజూ తప్పకుండా తీసుకోవాలంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారామె. మరి, ఏంటా పదార్థాలు? వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటి? రండి తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
marvelous-benefits-of-jaggery-in-telugu
women icon@teamvasundhara
health-benefits-of-wearing-mehandi-or-gorintaaku-in-telugu

అరచేతుల్లో విరబూసే గోరింట ఆరోగ్యానికీ మంచిదే..

'గోరింట పూసింది కొమ్మ లేకుండా.. మురిపాల అరచేత మొగ్గ తొడిగింది..' అన్న చందంగా మహిళల చేతుల్లో గోరింటాకు విరబూస్తుంది. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు.. అతివల చేతులు, కాళ్లు గోరింటాకుతో నిండిపోయి, పండిపోతాయి. ఈ మాసంలో చాలామంది తమ చేతులకు, పాదాలకు గోరింటాకు పెట్టుకోవడం అనేది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఆషాడంలో వచ్చే వాతావరణ మార్పుల ప్రభావం శరీరంపై పడకుండా ఉండి.. ఎలాంటి చర్మ వ్యాధులు రాకుండా చేసేందుకు గోరింటాకు ఎంతగానో ఉపకరిస్తుంది. కేవలం ఆషాఢంలోనే కాదు.. పెళ్లిళ్లు, పండగలు.. వంటిి ప్రత్యేక సందర్భాల్లో కూడా ముందుగా గుర్తొచ్చేది గోరింటాకే. ఇలా చేతులు, పాదాలను రకరకాల డిజైన్లతో పండించుకుని, మురిసిపోవడం మనకెంతో ఇష్టం కదూ.. మరి ఇంతలా మన మనసు దోచుకుంటున్న గోరింటాకు వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఓ లుక్కేద్దామా??

Know More

women icon@teamvasundhara
how-can-i-control-my-breast-milk-flow?

చనుబాల ఉత్పత్తి తగ్గేదెలా?

హాయ్‌ డాక్టర్‌. నా వయసు 27. ప్రస్తుతం నాకు ఏడు నెలల బాబున్నాడు. డెలివరీ తర్వాత రెండు నెలల దాకా ఆగకుండా బ్లీడింగ్‌ అయింది. ఇక మూడో నెల నుంచి పిరియడ్స్‌ ప్రారంభమయ్యాయి. ఫీడింగ్‌ ఇస్తున్నప్పుడు నెలసరి రాదని విన్నాను. కానీ నేను నా బాబుకు పూర్తిగా నా పాలే ఇస్తున్నాను. అయినా అదనంగా ఇంకా ఎక్కువ పాలు ఉత్పత్తవుతున్నాయి. ఇటు అధిక పాల ఉత్పత్తి, అటు నెలసరితో చాలా ఇబ్బందిగా ఉంది. నాకు, నా బాబుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవు. చనుబాలు మరీ ఎక్కువగా ఉత్పత్తి (ఓవర్‌ ఫ్లో) కాకుండా ఉండాలంటే నేనేం చేయాలి? అలాగే బిడ్డకు పాలిస్తున్నప్పుడు పిరియడ్స్‌ రావడం వల్ల ఏమైనా సమస్యలొస్తాయా? చెప్పండి. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
fashioner-shilpa-reddy-shares-her-covid-experience-through-insta-video

కరోనా నుంచి అలా బయటపడ్డా.. అదే నా ఆయుధం!

ఈ రోజుల్లో ఒంట్లో కాస్త నలతగా అనిపిస్తే చాలు.. మన మనసంతా కరోనా వైరస్‌ చుట్టూనే తిరుగుతోంది. మనకూ వైరస్‌ సోకిందేమోనని కంగారు పడిపోతున్నాం. ఇక ఎలాంటి లక్షణాలు లేని వారిలో కూడా కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఎవరి నుంచి ముప్పు ముంచుకొస్తుందో, మనలోనూ కరోనా వైరస్‌ ఉందేమోనని క్షణక్షణం భయంభయంగా గడుపుతున్నాం. ఇదిగో ఇలాంటి భయమే మనల్ని నిలువెల్లా ముంచుతుందంటున్నారు నగరానికి చెందిన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్పా రెడ్డి. కొద్దిరోజుల క్రితమే కొవిడ్‌ బారిన పడి కోలుకున్న ఆమె.. చక్కటి ఆహారం, వ్యాయామం, ధ్యానంతో ఈ వైరస్‌ను జయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మనలోని రోగనిరోధక శక్తే కరోనాను ఎదిరించే ఆయుధమని, దాన్ని దృఢంగా ఉంచుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించడంతో పాటు ధైర్యంగా అడుగు ముందుకేయాలంటూ సూచిస్తున్నారు. ఈ క్రమంలో తన కొవిడ్‌ అనుభవాలను, దాన్నుంచి బయటపడిన విధానాన్ని ఇన్‌స్టా వీడియోతో పాటు దానికి జతచేసిన సుదీర్ఘమైన క్యాప్షన్‌ రూపంలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో, పోస్ట్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Know More

women icon@teamvasundhara
health-benefits-of-doing-yoga-for-women-in-telugu
women icon@teamvasundhara
precautions-to-take-during-monsoon-to-prevent-viral-infections

చిటపట చినుకుల కాలంలో ఈ జాగ్రత్తలే మన రక్షణ కవచాలు!

రోజులు గడుస్తున్నా, కాలాలు మారుతున్నా ఇప్పుడు అందరి దృష్టి కరోనా పైనే ఉంది. ఎందుకంటే ఎటు నుంచి ఈ మహమ్మారి ముంచుకొస్తుందో తెలియని భయంతోనే అందరూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక మరోవైపు వృత్తిఉద్యోగాల రీత్యా బయటికి వెళ్లాల్సి వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే తమ తమ పనులను కొనసాగిస్తున్నారు చాలామంది. అయితే ఈ వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ కారణంగా బ్యాక్టీరియా, వైరస్‌, ఇతర ఇన్ఫెక్షన్లు త్వరగా విస్తరించే ప్రమాదం ఉంది. ఫలితంగా జలుబు, దగ్గు, జ్వరం.. వంటివి మరింత వేగంగా ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటాయి. అసలే కరోనాతో సతమతమవుతున్న ఈ రోజుల్లో మనం అప్పుడో ఇప్పుడో తుమ్మినా, దగ్గినా అది కరోనానేమో అని భయపడిపోతున్నాం. మరి, ఇలాంటి గడ్డు కాలంలో ఎలాంటి ఫ్లూ లక్షణాలు మన దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి, అవేంటో తెలుసుకొని మనమూ పాటించేద్దామా?

Know More

women icon@teamvasundhara
health-benefits-of-soaking-nuts-and-seeds-in-telugu
women icon@teamvasundhara
benefits-of-eating-breakfast-in-telugu

బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సిందే!

రోజూ మనం తీసుకునే ఆహారంలో అత్యంత కీలక పాత్ర పోషించేది ఉదయం తీసుకునే 'బ్రేక్‌ఫాస్టే'! రోజుని ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రారంభించాలంటే మంచి పోషకవిలువలున్న అల్పాహారం తీసుకోవడమూ ముఖ్యమే. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కొంతమందికి బ్రేక్‌ఫాస్ట్ చేయడానికే టైముండదు. మరికొంతమందైతే ఏదో ఒకటి తినేద్దాంలే అని సరిపెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతిని రకరకాల సమస్యలు చుట్టుముట్టే ప్రమాదమూ లేకపోలేదు. అలాగే మనం చేసే పనిపై సరిగ్గా శ్రద్ధ పెట్టలేకపోవచ్చు! ఇంతకీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటి? చేయకపోతే వచ్చే నష్టాలేంటి? చూద్దాం రండి...

Know More

women icon@teamvasundhara
health-benefits-of-olive-oil-in-telugu
women icon@teamvasundhara
is-pre-existing-diabetes-and-pregnancy-harm-baby?-in-telugu
women icon@teamvasundhara
advice-on-the-use-of-masks-in-the-context-of-covid-by-who

women icon@teamvasundhara
how-to-get-happy-sleep-in-telugu
women icon@teamvasundhara
malamalaika-arora-decodes-right-way-of-drinking-water-through-her-instagram-post

నీళ్లు ఎలా తాగాలో మీకు తెలుసా?

మనం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండడానికి రోజుకో కొత్త మార్గాన్ని అన్వేషిస్తుంటాం. ఈ క్రమంలో కొత్త కొత్త వ్యాయామాలు నేర్చుకోవడం, విభిన్న ఆహార పదార్థాల రుచిని ఆస్వాదించడంతో పాటు.. తీసుకునే ఆహారం కూడా ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? ఏ సమయానికి తింటున్నాం? వంటి విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంటాం. కానీ కొన్ని ప్రాథమిక అంశాలను మాత్రం మర్చిపోతుంటాం. ఇదే విషయం గురించి నొక్కి వక్కాణిస్తోంది బాలీవుడ్‌ ఫిట్టెస్ట్‌ బ్యూటీ మలైకా అరోరా. ఫిట్‌నెస్‌లో భాగంగా మనం పాటించే నియమాల్లో నీళ్లు తాగడం కూడా ఒకటని, అయితే నీళ్లు తాగడానికీ ఓ పద్ధతుంది అంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేసిందీ సుందరి. లాక్‌డౌన్‌లో భాగంగా ఇప్పటికే తన ఫిట్‌నెస్‌, హెల్దీ, బ్యూటీ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఫ్యాన్స్‌తో నిరంతరం టచ్‌లోనే ఉంది మలైకా. ఇక తాజాగా నీళ్లు ఎలా తాగాలో వివరిస్తూ తన అభిమానులకు ఆరోగ్య పాఠాలు చెబుతోంది.

Know More

women icon@teamvasundhara
will-three-abortions-affect-my-pregnancy?
women icon@teamvasundhara
govt-issues-new-guidelines-for-corona-patients-at-home

ఇంట్లోనే కరోనా వైద్యం.. కేంద్రం ఏం చెబుతోంది..?

కరోనా లక్షణాలు కనిపించిన బాధితులు ఇళ్లలోనే చికిత్స తీసుకునేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా 17 రోజుల పాటు ఇంట్లోనే ఉంటూ వైద్యుల సూచనలు, జాగ్రత్తలతో వైరస్‌ నుంచి బయటపడవచ్చని తెలిపింది. లక్షణాలు తీవ్రమైతే వైద్యుని సలహా తీసుకోవాలని.. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర జబ్బులతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలని సూచించింది. అలాగే పోషకాహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. కరోనా ఉన్నట్లు అనుమానించినా, నిర్ధారించినా ఆందోళన చెందవద్దని, వైద్యుల సూచనలు పాటించాలంది. అత్యవసరమైతే టోల్‌ఫ్రీ నంబరు 18005994455ను సంప్రదించాలని కోరింది.

Know More

women icon@teamvasundhara
tips-for-online-doctor-consultation-in-telugu

ఆన్‌లైన్‌లో డాక్టరుని సంప్రదిస్తున్నారా?

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వివిధ ఆస్పత్రులు ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. నిజానికి ఈ విధానం అంతకు ముందు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ.. లాక్‌డౌన్‌ తర్వాతే ఎక్కువ ప్రజాదరణ పొందిందని చెప్పాలి. కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులతో పాటు కొందరు వైద్యులు వ్యక్తిగతంగా కూడా ఈ సేవలను అందిస్తున్నారు. దీంతో ఇంటి నుంచే ఫోన్‌ లేదా వీడియో కాల్‌ ద్వారా డాక్టర్‌తో మాట్లాడి, అనుమానాలను నివృత్తి చేసుకునే వెలుసుబాటు లభిస్తోంది. ఈక్రమంలో ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌లో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
corona-virus-why-should-avoid-wearing-gloves-shopping-for-grocery

చేతులకు గ్లోవ్స్‌ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే!

కరోనా వైరస్‌ ప్రభావంతో మన జీవనశైలిలో చాలా మార్పులొచ్చాయి. వైరస్‌ నుంచి మనల్ని మనం రక్షించుకునే క్రమంలో అందరితో సామాజిక దూరం పాటిస్తున్నాం. ఫేస్‌ మాస్క్‌తోనే బయటకు వెళుతున్నాం. క్రమం తప్పకుండా శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటున్నాం. మరికొందరు రెగ్యులర్‌గా హ్యాండ్‌ గ్లోవ్స్‌ ధరిస్తున్నారు. అయితే అన్ని సందర్భాల్లో గ్లోవ్స్‌ వాడడం అంత మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య, వైద్య నిపుణులు. ప్రత్యేకించి గ్రాసరీ, ఫార్మసీ దుకాణాలకు వెళ్లినప్పుడు హ్యాండ్‌ గ్లోవ్స్‌ ధరించకపోవడమే మేలంటున్నారు.

Know More

women icon@teamvasundhara
causes-and-precautions-for-d-vitamin-deficiency-in-telugu
women icon@teamvasundhara
coronavirus-visiting-a-hospital-during-the-pandemic?-keep-these-points-in-mind

ఆస్పత్రికి వెళుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే!

సుదీర్ఘ లాక్‌డౌన్‌కి తెరదించుతూ ప్రభుత్వం దశలవారీగా కొన్ని సడలింపులిస్తోంది. దీంతో అన్ని రంగాల్లోనూ పనులు మొదలయ్యాయి. ఇక లాక్‌డౌన్‌ కాలంలో చాలా రోజుల పాటు ఎమర్జెన్సీ సేవలకే పరిమితమైన ఆస్పత్రులు కూడా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులున్న రోగులతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఆస్పత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే ఆర్థిక కారణాలతో లాక్‌డౌన్‌ సడలింపులిచ్చినా కరోనా వైరస్‌ మన మధ్యే ఉందన్నది జీర్ణించుకోలేని వాస్తవం. ఈ పరిస్థితుల్లో వివిధ కారణాలతో ఆస్పత్రులు, క్లినిక్‌లకు వెళ్లే రోగులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
when-should-i-have-sex-to-get-pregnant?
women icon@teamvasundhara
best-summer-fruits-to-eat-in-telugu
women icon@teamvasundhara
precautions-to-take-in-periods-on-this-menstrual-hygiene-day

నెలసరి సమయంలో హుషారుగా ఇలా...!

'ఆకాశం తన రెక్కలతో నను కప్పుతు ఉంటే..' అంటూ హుషారుగా తిరిగే అమ్మాయిలు సైతం నెలసరి రాగానే దిగులుగా, నీరసంగా అయిపోతారు. కానీ కొందరు మాత్రం ఎప్పటిలానే ఆడుతూపాడుతూ తిరిగేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే నెలసరి అనేది అందరమ్మాయిలకీ ఎదురయ్యే సహజమైన సమస్యే. అయితే దానిని ఎదుర్కొనే తీరులోనే తేడాలు ఉంటాయి. ఈ క్రమంలో నెలసరి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే హుషారుగా ఆడుతూపాడుతూ ఉండచ్చో ఓసారి మనం కూడా తెలుసుకుందాం రండి.. సాధారణంగా నెలసరి సమయంలో ఎక్కువమంది సతమతమయ్యేది అధిక రక్తస్రావం, కడుపునొప్పి సమస్యలతోనే. సరైన పోషకాహారం తీసుకుంటూ మన చుట్టూ ఉండే వాతావరణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యదాయకంగా ఉండేలా చూసుకుంటే వీటి నుంచి బయటపడచ్చు. ఒకవేళ సమస్య మరీ తీవ్రమైతే వెంటనే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి. ఇవన్నీ చేసినా వ్యక్తిగతంగా మనం కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తేనే ఎప్పటిలా తాజాగా, హుషారుగా ఉండటానికి వీలవుతుంది.

Know More

women icon@teamvasundhara
genetic-disorders-in-children
women icon@teamvasundhara
pain-during-sex-what-to-do
women icon@teamvasundhara
reasons-to-get-negative-emotions-during-lockdown

ఈ సంక్షోభ సమయంలో మానసిక ఆరోగ్యమూ ముఖ్యమే !

మనదేశమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎవరికి వారే స్వయంగా లాక్‌డౌన్‌ విధించుకుని బంధించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది కరోనా. ఈ నేపథ్యంలో కొందరు ఈ సమయాన్ని తమ కోసం, తమ ప్రియమైన వారి కోసం కేటాయించడానికి దొరికిన అవకాశంగా భావిస్తే.. మరికొందరి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ లాక్‌డౌన్‌ వేళ ఇంట్లో ఉన్నా కూడా కొందరు ఒత్తిడికి గురవుతున్నట్లు మానసిక నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకు బోలెడన్ని కారణాలున్నాయంటున్నారు వారు. ఇంతకీ, ఏంటా కారణాలు? వాటిని పరిష్కరించుకునే మార్గాల గురించి ‘మానసిక ఆరోగ్య అవగాహన వారోత్సవం’ సందర్భంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
these-celebrities-have-battled-mental-disorders

ఆ సమస్య గురించి ధైర్యంగా బయటపెట్టారు.. భరోసానిచ్చారు !

మనసు నిర్మలంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంటాడు. మంచైనా, చెడైనా అది మనసుపైనే ఆధారపడి ఉంటుంది. మనసులోని ఆలోచనలు సక్రమంగా లేకుంటే మనిషి మనుగడే కష్టమవుతుంది. అందుకే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యం తప్పనిసరి అని చెబుతారు సైకాలజిస్టులు. కానీ నేటి యాంత్రిక జీవనంతో స్కూలుకెళ్లే పిల్లల నుంచి పండు ముదుసలి దాకా అందరూ డిప్రెషన్ బారిన పడుతున్నారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న సెలబ్రిటీలు సైతం ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో 'మానసిక అవగాహన వారోత్సవం’ సందర్భంగా ఒత్తిడి, మానసిక ఆందోళన నుంచి బయటపడిన కొందరు ప్రముఖుల గురించి తెలుసుకుందాం. !

Know More

women icon@teamvasundhara
employees-facing-problems-after-lockdown-about-coronavirus
women icon@teamvasundhara
health-benefits-of-curry-leaves
women icon@teamvasundhara
juices-that-help-you-to-detoxify-your-body
women icon@teamvasundhara
natural-ways-to-control-high-blood-pressure

బీపీకి వీటితో చెక్ పెడదాం!

అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్).. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. ధమనుల్లో రక్తం అధిక ఒత్తిడితో ప్రసరించడం వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశాలున్నాయి. సాధారణ వ్యక్తులతో పాటు సుమారు 50 శాతం మందికి పైగా వైద్యులు సైతం అధిక రక్తపోటు సమస్యతో సతమతమవుతున్నారని తేలింది. దీనికి అధిక ఒత్తిడితో పాటు ఇతర అంశాలు కూడా కారణమవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఇలా చాప కింద నీరులా వ్యాపించే ఈ వ్యాధిపై అవగాహన కల్పించడం కోసమే ఏటా మే 17న 'వరల్డ్ హైపర్‌టెన్షన్ డే'ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సమస్య తలెత్తడానికి గల కారణాలు, దాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఉపకరించే కొన్ని సహజసిద్ధ మార్గాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-high-blood-pressure-during-pregnancy
women icon@teamvasundhara
lock-down-tips-to-take-healthy-food-in-this-lock-down-period