scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరి ప్రేమను అంగీకరించాలి? మీరే చెప్పండి!'

'ఏదైనా సరే కంటికింపుగా లేకపోతే మనసుకు నచ్చదంటారు. మరి ప్రేమ సంగతి ఏంటి ? ఒకరికి మనపై ఉండే ప్రేమ కూడా అంతేనా ? చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటేనే మనసుకు నచ్చుతామా ? ఈలోకంలో ఒక అమ్మాయి, అబ్బాయి తమ అభిప్రాయాలు ఒకటే కావడం వల్ల, ఒకరికొకరు నచ్చి ప్రేమలో పడుతున్నారా? లేక కేవలం ఆకర్షణతోనే ఒక్కటవుతున్నారా? ఇలా ప్రేమ గురించి తికమకపడుతూ సతమతమవుతోంది రాగిణి. ఇందుకు కారణం... ఉన్నట్టుండి ఇద్దరు యువకులు ఆమెకు తమ మనసులోని ప్రేమను తెలపడమే ! ఒకరు తొలుత తాను ప్రేమించిన వ్యక్తి అయితే.. మరొకరు తనను ప్రేమించిన వ్యక్తి. అందుకే ఇద్దరిలో ఎవర్ని ఎంచుకోవాలో అర్థం కాక మన సహాయం కోరుతోంది రాగిణి. ఆమె హృదయరాగమేంటో ఓసారి విని మీ అభిప్రాయంతో ఆమెకో పరిష్కారాన్ని చూపండి !'

Know More

Movie Masala

 
category logo

దీపిక చెప్పినట్లుగా ‘ఒత్తిడి’ని ఇలా చిత్తు చేద్దాం!

Deepika Padukone shares easy and effective tips to cope with mental health during COVID 19 Lockdown

దివ్య ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా గత మూడు నెలల నుంచి ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తోంది. అటు ఆఫీస్‌ పనికి తోడు ఇటు ఇంటి బాధ్యతలు, పిల్లల ఆలనా పాలన చూస్తూ తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది దివ్య.

లాక్‌డౌన్‌ కారణంగా మొన్నటిదాకా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసిన సుకన్యను తాజాగా వాళ్ల కంపెనీ విధుల నుంచి తొలగించింది. అటు ఉద్యోగం కోల్పోయి, ఇటు ఏం చేయాలో తోచక ఆందోళన చెందుతోందామె.
ఇలా కరోనా తెచ్చిన లాక్‌డౌన్‌ కారణంగా నెలలకు నెలలు ఇంటికే పరిమితమవడం, వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో చాలామంది ఒత్తిడి, ఆందోళనల మధ్యే కాలం వెళ్లదీస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా కొందరు తమ విధులకు హాజరవుతున్నప్పటికీ ఎటు నుంచి కరోనా ముప్పు ముంచుకొస్తుందోనని భయపడిపోతున్నారు. అయితే ఇలాంటి మానసిక సమస్యలు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని, వాటిని వీలైనంత తొందరగా దూరం చేసుకోవాలని అంటోంది బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె. ఈ క్రమంలోనే మానసిక ఒత్తిళ్లను దూరం చేసే కొన్ని చిట్కాలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అందరితో పంచుకుంది దీప్స్‌.

View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone) on


దీపికా పదుకొణె.. కేవలం నటిగానే కాదు.. సమాజ సేవలోనూ ముందే ఉంటుందీ బ్యూటీ. వివిధ కారణాల వల్ల 2014లో తీవ్ర మానసిక వేదనను అనుభవించిన ఆమె.. ఆపై దాన్నుంచి కోలుకొని అలాంటి సమస్యలతో బాధపడే వారికి అండగా నిలవాలనుకుంది. ఈ క్రమంలోనే 2015లో ‘ది లివ్‌ లవ్‌ లాఫ్‌’ అనే ఫౌండేషన్‌కు శ్రీకారం చుట్టింది. ఆందోళనలు, ఒత్తిళ్లతో సతమతమయ్యే ఎందరికో ప్రముఖ నిపుణులచే కౌన్సిలింగ్‌ ఇప్పిస్తోన్న ఈ అందాల తార.. మానసిక సమస్యల గురించి అందరిలో అవగాహన పెంచడానికి సందర్భం వచ్చినప్పుడల్లా వివిధ వేదికలపైన తన గళాన్ని వినిపిస్తుంటుంది. ఈ లాక్‌డౌన్‌ సమయంలోనూ ఒత్తిడిని చిత్తు చేయాలంటూ పలు చిట్కాలు సూచించిన దీప్స్‌.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా మరిన్ని సూచనలు చేస్తూ తన ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపింది.

View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone) on


మీకంటూ టైం కేటాయించుకోండి..
* మిమ్మల్ని మీరు ప్రేమించుకునేందుకు, మీకోసం మీరు సమయం కేటాయించుకునేందుకు చక్కటి అవకాశం ఇది. అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్లకు మద్దతుగా, తోడుగా నిలవండి. అలా ఇతరులకు సహాయపడడం వల్ల మనసుకు తృప్తిగా అనిపిస్తుంది.
* మీలోని భయాలను గుర్తించి వాటి నుంచి బయటపడే మార్గం ఆలోచించండి. ఎవరూ ఒంటరి కాదు.. అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
* బాధను మన అనుకున్న వారితో పంచుకుంటే గుండె భారం తగ్గుతుందంటారు. అలాగే మీ మనసుకు దగ్గరైన వారితో మీ మానసిక సమస్యలను పంచుకోండి.
* సుఖ నిద్ర కూడా మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోండి.
* నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నేను ఈ లాక్‌డౌన్‌లో నాకంటూ కాస్త సమయం కేటాయించుకున్నాను. మీరూ మీకు నచ్చిన పనులు చేస్తూ ఎంజాయ్‌ చేయడానికి ఇదే సదవకాశం. పుస్తకాలు చదవడం, డ్యాన్స్‌ నేర్చుకోవడం, వంట చేయడం, వార్డ్‌రోబ్‌ను మీకు నచ్చినట్లుగా సర్దుకోవడం.. ఇలా మీకు ఏది ఇష్టమనిపిస్తే అదే చేయండి.. తద్వారా మీ మనసుకు ఉల్లాసంగా అనిపిస్తుంది.

View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone) on


లైఫ్‌స్టైల్‌ మార్చండి!
* కరోనా మన జీవితాల్ని అస్తవ్యస్తం చేసింది. మన జీవనశైలిని పూర్తిగా మార్చేసింది. అయినా మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఒక స్థిరమైన లైఫ్‌స్టైల్‌ని అలవాటు చేసుకోవాలి. ఇంట్లో ఉంటున్నాం కదా అని ఇష్టమొచ్చినప్పుడు పడుకోవడం, ఆలస్యంగా నిద్ర లేవడం కాకుండా.. నిద్రకు, భోజనానికి, వర్కవుట్‌కు, ఇతర పనులు చేయడానికి ఒక కచ్చితమైన ప్రణాళిక వేసుకోండి. రోజూ అదే ఫాలో అవ్వండి.
* ఇంట్లో ఉన్నామని బోర్‌గా ఫీలవ్వకుండా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంపై దృష్టి పెట్టండి. నేనైతే ఈ లాక్‌డౌన్‌ సమయంలో కొత్త కొత్త వంటకాలు ప్రయత్నిస్తున్నా. అలా మీరూ మీలో ఉన్న అభిరుచులను తట్టి లేపి అందులో నైపుణ్యం సాధించండి.
* మనలో కొత్త ఉత్సాహాన్ని నింపి, మనసును ఉరకలెత్తించే శక్తి ప్రకృతికి ఉంది. అందుకే నిరాశలో కూరుకుపోయినప్పుడు, నిస్సత్తువగా అనిపించినప్పుడు పచ్చటి చెట్ల మధ్య కాసేపు గడపండి.. ఆకాశం వైపు చూడండి.. పక్షుల కిలకిలారావాలు వినండి.. ఇవన్నీ మానసిక సమస్యలకు సహజసిద్ధమైన ఔషధాల్లాంటివి.
* ధ్యానం, వ్యాయామం, యోగా.. మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటు ఫిట్‌నెస్‌ను అందిస్తాయివి. కాబట్టి క్రమం తప్పకుండా వీటిని మీ రోజువారీ లైఫ్‌స్టైల్‌లో భాగం చేసుకోండి.

View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone) on


నచ్చిన వారితో ఇష్టంగా..!
* ఈ లాక్‌డౌన్‌ సమయంలో నేను ప్రశాంతంగా ఉండడానికి ఓ కారణం.. నా మనసుకు నచ్చిన వారితో సమయం గడపడమే. కాబట్టి మీరు కూడా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి గడపడం, వారితో ఫోన్‌లో మాట్లాడడం, స్నేహితులతో పాత జ్ఞాపకాలు నెమరువేసుకోవడం.. వంటివి చేయచ్చు.
* సంగీతం అంటే ఎవరికిష్టముండదు చెప్పండి. మనసులోని ఒత్తిడి, ఆందోళనల్ని దూరం చేసే అద్భుత శక్తి మ్యూజిక్‌ సొంతం. అందుకే మీరూ ఒత్తిడిని అధిగమించడానికి మీ మనసుకు నచ్చిన పాటలు వినండి.
* ఇతరులతో పోల్చుకుంటే మనల్ని మనం తక్కువ చేసుకున్నట్లే లెక్క. అందుకే ఎలా ఉన్నా సరే.. మిమ్మల్ని మీరు అంగీకరించండి.. మీలో ఉన్న బలాల్ని, ప్రత్యేకతలను గుర్తించి, వాటిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ప్రయత్నించండి.
* మన చుట్టూ జరిగే విషయాల్ని తెలుసుకోవడంలో తప్పు లేదు. అయితే వాటి గురించే పదే పదే ఆలోచిస్తూ, అవి మీ మనసుపై ప్రతికూల ప్రభావం చూపకుండా చూసుకునే బాధ్యత మీదే.
* సమస్య తీవ్రతను బట్టి మానసిక నిపుణులను సంప్రదించడానికి వెనకాడకండి. వారు మీకు తప్పకుండా పరిష్కారం చూపిస్తారు.

ఇలా మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచే ఉద్దేశంతో దీపిక పంచుకున్న ఈ చిట్కాలు మనమూ పాటించేద్దాం.. కరోనా సంక్షోభ సమయంలో కంటికి కనిపించకుండా మనల్ని వేధిస్తోన్న ఒత్తిడి, ఆందోళనల్ని తరిమికొడదాం.. సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకుందాం.. ఏమంటారు?





women icon@teamvasundhara
tips-to-take-care-of-your-breasts-in-telugu

వీటి విషయంలో జాగ్రత్త వహిస్తున్నారా..?

తీరైన శరీరాకృతిలో వక్ష సంపదది కూడా కీలకపాత్రే. అయితే వివిధ కారణాల వల్ల వాటి ఆకృతిలో, పరిమాణంలో తేడాలు చోటుచేసుకుని సాగిపోయినట్లుగా కనిపిస్తుంటాయి. దీనివల్ల ఒక్కోసారి వయసు పైబడిన వారిగానూ కనిపించే అవకాశం ఉంది. ఫలితంగా కొందరిలో ఇది న్యూనతకూ దారితీస్తుంది. అయితే వక్షోజాల్లో ఇలాంటి తేడాలు ఎందుకొస్తాయి..? అని మీరెప్పుడైనా ఆలోచించారా..? ఎందుకంటే మనం రోజూ చేసే కొన్ని కొన్ని పనులు కూడా వీటి అందం, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి అవేంటో తెలుసుకొని మహిళలంతా తమ ఎద సంపదను ఆరోగ్యంగా ఉంచుకోవడం తప్పనిసరి. అందుకు రోజువారీ ఆహారపుటలవాట్లే కాదు.. వ్యాయామం కూడా తోడ్పడుతుంది. ఈ క్రమంలో ఆరోగ్యవంతమైన వక్ష సంపదను పొందాలంటే గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
is-bleeding-injurious-during-pregnancy?
women icon@teamvasundhara
immunity-boosting-foods-in-rainy-season-by-celebrity-nutritionist-rujuta-diwekar

వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచే పదార్ధాలివే!

కాలం మారుతున్న కొద్దీ వివిధ రకాల ఇన్ఫెక్షన్లు మన శరీరంపై దాడి చేస్తుంటాయి. వాటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే రోగనిరోధక వ్యవస్థను దృఢంగా ఉంచుకోవాలి. ఈ క్రమంలోనే ఆయా కాలాల్లో లభించే పండ్లు, కాయగూరలు తీసుకోవడంతో పాటు ఆహార నియమాల్లోనూ పలు మార్పులు-చేర్పులు చేసుకోవడం అవసరం అంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ వంటి విషయాల్లో అందరిలో అవగాహన నింపేందుకు తరచూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టే రుజుత.. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆహార నియమాలేంటో వివరిస్తూ ఇటీవలే మరో పోస్ట్‌ పెట్టారు. ఈ చిటపట చినుకుల కాలంలో ఏవి తినాలి? ఏవి తినకూడదు? ఫలితంగా ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలేంటి? తదితర విషయాల గురించి వివరిస్తూ ఆమె పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Know More

women icon@teamvasundhara
chef-anahita-dhondy-share-the-recipe-of-an-immunity-boosting-kadha-through-her-instagram

ఇమ్యూనిటీ కోసం రోజుకు రెండు సార్లు ఈ డ్రింక్‌ తాగండి!

ప్రస్తుతం ప్రపంచమంతా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తోన్న కరోనా మహమ్మారికి మందు లేదు. ఇప్పటివరకు టీకా కూడా రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం రోగనిరోధక శక్తిని పెంచుకోవడం. అందుకే చాలామంది తమకు తెలిసిన ఇంటి చిట్కాలు పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఇమ్యూనిటీని పెంచుకోవడానికి చాలామంది సెలబ్రిటీలు కూడా తాము పాటిస్తోన్న చిట్కాలను సోషల్‌ మీడియా వేదికగా అందరితో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ చెఫ్‌ అనహితా దోండే కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడే ఓ అద్భుతమైన డ్రింక్‌ను, దాని రెసిపీని ఇన్‌స్టాలో వీడియో రూపంలో పంచుకున్నారు. అంతేకాదు.. రోజూ రెండుసార్లు ఈ పానీయం తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలు సొంతమవుతాయంటున్నారామె. మరి, ఇంతకీ ఏంటా డ్రింక్‌? అదెలా తయారుచేస్తారు? తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
plants-and-flowers-may-boost-your-mood-and-make-you-happy-in-telugu

ఈ మొక్కలు మీ మూడ్‌ని మార్చేస్తాయ్!

వ్యక్తిగత లేదా వృత్తిపరమైన జీవితాల్లో భాగంగా మనకు అప్పుడప్పుడూ ఎదురయ్యే సమస్యలు మనలో మానసిక ఒత్తిడి, ఆందోళనను కలిగిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం అందరి జీవితాల్లోనూ సర్వసాధారణంగా మారిపోయాయి. అందుకే వీటి నుంచి బయటపడడానికి చాలామంది వ్యాయామం, ధ్యానం.. వంటివి చేయడంతోపాటు వారికి నచ్చిన పనులు చేయడం.. వంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని కూడా అనుసరిస్తున్నారు. అయితే ఇంట్లో మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే కొన్ని మొక్కలు కూడా మనలో ఉండే మానసిక ఆందోళనల్ని దూరం చేస్తాయన్న విషయం మీకు తెలుసా..? అవునండీ.. మీరు చదివింది నిజమే.. కొన్ని మొక్కలు మన మూడ్‌ని ప్రభావితం చేయడమే కాదు.. ఒత్తిడి, ఆందోళనల్ని తగ్గించి తిరిగి మనల్ని ఉత్సాహంగా ఉండేలా చేస్తాయట! ఇంతకీ ఆ మొక్కలేంటో ఓసారి మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
shilpa-shetty-shares-she-has-accepted-vegetarianism-completely-through-her-long-instagram-post

ఒకప్పుడు నాన్‌వెజ్ కి బానిసయ్యా.. ఇప్పుడు శాకాహారిగా మారిపోయా!

చికెన్‌, మటన్‌, చేపలు.. వీటి పేర్లు చెబుతుంటూనే మాంసాహార వంటకాలు గుర్తొచ్చి నోరూరిపోతుంది కదూ! మరి, నాన్‌వెజ్‌ వంటకాలంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. అయితే కొందరు మూగ జీవాల పట్ల ప్రేమ, ప్రకృతి పరిరక్షణలో భాగంగా తమ ఆహారపుటలవాట్లను మార్చుకుంటారు. మాంసాహారం పూర్తిగా మానేసి శాకాహారాన్ని తమ జీవనవిధానంలో ఓ భాగం చేసుకుంటారు. కొందరు బాలీవుడ్‌ ముద్దుగుమ్మలూ ఇందుకు అతీతం కాదు. ఆ లిస్టులో తాజాగా చేరిపోయింది బాలీవుడ్‌ ఫిట్టెస్ట్‌ బ్యూటీ శిల్పా శెట్టి. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై మక్కువ చూపే ఈ అందాల తార.. ఇప్పుడు పూర్తి వెజిటేరియన్‌గా మారిపోయింది. దీన్ని ఓ మైలురాయిగా అభివర్ణిస్తూ.. అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేశానని, ఎన్నో ఏళ్ల కల సాకారమైందంటూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టింది. అంతేకాదు.. శాకాహారాన్ని తన సంపూర్ణ ఆహారంగా మలచుకున్న ఈ యమ్మీ మమ్మీ.. దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఆ పోస్ట్‌లో భాగంగా వివరించింది.

Know More

women icon@teamvasundhara
ayush-guidelines-to-relief-from-seasonal-flu-in-telugu
women icon@teamvasundhara
precautions-to-take-during-monsoon-to-prevent-viral-infections

చిటపట చినుకుల కాలంలో ఈ జాగ్రత్తలే మన రక్షణ కవచాలు!

రోజులు గడుస్తున్నా, కాలాలు మారుతున్నా ఇప్పుడు అందరి దృష్టి కరోనా పైనే ఉంది. ఎందుకంటే ఎటు నుంచి ఈ మహమ్మారి ముంచుకొస్తుందో తెలియని భయంతోనే అందరూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక మరోవైపు వృత్తిఉద్యోగాల రీత్యా బయటికి వెళ్లాల్సి వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే తమ తమ పనులను కొనసాగిస్తున్నారు చాలామంది. అయితే ఈ వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ కారణంగా బ్యాక్టీరియా, వైరస్‌, ఇతర ఇన్ఫెక్షన్లు త్వరగా విస్తరించే ప్రమాదం ఉంది. ఫలితంగా జలుబు, దగ్గు, జ్వరం.. వంటివి మరింత వేగంగా ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటాయి. అసలే కరోనాతో సతమతమవుతున్న ఈ రోజుల్లో మనం అప్పుడో ఇప్పుడో తుమ్మినా, దగ్గినా అది కరోనానేమో అని భయపడిపోతున్నాం. మరి, ఇలాంటి గడ్డు కాలంలో ఎలాంటి ఫ్లూ లక్షణాలు మన దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి, అవేంటో తెలుసుకొని మనమూ పాటించేద్దామా?

Know More

women icon@teamvasundhara
how-to-get-pregnant-with-this-problem?
women icon@teamvasundhara
bollywood-serial-actress-mohena-kumari-singh-finally-tests-covid-19-negative-after-a-month

మొత్తానికి నెల రోజుల తర్వాత నెగెటివ్‌ వచ్చింది!

‘గెలుపు పొందే వరకూ అలుపు లేదు మనకు’ అన్నాడో సినీ కవి. ‘కొవిడ్‌ సోకినా నెగెటివ్‌ వచ్చేంత వరకూ మనో నిబ్బరాన్ని కోల్పోకు..’ అంటోంది బాలీవుడ్‌ బుల్లితెర బ్యూటీ మోహెనా కుమారి సింగ్‌. తనతో పాటు తన ఏడుగురు కుటుంబ సభ్యులు కరోనా బారిన పడి కోలుకొని ఇంటికి చేరుకున్నా.. ఆమెకు మాత్రం పదే పదే పాజిటివ్‌ రావడంతో కాస్త టెన్షన్‌ పడ్డానంటోందామె. అయినా గుండె ధైర్యంతో నెల రోజుల తర్వాత కరోనా నుంచి పూర్తిగా కోలుకొని తాజాగా ఇంటికి చేరుకుంది మోహెనా. ఈ క్రమంలో తనకు వైద్య సేవలందించిన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టిందీ బ్యూటిఫుల్‌ బేబ్‌. అంతేనా.. కొవిడ్‌ నుంచి కోలుకునే క్రమంలో తాను పాటించిన జాగ్రత్తలు, తీసుకున్న ఆహార పదార్థాలు.. వంటివన్నీ మరో పోస్ట్‌లో పంచుకుంటూ తన ఫ్యాన్స్‌లో ధైర్యం నింపిందీ అందాల తార. ఇలా మోహెన పెట్టిన ఈ రెండు ఇన్‌స్టా పోస్టులు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
natural-antibiotics-in-your-kitchen
women icon@teamvasundhara
these-are-the-benefits-while-you-stop-wearing-a-bra

‘బ్రా’ వేసుకోవడం మంచిదా? కాదా?

చక్కటి ఎద సౌష్ఠవానికి, సాగినట్లుగా కనిపించే వక్షోజాలను పట్టి ఉంచడానికి అమ్మాయిలంతా బ్రా ధరించడం కామనే. అందుకే అతివల వార్డ్‌రోబ్‌లో వీటికి ప్రత్యేకమైన షెల్ఫ్‌ కూడా ఉంటుంది. ఆయా దుస్తులకు తగినట్లుగా సాధారణ బ్రా, స్ట్రాప్‌లెస్‌, బ్రాలెట్‌, స్పోర్ట్స్‌ బ్రా.. వంటివి ఎంచుకొని కూల్‌గా, కంఫర్టబుల్‌గా కనిపించేస్తుంటారు అమ్మాయిలు. అయితే వీటిని ఇష్టపడి ధరించే వారి కంటే.. ‘తప్పదు.. వేసుకోవాల్సిందే..’ అంటూ అయిష్టంగా ధరించే వారే ఎక్కువమంది ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ లోదుస్తులు ఎద భాగానికి పట్టినట్లుగా ఉండడం, తద్వారా ఛాతీలో నొప్పి రావడం, ఆ ప్రదేశంలో చెమట వచ్చి రాషెస్‌లా ఏర్పడడం.. వంటి స్వీయానుభవాలే వారి ఫీలింగ్‌కి ప్రధాన కారణం. మరి, ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రా ధరించాల్సిందేనా? ఇది వేసుకోకపోతే నష్టమేంటి? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. అయితే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో తప్ప మరీ అసౌకర్యంగా అనిపిస్తే బ్రా ధరించకపోయినా ఎలాంటి నష్టం ఉండదంటున్నారు సంబంధిత నిపుణులు. ఇంకా చెప్పాలంటే అత్యవసరం కానప్పుడు బ్రా వేసుకోకపోతే ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు వారు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
celebrity-nutritionist-rujuta-diwekar-shares-5-food-tips-for-children-pursuing-school-from-home

ఆన్‌లైన్‌ క్లాసులు... ఈ అయిదు పదార్ధాలూ మీ డైట్ లో ఉన్నాయా?

కరోనా మనకు శారీరకంగా, మానసికంగా ఎంతో కీడు చేస్తున్నా.. టెక్నాలజీ విషయంలో మాత్రం మనల్ని ఓ మెట్టు ఎక్కించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటిదాకా ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ ఆప్షన్‌ లేని సంస్థలు సైతం తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాయి. అలాగే రోజూ స్కూలుకెళ్లి పాఠాలు నేర్చుకునే పిల్లలు కూడా ఇప్పుడు ఇంటిపట్టునే ఉంటూ ఆన్‌లైన్‌లోనే క్లాసులు వింటున్నారు. అయితే ఎలాగూ ఇంటి నుంచే క్లాసులు వింటున్నాం కదా అని బద్ధకిస్తూ, చదువు విషయంలో అశ్రద్ధ వహిస్తే.. పాఠాలు బుర్రకెక్కవు సరికదా తోటి పిల్లల కంటే వెనకబడే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లలు ఆన్‌లైన్‌ క్లాసులపై శ్రద్ధ వహించాలంటే వారికి అందించే ఆహారం పట్ల కూడా తల్లులు జాగ్రత్త వహించాలంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ పాఠాలు వింటోన్న పిల్లలు, యువత ఐదు రకాల పదార్థాలను రోజూ తప్పకుండా తీసుకోవాలంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారామె. మరి, ఏంటా పదార్థాలు? వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటి? రండి తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
health-benefits-of-wearing-mehandi-or-gorintaaku-in-telugu

అరచేతుల్లో విరబూసే గోరింట ఆరోగ్యానికీ మంచిదే..

'గోరింట పూసింది కొమ్మ లేకుండా.. మురిపాల అరచేత మొగ్గ తొడిగింది..' అన్న చందంగా మహిళల చేతుల్లో గోరింటాకు విరబూస్తుంది. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు.. అతివల చేతులు, కాళ్లు గోరింటాకుతో నిండిపోయి, పండిపోతాయి. ఈ మాసంలో చాలామంది తమ చేతులకు, పాదాలకు గోరింటాకు పెట్టుకోవడం అనేది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఆషాడంలో వచ్చే వాతావరణ మార్పుల ప్రభావం శరీరంపై పడకుండా ఉండి.. ఎలాంటి చర్మ వ్యాధులు రాకుండా చేసేందుకు గోరింటాకు ఎంతగానో ఉపకరిస్తుంది. కేవలం ఆషాఢంలోనే కాదు.. పెళ్లిళ్లు, పండగలు.. వంటిి ప్రత్యేక సందర్భాల్లో కూడా ముందుగా గుర్తొచ్చేది గోరింటాకే. ఇలా చేతులు, పాదాలను రకరకాల డిజైన్లతో పండించుకుని, మురిసిపోవడం మనకెంతో ఇష్టం కదూ.. మరి ఇంతలా మన మనసు దోచుకుంటున్న గోరింటాకు వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఓ లుక్కేద్దామా??

Know More

women icon@teamvasundhara
why-do-i-feel-pain-during-sex?
women icon@teamvasundhara
how-can-i-control-my-breast-milk-flow?

చనుబాల ఉత్పత్తి తగ్గేదెలా?

హాయ్‌ డాక్టర్‌. నా వయసు 27. ప్రస్తుతం నాకు ఏడు నెలల బాబున్నాడు. డెలివరీ తర్వాత రెండు నెలల దాకా ఆగకుండా బ్లీడింగ్‌ అయింది. ఇక మూడో నెల నుంచి పిరియడ్స్‌ ప్రారంభమయ్యాయి. ఫీడింగ్‌ ఇస్తున్నప్పుడు నెలసరి రాదని విన్నాను. కానీ నేను నా బాబుకు పూర్తిగా నా పాలే ఇస్తున్నాను. అయినా అదనంగా ఇంకా ఎక్కువ పాలు ఉత్పత్తవుతున్నాయి. ఇటు అధిక పాల ఉత్పత్తి, అటు నెలసరితో చాలా ఇబ్బందిగా ఉంది. నాకు, నా బాబుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవు. చనుబాలు మరీ ఎక్కువగా ఉత్పత్తి (ఓవర్‌ ఫ్లో) కాకుండా ఉండాలంటే నేనేం చేయాలి? అలాగే బిడ్డకు పాలిస్తున్నప్పుడు పిరియడ్స్‌ రావడం వల్ల ఏమైనా సమస్యలొస్తాయా? చెప్పండి. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
health-benefits-of-banana-in-telugu
women icon@teamvasundhara
fashioner-shilpa-reddy-shares-her-covid-experience-through-insta-video

కరోనా నుంచి అలా బయటపడ్డా.. అదే నా ఆయుధం!

ఈ రోజుల్లో ఒంట్లో కాస్త నలతగా అనిపిస్తే చాలు.. మన మనసంతా కరోనా వైరస్‌ చుట్టూనే తిరుగుతోంది. మనకూ వైరస్‌ సోకిందేమోనని కంగారు పడిపోతున్నాం. ఇక ఎలాంటి లక్షణాలు లేని వారిలో కూడా కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఎవరి నుంచి ముప్పు ముంచుకొస్తుందో, మనలోనూ కరోనా వైరస్‌ ఉందేమోనని క్షణక్షణం భయంభయంగా గడుపుతున్నాం. ఇదిగో ఇలాంటి భయమే మనల్ని నిలువెల్లా ముంచుతుందంటున్నారు నగరానికి చెందిన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్పా రెడ్డి. కొద్దిరోజుల క్రితమే కొవిడ్‌ బారిన పడి కోలుకున్న ఆమె.. చక్కటి ఆహారం, వ్యాయామం, ధ్యానంతో ఈ వైరస్‌ను జయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మనలోని రోగనిరోధక శక్తే కరోనాను ఎదిరించే ఆయుధమని, దాన్ని దృఢంగా ఉంచుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించడంతో పాటు ధైర్యంగా అడుగు ముందుకేయాలంటూ సూచిస్తున్నారు. ఈ క్రమంలో తన కొవిడ్‌ అనుభవాలను, దాన్నుంచి బయటపడిన విధానాన్ని ఇన్‌స్టా వీడియోతో పాటు దానికి జతచేసిన సుదీర్ఘమైన క్యాప్షన్‌ రూపంలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో, పోస్ట్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Know More

women icon@teamvasundhara
benefits-of-rice-water-in-telugu
women icon@teamvasundhara
precautions-to-take-during-monsoon-to-prevent-viral-infections

చిటపట చినుకుల కాలంలో ఈ జాగ్రత్తలే మన రక్షణ కవచాలు!

రోజులు గడుస్తున్నా, కాలాలు మారుతున్నా ఇప్పుడు అందరి దృష్టి కరోనా పైనే ఉంది. ఎందుకంటే ఎటు నుంచి ఈ మహమ్మారి ముంచుకొస్తుందో తెలియని భయంతోనే అందరూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక మరోవైపు వృత్తిఉద్యోగాల రీత్యా బయటికి వెళ్లాల్సి వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే తమ తమ పనులను కొనసాగిస్తున్నారు చాలామంది. అయితే ఈ వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ కారణంగా బ్యాక్టీరియా, వైరస్‌, ఇతర ఇన్ఫెక్షన్లు త్వరగా విస్తరించే ప్రమాదం ఉంది. ఫలితంగా జలుబు, దగ్గు, జ్వరం.. వంటివి మరింత వేగంగా ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటాయి. అసలే కరోనాతో సతమతమవుతున్న ఈ రోజుల్లో మనం అప్పుడో ఇప్పుడో తుమ్మినా, దగ్గినా అది కరోనానేమో అని భయపడిపోతున్నాం. మరి, ఇలాంటి గడ్డు కాలంలో ఎలాంటి ఫ్లూ లక్షణాలు మన దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి, అవేంటో తెలుసుకొని మనమూ పాటించేద్దామా?

Know More

women icon@teamvasundhara
benefits-of-eating-breakfast-in-telugu

బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సిందే!

రోజూ మనం తీసుకునే ఆహారంలో అత్యంత కీలక పాత్ర పోషించేది ఉదయం తీసుకునే 'బ్రేక్‌ఫాస్టే'! రోజుని ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రారంభించాలంటే మంచి పోషకవిలువలున్న అల్పాహారం తీసుకోవడమూ ముఖ్యమే. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కొంతమందికి బ్రేక్‌ఫాస్ట్ చేయడానికే టైముండదు. మరికొంతమందైతే ఏదో ఒకటి తినేద్దాంలే అని సరిపెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతిని రకరకాల సమస్యలు చుట్టుముట్టే ప్రమాదమూ లేకపోలేదు. అలాగే మనం చేసే పనిపై సరిగ్గా శ్రద్ధ పెట్టలేకపోవచ్చు! ఇంతకీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటి? చేయకపోతే వచ్చే నష్టాలేంటి? చూద్దాం రండి...

Know More

women icon@teamvasundhara
health-benefits-of-curd-in-telugu
women icon@teamvasundhara
advice-on-the-use-of-masks-in-the-context-of-covid-by-who

women icon@teamvasundhara
how-to-get-happy-sleep-in-telugu

women icon@teamvasundhara
malamalaika-arora-decodes-right-way-of-drinking-water-through-her-instagram-post

నీళ్లు ఎలా తాగాలో మీకు తెలుసా?

మనం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండడానికి రోజుకో కొత్త మార్గాన్ని అన్వేషిస్తుంటాం. ఈ క్రమంలో కొత్త కొత్త వ్యాయామాలు నేర్చుకోవడం, విభిన్న ఆహార పదార్థాల రుచిని ఆస్వాదించడంతో పాటు.. తీసుకునే ఆహారం కూడా ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? ఏ సమయానికి తింటున్నాం? వంటి విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంటాం. కానీ కొన్ని ప్రాథమిక అంశాలను మాత్రం మర్చిపోతుంటాం. ఇదే విషయం గురించి నొక్కి వక్కాణిస్తోంది బాలీవుడ్‌ ఫిట్టెస్ట్‌ బ్యూటీ మలైకా అరోరా. ఫిట్‌నెస్‌లో భాగంగా మనం పాటించే నియమాల్లో నీళ్లు తాగడం కూడా ఒకటని, అయితే నీళ్లు తాగడానికీ ఓ పద్ధతుంది అంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేసిందీ సుందరి. లాక్‌డౌన్‌లో భాగంగా ఇప్పటికే తన ఫిట్‌నెస్‌, హెల్దీ, బ్యూటీ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఫ్యాన్స్‌తో నిరంతరం టచ్‌లోనే ఉంది మలైకా. ఇక తాజాగా నీళ్లు ఎలా తాగాలో వివరిస్తూ తన అభిమానులకు ఆరోగ్య పాఠాలు చెబుతోంది.

Know More

women icon@teamvasundhara
govt-issues-new-guidelines-for-corona-patients-at-home

ఇంట్లోనే కరోనా వైద్యం.. కేంద్రం ఏం చెబుతోంది..?

కరోనా లక్షణాలు కనిపించిన బాధితులు ఇళ్లలోనే చికిత్స తీసుకునేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా 17 రోజుల పాటు ఇంట్లోనే ఉంటూ వైద్యుల సూచనలు, జాగ్రత్తలతో వైరస్‌ నుంచి బయటపడవచ్చని తెలిపింది. లక్షణాలు తీవ్రమైతే వైద్యుని సలహా తీసుకోవాలని.. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర జబ్బులతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలని సూచించింది. అలాగే పోషకాహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. కరోనా ఉన్నట్లు అనుమానించినా, నిర్ధారించినా ఆందోళన చెందవద్దని, వైద్యుల సూచనలు పాటించాలంది. అత్యవసరమైతే టోల్‌ఫ్రీ నంబరు 18005994455ను సంప్రదించాలని కోరింది.

Know More

women icon@teamvasundhara
different-grams-of-health-benefits-in-telugu
women icon@teamvasundhara
tips-for-online-doctor-consultation-in-telugu

ఆన్‌లైన్‌లో డాక్టరుని సంప్రదిస్తున్నారా?

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వివిధ ఆస్పత్రులు ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. నిజానికి ఈ విధానం అంతకు ముందు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ.. లాక్‌డౌన్‌ తర్వాతే ఎక్కువ ప్రజాదరణ పొందిందని చెప్పాలి. కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులతో పాటు కొందరు వైద్యులు వ్యక్తిగతంగా కూడా ఈ సేవలను అందిస్తున్నారు. దీంతో ఇంటి నుంచే ఫోన్‌ లేదా వీడియో కాల్‌ ద్వారా డాక్టర్‌తో మాట్లాడి, అనుమానాలను నివృత్తి చేసుకునే వెలుసుబాటు లభిస్తోంది. ఈక్రమంలో ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌లో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
how-many-days-to-take-thyroxine-tablets?
women icon@teamvasundhara
corona-virus-why-should-avoid-wearing-gloves-shopping-for-grocery

చేతులకు గ్లోవ్స్‌ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే!

కరోనా వైరస్‌ ప్రభావంతో మన జీవనశైలిలో చాలా మార్పులొచ్చాయి. వైరస్‌ నుంచి మనల్ని మనం రక్షించుకునే క్రమంలో అందరితో సామాజిక దూరం పాటిస్తున్నాం. ఫేస్‌ మాస్క్‌తోనే బయటకు వెళుతున్నాం. క్రమం తప్పకుండా శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటున్నాం. మరికొందరు రెగ్యులర్‌గా హ్యాండ్‌ గ్లోవ్స్‌ ధరిస్తున్నారు. అయితే అన్ని సందర్భాల్లో గ్లోవ్స్‌ వాడడం అంత మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య, వైద్య నిపుణులు. ప్రత్యేకించి గ్రాసరీ, ఫార్మసీ దుకాణాలకు వెళ్లినప్పుడు హ్యాండ్‌ గ్లోవ్స్‌ ధరించకపోవడమే మేలంటున్నారు.

Know More

women icon@teamvasundhara
health-benefits-of-guava-or-jaama-in-telugu
women icon@teamvasundhara
health-tips-in-summer-to-avoid-dehydration-in-telugu
women icon@teamvasundhara
coronavirus-visiting-a-hospital-during-the-pandemic?-keep-these-points-in-mind

ఆస్పత్రికి వెళుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే!

సుదీర్ఘ లాక్‌డౌన్‌కి తెరదించుతూ ప్రభుత్వం దశలవారీగా కొన్ని సడలింపులిస్తోంది. దీంతో అన్ని రంగాల్లోనూ పనులు మొదలయ్యాయి. ఇక లాక్‌డౌన్‌ కాలంలో చాలా రోజుల పాటు ఎమర్జెన్సీ సేవలకే పరిమితమైన ఆస్పత్రులు కూడా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులున్న రోగులతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఆస్పత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే ఆర్థిక కారణాలతో లాక్‌డౌన్‌ సడలింపులిచ్చినా కరోనా వైరస్‌ మన మధ్యే ఉందన్నది జీర్ణించుకోలేని వాస్తవం. ఈ పరిస్థితుల్లో వివిధ కారణాలతో ఆస్పత్రులు, క్లినిక్‌లకు వెళ్లే రోగులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
health-benefits-of-banana-flour-by-celebrity-nutritionist-rujuta-diwekar
women icon@teamvasundhara
health-benefits-of-fenugreek-or-menthulu-in-telugu
women icon@teamvasundhara
precautions-to-take-in-periods-on-this-menstrual-hygiene-day

నెలసరి సమయంలో హుషారుగా ఇలా...!

'ఆకాశం తన రెక్కలతో నను కప్పుతు ఉంటే..' అంటూ హుషారుగా తిరిగే అమ్మాయిలు సైతం నెలసరి రాగానే దిగులుగా, నీరసంగా అయిపోతారు. కానీ కొందరు మాత్రం ఎప్పటిలానే ఆడుతూపాడుతూ తిరిగేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే నెలసరి అనేది అందరమ్మాయిలకీ ఎదురయ్యే సహజమైన సమస్యే. అయితే దానిని ఎదుర్కొనే తీరులోనే తేడాలు ఉంటాయి. ఈ క్రమంలో నెలసరి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే హుషారుగా ఆడుతూపాడుతూ ఉండచ్చో ఓసారి మనం కూడా తెలుసుకుందాం రండి.. సాధారణంగా నెలసరి సమయంలో ఎక్కువమంది సతమతమయ్యేది అధిక రక్తస్రావం, కడుపునొప్పి సమస్యలతోనే. సరైన పోషకాహారం తీసుకుంటూ మన చుట్టూ ఉండే వాతావరణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యదాయకంగా ఉండేలా చూసుకుంటే వీటి నుంచి బయటపడచ్చు. ఒకవేళ సమస్య మరీ తీవ్రమైతే వెంటనే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి. ఇవన్నీ చేసినా వ్యక్తిగతంగా మనం కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తేనే ఎప్పటిలా తాజాగా, హుషారుగా ఉండటానికి వీలవుతుంది.

Know More

women icon@teamvasundhara
health-benefits-of-triphala-powder-by-expert
women icon@teamvasundhara
reasons-why-drinking-water-from-a-clay-pot-can-be-beneficial-during-summer
women icon@teamvasundhara
reasons-to-get-negative-emotions-during-lockdown

ఈ సంక్షోభ సమయంలో మానసిక ఆరోగ్యమూ ముఖ్యమే !

మనదేశమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎవరికి వారే స్వయంగా లాక్‌డౌన్‌ విధించుకుని బంధించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది కరోనా. ఈ నేపథ్యంలో కొందరు ఈ సమయాన్ని తమ కోసం, తమ ప్రియమైన వారి కోసం కేటాయించడానికి దొరికిన అవకాశంగా భావిస్తే.. మరికొందరి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ లాక్‌డౌన్‌ వేళ ఇంట్లో ఉన్నా కూడా కొందరు ఒత్తిడికి గురవుతున్నట్లు మానసిక నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకు బోలెడన్ని కారణాలున్నాయంటున్నారు వారు. ఇంతకీ, ఏంటా కారణాలు? వాటిని పరిష్కరించుకునే మార్గాల గురించి ‘మానసిక ఆరోగ్య అవగాహన వారోత్సవం’ సందర్భంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
these-celebrities-have-battled-mental-disorders

ఆ సమస్య గురించి ధైర్యంగా బయటపెట్టారు.. భరోసానిచ్చారు !

మనసు నిర్మలంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంటాడు. మంచైనా, చెడైనా అది మనసుపైనే ఆధారపడి ఉంటుంది. మనసులోని ఆలోచనలు సక్రమంగా లేకుంటే మనిషి మనుగడే కష్టమవుతుంది. అందుకే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యం తప్పనిసరి అని చెబుతారు సైకాలజిస్టులు. కానీ నేటి యాంత్రిక జీవనంతో స్కూలుకెళ్లే పిల్లల నుంచి పండు ముదుసలి దాకా అందరూ డిప్రెషన్ బారిన పడుతున్నారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న సెలబ్రిటీలు సైతం ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో 'మానసిక అవగాహన వారోత్సవం’ సందర్భంగా ఒత్తిడి, మానసిక ఆందోళన నుంచి బయటపడిన కొందరు ప్రముఖుల గురించి తెలుసుకుందాం. !

Know More

women icon@teamvasundhara
how-to-increase-my-breast-size