scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నేను ఏ తప్పూ చేయలేదు.. అయినా నాకెందుకీ శిక్ష!'

'ఎయిడ్స్.. నిరోధక మార్గాలు తప్ప పూర్తిస్థాయి చికిత్స లేని వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి సోకిందని తెలిస్తే చాలు.. వారు తప్పు చేశారు కాబట్టే ఆ వ్యాధి వచ్చిందని చుట్టుపక్కల ఉన్న వారు బలంగా నమ్ముతారు. ఈ క్రమంలో బాధితులను వారి మాటలతో మానసికంగానూ హింసిస్తారు. ఓ మహిళ తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ మహమ్మారి బారిన పడి ఒకానొక దశలో జీవితాన్ని ముగించేసుకోవాలనుకుంది.. కానీ ఆమెకు వచ్చిన ఓ ఆలోచన ఆ నిర్ణయాన్ని మార్చేసింది. అంతేకాదు.. ఈ సమాజంలో ఆమె ఎదుర్కొన్న మాటల ఈటెలు, బాధాకరమైన సంఘటనలు.. తనని మానసికంగా మరింత బలంగా తీర్చిదిద్దాయి.. దాంతో ఆమె ఎయిడ్స్‌పై పోరాడడమే కాదు.. చుట్టుపక్కల వారికీ అవగాహన కల్పిస్తూ తోటి వ్యాధిగ్రస్తులకు అండగానూ నిలుస్తోంది. అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం రండి.. నమస్కారం.'

Know More

Movie Masala

 
category logo

అకాలంలో అవాంఛిత గర్భం రాకుండా ఉండాలంటే...

Contraceptive Care Guidelines during Covid-19 Pandemic by Gynecology Expert Dr. Savita Devi

దివిజకు ఇటీవలే వివాహమైంది. ఏడాది వరకూ పిల్లలు వద్దనుకొని పలు గర్భ నిరోధక పద్ధతులు పాటిస్తున్నారా దంపతులు. అయితే ఈ కొవిడ్‌-19 సమయంలో గర్భ నిరోధక సాధనాలు అందుబాటులో లేకపోవడం వల్ల అవాంఛిత గర్భం దాల్చిందామె. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన దివిజ.. తన సొంత వైద్యంతో పీకల మీదకు తెచ్చుకుంది.

భూమికి రెండేళ్ల కూతురుంది. అయితే ఆమెకున్న ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌ సమస్యతో అండం ఎప్పుడు విడుదలవుతుందో సరైన అవగాహన లేక అవాంఛిత గర్భం దాల్చింది. దాన్ని తొలగించుకోవడానికి ప్రస్తుత పరిస్థితుల్లో సరైన వైద్య సదుపాయాలు లేక సతమతమవుతోంది.

వీళ్లే కాదు.. చాలామంది మహిళలు అండం విడుదలవడంపై సరైన అవగాహన లేకపోవడం, సురక్షితమైన గర్భ నిరోధక పద్ధతులేంటో తెలియకపోవడంతో ఇష్టం లేకుండానే గర్భం ధరిస్తున్నారు. వీటికి తోడు కొవిడ్‌-19 మహమ్మారి విజృంభిస్తోన్న ఈ సమయంలో మార్కెట్లో గర్భ నిరోధక సాధనాలు సైతం అందుబాటులో లేవు. ఫలితంగా రాబోయే రోజుల్లో దాదాపు 30 లక్షల మంది మహిళలు అవాంఛిత గర్భం ధరించే అవకాశాలున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.Savithagy200.jpg

అంతేకాదు.. ఇలా ఇష్టం లేకుండా వచ్చిన గర్భాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రస్తుతం సదుపాయాలు కూడా లేకపోవడంతో అసురక్షిత గర్భస్రావాల సంఖ్య పెరుగుతుందని, అది అధిక మాతృ మరణాల రేటుకు దారితీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి, ఇలా జరగకుండా ఉండాలంటే సురక్షిత గర్భ నిరోధక పద్ధతుల గురించి ప్రతి మహిళా అవగాహన పెంచుకోవడం ఉత్తమం అంటున్నారు ప్రముఖ గైనకాలజీ నిపుణులు డాక్టర్‌ వై. సవితాదేవి. ఈ నేపథ్యంలోనే అవాంఛిత గర్భాలను, అసురక్షిత గర్భస్రావాలను నిరోధించే ఆ సురక్షిత గర్భ నిరోధక పద్ధతుల గురించి ఇలా వివరించారు.

గణాంకాలేం చెబుతున్నాయి?

లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర వస్తువులు మినహా మిగతా వస్తువులపై తాత్కాలిక నిషేధం కొనసాగుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రవాణా సౌకర్యాలు లేకపోవడం, మందుల షాపులు, ఆసుపత్రులు అందుబాటులో లేకపోవడం వల్ల మహిళలకు గర్భ నిరోధక సలహాలు, చికిత్సలు అందించే వీల్లేకుండా పోయింది. ఫలితంగా రాబోయే రోజుల్లో శిశు జననాల రేటు గణనీయంగా పెరుగుతుందని FRHS (Foundation for Reproductive Health Services India) సంస్థ, కొంతమంది ఆరోగ్య నిపుణులతో కలిసి చేసిన అధ్యయనంలో తేలింది. దీని ప్రకారం.. రాబోయే రోజుల్లో 20-30 లక్షల మంది మహిళలు అవాంఛిత గర్భం దాల్చే అవకాశాలున్నాయని.. వీరిలో సుమారు ఏడు లక్షల మంది అసురక్షిత గర్భస్రావ పద్ధతులు పాటిస్తారని, ఫలితంగా మాతృ మరణాల రేటు పెరుగుతుందని వారు అంచనా వేశారు.

‘సురక్షితం’ ఆరోగ్యదాయకం!

అయితే వారి అంచనా ప్రకారం.. పట్టణాల్లో కంటే పల్లెటూళ్లలోనే శిశు జననాల రేటు అధికంగా ఉంటుందని అర్థమవుతుంది. దీనికి కారణాలూ లేకపోలేదు. అక్కడ ఆసుపత్రి సేవలు అందుబాటులో లేకపోవడం, ప్రజా రవాణా సౌకర్యం లేకపోవడం, మెడికల్‌ షాపులు తెరవకపోవడం, ఒకవేళ తెరిచినా లాక్‌డౌన్‌ వల్ల అందులో సంబంధిత మందులు లభ్యం కాకపోవడం, చాలావరకు ఆరోగ్య సిబ్బంది కొవిడ్‌ 19 రోగులకు చికిత్స అందివ్వడంలో బిజీగా ఉండడం.. తదితర కారణాల వల్ల స్త్రీలకు అవసరమైన గర్భ నిరోధక సలహాలు కానీ, చికిత్సలు కానీ అందడం లేదన్నది వాస్తవం. ఇలా అవాంఛిత గర్భాలెక్కువైనప్పుడు తల్లీబిడ్డలిద్దరి జీవితాలూ ప్రమాదంలో పడతాయి. కాబట్టి సురక్షితమైన గర్భ నిరోధక పద్ధతుల గురించి ముందుగానే అవగాహన పెంచుకుంటే మాతృ-శిశు మరణాల రేటు చాలా వరకు తగ్గుతుంది. అలాగే పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారు.

గర్భ నిరోధక పద్ధతులివే!

ఈ ఆధునిక కాలంలో మనకు ఎన్నో రకాల గర్భ నిరోధక సాధనాలున్నాయి. వీటిలో కొన్ని సహజమైనవి, కొన్ని తాత్కాలికమైనవి, కొన్ని శాశ్వతమైనవి, కొన్ని హార్మోన్ల వాడకం ద్వారా జరిగేవి, కొన్ని ఆపరేషన్ల ద్వారా జరిగేవి. అయితే అందరికీ అన్ని పద్ధతులు సరిపోకపోవచ్చు. ఎవరికి ఏ పద్ధతి సరిపోతుందన్నది వారి వయసు, ఇది వరకే వారికి పుట్టిన పిల్లల సంఖ్య, వారి జీవన శైలి, వారికి ఉండే ఇతర ఆరోగ్య సమస్యలు.. మొదలైన వాటిని బట్టి నిర్ణయిస్తారు. అయితే కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తోన్న ఈ రోజుల్లో ఇన్ని రకాలుగా ఆలోచించే అవకాశం, సరైన సదుపాయాలు లేకపోవచ్చు. ఎందుకంటే లాక్‌డౌన్‌ సమయంలో అన్ని రకాల పరీక్షలు చేయించుకోవడం కుదరకపోవచ్చు.. అలాగే అన్ని రకాల గర్భ నిరోధక సాధనాలు అందుబాటులో ఉండకపోవచ్చు.. కాబట్టి సహజసిద్ధమైన గర్భ నిరోధక పద్ధతుల గురించి అవగాహన పెంచుకోవడం ఉత్తమం. అలాగే ఈ సహజ పద్ధతులు ఎక్కువగా ప్రతికూల ప్రభావం చూపవు.. సరికదా వీటిని పాటించే క్రమంలో డాక్టర్లను సంప్రదించాల్సిన అవసరం కూడా ఉండదు. వాటి గురించి ముందుగానే తెలుసుకుంటే ఎవరికి వారు సులభంగా అనుసరించచ్చు.

1. సహజ పద్ధతులు

Contraceptivecare650-4.jpg

అండం విడుదలను గుర్తించే పద్ధతి

ఈ పద్ధతిలో భాగంగా అండం ఎప్పుడు విడుదలవుతుందో గుర్తించి ఆ సమయంలో కలయికలో పాల్గొనకుండా జాగ్రత్తపడాలి. గర్భాశయ ముఖద్వారం నుంచి పలుచని తీగలా సాగే స్రావాలు విడుదలవడం, పొత్తి కడుపులో కొద్ది పాటి నొప్పి రావడం, అండం విడుదలవడానికి ముందు రోజున తక్కువ శరీర ఉష్ణోగ్రత నమోదవడం.. వంటి లక్షణాలను బట్టి మనం అండం ఎప్పుడు విడుదలవుతుందో సులభంగా గుర్తించచ్చు.

Contraceptivecare650-2.jpg

క్యాలెండర్‌ పద్ధతి

రుతుచక్రాన్ని బట్టి అండం ఎప్పుడు విడుదలవుతుందో గుర్తించడాన్ని క్యాలెండర్‌ పద్ధతి అంటారు. నెలసరి సక్రమంగా వచ్చే వాళ్లు నెలసరి మొదలైన రోజు నుంచి లెక్కపెట్టుకుంటే 10-20 రోజుల మధ్యలో అండం విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో భార్యాభర్తలిద్దరూ దూరంగా ఉండడం లేదంటే ఇతర కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడం.. వంటివి చేయాల్సి ఉంటుంది. కానీ నెలసరి మరీ త్వరగానో లేదంటే ఆలస్యంగానో వచ్చే వారిలో ఇలా లెక్కించుకోవడం కాస్త కష్టమే.

Contraceptivecare650-9.jpg

Lactational Amenorrhea Method (LAM)

పాలిచ్చే తల్లులకు అండం విడుదల కాదు కాబట్టి.. ఈ సమయంలో గర్భం ధరించే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పచ్చు. అయితే బిడ్డ పూర్తిగా తల్లిపాలపైన ఆధారపడినప్పుడు, ఇంకా నెలసరి మొదలవ్వకపోతే మాత్రమే ఈ పద్ధతి సక్సెసవుతుంది. సాధారణంగా.. కాన్పు అయిన తర్వాత ఆరు నెలల వరకు మాత్రమే ఈ పద్ధతి పనిచేస్తుంది.

2. బ్యారియర్‌ కాంట్రాసెప్టివ్‌ పద్ధతి

Contraceptivecare650-6.jpg

ఈ కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో తేలిగ్గా పాటించగలిగిన గర్భ నిరోధక పద్ధతి బ్యారియర్‌ కాంట్రాసెప్టివ్‌ పద్ధతి. ఇందులో భాగంగా స్త్రీలో విడుదలయ్యే అండం, పురుషుడి నుంచి వచ్చే శుక్రకణంతో కలవకుండా అడ్డంకులు ఏర్పరచడమన్నమాట. ఈ క్రమంలో పురుషులు వాడే కండోమ్‌, స్త్రీలు వాడే డయాఫ్రమ్‌, వీర్యకణాలను నిర్వీర్యపరిచే జెల్లీలు (Spermicidal Jellies).. వంటివి ఎవరికి వారే వాడుకుంటూ గర్భం రాకుండా జాగ్రత్తపడచ్చు. అయితే పై మూడు సహజ పద్ధతులతో పాటు ఈ బ్యారియర్‌ కాంట్రాసెప్టివ్‌ పద్ధతి అన్ని సందర్భాల్లో సక్సెస్‌ కాకపోవచ్చు.

3. హార్మోన్ల గర్భనిరోధక పద్ధతులు

Contraceptivecare650.jpg

ప్రస్తుతం మనకు రకరకాల హార్మోన్ల గర్భనిరోధక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి.. గర్భ నిరోధక మాత్రలు, హార్మోన్ల ఇంజెక్షన్లు, హార్మోన్ల ఇంప్లాంట్లు, హార్మోన్ల లూప్‌లు, వెజైనల్‌ రింగులు.

గర్భ నిరోధక మాత్రలు

గర్భ నిరోధక మాత్రలు కూడా రెండు, మూడు రకాలున్నాయి.

కంబైన్డ్‌ ఓరల్‌ కాంట్రాసెప్టివ్‌

ఈ మాత్రలు కొత్తగా వేసుకునే వారు మాత్రం తప్పనిసరిగా డాక్టర్‌ని సంప్రదించి.. వారు చెప్పిన పరీక్షలు చేయించుకొని, వారి సలహా ప్రకారం మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఇక ఇంతకుముందే ఈ పిల్స్‌ వాడుతున్నట్లయితే కనుక వాటిని ఈ లాక్‌డౌన్‌ సమయంలో అదే విధంగా కొనసాగించచ్చు.

Contraceptivecare650-7.jpg

మినీ పిల్‌

ఈ మాత్రలు కూడా గర్భ నిరోధక మాత్రల కంటే ఎక్కువ సురక్షితమైనవైనప్పటికీ మొట్టమొదటిసారి వాడేటప్పుడు మాత్రం డాక్టర్‌ సలహా తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఆరోగ్య సమస్యలున్న స్త్రీలు, పాలిచ్చే తల్లులు కూడా ఈ పిల్స్‌ వాడచ్చు.

ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్‌ పిల్‌

సాధారణ పరిస్థితుల్లో ఈ పిల్‌.. కలయిక జరిగినప్పుడల్లా వాడమని డాక్టర్లెవ్వరూ సలహా ఇవ్వరు. కానీ ఈ కొవిడ్‌-19 సమయంలో ఒక్కోసారి దీని వాడకం తప్పనిసరి కావచ్చు. ఎందుకంటే ఇది నేరుగా మెడికల్‌ షాప్‌లో దొరుకుతుంది కాబట్టి డాక్టర్‌ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. అయినా కూడా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీన్ని వాడాల్సి ఉంటుంది. అది కూడా కలయిక జరిగిన ఒకట్రెండు రోజుల్లోపల.. అందులోనూ తక్కువ డోస్‌ ఉండే ఒకే ఒక మాత్ర వాడితే సరిపోతుంది. ఎక్కువ రోజులు నిర్లక్ష్యం చేస్తే ఈ మాత్ర పనిచేయదు.

Contraceptivecare650-5.jpg

IUCD (Intra Uterine Contraceptive Device)

ప్రస్తుతం ఎన్నో రకాల IUCD లు మనకు అందుబాటులో ఉన్నాయి. మల్టీలోడ్‌ కాపర్‌-టిలు, హార్మోన్లు ఉన్న మిరేనా వంటి కాపర్‌-టిలు చాలా బాగా పనిచేస్తాయి. కానీ ఇవి అమర్చడానికి డాక్టర్‌ అవసరం ఉంటుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో అది కుదరకపోవచ్చు. అయితే ఒక సందర్భంలో మాత్రం ఇవి అమర్చడానికి వీలుంటుంది. సుఖ ప్రసవమైనా, సి-సెక్షన్‌ అయినా ఆసుపత్రిలో కాన్పు జరిగిన వెంటనే కాపర్‌-టి అమర్చుకొని ఇంటికి వెళ్లచ్చు.

Contraceptivecare650-8.jpg

ఇంప్లాంట్లు ఇంజెక్షన్లు

ఇంప్లాంట్లు, ఇంజెక్షన్లు కూడా ఆసుపత్రుల్లో డాక్టర్ల పర్యవేక్షణలోనే అమర్చాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి గర్భ నిరోధక పద్ధతులు పాటించడం చాలామందికి వీలు కాకపోవచ్చు.

Contraceptivecare650-3.jpg

వెజైనల్‌ రింగులు

కంబైన్డ్‌ ఓరల్‌ కాంట్రాసెప్టివ్‌ మాత్రల్లో ఉండే హార్మోన్లే వెజైనల్‌ రింగుల్లోనూ ఉంటాయి. అయితే వీటిని కొత్తగా వాడే వాళ్లు మొదటిసారి డాక్టర్‌ సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంతకుముందే ఇవి వాడే అలవాటున్న వారు వీటిని కొనసాగించచ్చు.

Contraceptivecare650-1.jpg

త్వరగా గుర్తిస్తే ముప్పు తక్కువ!

అవాంఛిత గర్భం ధరించినప్పుడు రెండు పద్ధతుల ద్వారా గర్భస్రావం చేయించుకోవచ్చు. ఒకటి - మాత్రలు వాడడం, రెండోది - సర్జికల్‌ పద్ధతి ద్వారా గర్భాన్ని తొలగించడం. సర్జికల్‌ పద్ధతి చేయించుకోవడానికి వీలు పడనప్పుడు మాత్రల ద్వారానే గర్భస్రావం చేయడం సురక్షితం. అయితే గర్భం ధరించారన్న విషయం ఎంత త్వరగా గుర్తిస్తే అది అంత తేలికవుతుంది. కాబట్టి అశ్రద్ధ చేయకుండా నెల తప్పిన వెంటనే ఎవరికి వారు హోమ్‌ ప్రెగ్నెన్సీ కిట్‌ సహాయంతో గర్భ నిర్ధరణ పరీక్ష చేసుకొని.. గర్భాన్ని కొనసాగించాలా, వద్దా అన్న విషయంపై ఓ నిర్ణయానికి రావాలి.

ఆధునిక గర్భనిరోధక పద్ధతులు సురక్షితమైనవి అయినప్పటికీ చాలా వరకు డాక్టర్‌ సలహా తీసుకోవడంతో పాటు ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది.. కాబట్టి ఇంట్లోనే సురక్షితంగా వాడగలిగిన సహజ గర్భనిరోధక పద్ధతులు, బ్యారియర్‌ పద్ధతులు.. వంటివి పాటించడం మంచిది. అలాగే అవాంఛిత గర్భం రాకుండా ఇప్పటికే గర్భనిరోధక మాత్రలు వాడుతున్న వారు వాటిని కొనసాగించచ్చు. అయితే కొవిడ్‌-19 అనేది కొత్త వైరస్‌ కాబట్టి ఇంత వరకు మనకు తెలిసిన వివరాలను బట్టి.. ఇది గర్భవతులకు, కడుపులో పెరుగుతున్న బిడ్డకు ప్రమాదకరం కాదని కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. అయినా కూడా ఈ విషయాలపై ఇంకా లోతుగా అధ్యయనాలు జరిగితే తప్ప మనకు దీని గురించి పూర్తి వివరాలు తెలియవు. అందుకని ఈ ప్రతికూల పరిస్థితుల్లో వీలైనంత వరకు అవాంఛిత గర్భం రాకుండా జాగ్రత్తపడడం ఉత్తమం.

women icon@teamvasundhara
precautions-to-take-during-monsoon-to-prevent-viral-infections

చిటపట చినుకుల కాలంలో ఈ జాగ్రత్తలే మన రక్షణ కవచాలు!

రోజులు గడుస్తున్నా, కాలాలు మారుతున్నా ఇప్పుడు అందరి దృష్టి కరోనా పైనే ఉంది. ఎందుకంటే ఎటు నుంచి ఈ మహమ్మారి ముంచుకొస్తుందో తెలియని భయంతోనే అందరూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక మరోవైపు వృత్తిఉద్యోగాల రీత్యా బయటికి వెళ్లాల్సి వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే తమ తమ పనులను కొనసాగిస్తున్నారు చాలామంది. అయితే ఈ వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ కారణంగా బ్యాక్టీరియా, వైరస్‌, ఇతర ఇన్ఫెక్షన్లు త్వరగా విస్తరించే ప్రమాదం ఉంది. ఫలితంగా జలుబు, దగ్గు, జ్వరం.. వంటివి మరింత వేగంగా ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటాయి. అసలే కరోనాతో సతమతమవుతున్న ఈ రోజుల్లో మనం అప్పుడో ఇప్పుడో తుమ్మినా, దగ్గినా అది కరోనానేమో అని భయపడిపోతున్నాం. మరి, ఇలాంటి గడ్డు కాలంలో ఎలాంటి ఫ్లూ లక్షణాలు మన దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి, అవేంటో తెలుసుకొని మనమూ పాటించేద్దామా?

Know More

women icon@teamvasundhara
health-tips-for-new-moms-in-telugu
women icon@teamvasundhara
bollywood-serial-actress-mohena-kumari-singh-finally-tests-covid-19-negative-after-a-month

మొత్తానికి నెల రోజుల తర్వాత నెగెటివ్‌ వచ్చింది!

‘గెలుపు పొందే వరకూ అలుపు లేదు మనకు’ అన్నాడో సినీ కవి. ‘కొవిడ్‌ సోకినా నెగెటివ్‌ వచ్చేంత వరకూ మనో నిబ్బరాన్ని కోల్పోకు..’ అంటోంది బాలీవుడ్‌ బుల్లితెర బ్యూటీ మోహెనా కుమారి సింగ్‌. తనతో పాటు తన ఏడుగురు కుటుంబ సభ్యులు కరోనా బారిన పడి కోలుకొని ఇంటికి చేరుకున్నా.. ఆమెకు మాత్రం పదే పదే పాజిటివ్‌ రావడంతో కాస్త టెన్షన్‌ పడ్డానంటోందామె. అయినా గుండె ధైర్యంతో నెల రోజుల తర్వాత కరోనా నుంచి పూర్తిగా కోలుకొని తాజాగా ఇంటికి చేరుకుంది మోహెనా. ఈ క్రమంలో తనకు వైద్య సేవలందించిన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టిందీ బ్యూటిఫుల్‌ బేబ్‌. అంతేనా.. కొవిడ్‌ నుంచి కోలుకునే క్రమంలో తాను పాటించిన జాగ్రత్తలు, తీసుకున్న ఆహార పదార్థాలు.. వంటివన్నీ మరో పోస్ట్‌లో పంచుకుంటూ తన ఫ్యాన్స్‌లో ధైర్యం నింపిందీ అందాల తార. ఇలా మోహెన పెట్టిన ఈ రెండు ఇన్‌స్టా పోస్టులు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
these-are-the-benefits-while-you-stop-wearing-a-bra

‘బ్రా’ వేసుకోవడం మంచిదా? కాదా?

చక్కటి ఎద సౌష్ఠవానికి, సాగినట్లుగా కనిపించే వక్షోజాలను పట్టి ఉంచడానికి అమ్మాయిలంతా బ్రా ధరించడం కామనే. అందుకే అతివల వార్డ్‌రోబ్‌లో వీటికి ప్రత్యేకమైన షెల్ఫ్‌ కూడా ఉంటుంది. ఆయా దుస్తులకు తగినట్లుగా సాధారణ బ్రా, స్ట్రాప్‌లెస్‌, బ్రాలెట్‌, స్పోర్ట్స్‌ బ్రా.. వంటివి ఎంచుకొని కూల్‌గా, కంఫర్టబుల్‌గా కనిపించేస్తుంటారు అమ్మాయిలు. అయితే వీటిని ఇష్టపడి ధరించే వారి కంటే.. ‘తప్పదు.. వేసుకోవాల్సిందే..’ అంటూ అయిష్టంగా ధరించే వారే ఎక్కువమంది ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ లోదుస్తులు ఎద భాగానికి పట్టినట్లుగా ఉండడం, తద్వారా ఛాతీలో నొప్పి రావడం, ఆ ప్రదేశంలో చెమట వచ్చి రాషెస్‌లా ఏర్పడడం.. వంటి స్వీయానుభవాలే వారి ఫీలింగ్‌కి ప్రధాన కారణం. మరి, ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రా ధరించాల్సిందేనా? ఇది వేసుకోకపోతే నష్టమేంటి? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. అయితే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో తప్ప మరీ అసౌకర్యంగా అనిపిస్తే బ్రా ధరించకపోయినా ఎలాంటి నష్టం ఉండదంటున్నారు సంబంధిత నిపుణులు. ఇంకా చెప్పాలంటే అత్యవసరం కానప్పుడు బ్రా వేసుకోకపోతే ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు వారు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
celebrity-nutritionist-rujuta-diwekar-shares-5-food-tips-for-children-pursuing-school-from-home

ఆన్‌లైన్‌ క్లాసులు... ఈ అయిదు పదార్ధాలూ మీ డైట్ లో ఉన్నాయా?

కరోనా మనకు శారీరకంగా, మానసికంగా ఎంతో కీడు చేస్తున్నా.. టెక్నాలజీ విషయంలో మాత్రం మనల్ని ఓ మెట్టు ఎక్కించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటిదాకా ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ ఆప్షన్‌ లేని సంస్థలు సైతం తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాయి. అలాగే రోజూ స్కూలుకెళ్లి పాఠాలు నేర్చుకునే పిల్లలు కూడా ఇప్పుడు ఇంటిపట్టునే ఉంటూ ఆన్‌లైన్‌లోనే క్లాసులు వింటున్నారు. అయితే ఎలాగూ ఇంటి నుంచే క్లాసులు వింటున్నాం కదా అని బద్ధకిస్తూ, చదువు విషయంలో అశ్రద్ధ వహిస్తే.. పాఠాలు బుర్రకెక్కవు సరికదా తోటి పిల్లల కంటే వెనకబడే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లలు ఆన్‌లైన్‌ క్లాసులపై శ్రద్ధ వహించాలంటే వారికి అందించే ఆహారం పట్ల కూడా తల్లులు జాగ్రత్త వహించాలంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ పాఠాలు వింటోన్న పిల్లలు, యువత ఐదు రకాల పదార్థాలను రోజూ తప్పకుండా తీసుకోవాలంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారామె. మరి, ఏంటా పదార్థాలు? వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటి? రండి తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
marvelous-benefits-of-jaggery-in-telugu
women icon@teamvasundhara
health-benefits-of-wearing-mehandi-or-gorintaaku-in-telugu

అరచేతుల్లో విరబూసే గోరింట ఆరోగ్యానికీ మంచిదే..

'గోరింట పూసింది కొమ్మ లేకుండా.. మురిపాల అరచేత మొగ్గ తొడిగింది..' అన్న చందంగా మహిళల చేతుల్లో గోరింటాకు విరబూస్తుంది. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు.. అతివల చేతులు, కాళ్లు గోరింటాకుతో నిండిపోయి, పండిపోతాయి. ఈ మాసంలో చాలామంది తమ చేతులకు, పాదాలకు గోరింటాకు పెట్టుకోవడం అనేది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఆషాడంలో వచ్చే వాతావరణ మార్పుల ప్రభావం శరీరంపై పడకుండా ఉండి.. ఎలాంటి చర్మ వ్యాధులు రాకుండా చేసేందుకు గోరింటాకు ఎంతగానో ఉపకరిస్తుంది. కేవలం ఆషాఢంలోనే కాదు.. పెళ్లిళ్లు, పండగలు.. వంటిి ప్రత్యేక సందర్భాల్లో కూడా ముందుగా గుర్తొచ్చేది గోరింటాకే. ఇలా చేతులు, పాదాలను రకరకాల డిజైన్లతో పండించుకుని, మురిసిపోవడం మనకెంతో ఇష్టం కదూ.. మరి ఇంతలా మన మనసు దోచుకుంటున్న గోరింటాకు వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఓ లుక్కేద్దామా??

Know More

women icon@teamvasundhara
how-can-i-control-my-breast-milk-flow?

చనుబాల ఉత్పత్తి తగ్గేదెలా?

హాయ్‌ డాక్టర్‌. నా వయసు 27. ప్రస్తుతం నాకు ఏడు నెలల బాబున్నాడు. డెలివరీ తర్వాత రెండు నెలల దాకా ఆగకుండా బ్లీడింగ్‌ అయింది. ఇక మూడో నెల నుంచి పిరియడ్స్‌ ప్రారంభమయ్యాయి. ఫీడింగ్‌ ఇస్తున్నప్పుడు నెలసరి రాదని విన్నాను. కానీ నేను నా బాబుకు పూర్తిగా నా పాలే ఇస్తున్నాను. అయినా అదనంగా ఇంకా ఎక్కువ పాలు ఉత్పత్తవుతున్నాయి. ఇటు అధిక పాల ఉత్పత్తి, అటు నెలసరితో చాలా ఇబ్బందిగా ఉంది. నాకు, నా బాబుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవు. చనుబాలు మరీ ఎక్కువగా ఉత్పత్తి (ఓవర్‌ ఫ్లో) కాకుండా ఉండాలంటే నేనేం చేయాలి? అలాగే బిడ్డకు పాలిస్తున్నప్పుడు పిరియడ్స్‌ రావడం వల్ల ఏమైనా సమస్యలొస్తాయా? చెప్పండి. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
fashioner-shilpa-reddy-shares-her-covid-experience-through-insta-video

కరోనా నుంచి అలా బయటపడ్డా.. అదే నా ఆయుధం!

ఈ రోజుల్లో ఒంట్లో కాస్త నలతగా అనిపిస్తే చాలు.. మన మనసంతా కరోనా వైరస్‌ చుట్టూనే తిరుగుతోంది. మనకూ వైరస్‌ సోకిందేమోనని కంగారు పడిపోతున్నాం. ఇక ఎలాంటి లక్షణాలు లేని వారిలో కూడా కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఎవరి నుంచి ముప్పు ముంచుకొస్తుందో, మనలోనూ కరోనా వైరస్‌ ఉందేమోనని క్షణక్షణం భయంభయంగా గడుపుతున్నాం. ఇదిగో ఇలాంటి భయమే మనల్ని నిలువెల్లా ముంచుతుందంటున్నారు నగరానికి చెందిన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్పా రెడ్డి. కొద్దిరోజుల క్రితమే కొవిడ్‌ బారిన పడి కోలుకున్న ఆమె.. చక్కటి ఆహారం, వ్యాయామం, ధ్యానంతో ఈ వైరస్‌ను జయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మనలోని రోగనిరోధక శక్తే కరోనాను ఎదిరించే ఆయుధమని, దాన్ని దృఢంగా ఉంచుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించడంతో పాటు ధైర్యంగా అడుగు ముందుకేయాలంటూ సూచిస్తున్నారు. ఈ క్రమంలో తన కొవిడ్‌ అనుభవాలను, దాన్నుంచి బయటపడిన విధానాన్ని ఇన్‌స్టా వీడియోతో పాటు దానికి జతచేసిన సుదీర్ఘమైన క్యాప్షన్‌ రూపంలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో, పోస్ట్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Know More

women icon@teamvasundhara
health-benefits-of-doing-yoga-for-women-in-telugu
women icon@teamvasundhara
precautions-to-take-during-monsoon-to-prevent-viral-infections

చిటపట చినుకుల కాలంలో ఈ జాగ్రత్తలే మన రక్షణ కవచాలు!

రోజులు గడుస్తున్నా, కాలాలు మారుతున్నా ఇప్పుడు అందరి దృష్టి కరోనా పైనే ఉంది. ఎందుకంటే ఎటు నుంచి ఈ మహమ్మారి ముంచుకొస్తుందో తెలియని భయంతోనే అందరూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక మరోవైపు వృత్తిఉద్యోగాల రీత్యా బయటికి వెళ్లాల్సి వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే తమ తమ పనులను కొనసాగిస్తున్నారు చాలామంది. అయితే ఈ వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ కారణంగా బ్యాక్టీరియా, వైరస్‌, ఇతర ఇన్ఫెక్షన్లు త్వరగా విస్తరించే ప్రమాదం ఉంది. ఫలితంగా జలుబు, దగ్గు, జ్వరం.. వంటివి మరింత వేగంగా ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటాయి. అసలే కరోనాతో సతమతమవుతున్న ఈ రోజుల్లో మనం అప్పుడో ఇప్పుడో తుమ్మినా, దగ్గినా అది కరోనానేమో అని భయపడిపోతున్నాం. మరి, ఇలాంటి గడ్డు కాలంలో ఎలాంటి ఫ్లూ లక్షణాలు మన దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి, అవేంటో తెలుసుకొని మనమూ పాటించేద్దామా?

Know More

women icon@teamvasundhara
health-benefits-of-soaking-nuts-and-seeds-in-telugu
women icon@teamvasundhara
benefits-of-eating-breakfast-in-telugu

బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సిందే!

రోజూ మనం తీసుకునే ఆహారంలో అత్యంత కీలక పాత్ర పోషించేది ఉదయం తీసుకునే 'బ్రేక్‌ఫాస్టే'! రోజుని ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రారంభించాలంటే మంచి పోషకవిలువలున్న అల్పాహారం తీసుకోవడమూ ముఖ్యమే. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కొంతమందికి బ్రేక్‌ఫాస్ట్ చేయడానికే టైముండదు. మరికొంతమందైతే ఏదో ఒకటి తినేద్దాంలే అని సరిపెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతిని రకరకాల సమస్యలు చుట్టుముట్టే ప్రమాదమూ లేకపోలేదు. అలాగే మనం చేసే పనిపై సరిగ్గా శ్రద్ధ పెట్టలేకపోవచ్చు! ఇంతకీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటి? చేయకపోతే వచ్చే నష్టాలేంటి? చూద్దాం రండి...

Know More

women icon@teamvasundhara
health-benefits-of-olive-oil-in-telugu
women icon@teamvasundhara
is-pre-existing-diabetes-and-pregnancy-harm-baby?-in-telugu
women icon@teamvasundhara
advice-on-the-use-of-masks-in-the-context-of-covid-by-who

women icon@teamvasundhara
how-to-get-happy-sleep-in-telugu
women icon@teamvasundhara
malamalaika-arora-decodes-right-way-of-drinking-water-through-her-instagram-post

నీళ్లు ఎలా తాగాలో మీకు తెలుసా?

మనం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండడానికి రోజుకో కొత్త మార్గాన్ని అన్వేషిస్తుంటాం. ఈ క్రమంలో కొత్త కొత్త వ్యాయామాలు నేర్చుకోవడం, విభిన్న ఆహార పదార్థాల రుచిని ఆస్వాదించడంతో పాటు.. తీసుకునే ఆహారం కూడా ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? ఏ సమయానికి తింటున్నాం? వంటి విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంటాం. కానీ కొన్ని ప్రాథమిక అంశాలను మాత్రం మర్చిపోతుంటాం. ఇదే విషయం గురించి నొక్కి వక్కాణిస్తోంది బాలీవుడ్‌ ఫిట్టెస్ట్‌ బ్యూటీ మలైకా అరోరా. ఫిట్‌నెస్‌లో భాగంగా మనం పాటించే నియమాల్లో నీళ్లు తాగడం కూడా ఒకటని, అయితే నీళ్లు తాగడానికీ ఓ పద్ధతుంది అంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేసిందీ సుందరి. లాక్‌డౌన్‌లో భాగంగా ఇప్పటికే తన ఫిట్‌నెస్‌, హెల్దీ, బ్యూటీ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఫ్యాన్స్‌తో నిరంతరం టచ్‌లోనే ఉంది మలైకా. ఇక తాజాగా నీళ్లు ఎలా తాగాలో వివరిస్తూ తన అభిమానులకు ఆరోగ్య పాఠాలు చెబుతోంది.

Know More

women icon@teamvasundhara
will-three-abortions-affect-my-pregnancy?
women icon@teamvasundhara
govt-issues-new-guidelines-for-corona-patients-at-home

ఇంట్లోనే కరోనా వైద్యం.. కేంద్రం ఏం చెబుతోంది..?

కరోనా లక్షణాలు కనిపించిన బాధితులు ఇళ్లలోనే చికిత్స తీసుకునేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా 17 రోజుల పాటు ఇంట్లోనే ఉంటూ వైద్యుల సూచనలు, జాగ్రత్తలతో వైరస్‌ నుంచి బయటపడవచ్చని తెలిపింది. లక్షణాలు తీవ్రమైతే వైద్యుని సలహా తీసుకోవాలని.. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర జబ్బులతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలని సూచించింది. అలాగే పోషకాహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. కరోనా ఉన్నట్లు అనుమానించినా, నిర్ధారించినా ఆందోళన చెందవద్దని, వైద్యుల సూచనలు పాటించాలంది. అత్యవసరమైతే టోల్‌ఫ్రీ నంబరు 18005994455ను సంప్రదించాలని కోరింది.

Know More

women icon@teamvasundhara
tips-for-online-doctor-consultation-in-telugu

ఆన్‌లైన్‌లో డాక్టరుని సంప్రదిస్తున్నారా?

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వివిధ ఆస్పత్రులు ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. నిజానికి ఈ విధానం అంతకు ముందు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ.. లాక్‌డౌన్‌ తర్వాతే ఎక్కువ ప్రజాదరణ పొందిందని చెప్పాలి. కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులతో పాటు కొందరు వైద్యులు వ్యక్తిగతంగా కూడా ఈ సేవలను అందిస్తున్నారు. దీంతో ఇంటి నుంచే ఫోన్‌ లేదా వీడియో కాల్‌ ద్వారా డాక్టర్‌తో మాట్లాడి, అనుమానాలను నివృత్తి చేసుకునే వెలుసుబాటు లభిస్తోంది. ఈక్రమంలో ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌లో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
corona-virus-why-should-avoid-wearing-gloves-shopping-for-grocery

చేతులకు గ్లోవ్స్‌ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే!

కరోనా వైరస్‌ ప్రభావంతో మన జీవనశైలిలో చాలా మార్పులొచ్చాయి. వైరస్‌ నుంచి మనల్ని మనం రక్షించుకునే క్రమంలో అందరితో సామాజిక దూరం పాటిస్తున్నాం. ఫేస్‌ మాస్క్‌తోనే బయటకు వెళుతున్నాం. క్రమం తప్పకుండా శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటున్నాం. మరికొందరు రెగ్యులర్‌గా హ్యాండ్‌ గ్లోవ్స్‌ ధరిస్తున్నారు. అయితే అన్ని సందర్భాల్లో గ్లోవ్స్‌ వాడడం అంత మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య, వైద్య నిపుణులు. ప్రత్యేకించి గ్రాసరీ, ఫార్మసీ దుకాణాలకు వెళ్లినప్పుడు హ్యాండ్‌ గ్లోవ్స్‌ ధరించకపోవడమే మేలంటున్నారు.

Know More

women icon@teamvasundhara
i-didnt-get-periods-for-the-last-three-years-what-to-do
women icon@teamvasundhara
coronavirus-visiting-a-hospital-during-the-pandemic?-keep-these-points-in-mind

ఆస్పత్రికి వెళుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే!

సుదీర్ఘ లాక్‌డౌన్‌కి తెరదించుతూ ప్రభుత్వం దశలవారీగా కొన్ని సడలింపులిస్తోంది. దీంతో అన్ని రంగాల్లోనూ పనులు మొదలయ్యాయి. ఇక లాక్‌డౌన్‌ కాలంలో చాలా రోజుల పాటు ఎమర్జెన్సీ సేవలకే పరిమితమైన ఆస్పత్రులు కూడా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులున్న రోగులతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఆస్పత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే ఆర్థిక కారణాలతో లాక్‌డౌన్‌ సడలింపులిచ్చినా కరోనా వైరస్‌ మన మధ్యే ఉందన్నది జీర్ణించుకోలేని వాస్తవం. ఈ పరిస్థితుల్లో వివిధ కారణాలతో ఆస్పత్రులు, క్లినిక్‌లకు వెళ్లే రోగులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
health-benefits-and-preparation-of-masala-oats-in-telugu
women icon@teamvasundhara
health-benefits-of-barley-water
women icon@teamvasundhara
precautions-to-take-in-periods-on-this-menstrual-hygiene-day

నెలసరి సమయంలో హుషారుగా ఇలా...!

'ఆకాశం తన రెక్కలతో నను కప్పుతు ఉంటే..' అంటూ హుషారుగా తిరిగే అమ్మాయిలు సైతం నెలసరి రాగానే దిగులుగా, నీరసంగా అయిపోతారు. కానీ కొందరు మాత్రం ఎప్పటిలానే ఆడుతూపాడుతూ తిరిగేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే నెలసరి అనేది అందరమ్మాయిలకీ ఎదురయ్యే సహజమైన సమస్యే. అయితే దానిని ఎదుర్కొనే తీరులోనే తేడాలు ఉంటాయి. ఈ క్రమంలో నెలసరి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే హుషారుగా ఆడుతూపాడుతూ ఉండచ్చో ఓసారి మనం కూడా తెలుసుకుందాం రండి.. సాధారణంగా నెలసరి సమయంలో ఎక్కువమంది సతమతమయ్యేది అధిక రక్తస్రావం, కడుపునొప్పి సమస్యలతోనే. సరైన పోషకాహారం తీసుకుంటూ మన చుట్టూ ఉండే వాతావరణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యదాయకంగా ఉండేలా చూసుకుంటే వీటి నుంచి బయటపడచ్చు. ఒకవేళ సమస్య మరీ తీవ్రమైతే వెంటనే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి. ఇవన్నీ చేసినా వ్యక్తిగతంగా మనం కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తేనే ఎప్పటిలా తాజాగా, హుషారుగా ఉండటానికి వీలవుతుంది.

Know More

women icon@teamvasundhara
health-benefits-of-triphala-powder-by-expert
women icon@teamvasundhara
reasons-why-drinking-water-from-a-clay-pot-can-be-beneficial-during-summer
women icon@teamvasundhara
reasons-to-get-negative-emotions-during-lockdown

ఈ సంక్షోభ సమయంలో మానసిక ఆరోగ్యమూ ముఖ్యమే !

మనదేశమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎవరికి వారే స్వయంగా లాక్‌డౌన్‌ విధించుకుని బంధించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది కరోనా. ఈ నేపథ్యంలో కొందరు ఈ సమయాన్ని తమ కోసం, తమ ప్రియమైన వారి కోసం కేటాయించడానికి దొరికిన అవకాశంగా భావిస్తే.. మరికొందరి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ లాక్‌డౌన్‌ వేళ ఇంట్లో ఉన్నా కూడా కొందరు ఒత్తిడికి గురవుతున్నట్లు మానసిక నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకు బోలెడన్ని కారణాలున్నాయంటున్నారు వారు. ఇంతకీ, ఏంటా కారణాలు? వాటిని పరిష్కరించుకునే మార్గాల గురించి ‘మానసిక ఆరోగ్య అవగాహన వారోత్సవం’ సందర్భంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
these-celebrities-have-battled-mental-disorders

ఆ సమస్య గురించి ధైర్యంగా బయటపెట్టారు.. భరోసానిచ్చారు !

మనసు నిర్మలంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంటాడు. మంచైనా, చెడైనా అది మనసుపైనే ఆధారపడి ఉంటుంది. మనసులోని ఆలోచనలు సక్రమంగా లేకుంటే మనిషి మనుగడే కష్టమవుతుంది. అందుకే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యం తప్పనిసరి అని చెబుతారు సైకాలజిస్టులు. కానీ నేటి యాంత్రిక జీవనంతో స్కూలుకెళ్లే పిల్లల నుంచి పండు ముదుసలి దాకా అందరూ డిప్రెషన్ బారిన పడుతున్నారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న సెలబ్రిటీలు సైతం ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో 'మానసిక అవగాహన వారోత్సవం’ సందర్భంగా ఒత్తిడి, మానసిక ఆందోళన నుంచి బయటపడిన కొందరు ప్రముఖుల గురించి తెలుసుకుందాం. !

Know More

women icon@teamvasundhara
how-to-increase-my-breast-size
women icon@teamvasundhara
constipation-causes-and-remedies
women icon@teamvasundhara
expert-advice-on-multiple-sclerosis-and-pregnancy
women icon@teamvasundhara
natural-ways-to-control-high-blood-pressure

బీపీకి వీటితో చెక్ పెడదాం!

అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్).. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. ధమనుల్లో రక్తం అధిక ఒత్తిడితో ప్రసరించడం వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశాలున్నాయి. సాధారణ వ్యక్తులతో పాటు సుమారు 50 శాతం మందికి పైగా వైద్యులు సైతం అధిక రక్తపోటు సమస్యతో సతమతమవుతున్నారని తేలింది. దీనికి అధిక ఒత్తిడితో పాటు ఇతర అంశాలు కూడా కారణమవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఇలా చాప కింద నీరులా వ్యాపించే ఈ వ్యాధిపై అవగాహన కల్పించడం కోసమే ఏటా మే 17న 'వరల్డ్ హైపర్‌టెన్షన్ డే'ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సమస్య తలెత్తడానికి గల కారణాలు, దాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఉపకరించే కొన్ని సహజసిద్ధ మార్గాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
ways-to-control-your-blood-pressure