scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నిబంధనలు పాటిస్తూనే అలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నాం !'

'పెళ్లంటే.. వధూవరులు, ఇరు కుటుంబ సభ్యులు, అతిథులు, అక్షతలు.. ఇలా జీవితంలో ఒకేసారి చేసుకునే ఈ వేడుకను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకుంటారు ప్రతి ఒక్కరూ. అయితే ఈ కరోనా కాలంలో పెళ్లి చేసుకునే వారికి అంత అదృష్టం కరువైందని చెప్పుకోవాలి. లాక్‌డౌన్‌, సామాజిక దూరం పేరుతో చాలా పెళ్లిళ్లు తూతూ మంత్రంగానే జరిగిపోతున్నాయి. వధువు ఒక చోట, వరుడు మరో చోట ఉంటే ఫోన్‌కే తాళికట్టి పెళ్లైందనిపించే రోజులొచ్చాయి. అంతేనా.. వధూవరులిద్దరూ ఒకే చోట ఉండి, కుటుంబ సభ్యులు వేరే ప్రాంతాల్లో ఉంటే వీడియో కాలింగ్‌ యాప్స్‌ ద్వారా అందరినీ ఒక్కచోట చేర్చి మరీ అక్షతలు వేయించుకుంటున్నాయి కొత్త జంటలు. ఇదిగో.. తమ పెళ్లీ ఇలాగే జరిగిందంటోంది ఓ నవ వధువు. ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతంలో ఉన్న తమకు ముందుగానే పెళ్లి ముహూర్తం నిశ్చయమైనప్పటికీ.. కరోనా కారణంగా స్వస్థలాలకు వెళ్లలేక ఉన్నచోటే పెళ్లి చేసుకున్నామంటూ తమ పెళ్లి ముచ్చట్లను మనతో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చేసింది.'

Know More

Movie Masala

 
category logo

‘కరోనా.. నాకెందుకొస్తుంది?’ అన్న ధీమా వద్దు!

A Brief Story on Corona Virus

ఎప్పుడు భయపడకూడదో కాదు, ఎప్పుడు భయపడాలో కూడా తెలియాలి. కరోనా ఇన్‌ఫెక్షన్‌ (కొవిడ్‌-19) విషయంలో ఇప్పుడిలాంటి భయమే కావాలి. ఇతర దేశాలతో పోలిస్తే కరోనా వైరస్‌ మనదేశంలో అంత తీవ్రంగా ప్రబలటం లేదు. అంత ప్రమాదకరంగా పరిణమించటం లేదు. కొందరికి ఇన్‌ఫెక్షన్‌ పూర్తిగా నయమైంది కూడా! ఇవన్నీ కరోనాకు అంతగా భయపడాల్సిన పనిలేదనే ధైర్యాన్ని ఇస్తుండచ్చు.. అంతమాత్రాన ‘కరోనా నాకెందుకొస్తుందిలే’ అన్న ధీమా గానీ ‘వస్తే ఏం చేస్తుందిలే’ అన్న అతి విశ్వాసం గానీ పనికిరావు. ‘నాకూ వస్తుందేమోనన్న’ భయమే కావాలి. ఎందుకంటే రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోంది. మూడు మరణాలూ సంభవించాయి. ఇవన్నీ భయపడాలనే చెబుతున్నాయి. కాస్త శ్రద్ధ పెడితే దీన్ని అడ్డుకోవటం అసాధ్యమేమీ కాదు. ఎందుకంటే కరోనా వైరస్‌ ఎక్కడో లేదు. ఒకరకంగా అది మన చేతుల్లోనే ఉంది! చాలావరకు మన చేతులు, చేతల ద్వారానే మనకూ ఇతరులకూ వ్యాపిస్తోంది.

briefstoryofcorona650-1.jpg
కరోనా వైరస్‌.. ఈ శతాబ్దపు మహమ్మారి! నిజానికిది చాలామందిని పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. నూటికి 80 మందిలో మామూలు లక్షణాలతోనే ఆగిపోవచ్చు. అలాగని గుండె మీద చేయి వేసుకొని నిశ్చింతగా ఉండటానికి వీల్లేదు. తక్కువగా అంచనా వేశామా పెను ప్రమాదాన్నే మోసుకొస్తుంది. చైనాలో చిన్నగా మొదలై, శరవేగంగా అన్ని దేశాలనూ చుట్టబెడుతూ, చివరికి మహమ్మారిగా మారిపోవటమే దీనికి నిదర్శనం. ఒకే సమయంలో పెద్దఎత్తున పలు దేశాలకు విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని మహమ్మారిగా ప్రకటించక తప్పలేదు. ఒకరి నుంచి ఒకరికి తేలికగా విస్తరిస్తూ అందరినీ కలవరపెడుతున్న ఇది మనదేశంలోనూ కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతానికి మన దగ్గర ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి, వారి సన్నిహితులకే పరిమితమవుతున్నప్పటికీ జడలు విప్పకుండా చూసుకోవటం మనందరి విధి.

briefstoryofcorona650-2.jpg
తస్మాత్‌ జాగ్రత్త!
లక్షణాల గురించి తెలుసుకొని ఉండటం, చేతుల శుభ్రత, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించటం, జన సమ్మర్థ ప్రాంతాలకు వెళ్లకపోవటం వంటి వాటితో దీన్ని చాలావరకు కట్టడి చేయచ్చు. ఇలాంటి అప్రమత్తత కొరవడటం వల్లనే చాలాదేశాలు కరోనా కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి. మనకు అలాంటి పరిస్థితి దాపురించకుండా ఉండాలంటే ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉండటం ఎంతైనా అవసరం. ఇందుకు ప్రభుత్వ చర్యలే సరిపోవు. పౌరులుగా మన బాధ్యతే ఎక్కువ.

briefstoryofcorona650-3.jpg
ఎందుకింత భయపడాలి?
జలుబు, ఫ్లూ వంటి సమస్యలను ఎలా అడ్డుకోవాలో మన శరీరానికి తెలుసు. వీటిని ఎదుర్కోవటానికి అవసరమైన యాంటీబాడీలను తయారుచేసి పెట్టుకొని ఉంటుంది. కరోనా వైరస్‌ అలాంటిది కాదు. పూర్తిగా కొత్తది. మనలో ఎవరిలోనూ దీన్ని ఎదుర్కొనే యాంటీబాడీలు లేవు. అందువల్ల ఇది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఎవరికైనా తేలికగా వ్యాపించచ్చు. తీవ్రమైతే విపత్కర పరిస్థితుల్లోకీ నెట్టేయచ్చు. ప్రస్తుతానికి దీనికి కచ్చితమైన, ప్రామాణికమైన చికిత్స అంటూ ఏదీ లేదు. టీకాలూ లేవు. అందుకే ఇంతగా భయపడాల్సి వస్తోంది.

briefstoryofcorona650-4.jpg
అధిక ముప్పు గలవారిని కాపాడుకుంటే..
కరోనా వైరస్‌ చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎవరికైనా రావచ్చు. కాకపోతే పిల్లలు, యువతీ యువకుల కన్నా వయసు మీద పడ్డవారిలో ముఖ్యంగా.. 65 ఏళ్లు పైబడ్డ వారిలో ఉద్ధృతి ఎక్కువ. ఇక 80 ఏళ్ల పైబడ్డ వారికైతే మరింత ప్రమాదకరం. వీరిలో మరణాల సంఖ్యా ఎక్కువగానే కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం వృద్ధుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం. అప్పటికే గుండెజబ్బుల వంటి సమస్యలతో బాధపడుతుండటం. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటితో బాధపడే వారికి కరోనాతో వాటిల్లే ప్రమాదం చాలా ఎక్కువ. క్యాన్సర్‌ చికిత్సలు తీసుకుంటున్న వారికి, ఇతర జబ్బులకు స్టెరాయిడ్లు వాడుకునే వారికి సైతం ముప్పు ఎక్కువే. చైనా అనుభవాలు ఈ విషయాన్నే చెబుతున్నాయి.

briefstoryofcorona650-5.jpg

అక్కడ 80% మందికి కరోనా మామూలు లక్షణాలతోనే ఆగిపోయింది. సుమారు 14% మందికి తీవ్రంగా మారింది. అంటే ఆయాసం, రక్తంలో గ్లూకోజు స్థాయులు తగ్గటం వంటి సమస్యలకు దారితీసింది. ఓ 5% మందిలో మరీ తీవ్రంగా పరిణమించింది. వీరిలో శ్వాస వ్యవస్థ కుప్పకూలటం, షాక్‌లోకి వెళ్లటం, అవయవాలు విఫలం కావటం వంటి వాటికి దారితీసింది. కరోనా ఇన్‌ఫెక్షన్‌తో మరణాల రేటు 3-4 శాతంగా ఉన్నట్టు అంచనా. గతంలో చైనాలో విజృంభించిన సార్స్‌తో పోలిస్తే (10%) ఇది తక్కువే అయినా.. మామూలు ఫ్లూతో పోలిస్తే (0.1%) చాలా ఎక్కువ. కలవర పెడుతున్న విషయం ఏంటంటే- వయసు పెరుగుతున్న కొద్దీ మరణాల సంఖ్యా పెరుగుతుండటం. 50 ఏళ్ల కన్నా తక్కువ వయసుగల వారిలో మరణాల రేటు 0.5% కాగా.. 80 ఏళ్లు పైబడిన వారిలో ఇది 15% వరకూ ఉంటోంది. ఇతరత్రా సమస్యలు సైతం ఇందుకు దోహదం చేస్తుండటం గమనార్హం. గుండెజబ్బులు గలవారిలో 10.5%, మధుమేహుల్లో 7.3%, దీర్ఘకాల శ్వాసకోశ జబ్బులుగల వారిలో 6.3% మంది మృత్యువాత పడినట్టు చైనా లెక్కలు చెబుతున్నాయి. కరోనా ప్రాణాంతకంగా పరిణమించే ముప్పు ఎక్కువగా ఉన్న వారిని దీని బారిన పడకుండా కాపాడుకుంటే చాలావరకు మరణాలను తగ్గించుకోవచ్చనే సంగతిని ఈ గణాంకాలు నొక్కి చెబుతున్నాయి.

briefstoryofcorona650-11.jpg
విజృంభించే అవకాశమే ఎక్కువ..
ప్రస్తుతం మనదేశంలో.. కరోనా ప్రబలిన ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో, ఇలాంటి వారికి సన్నిహితంగా మెలిగిన వారిలోనే ఇన్‌ఫెక్షన్‌ బయటపడుతోంది. పది లక్షల మందిలో ఒకరి కన్నా తక్కువ మందిలోనే నిర్ధరణ అవుతోంది. అందువల్ల సమస్య చాలా చిన్నదిగానే కనిపించచ్చు. కానీ మనదేశ పరిస్థితులు వేరు. ప్రజల అలవాట్లు, సంప్రదాయాలు, సంస్కృతులు వేరు. జనసాంద్రత ఎక్కువ. అందరినీ గిరి గీసి కట్టడి చేయటం అంత తేలికైన పనికాదు. పైగా వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహనా అంతంతే. దీనికి తోడు క్షయ, ఆస్థమా.. వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు ఎందరో. మనదేశం మధుమేహానికి రాజధానిగానూ మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహిస్తే కరోనా ఏ క్షణంలోనైనా ఉద్ధృతంగా, ప్రమాదకరంగా మారే అవకాశమే ఎక్కువ. సమాజంలో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించటం ఆరంభిస్తే కట్టడి చేయటం చాలా చాలా కష్టం. అందువల్ల ఎక్కువమంది గుమిగూడి ఉండే చోట్లకు వెళ్లకపోవటం మంచిది. ఒకరి నుంచి వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలిగినా వేలాది మందిని దీని బారిన పడకుండా రక్షించుకోవచ్చు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఒకరికి ఒకరికి మధ్య 2 మీటర్ల (6 అడుగులు) దూరం ఉండేలా చూసుకోవాలి.

లక్షణాలుంటే మాస్కులు..

briefstoryofcorona650-6.jpg
ప్రస్తుతం కరోనా మన సమాజంలో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్న దాఖలాలు లేవు. అందువల్ల పొలోమని అంతా మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. దగ్గు, తుమ్ముల వంటి లక్షణాలు ఉన్నవారు మాస్కులు ధరించటం మంచిది. దీంతో ఇతరులకు వారి నుంచి వైరస్‌ వ్యాపించకుండా చూసుకోవచ్చు. డాక్టర్లు, నర్సులు, ఆయాలు, నిర్ధరణ పరీక్షలు చేసే వారికి, జబ్బుతో బాధపడే వారికి సపర్యలు చేసే వారికి ప్రత్యేకమైన ఎన్‌95 మాస్కులు అవసరం. ఇవి ఖరీదైనవి. అందరికీ అవసరం లేదు. మిగతా వాళ్లు అవసరమైతే మూడు పొరలతో కూడిన మామూలు మాస్కులు ధరిస్తే చాలు. ఎన్‌95 మాస్కులు అందరూ ధరించటం మొదలెడితే కొరత ఏర్పడచ్చు. అప్పుడు నిజంగా అవసరమున్న వారికి ఇవి అందుబాటులో లేకుండా పోవచ్చు.

మాస్క్‌ ఉపయోగించడానికీ పద్ధతుంది!

briefstoryofcorona650-7.jpg
ఒకే మాస్కును నాలుగైదు రోజులు వాడుకోవటం తగదు. తరచూ మార్చుకోవాలి. కనీసం రోజుకొకటి చొప్పున మార్చుకోవాల్సి ఉంటుంది. మాస్కు ధరించే ముందు, తీసిన తర్వాతా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మాస్కును చేతులతో తాకరాదు. దీన్ని తీసేసే సమయంలోనూ ముందు భాగాన్ని తాకకూడదు. వెనక వైపు నుంచి తీసి, జాగ్రత్తగా మూత ఉన్న చెత్త బుట్టలో వేయాలి.

పరీక్షలు ఎవరికి?

briefstoryofcorona650-9.jpg
* జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఆయాసం.. వంటి కరోనా అనుమానిత లక్షణాలు గల వారికి.
* కరోనా వ్యాప్తిలో ఉన్న చైనా, హాంకాంగ్‌, దక్షిణ కొరియా, జపాన్‌, ఇరాన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీ, యూఏఈ.. వంటి దేశాల నుంచి వచ్చిన వారికి.
* కరోనా ఇన్‌ఫెక్షన్‌ బాధితులకు సన్నిహితంగా ఉన్న వారికి.

అవసరమైతే స్వీయ నిర్బంధం తప్పదు!

వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం మనందరి విధి. కరోనా అనుమానిత లక్షణాలు గల వారు అవసరమైతే స్వీయ నిర్బంధం విధించుకోవాలి. ముఖ్యంగా కరోనా వ్యాప్తిలో ఉన్న దేశాల నుంచి ఇటీవలే వచ్చిన వారు, ఇలాంటి వారికి సన్నిహితంగా మెలిగినవారు తమకు తామే బయటకు రాకుండా ‘కట్టడి’ చేసుకోవటం మంచిది. దీంతో చాలావరకు వైరస్‌ ఇతరులకు సోకకుండా జాగ్రత్తపడచ్చు. ఇలా స్వీయ నిర్బంధం పాటించటానికీ కొన్ని పద్ధతులున్నాయని తెలుసుకోవాలి.
* స్వీయ నిర్బంధం పాటిస్తున్న వారికి కరోనా నిర్ధరణ అయితే వారితో సన్నిహితంగా మెలిగిన వారంతా కూడా 14 రోజుల వరకు విడిగా ఉండాలి. అనంతరం మరో 14 రోజుల వరకు గానీ కరోనా లేనట్టు పరీక్షల్లో తేలినంత వరకూ విడిగానే ఉండాలి.
* గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే గదిలో విడిగా, ప్రత్యేకంగా ఉండాలి. గదికి బాత్రూమ్‌ సౌకర్యం ఉంటే ఇంకా మంచిది.
* అదే గదిలోనే మరో వ్యక్తి సైతం ఉండాల్సి వస్తే ఇద్దరి మధ్యా కనీసం మీటరు దూరం ఉండేలా చూసుకోవాలి.
* వృద్ధులకు, గర్భిణులకు పిల్లలకు, గుండెజబ్బుల వంటి ఇతరత్రా సమస్యలు గలవారితో సన్నిహితంగా ఉండద్దు.
* ఎక్కువ మంది గుమిగూడి ఉండే చోట్లకు వెళ్లరాదు. పెళ్లిళ్లు, విందు వినోదాలు, సమావేశాల వంటి వాటికి అసలే వెళ్లద్దు.

briefstoryofcorona650-10.jpg
* తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవాలి. లేదా ఆల్కహాల్‌ ఆధారిత శుభ్రకాల(సానిటైజర్స్‌)ను చేతులకు రుద్దుకోవాలి.
* గిన్నెలు, కంచాలు, గ్లాసులు, కప్పుల వంటివి వేరే వాళ్లు వాడకుండా చూసుకోవాలి.
* ఎల్లవేళలా ముక్కుకు, నోటికి మాస్క్‌ ధరించాలి. వాడిన మాస్కులను బ్లీచింగ్‌ ద్రావణంలో (5%) లేదా సోడియం హైడ్రోక్లోరైడ్‌ ద్రావణం(1%)తో శుభ్రం చేశాక కాల్చేయాలి. నేలలోనైనా పాతి పెట్టచ్చు.
* జ్వరం, దగ్గు లేదా ఆయాసం వంటి కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి.

చేతులతోనే మట్టి కరిపించచ్చు!

briefstoryofcorona650-9.jpg
కరోనా వైరస్‌ చూడటానికి కిరీటంలా ఉంటుంది. దీని చుట్టూరా పైకి పొడుచుకొని వచ్చే భాగాలుంటాయి. వీటి మధ్య పరచుకొని ఉండే ప్రొటీన్‌ (కొవ్వు) పొర వైరస్‌కు రక్షణగా నిలుస్తుంది. సబ్బుతో చేయిని కడుక్కుంటే ఈ పొర కరిగిపోయి వైరస్‌ త్వరగా నిర్వీర్యమవుతుంది, చనిపోతుంది. అందువల్ల కరోనా ఇన్‌ఫెక్షన్‌ నివారణకు చేతులను తరచూ సబ్బుతో కడుక్కోవటం అన్నింటికన్నా ఉత్తమమైన పని. అలాగని పైపైన కడుక్కుంటామంటే కుదరదు. కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో చేతులను బాగా రుద్దుకొని శుభ్రంగా కడుక్కోవాలి. బయటి నుంచి ఇంట్లోకి వచ్చిన ప్రతిసారీ చేతులను కడుక్కోవాలి. భోజనం చేయటానికి ముందు, మల విసర్జన అనంతరం తప్పకుండా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

దగ్గినా, తుమ్మినా జాగ్రత్త!

briefstoryofcorona650-12.jpg
దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లు సాధారణంగా మీటరు దూరం వరకు విస్తరిస్తాయి. కాబట్టి దగ్గే వారికి, తుమ్మే వారికి కనీసం మీటరు దూరంలో ఉండేలా చూసుకోవాలి. మనదేశంలో చాలామంది పిడికిలినో, దోసిలినో అడ్డం పెట్టుకుని దగ్గుతుంటారు. అదే చేత్తో ఇతరులకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం, వస్తువులను అందించడం.. వంటివి చేస్తుంటారు. ఇది వైరస్‌ వ్యాపించటానికి దోహదం చేస్తుంది. అందుకే ఈ సమయంలో పిడికిలికి బదులు నోటికి, ముక్కుకు దళసరి రుమాలు అడ్డు పెట్టుకోవాలి. వీలుంటే టిష్యూ పేపరును అడ్డుపెట్టుకోవచ్చు. చేతి రుమాలును రోజూ ఉతుక్కోవాలి. టిష్యూ పేపరును ఎప్పటికప్పుడు మూత ఉన్న చెత్తబుట్టలోనే వేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరుబయట పడేయద్దు. రుమాలు, పేపరు.. వంటివి అందుబాటులో లేకపోతే మణికట్టు మధ్యన ముక్కు, నోరు ఆనించి దగ్గటం, తుమ్మటం చేయాలి. ఎదుట ఎవరైనా ఉంటే తల పక్కకు తిప్పి దగ్గటం మంచిది.
వాటినీ శుభ్రం చేయాలి!

కరోనా వైరస్‌ కాస్త బరువుగా ఉండటం వల్ల వెంటనే కింద పడిపోతుంది. తుంపర్ల ద్వారా వెలువడిన ఇది చుట్టుపక్కల టేబుళ్లు, కుర్చీలు, సోఫాల వంటి వాటిపై పడి, అక్కడే అంటుకోవచ్చు. ఇది సుమారు 3 రోజుల వరకు జీవించి ఉంటుందని పరీక్షలు తెలియజేస్తున్నాయి. ఆయా వస్తువులను ముట్టుకుంటే అది మన చేతులకూ అంటుకుంటుంది. అదే చేత్తో ముక్కు, నోరు, కళ్లను తాకితే వైరస్‌ మనలోకీ ప్రవేశిస్తుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు చేతులతో ముఖాన్ని తాకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. ఆయా వస్తువులను ఆల్కహాల్‌ ఆధారిత శుభ్రకాలతో ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.

డా|| ఎం.వి.రావు, కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌, యశోదా హాస్పిటల్‌.

women icon@teamvasundhara
coronavirus-visiting-a-hospital-during-the-pandemic?-keep-these-points-in-mind

ఆస్పత్రికి వెళుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే!

సుదీర్ఘ లాక్‌డౌన్‌కి తెరదించుతూ ప్రభుత్వం దశలవారీగా కొన్ని సడలింపులిస్తోంది. దీంతో అన్ని రంగాల్లోనూ పనులు మొదలయ్యాయి. ఇక లాక్‌డౌన్‌ కాలంలో చాలా రోజుల పాటు ఎమర్జెన్సీ సేవలకే పరిమితమైన ఆస్పత్రులు కూడా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులున్న రోగులతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఆస్పత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే ఆర్థిక కారణాలతో లాక్‌డౌన్‌ సడలింపులిచ్చినా కరోనా వైరస్‌ మన మధ్యే ఉందన్నది జీర్ణించుకోలేని వాస్తవం. ఈ పరిస్థితుల్లో వివిధ కారణాలతో ఆస్పత్రులు, క్లినిక్‌లకు వెళ్లే రోగులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
when-should-i-have-sex-to-get-pregnant?
women icon@teamvasundhara
best-summer-fruits-to-eat-in-telugu
women icon@teamvasundhara
precautions-to-take-in-periods-on-this-menstrual-hygiene-day

నెలసరి సమయంలో హుషారుగా ఇలా...!

'ఆకాశం తన రెక్కలతో నను కప్పుతు ఉంటే..' అంటూ హుషారుగా తిరిగే అమ్మాయిలు సైతం నెలసరి రాగానే దిగులుగా, నీరసంగా అయిపోతారు. కానీ కొందరు మాత్రం ఎప్పటిలానే ఆడుతూపాడుతూ తిరిగేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే నెలసరి అనేది అందరమ్మాయిలకీ ఎదురయ్యే సహజమైన సమస్యే. అయితే దానిని ఎదుర్కొనే తీరులోనే తేడాలు ఉంటాయి. ఈ క్రమంలో నెలసరి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే హుషారుగా ఆడుతూపాడుతూ ఉండచ్చో ఓసారి మనం కూడా తెలుసుకుందాం రండి.. సాధారణంగా నెలసరి సమయంలో ఎక్కువమంది సతమతమయ్యేది అధిక రక్తస్రావం, కడుపునొప్పి సమస్యలతోనే. సరైన పోషకాహారం తీసుకుంటూ మన చుట్టూ ఉండే వాతావరణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యదాయకంగా ఉండేలా చూసుకుంటే వీటి నుంచి బయటపడచ్చు. ఒకవేళ సమస్య మరీ తీవ్రమైతే వెంటనే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి. ఇవన్నీ చేసినా వ్యక్తిగతంగా మనం కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తేనే ఎప్పటిలా తాజాగా, హుషారుగా ఉండటానికి వీలవుతుంది.

Know More

women icon@teamvasundhara
genetic-disorders-in-children
women icon@teamvasundhara
pain-during-sex-what-to-do
women icon@teamvasundhara
reasons-to-get-negative-emotions-during-lockdown

ఈ సంక్షోభ సమయంలో మానసిక ఆరోగ్యమూ ముఖ్యమే !

మనదేశమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎవరికి వారే స్వయంగా లాక్‌డౌన్‌ విధించుకుని బంధించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది కరోనా. ఈ నేపథ్యంలో కొందరు ఈ సమయాన్ని తమ కోసం, తమ ప్రియమైన వారి కోసం కేటాయించడానికి దొరికిన అవకాశంగా భావిస్తే.. మరికొందరి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ లాక్‌డౌన్‌ వేళ ఇంట్లో ఉన్నా కూడా కొందరు ఒత్తిడికి గురవుతున్నట్లు మానసిక నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకు బోలెడన్ని కారణాలున్నాయంటున్నారు వారు. ఇంతకీ, ఏంటా కారణాలు? వాటిని పరిష్కరించుకునే మార్గాల గురించి ‘మానసిక ఆరోగ్య అవగాహన వారోత్సవం’ సందర్భంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
these-celebrities-have-battled-mental-disorders

ఆ సమస్య గురించి ధైర్యంగా బయటపెట్టారు.. భరోసానిచ్చారు !

మనసు నిర్మలంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంటాడు. మంచైనా, చెడైనా అది మనసుపైనే ఆధారపడి ఉంటుంది. మనసులోని ఆలోచనలు సక్రమంగా లేకుంటే మనిషి మనుగడే కష్టమవుతుంది. అందుకే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యం తప్పనిసరి అని చెబుతారు సైకాలజిస్టులు. కానీ నేటి యాంత్రిక జీవనంతో స్కూలుకెళ్లే పిల్లల నుంచి పండు ముదుసలి దాకా అందరూ డిప్రెషన్ బారిన పడుతున్నారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న సెలబ్రిటీలు సైతం ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో 'మానసిక అవగాహన వారోత్సవం’ సందర్భంగా ఒత్తిడి, మానసిక ఆందోళన నుంచి బయటపడిన కొందరు ప్రముఖుల గురించి తెలుసుకుందాం. !

Know More

women icon@teamvasundhara
employees-facing-problems-after-lockdown-about-coronavirus
women icon@teamvasundhara
health-benefits-of-curry-leaves
women icon@teamvasundhara
juices-that-help-you-to-detoxify-your-body
women icon@teamvasundhara
natural-ways-to-control-high-blood-pressure

బీపీకి వీటితో చెక్ పెడదాం!

అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్).. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. ధమనుల్లో రక్తం అధిక ఒత్తిడితో ప్రసరించడం వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశాలున్నాయి. సాధారణ వ్యక్తులతో పాటు సుమారు 50 శాతం మందికి పైగా వైద్యులు సైతం అధిక రక్తపోటు సమస్యతో సతమతమవుతున్నారని తేలింది. దీనికి అధిక ఒత్తిడితో పాటు ఇతర అంశాలు కూడా కారణమవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఇలా చాప కింద నీరులా వ్యాపించే ఈ వ్యాధిపై అవగాహన కల్పించడం కోసమే ఏటా మే 17న 'వరల్డ్ హైపర్‌టెన్షన్ డే'ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సమస్య తలెత్తడానికి గల కారణాలు, దాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఉపకరించే కొన్ని సహజసిద్ధ మార్గాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-high-blood-pressure-during-pregnancy
women icon@teamvasundhara
lock-down-tips-to-take-healthy-food-in-this-lock-down-period
women icon@teamvasundhara
i-have-irregular-periods-what-to-do

మాత్రలు వాడితేనే పిరియడ్స్‌ వస్తున్నాయి.. ఎలా?

హలో మేడం. నా వయసు 30. నాకు 2014లో బాబు పుట్టాడు. అప్పట్నుంచి పిరియడ్స్‌ రావట్లేదు. బాబు పుట్టాక రెండేళ్లకు డాక్టర్‌ దగ్గర చెకప్‌ చేయించుకున్నా. డాక్టర్‌ టెస్ట్‌ చేసి నాకు పీసీఓఎస్‌ ఉందని చెప్పారు. దాంతో అప్పట్నుంచి మాత్రలు వేసుకుంటేనే పిరియడ్స్‌ వస్తున్నాయి. 2018లో డాక్టర్‌ సలహా మేరకు లాప్రోస్కోపీ కూడా చేయించుకున్నా. అయినా కూడా పిరియడ్స్‌ రెగ్యులర్‌ కావట్లేదు. రెండోసారి ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించాం.. కానీ అండాల ఎదుగుదల లేక ప్రెగ్నెన్సీ రావట్లేదు. ట్యాబ్లెట్స్‌, ఇంజెక్షన్స్‌ అన్నీ ట్రై చేశాం.. అయినా గర్భం రావట్లేదు. నా ఈ సమస్యలకు పరిష్కారం చూపగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
contraceptive-care-guidelines-during-covid-19-pandemic-by-gynecology-expert-dr-savita-devi
women icon@teamvasundhara
how-to-stop-spotting---gynecologist-advice

స్పాటింగ్‌ అయితే సమస్యా?

హాయ్‌ డాక్టర్‌. ఇప్పుడు నాకు 18 ఏళ్లు. నా బరువు 42 కిలోలు.. ఎత్తు 5’2’’. ఐదేళ్ల క్రితం రజస్వల అయ్యాను. అప్పుడు రెండు నెలలకోసారి నెలసరి వచ్చేది. బ్లీడింగ్‌ కూడా నార్మల్‌గానే అయ్యేది. కానీ ఏడాది క్రితం నెలసరి సమయంలో 10 రోజులు స్పాటింగ్‌ అయింది. అప్పుడు డాక్టర్‌ దగ్గరికి వెళ్తే స్కానింగ్‌ చేసి పీసీఓఎస్‌ ఉందని చెప్పారు. ఎండోమెట్రియమ్‌ 8mm అని చెప్పారు. అప్పట్నుంచి ఇప్పటిదాకా మాత్రలు వాడుతున్నా. అయితే నెలసరి సరిగ్గా వస్తుంది కానీ బ్లీడింగ్‌ సరిగ్గా అవ్వట్లేదు. ఒకటి లేదా రెండు రోజులు స్పాటింగ్‌ అవుతుంది. గత నెలలో మాత్రలు వేసుకోకపోతే 10 రోజులైనా నెలసరి రాలేదు. మళ్లీ మూడు రోజులు మాత్రలు వాడాక 5వ రోజు నెలసరి వచ్చింది.. అది కూడా రెండు రోజులు స్పాటింగ్‌ అయింది. నాకు అవాంఛిత రోమాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. థైరాయిడ్‌ లేదు. నా ఈ సమస్యకు పరిష్కారం చూపగలరు. ప్రస్తుతం నేను వాడే మాత్రలు ఎక్కువ కాలం వేసుకుంటే ప్రమాదమా..? చెప్పండి. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
celebrity-nutritionist-pooja-makhija-shared-the-nutritional-values-of-indian-spices

ఈ వంటింటి ఔషధాలతో ఇమ్యూనిటీ పెంచుకోండి!

ఒంట్లో కాస్త నలతగా అనిపిస్తే చాలు.. మెడికల్‌ షాప్‌ నుంచి ఏదో ఒక ట్యాబ్లెట్‌ తెచ్చుకోవడం, వేసేసుకోవడం చేస్తుంటామే తప్ప.. ఆ అనారోగ్యాన్ని తగ్గించగలిగే ఔషధాలు మన వంటింట్లోనే ఉన్నాయన్న విషయం మాత్రం ఆలోచించం. అంతేకాదు.. ఏ వ్యాధులూ సోకకుండా మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేసే రోగనిరోధక వ్యవస్థను పటిష్ట పరిచే సహజసిద్ధమైన ఔషధాలకు మన వంటిల్లు నిలయం. అలాంటి పదార్థాల్లో కొన్ని మసాలా దినుసులు కూడా ఉన్నాయంటోంది ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు పూజా మఖిజ. వంటింట్లో లభించే వివిధ రకాల మసాలాల్లో దాగున్న పోషక విలువలను వివరిస్తూ ఇటీవలే ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది పూజ.

Know More

women icon@teamvasundhara
health-benefits-of-cloves-tea

లవంగం టీ తాగారా...?

కాఫీ, టీలు లేకపోతే కొందరికి రోజు గడవదు. తలనొప్పిగా ఉన్నా, ఒత్తిడి నుంచి రిలాక్స్ కావాలన్నా ముందుగా ఆశ్రయించేది వీటినే. ప్రత్యేకించి తేనీరు విషయానికొస్తే దీనివల్ల ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలూ చేకూరతాయని వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది. అందులోనూ కొన్ని మూలికలతో తయారుచేసిన తేనీరు ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. అందుకే చాలామంది సాధారణ టీతో పాటు అల్లం టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ.. అంటూ వివిధ రకాల టీలు తాగుతుంటారు. అయితే లవంగంతో తయారుచేసిన తేనీరు మీరెప్పుడైనా తాగారా? ఇది కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

Know More

women icon@teamvasundhara
self-massaging-techniques-to-relax-your-pain-and-stress

మన చేతుల్లోనే ఉంది.. ‘మసాజ్‌’ మ్యాజిక్‌ అంతా!

మసాజ్‌.. శారీరక నొప్పుల నుండి ఉపశమనం కలిగించడంతో పాటు మానసికంగా సాంత్వన చేకూర్చుతుందీ ప్రక్రియ. ఈ లాక్‌డౌన్‌ సమయంలోనూ ఇంటి నుండి పనిచేయాల్సి రావడంతో అటు ఇంటి పని, ఇటు ఆఫీసు పనితో సతమతమవుతున్నారు చాలామంది మహిళలు. తద్వారా శారీరక నొప్పులు, మానసిక ఒత్తిడి రెట్టింపవుతున్నాయి. ఇక వీటి నుంచి బయటపడడానికి స్పా సెంటర్లు, మసాజ్‌ సెంటర్లకు వెళ్లి మసాజ్‌ చేయించుకుందామంటే ఈ లాక్‌డౌన్‌లో అవి కూడా మూతపడ్డాయి. అలాగని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎవరికి వారే సొంతంగా మసాజ్‌ చేసుకుంటే ఈ సమస్యలకు సత్వరమే ఫుల్‌స్టాప్‌ పెట్టచ్చంటున్నారు నిపుణులు. అయితే అదంతా ఎలా సాధ్యం అంటారా.. అందుకు మన చేతుల్లోనే ఉంది మ్యాజిక్‌ అంతా..! ఇందుకోసం మనం చేయాల్సిందల్లా మన బిజీ లైఫ్‌స్టైల్‌లో మసాజ్‌ కోసం కాస్త సమయం కేటాయించడమే! మరి, ఏయే నొప్పులకు ఎవరికి వారే స్వయంగా ఎలా మసాజ్‌ చేసుకోవచ్చో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
corona-virus-what-happens-when-you-dont-wash-your-hands

వామ్మో.. చేతులు శుభ్రం చేసుకోకపోతే ఇన్ని అనర్థాలా?

‘మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మన చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనిని ఒక అలవాటుగా మార్చుకోవాలి’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది. అంతేకాదు.. ఏటా మే 5న ‘హ్యాండ్‌ హైజీన్‌ డే’ (చేతుల పరిశుభ్రతా దినోత్సవం) పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చేతులు శుభ్రం చేసుకోవాలన్న విషయాన్ని చాలామంది పెడచెవిన పెడుతున్నారు. కానీ కరోనా పుణ్యమా అని ప్రస్తుతం ప్రతిఒక్కరూ చేతుల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యులు, ప్రముఖ ఆరోగ్య సంస్థలు సైతం పదే పదే ఇదే మాటను నొక్కివక్కాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఈ ప్రత్యేకమైన రోజుకు బోలెడంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Know More

women icon@teamvasundhara
world-hand-hygiene-day-hand-wash-who-precautions

చేతులు కడుక్కోండి.. ఆరోగ్యంగా ఉండండి!

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న కరోనా భూతం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అత్యంత ఆవశ్యకమన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గంటగంటకూ హ్యాండ్‌వాష్‌, శానిటైజర్ లేదా ఏదైనా సబ్బుతో చేతుల్ని పరిశుభ్రంగా రుద్ది మరీ కడుక్కోమంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. అంతేకాదు.. చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎన్నో వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చని కూడా వారు సూచిస్తున్నారు. నేడు (మే 5) ‘వరల్డ్‌ హ్యాండ్‌ హైజీన్‌ డే’. ఈ సందర్భంగా ‘SAVE LIVES: Clean your hands’ అనే థీమ్‌తో మనముందుకొచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ క్రమంలో చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే కొవిడ్‌తో పాటు ఎన్నో ఇన్ఫెక్షన్లు మన దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండచ్చన్న సందేశాన్ని అందరికీ అందించింది డబ్ల్యూహెచ్‌వో. ఈ నేపథ్యంలో సబ్బుతో చేతులను ఎంతసేపు కడగాలి? ఎలా శుభ్రం చేసుకోవాలి..? ఎప్పుడెప్పుడు చేతులు కడుక్కోవాలి..? తదితర విషయాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
here-are-the-health-benefits-of-eating-mango-pickle

ఈ ‘తియ్యటి ఆవకాయ’ మీరూ ట్రై చేస్తారా?

వేసవి కాలం అనగానే మనకు గుర్తొచ్చే విషయాల్లో మామిడి కాయలు/పండ్లు కూడా ఒకటి. ఈ సీజన్‌లో వచ్చే పుల్లని మామిడి కాయలతో చేసే ఆవకాయ అంటే ఇష్టం లేని వారుంటారా చెప్పండి.. వేడివేడి అన్నం, మామిడికాయ పచ్చడి, మీగడ వేసుకొని తింటే.. ఆ రుచికి మరేదీ సాటిరాదని చెప్పడం అతిశయోక్తి కాదు. అందుకే ఓ సినిమాలో త్రివిక్రమ్‌ కూడా ‘అమ్మ, ఆవకాయ.. ఎప్పటికీ బోర్‌ కొట్టవు’ అంటాడు. మన పూర్వీకులు కనిపెట్టిన ఈ సంప్రదాయ రెసిపీ రుచికరమైందే కాదు.. ఎంతో ఆరోగ్యకరమైంది కూడా..! ఈ క్రమంలో కొణిదెల వారి కోడలు ఉపాసన ఇటీవలే తియ్యటి ఆవకాయ పచ్చడి తయారు చేసింది. ఈ విషయాన్ని తను ఇటీవలే సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తను ఆవకాయ పెట్టడం జీవితంలో ఇదే మొదటిసారి అని చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఆవకాయ వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి కూడా వివరంగా తన బ్లాగ్‌లో వివరించింది మిస్సెస్‌ సి. మరి ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందామా..!

Know More

women icon@teamvasundhara
avoid-these-mistakes-while-wearing-reusable-masks

మాస్క్‌ ధరించేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?

మాస్క్‌.. కరోనా విజృంభణతో ప్రతి ఒక్కరికీ అత్యవసర వస్తువుగా మారిందిది. అడుగు బయటపెడితే మాస్క్‌ ధరించడం తప్పనిసరి అంటూ ప్రభుత్వాలు కూడా ఆదేశాలు జారీ చేశాయి. అంతేకాదు.. ప్రస్తుతం అందరికీ మాస్కుల అవసరం ఏర్పడడంతో బయట వాటి కొరత విపరీతంగా ఉంది. ఈ క్రమంలోనే సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల దాకా అందరూ ఎవరి మాస్కులు వాళ్లు తయారుచేసుకోవడంలో బిజీ అయ్యారు. అంతేకాదు.. వాటినెలా తయారుచేయాలో వివరిస్తూ వాటికి సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు కొందరు సెలబ్రిటీలు. అయితే మాస్క్‌ తయారుచేయడం వరకు బాగానే ఉంది.. కానీ వాటిని ధరించే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ మహమ్మారికి దూరంగా ఉండగలం. మరి, ఇంతకీ రీయూజబుల్‌ మాస్కులు ధరించే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
health-benefits-of-moong-dal-in-summer
women icon@teamvasundhara
natural-way-to-relieve-gas-and-bloating

ఈ చిట్కాలతో గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం!

'రాళ్లు తిని అరిగించుకోవాల్సిన వయసులో ఈ అరుగుదల సమస్యలేంటర్రా..?' - అంటూ పెద్దవాళ్లు వాపోతున్నారు.. కానీ ఏం చేయగలం..? చదువులూ, ఉద్యోగాల కోసం పరుగులు తీసే హడావుడిలో బయట దొరికే ఆహారం తినక తప్పదు. అలాంటప్పుడు దానివల్ల కలిగే జీర్ణ సమస్యలూ తప్పవు కదా మరి..! ఇంట్లో తయారు చేసే ఆహారం కూడా వందశాతం ఆరోగ్యకరమైనదే అని చెప్పలేం. విషపూరితమైన కూరగాయలు, కల్తీ సరుకులు మన ఆహారాన్ని కలుషితం చేస్తున్నాయి. నగరాలలో ఈ సమస్య మరీ ఎక్కువ. పెరిగే హాస్పిటళ్ల సంఖ్యకీ, తరిగి పోతున్న మన ఆరోగ్యానికీ ఇదే కారణం. అలాగని తినకుండా ఉండలేం కదా.. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటనేగా మీ ప్రశ్న..? అయితే జీర్ణ సమస్యలని నివారించే ఈ వంటింటి చిట్కాలను పాటించండి.

Know More

women icon@teamvasundhara
summer-tip-health-benefits-of-barley-seeds
women icon@teamvasundhara
these-vitamins-plays-a-vital-role-to-strengthen-the-immunity-system

ఇమ్యూనిటీని పెంచే విటమిన్లివి!

రోగనిరోధక శక్తి... మనల్ని జబ్బుల బారి నుండి కాపాడే ఔషధం వంటిది. మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటే దాని ధాటికి మన ఒంట్లోకి ప్రవేశించే వైరస్‌, బ్యాక్టీరియాలు కూడా నిలవలేవు. మరి, ఇందుకోసం మనం తీసుకునే ఆహారం చాలా కీలకం. ఈ క్రమంలో విటమిన్లు నిండి ఉన్న ఆహారాన్ని కూడా మన రోజువారీ మెనూలో చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. తద్వారా వ్యాధి సోకిన తర్వాత దాన్ని నయం చేసుకోవడం కంటే ముందే జాగ్రత్తపడచ్చంటున్నారు. కరోనా విజృంభణ కొనసాగుతోన్న ఈ నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లేంటి? అవి పుష్కలంగా లభించే పదార్థాలేంటో తెలుసుకొని మన రోజువారీ మెనూలో భాగం చేసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
celebrity-dietician-rujuta-diwekar-shared-superfoods-for-thyroid-problems

థైరాయిడ్‌ సమస్యా? అయితే ఈ సూపర్‌ ఫుడ్స్‌ మీకోసమే!

థైరాయిడ్‌.. చాలామంది మహిళల ఆరోగ్యకరమైన జీవనశైలిపై దెబ్బ కొడుతుందీ సమస్య. శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేసే ఈ గ్రంథి పనితీరు దెబ్బతింటే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, అలసట, నెలసరి సక్రమంగా రాకపోవడం, గర్భం దాల్చకపోవడం.. వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టి థైరాయిడ్‌ గ్రంథి పనితీరును మెరుగుపరచుకోవాలంటే అందుకు మనం తీసుకునే ఆహారం, చేసే వ్యాయామాలు ఎంతగానో దోహదం చేస్తాయి. ముఖ్యంగా కొన్ని సూపర్‌ఫుడ్స్‌ థైరాయిడ్‌ గ్రంథి పనితీరును చక్కదిద్దడంలో తోడ్పడతాయంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌.

Know More

women icon@teamvasundhara
water-melon-health-benefits
women icon@teamvasundhara
corona-virus-covid-19-rakul-shares-her-immunity-power-secret

నా ఇమ్యూనిటీ రహస్యమిదే!

ఎలాంటి మందూ లేని కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే స్వీయ నిర్బంధం ఒక్కటే పరిష్కార మార్గమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా ఈ వైరస్‌ సోకకుండా నియంత్రించాలన్నా, ఒకవేళ సోకినా త్వరగా కోలుకోవాలన్నా శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలని వారు చెబుతున్నారు. ఇక లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు కూడా కరోనా జాగ్రత్తలపై సోషల్‌ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటిపట్టునే ఉండి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవడానికి తామెలాంటి చిట్కాలు పాటిస్తున్నామో తెలుపుతూ పోస్టులు, ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తున్నారు. తాజాగా పంజాబీ భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి తాను పాటిస్తోన్న ఓ ఆరోగ్య సూత్రాన్ని అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
we-dont-want-children-what-to-do
women icon@teamvasundhara
corona-virus-national-institute-of-nutrition-suggests-balanced-diet-to-fight-against-corona

ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ పోషకాహారం తీసుకోవాల్సిందే !

కరోనా ధాటికి ప్రపంచం కుదేలవుతోంది. అమెరికా, ఇటలీ, బ్రిటన్‌, స్పెయిన్‌.. లాంటి అత్యుత్తమ వైద్య సదుపాయాలున్న అగ్రదేశాలు కూడా ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోలేకపోతున్నాయి. ఇక భారతదేశంలోనూ రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఎలాంటి మందూ లేని ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే స్వీయ జాగ్రత్తలే శరణ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలన్నా, సోకినా త్వరితగతిన కోలుకోవాలన్నా రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు ‘జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌)’ కూడా రోగనిరోధక శక్తిని పెంచే బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే కరోనాపై విజయం సాధించవచ్చని చెబుతోంది. ఈక్రమంలో అందరూ పౌష్టికాహారంపై దృష్టి సారించాలని చెబుతూ దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-for-pregnant-woman-in-this-lock-down-period
women icon@teamvasundhara
eye-care-during-corona-crisis