scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నిబంధనలు పాటిస్తూనే అలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నాం !'

'పెళ్లంటే.. వధూవరులు, ఇరు కుటుంబ సభ్యులు, అతిథులు, అక్షతలు.. ఇలా జీవితంలో ఒకేసారి చేసుకునే ఈ వేడుకను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకుంటారు ప్రతి ఒక్కరూ. అయితే ఈ కరోనా కాలంలో పెళ్లి చేసుకునే వారికి అంత అదృష్టం కరువైందని చెప్పుకోవాలి. లాక్‌డౌన్‌, సామాజిక దూరం పేరుతో చాలా పెళ్లిళ్లు తూతూ మంత్రంగానే జరిగిపోతున్నాయి. వధువు ఒక చోట, వరుడు మరో చోట ఉంటే ఫోన్‌కే తాళికట్టి పెళ్లైందనిపించే రోజులొచ్చాయి. అంతేనా.. వధూవరులిద్దరూ ఒకే చోట ఉండి, కుటుంబ సభ్యులు వేరే ప్రాంతాల్లో ఉంటే వీడియో కాలింగ్‌ యాప్స్‌ ద్వారా అందరినీ ఒక్కచోట చేర్చి మరీ అక్షతలు వేయించుకుంటున్నాయి కొత్త జంటలు. ఇదిగో.. తమ పెళ్లీ ఇలాగే జరిగిందంటోంది ఓ నవ వధువు. ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతంలో ఉన్న తమకు ముందుగానే పెళ్లి ముహూర్తం నిశ్చయమైనప్పటికీ.. కరోనా కారణంగా స్వస్థలాలకు వెళ్లలేక ఉన్నచోటే పెళ్లి చేసుకున్నామంటూ తమ పెళ్లి ముచ్చట్లను మనతో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చేసింది.'

Know More

Movie Masala

 
category logo

హోలీ కేళీపై ‘కరోనా’ ఎఫెక్ట్‌ పడకుండా ..!

celebrate Holi without effect of coronavirus

రంగుల హరివిల్లు.. డీజే సంగీతం.. దానికి తగ్గ స్టెప్పులు.. అలసిపోకుండా మధ్యమధ్యలో కూల్‌డ్రింక్స్, స్నాక్స్.. రంగుల పండగ హోలీ తెచ్చే హడావిడి అంతా ఇంతా కాదు. అయితే మనదేశంలోనూ కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) క్రమంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో ఎక్కువమంది గుమిగూడి హోలీ సంబరాలు చేసుకోవడం అంత మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే ఎక్కువ మంది గుమిగూడిన చోట వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందని, ఆ గుంపులో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే.. దగ్గు, తుమ్ముల ద్వారా అది అందరికీ సోకే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హోలీ సంబరాల్లో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే వారూ లేకపోలేదు. మరి, ఓవైపు కరోనా నుంచి జాగ్రత్తపడుతూనే.. మరోవైపు రంగుల ప్రభావం మనపై పడకుండా హెల్దీగా హోలీ జరుపుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి.

‘కరోనా’కు దూరంగా..!

handwashtips650-10.jpg

కొవిడ్‌ - 19 (కరోనా వైరస్‌) ప్రస్తుతం మన దేశంలోకీ ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ఎక్కువమంది గుంపులుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లొద్దంటూ, ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవాలంటూ, ముక్కు-నోరు కవరయ్యేలా మాస్కులు ధరించాలంటూ వైద్యులు సూచిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడి జరుపుకొనే హోలీ విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సిందే అంటున్నారు. హోలీ సందర్భంగా వందలాది మంది ఒకే చోట గుమిగూడడం, కొన్ని ఈవెంట్‌ సంస్థలు ఏర్పాటు చేసే రెయిన్‌ డ్యాన్స్‌.. వంటి ప్రత్యేక కార్యక్రమాల్లో కుటుంబంతో కలిసి పాల్గొని ఎంజాయ్‌ చేయడం సర్వసాధారణమే. అయితే ఎక్కువ మంది గుమిగూడిన చోట వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉంటుందని, ఒకవేళ ఆ గుంపులో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే వారు దగ్గడం, తుమ్మడం వల్ల అది మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మన ఇంటి ముంగిట్లో.. అది కూడా మన కుటుంబ సభ్యులతోనే కలిసి హోలీ ఆడుకోవడం, అది కూడా సహజసిద్ధమైన రంగులతో హోలీ కేళీ జరుపుకోవడమే శ్రేయస్కరమంటున్నారు వారు. హోలీ ముగిసిన తర్వాత ఒకవేళ దగ్గు, తుమ్ములు లాంటి లక్షణాలేవైనా కనిపిస్తే.. వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం మాత్రం మర్చిపోవద్దు.

చర్మ సంరక్షణ ఇలా !

tipsforsafeholi650-2.jpg

* హోలీ ఆడటానికి కేవలం సహజసిద్ధమైన రంగులను మాత్రమే ఉపయోగించాలి. అయితే నేచురల్ రంగులుగా మార్కెట్లో దొరుకుతున్న చాలా రకాల రంగుల్లో రసాయన అవశేషాలుంటున్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఉదాహరణకు హెన్నాను మనమంతా సహజసిద్ధమైన రంగుగానే భావిస్తాం.. కానీ బ్లాక్ హెన్నాలో పారాఫినైలెన్‌డైఅమైన్ (పీపీడీ) అనే రసాయనం కలిసి ఉంటుంది. అది చాలామందిలో ఎలర్జీని కలగజేస్తుంది.
* హోలీ ఆడటానికి ముందే గోళ్లకు దట్టంగా నెయిల్ పాలిష్ వేసేయాలి. దీని వల్ల గోళ్లలోకి రంగుల ప్రభావం పోకుండా ఉంటుంది. లేదా కొబ్బరి నూనె, ఆముదం, ఆలివ్ ఆయిల్ చెంచా చొప్పున తీసుకొని అందులో గోళ్లను ముంచి కాసేపు ఉంచాలి.
* హోలీ ఆడే క్రమంలో ఎండ తగులుతుంది. అలాగే నీళ్లలో తడుస్తూ ఉంటారు. కాబట్టి చర్మం మరింత నల్లబడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే ముందుగానే చర్మానికి 30 ఎస్‌పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా రాసుకోవాలి.
* పెదాలకు లిప్‌బామ్‌ని దట్టంగా రాసుకోవాలి. హోలీ ఆడిన తర్వాత లిప్ బామ్ కూడా పోయేలా పెదవుల్ని కడిగి తుడుచుకోవాలి.
* హోలీ రంగుల వల్ల చర్మం తర్వాత ఎక్కువగా పాడయ్యేది జుట్టు.. అందుకే హోలీకి ముందు రోజు రాత్రే తలకు నూనె పట్టించి మర్దనా చేయాలి. హోలీ ఆడేటప్పుడు కూడా గట్టిగా జడ వేసుకోవడం వల్ల జుట్టు పైన ఎక్కువగా రంగు పడకుండా ఉంటుంది.
* హోలీ ముందు రోజు శరీరానికి ఆముదం రాసుకోవడం వల్ల రంగుల ప్రభావం చర్మం లోపలికి వెళ్లకుండా ఉండటమే కాదు.. రంగులు తొందరగా తొలగిపోతాయి.
* హోలీ ఆడిన తర్వాత కూడా క్లెన్సర్‌తో చక్కగా రంగులను క్లీన్ చేసుకోవాలి. ఎక్కడా రంగుల అవశేషాలు మిగలకుండా జాగ్రత్త పడాలి. ఒక స్పూను శెనగపిండి, రెండు స్పూన్ల పాలపొడి, కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ తీసుకొని దాన్ని చర్మానికి పట్టించి క్లీన్ చేసుకుంటే రంగులు ఈజీగా తొలగిపోతాయి. ఆ తర్వాత శరీరానికి మంచి మాయిశ్చరైజర్ తప్పనిసరిగా రాసుకోవాలి.
* హోలీ ఆడిన తర్వాత ముల్తానీ మట్టి ప్యాక్ వేసుకొని ఒక గంట సేపు ఆగిన తర్వాత స్నానం చేయడం వల్ల రంగులన్నీ పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆ రంగుల వల్ల అలర్జీలు తలెత్తకుండా ఉంటాయి.
* శెనగపిండి, స్వీట్ ఆయిల్, మీగడ, రోజ్‌వాటర్‌లతో చిక్కని పేస్ట్ తయారుచేసి ముఖం, చేతులు, మెడ, కాళ్ల మీద అప్త్లె చేసి ఆరనివ్వాలి. ఆరిన తర్వాత రుద్ది కడిగేసుకుంటే చర్మం మీద వచ్చిన దద్దుర్లు తగ్గుతాయి.
* హోలీ ముందు లేదా తర్వాత కొద్ది రోజుల పాటు బ్యూటీ ట్రీట్‌మెంట్లకు దూరంగా ఉండడం మంచిది.
* హోలీ ఆడే క్రమంలో శరీరాన్ని పూర్తిగా కవర్ చేస్తూ ఉండే దుస్తులు ధరించడం మంచిది. దీని వల్ల చర్మానికి రంగుల వల్ల ఎక్కువ హాని జరగకుండా కాపాడుకోవచ్చు.

‘కళ్లు’ జాగ్రత్త!

holicoronagh650-1.jpg

* హోలీ రంగుల నుంచి కళ్లను కాపాడుకోవడం కూడా ముఖ్యమే. ఈ క్రమంలో కళ్లలో రంగులు పడినట్లయితే వాటిని ఎక్కువ నీళ్లతో తరచుగా కడుగుతూ ఉండాలి. హోలీ ఆడడం పూర్తయిన తర్వాత కళ్లలో కొద్దిగా రోజ్ వాటర్ వేసుకొని పడుకున్నా కళ్లకు విశ్రాంతి దొరుకుతుంది.
* మన కళ్ల చుట్టూ ఉన్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వీటిపై రంగులు పడితే అది కమిలిపోయి ఆ ప్రభావం కంటి చూపుపై పడుతుంది. అందుకే బయటికి వెళ్లే ముందే కొబ్బరి, బాదం నూనెలను కళ్ల చుట్టూ రాసుకోవాలి.

* ఒకవేళ కళ్లు ఎర్రబడటం, నీరు కారడం, పుసులు కట్టడం, దురద, రక్తం కారటం లాంటి లక్షణాలు కన్పిస్తే.. నిర్లక్ష్యం చేయకుండా తక్షణం నిపుణులైన నేత్ర వైద్యులను సంప్రదించాలి.

* కంట్లో రంగులు పడకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఎవరైనా రంగులు వేస్తే కళ్లు, పెదాలు గట్టిగా మూసి వేయడం ద్వారా ప్రమాదం నుంచి కొంత వరకు తప్పించుకోవచ్చు.

* కళ్లలో రంగులు పడితే ఎట్టి పరిస్థితిలో నలపకూడదు. ఇలా చేయడం వల్ల నేత్రాలకు మరింత నష్టం జరుగుతుంది. కొన్నిసార్లు చూపు కోల్పోయే అవకాశం కూడా ఉంది.

* వాటర్‌ బెలూన్స్‌కు దూరంగా ఉండాలి. వీటితో కళ్లలోకి కొట్టడం ద్వారా ఎక్కువ గాయాలవుతాయి. కొన్నిసార్లు కళ్లల్లో రక్తస్రావం జరుగుతుంది. కటకాలు దెబ్బతినడం, స్థానభ్రంశం చెందడం, రెటీనా దెబ్బతినే ముప్పు ఉంటుంది. కళ్లలో చిక్కుకున్న అవశేషాలను చేతి రుమాలు, టిష్యూ పేపర్‌ ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తే అది మరింత నష్టం కలిగిస్తుంది.

* హోలీలో పాల్గొంటే కాంటాక్ట్‌ లెన్స్‌లు వాడకపోవడం ఉత్తమం. కొన్ని లెన్స్‌లు నీటిని పీల్చుకుంటాయి. ఇవి కంటిలో చిక్కుకుపోతే అలర్జీలు, అంటు వ్యాధులు రావడంతో పాటు కంటి చూపుకి నష్టం చేసే అవకాశం ఉంది.

* డాబాలు, మేడలపై, అపార్ట్‌మెంట్ల టెర్రస్‌పై హోలీ ఆడకపోవడం మంచిది. కొన్నిసార్లు ఈ సందడిలో మునిగి కాలు జారి కింద పడే ప్రమాదం కూడా ఉంటుంది. గతంలో ఈ తరహా సంఘటనలు చోటుచేసుకున్నాయి.

* ప్రమాదవశాత్తు రంగు పడితే ముఖాన్ని కిందకు దించి కళ్లను తెరిచేందుకు ప్రయత్నించాలి. ఈ క్రమంలో కళ్లల్లో నీళ్లు కొట్టకూడదు. ఇది మరింత ప్రమాదానికి దారితీస్తుంది. దోసిట్లో నీటిని తీసుకొని అందులో ముఖం పెట్టి కళ్లను నెమ్మదిగా తెరవాలి.

గర్భిణులూ.. ఇవి మీకోసమే!

apohalegh650-2.jpg

హోలీ సమయంలో మామూలు స్త్రీల కంటే గర్భిణులు, పాలిచ్చే తల్లులు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లో దొరికే రంగులు అవి సహజసిద్ధమైనవైనా సరే.. గర్భిణులు వాటిని ఉపయోగించకపోవడం మంచిది. ఇలాంటి వారు ఇంట్లోనే తయారు చేసుకున్న రంగులతో హోలీ ఆడుకోవచ్చు.
* పసుపు, సింధూరం, గంధం వంటి వాటిని ఉపయోగించవచ్చు. ఇవి కాకుండా బీట్‌రూట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని ఉడకబెట్టినా రంగులు వస్తాయి.. వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు.
* గర్భిణులు, పాలిచ్చే తల్లులు హోలీ ఆడిన తర్వాత వీలైనంత తొందరగా రంగులను తొలగించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ రంగుల ప్రభావం బిడ్డ మీద ఎక్కువగా ఉంటుంది.
* కేవలం హోలీ రంగులతోనే కాదు.. వీళ్లు ఇంకా చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. తీసుకునే ఆహారంలో ఎక్కడా కృత్రిమ రంగులు లేకుండా చూసుకోవాలి. నూనె పదార్థాలు, కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తీసుకోకపోవడం, నీళ్లు ఎక్కువగా తాగుతుండటం వంటివి చేస్తూ ఉండాలి.
* హోలీ రోజు నీటి ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. గర్భిణులు నడిచేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం, ఎవరినైనా తోడుగా ఉంచుకోవడం మంచిది. దీని వల్ల నీళ్లలో జారిపడే ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు.
* అలాగే కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో వీరు ఇంట్లోనే, అది కూడా కుటుంబ సభ్యులతోనే హోలీ ఆడుకోవడం, స్వయంగా తయారు చేసుకున్న రంగులతోనే జాగ్రత్తలు పాటిస్తూ హోలీ ఆడుకోవడం మంచిది. వీలైతే హోలీ సంబరాలకు దూరంగా ఉంటే మరీ మంచిది.
చూశారుగా.. అటు అందం విషయంలో ఇటు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహిస్తూ హోలీ కేళీ జరుపుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు.. అలాగే ‘కరోనా’ వైరస్‌ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సంతోషంగా హోలీని ఎంజాయ్‌ చేయచ్చు.





women icon@teamvasundhara
coronavirus-visiting-a-hospital-during-the-pandemic?-keep-these-points-in-mind

ఆస్పత్రికి వెళుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే!

సుదీర్ఘ లాక్‌డౌన్‌కి తెరదించుతూ ప్రభుత్వం దశలవారీగా కొన్ని సడలింపులిస్తోంది. దీంతో అన్ని రంగాల్లోనూ పనులు మొదలయ్యాయి. ఇక లాక్‌డౌన్‌ కాలంలో చాలా రోజుల పాటు ఎమర్జెన్సీ సేవలకే పరిమితమైన ఆస్పత్రులు కూడా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులున్న రోగులతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఆస్పత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే ఆర్థిక కారణాలతో లాక్‌డౌన్‌ సడలింపులిచ్చినా కరోనా వైరస్‌ మన మధ్యే ఉందన్నది జీర్ణించుకోలేని వాస్తవం. ఈ పరిస్థితుల్లో వివిధ కారణాలతో ఆస్పత్రులు, క్లినిక్‌లకు వెళ్లే రోగులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
when-should-i-have-sex-to-get-pregnant?
women icon@teamvasundhara
best-summer-fruits-to-eat-in-telugu
women icon@teamvasundhara
precautions-to-take-in-periods-on-this-menstrual-hygiene-day

నెలసరి సమయంలో హుషారుగా ఇలా...!

'ఆకాశం తన రెక్కలతో నను కప్పుతు ఉంటే..' అంటూ హుషారుగా తిరిగే అమ్మాయిలు సైతం నెలసరి రాగానే దిగులుగా, నీరసంగా అయిపోతారు. కానీ కొందరు మాత్రం ఎప్పటిలానే ఆడుతూపాడుతూ తిరిగేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే నెలసరి అనేది అందరమ్మాయిలకీ ఎదురయ్యే సహజమైన సమస్యే. అయితే దానిని ఎదుర్కొనే తీరులోనే తేడాలు ఉంటాయి. ఈ క్రమంలో నెలసరి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే హుషారుగా ఆడుతూపాడుతూ ఉండచ్చో ఓసారి మనం కూడా తెలుసుకుందాం రండి.. సాధారణంగా నెలసరి సమయంలో ఎక్కువమంది సతమతమయ్యేది అధిక రక్తస్రావం, కడుపునొప్పి సమస్యలతోనే. సరైన పోషకాహారం తీసుకుంటూ మన చుట్టూ ఉండే వాతావరణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యదాయకంగా ఉండేలా చూసుకుంటే వీటి నుంచి బయటపడచ్చు. ఒకవేళ సమస్య మరీ తీవ్రమైతే వెంటనే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి. ఇవన్నీ చేసినా వ్యక్తిగతంగా మనం కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తేనే ఎప్పటిలా తాజాగా, హుషారుగా ఉండటానికి వీలవుతుంది.

Know More

women icon@teamvasundhara
genetic-disorders-in-children
women icon@teamvasundhara
pain-during-sex-what-to-do
women icon@teamvasundhara
reasons-to-get-negative-emotions-during-lockdown

ఈ సంక్షోభ సమయంలో మానసిక ఆరోగ్యమూ ముఖ్యమే !

మనదేశమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎవరికి వారే స్వయంగా లాక్‌డౌన్‌ విధించుకుని బంధించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది కరోనా. ఈ నేపథ్యంలో కొందరు ఈ సమయాన్ని తమ కోసం, తమ ప్రియమైన వారి కోసం కేటాయించడానికి దొరికిన అవకాశంగా భావిస్తే.. మరికొందరి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ లాక్‌డౌన్‌ వేళ ఇంట్లో ఉన్నా కూడా కొందరు ఒత్తిడికి గురవుతున్నట్లు మానసిక నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకు బోలెడన్ని కారణాలున్నాయంటున్నారు వారు. ఇంతకీ, ఏంటా కారణాలు? వాటిని పరిష్కరించుకునే మార్గాల గురించి ‘మానసిక ఆరోగ్య అవగాహన వారోత్సవం’ సందర్భంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
these-celebrities-have-battled-mental-disorders

ఆ సమస్య గురించి ధైర్యంగా బయటపెట్టారు.. భరోసానిచ్చారు !

మనసు నిర్మలంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంటాడు. మంచైనా, చెడైనా అది మనసుపైనే ఆధారపడి ఉంటుంది. మనసులోని ఆలోచనలు సక్రమంగా లేకుంటే మనిషి మనుగడే కష్టమవుతుంది. అందుకే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యం తప్పనిసరి అని చెబుతారు సైకాలజిస్టులు. కానీ నేటి యాంత్రిక జీవనంతో స్కూలుకెళ్లే పిల్లల నుంచి పండు ముదుసలి దాకా అందరూ డిప్రెషన్ బారిన పడుతున్నారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న సెలబ్రిటీలు సైతం ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో 'మానసిక అవగాహన వారోత్సవం’ సందర్భంగా ఒత్తిడి, మానసిక ఆందోళన నుంచి బయటపడిన కొందరు ప్రముఖుల గురించి తెలుసుకుందాం. !

Know More

women icon@teamvasundhara
employees-facing-problems-after-lockdown-about-coronavirus
women icon@teamvasundhara
health-benefits-of-curry-leaves
women icon@teamvasundhara
juices-that-help-you-to-detoxify-your-body
women icon@teamvasundhara
natural-ways-to-control-high-blood-pressure

బీపీకి వీటితో చెక్ పెడదాం!

అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్).. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. ధమనుల్లో రక్తం అధిక ఒత్తిడితో ప్రసరించడం వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశాలున్నాయి. సాధారణ వ్యక్తులతో పాటు సుమారు 50 శాతం మందికి పైగా వైద్యులు సైతం అధిక రక్తపోటు సమస్యతో సతమతమవుతున్నారని తేలింది. దీనికి అధిక ఒత్తిడితో పాటు ఇతర అంశాలు కూడా కారణమవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఇలా చాప కింద నీరులా వ్యాపించే ఈ వ్యాధిపై అవగాహన కల్పించడం కోసమే ఏటా మే 17న 'వరల్డ్ హైపర్‌టెన్షన్ డే'ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సమస్య తలెత్తడానికి గల కారణాలు, దాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఉపకరించే కొన్ని సహజసిద్ధ మార్గాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-high-blood-pressure-during-pregnancy
women icon@teamvasundhara
lock-down-tips-to-take-healthy-food-in-this-lock-down-period
women icon@teamvasundhara
i-have-irregular-periods-what-to-do

మాత్రలు వాడితేనే పిరియడ్స్‌ వస్తున్నాయి.. ఎలా?

హలో మేడం. నా వయసు 30. నాకు 2014లో బాబు పుట్టాడు. అప్పట్నుంచి పిరియడ్స్‌ రావట్లేదు. బాబు పుట్టాక రెండేళ్లకు డాక్టర్‌ దగ్గర చెకప్‌ చేయించుకున్నా. డాక్టర్‌ టెస్ట్‌ చేసి నాకు పీసీఓఎస్‌ ఉందని చెప్పారు. దాంతో అప్పట్నుంచి మాత్రలు వేసుకుంటేనే పిరియడ్స్‌ వస్తున్నాయి. 2018లో డాక్టర్‌ సలహా మేరకు లాప్రోస్కోపీ కూడా చేయించుకున్నా. అయినా కూడా పిరియడ్స్‌ రెగ్యులర్‌ కావట్లేదు. రెండోసారి ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించాం.. కానీ అండాల ఎదుగుదల లేక ప్రెగ్నెన్సీ రావట్లేదు. ట్యాబ్లెట్స్‌, ఇంజెక్షన్స్‌ అన్నీ ట్రై చేశాం.. అయినా గర్భం రావట్లేదు. నా ఈ సమస్యలకు పరిష్కారం చూపగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
contraceptive-care-guidelines-during-covid-19-pandemic-by-gynecology-expert-dr-savita-devi
women icon@teamvasundhara
how-to-stop-spotting---gynecologist-advice

స్పాటింగ్‌ అయితే సమస్యా?

హాయ్‌ డాక్టర్‌. ఇప్పుడు నాకు 18 ఏళ్లు. నా బరువు 42 కిలోలు.. ఎత్తు 5’2’’. ఐదేళ్ల క్రితం రజస్వల అయ్యాను. అప్పుడు రెండు నెలలకోసారి నెలసరి వచ్చేది. బ్లీడింగ్‌ కూడా నార్మల్‌గానే అయ్యేది. కానీ ఏడాది క్రితం నెలసరి సమయంలో 10 రోజులు స్పాటింగ్‌ అయింది. అప్పుడు డాక్టర్‌ దగ్గరికి వెళ్తే స్కానింగ్‌ చేసి పీసీఓఎస్‌ ఉందని చెప్పారు. ఎండోమెట్రియమ్‌ 8mm అని చెప్పారు. అప్పట్నుంచి ఇప్పటిదాకా మాత్రలు వాడుతున్నా. అయితే నెలసరి సరిగ్గా వస్తుంది కానీ బ్లీడింగ్‌ సరిగ్గా అవ్వట్లేదు. ఒకటి లేదా రెండు రోజులు స్పాటింగ్‌ అవుతుంది. గత నెలలో మాత్రలు వేసుకోకపోతే 10 రోజులైనా నెలసరి రాలేదు. మళ్లీ మూడు రోజులు మాత్రలు వాడాక 5వ రోజు నెలసరి వచ్చింది.. అది కూడా రెండు రోజులు స్పాటింగ్‌ అయింది. నాకు అవాంఛిత రోమాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. థైరాయిడ్‌ లేదు. నా ఈ సమస్యకు పరిష్కారం చూపగలరు. ప్రస్తుతం నేను వాడే మాత్రలు ఎక్కువ కాలం వేసుకుంటే ప్రమాదమా..? చెప్పండి. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
celebrity-nutritionist-pooja-makhija-shared-the-nutritional-values-of-indian-spices

ఈ వంటింటి ఔషధాలతో ఇమ్యూనిటీ పెంచుకోండి!

ఒంట్లో కాస్త నలతగా అనిపిస్తే చాలు.. మెడికల్‌ షాప్‌ నుంచి ఏదో ఒక ట్యాబ్లెట్‌ తెచ్చుకోవడం, వేసేసుకోవడం చేస్తుంటామే తప్ప.. ఆ అనారోగ్యాన్ని తగ్గించగలిగే ఔషధాలు మన వంటింట్లోనే ఉన్నాయన్న విషయం మాత్రం ఆలోచించం. అంతేకాదు.. ఏ వ్యాధులూ సోకకుండా మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేసే రోగనిరోధక వ్యవస్థను పటిష్ట పరిచే సహజసిద్ధమైన ఔషధాలకు మన వంటిల్లు నిలయం. అలాంటి పదార్థాల్లో కొన్ని మసాలా దినుసులు కూడా ఉన్నాయంటోంది ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు పూజా మఖిజ. వంటింట్లో లభించే వివిధ రకాల మసాలాల్లో దాగున్న పోషక విలువలను వివరిస్తూ ఇటీవలే ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది పూజ.

Know More

women icon@teamvasundhara
health-benefits-of-cloves-tea

లవంగం టీ తాగారా...?

కాఫీ, టీలు లేకపోతే కొందరికి రోజు గడవదు. తలనొప్పిగా ఉన్నా, ఒత్తిడి నుంచి రిలాక్స్ కావాలన్నా ముందుగా ఆశ్రయించేది వీటినే. ప్రత్యేకించి తేనీరు విషయానికొస్తే దీనివల్ల ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలూ చేకూరతాయని వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది. అందులోనూ కొన్ని మూలికలతో తయారుచేసిన తేనీరు ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. అందుకే చాలామంది సాధారణ టీతో పాటు అల్లం టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ.. అంటూ వివిధ రకాల టీలు తాగుతుంటారు. అయితే లవంగంతో తయారుచేసిన తేనీరు మీరెప్పుడైనా తాగారా? ఇది కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

Know More

women icon@teamvasundhara
self-massaging-techniques-to-relax-your-pain-and-stress

మన చేతుల్లోనే ఉంది.. ‘మసాజ్‌’ మ్యాజిక్‌ అంతా!

మసాజ్‌.. శారీరక నొప్పుల నుండి ఉపశమనం కలిగించడంతో పాటు మానసికంగా సాంత్వన చేకూర్చుతుందీ ప్రక్రియ. ఈ లాక్‌డౌన్‌ సమయంలోనూ ఇంటి నుండి పనిచేయాల్సి రావడంతో అటు ఇంటి పని, ఇటు ఆఫీసు పనితో సతమతమవుతున్నారు చాలామంది మహిళలు. తద్వారా శారీరక నొప్పులు, మానసిక ఒత్తిడి రెట్టింపవుతున్నాయి. ఇక వీటి నుంచి బయటపడడానికి స్పా సెంటర్లు, మసాజ్‌ సెంటర్లకు వెళ్లి మసాజ్‌ చేయించుకుందామంటే ఈ లాక్‌డౌన్‌లో అవి కూడా మూతపడ్డాయి. అలాగని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎవరికి వారే సొంతంగా మసాజ్‌ చేసుకుంటే ఈ సమస్యలకు సత్వరమే ఫుల్‌స్టాప్‌ పెట్టచ్చంటున్నారు నిపుణులు. అయితే అదంతా ఎలా సాధ్యం అంటారా.. అందుకు మన చేతుల్లోనే ఉంది మ్యాజిక్‌ అంతా..! ఇందుకోసం మనం చేయాల్సిందల్లా మన బిజీ లైఫ్‌స్టైల్‌లో మసాజ్‌ కోసం కాస్త సమయం కేటాయించడమే! మరి, ఏయే నొప్పులకు ఎవరికి వారే స్వయంగా ఎలా మసాజ్‌ చేసుకోవచ్చో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
corona-virus-what-happens-when-you-dont-wash-your-hands

వామ్మో.. చేతులు శుభ్రం చేసుకోకపోతే ఇన్ని అనర్థాలా?

‘మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మన చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనిని ఒక అలవాటుగా మార్చుకోవాలి’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది. అంతేకాదు.. ఏటా మే 5న ‘హ్యాండ్‌ హైజీన్‌ డే’ (చేతుల పరిశుభ్రతా దినోత్సవం) పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చేతులు శుభ్రం చేసుకోవాలన్న విషయాన్ని చాలామంది పెడచెవిన పెడుతున్నారు. కానీ కరోనా పుణ్యమా అని ప్రస్తుతం ప్రతిఒక్కరూ చేతుల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యులు, ప్రముఖ ఆరోగ్య సంస్థలు సైతం పదే పదే ఇదే మాటను నొక్కివక్కాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఈ ప్రత్యేకమైన రోజుకు బోలెడంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Know More

women icon@teamvasundhara
world-hand-hygiene-day-hand-wash-who-precautions

చేతులు కడుక్కోండి.. ఆరోగ్యంగా ఉండండి!

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న కరోనా భూతం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అత్యంత ఆవశ్యకమన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గంటగంటకూ హ్యాండ్‌వాష్‌, శానిటైజర్ లేదా ఏదైనా సబ్బుతో చేతుల్ని పరిశుభ్రంగా రుద్ది మరీ కడుక్కోమంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. అంతేకాదు.. చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎన్నో వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చని కూడా వారు సూచిస్తున్నారు. నేడు (మే 5) ‘వరల్డ్‌ హ్యాండ్‌ హైజీన్‌ డే’. ఈ సందర్భంగా ‘SAVE LIVES: Clean your hands’ అనే థీమ్‌తో మనముందుకొచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ క్రమంలో చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే కొవిడ్‌తో పాటు ఎన్నో ఇన్ఫెక్షన్లు మన దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండచ్చన్న సందేశాన్ని అందరికీ అందించింది డబ్ల్యూహెచ్‌వో. ఈ నేపథ్యంలో సబ్బుతో చేతులను ఎంతసేపు కడగాలి? ఎలా శుభ్రం చేసుకోవాలి..? ఎప్పుడెప్పుడు చేతులు కడుక్కోవాలి..? తదితర విషయాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
here-are-the-health-benefits-of-eating-mango-pickle

ఈ ‘తియ్యటి ఆవకాయ’ మీరూ ట్రై చేస్తారా?

వేసవి కాలం అనగానే మనకు గుర్తొచ్చే విషయాల్లో మామిడి కాయలు/పండ్లు కూడా ఒకటి. ఈ సీజన్‌లో వచ్చే పుల్లని మామిడి కాయలతో చేసే ఆవకాయ అంటే ఇష్టం లేని వారుంటారా చెప్పండి.. వేడివేడి అన్నం, మామిడికాయ పచ్చడి, మీగడ వేసుకొని తింటే.. ఆ రుచికి మరేదీ సాటిరాదని చెప్పడం అతిశయోక్తి కాదు. అందుకే ఓ సినిమాలో త్రివిక్రమ్‌ కూడా ‘అమ్మ, ఆవకాయ.. ఎప్పటికీ బోర్‌ కొట్టవు’ అంటాడు. మన పూర్వీకులు కనిపెట్టిన ఈ సంప్రదాయ రెసిపీ రుచికరమైందే కాదు.. ఎంతో ఆరోగ్యకరమైంది కూడా..! ఈ క్రమంలో కొణిదెల వారి కోడలు ఉపాసన ఇటీవలే తియ్యటి ఆవకాయ పచ్చడి తయారు చేసింది. ఈ విషయాన్ని తను ఇటీవలే సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తను ఆవకాయ పెట్టడం జీవితంలో ఇదే మొదటిసారి అని చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఆవకాయ వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి కూడా వివరంగా తన బ్లాగ్‌లో వివరించింది మిస్సెస్‌ సి. మరి ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందామా..!

Know More

women icon@teamvasundhara
avoid-these-mistakes-while-wearing-reusable-masks

మాస్క్‌ ధరించేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?

మాస్క్‌.. కరోనా విజృంభణతో ప్రతి ఒక్కరికీ అత్యవసర వస్తువుగా మారిందిది. అడుగు బయటపెడితే మాస్క్‌ ధరించడం తప్పనిసరి అంటూ ప్రభుత్వాలు కూడా ఆదేశాలు జారీ చేశాయి. అంతేకాదు.. ప్రస్తుతం అందరికీ మాస్కుల అవసరం ఏర్పడడంతో బయట వాటి కొరత విపరీతంగా ఉంది. ఈ క్రమంలోనే సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల దాకా అందరూ ఎవరి మాస్కులు వాళ్లు తయారుచేసుకోవడంలో బిజీ అయ్యారు. అంతేకాదు.. వాటినెలా తయారుచేయాలో వివరిస్తూ వాటికి సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు కొందరు సెలబ్రిటీలు. అయితే మాస్క్‌ తయారుచేయడం వరకు బాగానే ఉంది.. కానీ వాటిని ధరించే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ మహమ్మారికి దూరంగా ఉండగలం. మరి, ఇంతకీ రీయూజబుల్‌ మాస్కులు ధరించే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
health-benefits-of-moong-dal-in-summer
women icon@teamvasundhara
natural-way-to-relieve-gas-and-bloating

ఈ చిట్కాలతో గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం!

'రాళ్లు తిని అరిగించుకోవాల్సిన వయసులో ఈ అరుగుదల సమస్యలేంటర్రా..?' - అంటూ పెద్దవాళ్లు వాపోతున్నారు.. కానీ ఏం చేయగలం..? చదువులూ, ఉద్యోగాల కోసం పరుగులు తీసే హడావుడిలో బయట దొరికే ఆహారం తినక తప్పదు. అలాంటప్పుడు దానివల్ల కలిగే జీర్ణ సమస్యలూ తప్పవు కదా మరి..! ఇంట్లో తయారు చేసే ఆహారం కూడా వందశాతం ఆరోగ్యకరమైనదే అని చెప్పలేం. విషపూరితమైన కూరగాయలు, కల్తీ సరుకులు మన ఆహారాన్ని కలుషితం చేస్తున్నాయి. నగరాలలో ఈ సమస్య మరీ ఎక్కువ. పెరిగే హాస్పిటళ్ల సంఖ్యకీ, తరిగి పోతున్న మన ఆరోగ్యానికీ ఇదే కారణం. అలాగని తినకుండా ఉండలేం కదా.. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటనేగా మీ ప్రశ్న..? అయితే జీర్ణ సమస్యలని నివారించే ఈ వంటింటి చిట్కాలను పాటించండి.

Know More

women icon@teamvasundhara
summer-tip-health-benefits-of-barley-seeds
women icon@teamvasundhara
these-vitamins-plays-a-vital-role-to-strengthen-the-immunity-system

ఇమ్యూనిటీని పెంచే విటమిన్లివి!

రోగనిరోధక శక్తి... మనల్ని జబ్బుల బారి నుండి కాపాడే ఔషధం వంటిది. మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటే దాని ధాటికి మన ఒంట్లోకి ప్రవేశించే వైరస్‌, బ్యాక్టీరియాలు కూడా నిలవలేవు. మరి, ఇందుకోసం మనం తీసుకునే ఆహారం చాలా కీలకం. ఈ క్రమంలో విటమిన్లు నిండి ఉన్న ఆహారాన్ని కూడా మన రోజువారీ మెనూలో చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. తద్వారా వ్యాధి సోకిన తర్వాత దాన్ని నయం చేసుకోవడం కంటే ముందే జాగ్రత్తపడచ్చంటున్నారు. కరోనా విజృంభణ కొనసాగుతోన్న ఈ నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లేంటి? అవి పుష్కలంగా లభించే పదార్థాలేంటో తెలుసుకొని మన రోజువారీ మెనూలో భాగం చేసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
celebrity-dietician-rujuta-diwekar-shared-superfoods-for-thyroid-problems

థైరాయిడ్‌ సమస్యా? అయితే ఈ సూపర్‌ ఫుడ్స్‌ మీకోసమే!

థైరాయిడ్‌.. చాలామంది మహిళల ఆరోగ్యకరమైన జీవనశైలిపై దెబ్బ కొడుతుందీ సమస్య. శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేసే ఈ గ్రంథి పనితీరు దెబ్బతింటే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, అలసట, నెలసరి సక్రమంగా రాకపోవడం, గర్భం దాల్చకపోవడం.. వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టి థైరాయిడ్‌ గ్రంథి పనితీరును మెరుగుపరచుకోవాలంటే అందుకు మనం తీసుకునే ఆహారం, చేసే వ్యాయామాలు ఎంతగానో దోహదం చేస్తాయి. ముఖ్యంగా కొన్ని సూపర్‌ఫుడ్స్‌ థైరాయిడ్‌ గ్రంథి పనితీరును చక్కదిద్దడంలో తోడ్పడతాయంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌.

Know More

women icon@teamvasundhara
water-melon-health-benefits
women icon@teamvasundhara
corona-virus-covid-19-rakul-shares-her-immunity-power-secret

నా ఇమ్యూనిటీ రహస్యమిదే!

ఎలాంటి మందూ లేని కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే స్వీయ నిర్బంధం ఒక్కటే పరిష్కార మార్గమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా ఈ వైరస్‌ సోకకుండా నియంత్రించాలన్నా, ఒకవేళ సోకినా త్వరగా కోలుకోవాలన్నా శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలని వారు చెబుతున్నారు. ఇక లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు కూడా కరోనా జాగ్రత్తలపై సోషల్‌ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటిపట్టునే ఉండి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవడానికి తామెలాంటి చిట్కాలు పాటిస్తున్నామో తెలుపుతూ పోస్టులు, ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తున్నారు. తాజాగా పంజాబీ భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి తాను పాటిస్తోన్న ఓ ఆరోగ్య సూత్రాన్ని అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
we-dont-want-children-what-to-do
women icon@teamvasundhara
corona-virus-national-institute-of-nutrition-suggests-balanced-diet-to-fight-against-corona

ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ పోషకాహారం తీసుకోవాల్సిందే !

కరోనా ధాటికి ప్రపంచం కుదేలవుతోంది. అమెరికా, ఇటలీ, బ్రిటన్‌, స్పెయిన్‌.. లాంటి అత్యుత్తమ వైద్య సదుపాయాలున్న అగ్రదేశాలు కూడా ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోలేకపోతున్నాయి. ఇక భారతదేశంలోనూ రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఎలాంటి మందూ లేని ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే స్వీయ జాగ్రత్తలే శరణ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలన్నా, సోకినా త్వరితగతిన కోలుకోవాలన్నా రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు ‘జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌)’ కూడా రోగనిరోధక శక్తిని పెంచే బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే కరోనాపై విజయం సాధించవచ్చని చెబుతోంది. ఈక్రమంలో అందరూ పౌష్టికాహారంపై దృష్టి సారించాలని చెబుతూ దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-for-pregnant-woman-in-this-lock-down-period
women icon@teamvasundhara
eye-care-during-corona-crisis

women icon@teamvasundhara
precautions-while-wearing-masks-during-corona-crisis

మాస్కులు ధరించే విషయంలో ఈ జాగ్రత్తలు మరవద్దు!

కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడంలో భాగంగా స్వీయ పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కుల వినియోగం కూడా తప్పనిసరైంది. అయితే ఇదే క్రమంలో గంటల తరబడి మాస్కులను ధరించడం వల్ల చర్మంపై గాట్లు ఏర్పడడం, కమిలిపోవడం, ఆ ప్రదేశంలో గాలి ప్రసరణ సరిగ్గా జరగక ఎరుపెక్కడం, అలర్జీలా రావడం.. వంటి పలు చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇలా నిరంతరాయంగా మాస్కులు ధరించడం వల్ల కొందరు నర్సుల చర్మంపై అయిన గాయాలకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలైన విషయం మనం చూసే ఉంటాం. అలాగని అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్లేటప్పుడు మాస్కులు ధరించకుండా ఉండే పరిస్థితి ఇప్పుడు లేదు.. కాబట్టి మాస్కులు ఎక్కువగా వినియోగించే వారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందచ్చంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో మాస్కులు ఎక్కువగా వేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలొస్తాయి? రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
tips-to-convenient-in-periods

ఇలా చేస్తే ఆ 'ఇబ్బంది' ఉండదు!

నెలసరి.. ఆడవారిని నెలనెలా పలకరించే ఈ పిరియడ్స్ వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఎదురవడం సహజం. కడుపునొప్పి, నడుంనొప్పి, చికాకు, ఒత్తిడి, ఆందోళన.. ఇలా ఈ సమయం మహిళల్ని చాలా రకాలుగానే ఇబ్బంది పెడుతుంటుంది. అయితే ప్రతి నెలా ఎదురయ్యే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి కొందరు మాత్రలు వేసుకోవడం మనం గమనిస్తూనే ఉంటాం. కానీ ఇలా ప్రతి చిన్నదానికీ తరచూ మాత్రలు వేసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి నెలసరి సమయంలో సౌకర్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవన్నీ ఆ సమయంలో ఎదురయ్యే అనారోగ్యాల నుంచి మనకు విముక్తి కలిగేలా చేస్తాయి. ఇంతకీ సౌకర్యవంతమైన పిరియడ్స్ కోసం ఏం చేయాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
precautions-and-natural-tips-for-body-pain-during-work-from-home-in-lockdown-time

‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ వేళ ఒంటి నొప్పులా..? ఈ టిప్స్‌ పాటించండి!

కరోనా కల్లోలం ఇప్పట్లో సద్దుమనిగేలా లేదు. లాక్‌డౌన్‌ కొనసాగుతోన్న వేళ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.. ఎన్నో సంస్థల పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇక కొన్ని సంస్థలు మాత్రం తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసుకునే (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) అవకాశాన్ని కల్పించాయి. ఇంటి నుంచి పనిచేసే క్రమంలో ఎక్కువ శాతం ల్యాప్‌టాప్‌ లేదా కంప్యూటర్‌ని ఉపయోగిస్తుంటాం. అయితే ఈ క్రమంలో గంటల తరబడి కూర్చోవడం, ఆఫీస్‌లో ఉన్న సౌకర్యాలు ఇంట్లో లేకపోవడంతో ఒంటి నొప్పులు బాధిస్తుంటాయి. ఇది చాలా సహజమైన విషయం.. మరి, ఇలాంటి ఒంటి నొప్పుల్ని దూరం చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం

Know More