scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నేను ఏ తప్పూ చేయలేదు.. అయినా నాకెందుకీ శిక్ష!'

'ఎయిడ్స్.. నిరోధక మార్గాలు తప్ప పూర్తిస్థాయి చికిత్స లేని వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి సోకిందని తెలిస్తే చాలు.. వారు తప్పు చేశారు కాబట్టే ఆ వ్యాధి వచ్చిందని చుట్టుపక్కల ఉన్న వారు బలంగా నమ్ముతారు. ఈ క్రమంలో బాధితులను వారి మాటలతో మానసికంగానూ హింసిస్తారు. ఓ మహిళ తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ మహమ్మారి బారిన పడి ఒకానొక దశలో జీవితాన్ని ముగించేసుకోవాలనుకుంది.. కానీ ఆమెకు వచ్చిన ఓ ఆలోచన ఆ నిర్ణయాన్ని మార్చేసింది. అంతేకాదు.. ఈ సమాజంలో ఆమె ఎదుర్కొన్న మాటల ఈటెలు, బాధాకరమైన సంఘటనలు.. తనని మానసికంగా మరింత బలంగా తీర్చిదిద్దాయి.. దాంతో ఆమె ఎయిడ్స్‌పై పోరాడడమే కాదు.. చుట్టుపక్కల వారికీ అవగాహన కల్పిస్తూ తోటి వ్యాధిగ్రస్తులకు అండగానూ నిలుస్తోంది. అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం రండి.. నమస్కారం.'

Know More

Movie Masala

 
category logo

అపోహలు తొలగిద్దాం.. అవగాహన పెంచుకుందాం..

aids Myths and Facts about the deadly disease

మానవ జాతిని వణికిస్తోన్న ప్రాణాంతక వ్యాధుల్లో ఎయిడ్స్ కూడా ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఈ వ్యాధికి మందు కనుగొనేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నా ఇప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. అలాగని హెచ్ఐవీ ఏమీ అంటువ్యాధి కాదు. ఈ వ్యాధి కేవలం కొన్ని మార్గాల ద్వారా మాత్రమే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. కానీ కొందరు ఎయిడ్స్, హెచ్ఐవీలపై ఉన్న అపోహల కారణంగా ఈరోజుల్లో కూడా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ; వారిని దూరం పెడుతూ ఉంటారు. ఇవే కాదు.. మన సమాజంలో హెచ్ఐవీ గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. వాటిని తొలగిస్తూ; వ్యాధి గురించి అందరికీ పూర్తి అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 1ని 'ప్రపంచ ఎయిడ్స్ దినం'గా ప్రకటించింది. ఈ ఏడాది 'కమ్యూనిటీస్‌ మేక్‌ ది డిఫరెన్స్‌ - ఎయిడ్స్‌ నివారణలో సమాజానిదే కీలక పాత్ర’ అనే నినాదంతో ఈ వ్యాధిపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తోంది. ఈ సందర్భంగా ఎయిడ్స్/హెచ్ఐవీ వ్యాధి పట్ల ఉన్న కొన్ని అపోహల గురించి తెలుసుకొని; మరింత అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం రండి.

HIVmythsgh650.jpg
అపోహ: కండోమ్స్ ధరిస్తే హెచ్ఐవీ రాదు..
హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వ్యక్తితో శృంగారంలో పాల్గొనేటప్పుడు కండోమ్ ధరిస్తే చాలు.. ఆ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. శృంగారం సమయంలో కండోమ్ చిరిగిపోవడం, జారిపోవడం, లీక్ అవ్వడం వంటివి జరిగే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటివి జరిగితే హెచ్ఐవీ సోకే ప్రమాదం చాలా ఎక్కువ. అవతలి వారికి హెచ్ఐవీ లేదు అనుకొని కండోమ్ లేకుండా శృంగారంలో పాల్గొనాలనుకున్నా.. ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మన దేశంలో హెచ్ఐవీ సోకిన వారిలో 25శాతం మందికి తాము ఆ వ్యాధితో బాధపడుతున్నామన్న సంగతి తెలీదు. ఇలాంటివారితో అసురక్షిత లైంగిక చర్యలో పాల్గొంటే హెచ్ఐవీ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇది వెజైనల్ సెక్స్‌కి మాత్రమే కాదు.. యానల్, ఓరల్ సెక్స్‌కి కూడా వర్తిస్తుంది. ఓరల్ సెక్స్ ద్వారా హెచ్ఐవీ వచ్చే అవకాశాలు తక్కువే అయినా పూర్తిగా రాదని చెప్పలేం. అందుకే జాగ్రత్తలు వహించడం మంచిది.
అపోహ: హెచ్ఐవీ సోకితే ఎయిడ్స్ వచ్చినట్లే..
హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ (హెచ్ఐవీ) రక్తంలో ఉండే తెల్ల రక్తకణాల్లో భాగమైన సీడీ4 అనే కణాలను నాశనం చేస్తుంది. ఇవి శరీరంలో ఉండే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ అనారోగ్యానికి గురి కాకుండా మనల్ని కాపాడతాయి. ఈ కణాలు నాశనం కావడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి.. పలు అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉంటుంది. సాధారణంగా హెచ్ఐవీ సోకిన తర్వాత ప్రారంభంలో గుర్తించకుండా అలాగే దీర్ఘకాలం పాటు వదిలేస్తే అది ఎయిడ్స్‌గా రూపాంతరం చెందుతుంది. ఈ క్రమంలోనే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో సీడీ4 కణాల సంఖ్య 200 కంటే తక్కువకు పడిపోతుంటుంది. ఫలితంగా వారిని రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి.
అపోహ: తాకినా హెచ్ఐవీ వ్యాపిస్తుంది..
హెచ్ఐవీ చాలా సున్నితమైన వైరస్. ఇది మన రక్తంలో కాకుండా బయట ఏమాత్రం జీవించలేదు. బాహ్య వాతావరణంలోకి వచ్చిన సెకన్ల వ్యవధిలోనే ఈ వైరస్ మరణిస్తుంది. అందుకే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులతో కలిసి ఆహారం తిన్నా, వారిని తాకినా ఈ వైరస్ వ్యాప్తి చెందదు. అంతేకాదు.. చెమట, విసర్జితాలు.. వంటి వాటి ద్వారా కూడా ఇది ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదు. కాబట్టి ఎయిడ్స్ బాధితులు ఉపయోగించిన వస్తువులను ఎవరైనా నిరభ్యంతరంగా వినియోగించవచ్చు. అంతేకాదు.. వారిని కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం, వ్యక్తిగత వస్తువులు పంచుకోవడం వంటివి చేసినా ఇది సోకదు. అయితే ఈ వ్యాధి ఉన్న వారు ఉపయోగించే సూదులు మాత్రం వాడకూడదు. అలాగే శృంగారంలో పాల్గొనే సమయంలో తప్పకుండా కండోమ్ ఉపయోగించాలి. ఇలా చేయడం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తిని కొంతవరకూ అరికట్టవచ్చు. ఒకవేళ గర్భం ధరించిన తర్వాత హెచ్ఐవీ పాజిటివ్ అని తేలితే వైద్యుల సలహా మేరకు కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. తద్వారా ఆ వైరస్ బిడ్డకు సంక్రమించకుండా కాపాడుకోవచ్చు. అయితే ఈ వ్యాధి తల్లిపాల ద్వారా కూడా సోకే ప్రమాదం ఉంది కాబట్టి ప్రసవం జరిగిన తర్వాత బిడ్డకు పాలు పట్టకుండా ఆ తల్లి జాగ్రత్తపడాల్సి ఉంటుంది

HIVmythsgh650-1.jpgఅపోహ: హెచ్ఐవీ సోకితే వెంటనే మరణిస్తారు..
గతంలో హెచ్ఐవీ వ్యాధి సోకిందంటే చాలు.. ఇక మరణం కోసం వేచి చూడడం తప్ప మరే ఇతర మార్గం లేదని భావించేవారు. కానీ ఇప్పుడు వైద్యశాస్త్రం కూడా ఎంతగానో అభివృద్ధి చెందింది. హెచ్ఐవీని సమూలంగా, శాశ్వతంగా తగ్గించలేకపోయినప్పటికీ ఆ వ్యాధితో పోరాడేందుకు శరీరంలోని రోగ నిరోధక
వ్యవస్థను బలపరిచేందుకు చాలా మందులు ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. ఏఆర్‌టీ - యాంటీ

రెట్రోవైరల్ థెరపీ తీసుకోవడం ద్వారా హెచ్ఐవీ బాధితులు కూడా ఎక్కువ కాలం పాటు జీవించే అవకాశం ఉంది. అంతేకాదు.. ఎప్పటికప్పుడు వైరల్ లోడ్, సీడీ4 కౌంట్ పరీక్షలు చేయించుకుంటూ; ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తూ తదనుగుణంగా మందులు వాడాల్సి ఉంటుంది. సమస్య తగ్గుముఖం పట్టిన తర్వాత మందులు ఉపయోగించడం ఆపేయడం వల్ల ఈ వ్యాధి తిరిగి మళ్లీ మొదటికే వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు.. హెచ్ఐవీ వ్యాధి సోకిన వారిలో చాలామందికి హెచ్‌సీవీ (హెపటైటిస్ సి వైరస్) వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి దాని కోసం కూడా తరచూ పరీక్షలు చేయించుకుంటూ; తగిన చికిత్స తీసుకోవడం వల్ల కాస్త ఎక్కువ రోజులు జీవించే వీలుంటుంది.

అపోహ: భార్యాభర్తలిద్దరికీ హెచ్ఐవీ ఉంటే కండోమ్ వాడాల్సిన అవసరం లేదు..
భార్యాభర్తలిద్దరికీ హెచ్ఐవీ ఉన్నప్పటికీ కండోమ్ ఉపయోగించకుండా అంటే అసురక్షితమైన లైంగిక చర్యలో పాల్గొనడం ఏమాత్రం సరికాదంటున్నారు వైద్యులు. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో ఉన్న హెచ్ఐవీ వైరస్ ఒకే రకమైనది కాకపోవచ్చు. హెచ్ఐవీలో కూడా రకాలున్నాయి కాబట్టి భాగస్వామి నుంచి మరో రకం వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది. ఫలితంగా హెచ్ఐవీ చికిత్స నిమిత్తం ఉపయోగిస్తున్న మందు ఆ వైరస్‌కు తగినది కాకపోతే శరీరంలో వైరల్ లోడ్ పెరిగిపోతుంది. తద్వారా వ్యాధి మరింత ముదిరే అవకాశం ఉంటుంది. కాబట్టి హెచ్ఐవీ సోకిన తర్వాత భాగస్వామితో శృంగారంలో పాల్గొనే సమయంలో కూడా కండోమ్ తప్పనిసరిగా వినియోగించాల్సి ఉంటుంది.


HIVmythsgh650-3.jpg

అపోహ: హెచ్ఐవీ సోకితే కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు..
హెచ్ఐవీ సోకిన తర్వాత ఆ వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి ఒక్కొక్కరికి ఒక్కోలా సమయం పడుతుంది. ఎందుకంటే మన రోగనిరోధక వ్యవస్థ ఎంత బలంగా ఉంటే ఈ వ్యాధి లక్షణాలు అంత ఆలస్యంగా బయటపడతాయి. అందుకే ఈ వైరస్ సోకిన వెంటనే ఎలాంటి లక్షణాలు

కనిపించవు. ఒకవేళ హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ సోకిందన్న అనుమానం ఉంటే కనుక ప్రతి మూడు నెలలకోసారి పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యాధి వచ్చిందా? రాలేదా?? అన్నది నిర్ధరించుకోవచ్చు.

అపోహ: ఒకసారి నెగెటివ్ వస్తే ఇక హెచ్ఐవీ లేనట్లే..
హెచ్ఐవీ వచ్చిన వారితో అసురక్షిత లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత లేదా హెచ్ఐవీ బాధితులు ఉపయోగించిన సూదులు వాడడం, వారి రక్తం మరొకరికి ఎక్కించడం వంటివి జరిగిన తర్వాత శరీరంలో హెచ్ఐవీ యాంటీబాడీలు ఏర్పడేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది. హెచ్ఐవీ వైరస్ ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది కాబట్టి ఇప్పటివరకూ ఉన్న పరీక్షలన్నీ.. హెచ్ఐవీ వచ్చిన తర్వాత శరీరం విడుదల చేసే యాంటీబాడీలనే పరీక్షిస్తున్నాయి. వీటిని విడుదల చేయడం కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు. అందుకే ఒక్కసారి పరీక్షలో నెగెటివ్ వస్తే మూడు నెలల పాటు వేచి చూసి మరోసారి టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది.


HIVmythsgh650-4.jpg

అపోహ: వైరల్ లోడ్ తగ్గిపోతే ఇక వ్యాధి వ్యాపించదు..
ఏఆర్‌టీ ఉపయోగించిన తర్వాత ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో వైరల్ లోడ్ రోజురోజుకీ తగ్గిపోయి.. చివరకు పరీక్షల్లో గుర్తించలేని స్థాయికి చేరిపోతుంది. ఇలాంటప్పుడు చాలామంది వ్యాధి తగ్గిపోయిందనే ఉద్దేశంతో మందులు ఉపయోగించడం ఆపేయడమే కాదు.. అసురక్షిత

లైంగిక చర్యలోనూ పాల్గొంటూ ఉంటారు. కానీ ఇది సరైంది కాదు. ఎందుకంటే శరీరంలో వైరల్ లోడ్ తగ్గితే వ్యాధి సంక్రమించే అవకాశాలు కూడా చాలావరకు తగ్గుతాయి. అంతమాత్రాన ఈ వ్యాధి సంక్రమించే అవకాశం పూర్తిగా లేదని చెప్పలేం. కాబట్టి వైరల్ లోడ్ పూర్తిగా తగ్గినా బాధితులు సదా జాగ్రత్తగా ఉండాల్సిందే!

హెచ్‌ఐవీ.. కొన్ని గణాంకాలు!

ప్రపంచవ్యాప్తంగా 3.79 లక్షల మంది హెచ్‌ఐవీతో బాధపడుతున్నారువీరిలో 3.62 కోట్ల మంది పెద్దలు, 17 లక్షల మంది పిల్లలు ఉన్నారుగతేడాది 19 లక్షల మంది కొత్తగా ఈ వ్యాధి బారిన పడ్డారు. 86 శాతం యువతకు విచ్చలవిడి లైంగిక సంబంధాల కారణంగా ఈ వ్యాధి సోకుతున్నట్లు తేలిందిఎయిడ్స్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందడం లేదన్న అభిప్రాయం చాలామందిలో ఉందిరోగులకు అవగాహన కల్పించడంమందుల పంపిణీలో లోపాల కారణంగా ఎయిడ్స్‌ వ్యాధి తీవ్రమవుతుండడంతో కొందరు రోగులు కోమాలోకి వెళ్లిపోతున్నారుతగిన వైద్యం అందక మరణిస్తున్నారుయుక్త వయసులోనే వృద్ధులుగా మారుతున్నారు. ‘సైటో మెగలో వైరస్‌’ వల్ల  కొన్నిసార్లు పాక్షికంగాఇంకొన్ని సందర్భాల్లో పూర్తిగా అంధత్వం సోకే అవకాశం ఉందిహెచ్‌ఐవీ అని తెలిసి కూడా కొందరు మందులు వాడకపోవడం వల్ల గుండె జబ్బులుకిడ్నీ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారుడయాలసిస్‌ వంటి సౌకర్యాలు అన్ని చోట్లా లేకపోవడంతో ఇబ్బందుల పాలవుతున్నారు.

యువతా మేలుకో!

హెచ్‌ఐవీ సోకగానే జీవితం ముగిసిపోదుదాన్ని నయం చేసే మందులు ప్రపంచంలో ఇప్పటికీ ఏ వైద్య విధానంలోనూ ఆవిష్కృతం కాలేదుఅందువల్ల మోసపూరిత ప్రకటనల పట్ల రోగులు అప్రమత్తంగా ఉండాలిశాస్త్రీయంగా ఇప్పటివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీఏ ఇతర ప్రముఖ ఆరోగ్య సంస్థలు కానీ ఆయుర్వేద మందులులేహ్యాల్నిఇతర ప్రత్యామ్నాయ మందుల్ని అధికారికంగా ఎయిడ్స్‌ చికిత్స కోసం గుర్తించలేదుఅయినా కొందరు కేరళ వైద్యమనిహైదరాబాద్‌ లేహ్యమనికోల్‌కతా మందులనిపాము విషమని ప్రచారం చేస్తూ రోగులను మోసం చేస్తున్నారుహెచ్‌ఐవీ ఉందని తెలిసినప్పటికీ ప్రామాణికమైన ఏఆర్‌టీ (యాంటీ రెట్రోవైరల్‌ థెరపీమందులు వాడకుండావైద్య పరీక్షలు చేయించుకోకుండా అవయవాలు పాడై పోయి చర్మ వ్యాధులకు గురవుతున్నారుకొందరు అందవికారంగా మారిపోతున్నారురోగ నిరోధక శక్తి క్షీణించిటీబీక్యాన్సర్లకు గురయ్యే వరకూ రోగులు హెచ్‌ఐవీ నిపుణుల వద్దకు గానీఏఆర్‌టీ కేంద్రాల వద్దకు గానీ వెళ్లడం లేదుహెచ్‌ఐవీ అని తెలియగానే సీడీ-4 కణాల సంఖ్య తగ్గేంత వరకు అశ్రద్ధ చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో ఆధునిక వైద్య సేవలు పొందితే 75 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవనం సాగించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారుఎయిడ్స్‌ రోగులూ మధుమేహంబీపీఆస్తమా రోగుల మాదిరిగానే ఔషధాల వాడకం ద్వారా ఆరోగ్యంగా ఉండచ్చుహెచ్‌ఐవీ ఉన్న దంపతులు తగిన సమయంలో ఏఆర్‌టీ మందులు వాడి హెచ్‌ఐవీ లేని సంతానాన్ని కనచ్చుతగిన చికిత్స పొందితే భార్య నుంచి భర్తకుభర్త నుంచి భార్యకు వ్యాధి సంక్రమించకుండా నివారించవచ్చు

భాగస్వామికి సోకకుండా..!

భార్యాభర్తలిద్దరిలో ఒకరు పాజిటివ్‌ఒకరు నెగెటివ్‌ అయినా (సీరో డిస్కార్డెంట్‌ దంపతుల్లోనూఒకరి నుంచి మరొకరికి వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించే వైద్యం నేడు అందుబాటులోకి వచ్చిందిఅలాగే హెచ్‌ఐవీ నెగెటివ్‌ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నా భాగస్వామికీ హెచ్‌ఐవీ సోకకుండా నివారించే మందులుపుట్టే పిల్లలకు ఈ వ్యాధి రాకుండా చేసే అధునాతన చికిత్స ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిందిప్రస్తుత పరిస్థితుల్లో హెచ్‌ఐవీ పాజిటివ్‌ సోకినా నివారణకు అధునాతన మందులు అందుబాటులోకి వచ్చాయిమూడు దశాబ్దాల క్రితం ఉన్న భయం ఇప్పుడు అవసరం లేదుకాబట్టి ప్రభుత్వాలుస్వచ్ఛంద సంస్థలు ఈ విషయాలపై విస్తృత ప్రచారం నిర్వహించి అందరిలో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతో ఉందియువత కూడా అనవసరమైన ఆందోళనలు మాని ఈ వ్యాధిపై మరింత లోతుగా తెలుసుకొనే ప్రయత్నం చేయాలి.





women icon@teamvasundhara
precautions-to-take-during-monsoon-to-prevent-viral-infections

చిటపట చినుకుల కాలంలో ఈ జాగ్రత్తలే మన రక్షణ కవచాలు!

రోజులు గడుస్తున్నా, కాలాలు మారుతున్నా ఇప్పుడు అందరి దృష్టి కరోనా పైనే ఉంది. ఎందుకంటే ఎటు నుంచి ఈ మహమ్మారి ముంచుకొస్తుందో తెలియని భయంతోనే అందరూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక మరోవైపు వృత్తిఉద్యోగాల రీత్యా బయటికి వెళ్లాల్సి వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే తమ తమ పనులను కొనసాగిస్తున్నారు చాలామంది. అయితే ఈ వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ కారణంగా బ్యాక్టీరియా, వైరస్‌, ఇతర ఇన్ఫెక్షన్లు త్వరగా విస్తరించే ప్రమాదం ఉంది. ఫలితంగా జలుబు, దగ్గు, జ్వరం.. వంటివి మరింత వేగంగా ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటాయి. అసలే కరోనాతో సతమతమవుతున్న ఈ రోజుల్లో మనం అప్పుడో ఇప్పుడో తుమ్మినా, దగ్గినా అది కరోనానేమో అని భయపడిపోతున్నాం. మరి, ఇలాంటి గడ్డు కాలంలో ఎలాంటి ఫ్లూ లక్షణాలు మన దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి, అవేంటో తెలుసుకొని మనమూ పాటించేద్దామా?

Know More

women icon@teamvasundhara
health-tips-for-new-moms-in-telugu
women icon@teamvasundhara
bollywood-serial-actress-mohena-kumari-singh-finally-tests-covid-19-negative-after-a-month

మొత్తానికి నెల రోజుల తర్వాత నెగెటివ్‌ వచ్చింది!

‘గెలుపు పొందే వరకూ అలుపు లేదు మనకు’ అన్నాడో సినీ కవి. ‘కొవిడ్‌ సోకినా నెగెటివ్‌ వచ్చేంత వరకూ మనో నిబ్బరాన్ని కోల్పోకు..’ అంటోంది బాలీవుడ్‌ బుల్లితెర బ్యూటీ మోహెనా కుమారి సింగ్‌. తనతో పాటు తన ఏడుగురు కుటుంబ సభ్యులు కరోనా బారిన పడి కోలుకొని ఇంటికి చేరుకున్నా.. ఆమెకు మాత్రం పదే పదే పాజిటివ్‌ రావడంతో కాస్త టెన్షన్‌ పడ్డానంటోందామె. అయినా గుండె ధైర్యంతో నెల రోజుల తర్వాత కరోనా నుంచి పూర్తిగా కోలుకొని తాజాగా ఇంటికి చేరుకుంది మోహెనా. ఈ క్రమంలో తనకు వైద్య సేవలందించిన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టిందీ బ్యూటిఫుల్‌ బేబ్‌. అంతేనా.. కొవిడ్‌ నుంచి కోలుకునే క్రమంలో తాను పాటించిన జాగ్రత్తలు, తీసుకున్న ఆహార పదార్థాలు.. వంటివన్నీ మరో పోస్ట్‌లో పంచుకుంటూ తన ఫ్యాన్స్‌లో ధైర్యం నింపిందీ అందాల తార. ఇలా మోహెన పెట్టిన ఈ రెండు ఇన్‌స్టా పోస్టులు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
these-are-the-benefits-while-you-stop-wearing-a-bra

‘బ్రా’ వేసుకోవడం మంచిదా? కాదా?

చక్కటి ఎద సౌష్ఠవానికి, సాగినట్లుగా కనిపించే వక్షోజాలను పట్టి ఉంచడానికి అమ్మాయిలంతా బ్రా ధరించడం కామనే. అందుకే అతివల వార్డ్‌రోబ్‌లో వీటికి ప్రత్యేకమైన షెల్ఫ్‌ కూడా ఉంటుంది. ఆయా దుస్తులకు తగినట్లుగా సాధారణ బ్రా, స్ట్రాప్‌లెస్‌, బ్రాలెట్‌, స్పోర్ట్స్‌ బ్రా.. వంటివి ఎంచుకొని కూల్‌గా, కంఫర్టబుల్‌గా కనిపించేస్తుంటారు అమ్మాయిలు. అయితే వీటిని ఇష్టపడి ధరించే వారి కంటే.. ‘తప్పదు.. వేసుకోవాల్సిందే..’ అంటూ అయిష్టంగా ధరించే వారే ఎక్కువమంది ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ లోదుస్తులు ఎద భాగానికి పట్టినట్లుగా ఉండడం, తద్వారా ఛాతీలో నొప్పి రావడం, ఆ ప్రదేశంలో చెమట వచ్చి రాషెస్‌లా ఏర్పడడం.. వంటి స్వీయానుభవాలే వారి ఫీలింగ్‌కి ప్రధాన కారణం. మరి, ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రా ధరించాల్సిందేనా? ఇది వేసుకోకపోతే నష్టమేంటి? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. అయితే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో తప్ప మరీ అసౌకర్యంగా అనిపిస్తే బ్రా ధరించకపోయినా ఎలాంటి నష్టం ఉండదంటున్నారు సంబంధిత నిపుణులు. ఇంకా చెప్పాలంటే అత్యవసరం కానప్పుడు బ్రా వేసుకోకపోతే ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు వారు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
celebrity-nutritionist-rujuta-diwekar-shares-5-food-tips-for-children-pursuing-school-from-home

ఆన్‌లైన్‌ క్లాసులు... ఈ అయిదు పదార్ధాలూ మీ డైట్ లో ఉన్నాయా?

కరోనా మనకు శారీరకంగా, మానసికంగా ఎంతో కీడు చేస్తున్నా.. టెక్నాలజీ విషయంలో మాత్రం మనల్ని ఓ మెట్టు ఎక్కించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటిదాకా ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ ఆప్షన్‌ లేని సంస్థలు సైతం తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాయి. అలాగే రోజూ స్కూలుకెళ్లి పాఠాలు నేర్చుకునే పిల్లలు కూడా ఇప్పుడు ఇంటిపట్టునే ఉంటూ ఆన్‌లైన్‌లోనే క్లాసులు వింటున్నారు. అయితే ఎలాగూ ఇంటి నుంచే క్లాసులు వింటున్నాం కదా అని బద్ధకిస్తూ, చదువు విషయంలో అశ్రద్ధ వహిస్తే.. పాఠాలు బుర్రకెక్కవు సరికదా తోటి పిల్లల కంటే వెనకబడే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లలు ఆన్‌లైన్‌ క్లాసులపై శ్రద్ధ వహించాలంటే వారికి అందించే ఆహారం పట్ల కూడా తల్లులు జాగ్రత్త వహించాలంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ పాఠాలు వింటోన్న పిల్లలు, యువత ఐదు రకాల పదార్థాలను రోజూ తప్పకుండా తీసుకోవాలంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారామె. మరి, ఏంటా పదార్థాలు? వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటి? రండి తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
marvelous-benefits-of-jaggery-in-telugu
women icon@teamvasundhara
health-benefits-of-wearing-mehandi-or-gorintaaku-in-telugu

అరచేతుల్లో విరబూసే గోరింట ఆరోగ్యానికీ మంచిదే..

'గోరింట పూసింది కొమ్మ లేకుండా.. మురిపాల అరచేత మొగ్గ తొడిగింది..' అన్న చందంగా మహిళల చేతుల్లో గోరింటాకు విరబూస్తుంది. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు.. అతివల చేతులు, కాళ్లు గోరింటాకుతో నిండిపోయి, పండిపోతాయి. ఈ మాసంలో చాలామంది తమ చేతులకు, పాదాలకు గోరింటాకు పెట్టుకోవడం అనేది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఆషాడంలో వచ్చే వాతావరణ మార్పుల ప్రభావం శరీరంపై పడకుండా ఉండి.. ఎలాంటి చర్మ వ్యాధులు రాకుండా చేసేందుకు గోరింటాకు ఎంతగానో ఉపకరిస్తుంది. కేవలం ఆషాఢంలోనే కాదు.. పెళ్లిళ్లు, పండగలు.. వంటిి ప్రత్యేక సందర్భాల్లో కూడా ముందుగా గుర్తొచ్చేది గోరింటాకే. ఇలా చేతులు, పాదాలను రకరకాల డిజైన్లతో పండించుకుని, మురిసిపోవడం మనకెంతో ఇష్టం కదూ.. మరి ఇంతలా మన మనసు దోచుకుంటున్న గోరింటాకు వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఓ లుక్కేద్దామా??

Know More

women icon@teamvasundhara
how-can-i-control-my-breast-milk-flow?

చనుబాల ఉత్పత్తి తగ్గేదెలా?

హాయ్‌ డాక్టర్‌. నా వయసు 27. ప్రస్తుతం నాకు ఏడు నెలల బాబున్నాడు. డెలివరీ తర్వాత రెండు నెలల దాకా ఆగకుండా బ్లీడింగ్‌ అయింది. ఇక మూడో నెల నుంచి పిరియడ్స్‌ ప్రారంభమయ్యాయి. ఫీడింగ్‌ ఇస్తున్నప్పుడు నెలసరి రాదని విన్నాను. కానీ నేను నా బాబుకు పూర్తిగా నా పాలే ఇస్తున్నాను. అయినా అదనంగా ఇంకా ఎక్కువ పాలు ఉత్పత్తవుతున్నాయి. ఇటు అధిక పాల ఉత్పత్తి, అటు నెలసరితో చాలా ఇబ్బందిగా ఉంది. నాకు, నా బాబుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవు. చనుబాలు మరీ ఎక్కువగా ఉత్పత్తి (ఓవర్‌ ఫ్లో) కాకుండా ఉండాలంటే నేనేం చేయాలి? అలాగే బిడ్డకు పాలిస్తున్నప్పుడు పిరియడ్స్‌ రావడం వల్ల ఏమైనా సమస్యలొస్తాయా? చెప్పండి. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
fashioner-shilpa-reddy-shares-her-covid-experience-through-insta-video

కరోనా నుంచి అలా బయటపడ్డా.. అదే నా ఆయుధం!

ఈ రోజుల్లో ఒంట్లో కాస్త నలతగా అనిపిస్తే చాలు.. మన మనసంతా కరోనా వైరస్‌ చుట్టూనే తిరుగుతోంది. మనకూ వైరస్‌ సోకిందేమోనని కంగారు పడిపోతున్నాం. ఇక ఎలాంటి లక్షణాలు లేని వారిలో కూడా కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఎవరి నుంచి ముప్పు ముంచుకొస్తుందో, మనలోనూ కరోనా వైరస్‌ ఉందేమోనని క్షణక్షణం భయంభయంగా గడుపుతున్నాం. ఇదిగో ఇలాంటి భయమే మనల్ని నిలువెల్లా ముంచుతుందంటున్నారు నగరానికి చెందిన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్పా రెడ్డి. కొద్దిరోజుల క్రితమే కొవిడ్‌ బారిన పడి కోలుకున్న ఆమె.. చక్కటి ఆహారం, వ్యాయామం, ధ్యానంతో ఈ వైరస్‌ను జయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మనలోని రోగనిరోధక శక్తే కరోనాను ఎదిరించే ఆయుధమని, దాన్ని దృఢంగా ఉంచుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించడంతో పాటు ధైర్యంగా అడుగు ముందుకేయాలంటూ సూచిస్తున్నారు. ఈ క్రమంలో తన కొవిడ్‌ అనుభవాలను, దాన్నుంచి బయటపడిన విధానాన్ని ఇన్‌స్టా వీడియోతో పాటు దానికి జతచేసిన సుదీర్ఘమైన క్యాప్షన్‌ రూపంలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో, పోస్ట్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Know More

women icon@teamvasundhara
health-benefits-of-doing-yoga-for-women-in-telugu
women icon@teamvasundhara
precautions-to-take-during-monsoon-to-prevent-viral-infections

చిటపట చినుకుల కాలంలో ఈ జాగ్రత్తలే మన రక్షణ కవచాలు!

రోజులు గడుస్తున్నా, కాలాలు మారుతున్నా ఇప్పుడు అందరి దృష్టి కరోనా పైనే ఉంది. ఎందుకంటే ఎటు నుంచి ఈ మహమ్మారి ముంచుకొస్తుందో తెలియని భయంతోనే అందరూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక మరోవైపు వృత్తిఉద్యోగాల రీత్యా బయటికి వెళ్లాల్సి వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే తమ తమ పనులను కొనసాగిస్తున్నారు చాలామంది. అయితే ఈ వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ కారణంగా బ్యాక్టీరియా, వైరస్‌, ఇతర ఇన్ఫెక్షన్లు త్వరగా విస్తరించే ప్రమాదం ఉంది. ఫలితంగా జలుబు, దగ్గు, జ్వరం.. వంటివి మరింత వేగంగా ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటాయి. అసలే కరోనాతో సతమతమవుతున్న ఈ రోజుల్లో మనం అప్పుడో ఇప్పుడో తుమ్మినా, దగ్గినా అది కరోనానేమో అని భయపడిపోతున్నాం. మరి, ఇలాంటి గడ్డు కాలంలో ఎలాంటి ఫ్లూ లక్షణాలు మన దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి, అవేంటో తెలుసుకొని మనమూ పాటించేద్దామా?

Know More

women icon@teamvasundhara
health-benefits-of-soaking-nuts-and-seeds-in-telugu
women icon@teamvasundhara
benefits-of-eating-breakfast-in-telugu

బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సిందే!

రోజూ మనం తీసుకునే ఆహారంలో అత్యంత కీలక పాత్ర పోషించేది ఉదయం తీసుకునే 'బ్రేక్‌ఫాస్టే'! రోజుని ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రారంభించాలంటే మంచి పోషకవిలువలున్న అల్పాహారం తీసుకోవడమూ ముఖ్యమే. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కొంతమందికి బ్రేక్‌ఫాస్ట్ చేయడానికే టైముండదు. మరికొంతమందైతే ఏదో ఒకటి తినేద్దాంలే అని సరిపెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతిని రకరకాల సమస్యలు చుట్టుముట్టే ప్రమాదమూ లేకపోలేదు. అలాగే మనం చేసే పనిపై సరిగ్గా శ్రద్ధ పెట్టలేకపోవచ్చు! ఇంతకీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటి? చేయకపోతే వచ్చే నష్టాలేంటి? చూద్దాం రండి...

Know More

women icon@teamvasundhara
health-benefits-of-olive-oil-in-telugu
women icon@teamvasundhara
is-pre-existing-diabetes-and-pregnancy-harm-baby?-in-telugu
women icon@teamvasundhara
advice-on-the-use-of-masks-in-the-context-of-covid-by-who

women icon@teamvasundhara
how-to-get-happy-sleep-in-telugu
women icon@teamvasundhara
malamalaika-arora-decodes-right-way-of-drinking-water-through-her-instagram-post

నీళ్లు ఎలా తాగాలో మీకు తెలుసా?

మనం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండడానికి రోజుకో కొత్త మార్గాన్ని అన్వేషిస్తుంటాం. ఈ క్రమంలో కొత్త కొత్త వ్యాయామాలు నేర్చుకోవడం, విభిన్న ఆహార పదార్థాల రుచిని ఆస్వాదించడంతో పాటు.. తీసుకునే ఆహారం కూడా ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? ఏ సమయానికి తింటున్నాం? వంటి విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంటాం. కానీ కొన్ని ప్రాథమిక అంశాలను మాత్రం మర్చిపోతుంటాం. ఇదే విషయం గురించి నొక్కి వక్కాణిస్తోంది బాలీవుడ్‌ ఫిట్టెస్ట్‌ బ్యూటీ మలైకా అరోరా. ఫిట్‌నెస్‌లో భాగంగా మనం పాటించే నియమాల్లో నీళ్లు తాగడం కూడా ఒకటని, అయితే నీళ్లు తాగడానికీ ఓ పద్ధతుంది అంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేసిందీ సుందరి. లాక్‌డౌన్‌లో భాగంగా ఇప్పటికే తన ఫిట్‌నెస్‌, హెల్దీ, బ్యూటీ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఫ్యాన్స్‌తో నిరంతరం టచ్‌లోనే ఉంది మలైకా. ఇక తాజాగా నీళ్లు ఎలా తాగాలో వివరిస్తూ తన అభిమానులకు ఆరోగ్య పాఠాలు చెబుతోంది.

Know More

women icon@teamvasundhara
will-three-abortions-affect-my-pregnancy?
women icon@teamvasundhara
govt-issues-new-guidelines-for-corona-patients-at-home

ఇంట్లోనే కరోనా వైద్యం.. కేంద్రం ఏం చెబుతోంది..?

కరోనా లక్షణాలు కనిపించిన బాధితులు ఇళ్లలోనే చికిత్స తీసుకునేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా 17 రోజుల పాటు ఇంట్లోనే ఉంటూ వైద్యుల సూచనలు, జాగ్రత్తలతో వైరస్‌ నుంచి బయటపడవచ్చని తెలిపింది. లక్షణాలు తీవ్రమైతే వైద్యుని సలహా తీసుకోవాలని.. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర జబ్బులతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలని సూచించింది. అలాగే పోషకాహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. కరోనా ఉన్నట్లు అనుమానించినా, నిర్ధారించినా ఆందోళన చెందవద్దని, వైద్యుల సూచనలు పాటించాలంది. అత్యవసరమైతే టోల్‌ఫ్రీ నంబరు 18005994455ను సంప్రదించాలని కోరింది.

Know More

women icon@teamvasundhara
tips-for-online-doctor-consultation-in-telugu

ఆన్‌లైన్‌లో డాక్టరుని సంప్రదిస్తున్నారా?

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వివిధ ఆస్పత్రులు ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. నిజానికి ఈ విధానం అంతకు ముందు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ.. లాక్‌డౌన్‌ తర్వాతే ఎక్కువ ప్రజాదరణ పొందిందని చెప్పాలి. కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులతో పాటు కొందరు వైద్యులు వ్యక్తిగతంగా కూడా ఈ సేవలను అందిస్తున్నారు. దీంతో ఇంటి నుంచే ఫోన్‌ లేదా వీడియో కాల్‌ ద్వారా డాక్టర్‌తో మాట్లాడి, అనుమానాలను నివృత్తి చేసుకునే వెలుసుబాటు లభిస్తోంది. ఈక్రమంలో ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌లో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
corona-virus-why-should-avoid-wearing-gloves-shopping-for-grocery

చేతులకు గ్లోవ్స్‌ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే!

కరోనా వైరస్‌ ప్రభావంతో మన జీవనశైలిలో చాలా మార్పులొచ్చాయి. వైరస్‌ నుంచి మనల్ని మనం రక్షించుకునే క్రమంలో అందరితో సామాజిక దూరం పాటిస్తున్నాం. ఫేస్‌ మాస్క్‌తోనే బయటకు వెళుతున్నాం. క్రమం తప్పకుండా శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటున్నాం. మరికొందరు రెగ్యులర్‌గా హ్యాండ్‌ గ్లోవ్స్‌ ధరిస్తున్నారు. అయితే అన్ని సందర్భాల్లో గ్లోవ్స్‌ వాడడం అంత మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య, వైద్య నిపుణులు. ప్రత్యేకించి గ్రాసరీ, ఫార్మసీ దుకాణాలకు వెళ్లినప్పుడు హ్యాండ్‌ గ్లోవ్స్‌ ధరించకపోవడమే మేలంటున్నారు.

Know More

women icon@teamvasundhara
i-didnt-get-periods-for-the-last-three-years-what-to-do
women icon@teamvasundhara
coronavirus-visiting-a-hospital-during-the-pandemic?-keep-these-points-in-mind

ఆస్పత్రికి వెళుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే!

సుదీర్ఘ లాక్‌డౌన్‌కి తెరదించుతూ ప్రభుత్వం దశలవారీగా కొన్ని సడలింపులిస్తోంది. దీంతో అన్ని రంగాల్లోనూ పనులు మొదలయ్యాయి. ఇక లాక్‌డౌన్‌ కాలంలో చాలా రోజుల పాటు ఎమర్జెన్సీ సేవలకే పరిమితమైన ఆస్పత్రులు కూడా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులున్న రోగులతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఆస్పత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే ఆర్థిక కారణాలతో లాక్‌డౌన్‌ సడలింపులిచ్చినా కరోనా వైరస్‌ మన మధ్యే ఉందన్నది జీర్ణించుకోలేని వాస్తవం. ఈ పరిస్థితుల్లో వివిధ కారణాలతో ఆస్పత్రులు, క్లినిక్‌లకు వెళ్లే రోగులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Know More