scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

చబ్బీ అలియా స్లిమ్‌గా ఎలా మారిందో తెలుసా?

More Inspiring Fat to Fit Journey of Alia Bhatt

weightloss1.jpg

నచ్చిన కెరీర్‌ని ఎంచుకొని అందులో సక్సెస్‌ సాధించడానికి ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా మార్చుకునే వారు మనలో ఎందరో! ఈ జాబితాలో తాను కూడా ఉన్నానంటోంది బాలీవుడ్‌ యంగ్‌ అండ్‌ డైనమిక్‌ హీరోయిన్‌ అందాల అలియా భట్‌. సినీ నేపథ్యమున్న కుటుంబంలో పుట్టిపెరిగిన ఈ బాలీవుడ్‌ అందం.. తానూ నటిగా కెరీర్‌ను ప్రారంభించాలని ఉవ్విళ్లూరింది. అయితే అది తను అనుకున్నంత సులభం కాలేదు. సినీ వారసురాలే అయినా ఆ సమయంలో తనను తాను నిరూపించుకోవడానికి తన అధిక బరువే అడ్డుగోడగా నిలిచింది. అలాగని అక్కడితో రాజీ పడలేదామె. ఎలాగైనా సరే.. బబ్లీ గర్ల్‌గా ఉన్న తాను స్లిమ్‌ గర్ల్‌గా మారి సినిమాల్లోకి అడుగుపెట్టాలనుకుంది. అందుకోసం తనకెంతో ఇష్టమైన ఆహార పదార్థాల్ని వదులుకోవడమే కాదు.. జిమ్‌లోనూ కఠినమైన కసరత్తులు చేసింది. దానికి ఫలితమే నటించిన తొలి చిత్రం ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ తన కెరీర్‌లోనే బిగ్‌ హిట్‌గా నిలవడం! చేసే పనిపై నిబద్ధత, పట్టుదల ఉంటే అందుకోసం ఎంతటి కష్టమైనా భరించేందుకు మనం ఆటోమేటిక్‌గా సిద్ధపడతాం.. అంటోంది అల్లూ బేబీ. మరి, కెరీర్‌ ప్రారంభించడానికి ముందు ఎంతో చబ్బీగా ఉండే అలియా.. తన తొలి సినిమా ఛాన్స్‌ కోసం ఎంతగా కష్టపడి బరువు తగ్గింది? ఈ క్రమంలో తాను పాటించిన డైట్‌, ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌.. వంటి విషయాలన్నీ తన ‘ఫ్యాట్‌ టు ఫిట్‌’ స్టోరీలో భాగంగా మనతో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.

fittofatalia650-1.jpg

హాయ్‌ మై డియర్‌ డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ ఉమెన్‌.. నేను మీ ‘బద్రీనాథ్‌ కీ దుల్హనియా’ని.. అదేనండీ.. మీ అలియాని! మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే సూపర్బ్‌గా ఉన్నా. ప్రస్తుతం బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్నా.. అయినా తెలుగు సినిమాలో నటించాలని.. మిమ్మల్నందరినీ పలకరించాలని నాకు ఎప్పటినుంచో ఆశగా ఉంది. అది ‘ఆర్‌ఆర్‌ఆర్‌ (వర్కింగ్‌ టైటిల్‌)’తో నెరవేరబోతోంది. చాలామంది నా తొలి సినిమా ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అనుకుంటారు. హీరోయిన్‌గా నన్ను పరిచయం చేసిన మొదటి సినిమా అదే అయినా 1999లో విడుదలైన ‘సంఘర్ష్‌’తోనే బాలనటిగా మీ అందరికీ చేరువయ్యా. అవునా.. అందులో ఉంది అలియానా అంటూ ఇప్పుడు మీరంతా ఆ సినిమాను మరోసారి గుర్తుతెచ్చుకుంటున్నారని నాకర్థమైంది.

fittofatalia650-7.jpg

మాట్లాడినంత సులభం కాదది!

అమ్మానాన్నలిద్దరూ సినిమా ఇండస్ట్రీలో మేటి డైరెక్టర్లుగా, నిర్మాతలుగా పేరుగాంచారు. ఇక అక్క పూజా భట్‌ బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా నిరూపించుకున్నారు. ఈ క్రమంలో ఓ సినీ వారసురాలిగా బాలీవుడ్‌లోకి ప్రవేశించడం మీకు చాలా సులభమై ఉంటుంది..’ నా సినీ ఎంట్రీ గురించి చాలామంది ఇలా అనుకునే ఉంటారు. కానీ ఎవరైనా సరే.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఈ రంగంలోకి ప్రవేశించడం, ఇక్కడ తమను తాము నిరూపించుకోవడం మాటల్లో చెప్పుకున్నంత సులభమైన విషయం కాదు. ఇది నేను హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించాలనుకున్నప్పుడు నాకు అవగతమైంది. ఎందుకంటే నేను సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు ఇప్పుడున్న బరువు కంటే మూడు రెట్లు ఎక్కువ బరువుండేదాన్ని. ఆ సమయంలోనే ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ సినిమా కోసం ఆడిషన్స్‌కి వెళ్లాను. దాదాపు 500 మంది అమ్మాయిలు ఆ ఆడిషన్‌లో పాల్గొన్నారు. వారిలో నుంచి టాప్‌-10 ఎంపికచేయగా అందులో నేనున్నాను. దాంతో ఈ సినిమా దర్శకులు కరణ్‌ జోహర్‌ నేను బరువు తగ్గాలని చెప్పారు. ఎందుకంటే ఆ సినిమాలో నాది చాలా యాక్టివ్‌గా ఉండే కాలేజీ అమ్మాయి పాత్ర. అందుకు తగినట్లుగా బరువు తగ్గి నాజూగ్గా మారాలని, పాత్రకు తగిన న్యాయం చేయాలని అప్పుడే అనుకున్నా. ఎలాగైతేనే.. సినీ రంగంలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టాలన్న నా కల ఫలించబోతున్న సంతోషంతో ఎలాగైనా బరువు తగ్గి స్లిమ్‌గా మారాలని గట్టిగా నిర్ణయించుకున్నా. అలా నా ఫ్యాట్‌ టు ఫిట్‌ జర్నీ మొదలైంది.

fittofatalia650-5.jpg

మూడు నెలల కష్టానికి ఫలితం!

బరువైతే తగ్గాలనుకున్నా.. కానీ ఈ క్రమంలో మన ఆహారపుటలవాట్లలో మార్పులు చేర్పులు చేసుకోవాలి. కఠినమైన వ్యాయామాలు చేయాలి. కాస్త కష్టంగానే అనిపించినా వాటిని ఇష్టంగానే స్వీకరించా. నాకు చిన్నప్పటి నుంచి కేక్‌లంటే ప్రాణం. బరువు తగ్గే క్రమంలో వాటికి స్వస్తి పలికా. కేవలం ఇదే కాదు.. నాకు నచ్చిన చాలా పదార్థాల్ని వదులుకున్నా.. ఈ క్రమంలో ఆరోగ్యకరమైన ఆహార శైలిని పాటించడం ప్రారంభించా. నా డైట్‌ రొటీన్‌ను 8 భాగాలుగా విభజించుకున్నా. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ తినడం కంటే ఎక్కువ సార్లు తక్కువ తినడం వల్ల ఆకలేయదు. ఇతర పదార్థాలు తినాలన్న కోరిక కూడా కలగదు. తద్వారా ప్రాసెస్డ్‌ ఫుడ్‌, నూనె సంబంధిత పదార్థాలపైకి మనసు మళ్లదు. అలాగే ఇలా కొంచెం కొంచెం తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగవుతుంది. బరువు తగ్గే క్రమంలో ఫుడ్‌ విషయంలో చేసుకున్న మార్పులకు ఫలితం మూడు నెలల్లో కనిపించింది. నేను ఇప్పుడున్న బరువుకు మూడు రెట్లు ఎక్కువ బరువున్న నేను.. స్ట్రిక్ట్‌ డైట్‌ రొటీన్‌తో మూడు నెలల్లో దాదాపు 16 కిలోలు తగ్గి స్లిమ్‌గా తయారయ్యా.

ఒక రోజు.. 8 మీల్స్‌!

fittofatalia650-12.jpg

మూడు నెలల్లో 16 కిలోలు తగ్గానంటే అందులో నేను పాటించిన డైట్‌ రొటీన్‌ పాత్ర ఎంతో కీలకం అని చెప్పుకోవాలిఈ క్రమంలో ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివేకర్‌ సూచించిన ఆహార నియమాలు పాటించాఈ క్రమంలోనే నా డైట్‌ మెనూను భాగాలు చేసుకున్న నేను.. డీటాక్స్‌ వాటర్‌తో నా రోజును ప్రారంభించేదాన్నిఅఫ్‌కోర్స్‌.. ఇప్పటికీ నేను ఇదే రొటీన్‌ని ఫాలో అవుతున్నా కూడా!

ఉదయం లేవగానే గ్లాసు గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం పిండుకొని తీసుకుంటాతద్వారా శరీరంలోని మలినాలువ్యర్థాలు సులభంగా బయటికి వెళ్లిపోయేందుకు ఈ వాటర్‌ ఎంతగానో దోహదం చేస్తుంది.

ఇక బ్రేక్‌ఫాస్ట్‌ కోసం.. చక్కెర వేయకుండా తయారు చేసిన కప్పు టీ లేదా కాఫీకాయగూరలతో తయారుచేసిన పోహా లేదా ఎగ్‌వైట్‌ శాండ్‌విచ్‌ తీసుకుంటా.

ఆ తర్వాత రెండు గంటలకు గ్లాస్‌ వెజిటబుల్‌ జ్యూస్‌ఏదైనా పండుఒక ఇడ్లీ బౌల్‌ సాంబార్‌లో ముంచుకొని లాగించేస్తా.

ఒక రోటీ కాయగూరలతో చేసిన కర్రీఒక ఇడ్లీ బౌల్‌ సాంబార్‌ఒక పండు.. మధ్యాహ్నం నేను తినే భోజనమిదే.

fittofatalia650-3.jpg

ఇక సాయంత్రం సమయంలో కప్పు చక్కెర లేని టీ లేదా కాఫీ తాగుతా.

ఆపై రెండు గంటలకు ఏదైనా పండు లేదా ఒక ఇడ్లీ తీసుకుంటా.

ఇక రాత్రి భోజనంలో భాగంగా ఒక రోటీ లేదా ఒక బౌల్‌ రైస్‌ని కాయగూరలతో చేసిన కర్రీ లేదా పప్పుతో కలిపి తీసుకుంటాఅప్పుడప్పుడూ గ్రిల్డ్‌ చికెన్‌ బ్రెస్ట్‌ తీసుకుంటా.

శక్తి కోసం మధ్యమధ్యలో నట్స్‌డ్రైఫ్రూట్స్‌.. వంటివి ఉండనే ఉన్నాయి.

నా శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి నీళ్లుకొబ్బరినీళ్లునిమ్మరసంచక్కెర వేయకుండా తయారుచేసిన పండ్ల రసాలు.. తప్పకుండా తీసుకుంటాఅలాగే వ్యాయామం తర్వాత కూడా ఈ పానీయాల్ని తాగుతుంటాతద్వారా శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.

fittofatalia650-10.jpg

నా డైట్‌లో ఛీట్‌ మీల్‌కు కూడా స్థానముందివారానికో రోజు నాకు నచ్చిన పదార్థాల్ని మనసారా ఆస్వాదిస్తూ.. వాటివల్ల నా శరీరంలో చేరిన అదనపు క్యాలరీలను ఎక్సర్‌సైజ్‌ ద్వారా కరిగిస్తూ నా ఫిట్‌నెస్‌ను కొనసాగిస్తున్నా.

ఆన్‌ జిమ్‌ ఆఫ్‌ జిమ్‌!

fittofatalia650-2.jpg

సినిమాల్లో ప్రవేశించే క్రమంలో బరువు తగ్గడానికి వ్యాయామాన్ని ఒక అస్త్రంగా మార్చుకున్న నేను.. ఇప్పటికీ చక్కటి ఫిట్‌నెస్‌ రొటీన్‌ను కొనసాగిస్తున్నాఈ క్రమంలో ప్రముఖ ఫిట్‌నెస్‌ ఎక్స్‌పర్ట్‌ యాస్మిన్‌ కరాచీవాలా సూచించిన వ్యాయామాల్ని చేస్తూ ఫిట్‌గా మారానుఈ క్రమంలో కార్డియోకిక్‌బాక్సింగ్‌బరువులెత్తడంపుషప్స్‌క్రంచెస్‌స్క్వాట్స్‌పిలాట్స్‌డంబెల్‌ ఎక్సర్‌సైజెస్‌.. వంటి కఠినమైన జిమ్‌ ఎక్సర్‌సైజ్‌లతో పాటు రోజూ ఉదయాన్నే జాగింగ్‌నడక.. వంటివీ నా వర్కవుట్‌ రొటీన్‌లో భాగమేఅంతేకాదు.. నా శరీరాన్ని మరింత ఫ్లెక్సిబుల్‌గాయాక్టివ్‌గా ఉంచుకోవడానికి.. మానసికంగా దృఢంగా ఉండడానికి కథక్‌ డ్యాన్స్‌వివిధ యోగాసనాలను సాధన చేస్తుంటాఇలాంటి స్ట్రిక్ట్‌ ఫిట్‌నెస్‌ రొటీన్‌ను ఫాలో అవుతోన్న నేను.. వాటిని ఫొటోలువీడియోల రూపంలో బంధించి మీకోసం సోషల్‌ మీడియాలోనూ పోస్ట్‌ చేస్తుంటానా వల్ల మరికొందరు స్ఫూర్తి పొందుతున్నారంటే అది నాకు ఆనందమే కదా మరి! 

View this post on Instagram

One my favs and one of the hardest exercises on the Cadillac here's #teasertuesday @yasminkarachiwala #yasminsbodyimage

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

అప్పుడంతా నన్ను చూసి ఆశ్చర్యపోయారు!

fittofatalia650-11.jpg

ఏదేమైనా ఇలాంటి డైట్‌ఫిట్‌నెస్‌ రొటీన్‌తో మూడు నెలల్లోనే 16 కిలోలు తగ్గి ఓ మ్యాగజీన్‌ ఫొటోషూట్‌లో కూడా పాల్గొన్నాఆ ఫొటోలు చూసిన ప్రతి ఒక్కరూ ‘వావ్‌.. అలియా ఇంత స్లిమ్మీ బ్యూటీగా తయారైందా?’ అంటూ ఆశ్చర్యపోయారుఇంకొందరైతే నన్ను గుర్తుపట్టలేకపోయారు కూడాఅలా స్లిమ్మీ గర్ల్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నేను నాటి నుంచి నేటి వరకూ అవే డైట్‌ఫిట్‌నెస్‌ నియమాలు పాటిస్తూ ఫిట్‌నెస్‌ను మెయింటెయిన్‌ చేస్తున్నానేనే కాదు.. ఎవరైనా సరే బరువు తగ్గాలని తమ మనసులో బలంగా నిర్ణయించుకుంటే అది ఎంత కష్టమైన ఇష్టంగా మార్చుకొని అనుకున్న ఫలితాన్ని సాధిస్తారుఅయితే ఈ క్రమంలో మీ సొంత ప్రయత్నాలు కాకుండా.. మీ శరీరతత్వంఆరోగ్యాన్ని బట్టి నిపుణులు సూచించిన సలహాలుసూచనలు పాటిస్తే మరింత మంచి ఫలితం ఉంటుందిఇలా మీరు బరువు తగ్గుతూ.. ఆ చిట్కాల్ని అందరితో పంచుకోవడం వల్ల మరికొంతమందికి స్ఫూర్తిగా నిలిచిన వారవుతారుసరేనా.. ఉంటాను మరి.. త్వరలోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌ (వర్కింగ్‌ టైటిల్‌)’తో మిమ్మల్ని పలకరిస్తాబై బై!!

గమనిక: ‘దేశముదురు’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ‘కంత్రి’, ‘మస్కా’, ‘కందిరీగ’, ‘పవర్‌’.. వంటి సినిమాలతో సక్సెస్‌ను మూటగట్టుకున్న ముంబయి మిల్కీ బ్యూటీ హన్సిక మోత్వానీ వెయిట్‌ లాస్‌ సీక్రెట్సేంటో తెలుసుకోవాలంటే ‘ఫ్యాట్‌ టు ఫిట్‌’ శీర్షికలో డిసెంబర్‌ 19న ప్రచురితమయ్యే ప్రత్యేక వ్యాసం చదవండి.

women icon@teamvasundhara
how-almonds-used-for-weight-loss

బాదం తినండి.. బరువు తగ్గండి..!

డ్రైఫ్రూట్స్ విషయంలో చాలామందికి వివిధ అపోహలుంటాయి. ఇవి తింటే శరీరంలో కొవ్వు పెరిగి లావవుతామని, ఫలితంగా లేనిపోని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుందని కొంతమంది భావిస్తారు. అయితే బాదం విషయంలో ఈ అపోహలన్నీ సరికాదని నిరూపించిందో అధ్యయనం. అంతేకాదు.. రోజూ దాదాపు 43 గ్రాముల బాదం పప్పును నూనె లేకుండా వేయించి, కాస్త ఉప్పు చల్లి.. నాలుగు వారాల పాటు తీసుకోవడం వల్ల బరువు పెరగకుండానే, శరీరానికి ఉపయోగపడే విటమిన్ 'ఇ'తో పాటు మోనో అన్‌శ్యాచురేటెడ్ కొవ్వులు, మంచి కొవ్వులు వృద్ధి చెందుతాయని వెల్లడించింది. మహిళల్లో అప్పుడప్పుడు బాదం పప్పు తినే వారి కంటే వారానికి దాదాపు 90 బాదం పప్పుల్ని తినేవారిలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం 35 శాతం తక్కువని కూడా తేలింది. బాదంలో క్యాలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉండడమే ఇందుకు కారణం. మరి విటమిన్ 'ఇ', పీచు.. వంటి ఎన్నో పోషకాలతో మిళితమైన బాదం పప్పు బరువు తగ్గించడంలో ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
ways-to-make-water-taste-better-in-telugu

ఇలా చేస్తే నీరు అమృతమే!

అమృతం అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. అలాగని దాన్ని మనం తాగలేం.. ఎందుకంటే అది దేవతలకు మాత్రమే పరిమితం కాబట్టి. మరి మన భూమిపై అమృతంతో సమాన ప్రాధాన్యం ఉన్న నీరు తాగమంటే మాత్రం.. మనలో చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. చలికాలంలో అయితే మరీనూ.. అయితే రోజూ నిర్ణీత మొత్తంలో నీటిని తీసుకోవడం వల్ల హానికారక విషపదార్థాలన్నీ బయటకు వెళ్లిపోయి, వివిధ అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండడం మాత్రమే కాదు.. శరీర బరువునూ అదుపులో ఉంచుకోవచ్చు. ఇంతటి దివ్యౌషధాన్ని ప్లెయిన్‌గా తీసుకోవడానికి అయిష్టత చూపించేవారు అందులో కొన్ని సహజసిద్ధమైన పదార్థాల్ని కలుపుకొని కూడా తీసుకోవచ్చు. ఫలితంగా నీటిని రుచికరంగా తయారు చేసుకోవడంతో పాటు మరిన్ని ప్రయోజనాల్ని కూడా పొందచ్చు.

Know More

women icon@teamvasundhara
reasons-youre-not-losing-belly-fat-in-telugu
women icon@teamvasundhara
samantha-akkineni-attempts-animal-flow-in-latest-video;-know-about-the-workout

కొత్త సంవత్సరంలో సమంత కొత్త హాబీ.. ఎందుకో తెలుసా?

కొత్త ఏడాదిలో నేను అది చేయాలి.. ఇది సాధించాలని కొత్త కొత్త తీర్మానాలు తీసుకోవడం సహజం. ఈ క్రమంలో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, చెడు అలవాట్లను వదిలేయడం.. ఇలా ఎవరికి నచ్చిన లక్ష్యాలను వారు నిర్దేశించుకుంటారు.. వాటిని తమ రోజువారీ అలవాట్లుగా మార్చుకుంటుంటారు. ఇలాగే మన టాలీవుడ్‌ బ్యూటీ సమంత కూడా కొత్త ఏడాదిలో ఓ కొత్త అలవాటును అలవర్చుకున్నానని చెబుతోంది. సాధారణంగానే ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాదంతా ఫిట్‌గా ఉండాలన్న ఉద్దేశంతో ఓ చక్కటి వర్కవుట్‌ను తన రొటీన్‌లో భాగం చేసుకున్నానంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది. తన వర్కవుట్‌ వీడియోను అందరితో పంచుకుంటూ మరోసారి ఫిట్‌నెస్‌ విషయంలో అందరినీ అలర్ట్‌ చేసింది. మరి, ఇంతకీ సామ్‌ అలవాటు చేసుకున్న ఆ కొత్త ఫిట్‌నెస్‌ రొటీన్‌ ఏంటి? మనల్ని ఫిట్‌గా ఉంచేందుకు అది ఎంత వరకు ఉపయోగపడుతుంది? తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
diet-mistakes-and-how-to-avoid-them-in-telugu

డైటింగ్ చేస్తున్నా బరువు తగ్గట్లేదా?

అబ్బబ్బా.. విసుగొచ్చేసింది. ఎన్ని రోజులు డైటింగ్ చేసినా ఈ వెయింగ్ మెషీన్ ఎటూ కదలదే.. ఎప్పుడూ అదే బరువు చూపిస్తోంది. బరువు చూసుకోవాలంటేనే విసుగ్గా ఉంది.. అనుకుంటోంది ముప్ఫై సంవత్సరాల శ్రీనిధి.. ఇలాంటి సమస్య చాలామందికి ఎదురవుతూ ఉంటుంది. సాధారణంగా బరువు ఎక్కువగా ఉన్నవారిలో చాలామంది దాన్ని తగ్గించుకోవడానికి వివిధ రకాల డైట్లు పాటిస్తూ ఉంటారు. ఇందులో కొంతమంది బరువు తగ్గడంలో విజయం సాధిస్తే.. మరికొందరు మాత్రం వెనుకబడిపోతుంటారు. ఇలా వెనుకబడిపోవడం వెనుక కొన్ని తప్పులుంటాయి. అవేంటో విశ్లేషించుకొని, వాటిని సరిదిద్దుకుంటే సులువుగా బరువు తగ్గే వీలుంటుంది అంటున్నారు పోషకాహార నిపుణులు.. మరి, అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
what-are-the-best-exercises-for-pregnant-women-their-benefits

ప్రెగ్నెన్సీలో ఏ వ్యాయామాలు మంచివి!

నెలలు నిండుతున్న కొద్దీ పొట్ట క్రమంగా పెరుగుతుంది.. తద్వారా ఏ పనీ చేయడానికి శరీరం సహకరించదు. దీనికి తోడు నడుము నొప్పి, పాదాల్లో వాపు.. వంటి అనారోగ్యాలు కూర్చున్న చోటు నుండి గర్భిణుల్ని కదలకుండా చేస్తాయి. నిజానికి గర్భంతో ఉన్న మహిళలు ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవడానికి వ్యాయామం చక్కగా ఉపయోగపడుతుందని నిపుణులు సలహా ఇస్తుంటారు. తాజాగా బాలీవుడ్‌ అందాల తార అనుష్కా శర్మ కూడా అదే చేసింది. మరికొన్ని రోజుల్లో అమ్మగా ప్రమోషన్‌ పొందనున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ తన రోజువారీ వర్కవుట్‌ను కొనసాగిస్తోంది. తాను తాజాగా ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేసిన ఓ వర్కవుట్‌ వీడియోనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ! గర్భం ధరించిన మహిళలు ఇలా క్రమం తప్పకుండా తమ వర్కవుట్‌ని కొనసాగిస్తే ఎంతో చురుగ్గా, ఆరోగ్యంగా ఉండచ్చని మరోసారి నిరూపించిందీ టు-బి-మామ్‌. ఈ నేపథ్యంలో అసలు గర్భిణులకు వ్యాయామం ఎందుకు అవసరం? వారు ఏయే వ్యాయామాలు చేయచ్చు? వాటివల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి? వంటి విషయాలన్నీ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
ways-to-track-your-weight-loss-progress-in-telugu

తగినంత తగ్గామని తెలుసుకోవడమెలా..?

అధిక బరువు.. చాలామందికి ఓ పెద్ద సమస్య ఇది.. ఈ నేపథ్యంలో తాము కోరుకున్న సంఖ్య వెయింగ్ స్కేల్‌పై కనిపించేవరకూ కష్టపడుతూనే ఉంటారు. ఇందుకోసం కొందరు విభిన్న రకాల డైట్లను ఫాలో అవుతుంటే, మరికొందరేమో చెమటోడ్చి వ్యాయామాలు చేస్తుంటారు. మంచి పోషకాహారం, చక్కటి వ్యాయామం ఈ రెండూ మన శరీరం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చాలామంది ఈ మార్గంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతారు. కానీ ఈ రెండూ ఎక్కడ ఆపాలన్న విషయం మాత్రం వారికి అర్థం కాదు.. ఇంతకీ బరువు తగ్గాల్సిన అవసరం లేదు అని మనకు ఎప్పుడు అనిపిస్తుంది? తగినంత బరువు తగ్గామని ఎలా తెలుసుకోవచ్చు? చూద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
actress-who-beat-pandemic-blues-through-yoga-in-telugu
women icon@teamvasundhara
ways-to-gain-weight-in-telugu

బరువు పెరగాలనుకుంటున్నారా?

బరువు తగ్గడం ఎంత కష్టమో పెరగడమూ అంతే కష్టం. ఏంటీ?? బరువు పెరగడమా?? ఎవరైనా తగ్గాలని కోరుకుంటారు గానీ.. పెరగాలనుకుంటారా?? అని ఆశ్చర్యపోతున్నారా?? కొన్ని రకాల ఉద్యోగాలకు 'కచ్చితంగా ఇంత బరువుండాలి' అని ఉంటుంది. అలాగే వయసుకు తగ్గ బరువు లేకుండా బాగా సన్నగా ఉండే వారు కూడా బరువు పెరగాలనుకుంటారు. ఈ క్రమంలో 'కొవ్వు పదార్థాలున్న ఆహారం ఎక్కువగా తీసుకుంటే చాలు.. సులభంగా బరువు పెరగొచ్చు. అందులో కష్టమేముంది' అనుకుంటారు కొంతమంది. అలా తీసుకుంటే శరీరంలో అనవసర కొవ్వు పేరుకుపోయి.. కావలసిన దానికంటే ఎక్కువ బరువు పెరిగి.. రకరకాల ఆరోగ్య సమస్యలు దరిచేరతాయి. కాబట్టి లేనిపోని సమస్యలు తెచ్చుకోకుండా, అవసరమున్నంత మేరకే బరువు పెరగాలంటే ఏం చేయాలో చూద్దాం..

Know More

women icon@teamvasundhara
ways-to-get-slim-waist-in-telugu
women icon@teamvasundhara
winter-exercise-tips-in-telugu

చలికి తట్టుకొని వర్కవుట్‌ చేయాలంటే..!

చలికాలం వచ్చిందంటే చాలు సహజంగానే మనలో బద్ధకం ఆవహిస్తుంది. మిగతా కాలాల్లో రోజూ ఉదయాన్నే నిద్రలేచి వర్కవుట్లకు ఉపక్రమించే వారు చలికాలంలో మాత్రం దుప్పటి కప్పుకొని ‘ఇంకాసేపటికి లేద్దాం లే..’ అంటూ బారెడు పొద్దెక్కేదాకా మంచానికే పరిమితమవుతుంటారు. మరి అన్ని రోజులూ వర్కవుట్లు చేసి ఒక్కసారిగా ఆపేస్తే శారీరక ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చలికాలంలో వ్యాయామాల మీదకు మనసు మళ్లాలంటే రొటీన్‌కి భిన్నంగా కొన్ని విభిన్న వర్కవుట్స్‌ చేయాలని చెబుతున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. తద్వారా శరీరానికి చక్కటి వ్యాయామం అంది.. ఫిట్‌గా మారే అవకాశం ఉంటుంది. అయితే చలికాలంలో చేసే వ్యాయామం ఏదైనా సరే.. ఈ క్రమంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకొని మనమూ ఈ వింటర్‌లో ఫిట్‌గా, ఆరోగ్యంగా మారిపోదాం రండి..

Know More

women icon@teamvasundhara
weight-loss-tips-for-after-marriage-in-telugu

పెళ్లి తర్వాత బరువు పెరగకుండా ఉండాలంటే..!

చాలామంది అమ్మాయిలు పెళ్లి తర్వాత బరువు పెరుగుతుంటారు. అయితే ఇందుకు చాలా రకాల కారణాలే ఉంటాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలిద్దరూ లేదా కుటుంబ సభ్యులంతా కలిసి ఇతర పార్టీలకు హాజరవడం, బంధువుల ఇళ్లకు వెళ్లడం, వారాంతాల్లో బయట తినడం, వ్యాయామానికి తగిన సమయం కేటాయించకపోవడం.. ఇలా కారణాలేవైనా వారి లైఫ్‌స్త్టెల్‌లో మార్పులొచ్చి బరువు పెరగడం మనం గమనిస్తూనే ఉంటాం. దీంతో వారు అటు శారీరకంగా, ఇటు మానసికంగా దృఢత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. మరి ఇలా జరగకుండా ఉండాలంటే పెళ్లి తర్వాత ఫిట్‌నెస్‌పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
spices-which-can-help-you-lose-weight-in-the-winter-season-in-telugu

చలికాలంలో ఇవి తింటే సులభంగా బరువు తగ్గచ్చట!

‘బరువు తగ్గాలి.. నాజూగ్గా మారాలి..’ ప్రస్తుతం చాలామంది జపిస్తోన్న ఫిట్‌నెస్‌ మంత్ర ఇది. అందుకోసమే ఇటు చక్కటి ఆహారం తీసుకుంటూనే.. అటు కఠినమైన వ్యాయామాలు చేయడానికీ వెనకాడట్లేదు ఈ తరం అమ్మాయిలు. అయితే ఇలా ఎంత ప్రయత్నించినా ఈ చలికాలంలో మాత్రం బరువు తగ్గడం కాస్త కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో జీవక్రియల పనితీరు నెమ్మదిస్తుంది. తద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడానికి చాలా సమయం పడుతుంది. అలాగని బరువు తగ్గలేమేమో అని నీరసపడిపోకుండా.. జీవక్రియల పనితీరును ప్రేరేపించే ఆహారం తీసుకోమంటున్నారు నిపుణులు. ఫలితంగా బరువు తగ్గే ప్రక్రియ వేగవంతమవుతుందంటున్నారు. ఇందుకు మన వంటింట్లో ఉండే మసాలాలను మించిన పరమౌషధం లేదంటున్నారు. మరి, ఈ శీతాకాలంలో శరీరంలోని జీవక్రియల పనితీరును మెరుగుపరిచి మనం బరువు తగ్గేందుకు సహకరించే ఆ మసాలాలేవి? వాటితో బరువు తగ్గడం ఎలా సాధ్యమవుతుంది? రండి.. తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
do-you-know-why-you-should-do-skipping??
women icon@teamvasundhara
gul-panag-reveals-how-she-achieved-her-goal-of-100-push-ups-a-day-and-the-motivation-behind-it

పదితో మొదలుపెట్టి వందకు చేరుకున్నా!

వ్యాయామం ప్రారంభించిన మొదట్లో అలసట లేకుండా కాసేపు చేయగలుగుతాం. అదే రోజూ సాధన చేసిన కొద్దీ సమయాన్ని పెంచుకుంటూ పోవడమే కాదు.. అందులో పరిణతి కూడా సాధించగలుగుతాం. ఇదే విషయాన్ని నిరూపిస్తోంది బాలీవుడ్‌ అందాల తార గుల్‌ పనగ్. పుషప్స్‌ చేయడం ప్రారంభించిన మొదట్లో కాస్త కష్టంగానే అనిపించినా.. సాధన చేసిన కొద్దీ వాటిని సునాయాసంగా చేయడానికి అలవాటు పడ్డానని చెబుతోందీ బ్యూటిఫుల్‌ మామ్‌. అందుకు లాక్‌డౌన్‌ సమయం చక్కగా ఉపయోగపడిందంటోంది. మామూలుగానే ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టే గుల్ పనగ్.. ఈ క్రమంలో తాను చేసిన వ్యాయామాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తన ఫ్యాన్స్‌కి ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్పుతుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా తన పుషప్స్‌ వీడియోను పోస్ట్‌ చేసిన ఈ తార.. సాధన వల్లే ఈ వ్యాయామం సులభంగా చేయగలుగుతున్నానంటూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది.

Know More

women icon@teamvasundhara
winter-exercise-tips

చలికి తట్టుకొని వర్కవుట్‌ చేయాలంటే..!

చలికాలం వచ్చిందంటే చాలు సహజంగానే మనలో బద్ధకం ఆవహిస్తుంది. మిగతా కాలాల్లో రోజూ ఉదయాన్నే నిద్రలేచి వర్కవుట్లకు ఉపక్రమించే వారు చలికాలంలో మాత్రం దుప్పటి కప్పుకొని ‘ఇంకాసేపటికి లేద్దాం లే..’ అంటూ బారెడు పొద్దెక్కేదాకా మంచానికే పరిమితమవుతుంటారు. మరి అన్ని రోజులూ వర్కవుట్లు చేసి ఒక్కసారిగా ఆపేస్తే శారీరక ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చలికాలంలో వ్యాయామాల మీదకు మనసు మళ్లాలంటే రొటీన్‌కి భిన్నంగా కొన్ని విభిన్న వర్కవుట్స్‌ చేయాలని చెబుతున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. తద్వారా శరీరానికి చక్కటి వ్యాయామం అంది.. ఫిట్‌గా మారే అవకాశం ఉంటుంది. అయితే చలికాలంలో చేసే వ్యాయామం ఏదైనా సరే.. ఈ క్రమంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకొని మనమూ ఈ వింటర్‌లో ఫిట్‌గా, ఆరోగ్యంగా మారిపోదాం రండి..

Know More

women icon@teamvasundhara
here-is-the-type-and-amount-of-exercise-you-need-who-advises

women icon@teamvasundhara
dia-mirza-learns-kalaripayattu-know-more-about-the-benefits-of-this-martial-art-form

దియా నేర్చుకుంటున్న ఈ మార్షల్‌ ఆర్ట్స్ తో ప్రయోజనాలెన్నో!

కొంతమంది వారి కెరీర్‌తో సంబంధం ఉన్నా, లేకపోయినా కొత్త కొత్త విద్యలు నేర్చుకోవడానికి ఉత్సుకత చూపుతారు. అదే మరికొందరు తమ కెరీర్‌లో దూసుకుపోవడానికి ఎంత కష్టమైన నైపుణ్యమైనా ఇష్టంగా నేర్చేసుకుంటారు. అలాగే ఓ నటిగా తాను కూడా కొత్త కొత్త విద్యలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతానంటోంది బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దియా మీర్జా. పర్యావరణమంటే ప్రాణం పెట్టే ఈ చక్కనమ్మ.. తన ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌కీ అంతే ప్రాధాన్యమిస్తుంటుంది. ఈ క్రమంలో తాను పాటించే ఆరోగ్య రహస్యాలు, ఫిట్‌నెస్‌ చిట్కాలను అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో తన ఫ్యాన్స్‌ కోసం పంచుకుంటుంటుంది దియా. ఈ క్రమంలోనే తాను కలరిపయట్టు అనే యుద్ధ విద్య నేర్చుకుంటోన్న ఫొటోను ఇటీవలే ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందీ బాలీవుడ్‌ బ్యూటీ. మరి, ఇంతకీ ఉన్నట్లుండి ఇంత కష్టతరమైన యుద్ధ కళను ఈ ముద్దుగుమ్మ ఎందుకు నేర్చుకుంటోందో తెలుసుకుందాం రండి..!

Know More

women icon@teamvasundhara
night-time-weight-loss-tips

బరువు తగ్గాలంటే పడుకునే ముందు ఇలా!

నీలిమ, మధురిమ.. ఇద్దరూ చిన్నప్పటి నుంచీ మంచి స్నేహితులు. ప్రస్తుతం వీరిద్దరూ ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే వీరిలో నీలిమ కంటే మధురిమ కాస్త లావుగా ఉంటుంది. దీంతో తను కూడా నీలిమలా నాజూగ్గా తయారవ్వాలని రోజూ వ్యాయామాలు చేయడం, మంచి ఆహారం తీసుకోవడం.. వంటి చిట్కాలన్నీ పాటిస్తోంది. ఇలా చాలామంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇవన్నీ సరే గానీ.. వీటితో పాటు మీరు చేయాల్సిన పని మరొకటుంది. అదేంటి అనుకుంటున్నారా? రాత్రి పడుకునే ముందు కొన్ని చిన్న చిన్న చిట్కాల్ని పాటించడం! దీనివల్ల కొద్ది రోజులకే బరువు తగ్గి నాజూగ్గా తయారుకావచ్చంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. మరి అవేంటో తెలుసుకొని మనమూ పాటిద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
weight-loss-tricks-to-help-you-wake-up-slimmer

సాయంత్రపు అలవాట్లతో ‘స్లిమ్‌’గా మారిపోదాం..!

బరువు తగ్గడానికి రోజూ చేసే వ్యాయామాలతో పాటు ఇంట్లో చేసే కొన్ని చిన్న చిన్న పనులు కూడా తోడ్పడతాయన్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీటికి సాయంత్రం చేసే కొన్ని సులభమైన పనులు కూడా తోడైతే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగని నామమాత్రంగా వీటిని ఫాలో అవుతూ తక్షణమే బరువు తగ్గాలనుకోవడం కూడా సరికాదు. కాబట్టి సాయంత్రం పూట చేసే ఆ పనుల్ని రోజువారీ అలవాట్లుగా మార్చుకోవాలి. తద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాల్ని అనతి కాలంలోనే చేరుకోవచ్చు. మరి బరువు తగ్గడానికి రోజూ సాయంత్రం పూట చేయాల్సిన ఆ పనులేంటో మనం కూడా తెలుసుకుందామా...

Know More

women icon@teamvasundhara
nutritionists-tips-to-stay-healthy-this-diwali-in-telugu
women icon@teamvasundhara
have-you-tried-fitness-snacking?
women icon@teamvasundhara
balika-vadhu-actress-avika-gor-opens-up-on-massive-weight-loss-journey-through-her-instagram-post

ఆరోజు అద్దంలో నన్ను నేను చూసుకొని అసహ్యించుకున్నా!

రోజులో ఎన్నోసార్లు మన అందాన్ని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతుంటాం. అలాంటిది ఎప్పుడైనా మనకు మనం లావుగా కనిపించినా, రోజులాగా అందంగా కనిపించకపోయినా ‘ఏంటిది.. ఈ రోజు ఇలా ఉన్నానేంటి?’ అనుకుంటూ ఉంటాం.. ఇలా తమ శరీరంలో వచ్చిన మార్పుల్ని స్వీకరించకుండా అసహ్యించుకునే వారూ లేకపోలేదు. ఒకానొక దశలో తన విషయంలోనూ ఇదే జరిగిందంటోంది ‘చిన్నారి పెళ్లికూతురు’ అవికా గోర్‌. లావెక్కిన తన కాళ్లు, చేతులు చూసుకొని ఎంతో బాధపడ్డానని, అభద్రతా భావానికి లోనయ్యానని చెబుతోంది. ఇక ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలాంటి ఫలితం ఉండదన్న విషయం ఆలస్యంగా గ్రహించినా.. అప్పట్నుంచి తన శరీరాన్ని ప్రేమించుకుంటూ తనకు నచ్చినట్లుగా మార్చుకున్నానంటోంది. ఈ క్రమంలోనే బొద్దుగుమ్మగా ఉన్న తాను ముద్దుగుమ్మగా ఎలా మారిందో, ఈ జర్నీలో తనకెదురైన అనుభవాలేంటో వివరిస్తూ సోషల్‌ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టిందీ బాలీవుడ్‌ బ్యూటీ. ఎలా ఉన్నా ఎవరికి వారు తమ శరీరాన్ని ప్రేమించాలని, అంగీకరించాలన్న చక్కటి సందేశాన్ని చాటుతోన్న ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Know More

women icon@teamvasundhara
how-to-control-your-weight-in-menopause

మెనోపాజ్ దశలో బరువు తగ్గాలంటే..!

చాలామంది మహిళలు మెనోపాజ్ దశలో బరువు పెరగడం మనం గమనిస్తూనే ఉంటాం. శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల స్థాయులు తగ్గిపోవడం, వయసు పెరిగే కొద్దీ కండరాల దారుఢ్యం తగ్గి.. శరీరంలో కొవ్వు పేరుకుపోవడం.. మొదలైన కారణాలే ఈ సమస్యకు కారణమవుతున్నాయి. అలాగే వయసు పైబడే కొద్దీ శరీరంలో జీవక్రియల రేటు కూడా మందగించడం వల్ల క్యాలరీలు కరిగించే శక్తి కూడా రోజురోజుకీ క్షీణిస్తుంది. అయినప్పటికీ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహార నియమాలు పాటించడం.. వంటి వాటి వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ క్రమంలో మెనోపాజ్ దశలో బరువు తగ్గాలంటే ఎలాంటి విషయాలు దృష్టిలో ఉంచుకోవాలో చూద్దామా..

Know More

women icon@teamvasundhara
fitness-tips-for-women-in-telugu
women icon@teamvasundhara
this-is-how-kangana-ranaut-gets-fit-losing-20-kgs-she-gained-for-thalaivi

ఆ 20 కిలోలు తగ్గడానికే ఈ శ్రమంతా!

ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ వంటి విషయాల్లో మన అందాల నాయికలు తీసుకునేంత శ్రద్ధ మరెవరూ తీసుకోరేమో అనిపిస్తుంది వాళ్ల లైఫ్‌స్టైల్‌ని చూస్తే! అయితే వాళ్లకొచ్చే సినిమా అవకాశాలు, అందులోని పాత్రలకు తగ్గట్లుగా బరువు పెరగడం, తగ్గడం.. అంత సులభమైన విషయమేమీ కాదు. ఇందులోనూ తమ పాత్రల్లో ఒదిగిపోవడానికి కొందరు ప్రోస్థటిక్ మేకప్‌ను ఆశ్రయిస్తే.. మరికొందరు నిజంగానే తమ శరీరాన్ని పాత్రకు తగినట్లుగా మలచుకుంటుంటారు. బాలీవుడ్‌ భామ కంగనా రనౌత్‌ కూడా ఇదే పని చేసింది. ‘తలైవి’గా తెరకెక్కనున్న జయలలిత బయోపిక్‌లో నటిస్తోన్న ఆమె.. ఆ పాత్ర కోసం ఏకంగా 20 కిలోలు పెరిగిందట! ఇక ఇప్పుడు తగ్గే పనిలో పడ్డానంటోందీ చక్కనమ్మ. అంతేకాదు.. బరువు పెరగడం ఎంత సులభమో.. తగ్గడం అంతకంటే కష్టమంటూ తన వర్కవుట్స్‌ గురించి సోషల్‌ మీడియాలో వరుస పోస్టులు పెడుతోందీ మనాలీ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
post-pregnancy-fitness-tips-in-telugu