scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

నా ‘ఫ్యాట్‌ టు ఫిట్‌’ జర్నీకి ఆయనే నాంది!

Dabangg Beauty Sonakshi Sinha Fat to Fit Story is very Inspiring to us

weightloss1.jpgజంక్‌ఫుడ్‌ చూస్తే ఆగలేను.. జిమ్‌ అంటేనే నీరసమొచ్చేస్తుంది.. శరీర బరువు సంగతేమో గానీ తిండి విషయంలో, వర్కవుట్లు చేసే విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్‌ కాను..’ ఇదీ 2010లో ‘దబాంగ్‌’ సినిమాపై సంతకం చేయడానికి ముందు వరకూ బబ్లీ బ్యూటీ సోనాక్షీ సిన్హా వాలకం. చిన్నతనం నుంచి పెద్ద ఫుడీ అయిన ఈ చిన్నది.. తన మనసుకు నచ్చింది లాగించడం, మనలో చాలామందిలాగే వ్యాయామం అంటేనే నీరసపడిపోవడంతో 90 కిలోల బరువుతో ఎంతో బబ్లీగా తయారైంది. అయితే ఒక్క సదవకాశం మన జీవితాన్నే మార్చేసినట్లు.. ఒక్క సినిమా ఈ బొద్దుగుమ్మను ముద్దుగుమ్మగా మార్చేసింది. అదే 2010లో విడుదలైన ‘దబాంగ్‌’ సినిమా!

ఈ చిత్రంలో తెరపై సోనాక్షీని చూసిన వారంతా ‘ఏంటీ నేను చూస్తోంది సోనాక్షీనేనా? ఇంకెవరినైనానా? మొన్నటిదాకా ఎంతో లావుగా ఉండే ఈమె ఇంత త్వరగా నాజూగ్గా ఎలా మారింది?’ అంటూ ముక్కున వేలేసుకున్నారట! ఇక గతంలో ఆమె శరీర బరువు గురించి విమర్శలు చేసిన వారంతా ఈ సినిమాలో ఆమె ఫిజిక్‌ను, నటనను చూసి ఫిదా అయిపోయారంటే అది అతిశయోక్తి కాదు. అయితే కేవలం నెలల వ్యవధిలోనే 90 కిలోల నుంచి 60 కిలోలకు చేరుకొన్న ఆమె ఫిట్‌నెస్‌ జర్నీ అంత సులభంగా ఏమీ సాగలేదంటోందీ సోనా బేబీ. ఇందుకోసం ఎంతగానో శ్రమించానని, తనకు నచ్చిన పదార్థాలను కూడా దూరం పెట్టానని అంటోందీ ముద్దుగుమ్మ. ఇలా తాను బరువు తగ్గడం వెనుక కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ప్రోత్సాహం కూడా ఎంతో ఉందంటోన్న ఈ లవ్లీ గర్ల్‌ ‘ఫ్యాట్‌ టు ఫిట్‌’ జర్నీ ఏంటో ఆమె మాటల్లోనే వినేద్దాం రండి..

sonakshifitnesssecretsgh650-3.jpg

హాయ్ అండీ.. ఎలా ఉన్నారు? నేనైతే ప్రస్తుతం ‘దబాంగ్‌ 3’, ‘భుజ్‌ : ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’.. వంటి రెండు సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నా. అయినా మీతో కాసేపు మాట్లాడాలనిపించింది. అందుకే నా పనులకు కాస్త విరామమిచ్చి ఇలా మీ ముందుకొచ్చా.

sonakshifitnesssecretsgh650-5.jpg

అదంత సులభం కాలేదు!

నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు పదేళ్లు కావస్తోన్నా ఇప్పటికీ చాలామంది నన్ను అడుగుతుంటారు. ‘మీరు సినిమాల్లోకి రాకముందు చాలా బబ్లీగా ఉండేవారు కదా..! కానీ దబాంగ్‌ సినిమాలో మిమ్మల్ని చూసి చాలా ఆశ్చర్యపోయాం.. అసలు అంత త్వరగా ఎలా ఫిట్‌గా మారారు? మాకూ కొన్ని ఫిట్‌నెస్‌ టిప్స్‌ చెప్పచ్చుగా!’ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలేస్తుంటారు. అలాంటి వారందరికీ నేను చెప్పే సమాధానం ఒక్కటే.. చక్కటి డైట్‌, ఫిట్‌నెస్‌ రొటీన్‌ పాటిస్తే ప్రతి ఒక్కరూ ఫిట్‌గా మారచ్చు. అయితే అది మాటల్లో చెప్పినంత సులభం కాదు. వాటిని పాటించేటప్పుడే అందులోని కష్టమేంటో తెలుస్తుంది. ఇప్పుడు మీకు నేను ఇలా టిప్స్‌ చెప్తున్నాను కానీ సినిమాల్లోకి రాకముందు నేను కూడా డైట్‌, ఫిట్‌నెస్‌ విషయాల్లో చాలా బద్ధకస్తురాలిని. నేను చిన్నతనం నుంచీ పెద్ద ఫుడీని. ఇక జంక్‌ఫుడ్‌ అంటే నాకు ప్రాణం. బయటికి వెళ్లినప్పుడు నాకు నచ్చిన పదార్థం ఏదైనా కనిపిస్తే దాన్ని తినేదాకా వదలకపోయేదాన్ని. ఇక చాలామంది లాగే నాకూ వ్యాయామం అంటే అస్సలు ఇష్టముండేది కాదు. పైగా ఎక్సర్‌సైజ్‌ అనగానే నీరసమొచ్చేది. అందుకే వర్కవుట్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టి ఇష్టమున్న ఆహారం తినడం వల్ల చాలా లావుగా తయారయ్యా. అప్పుడు నా బరువు 90 కిలోలంటే మీరే అర్థం చేసుకోండి నేను ఎంత చబ్బీగా ఉండేదాన్నో!

sonakshifitnesssecretsgh650-4.jpg

ఆయన ప్రోత్సాహంతోనే..!

బాగా లావుగా ఉండే వారిని చూసి మన చుట్టూ ఉండే కొందరు గేలి చేయడం, విమర్శించడం కామనే. ఇలాంటి అనుభవాలు నాకూ ఉన్నాయి. అయితే నేను వాటిని పట్టించుకోలేదు. అయితే నేను బరువు తగ్గడంపై పూర్తి దృష్టి పెట్టింది మాత్రం ‘దబాంగ్‌’ సినిమాలో నాకు తొలి అవకాశం వచ్చినప్పుడే! అప్పటికే 90 కిలోల బరువున్న నేను.. అందులో నా పాత్ర కోసం 30 కిలోలు తగ్గాల్సి వచ్చింది. ఇక లాభం లేదనుకొని చక్కటి డైట్‌, ఫిట్‌నెస్‌ రొటీన్లను నా లైఫ్‌స్టైల్‌లో భాగం చేసుకున్నా. ఈ క్రమంలో సల్మాన్‌ కూడా నన్ను ఎంతో ప్రోత్సహించారు. బరువు తగ్గాలని దృఢంగా నిశ్చయించుకున్న నన్ను చూసి.. ‘నువ్వు కాస్త ప్రయత్నిస్తే కచ్చితంగా బరువు తగ్గగలవు. నీకు ఆ సామర్థ్యముంది..’ అంటూ పదే పదే చెబుతుండేవారు. దాంతో బరువు తగ్గాలన్న నా కోరికకు మరింత వూతమిచ్చినట్లయింది. అందుకే నా ‘ఫ్యాట్‌ టు ఫిట్‌’ జర్నీలో నేను పాటించిన డైట్‌-ఫిట్‌నెస్‌ రొటీన్‌ ఒకెత్తయితే.. సల్మాన్‌ అందించిన ప్రోత్సాహం మరో ఎత్తు. ఇందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటా.

ప్రతి రెండు గంటలకోసారి..

sonakshifitnesssecretsgh650-1.jpg

నా డైట్‌ రొటీన్‌ ప్రారంభించిన తర్వాత నాకెంతో ఇష్టమైన కొన్ని ఆహార పదార్థాలనుజంక్‌ ఫుడ్‌ను వదులుకోవడం కాస్త కష్టంగానే అనిపించిందిఅయినా బరువు తగ్గాలనుకుని బలంగా నిర్ణయించుకున్న తర్వాత స్ట్రిక్ట్‌ డైట్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టాఈ క్రమంలో ఓ డైట్‌ ఛార్ట్‌ని ప్రిపేర్‌ చేసుకొని ఫాలో అవడం ప్రారంభించాప్రతి రెండు గంటలకోసారి తక్కువ మొత్తంలో ఏదో ఒకటి తినాలనిసాయంత్రం ఆరు గంటల తర్వాత కార్బోహైడ్రేట్లు అసలే తీసుకోకూడదనే నియమం పెట్టుకున్నా.

ఉదయం లేవగానే గ్లాసు గోరువెచ్చటి నీటిలో కాస్త తేనెకొద్దిగా నిమ్మరసం వేసుకొని కలుపుకొని తీసుకోవడం నాకు అలవాటుఉదయం నేను తీసుకునే తొలి ఫుడ్‌ కూడా ఇదే!

ఇక బ్రేక్‌ఫాస్ట్‌ కోసం సెరల్స్‌వెన్న తొలగించిన పాలుహోల్‌వీట్‌ టోస్ట్‌.. వంటివి తీసుకుంటా.

sonakshifitnesssecretsgh650-6.jpg

ఆపై రెండు గంటలకు కొన్ని డ్రైఫ్రూట్స్‌కప్పు గ్రీన్‌ టీ తాగుతా.

మధ్యాహ్నం భోజనం సమయంలో రోటీసబ్జీ (కూరగాయలన్నీ కలిపి తయారుచేసే కర్రీ), సలాడ్‌.. వంటివి తీసుకుంటా.

సాయంత్రం కప్పు గ్రీన్‌ టీ లేదా ఒక బౌల్‌ పండ్ల ముక్కలు తింటాను.

ఇక రాత్రి భోజనానికి సబ్జీ (కూరగాయలన్నీ కలిపి తయారుచేసే కర్రీ), చికెన్‌ ముక్క లేదా గ్రిల్డ్‌ ఫిష్‌పప్పు.. వంటివి తీసుకుంటా.

సాయంత్రం ఆరు తర్వాత కార్బోహైడ్రేట్లు ఉండే ఆహార పదార్థాలు అసలే తీసుకోనుడిన్నర్‌ కూడా లోపే ముగించేస్తా.

నీళ్లు ఎక్కువగా తాగడంఅప్పుడప్పుడూ పండ్ల రసాలు తీసుకోవడం కామనే.

రెండు రోజులు జిమ్‌లో.. మూడు రోజులు యోగాతో..!

View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona) on

ఒకప్పుడు నాకు జిమ్‌ అంటేనే నీరసమొచ్చేదికానీ ఎప్పుడైతే బరువు తగ్గాలని నిర్ణయించుకున్నానో అప్పట్నుంచి జిమ్‌వర్కవుట్స్‌పై ఇష్టం ఏర్పడిందినా వర్కవుట్‌ రొటీన్‌లో భాగంగా రెండు రోజులు జిమ్‌ వ్యాయామాలకుమూడు రోజులు యోగాకు ప్రాధాన్యమిస్తానుజిమ్‌లో భాగంగా ర్డియోబరువులెత్తడంసైక్లింగ్‌స్పిన్నింగ్‌.. వంటి వ్యాయామాలు చేస్తానుఈ క్రమంలో నాకు నా ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నమ్రతా పురోహిత్‌ వాటికి సంబంధించిన మెలకువలు చెబుతుంటారువీటితో పాటు యోగాస్విమ్మింగ్‌టెన్నిస్‌.. వంటివీ నేను బరువు తగ్గి ఫిట్‌గా మారేందుకునేటికీ నన్ను ఫిట్‌గా ఉంచేందుకు దోహదం చేస్తున్నాయిఅలాగే నేను ఎప్పుడూ నవ్వుతూనా చుట్టూ ఉన్న వారిని నవ్వించడం నాకు ముందు నుంచీ అలవాటునేను చేసే వ్యాయామాలతో పాటు ఈ అలవాటు కూడా నాలో కలిగే ఒత్తిళ్లను మటుమాయం చేయడంలో సహకరిస్తుంది.

సో.. ఇదండీ నా ‘ఫ్యాట్‌ టు ఫిట్‌’ జర్నీలోని కొన్ని ముఖ్యమైన విషయాలు. మీరు కూడా ‘నేను లావుగా ఉన్నాను.. అందరూ నన్ను చూసి ఏమనుకుంటున్నారో..’ అని నిరాశ పడకుండా.. నిపుణుల సలహా మేరకు చక్కటి డైట్‌, ఫిట్‌నెస్‌ నియమాలను మీ రొటీన్‌లో భాగం చేసుకోండి.. తద్వారా మీరు బరువు తగ్గడంతో పాటు ఆ చిట్కాల్ని నలుగురికీ అందించి.. వారి వెయిట్‌ లాస్ జర్నీలో భాగం కండి.. నేను చెప్పిన ఈ విషయాలు మర్చిపోరుగా.. ఉంటాను మరి. బై బై!!

గమనిక : చక్కటి డైట్‌, ఫిట్‌నెస్‌ నియమాలతో బరువు తగ్గి నాజూగ్గా మారడంతో పాటు తనదైన ఫిజిక్‌, ఫ్యాషన్లతో బాలీవుడ్‌ ఫ్యాషనిస్టాగా పేరుతెచ్చుకున్న కపూర్‌ వారసురాలు సోనమ్‌ కపూర్‌ ‘ఫ్యాట్‌ టు ఫిట్‌’ స్టోరీ తెలుసుకోవాలంటే ‘అలా బరువు తగ్గా!’ శీర్షికలో నవంబర్‌ 28న ప్రచురితమయ్యే ప్రత్యేక వ్యాసం చదవండి.





women icon@teamvasundhara
how-almonds-used-for-weight-loss

బాదం తినండి.. బరువు తగ్గండి..!

డ్రైఫ్రూట్స్ విషయంలో చాలామందికి వివిధ అపోహలుంటాయి. ఇవి తింటే శరీరంలో కొవ్వు పెరిగి లావవుతామని, ఫలితంగా లేనిపోని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుందని కొంతమంది భావిస్తారు. అయితే బాదం విషయంలో ఈ అపోహలన్నీ సరికాదని నిరూపించిందో అధ్యయనం. అంతేకాదు.. రోజూ దాదాపు 43 గ్రాముల బాదం పప్పును నూనె లేకుండా వేయించి, కాస్త ఉప్పు చల్లి.. నాలుగు వారాల పాటు తీసుకోవడం వల్ల బరువు పెరగకుండానే, శరీరానికి ఉపయోగపడే విటమిన్ 'ఇ'తో పాటు మోనో అన్‌శ్యాచురేటెడ్ కొవ్వులు, మంచి కొవ్వులు వృద్ధి చెందుతాయని వెల్లడించింది. మహిళల్లో అప్పుడప్పుడు బాదం పప్పు తినే వారి కంటే వారానికి దాదాపు 90 బాదం పప్పుల్ని తినేవారిలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం 35 శాతం తక్కువని కూడా తేలింది. బాదంలో క్యాలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉండడమే ఇందుకు కారణం. మరి విటమిన్ 'ఇ', పీచు.. వంటి ఎన్నో పోషకాలతో మిళితమైన బాదం పప్పు బరువు తగ్గించడంలో ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
ways-to-make-water-taste-better-in-telugu

ఇలా చేస్తే నీరు అమృతమే!

అమృతం అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. అలాగని దాన్ని మనం తాగలేం.. ఎందుకంటే అది దేవతలకు మాత్రమే పరిమితం కాబట్టి. మరి మన భూమిపై అమృతంతో సమాన ప్రాధాన్యం ఉన్న నీరు తాగమంటే మాత్రం.. మనలో చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. చలికాలంలో అయితే మరీనూ.. అయితే రోజూ నిర్ణీత మొత్తంలో నీటిని తీసుకోవడం వల్ల హానికారక విషపదార్థాలన్నీ బయటకు వెళ్లిపోయి, వివిధ అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండడం మాత్రమే కాదు.. శరీర బరువునూ అదుపులో ఉంచుకోవచ్చు. ఇంతటి దివ్యౌషధాన్ని ప్లెయిన్‌గా తీసుకోవడానికి అయిష్టత చూపించేవారు అందులో కొన్ని సహజసిద్ధమైన పదార్థాల్ని కలుపుకొని కూడా తీసుకోవచ్చు. ఫలితంగా నీటిని రుచికరంగా తయారు చేసుకోవడంతో పాటు మరిన్ని ప్రయోజనాల్ని కూడా పొందచ్చు.

Know More

women icon@teamvasundhara
reasons-youre-not-losing-belly-fat-in-telugu
women icon@teamvasundhara
samantha-akkineni-attempts-animal-flow-in-latest-video;-know-about-the-workout

కొత్త సంవత్సరంలో సమంత కొత్త హాబీ.. ఎందుకో తెలుసా?

కొత్త ఏడాదిలో నేను అది చేయాలి.. ఇది సాధించాలని కొత్త కొత్త తీర్మానాలు తీసుకోవడం సహజం. ఈ క్రమంలో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, చెడు అలవాట్లను వదిలేయడం.. ఇలా ఎవరికి నచ్చిన లక్ష్యాలను వారు నిర్దేశించుకుంటారు.. వాటిని తమ రోజువారీ అలవాట్లుగా మార్చుకుంటుంటారు. ఇలాగే మన టాలీవుడ్‌ బ్యూటీ సమంత కూడా కొత్త ఏడాదిలో ఓ కొత్త అలవాటును అలవర్చుకున్నానని చెబుతోంది. సాధారణంగానే ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాదంతా ఫిట్‌గా ఉండాలన్న ఉద్దేశంతో ఓ చక్కటి వర్కవుట్‌ను తన రొటీన్‌లో భాగం చేసుకున్నానంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది. తన వర్కవుట్‌ వీడియోను అందరితో పంచుకుంటూ మరోసారి ఫిట్‌నెస్‌ విషయంలో అందరినీ అలర్ట్‌ చేసింది. మరి, ఇంతకీ సామ్‌ అలవాటు చేసుకున్న ఆ కొత్త ఫిట్‌నెస్‌ రొటీన్‌ ఏంటి? మనల్ని ఫిట్‌గా ఉంచేందుకు అది ఎంత వరకు ఉపయోగపడుతుంది? తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
diet-mistakes-and-how-to-avoid-them-in-telugu

డైటింగ్ చేస్తున్నా బరువు తగ్గట్లేదా?

అబ్బబ్బా.. విసుగొచ్చేసింది. ఎన్ని రోజులు డైటింగ్ చేసినా ఈ వెయింగ్ మెషీన్ ఎటూ కదలదే.. ఎప్పుడూ అదే బరువు చూపిస్తోంది. బరువు చూసుకోవాలంటేనే విసుగ్గా ఉంది.. అనుకుంటోంది ముప్ఫై సంవత్సరాల శ్రీనిధి.. ఇలాంటి సమస్య చాలామందికి ఎదురవుతూ ఉంటుంది. సాధారణంగా బరువు ఎక్కువగా ఉన్నవారిలో చాలామంది దాన్ని తగ్గించుకోవడానికి వివిధ రకాల డైట్లు పాటిస్తూ ఉంటారు. ఇందులో కొంతమంది బరువు తగ్గడంలో విజయం సాధిస్తే.. మరికొందరు మాత్రం వెనుకబడిపోతుంటారు. ఇలా వెనుకబడిపోవడం వెనుక కొన్ని తప్పులుంటాయి. అవేంటో విశ్లేషించుకొని, వాటిని సరిదిద్దుకుంటే సులువుగా బరువు తగ్గే వీలుంటుంది అంటున్నారు పోషకాహార నిపుణులు.. మరి, అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
what-are-the-best-exercises-for-pregnant-women-their-benefits

ప్రెగ్నెన్సీలో ఏ వ్యాయామాలు మంచివి!

నెలలు నిండుతున్న కొద్దీ పొట్ట క్రమంగా పెరుగుతుంది.. తద్వారా ఏ పనీ చేయడానికి శరీరం సహకరించదు. దీనికి తోడు నడుము నొప్పి, పాదాల్లో వాపు.. వంటి అనారోగ్యాలు కూర్చున్న చోటు నుండి గర్భిణుల్ని కదలకుండా చేస్తాయి. నిజానికి గర్భంతో ఉన్న మహిళలు ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవడానికి వ్యాయామం చక్కగా ఉపయోగపడుతుందని నిపుణులు సలహా ఇస్తుంటారు. తాజాగా బాలీవుడ్‌ అందాల తార అనుష్కా శర్మ కూడా అదే చేసింది. మరికొన్ని రోజుల్లో అమ్మగా ప్రమోషన్‌ పొందనున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ తన రోజువారీ వర్కవుట్‌ను కొనసాగిస్తోంది. తాను తాజాగా ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేసిన ఓ వర్కవుట్‌ వీడియోనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ! గర్భం ధరించిన మహిళలు ఇలా క్రమం తప్పకుండా తమ వర్కవుట్‌ని కొనసాగిస్తే ఎంతో చురుగ్గా, ఆరోగ్యంగా ఉండచ్చని మరోసారి నిరూపించిందీ టు-బి-మామ్‌. ఈ నేపథ్యంలో అసలు గర్భిణులకు వ్యాయామం ఎందుకు అవసరం? వారు ఏయే వ్యాయామాలు చేయచ్చు? వాటివల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి? వంటి విషయాలన్నీ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
ways-to-track-your-weight-loss-progress-in-telugu

తగినంత తగ్గామని తెలుసుకోవడమెలా..?

అధిక బరువు.. చాలామందికి ఓ పెద్ద సమస్య ఇది.. ఈ నేపథ్యంలో తాము కోరుకున్న సంఖ్య వెయింగ్ స్కేల్‌పై కనిపించేవరకూ కష్టపడుతూనే ఉంటారు. ఇందుకోసం కొందరు విభిన్న రకాల డైట్లను ఫాలో అవుతుంటే, మరికొందరేమో చెమటోడ్చి వ్యాయామాలు చేస్తుంటారు. మంచి పోషకాహారం, చక్కటి వ్యాయామం ఈ రెండూ మన శరీరం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చాలామంది ఈ మార్గంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతారు. కానీ ఈ రెండూ ఎక్కడ ఆపాలన్న విషయం మాత్రం వారికి అర్థం కాదు.. ఇంతకీ బరువు తగ్గాల్సిన అవసరం లేదు అని మనకు ఎప్పుడు అనిపిస్తుంది? తగినంత బరువు తగ్గామని ఎలా తెలుసుకోవచ్చు? చూద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
actress-who-beat-pandemic-blues-through-yoga-in-telugu
women icon@teamvasundhara
ways-to-gain-weight-in-telugu

బరువు పెరగాలనుకుంటున్నారా?

బరువు తగ్గడం ఎంత కష్టమో పెరగడమూ అంతే కష్టం. ఏంటీ?? బరువు పెరగడమా?? ఎవరైనా తగ్గాలని కోరుకుంటారు గానీ.. పెరగాలనుకుంటారా?? అని ఆశ్చర్యపోతున్నారా?? కొన్ని రకాల ఉద్యోగాలకు 'కచ్చితంగా ఇంత బరువుండాలి' అని ఉంటుంది. అలాగే వయసుకు తగ్గ బరువు లేకుండా బాగా సన్నగా ఉండే వారు కూడా బరువు పెరగాలనుకుంటారు. ఈ క్రమంలో 'కొవ్వు పదార్థాలున్న ఆహారం ఎక్కువగా తీసుకుంటే చాలు.. సులభంగా బరువు పెరగొచ్చు. అందులో కష్టమేముంది' అనుకుంటారు కొంతమంది. అలా తీసుకుంటే శరీరంలో అనవసర కొవ్వు పేరుకుపోయి.. కావలసిన దానికంటే ఎక్కువ బరువు పెరిగి.. రకరకాల ఆరోగ్య సమస్యలు దరిచేరతాయి. కాబట్టి లేనిపోని సమస్యలు తెచ్చుకోకుండా, అవసరమున్నంత మేరకే బరువు పెరగాలంటే ఏం చేయాలో చూద్దాం..

Know More

women icon@teamvasundhara
ways-to-get-slim-waist-in-telugu
women icon@teamvasundhara
winter-exercise-tips-in-telugu

చలికి తట్టుకొని వర్కవుట్‌ చేయాలంటే..!

చలికాలం వచ్చిందంటే చాలు సహజంగానే మనలో బద్ధకం ఆవహిస్తుంది. మిగతా కాలాల్లో రోజూ ఉదయాన్నే నిద్రలేచి వర్కవుట్లకు ఉపక్రమించే వారు చలికాలంలో మాత్రం దుప్పటి కప్పుకొని ‘ఇంకాసేపటికి లేద్దాం లే..’ అంటూ బారెడు పొద్దెక్కేదాకా మంచానికే పరిమితమవుతుంటారు. మరి అన్ని రోజులూ వర్కవుట్లు చేసి ఒక్కసారిగా ఆపేస్తే శారీరక ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చలికాలంలో వ్యాయామాల మీదకు మనసు మళ్లాలంటే రొటీన్‌కి భిన్నంగా కొన్ని విభిన్న వర్కవుట్స్‌ చేయాలని చెబుతున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. తద్వారా శరీరానికి చక్కటి వ్యాయామం అంది.. ఫిట్‌గా మారే అవకాశం ఉంటుంది. అయితే చలికాలంలో చేసే వ్యాయామం ఏదైనా సరే.. ఈ క్రమంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకొని మనమూ ఈ వింటర్‌లో ఫిట్‌గా, ఆరోగ్యంగా మారిపోదాం రండి..

Know More

women icon@teamvasundhara
weight-loss-tips-for-after-marriage-in-telugu

పెళ్లి తర్వాత బరువు పెరగకుండా ఉండాలంటే..!

చాలామంది అమ్మాయిలు పెళ్లి తర్వాత బరువు పెరుగుతుంటారు. అయితే ఇందుకు చాలా రకాల కారణాలే ఉంటాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలిద్దరూ లేదా కుటుంబ సభ్యులంతా కలిసి ఇతర పార్టీలకు హాజరవడం, బంధువుల ఇళ్లకు వెళ్లడం, వారాంతాల్లో బయట తినడం, వ్యాయామానికి తగిన సమయం కేటాయించకపోవడం.. ఇలా కారణాలేవైనా వారి లైఫ్‌స్త్టెల్‌లో మార్పులొచ్చి బరువు పెరగడం మనం గమనిస్తూనే ఉంటాం. దీంతో వారు అటు శారీరకంగా, ఇటు మానసికంగా దృఢత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. మరి ఇలా జరగకుండా ఉండాలంటే పెళ్లి తర్వాత ఫిట్‌నెస్‌పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
spices-which-can-help-you-lose-weight-in-the-winter-season-in-telugu

చలికాలంలో ఇవి తింటే సులభంగా బరువు తగ్గచ్చట!

‘బరువు తగ్గాలి.. నాజూగ్గా మారాలి..’ ప్రస్తుతం చాలామంది జపిస్తోన్న ఫిట్‌నెస్‌ మంత్ర ఇది. అందుకోసమే ఇటు చక్కటి ఆహారం తీసుకుంటూనే.. అటు కఠినమైన వ్యాయామాలు చేయడానికీ వెనకాడట్లేదు ఈ తరం అమ్మాయిలు. అయితే ఇలా ఎంత ప్రయత్నించినా ఈ చలికాలంలో మాత్రం బరువు తగ్గడం కాస్త కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో జీవక్రియల పనితీరు నెమ్మదిస్తుంది. తద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడానికి చాలా సమయం పడుతుంది. అలాగని బరువు తగ్గలేమేమో అని నీరసపడిపోకుండా.. జీవక్రియల పనితీరును ప్రేరేపించే ఆహారం తీసుకోమంటున్నారు నిపుణులు. ఫలితంగా బరువు తగ్గే ప్రక్రియ వేగవంతమవుతుందంటున్నారు. ఇందుకు మన వంటింట్లో ఉండే మసాలాలను మించిన పరమౌషధం లేదంటున్నారు. మరి, ఈ శీతాకాలంలో శరీరంలోని జీవక్రియల పనితీరును మెరుగుపరిచి మనం బరువు తగ్గేందుకు సహకరించే ఆ మసాలాలేవి? వాటితో బరువు తగ్గడం ఎలా సాధ్యమవుతుంది? రండి.. తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
do-you-know-why-you-should-do-skipping??
women icon@teamvasundhara
gul-panag-reveals-how-she-achieved-her-goal-of-100-push-ups-a-day-and-the-motivation-behind-it

పదితో మొదలుపెట్టి వందకు చేరుకున్నా!

వ్యాయామం ప్రారంభించిన మొదట్లో అలసట లేకుండా కాసేపు చేయగలుగుతాం. అదే రోజూ సాధన చేసిన కొద్దీ సమయాన్ని పెంచుకుంటూ పోవడమే కాదు.. అందులో పరిణతి కూడా సాధించగలుగుతాం. ఇదే విషయాన్ని నిరూపిస్తోంది బాలీవుడ్‌ అందాల తార గుల్‌ పనగ్. పుషప్స్‌ చేయడం ప్రారంభించిన మొదట్లో కాస్త కష్టంగానే అనిపించినా.. సాధన చేసిన కొద్దీ వాటిని సునాయాసంగా చేయడానికి అలవాటు పడ్డానని చెబుతోందీ బ్యూటిఫుల్‌ మామ్‌. అందుకు లాక్‌డౌన్‌ సమయం చక్కగా ఉపయోగపడిందంటోంది. మామూలుగానే ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టే గుల్ పనగ్.. ఈ క్రమంలో తాను చేసిన వ్యాయామాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తన ఫ్యాన్స్‌కి ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్పుతుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా తన పుషప్స్‌ వీడియోను పోస్ట్‌ చేసిన ఈ తార.. సాధన వల్లే ఈ వ్యాయామం సులభంగా చేయగలుగుతున్నానంటూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది.

Know More

women icon@teamvasundhara
winter-exercise-tips

చలికి తట్టుకొని వర్కవుట్‌ చేయాలంటే..!

చలికాలం వచ్చిందంటే చాలు సహజంగానే మనలో బద్ధకం ఆవహిస్తుంది. మిగతా కాలాల్లో రోజూ ఉదయాన్నే నిద్రలేచి వర్కవుట్లకు ఉపక్రమించే వారు చలికాలంలో మాత్రం దుప్పటి కప్పుకొని ‘ఇంకాసేపటికి లేద్దాం లే..’ అంటూ బారెడు పొద్దెక్కేదాకా మంచానికే పరిమితమవుతుంటారు. మరి అన్ని రోజులూ వర్కవుట్లు చేసి ఒక్కసారిగా ఆపేస్తే శారీరక ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చలికాలంలో వ్యాయామాల మీదకు మనసు మళ్లాలంటే రొటీన్‌కి భిన్నంగా కొన్ని విభిన్న వర్కవుట్స్‌ చేయాలని చెబుతున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. తద్వారా శరీరానికి చక్కటి వ్యాయామం అంది.. ఫిట్‌గా మారే అవకాశం ఉంటుంది. అయితే చలికాలంలో చేసే వ్యాయామం ఏదైనా సరే.. ఈ క్రమంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకొని మనమూ ఈ వింటర్‌లో ఫిట్‌గా, ఆరోగ్యంగా మారిపోదాం రండి..

Know More

women icon@teamvasundhara
here-is-the-type-and-amount-of-exercise-you-need-who-advises

women icon@teamvasundhara
dia-mirza-learns-kalaripayattu-know-more-about-the-benefits-of-this-martial-art-form

దియా నేర్చుకుంటున్న ఈ మార్షల్‌ ఆర్ట్స్ తో ప్రయోజనాలెన్నో!

కొంతమంది వారి కెరీర్‌తో సంబంధం ఉన్నా, లేకపోయినా కొత్త కొత్త విద్యలు నేర్చుకోవడానికి ఉత్సుకత చూపుతారు. అదే మరికొందరు తమ కెరీర్‌లో దూసుకుపోవడానికి ఎంత కష్టమైన నైపుణ్యమైనా ఇష్టంగా నేర్చేసుకుంటారు. అలాగే ఓ నటిగా తాను కూడా కొత్త కొత్త విద్యలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతానంటోంది బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దియా మీర్జా. పర్యావరణమంటే ప్రాణం పెట్టే ఈ చక్కనమ్మ.. తన ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌కీ అంతే ప్రాధాన్యమిస్తుంటుంది. ఈ క్రమంలో తాను పాటించే ఆరోగ్య రహస్యాలు, ఫిట్‌నెస్‌ చిట్కాలను అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో తన ఫ్యాన్స్‌ కోసం పంచుకుంటుంటుంది దియా. ఈ క్రమంలోనే తాను కలరిపయట్టు అనే యుద్ధ విద్య నేర్చుకుంటోన్న ఫొటోను ఇటీవలే ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందీ బాలీవుడ్‌ బ్యూటీ. మరి, ఇంతకీ ఉన్నట్లుండి ఇంత కష్టతరమైన యుద్ధ కళను ఈ ముద్దుగుమ్మ ఎందుకు నేర్చుకుంటోందో తెలుసుకుందాం రండి..!

Know More

women icon@teamvasundhara
night-time-weight-loss-tips

బరువు తగ్గాలంటే పడుకునే ముందు ఇలా!

నీలిమ, మధురిమ.. ఇద్దరూ చిన్నప్పటి నుంచీ మంచి స్నేహితులు. ప్రస్తుతం వీరిద్దరూ ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే వీరిలో నీలిమ కంటే మధురిమ కాస్త లావుగా ఉంటుంది. దీంతో తను కూడా నీలిమలా నాజూగ్గా తయారవ్వాలని రోజూ వ్యాయామాలు చేయడం, మంచి ఆహారం తీసుకోవడం.. వంటి చిట్కాలన్నీ పాటిస్తోంది. ఇలా చాలామంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇవన్నీ సరే గానీ.. వీటితో పాటు మీరు చేయాల్సిన పని మరొకటుంది. అదేంటి అనుకుంటున్నారా? రాత్రి పడుకునే ముందు కొన్ని చిన్న చిన్న చిట్కాల్ని పాటించడం! దీనివల్ల కొద్ది రోజులకే బరువు తగ్గి నాజూగ్గా తయారుకావచ్చంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. మరి అవేంటో తెలుసుకొని మనమూ పాటిద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
weight-loss-tricks-to-help-you-wake-up-slimmer

సాయంత్రపు అలవాట్లతో ‘స్లిమ్‌’గా మారిపోదాం..!

బరువు తగ్గడానికి రోజూ చేసే వ్యాయామాలతో పాటు ఇంట్లో చేసే కొన్ని చిన్న చిన్న పనులు కూడా తోడ్పడతాయన్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీటికి సాయంత్రం చేసే కొన్ని సులభమైన పనులు కూడా తోడైతే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగని నామమాత్రంగా వీటిని ఫాలో అవుతూ తక్షణమే బరువు తగ్గాలనుకోవడం కూడా సరికాదు. కాబట్టి సాయంత్రం పూట చేసే ఆ పనుల్ని రోజువారీ అలవాట్లుగా మార్చుకోవాలి. తద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాల్ని అనతి కాలంలోనే చేరుకోవచ్చు. మరి బరువు తగ్గడానికి రోజూ సాయంత్రం పూట చేయాల్సిన ఆ పనులేంటో మనం కూడా తెలుసుకుందామా...

Know More

women icon@teamvasundhara
nutritionists-tips-to-stay-healthy-this-diwali-in-telugu
women icon@teamvasundhara
have-you-tried-fitness-snacking?
women icon@teamvasundhara
balika-vadhu-actress-avika-gor-opens-up-on-massive-weight-loss-journey-through-her-instagram-post

ఆరోజు అద్దంలో నన్ను నేను చూసుకొని అసహ్యించుకున్నా!

రోజులో ఎన్నోసార్లు మన అందాన్ని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతుంటాం. అలాంటిది ఎప్పుడైనా మనకు మనం లావుగా కనిపించినా, రోజులాగా అందంగా కనిపించకపోయినా ‘ఏంటిది.. ఈ రోజు ఇలా ఉన్నానేంటి?’ అనుకుంటూ ఉంటాం.. ఇలా తమ శరీరంలో వచ్చిన మార్పుల్ని స్వీకరించకుండా అసహ్యించుకునే వారూ లేకపోలేదు. ఒకానొక దశలో తన విషయంలోనూ ఇదే జరిగిందంటోంది ‘చిన్నారి పెళ్లికూతురు’ అవికా గోర్‌. లావెక్కిన తన కాళ్లు, చేతులు చూసుకొని ఎంతో బాధపడ్డానని, అభద్రతా భావానికి లోనయ్యానని చెబుతోంది. ఇక ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలాంటి ఫలితం ఉండదన్న విషయం ఆలస్యంగా గ్రహించినా.. అప్పట్నుంచి తన శరీరాన్ని ప్రేమించుకుంటూ తనకు నచ్చినట్లుగా మార్చుకున్నానంటోంది. ఈ క్రమంలోనే బొద్దుగుమ్మగా ఉన్న తాను ముద్దుగుమ్మగా ఎలా మారిందో, ఈ జర్నీలో తనకెదురైన అనుభవాలేంటో వివరిస్తూ సోషల్‌ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టిందీ బాలీవుడ్‌ బ్యూటీ. ఎలా ఉన్నా ఎవరికి వారు తమ శరీరాన్ని ప్రేమించాలని, అంగీకరించాలన్న చక్కటి సందేశాన్ని చాటుతోన్న ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Know More

women icon@teamvasundhara
how-to-control-your-weight-in-menopause

మెనోపాజ్ దశలో బరువు తగ్గాలంటే..!

చాలామంది మహిళలు మెనోపాజ్ దశలో బరువు పెరగడం మనం గమనిస్తూనే ఉంటాం. శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల స్థాయులు తగ్గిపోవడం, వయసు పెరిగే కొద్దీ కండరాల దారుఢ్యం తగ్గి.. శరీరంలో కొవ్వు పేరుకుపోవడం.. మొదలైన కారణాలే ఈ సమస్యకు కారణమవుతున్నాయి. అలాగే వయసు పైబడే కొద్దీ శరీరంలో జీవక్రియల రేటు కూడా మందగించడం వల్ల క్యాలరీలు కరిగించే శక్తి కూడా రోజురోజుకీ క్షీణిస్తుంది. అయినప్పటికీ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహార నియమాలు పాటించడం.. వంటి వాటి వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ క్రమంలో మెనోపాజ్ దశలో బరువు తగ్గాలంటే ఎలాంటి విషయాలు దృష్టిలో ఉంచుకోవాలో చూద్దామా..

Know More

women icon@teamvasundhara
fitness-tips-for-women-in-telugu
women icon@teamvasundhara
this-is-how-kangana-ranaut-gets-fit-losing-20-kgs-she-gained-for-thalaivi

ఆ 20 కిలోలు తగ్గడానికే ఈ శ్రమంతా!

ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ వంటి విషయాల్లో మన అందాల నాయికలు తీసుకునేంత శ్రద్ధ మరెవరూ తీసుకోరేమో అనిపిస్తుంది వాళ్ల లైఫ్‌స్టైల్‌ని చూస్తే! అయితే వాళ్లకొచ్చే సినిమా అవకాశాలు, అందులోని పాత్రలకు తగ్గట్లుగా బరువు పెరగడం, తగ్గడం.. అంత సులభమైన విషయమేమీ కాదు. ఇందులోనూ తమ పాత్రల్లో ఒదిగిపోవడానికి కొందరు ప్రోస్థటిక్ మేకప్‌ను ఆశ్రయిస్తే.. మరికొందరు నిజంగానే తమ శరీరాన్ని పాత్రకు తగినట్లుగా మలచుకుంటుంటారు. బాలీవుడ్‌ భామ కంగనా రనౌత్‌ కూడా ఇదే పని చేసింది. ‘తలైవి’గా తెరకెక్కనున్న జయలలిత బయోపిక్‌లో నటిస్తోన్న ఆమె.. ఆ పాత్ర కోసం ఏకంగా 20 కిలోలు పెరిగిందట! ఇక ఇప్పుడు తగ్గే పనిలో పడ్డానంటోందీ చక్కనమ్మ. అంతేకాదు.. బరువు పెరగడం ఎంత సులభమో.. తగ్గడం అంతకంటే కష్టమంటూ తన వర్కవుట్స్‌ గురించి సోషల్‌ మీడియాలో వరుస పోస్టులు పెడుతోందీ మనాలీ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
post-pregnancy-fitness-tips-in-telugu
women icon@teamvasundhara
ways-to-lose-weight-during-menopause-in-telugu

మెనోపాజ్ దశలో బరువు తగ్గాలంటే..!

చాలామంది మహిళలు మెనోపాజ్ దశలో బరువు పెరగడం మనం గమనిస్తూనే ఉంటాం. శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల స్థాయులు తగ్గిపోవడం, వయసు పెరిగే కొద్దీ కండరాల దారుఢ్యం తగ్గి.. శరీరంలో కొవ్వు పేరుకుపోవడం.. మొదలైన కారణాలే ఈ సమస్యకు కారణమవుతున్నాయి. అలాగే వయసు పైబడే కొద్దీ శరీరంలో జీవక్రియల రేటు కూడా మందగించడం వల్ల క్యాలరీలు కరిగించే శక్తి కూడా రోజురోజుకీ క్షీణిస్తుంది. అయినప్పటికీ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహార నియమాలు పాటించడం.. వంటి వాటి వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ క్రమంలో ‘మెనోపాజ్‌ అవగాహనా మాసం’ సందర్భంగా మెనోపాజ్ దశలో బరువు తగ్గాలంటే ఎలాంటి విషయాలు దృష్టిలో ఉంచుకోవాలో చూద్దామా..

Know More