సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం.. వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!
జుట్టు రాలుతోందా? అయితే ఇవి తీసుకోండి!
వెచ్చదనానికి కాస్త స్టైల్‌ని జోడించేద్దాం..!
ఆ అబార్షన్ తర్వాత మళ్లీ గర్భం రాలేదు.. నేను తల్లినవుతానా?
కొత్త సంవత్సరంలో సమంత కొత్త హాబీ.. ఎందుకో తెలుసా?
అతని చావుకి నేనే కారణమంటున్నారు.. ఏం చేయాలి?
నా కథ వినండి.. టీకా వచ్చినా సరే.. కరోనా విషయంలో నిర్లక్ష్యం వద్దు!
మన అందాల తారల సంక్రాంతి సంబరాలు చూశారా?
అప్పుడు మా పెళ్లికి నాన్న ఒప్పుకోలేదు!
నేనేం చెప్పలేదు.. అలా జరిగిపోయిందంతే!
నల్లుల బెడద ఎక్కువగా ఉందా..!
అందుకే పిల్లలకు ఎక్కువ భాషలు నేర్పించాలట!
మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..
మీ చుట్టూ ఇలాంటి వ్యక్తులు ఉన్నారా? అయితే ఇక ఆనందం మీ వెంటే!
ఉద్యోగ సంక్షోభం నుంచి గట్టెక్కాలా? అయితే ఇవి తెలుసుకోండి!
బయటకి చెప్పరు.. కానీ దీని గురించే గొడవపడతారట !
అందుకే ఈ లాయరమ్మకు అమెరికాలో అంత గౌరవం!
ఆ నర్సు ఆలోచన ఓ తల్లిని ఆపద నుంచి కాపాడింది!
Login
పంటి నొప్పి వచ్చినప్పుడు గోరువెచ్చని నీటిలో కాస్త పటిక పొడి, కొద్దిగా ఉప్పు వేసి నోట్లో పోసుకుని ఎక్కువ సేపు పుక్కిలించాలి.
Share via facebook
Share via Whatsapp
Share via Twitter
సేమియా పాయసంలో కొద్దిగా జీడిపప్పు పొడి కలిపితే.. రుచితోపాటు చిక్కగానూ ఉంటుంది.
గ్రీన్‌చట్నీ చేస్తున్నప్పుడు రెండుమూడు చెంచాల పెరుగు కూడా వేయండి. చట్నీ రుచిగా, మంచి రంగులో ఉంటుంది.
మొటిమల సమస్య తొలగించుకోవడం కోసం.. అరకప్పు ఓట్స్‌ని ఉడికించి మొటిమలు ఉన్న ప్రాంతంలో రాయాలి. ఇది జిడ్డు, చర్మంపైన ఉండే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. దీంతో క్రమంగా మొటిమలు తగ్గుముఖం పడతాయి.
తందూరీ చికెన్ చేస్తున్నపుడు అది మంచి రంగులో రావాలంటే.. నిమ్మరసం, పసుపు కలిపి అందులో వేయండి.
చేతులకు బీట్రూట్ రంగు అంటుకుంటే.. కొద్దిగా వంటసోడా వేసుకుని నీళ్లతో రుద్ది కడిగేసి చూడండి. రంగు సులువుగా పోతుంది.
నిమ్మకాయలని ఫ్రిజ్‌లో నేరుగా ఉంచితే ఎండిపోయినట్టుగా అయిపోతాయి. బదులుగా కొద్దిగా కొబ్బరినూనె రాసి ఉంచితే తాజాగా ఉంటాయి.
మంచినీళ్ల సీసాలో చెంచా వెనిగర్, కాసిన్ని బియ్యం వేసి కాసేపాగి అటూ ఇటూ కదిపి తరవాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేస్తే బ్యాక్టీరియా పేరుకొనే సమస్య ఉండదు.
మొక్కజొన్నల్ని వేయించడానికి ముందు కాసేపు ఫ్రిజ్‌లో ఉంచండి. అప్పుడు చక్కగా వేగుతాయి.
బ్రెడ్‌పొడి వాడాల్సి వచ్చి.. అది అందుబాటులో లేనప్పుడు కార్న్‌ఫ్లేక్స్‌ని పొడిలా చేసి వాడుకోవచ్చు.
నిమ్మకాయ నుంచి రసం తీసే ముందు 20 సెకన్లు మైక్రోవేవ్ ఒవెన్‌లో పెడితే రసం ఎక్కువగా వస్తుంది.
ఎండు ద్రాక్షలు నిల్వ ఉంచే డబ్బా మూతకి చిల్లులు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే తేమ చేరి ఒకదానికొక్కటి అతుక్కోవు.
భోంచేశాక కాస్త ఉప్పు, ఇంగువ పొడీ మజ్జిగలో వేసుకుని తాగితే అన్నం త్వరగా జీర్ణమవుతుంది. కడుపుబ్బరం సమస్య తలెత్తదు.
గసగసాలను మెత్తటి మిశ్రమంలా చేసి, తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు పోతుంది.
హెన్నా మిశ్రమానికి చెంచా యూకలిప్టస్ నూనె చేరిస్తే మరింత చక్కని రంగు వస్తుంది.
అలంకరణకు ముందు ముఖాన్ని గులాబీ నీళ్లతో తుడుచుకుంటే మేకప్ ఎక్కువ సేపు తాజాగా ఉంటుంది.
కాకరకాయల్ని ముక్కల్లా తరిగాక ఇరవైనిమిషాలపాటు ఉప్పునీటిలోనే వేసి ఉంచితే వాటిలోని చేదు పోతుంది.
పచ్చి మిర్చి ఎక్కువగా తరగాల్సి వచ్చినప్పుడు చేతులకు కొన్ని చల్లని పాలు రాసుకోవాలి. అలా చేస్తే చేతులు మంట పుట్టవు.
కరివేపాకు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. దాన్ని నిల్వ చేసే డబ్బాలో నాలుగైదు మెంతులు కూడా వేయండి.
శనగపిండి లడ్డూలు చేస్తున్నప్పుడు నెయ్యితోపాటు టేబుల్‌స్పూను పల్లీనూనె కూడా కలపండి. లడ్డూలు రుచితోపాటు, మెత్తగాను ఉంటాయి.
వెండి వస్తువుల్ని సహజ సిద్ధ గోరింటాకులో నానబెట్టి శుభ్రపరిస్తే తళతళలాడతాయి.
బెండకాయ ముక్కలని వేయించేటప్పుడు దానిలో చెంచాడు పెరుగు వేస్తే జిగురు తగ్గుతుంది. ముక్కలు చక్కగా విడివిడిగా వేగుతాయి.
గోళ్లు పెళుసుబారి, విరిగిపోతున్నప్పుడు నిద్రపోయే ముందు కొంచెం నువ్వులనూనె రాసుకుంటే త్వరలోనే ఫలితం ఉంటుంది.
బొంబాయిరవ్వతో కేసరి చేస్తున్నప్పుడు మోతాదును బట్టి కొద్దిగా సెనగపిండి కూడా కలపండి. రుచి మాత్రమే కాదు, మంచి రంగూ వస్తుంది.
గ్లాసు నీళ్లలో కొన్ని కర్పూరం బిళ్లలు వేసి.. పడుకునే ముందు మంచం కింద పెడితే దోమల బెడద తప్పుతుంది. ఆ సువాసనకు హాయిగా నిద్రపడుతుంది.
వంకాయలు కొనేప్పుడు పుచ్చులు చూడటమే కాదు. తక్కువ బరువున్న వాటినే ఎంచుకోవాలి. వాటిల్లో గింజలు తక్కువగా ఉంటాయి.
బట్టలపై నూనె మరకలు పడినప్పుడు వాటిపై చాక్‌పీస్‌తో రుద్ది ఆ తర్వాత ఉతకండి. చాక్‌పీస్ నూనెను పీల్చేసుకోవడం వల్ల మరక సులభంగా వదిలిపోతుంది.
తేనే సీసాకు చీమలు పడుతుంటే డబ్బా చుట్టూ కాస్త ఉప్పు, మిరియాల పొడిని చల్లితే సరి. దరిచేరవు.
తులసి ఆకులకు కొద్దిగా రోజ్‌వాటర్, వేపాకులు కలిపి రుబ్బుకొని మొహానికి రాసుకుంటే మొటిమలు తొలగిపోతాయి.
ఉపయోగించిన టీ పొడిని గులాబీ మొక్కలకు వేస్తే.. అవి బాగా పెరిగి.. ఎక్కువ పూలు పూస్తాయి.
గ్యాస్ పొయ్యి నాబ్స్ మరీ జిడ్డుగా ఉరటే టూత్వేస్ట్తో రుద్ది చూడరడి.
బిర్యానీ ఆకులను మెత్తటి పొడిగా చేసి బొద్దింకలు ఉండే చోట వేస్తే ఆ వాసనను తట్టుకోలేక అవి చనిపోతాయి.
ఉల్లిపాయ రసాన్ని ఛాతీపైన, చెవుల వెనక రాసుకొంటే.. శరీర ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది.
ఎండు బఠాణీలను నిల్వచేసేప్పుడు డబ్బాలో ఒకటి రెండు ఎండుమిర్చి ఉంచితే ఎక్కువ కాలం పురుగు పట్టకుండా ఉంటాయి.
చెంచా నిమ్మరసం, అరచెంచా తేనె, చెంచా పాలు కలిపి ముఖానికి అప్త్లె చేసుకొని పది నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముఖంపైన జిడ్డు తొలగిపోతుంది.
కలబంద రసంలో కొద్దిగా కొబ్బరి నూనె వేసి మోచేతులు, మోకాళ్లకు రుద్దడం వల్ల ఆ ప్రాంతంలోని నలుపు తగ్గుతుంది.
ముదిరిపోయిన సొరకాయ గింజల్ని బియ్యంతో కలిపి నానబెట్టి దోశలు వేస్తే రుచిగా ఉంటాయి.
దోమ కాట్లు, దద్దుర్లు, గాయాల వంటి వాటిపై లవంగ నూనెను రాస్తే దురద, మంట సమస్య నుంచి వెంటనే బయటపడచ్చు.
కూరగాయలు, పండ్లు తాజాగా ఉండాలంటే వాటిని పేపర్లో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి.
చలి కాలంలో గొంతు నొప్పి బాధిస్తుంటే మిరియాలను బుగ్గన ఉంచుకుని చప్పరిస్తే సరి.
మస్కారా వేసుకునే ముందు కనురెప్పలపై కొద్దిగా బేబీ పౌడర్ని రాసుకోండి. ఆ తరవాత మస్కారా వేసుకోవడం వల్ల అవి నిండుగా కనిపిస్తాయి.
చాపింగ్ బోర్డుపై ఉన్న మరకలు వదిలిపోవాలంటే నిమ్మచెక్కతో రుద్ది చూడండి.
కుండీలో మొక్క నాటుతున్నప్పుడు అడుగున స్పాంజి ఉంచి అప్పుడు మట్టి నింపాలి. స్పాంజి నీళ్లను పీల్చుకుంటుంది. మొక్కలకు తడి అందుతుంది. నీళ్లూ తక్కువ పడతాయి.
ఫ్రైడ్ రైస్ కోసం వండే అన్నం రుచిగా రావాలంటే బియ్యంలో నీళ్లతో పాటు ఓ కప్పు కొబ్బరి పాలు కలపండి.
వాడిపోయినట్టున్న క్యారట్, బీట్రూట్ వంటివాటిని కాసేపు ఉప్పునీటిలో వేస్తే తాజాగా ఉంటాయి.
కమలా తొక్కల్ని నీటిలో వేసి సన్నటి సెగపై ఉంచితే ఇల్లంతా చక్కటి సువాసన నిండుతుంది.
గుడ్లు ఉడికిస్తున్నప్పుడు నీళ్లలో చెంచా వెనిగర్ వేస్తే తెల్లసొన బయటకు రాకుండా ఉంటుంది.
ప్రకాశవంతమైన చర్మం కోసం ప్రతిరోజూ నిమ్మకాయ చెక్కను చర్మానికి రుద్దుకుంటే సరిపోతుంది
కేక్ మరింత రుచిగా రావాలంటే.. పిండిలో ముందుగానే కాస్త తేనె కలిపి చూడండి!
కప్పు నీటిలో అరకప్పు కీరదోస రసం కలిపి ఫ్రిజ్‌లో పెట్టి ఆ ఐస్ ముక్కలతో ముఖాన్ని రుద్దుకుంటూ ఉంటే చర్మం తాజాగా, అందంగా తయారవుతుంది.
బిస్కెట్లు నిల్వచేసే డబ్బాలో అడుగున ఒక బ్రెడ్స్త్లెసు వేయండి. బిస్కెట్లు మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటాయి.
అరటిపండ్లను ఇతర పండ్లతో కలిపి ఉంచకూడదు. వాటి నుంచి విడుదలయ్యే వాయువులు ఇతర పండ్లను త్వరగా పండిపోయేలా చేస్తుంది.
జీన్స్‌ని పూర్తిగా ఉతికాక అరకప్పు వెనిగర్ కలిపిన నీటిలో జాడించండి. ఇలా చేయడం వల్ల అవి రంగు మారకుండా ఉంటాయి.
ధనియాలను కొద్దిగా వేయించి ఉంచుకుంటే త్వరగా పురుగు పట్టవు.
ధనియాలు నిల్వ చేస్తున్నపుడు త్వరగా పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని దోరగా వేయించి ఆ తర్వాత గాలి తగలని డబ్బాలోకి తీసుకోండి.
సమోసాలు కరకరలాడుతూ ఉండాలంటే.. మైదాలో మొదట కొద్దిగా మొక్కజొన్న పిండి, వేడి నూనె వేసి కలపాలి. తర్వాత వేడి నీళ్లు పోసి చపాతి పిండిలా చేసుకోవాలి.
పాదాలను వారానికోసారి పిప్పర్మెంట్ నూనెతో మర్దన చేసుకుంటే మృదువుగా తయారవుతాయి.
ఉల్లిపాయలు అందుబాటులో లేనప్పుడు కూరలో కొద్దిగా ఇంగువ, చెంచా అల్లం రసం కలపండి. కూరకు మంచి రుచి వస్తుంది.
గోరువెచ్చటి పాలలో కొద్దిగా పసుపు వేసి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది
కూరగాయల్ని తరిగి ఫ్రిజ్‌లో పెట్టుకుని తరవాత వాడదాం అనుకున్నప్పుడు, వాటికి కొద్దిగా నిమ్మరసం రాస్తే తాజాగా ఉంటాయి.
పచ్చిపాలలో పసుపు కలిపి అందులో కాటన్ బాల్స్‌ని నానబెట్టి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. రోజుకో కాటన్ బాల్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ప్రకాశవంతమైన చర్మం మీ సొంతమవుతుంది.
దోసె పిండి పులిసిందా.. అందులో కొద్దిగా చక్కెర వేయండి. ఆ పులుపు తగ్గి.. దోసెలు కమ్మగా తయారవుతాయి.
గాజు పాత్రలు కడిగే నీటిలో కొద్దిగా ఉప్పు కూడా వేయండి. మురికి పోతుంది.
పెదవులు పగిలి మంట పుడుతుంటే వెనిగర్‌లో ముంచిన దూదితో అప్పుడప్పుడూ అద్దుతూ ఉండాలి.
పకోడీ, జంతికల్లాంటివి చేస్తున్నప్పుడు పిండిలో కొద్దిగా పాలు పోసి, తరవాత ఉప్పు వేసి కలపాలి. ఇలా చేస్తే అవి కరకరలాడుతూ వస్తాయి.
బట్టలపై పడిన చెమట తాలూకు మరకలను వదిలించడానికి బేకింగ్సోడాని మరక పడిన చోట రుద్ది ఉతికితే సరి.
గాలి తగిలి గట్టిపడిన బ్రెడ్డుని పొడి చేసి పిండిలో వేస్తే పకోడీలు కరకరలాడి రుచిగా ఉంటాయి.
ఉల్లిపాయలు వేయిస్తున్నప్పుడు అడుగంటకుండా ఉండాలంటే కొద్దిగా పాలు పోస్తే సరి!
బాగా పండిన అరటి పండులో తేనె కలిపి ఈ మిశ్రమాన్ని నల్ల మచ్చలున్న ప్రాంతంలో రాస్తే మచ్చలు తగ్గుతాయి.
పెరుగు త్వరగా పులవకుండా ఉండాలంటే అందులో చిన్న కొబ్బరి ముక్క వేయండి.
దోశ, ఇడ్లీ చేసేటప్పుడు నానబెట్టిన బియ్యం, పప్పులో కొంచెం మెంతులు వేస్తే ఇడ్లీ, దోశలు మెత్తగా ఉంటాయి.
అరటిపళ్లను నేరుగా కాకుండా ప్లాస్టిక్ డబ్బాలో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే తొక్క నల్లబడకుండా ఉంటాయి.
పూరీలు ఎక్కువ నూనె పీల్చుకోకుండా ఉండాలంటే.. చపాతీపిండికన్నా కాస్త గట్టిగా కలుపుకోవాలి. అలాగే పిండి కలిపిన వెంటనే పూరీలు వత్తేయాలి.
ఎండుమిర్చితో కూరకారం కొడుతున్నప్పుడు అందులో కొద్దిగా నువ్వుల నూనె వేయాలి. ఇలా చేస్తే కూరకారం మంచి రంగులో వస్తుంది. రుచి కూడా బాగుంటుంది.
వాడని ఫ్లాస్క్‌లో రెండు లవంగాలు వేస్తే పురుగు చేరదు. దుర్వాసన కూడా రాదు.
పచ్చిమిర్చిని నిల్వ చేస్తున్నప్పుడు వాటిని ఉంచిన కవర్లో కాస్త పసుపు వేయండి. ఇలా చేస్తే అవి త్వరగా పండవు.
బాగా పులిసిన మజ్జిగను రోజుకు రెండుసార్లు పుక్కిలిస్తుంటే నోటి పూత తగ్గుతుంది
పాత్రలు శుభ్రం చేయడానికి ఉపయోగించే నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపితే పాత్రలు నీచు వాసన రాకుండా ఉంటాయి.
తేనె, పెరుగు, రోజ్‌వాటర్ బాగా కలిపి ముఖానికి రాసి పావుగంట తర్వాత కడిగేస్తే ముఖంపై జిడ్డు తగ్గి, తాజాగా మారుతుంది.
కొత్తిమీర కొన్ని రోజులు తాజాగా ఉండాలంటే దాన్ని కాడలతో సహా నీళ్లలో ఉంచాలి. రోజూ నీళ్లు మారిస్తే సరిపోతుంది.
నాలుగు అల్లం ముక్కలు వేణ్నీళ్లలో బాగా మరగనిచ్చి, అందులో రెండు గింజల మిరియాల పొడి వేసి తాగితే జలుబు తగ్గుతుంది.
గుడ్డుసొన గిలక్కొట్టేటప్పుడు చెంచా చల్లని నీళ్లు చేర్చండి. ఇలా చేస్తే ఆమ్లెట్ పెద్దగా వస్తుంది.
కోడిగుడ్డు పెంకులు పారేయకుండా వంటింట్లో అక్కడక్కడా ఉంచండి. బొద్దింకల బెడద ఉండదు.
బంగాళాదుంపలను ఇరవై నిమిషాలు ఉప్పు వేసిన నీటిలో నానబెడితే అవి త్వరగా ఉడుకుతాయి
కలబంద రసంలో ముల్తానీ మట్టి లేదా చందనం కలిపి ముఖానికి పట్టిస్తే మొటిమలు తగ్గుముఖం పడతాయి.
బజ్జీల పిండిలో కొద్దిగా బియ్యప్పిండి కలపండి. అవి కరకరలాడతాయి. నూనె కూడా ఎక్కువగా పీల్చుకోవు.
పనీర్ గట్టిగా అయిపోయిందా..?ఓ పదినిమిషాలు వేడినీటిలో ఉంచి చూడండి. మెత్తగా, కట్ చేసుకునేందుకు అనువుగా మారుతుంది.
పుదీనా పలావ్ రుచిగా రావాలంటే.. ముందుగా పుదీనా ఆకుల్ని చెంచా వెన్న లేదా నెయ్యిలో వేయించండి.
జిడ్డు పేరుకున్న పెనాన్ని వేడినీటిలో కాసేపు ఉంచాలి. ఆ తరవాత నిమ్మ చెక్కతో రుద్దితే సులువుగా శుభ్రపడుతుంది.
ఒక క్యారట్, టొమాటో రసానికి కొన్ని గోరువెచ్చని నీళ్లూ, చెంచా తేనె కలిపి తాగితే రక్తశుద్ది జరుగుతుంది.
క్యాబేజీ ఉడికిస్తున్నప్పుడు... ఆ తరుగుపై ఒక బ్రెడ్ ముక్కని ఉంచితే, కూర వాసన రాకుండా ఉంటుంది.
ముల్తానీ మట్టిని బాదం పేస్ట్‌తో కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
సాంబారు మరీ పల్చగా ఉన్నప్పుడు చెంచా లేదా చెంచాన్నర సెనగపిండిలో కొద్దిగా చక్కెర వేసి నీళ్లతో పేస్టులా చేయండి. దీన్ని సాంబారులో వేసి మరిగిస్తే చిక్కగా మారుతుంది.
ఫ్లాస్కు దుర్వాసన వస్తుంటే మజ్జిగతో కడిగితే సరిపోతుంది.
కరివేపాకు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. దాన్ని నిల్వ చేసే డబ్బాలో నాలుగైదు మెంతులు కూడా వేయండి
కాఫీ పొడిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.
బంగాళాదుంపల వేపుడు కరకరలాడేలా రావాలంటే, ముక్కలు తరిగాక అరగంటసేపు, చల్లని నీళ్లలో ఉంచాలి. ఆ తరవాత వేయించాలి.
రోజూ ఉదయాన్నే రెండు గ్లాసుల నీటిని వేడిచేసి, అందులో మూడు స్పూన్ల జీలకర్ర వేసి, గోరువెచ్చగా అయ్యేంత వరకూ ఉంచి తాగితే బరువు అదుపులో ఉంటుంది.
చపాతీలు పొంగినట్లు రావాలంటే గోధుమపిండిలో కొద్దిగా మైదా లేదా కొన్ని చల్లని నీళ్లు కలిపి చూడండి.
స్వీట్‌కార్న్ ఉడికించి దింపేముందు కొద్దిగా నిమ్మరసం వేయండి. పసుపురంగులో తాజాగా కనిపిస్తాయి.
గోరింటాకు పెట్టుకునే ముందు చేతికి యూకలిప్టస్ నూనె రాసుకుంటే ముదురు ఎరుపు రంగులో పండుతుంది.
చాకు జిగురుగా మారి తరగడానికి వీలుగా లేకపోతే, వెనిగర్‌లో ముంచిన స్పాంజితో తుడిస్తే సరి.
నేలపై లేదా ఏ ఇతర వస్తువులకైనా క్యాండిల్ వ్యాక్స్ అతుక్కొని వదలకపోతే వెనిగర్‌ని చల్లి కాసేపు నానబెట్టి ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది.
వేపాకుల్ని మెత్తగా చేసుకుని, దాన్లో రెండు చెంచాల పెసరపిండి కలిపి దాన్ని పాదాల పగుళ్లున్న చోట రాసి, అరగంట తరవాత కడిగేయాలి.
బంగాళాదుంప రసాన్ని తరచూ చర్మానికి రాసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
అరటిపండ్లు త్వరగా పాడవకుండా ఉండాలంటే ముచ్చికల దగ్గర పారదర్శక ప్లాస్టిక్ కవర్ని చుట్టి ఉంచాలి.
పిల్లలు జలుబుతో బాధ పడుతున్నప్పుడు వాళ్లు స్నానం చేసే నీటిలో 4 చుక్కల యూకలిప్టస్ నూనె కలపండి. ఉపశమనం లభిస్తుంది.
కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి రాత్రి తలకు అప్త్లె చేసుకొని ఉదయాన్నే తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
మొక్కజొన్నల్ని వేయించడానికి ముందు కాసేపు ఫ్రిజ్‌లో ఉంచండి. అప్పుడు చక్కగా వేగుతాయి
బీరువా అరలు... వార్డ్‌రోబుల్లో నాలుగైదు లవంగాలను ఉంచితే సిల్వర్ ఫిష్‌ల బెడద ఉండదు.
ఇంట్లో తయారు చేసే మిల్క్ షేక్‌లు రుచిగా ఉండాలంటే తీసుకున్న పాలను బట్టి కొద్దిగా జామ్ వేసి మిక్సీ పట్టాలి.
దోశపిండి పులిసిందా.. అందులో కొద్దిగా చక్కెర వేయండి. ఆ పులుపు తగ్గి.. దోశలు కమ్మగా తయారవుతాయి.
తెల్లని దుస్తులు, తువాళ్లు వంటివి వాషింగ్మెషీన్లో వేసి ఉతుకుతున్నప్పుడు కొద్దిగా నిమ్మరసం కూడా కలపాలి. అలా చేస్తే మరకలు పోయి.. మెరుస్తాయి!
వంటింటి సింకులో అక్కడక్కడా వంటసోడా చల్లి కాసేపయ్యాక కడిగేయండి. సింకు నుంచి వచ్చే దుర్వాసన పోతుంది.
యాపిల్ ముక్కలుగా కోశాక నల్లగా మారకుండా ఉండాలంటే ముక్కలని చిటికెడు ఉప్పు కలిపిన నీటిలో వేస్తే సరిపోతుంది.
కాటన్ బాల్స్‌ను రోజ్ వాటర్‌లో ముంచి కంటి రెప్పలపై నెమ్మదిగా రాయండి. ఇలా చేస్తే వలయాలు పోవడమే కాక కంట్లోని వేడి కూడా తగ్గుతుంది.
నలుపురంగు బట్టలు రంగు పోకుండా ఉండాలంటే ఉతకడానికి ముందుగా టీ డికాక్షన్లో నానబెట్టాలి. రాయల్బ్లూ రంగుకయితే.. ఉప్పు నీళ్లు మేలు!
పాలల్లో దానిమ్మ తొక్కలను వేసి మరిగించిన తర్వాత ఆ పాలు వడపోసుకొని తాగితే రక్తం శుద్ధవుతుంది.
లెదర్ వస్తువులపై ఏవైనా ఇంకు మరకలున్నాయా?హెయిర్ స్ప్రే చల్లి రుద్దితే ఇట్టే పోతాయి.
ఎక్కువ రోజులు నిల్వ చేసిన బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో కొన్ని వేపాకులు వేసి కలిపితే సరిపోతుంది.
దోసెల పిండిలో అరకప్పు బొంబాయి రవ్వ కలిపి కాసేపు ఉంచితే అవి పెనానికి అంటుకోకుండా చక్కగా వస్తాయి.
పకోడీ పిండిలో కొంచెం నెయ్యి కలిపితే కరకరలాడుతూ వస్తాయి.. రుచిగా కూడా ఉంటాయి.
సెనగపిండిలో చెంచా నిమ్మరసం కలిపి... వెండి వస్తువుల్ని రుద్దితే అవి తళతళలాడతాయి.
సూప్ దింపేముందు బాగా చిలికిన గుడ్డు సొనను కలిపితే రుచి బాగుంటుంది.
పాల సీసా దుర్వాసన రాకుండా ఉండాలంటే... బేకింగ్ సోడా కలిపిన నీళ్లతో కడగాలి!
పనీర్ తయారీ కోసం పాలను విరగ్గొడుతున్నప్పుడు నిమ్మరసంతో పాటు చెంచా పెరుగు వేస్తే... పనీర్ మెత్తగా వస్తుంది.
లవంగాలు తాజావో కాదో తెలుసుకోవడానికి వాటిని గోటితో చిదమాలి. అప్పుడు వాటి నుంచి నూనెలాంటి పదార్థం వస్తే అవి తాజావని అర్థం.
ఎండ ప్రభావానికి గురైన పెదవులకు కలబంద గుజ్జును రాస్తే ఫలితం కనిపిస్తుంది.
బూట్లు, చెప్పుల నుంచి వచ్చే దుర్వాసన పోవాలంటే.. వాటి లోపల వంటసోడా చల్లి కాసేపయ్యాక దులిపేయాలి.
టొమాటోలు పచ్చిగా ఉంటే ఒక్కోదాన్ని విడివిడిగా చిన్నచిన్న న్యూస్ పేపర్ ముక్కల్లో చుట్టి గది ఉష్ణోగ్రతలో ఉంచండి. మర్నాటి కల్లా పండుతాయి.
బెండకాయల్ని వేయించేటప్పుడు అందులో కాస్త నిమ్మరసం కలిపితే ముక్కలు అతుక్కోకుండా కరకరలాడుతూ ఉంటాయి.