ఆనాటి మధురస్మృతులు.. అలా గుర్తుకొచ్చాయ్..!
ఇందువదన.. కుందరదన..! మందగమన.. మధురవచన..! గగన జఘన సొగసులలనవే..! సిగ్గూ పూబంతి ఇసిరే.. సీతామాలచ్చి..! మొగ్గా సింగారం ఇరిసే సుదతీ మీనాచ్చి..! సండే అననురా.. మండే అననురా.. ఎన్నడూ నీ దాన్నెరా..! నా రాజా రా ఇటు రా..! వానా వానా.. వెల్లువాయే..! కొండాకోన తుళ్లిపోయే..! ఈ పాటలు వినగానే మనకు గుర్తొచ్చేది.. తమ కాంబినేషన్‌తో ఆన్‌స్క్రీన్‌పై మ్యాజిక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, లేడీ అమితాబ్ విజయశాంతి. నటన, డ్యాన్స్, గ్లామర్.. ఇలా ప్రతి దానిలోనూ ఒకరికొకరు పోటీపడుతూ 80వ దశకంలో తెరపై బెస్ట్ పెయిర్‌గా ప్రేక్షకుల చేత నీరాజనాలందుకున్నారీ సూపర్‌స్టార్స్. వీళ్లిద్దరు కలిసి నటించిన ‘ఛాలెంజ్’, ‘స్వయంకృషి’, ‘పసివాడి ప్రాణం’, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, ‘గ్యాంగ్‌లీడర్’.. మొదలైన సినిమాలు అభిమానులను ఎంతగా అలరించాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ‘మెకానిక్ అల్లుడు’ తర్వాత వీళ్లిద్దరూ కలిసి మళ్లీ ఏ సినిమాలో నటించలేదు. అయినా తెర వెనుక మాత్రం చిరు, విజయశాంతిల మధ్య ఉన్న స్నేహబంధం కొంతకాలం అలాగే ఉంది.
Know More