సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

women icon @teamvasundhara

åXRx Í䮾Õ-Âî-¦ð-ÅŒÕ-¯ÃoªÃ? ƪáÅä ¨ ®¾ÖÍŒ-Ê©Õ OÕÂî-®¾„äÕ..

N„ã¾Ç ®¾¢“X¾-ŸÄ-§ŒÖ©ðx, «u¹×h© ‚©ð-ÍŒ¯Ã Ÿµîª½-ºÕ©ðx ÂéÇE¹ÊÕ-’¹Õ-º¢’à Ưä¹ «Öª½Õp©Õ Íî{Õ Í䮾Õ-¹ע-{Õ-¯Ãoªá. “X¾®¾ÕhÅŒ¢ «Õ£ÏÇ-@Á©Õ ÅŒ«Õ ¦µÇ„Ã-©ÊÕ ®¾éªjÊ KA©ð ƪ½n¢ Í䮾Õ-¹ע{Ö, ÅŒ«Õ ÆGµ-ª½Õ-ÍŒÕ-©ÊÕ, ®¾yÅŒ¢-“ÅÃEo ’õª½N¢Íä °NÅŒ ¦µÇ’¹-²Äy-NÕ¯ä ÂÕ-¹ע-{Õ-¯Ãoª½Õ. ƪáÅä N„Ã-£¾Ç¦¢Ÿµ¿¢ ®¾èÇ-«Û’à ²Ä’Ã-©¢˜ä ŠÂ¹J X¾{x «Õªí-¹-JÂË æ®o£¾Ç-¦µÇ-«¢Åî ¤Ä{Õ ƒŸ¿lJ «ÕŸµÄu «Õ¢* ¹«âu-E-êÂ-†¾¯þ …¢œ¿œ¿¢ Æ«-®¾-ª½-«Õ¢-{Õ-¯Ãoª½Õ EX¾Û-ºÕ©Õ. ¨ “¹«Õ¢©ð OÕ °N-ÅŒ-¦µÇ-’¹-²ÄyNÕE ‡©Ç ‡¢ÍŒÕ-Âî-„ÃL? ¨ N†¾-§ŒÕ¢©ð OÕ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ© ®¾£¾É-§ŒÖEo ‡©Ç B®¾ÕÂî-„ÃL? OÕÂ¹× Âæð§äÕ °NÅŒ ¦µÇ’¹-²Äy-NÕE ¹L-®Ï-Ê-X¾Ûpœ¿Õ ‡©Ç¢šË N†¾-§ŒÖ©Õ «ÖšÇx-œËÅä N„ã¾Ç N†¾-§ŒÕ¢©ð ŠÂ¹ Ƣ͌-¯ÃÂ¹× ªÃ«ÍŒÕa..? ©Ç¢šË Æ¢¬Ç© OÕŸ¿ 'å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ ¤òM®ýÑ N¦µÇ’¹¢ „ê½Õ ÅŒ«Õ „ç¦ü-å®j-šü©ð ÂíEo ‚ÍŒ-ª½-ºÇ-ÅŒt-¹-„çÕiÊ ®¾ÖÍŒ-Ê©Õ Íä¬Çª½Õ. ‚ N«-ªÃ©Õ OÕÂ¢.. °NÅŒ ¦µÇ’¹-²Äy-NÕE ‡¢ÍŒÕ-Âí-¯ä-«á¢Ÿ¿Õ..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala