ఈ చిన్నారులెందుకు ఫేమస్ అయ్యారో తెలుసా?
స్వచ్ఛమైన మనసు, అమాయకత్వం కలగలిసిన పిల్లలు మాట్లాడుతుంటూనే ఎంతో ముద్దుగా ఉంటుంది. ఇక నిష్కల్మషమైన వారి చిరునవ్వు ఎలాంటి బాధనైనా మరిపిస్తుంది. మాటల్లో సహజత్వం, చూపుల్లో అమాయకత్వంతో కూడిన పిల్లలు ఏ పనిచేసినా చూడడానికి చాలా ముచ్చటేస్తుంటుంది. ఈ క్రమంలో పసిఛాయలు కూడా పోని ఇద్దరు చిన్నారులు తమ గాన ప్రతిభతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. కూనిరాగాలు తీసే వయసులో ఒకరేమో ప్రొఫెషనల్ సింగర్‌లా పాట పాడగా, మరో చిన్నారి ప్రిన్సెస్‌లా మారి క్యూట్‌గా పాటలు పాడి అలరించింది. మరి నెట్టింట్లో వైరలవుతోన్న ఈ ఇద్దరు చిన్నారుల గాత్రాన్ని మనం కూడా విందాం రండి..!
Know More