పూలకు బదులు మొక్కలిచ్చారు.. తల్లిదండ్రులకు ప్రేమ పంచారు!
‘తమ మనసులో దాగున్న ప్రేమను రోజాపూలు, ఇతర కానుకల ద్వారా తెలియజేసుకోవడం.. సినిమాలు-షికార్లు, పార్టీలు, రెస్టరంట్లలో లంచ్-డిన్నర్..’ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులు చేసే హడావిడి మామూలుగా ఉండదు. అయితే.. ‘ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రత్యేకంగా ఒక రోజంటూ అవసరం లేదని.. మీ భాగస్వామికి ప్రతిరోజూ, ప్రతిక్షణం ప్రేమను తెలియజేయచ్చని.. అందుకోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదం’టూ కొందరు భావిస్తుంటారు. ఏదిఏమైనా పాశ్చాత్య సంస్కృతిలో పుట్టిన ఈ సంప్రదాయం ప్రస్తుతం అన్ని దేశాలకూ విస్తరించింది. అయితే ఒకరికొకరు ప్రేమను ఇచ్చిపుచ్చుకునే ఈ ప్రత్యేకమైన రోజున వేడుకల పేరుతో వృథా ఖర్చు చేయకుండా.. పర్యావరణహితంగా, చిన్నారుల్లో సంప్రదాయాల పట్ల అవగాహన పెంచేలా ఉంటే బాగుంటుంది కదూ!! అచ్చం.. ఇలాంటి ఆలోచనలకే శ్రీకారం చుట్టాయి బిహార్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు. మరి, ఈ ‘వేలంటైన్స్ డే’ సందర్భంగా అందరికంటే భిన్నంగా వారేం చేశారో తెలుసుకోవాలనుందా..? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..!
Know More