ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు...ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
స్వాతి ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. బహుళ జాతి కంపెనీ కావడంతో ఆఫీసు మొత్తం ఏసీ సదుపాయం ఉంది. అలాగే తన ఇంటి బెడ్‌రూమ్‌లోనూ ఓ ఏసీని ఏర్పాటు చేసుకుంది స్వాతి. దీంతో ఆమెకు ఏసీ ఓ అవసరంలా మారిపోయింది. కాసేపు బయట కూర్చున్నా సరే ఉక్కపోత, చెమటలు పట్టేస్తున్నాయంటూ చిరాకు పడుతోంది. అయితే ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోన్న స్వాతి ఏసీ కోసం తన బెడ్‌రూమ్‌లోనే ఆఫీస్ వాతావరణాన్ని సృష్టించుకుంది. అంతలోనే.. ‘కరోనా వైరస్ చల్లటి ప్రదేశాల్లో ఎక్కువగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఏసీ ఉపయోగించే ప్రదేశాల్లో వైరస్ విస్తరణ మరీ ఎక్కువగా ఉంది.. కాబట్టి ఏసీలను ఉపయోగించకండి..’ అంటూ వాట్సాప్‌లో వైరలవుతోన్న ఓ మెసేజ్ చదివింది. దీంతో ఏసీ వినియోగించాలా? వద్దా? అన్న సందిగ్ధంలో పడింది స్వాతి. మరి, నిజంగానే ఏసీల వల్ల కరోనా వ్యాపిస్తుందా..? కరోనా విస్తృతిపై ఏసీల ప్రభావం ఎంత వరకు ఉంటుంది? ఒకవేళ ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏసీ వాడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏసీలు, కూలర్లు, వెంటిలేషన్ విషయాల్లో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలేంటి..? ఈ విషయాల గురించి తెలుసుకుందాం రండి..
Know More