వీటితో చలికాలంలోనూ అందంగానే ఉందాం!
కాలమేదైనా అందంగా మెరిసిపోవాలని అమ్మాయిలు ఆరాటపడడం సహజం. అందుకోసమే ఇటు ఇంట్లో సహజసిద్ధమైన సౌందర్య చికిత్సల్ని ఫాలో అవుతూనే అటు బ్యూటీ పార్లర్లను కూడా ఆశ్రయిస్తుంటారు. అయినప్పటికీ ఆయా కాలాల్లో ఎదురయ్యే వాతావరణ పరిస్థితులు అతివల సౌందర్యాన్ని దెబ్బతీస్తూనే ఉంటాయి. ఇక ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండే చలికాలంలో అయితే ఈ సమస్యలు మరింత తీవ్రమవుతుంటాయి. పొడి చర్మం, మడమల్లో పగుళ్లు, జుట్టు నిర్జీవమవడం.. వంటి ఎన్నో సౌందర్య సమస్యలు ఈ కాలంలో అమ్మాయిల పాలిట శాపంగా మారుతున్నాయి. అందుకే వీటన్నింటి నుంచి బయటపడడంతో పాటు ఈ కాలంలో శరీరానికి వెచ్చదనాన్ని అందించడానికి కొన్ని సహజసిద్ధమైన స్పా ట్రీట్మెంట్లు ఉత్తమం అని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. అంతేకాదు.. వీటివల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయట! మరి, అవేంటో తెలుసుకొని మనమూ వాటిని ఫాలో అవుదాం రండి..
Know More