సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

women icon @teamvasundhara

ఆ విషయం మా ఆయనకు ఎలా చెప్పాలి?

నమస్తే మేడమ్‌. నాకు పెళ్లై రెండేళ్లవుతోంది. నేను, నా భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాం. మరో ఆరు నెలల్లో స్వదేశానికి రాబోతున్నాం. మా దాంపత్య జీవితం బాగానే ఉంది.. కానీ మావారి అక్క వల్ల నాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నన్ను ప్రాణంగా ప్రేమించే నా భర్త తన అక్క గురించి ఏ మాట చెప్పినా ఊరుకోడు. ఆమె మా ఇంట్లో ఒక్క రోజుంటే చాలు.. ఆ రోజంతా మా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆమెకు పెళ్లై పదేళ్లవుతుంది. అయినా మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. మా ఆయన కూడా ఆమె చెప్పినదానికల్లా తలూపుతారు. మా పెళ్లయిన దగ్గర్నుంచి ఇదే వ్యవహారం కొనసాగుతోంది. మా వారి అక్క కూతురు ఫోన్లో ఏమడిగినా అప్పటికప్పుడు కొనివ్వాల్సిందే. మా ఆయన ఫంక్షన్‌కి వెళ్లేటప్పుడు ఏ డ్రస్ వేసుకోవాలో కూడా మా ఆడపడుచే చెబుతుంది. ఇలాంటివి తట్టుకోలేక ఉద్యోగం పేరు చెప్పి దూరంగా ఉంటున్నాం.

Know More

women icon @teamvasundhara

కంటతడి పెట్టిస్తోన్న గూగుల్‌ ప్రకటన..!

‘జ్ఞాపకాలు.. చెడ్డవైనా, మంచివైనా ఎప్పుడూ మనతోనే ఉంటాయి. జీవితాంతం వాటిని మోయక తప్పదు..!’.. ‘తొలిప్రేమ’ సినిమాలో హీరో వరుణ్‌ తేజ్‌ చెప్పిన ఈ డైలాగ్‌ చాలామంది హృదయాలను తాకే ఉంటుంది. మనిషి జీవితం అనేక బంధాలతో ముడిపడి ఉంటుంది. ఈ ప్రయాణంలో సంతోషాలు.. బాధలు.. చిరునవ్వులు.. నిట్టూర్పులు.. కన్నీళ్లతో కూడిన ఎన్నో అనుభవాలు మనకు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిసి పంచుకునే జ్ఞాపకాలు ఎప్పటికీ మరపురానివే..! ఎందుకంటే మన జీవితంలో ఎక్కువభాగం మనకు తోడుగా ఉండేది వాళ్లే..! ఈ నేపథ్యంలో భార్యాభర్తల అనుబంధం గురించి గూగుల్‌ రూపొందించిన ఓ ప్రకటన వీక్షకుల హృదయాలను తాకుతోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ వీడియోను చూసి భావోద్వేగానికి గురవుతున్నారు.. కంటతడి పెడుతున్నారు. మరి ఆ విశేషాలేంటో మీరూ చూసేయండి.

Know More

women icon @teamvasundhara

ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?

ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.

Know More

women icon @teamvasundhara

ఇలా చేస్తే అత్తిల్లూ పుట్టిల్లే..!

అప్పటిదాకా పుట్టింట్లో ఎంతో స్వేచ్ఛగా, గారాబంగా పెరిగిన ఆడపిల్ల పెళ్లయ్యాక అత్తింట్లో అడుగుపెట్టగానే ఆమెపై ఎన్నో బరువు బాధ్యతలు వచ్చిపడతాయి. మరి, వాటన్నింటినీ బ్యాలన్స్ చేసుకుంటూ ముందుకు సాగితేనే అటు పుట్టింటి గౌరవాన్ని, ఇటు మెట్టినింటి అనురాగాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే అప్పుడే అత్తారింట్లో అడుగుపెట్టిన అమ్మాయికి ఇవన్నీ కొత్తగానే అనిపిస్తాయి. ఏ విషయంలో ఎలా మెలగాలో అర్థం కాని పరిస్థితి వారిది. అన్నింటికంటే ముఖ్యంగా అత్తింటి వారితో నడుచుకునే విధానం, అత్తమామలకిచ్చే గౌరవమర్యాదలు, వారి అభిరుచులేంటి.. వంటివన్నీ తెలుసుకొని ముందుకు సాగితేనే మెట్టినింటిని కూడా పుట్టింటిలా మార్చుకోవచ్చు. అంతేకాదు.. ఇలా చేయడం వల్ల పెళ్లి తర్వాత అమ్మానాన్నలుగా భావించే అత్తమామలతో సఖ్యత కూడా ఏర్పడుతుంది.. ఇద్దరి మధ్య అనుబంధం మరింత దృఢమవుతుంది. అయితే ఇందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మరి, అవేంటో తెలుసుకొని ఆచరిస్తే అత్తింటి అనుబంధంలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించవచ్చు.

Know More

women icon @teamvasundhara

ఏమో.. మళ్లీ ప్రేమలో పడచ్చేమో!

ఇద్దరు వేర్వేరు మనుషులను, రెండు మనసులను మూడు ముళ్లతో ఏకం చేసేదే పెళ్లి. అగ్ని సాక్షిగా ఒక్కసారి ఏడడుగులు నడిచాక..జీవితాంతం కలిసే ఉండాలి... కష్టమైనా.. సుఖమైనా కలిసే పంచుకోవాలి.. ఇలా పెళ్లి అనే పవిత్ర బంధం గురించి చాలా మాటలే వినిపిస్తుంటాయి. అయితే ప్రస్తుత కాలంలో కొందరు దంపతుల కాపురం ఎలాంటి అరమరికల్లేకుండా సాఫిగా సాగుతుంటే..మరికొన్ని జంటలు సంసారమనే సాగరంలో సర్దుకుపోలేక మధ్యలోనే నూరేళ్ల బంధానికి స్వస్తి పలుకుతున్నాయి. పెళ్లిలో కలిసి ఏడడుగులు నడిచినంత మాత్రాన జీవితాంతం కలిసి నడవలేమంటూ పరస్పర అంగీకారంతో విడిపోతున్నాయి. ఈ క్రమంలో నటి శ్వేతాబసు ప్రసాద్‌ కూడా గతేడాది చివరిలో తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చట్ట ప్రకారం లీగల్‌గా విడాకులు పొందేందుకు తాజాగా కోర్టు మెట్లు కూడా ఎక్కారీ మాజీ కపుల్‌. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి, విడాకులు, సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది శ్వేత.

Know More

women icon @teamvasundhara

ఇలాంటి లవ్‌ ప్రపోజల్‌ను ఎక్కడా చూసుండరు..!

ప్రేమంటేనే ఓ మధురానుభూతి..! ఈ సృష్టిలో ప్రతి బంధం ప్రేమతో ముడిపడినదే..! ప్రేమ లేని సృష్టిని ఊహించుకోవడం కష్టం. అందుకే ఒకరిని ప్రేమించడం.. ఒకరి చేత ప్రేమించబడటం.. ఈ రెండూ గొప్ప విషయాలే..! అయితే మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించడం ఎంత ముఖ్యమో.. వాళ్లకు మన ప్రేమను తెలియజేయడం కూడా అంతే ముఖ్యం. మీరు ప్రేమించే వ్యక్తికి మీ మనసులోని భావాలు అర్థమయ్యేలా చెప్పగలగాలి. మీ ప్రేయసి/ప్రియుడిపై మీకెంత ప్రేముందో మాటల్లో లేదా చేతల్లో వివరంగా చెప్పగలగాలి. దీనినే ఆంగ్లంలో లవ్‌ ప్రపోజల్‌ అని అంటారు. ఒకప్పుడు ప్రేమికులు ఉత్తరాల ద్వారా తమ ప్రేమను వ్యక్తపరిచే వాళ్లు. కాలం మారేకొద్దీ.. ఉత్తరాలు పోయి ఈ-మెయిల్స్‌, మెసేజెస్‌ వచ్చాయి. ప్రేమను వ్యక్తపరిచే విధానం మారినా.. అందులో ఉండే మాధుర్యం మాత్రం అప్పటికీ.. ఇప్పటికీ.. అలాగే ఉంది.

Know More

women icon @teamvasundhara

మళ్లీ అజయ్‌ని చేరాలనుకుంటున్నా... కానీ ఎలా ?

మనసుంటే మార్గం ఉంటుందంటారు. మరి సరిదిద్దుకోలేని తప్పు చేసినప్పుడు కూడా ఆ మనసు మరో మార్గాన్ని చూపిస్తుందా ?బంధాల పంజరంలో బందీ అయిపోయిన ఓ వనిత ఈ ప్రశ్నకు బదులు అడుగుతూ సమాధానం కోసం దీనంగా ఎదురుచూస్తోంది. భర్తతో జీవితాంతం కలిసుంటానని ఏడడుగులు వేసిన ఆమె ఆరు నెలలు తిరగకుండానే అతడికి విడాకులిచ్చింది. జీవితమనే సుడిగుండంలో అయోమయం అయిపోయిన ఆమెకు విధి మరో భర్తను ప్రసాదించింది. అయితే అందుకు ప్రతిగా ఆమెకు అవసరాన్నే మిగిల్చి ప్రేమను తీసేసుకుంది. ప్రేమ లేని జీవితం ఆత్మ లేని దేహం వంటిదని భావించిన ఆమె ఇప్పుడు ఆ ప్రేమను పొందేందుకు తిరిగి మొదటి భర్త వద్దకు వెళ్లాలనుకుంటోంది. మరి అతను ఒప్పుకుంటాడా ? అందుకు సమాజం ఏమంటుంది ? ఈ విషయాన్ని తన రెండో భర్తకు ఎలా తెలపాలి ? అని సతమతమవుతోంది శైలజ. ఆమె హృదయరాగం ఏంటో ఒకసారి విని మీ సలహా అందివ్వమని కోరుతోంది.

Know More

women icon @teamvasundhara

2020లో మేము చూసిన తొలి సూర్యోదయం ఇదే..!

ప్రేమకు మనసుతో తప్ప.. వయసుతో సంబంధం లేదని నిరూపించిన జంటల్లో మిలింద్ సోమన్‌ - అంకితా కొన్వర్‌ల జంట కూడా ఒకటి. తమ మధ్య 26 ఏళ్ల వయోభేదం ఉన్నప్పటికీ ప్రేమ వివాహం చేసుకొని ఈ కపుల్‌ వార్తల్లో నిలిచిన సంగతి విదితమే. సమాజంలో ఎంతోమంది తమ బంధాన్ని తప్పుబడుతూ రకరకాల విమర్శలు చేస్తున్నప్పటికీ వాటన్నింటినీ చిరునవ్వుతో కొట్టిపడేస్తూ తమ వైవాహిక జీవితాన్ని తమకు నచ్చినట్లుగా గడిపేస్తున్నారీ లవ్లీ కపుల్‌. ఈ క్రమంలో మిలింద్‌-అంకితల జంట న్యూ ఇయర్‌ సందర్భంగా జపాన్‌లోని మౌంట్‌ ఫుజీ (అగ్నిపర్వతం)ని సందర్శించారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలు, వీడియోలను వీళ్లు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. అవి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

Know More

women icon @teamvasundhara

నన్ను అనుమానిస్తున్న నా భర్తతో అనుబంధం ఉంచుకోనా? తెంచుకోనా?

మేడమ్‌.. చదువుకునే రోజుల్లో నాకో స్నేహితుడుండేవాడు. చాలాకాలం తర్వాత ఈ మధ్య ఫేస్‌బుక్‌లో మళ్లీ కలిశాడు. అతనితో మాట్లాడుతుండగా తను నన్ను ఇష్టపడుతున్నాడని తెలిసింది. నాకు కూడా అతనంటే ఎప్పట్నుంచో ఇష్టం. దాంతో ఇద్దరం పెళ్లి చేసుకుందామనుకున్నాం. కానీ, కొన్ని రోజుల తర్వాత అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. నన్ను దూరం పెడుతున్నట్టు అనిపించింది. అప్పుడు చాలా బాధపడ్డాను. అలా కొంతకాలం గడిచింది. మా పెద్దవాళ్లు నాకు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అప్పుడు ‘నువ్వు వేరే అతన్ని పెళ్లి చేసుకుంటే సుఖపడవు’ అని అతనన్నాడు. కానీ పెద్దవాళ్ల మాట మీరకూడదని వేరే అతన్ని పెళ్లి చేసుకున్నాను. అయితే నా జీవితంలో నా స్నేహితుడు చెప్పినట్టే జరుగుతోంది.

Know More

women icon @teamvasundhara

ప్రేమ పరవశమే..దైవ దర్శనమే..!

జీవితంలో కొన్ని బంధాలు మన పుట్టుకతో మొదలయితే..మరికొన్ని బంధాలను దేవుడు సృష్టిస్తాడట. అలాంటి వాటిలో ఆలుమగల బంధం కూడా ఒకటి. ‘మ్యారేజెస్‌ ఆర్‌ మేడిన్‌ హెవెన్‌’ అన్నట్లు జీవితాంతం తోడుగా ఉండాల్సిన జోడీని దేవుడే మనతో కలుపుతాడట. సెలబ్రిటీ కపుల్‌ అనుష్కాశర్మ- విరాట్‌కోహ్లీ లను చూస్తే ఈ మాటలు నిజమనిపిస్తాయి. దాంపత్య బంధానికి సరైన నిర్వచనంలా కనిపించే ఈ జంట ఒకరిపై ఒకరు ప్రేమను చూపించడానికి ఏ మాత్రం వెనుకాడరు. వృత్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా ..వీలు చిక్కినప్పుడల్లా వెకేషన్‌లకు వెళ్లి ఏకాంత జీవితం గడుపుతారీ లవ్లీ కపుల్‌. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున ఇటలీలో ఒక్కటైన ఈ ముద్దుల జంట..నేడు తమ రెండో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ క్రమంలో దంపతులిద్దరూ తమ పెళ్లి నాటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Know More

women icon @teamvasundhara

అవును.. మేము విడిపోయాం!

‘పెళ్లంటే నూరేళ్ల పంట..మనసిచ్చి మనువాడాక మరణించేదాకా ఆ పవిత్ర బంధాన్ని తెంచుకోకూడదు..ఒకసారి కలిసి ఏడడుగులు నడిచాక ..కష్టమైనా, సుఖమైనా ఇద్దరూ కలిసే పంచుకోవాలి. ఎన్ని అభిప్రాయ భేదాలొచ్చినా కలకాలం కలిసుండాలి’.. ఇలా పెళ్లి గురించి పురాణాల్లో చాలా మాటలే కనిపిస్తుంటాయి. అయితే ప్రస్తుత కాలంలో కొందరు దంపతుల సంసార నావ కొన్నేళ్ల పాటు బాగానే సాగినా..ఆ తర్వాత పలు కారణాలతో వారిద్దరూ తమ బంధానికి మధ్యలోనే స్వస్తి పలుకుతున్నారు. వ్యక్తిగతంగా, వృత్తిగతంగా దంపతుల మధ్య అభిప్రాయభేదాలు రావడం, ఒకరిపై ఒకరికి గౌరవం తగ్గిపోవడం, వివాహేతర సంబంధాలు..ఇలా వైవాహిక బంధం మధ్యలోనే వీగిపోవడానికి కారణాలెన్నో! సామాన్యులే కాదు..సెలబ్రిటీ జంటలూ ఇందుకు అతీతమేమీ కాదు. ఈ క్రమంలో తాజాగా తన వివాహ బంధానికి ముగింపు పలికింది శ్వేతా బసు ప్రసాద్‌. ఈ నేపథ్యంలో తన భర్త రాహుల్‌ మిట్టల్‌తో విడిపోతున్నానంటూ ఇన్‌స్టా వేదికగా ప్రకటించింది. మరో మూడు రోజుల్లో మొదటి పెళ్లి రోజు జరుపుకోవాల్సిన ఈ దంపతులు..ఇలా తమ వైవాహిక బంధాన్ని తెంచుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

Know More

women icon @teamvasundhara

చిన్నారి చెల్లితో చేయండివన్నీ..!

అక్కాచెల్లెళ్ల బంధం.. అది ఎంతో మధురమైనది.. ప్రత్యేకమైనది. ఒకరికొకరు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు.. పోటీ పడతారు. కానీ ఇద్దరిలో ఏ ఒక్కరికి కష్టమొచ్చినా మరొకరు తోడుంటారు. అన్నీ నేను చూసుకుంటా.. అంటూ ధైర్యాన్నిస్తారు. అండగా నిలబడతారు. అదీ రక్తసంబంధమంటే.. అలాంటిది ఆ ఇద్దరిలో ఒకరికి పెళ్లయి వెళ్లిపోతున్నారంటే అటు సంతోషం, ఇటు బాధ రెండూ కలిసి ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి. పెళ్లయినా ఈ బంధాన్ని మరింత దృఢంగా మార్చుకునేలా.. ఇద్దరూ దూరంగా ఉన్నా.. ఒకరినొకరు ఎప్పుడూ మిస్సవకుండా.. జీవితాంతం గుర్తుంచుకునేలా కొన్ని జ్ఞాపకాలను పదిలపర్చుకోవడానికి ఇదే సరైన సమయం మరి.. అందుకే మీ పెళ్లి కుదిరిందనగానే మీ చిన్నారి చెల్లితో ఈ అల్లరి పనులన్నీ చేసేయండి. ఆ జ్ఞాపకాలు మీరు అత్తారింటికి వెళ్లినా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. నవ్విస్తూ.. మీ చెల్లెలి అల్లరిని గుర్తు చేస్తూ, తాను ఎప్పుడూ మీ పక్కనే ఉన్నట్లుగా మీకు అనిపించేలా చేస్తాయి.

Know More

women icon @teamvasundhara

21 ఏళ్ల ప్రేమ బంధం వీగిపోయింది..!

అప్పుడే మోడలింగ్‌లోకి అడుగుపెట్టాడతను. కానీ అప్పటికే మోడలింగ్‌ కెరీర్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందామె. ఇద్దరూ కలిసి పలు ఫ్యాషన్‌ షోలలో పాల్గొన్నారు. చెట్టపట్టాలేసుకొని ర్యాంప్‌పై నడిచారు. ఈ క్రమంలోనే వారి మధ్య ఏదో తెలియని ఫీలింగ్‌ మొదలైంది. త్వరలోనే ఆ ఫీలింగ్‌ని ప్రేమ అని గ్రహించిన వీరు తమ అనుబంధాన్ని శాశ్వతమైన పెళ్లిబంధంగా మార్చుకున్నారు. అయితే ఇలా మొదలైన తమ ప్రేమ శాశ్వతం కాదని, భవిష్యత్తులో విడిపోతామని అప్పుడు వారికి తెలియలేదు. సంసార సాగరంలోని ఒడిదొడుకుల్ని తట్టుకుంటూ 21 ఏళ్ల పాటు ప్రేమను పంచుకున్న ఈ జంట తాజాగా విడాకులతో సెపరేట్‌ అయిపోయింది. వారెవరో మీకు ఇప్పటికే అర్థమైపోయుంటుంది. యస్‌.. వారే ఒకప్పటి మోడల్స్‌ కమ్‌ యాక్టర్స్‌ అర్జున్‌ రాంపాల్‌ - మెహ్ర్‌ జెస్సియాలు. విడిపోతున్నామని గతేడాది అధికారిక ప్రకటన చేసిన ఈ జంటకు.. ముంబయి బాంద్రాలోని ఓ కోర్టు తాజాగా విడాకులు మంజూరు చేసింది. దాంతో వీరిద్దరి ఫ్యాన్సే కాదు.. సినీ ఇండస్ట్రీ కూడా షాక్‌కు గురైంది. ఈ నేపథ్యంలో వీరి ప్రేమ, పెళ్లి, విడాకులకు సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాల గురించి తెలుసుకుందాం..

Know More

women icon @teamvasundhara

అవును.. మేము ప్రేమలో ఉన్నాం!

ప్రేమ మన జీవితంలో ఎప్పుడు, ఎలా చిగురిస్తుందో చెప్పలేం. ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి కొందరికి సంవత్సరాలు పట్టచ్చు. అదే ఇంకొందరికి కేవలం రోజుల సమయం చాలు. తాను పరిచయమైన 5 నెలలకే తన మాసస చోరుడు తనకు పూర్తిగా అర్థమయ్యాడు అంటోందీ బాలీవుడ్‌ క్యూటీ కృతి కర్బందా. ‘బోణీ’ సినిమాతో విజయాన్ని బోణీ కొట్టకపోయినా.. వెండితెరపై గుర్తింపు తెచ్చుకుందీ దిల్లీ బ్యూటీ. ఆపై తెలుగులో ‘తీన్‌మార్‌’, ’మిస్టర్‌. నూకయ్య’, ‘ఒంగోలు గిత్త’, ’బ్రూస్‌లీ’ సినిమాలు చేసినా తన సక్సెస్‌ రేట్‌ని మాత్రం పెంచుకోలేకపోయింది. ప్రస్తుతం తన దృష్టంతా బాలీవుడ్‌పై పెట్టిన ఈ స్టార్‌ ‘హౌస్‌ఫుల్‌ ’తో తన కెరీర్‌లోనే మంచి హిట్‌ అందుకుంది. తను నటించిన ‘పాగల్‌పంతీ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన రిలేషన్‌షిప్‌ గురించి కన్ఫమ్‌ చేసిందీ సుందరి. మరి కృతి ప్రేమ కబుర్లేంటో విందామా..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala