సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

మిమ్మల్ని ఇష్టపడే వాళ్లనే.. మీరూ ఇష్టపడండి!

తనదైన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది అందాల తార రాయ్‌ లక్ష్మీ. ‘కాంచనమాల కేబుల్‌ టీవీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. అనంతరం పలు విజయవంతమైన సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు బాలీవుడ్‌లోనూ నటించిన ఈ బ్యూటీ.. సినిమాలతోనే కాకుండా సోషల్‌ మీడియా వేదికగా కూడా అభిమానులతో నిత్యం టచ్‌లోనే ఉంటుంది. తన లేటెస్ట్‌ ఫొటోలను, సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకోవడం ఈ ముద్దుగుమ్మకు అలవాటు. మే 5న లక్ష్మీ రాయ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తను పోస్ట్‌ చేసిన కొన్ని ఫొటోలు, వాటికి ఇచ్చిన ఆసక్తికరమైన క్యాప్షన్‌లపై ఓ లుక్కేద్దాం రండి..

Know More

women icon @teamvasundhara

హలో.. హలో.. మీరు నేననుకునే వ్యక్తేనా?

న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి.. యాంకర్‌గా రాణించి.. సినిమాల్లో నటించేంత స్థాయికి ఎదిగింది అనసూయ. ఎప్పుడూ ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటూ.. స్టార్‌ యాంకర్‌గా పేరు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. ఇక కెరీర్‌ పరంగా తానెంత బిజీగా ఉన్నా సరే.. సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉండే అనసూయ.. తన ఫొటోలతో పాటు, కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ‘జబర్దస్త్‌’ సెట్‌లో లంగా ఓణీలో డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన అను.. ‘నా ఆత్మ పరిభాషే డ్యాన్స్‌’ అనే క్యాప్షన్‌ రాసుకొచ్చింది.

Know More

women icon @teamvasundhara

ÆX¾Ûpœ¿Õ œË“åX-†¾-¯þÅî ¦ÇŸµ¿-X¾œÄf..!

ªÃ§ýÕ ©ÂÌ~t.. ¨ æXª½Õ NÊ-’Ã¯ä ‚„çÕ ÊJh¢-*Ê 'Åö¦Ç Åö¦ÇÑ, 'ª½ÅÃh©Ö ª½ÅÃh©ÖÑ ¤Ä{©ä ’¹Õªíh-²Ähªá.. ƒ{Õ “X¾Åäu¹ UÅÃ-©Åî Æ©-J®¾Öh.. Æ{Õ ®ÏE-«Ö©ðx ŌʟçjÊ ¤Ä“ÅŒ-©Åî «Õ¢* æXª½Õ ÅçÍŒÕa-¹עD ¦ÖušÌ.. “X¾®¾ÕhÅŒ¢ £ÏÇ¢D©ð ‚„çÕ ÊšË¢-*Ê 'WMÐ2Ñ *“ÅŒ¢ Nœ¿Õ-Ÿ¿-©Â¹× ®ÏŸ¿l´-«Õ-«Û-Åî¢C. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à ®ÏE«ÖÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê N†¾-§ŒÖ-©ÊÕ X¾¢ÍŒÕ-¹ע{Ö.. ŸÄE-Â¢ ÅŒ¯ç¢ÅŒ ¹†¾d-X¾-œË¢D N«-J¢*¢C ©ÂË~t.. Æ¢Åä-Âß¿Õ.. ®ÏE«Ö †¾àšË¢’û ®¾«Õ-§ŒÕ¢©ð œË“åX-†¾-¯þÅî ¦ÇŸµ¿-X¾-œÄf-ÊE Â¹ØœÄ ¦§ŒÕ-{-åX-šËd¢C ªÃ§ýÕ ©ÂÌ~t. 'WMÐ2 *“B-¹-ª½º ®¾«Õ-§ŒÕ¢©ð ¯äÊÕ œË“åX-†¾-¯þÅî ¦ÇŸµ¿-X¾œÄf. ¨ ®ÏE«Ö Â¢ «á¢Ÿ¿Õ’à ¯äÊÕ 11 ê°© ¦ª½Õ«Û ÅŒ’Ã_Lq «*a¢C. ‚ ÅŒªÃyÅŒ ÆŸä ¤Ä“ÅŒ Â¢ 17 ÂË©ð©Õ åXJT, «ÕSx 8 ÂË©ð©Õ ÅŒ’Ã_ÊÕ.. ƒ©Ç ÂíEo ¯ç©-©ðx¯ä ÅŒ’¹Õ_ÅŒÖ åXª½Õ-’¹ÕÅŒÖ …¢œ¿œ¿¢ «©x ¯Ã ¬ÁK-ª½¢åXj ŸÄE “X¾¦µÇ«¢ ¦Ç’ïä X¾œË¢C. Æ®¾©ä ª½Â¹-ª½-Âé ‚£¾É-ª½-X¾-ŸÄ-ªÃn©Õ AÊ-œ¿-«Õ¢˜ä ¯ÃÂ¹× ÍÃ©Ç ƒ†¾d¢. ŸÄEo NÕ®¾q-«Û-ÅŒÕ-¯Ão-ÊÊo ¦ÇŸµ¿ „äCµ¢-ÍäC. D¢Åî œË“åX-†¾-¯þ-©ðÂË „çRx-¤ò§ŒÖ. ‡X¾Ûpœ¿Ö *ªÃ’Ã_ …¢œä-ŸÄEo. ‡«-J-ÅîÊÖ Â¹©-«-œÄ-EÂË ‚®¾ÂËh ÍŒÖXÏ¢-Íä-ŸÄEo Âß¿Õ.. ÂÃF ‚ ®¾«Õ-§ŒÕ¢©ð ¯Ã ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ, æ®o£ÏÇ-ÅŒÕ©Õ ‡¢Åî ²Ä§ŒÕ¢ Íä¬Çª½Õ. ¯Ã ®¾«Õ®¾uÊÕ Æª½n¢ Í䮾Õ-ÂíE *ÂËÅŒq Íäªá¢-Íê½Õ. D¢Åî ¯äÊÕ AJT «Ö«â©Õ «ÕE-†Ï-ʧŒÖu..Ñ Æ¢{Ö ÅŒÊ ÆÊÕ-¦µ¼-„Ã-©ÊÕ X¾¢ÍŒÕ-¹עD Æ¢ŸÄ© ªÃP. «ÕJ, Oթ𠇫-J-éÂj¯Ã œË“åX-†¾¯þ …¢˜ä Š¢{-J’à ‚ ¦ÇŸµ¿ÊÕ ¦µ¼J¢-ÍŒ-¹עœÄ OÕª½Ö ŸÄEo ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu-©Åî X¾¢ÍŒÕ-ÂË. „çÕª½Õ-é’jÊ *ÂË-ÅŒqÅî ŸÄEo Ÿ¿Öª½¢ Í䮾Õ-ÂË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala