సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

అలా అయితే ధోనీని మరోసారి కన్నెత్తి కూడా చూసేదాన్ని కాదేమో!

మహేంద్ర సింగ్‌ ధోనీ... క్రికెట్‌ గురించి తెలిసినవారికి ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. కెరీర్‌ ప్రారంభంలో ధనాధన్‌ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ధోనీ తన ఆహార్యంతోనూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రత్యేకించి తన పొడవాటి హెయిర్‌స్టైల్‌తో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. అంతేకాదు చాలామంది అభిమానులు, యువత ధోనీ హెయిర్‌స్టైల్‌ను అనుకరించారు. ఇలా ఎందరినో ఆకట్టుకున్న ధోనీ హెయిర్‌స్టైల్‌ అతడి సతీమణి సాక్షికి ఏ మాత్రం నచ్చలేదట. తాజాగా ధోనీ ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ ఛాట్‌లో పాల్గొన్న ఆమె తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

Æ©Ç …¢˜ä ¯ÃÂ¹× ÊÍŒaŸ¿Õ..!

¦ÇM-«Ûœþ šÇXý-„çÖ®ýd £ÔǪî-ªá-Êx©ð “X¾®¾ÕhÅŒ¢ «á¢Ÿ¿Õ-«-ª½Õ-®¾©ð …¢C DXÏ-ÂÃ-X¾-Ÿ¿Õ-Âíºã. ƒ{Õ ¦ÇM-«Ûœþ, Æ{Õ £¾ÉM-«Ûœþ ®ÏE-«Ö©ðx ʚˮ¾Öh G°’à ’¹œË-æX-²òh¢C. ƒ¢ÅŒ G° 农¿Öu-©ü©ð Â¹ØœÄ ¨ Æ«Õtœ¿Õ ƒšÌ-«© æX¶®ý-¦Õ-Âú©ð ÆGµ-«Ö-ÊÕ-©Åî “X¾Åäu-¹¢’à «áÍŒašË¢*¢C. „ê½-œË-TÊ “X¾¬Áo-©Â¹× ®¾«Ö-ŸµÄ-Ê-NÕ®¾Öh.. 'ƒ¢šðx Ÿ¿Õ«át …¢˜ä ¯ÃÂ¹× Æ®¾q©Õ ÊÍŒaŸ¿Õ. Æ¢Ÿ¿Õê ¯ÃÂ¹× \«Ö“ÅŒ¢ O©Õ *Âˈ¯Ã ƒ¢šËE ¬ÁÙ“¦µ¼¢ Í䮾Õ-¹עšÇ. Æ©Çê’ ®¾y§ŒÕ¢’à «¢{ Í䮾Õ-ÂíE AÊ-œÄ-EÂË ƒ†¾d-X¾-œ¿ÅÃ. ¨«ÕŸµäu '$$$ : C J{ªýo ‚X¶ý èÇ¢œ¿ªý êÂèüÑ †¾àšË¢-’û©ð ¦µÇ’¹¢’à NŸä-¬Ç©ðx ¯Ã©Õ’¹Õ ¯ç©©Õ Š¢{-J-’Ã¯ä …¯Ão. ‚ ®¾«Õ-§ŒÕ¢©ð †¾àšË¢’û «áT-®ÏÊ ÅŒªÃyÅŒ ƒ¢šËÂË Í䪽Õ-ÂíE ¯Ã X¾ÊÕ©Õ ¯ä¯ä Í䮾Õ-Âí-¯ä-ŸÄEo. ƒÂ¹, \«Ö“ÅŒ¢ BJ¹ ŸíJ-Â˯à E“Ÿ¿-¤ò-«-œÄ-Eê “X¾§ŒÕ-Ao®¾Õh¢šÇ. Æ©Çê’ ‡X¾Ûpœ¿Ö ‡«ªî ŠÂ¹J ’¹ÕJ¢* ‚©ð-*-®¾Öh¯ä …¢šÇ..Ñ Æ¢{Ö ÅŒÊ ÆGµ-ª½Õ-ÍŒÕ-©ÊÕ ÆGµ-«Ö-ÊÕ-©Åî X¾¢ÍŒÕ-Âí¢C. Æ¢Åä-Âß¿Õ.. ¦ÇM-«Ûœþ “œÎ„þÕ-’¹-ªýx’à æXª½Õ-Åç-ÍŒÕa-ÂíÊo æ£Ç«Õ-«Ö-L-EÂË Â¹ØœÄ ²Ä«Ö->¹ «ÖŸµ¿u«Õ¢ „äC-¹’à '‰ ©«ÜuÑ ÍçXÏp¢C. ‡¢Ÿ¿Õ-¹-¯ä’à OÕ ®¾¢Ÿä£¾Ç¢..? æ£Ç«Õ-«Ö-LE ƒšÌ-«© •J-TÊ ŠÂ¹ “åX®ý-OÕ-šü©ð «ÖšÇx-œ¿ÕÅŒÖ.. “X¾®¾ÕhÅŒ¢ …Êo ¹Ÿ±Ä-¯Ã-ªá-¹©ðx “œÎ„þÕ-’¹ªýx Ưä X¾Ÿ¿¢ DXÏÂà X¾Ÿ¿Õ-Âí-ºãÂ¹× ¦Ç’à ®¾J-¤ò-Ōբ-Ÿ¿E ÍçX¾Ûp-Âí-ÍÃaª½Õ. ¨ „ÃuÈuÂ¹× ®¾p¢C¢-*Ê DXϹ šËy{dªý ŸÄyªÃ ÅŒÊ ‚Ê¢-ŸÄEo ‚„çÕÅî X¾¢ÍŒÕ-Âí¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala