మా పాపకు ఆ అలవాటుంది.. ఎలా మాన్పించాలి?
నమస్తే మేడమ్.. మా పాప వయసు 12 ఏళ్లు. 7వ తరగతి చదువుతోంది. మా పాప 5, 6 తరగతులు బాగానే చదివింది. కానీ ఇప్పుడు సరిగ్గా చదవడం లేదు. మంచి మార్కులు కూడా రావట్లేదు. అలాగే కొన్ని రోజుల క్రితం తన స్కూల్లో టీచర్ పర్సులో నుంచి ఎవరికీ తెలియకుండా డబ్బు తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న టీచర్.. స్కూల్ డైరెక్టర్‌కి కంప్లైంట్ చేస్తే.. సీసీ కెమెరాలు పరిశీలించి మమ్మల్ని పిలిపించారు. ఇంటికొచ్చిన తర్వాత పాపను అడిగితే నేను తీయలేదని అబద్ధాలు చెప్పింది. కొన్ని రోజుల క్రితం ఎగ్జామ్ రాసిన తర్వాత తిరిగి ఆ పేపర్ టీచర్లకి ఇవ్వలేదని తెలిసింది. వాళ్ల టీచర్లు ఎంతమంది అడిగినా ఇచ్చాననే సమాధానం చెప్పింది. అయితే ఇంటికొచ్చాక తిట్టి అడిగితే.. అప్పుడు కావాలనే పేపర్ ఇవ్వకుండా బయట పడేశానని చెప్పింది. ఇలా పాప అబద్ధాలు చెప్పకుండా ఎలా మాన్పించాలి? - ఓ సోదరి
Know More