డేట్‌కు రమ్మని వేధించాడు!
కల్కి కొచ్లిన్..బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తున్న హీరోయిన్. 2009లో ‘దేవ్ డి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాకే ‘బెస్ట్ సపోర్టింగ్ యాక్ర్టెస్’ గా ఫిల్మ్‌ఫేర్ అందుకుంది. ఆ తర్వాత ‘షైతాన్’, ‘జిందగీ న మిలేగీ దొబారా’, ‘షాంఘై’, ‘యే జవానీ హై దివానీ’, ‘హ్యాపీ ఎండింగ్’, ‘మార్గరిటా విత్ ఏ స్ర్టా, తదితర చిత్రాల్లో నటించి అలరించింది. సినిమాలే కాదు ..ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలు.. ముఖ్యంగా మహిళా సమస్యలపై గళమెత్తడంలోనూ ముందుంటుందీ ముద్దుగుమ్మ. ఏవిషయంలోనైనా ముక్కుసూటిగా మాట్లాడడం ఆమె నైజం. ఈ క్రమంలో తాను జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు, చిత్ర పరిశ్రలో ఎదుర్కొన్న వేధింపుల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకుందీ బ్యూటీ.
Know More