సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఈ మూడు చిట్కాలతో పీసీఓఎస్‌ను అదుపు చేసుకున్నా!

పీసీఓఎస్‌/పీసీఓడీ.. పేరేదైనా ఎంతోమంది మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందీ సమస్య. పదిలో కనీసం ఒక్కరైనా ఈ సమస్యతో బాధపడుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు మహిళల పట్ల ఇదెంత శాపంగా పరిణమిస్తుందో! అయితే ఈ సమస్యతో బాధపడే మహిళలు కూడా తమ అనుభవాలను బయటికి చెప్పడానికి ఇష్టపడరు.. కారణం సమాజం తమనెక్కడ చిన్న చూపు చూస్తుందోనని! కానీ కొంతమంది మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి తమ పీసీఓఎస్‌ స్టోరీని పంచుకుంటూ నలుగురిలో స్ఫూర్తి నింపుతుంటారు. అలాంటి వారిలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఉన్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా సోనమ్‌ కపూర్‌ కూడా తాను గత కొన్నేళ్లుగా పీసీఓస్‌తో బాధపడుతున్నట్లు తాజాగా సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. అంతేకాదు.. ఈ సమస్యను అదుపు చేసుకోవడానికి తాను పాటిస్తోన్న చిట్కాలను సైతం ఓ వీడియో రూపంలో పోస్ట్‌ చేసి ఇతర మహిళల్లో పీసీఓఎస్‌పై అవగాహన పెంచుతోంది. సంతాన సమస్యలు, అధిక బరువు, అవాంఛిత రోమాలు.. పీసీఓఎస్‌ మహిళలపై చూపే ప్రతికూల ప్రభావానికి కొన్ని సాక్ష్యాలివి! ఇది ఒక్కసారి మన జీవితంలోకొచ్చిందంటే.. దీన్ని అదుపు చేసుకోవడమే తప్ప.. శాశ్వత పరిష్కారం లేదంటున్నారు వైద్య నిపుణులు. చక్కటి లైఫ్‌స్టైల్‌, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా చేసే వ్యాయామం.. వంటివన్నీ పీసీఓఎస్‌ను అదుపు చేసుకునేందుకు మార్గాలు అంటూ సలహా ఇస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌ కూడా ఇదే విషయం చెబుతోంది. పీసీఓఎస్‌ బారిన పడ్డాక తాను ఎదుర్కొన్న సవాళ్లను, దీన్ని అదుపు చేసుకునేందుకు పాటిస్తోన్న చిట్కాలను వివరిస్తూ ఓ వీడియో రూపొందించిందీ భామ. దీన్ని తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ మహిళలందరిలో ఈ సమస్య పట్ల అవగాహన పెంచుతోంది.

Know More

women icon @teamvasundhara

'కరోనా మనల్ని ఏం చేస్తుందిలే ' అనుకోవద్దు!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా ప్రస్తుతం మనదేశంలోనూ ఉగ్రరూపం చూపిస్తోంది. రోజుకు లక్షకు దగ్గరగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అయితే అదే సమయంలో కరోనా సోకి కోలుకున్న బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండడం కొంచెం ఊరట కలిగించే విషయమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మహమ్మారి బారిన పడి కోలుకున్న వారు తమ అనుభవాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. ఇక వైరస్‌ను జయించిన సెలబ్రిటీలు కూడా తమ సందేశాల ద్వారా ఫ్యాన్స్‌కు కరోనా జాగ్రత్తలు చెబుతున్నారు. తద్వారా అభిమానుల్లో భయం పోగొట్టి ధైర్యాన్ని నింపుతున్నారు. ఈ క్రమంలో తమిళ నటి నిక్కీ గల్రానీ కొద్ది రోజుల క్రితం కొవిడ్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. సుమారు రెండు వారాల పాటు హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్న ఆమె పూర్తిగా కోలుకుంది. ఈ సందర్భంగా కొవిడ్‌కు సంబంధించి తన అనుభవాలను ఓ వీడియో రూపంలో పంచుకుంది.

Know More

women icon @teamvasundhara

నెలసరి నొప్పుల్ని అలా దూరం చేసుకుంటున్నా!

మనల్ని నెలనెలా పలకరించే నెలసరి కారణంగా అటు శారీరకంగా, ఇటు మానసికంగా పలు ఆరోగ్య సమస్యలు ఎదురవడం సహజం. ముఖ్యంగా పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి.. వంటివి ఏ పనీ చేసుకోనివ్వకుండా, విశ్రాంతి తీసుకోనివ్వకుండా మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అయితే అలాంటప్పుడే శరీరానికి కాస్త పని చెప్పాలంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. ఫిట్‌నెస్‌ గురూ మిలింద్‌ సోమన్‌ భార్యగానే కాకుండా.. శారీరక, మానసిక ఆరోగ్యం విషయంలో తాను చేసే వ్యాయామాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అంకిత. తన వ్యక్తిగత విషయాలు, తాను చేసే వర్కవుట్‌కి సంబంధించిన పోస్టులను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకునే ఈ ముద్దుగుమ్మ.. నెలసరి సమస్యల్ని ఓ సింపుల్‌ చిట్కాతో ఇట్టే ఎదుర్కోవచ్చంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్‌ చేసింది. మరి, అదేంటో మనమూ తెలుసుకొని ఫాలో అయిపోదామా?!

Know More

women icon @teamvasundhara

కరోనా నుంచి అలా బయటపడ్డా.. అదే నా ఆయుధం!

ఈ రోజుల్లో ఒంట్లో కాస్త నలతగా అనిపిస్తే చాలు.. మన మనసంతా కరోనా వైరస్‌ చుట్టూనే తిరుగుతోంది. మనకూ వైరస్‌ సోకిందేమోనని కంగారు పడిపోతున్నాం. ఇక ఎలాంటి లక్షణాలు లేని వారిలో కూడా కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఎవరి నుంచి ముప్పు ముంచుకొస్తుందో, మనలోనూ కరోనా వైరస్‌ ఉందేమోనని క్షణక్షణం భయంభయంగా గడుపుతున్నాం. ఇదిగో ఇలాంటి భయమే మనల్ని నిలువెల్లా ముంచుతుందంటున్నారు నగరానికి చెందిన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్పా రెడ్డి. కొద్దిరోజుల క్రితమే కొవిడ్‌ బారిన పడి కోలుకున్న ఆమె.. చక్కటి ఆహారం, వ్యాయామం, ధ్యానంతో ఈ వైరస్‌ను జయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మనలోని రోగనిరోధక శక్తే కరోనాను ఎదిరించే ఆయుధమని, దాన్ని దృఢంగా ఉంచుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించడంతో పాటు ధైర్యంగా అడుగు ముందుకేయాలంటూ సూచిస్తున్నారు. ఈ క్రమంలో తన కొవిడ్‌ అనుభవాలను, దాన్నుంచి బయటపడిన విధానాన్ని ఇన్‌స్టా వీడియోతో పాటు దానికి జతచేసిన సుదీర్ఘమైన క్యాప్షన్‌ రూపంలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో, పోస్ట్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Know More

women icon @teamvasundhara

సింపుల్‌గా ఇలా ఇంట్లోనే వర్కవుట్స్‌ చేసేద్దాం..!

వ్యాయామం అనగానే జిమ్‌, అందులో చేసే కఠినమైన వ్యాయామాలే మన కళ్ల ముందు కదలాడతాయి. కానీ వాటి అవసరం లేకుండా ఇంట్లోనే సులభమైన వర్కవుట్స్‌ చేస్తూ మన ఫిట్‌నెస్‌ లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఇదివరకే చాలామంది ముద్దుగుమ్మలు నిరూపించారు. అంతేనా.. వారు చేసే ఆ వర్కవుట్‌ వీడియోలను, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటూ తమ అభిమానులకు ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్పుతుంటారు కూడా! అలాంటి ఫిట్టెస్ట్‌ బ్యూటీస్‌ జాబితాలో ఫిట్‌నెస్‌ గురూ, బాలీవుడ్‌ హీరో మిలింద్‌ సోమన్‌ భార్య అంకితా కొన్వర్‌ తప్పకుండా ఉంటుంది. తాను చేసిన వర్కవుట్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల మరో వీడియోను పోస్ట్‌ చేసింది. ఇందులో భాగంగా ఇంట్లోనే ఈజీగా చేసే కొన్ని వర్కవుట్లను తాను చేస్తూనే.. తన ఫ్యాన్స్‌కి నేర్పుతోందీ ఫిట్టెస్ట్‌ బేబ్‌. మరి, అంకిత చేసిన ఆ వర్కవుట్లేంటో తెలుసుకొని, ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లోనే ఫిట్‌గా మారిపోదాం రండి..

Know More

women icon @teamvasundhara

నీళ్లు ఎలా తాగాలో మీకు తెలుసా?

మనం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండడానికి రోజుకో కొత్త మార్గాన్ని అన్వేషిస్తుంటాం. ఈ క్రమంలో కొత్త కొత్త వ్యాయామాలు నేర్చుకోవడం, విభిన్న ఆహార పదార్థాల రుచిని ఆస్వాదించడంతో పాటు.. తీసుకునే ఆహారం కూడా ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? ఏ సమయానికి తింటున్నాం? వంటి విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంటాం. కానీ కొన్ని ప్రాథమిక అంశాలను మాత్రం మర్చిపోతుంటాం. ఇదే విషయం గురించి నొక్కి వక్కాణిస్తోంది బాలీవుడ్‌ ఫిట్టెస్ట్‌ బ్యూటీ మలైకా అరోరా. ఫిట్‌నెస్‌లో భాగంగా మనం పాటించే నియమాల్లో నీళ్లు తాగడం కూడా ఒకటని, అయితే నీళ్లు తాగడానికీ ఓ పద్ధతుంది అంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేసిందీ సుందరి. లాక్‌డౌన్‌లో భాగంగా ఇప్పటికే తన ఫిట్‌నెస్‌, హెల్దీ, బ్యూటీ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఫ్యాన్స్‌తో నిరంతరం టచ్‌లోనే ఉంది మలైకా. ఇక తాజాగా నీళ్లు ఎలా తాగాలో వివరిస్తూ తన అభిమానులకు ఆరోగ్య పాఠాలు చెబుతోంది.

Know More

women icon @teamvasundhara

«ÕÊ¢-Ÿ¿ª½¢ „ÃJÂË ®¾¤òªýd ÍäŸÄl¢..!

«Õ£ÏÇ@Ç ®¾«Õ-®¾u-©åXj ÅŒÊ ’¹@ÇEo NE-XÏ¢-ÍŒ-œ¿„äÕ Âß¿Õ.. «Õ£ÏÇ-@Á-©Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê ÆEo N†¾-§ŒÖ-©ðxÊÖ X¾ÜJh «ÕŸ¿l-ŌՒà E©Õ-®¾Õh¢C ¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© ¦µÇ«Õ JÍà ͌ŸÄl. ¨ ¯äX¾-Ÿ±¿u¢-©ð¯ä “X¾®¾ÕhÅŒ¢ ƒ¢’¹x¢œþ „äC-¹’à •ª½Õ-’¹Õ-ÅîÊo «Õ£ÏÇ@Ç “X¾X¾¢-ÍŒ-¹-Xý©ð ¦µÇ’¹¢’à «ÕÊ «Õ£ÏÇ@Ç •{ÕdÂ¹× ÅŒÊ «ÕŸ¿lÅŒÕ Åç©Õ-X¾ÛÅŒÖ ƒ¯þ-²Äd-“’Ã-„þÕ©ð ‹ OœË-§çÖÊÕ å®jÅŒ¢ ¤ò®ýd Íä®Ï¢C JÍÃ. Æ¢Åä-Âß¿Õ.. ‚C-„ê½¢ (V©ãj 2Ê) ¦µÇª½Åý.. ŸÄ§ŒÖC ¤ÄÂË-²Än¯þÅî ÅŒ©-X¾-œ¿-ÊÕÊo ®¾¢Ÿ¿ª½s´¢’à «ÕÊ •{ÕdÂ¹× «ÕÊ¢-Ÿ¿J ®¾¤ò-ªýdE Â¹ØœÄ Æ¢C¢-ÍŒ-«ÕE ÂÕ-Åî¢C. '’¹ÅŒ 骢œ¿Õ ‚C-„Ã-ªÃ© “ÂËÅŒ¢ (W¯þ 18Ê) ¦µÇª½Åý, ¤ÄÂË-²Än¯þ •{x «ÕŸµ¿u ͵âXÏ-§ŒÕ¯þq “šðX¶Ô åX¶jÊ©ü •J-T¢C. Æ¢Ÿ¿Õ©ð «ÕÊ¢ ‹œË-¤ò§ŒÖ¢. ‚ ªîV ªîœ¿xFo EªÃt-ÊÕ-†¾u¢’à «ÖªÃªá.. Ÿ¿ÕÂÃ-ºÇ©Õ Å窽Õ-ÍŒÕ-Âî-©äŸ¿Õ.. ŠÂ¹ˆ-«Ö-{©ð Íç¤Äp-©¢˜ä ‚ ªîV èÇB§ŒÕ 宩«Û CÊ-„äÕ-„çÖ-Ê-Êo{Õx ÆE-XÏ¢-*¢C. Æ®¾©Õ OÕ Æ¢Ÿ¿-JÂÌ “X¾®¾ÕhÅŒ¢ «Õ£ÏÇ-@Á© “ÂËéšü “X¾X¾¢-ÍŒ-¹Xý •ª½Õ-’¹Õ-Ōբ-Ÿ¿Êo ®¾¢’¹A Åç©Õ²Ä? Æ¢Ÿ¿Õ-©ðÊÖ ‚C-„ê½¢ «ÕÊ •{Õd, ¤ÄÂË-²Än-¯þÅî ÅŒ©-X¾-œ¿ÊÕ¢Ÿ¿Êo N†¾§ŒÕ¢ Åç©Õ²Ä? ÂæšËd ¨ “¹«Õ¢©ð «ÕÊ¢-Ÿ¿ª½¢ ‡©Ç¢šË L¢’¹-¦µäŸ¿¢ ÍŒÖX¾-¹עœÄ «ÕÊ «Õ£ÏÇ@Ç •{ÕdÂ¹× «ÕŸ¿l-ŌՒà E©-„ÃL. ¯ä¯çjÅä «ÕÊ •{ÕdÂ¹× X¾ÜJh ®¾¤ò-ªýd-E²Äh. OÕª½Õ Â¹ØœÄ X¾Ûª½Õ-†¾ß© •{ÕdÂ¹× ‡¢ÅŒ …ÅÃq-£¾Ç¢’ïçjÅä ®¾¤òªýd ƒÍÃaªî.. Æ©Çê’ «Õ£ÏÇ-@Á© •{ÕdÂ¹× Â¹ØœÄ ƒ²Äh-ª½E ‚P-®¾Õh¯Ão.. ’î ƒ¢œË§ŒÖ..Ñ Æ¢{Ö ÅŒÊ OœË-§ç֩𠦵ǒ¹¢’à N«-J¢-*¢D Æ¢ŸÄ© Åê½. “X¾®¾ÕhÅŒ¢ ¨ «áŸ¿Õl-’¹Õ«Õt.. 'ƒ¯þ-å®jœþ ‡œþbÑ Æ¯ä „ç¦ü ®ÏK-®ý©ð ÊšË-²òh¢C. ƒ¢Ÿ¿Õ©ð JÍÃ.. ‹ “ÂËéšü •{Õd §ŒÕ•-«Ö-ÊÕ-ªÃ-L’à ¹E-XÏ¢-ÍŒ-ÊÕ¢C.

Know More

women icon @teamvasundhara

XÏ©ðxœË ³ÄXÏ¢’û ÆŸ¿-ª½£¾Çô..!

*Êo XÏ©x© ’¹ÕJ¢*.. „Ã@Áx *LXÏ Í䆾d© ’¹ÕJ¢* ‡¢ÅŒ ÍçXÏp¯Ã Ō¹׈„ä. „Ã@ÁxE ‡Â¹ˆ-œËÂË B®¾Õ-éÂ-Rx¯Ã ƒ@ÁÙx XÔÂË X¾¢Cꪮ¾Õh¢-šÇª½Õ. ¨ “¹«Õ¢©ð „ÃJE ÆŸ¿Õ-X¾Û©ð åX{d-œÄ-EÂË ÅŒLx-Ÿ¿¢“œ¿Õ©Õ Í䧌ÕE “X¾§ŒÕ-ÅÃo©Õ …¢œ¿«Êœ¿¢©ð ®¾¢Ÿä£¾Ç¢ ©äŸ¿Õ. ƒÂ¹ XÏ©xLo ³ÄXÏ¢’ûÂË B®¾Õ-éÂ-Rx-Ê-X¾Ûpœ¿Õ ͌֜ÄL.. ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©Â¹× ͌չˆ©Õ ÍŒÖXÏ-²Ähª½Õ. ¯ÃÂ¹× ÆC ÂÄÃL.. ƒC ÂÄÃL.. Æ¢{Ö «ÖªÃ¢ Í䮾Õh¢-šÇª½Õ. Æ¢Ÿ¿Õê Âæð©Õ.. OJE ³ÄXÏ¢’û ¦Õ{d©ð ¤ñ¢C’Ã_ ¹تîa-¦ãšËd «ÕK ³ÄXÏ¢’û Íäæ®®¾Õh¢-šÇª½Õ «ÕOÕt©Õ. ƪáÅä Æ¢Ÿ¿ª½Õ XÏ©x©Õ ‹ ª½Â¹-„çÕiÅä.. ¨ OœË§çÖ©ðE ¦Õœîfœ¿Õ «Ö“ÅŒ¢ ƒ¢Âî-ª½Â¹¢. «Õ£¾É ¦ÕCl´-«Õ¢-ÅŒÕ-œË’à ƫÖt-¯Ã-Êo-©ÊÕ \«Ö“ÅŒ¢ œË®¾dªýs Í䧌Õ-¹עœÄ '¯Ã ª½Ö˜ä å®X¾-êª{Õ..Ñ ÆÊo{Õx’à ŌÊÕ Â¹ØœÄ “¬ÁŸ¿l´’à ³ÄXÏ¢’û Íäæ®-®¾Õh-¯Ãoœ¿Õ. ³ÄX¾Û-©ðE “œ¿®¾Õq©ÊÕ \«Ö“ÅŒ¢ *¢Ÿ¿-ª½-«¢-Ÿ¿ª½ Í䧌Õ-¹עœÄ X¾Ÿ¿l´-A’à ŌÊÂ¹× ÅŒTÊ å®jV©ð “œ¿®¾Õq-©ÊÕ ‹XÏ’Ã_ ‡¢XϹ Í䮾Õ-Âí¢-{Õ-¯Ãoœ¿Õ. ³ÄX¾Û©ð „ä©Ç-œ¿-D-®ÏÊ Ÿ¿Õ®¾ÕhLo ֮͌¾Öh.. Æ©Ç ‹ ªõ¢œä-¬Çœ¿Õ. ƒ©Ç ¦ÕœË-¦ÕœË Êœ¿-¹-©Åî «áŸ¿Õl’à ³ÄXÏ¢’û Í䮾ÕhÊo ¨ ¦ÕœîfœË OœË§çÖ ²Ä«Ö->¹ «ÖŸµ¿u«Õ “XϧŒá-©ÊÕ ‚¹-{Õd-¹ע-šð¢C. ƒ¢é¢-Ÿ¿Õ-ÂÃ-©®¾u¢? OÕª½Ö ‹²ÄJ OœË ³ÄXÏ¢-’ûE OÂË~¢-Íä-§ŒÕ¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala