సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

నచ్చిన పని చేయనివ్వకుండా ఏదీ మనల్ని ఆపలేదు!

ఇవి కోరుకున్న సెలవులు కావు.. కానీ ప్రజలు ఇన్ని రోజులుగా ఇంటికే పరిమితమవడం ఇదే తొలిసారి కావచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇళ్లలోనే ఉండిపోయారు. మరి, ఇలా అనుకోకుండా వచ్చిన ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతోంది అలనాటి అందాల తార మాధురీ దీక్షిత్‌. గాలికి గజ్జెలు కట్టుకొని ఇంట్లో క్లాసికల్ డ్యాన్స్‌ చేస్తోన్న వీడియోను పోస్ట్‌ చేసిందీ అందాల తార. ఇక ఈ వీడియోతో పాటు ‘ఈ విలువైన సమయాన్ని వృథా చేయకుండా.. పూర్తిగా వినియోగించుకుందాం.. మనకిష్టమైన పని చేయనివ్వకుండా ఏదీ మనల్ని ఆపలేదు..’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించిందీ ఎవర్‌గ్రీన్‌ బ్యూటీ.

Know More

women icon @teamvasundhara

హ్యాపీ బర్త్‌డే ‘కత్తి కాంతమ్మ’..!

‘ఈ సినిమాలో నాకు దొరికిన మంచి నటి హరితేజ. ఈ అమ్మాయిని చాలా సంవత్సరాలపాటు చూడాలి. నచ్చినా, నచ్చకపోయినా భరించడమే.. తప్పదు. ఎందుకంటే ఈ అమ్మాయి నాకు చిన్న వయసులో ఉన్న అందమైన సూర్యకాంతంలా అనిపించింది. అంతటి గొప్ప నటిలా అనిపించింది హరితేజ.’ ఇవీ... ‘అ..ఆ’ సినిమా ఆడియో లాంచ్‌ కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్‌ చెప్పిన మాటలు. హరితేజ నటన చూస్తుంటే ఈ మాటలు అక్షరాలా నిజమే అనిపిస్తాయి. ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘మనసు మమత’ ధారావాహికతో మొదలైన హరితేజ ఆన్‌స్క్రీన్‌ జర్నీ.. సినిమాల వరకు విజయవంతంగా కొనసాగింది.. కొనసాగుతోంది. 2017లో తెలుగులో తొలిసారి ప్రసారమైన ‘బిగ్‌బాస్‌’ రియాలిటీ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరైందీ కుందనపుబొమ్మ. ఈ క్రమంలో తన హరికథా నైపుణ్యంతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుందీ చిన్నది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు పలు ప్రోగ్రామ్‌లకు యాంకర్‌గానూ వ్యవహరిస్తోంది హరితేజ. ఈ క్రమంలో ప్రస్తుతం ‘పండు చేస్కో’తో ఆడ పడుచులతో సందడి చేస్తోన్న హరి.. తాను ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్‌మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటుందీ బ్యూటీ క్వీన్‌. ఈ క్రమంలో తన కెరీర్‌, వ్యక్తిగత విషయాలను నెటిజన్లతో పంచుకుంటుంది. తన సహజ నటన, ఆకట్టుకునే రూపంతో బుల్లితెరతో పాటు వెండితెర ప్రేక్షకులను సైతం అలరిస్తోన్న హరితేజ పుట్టినరోజు నేడు (ఫిబ్రవరి 26 బుధవారం). ఈ సందర్భంగా హరి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన కొన్ని ఆసక్తికర పోస్ట్‌లపై ఓ లుక్కేద్దామా.!!

Know More

women icon @teamvasundhara

Æ¢Ÿ¿Õê 'Ÿ¿®¾ªÃÑ «ÖÂ¹× å®p†¾©ü!

*¯Ão, åXŸÄl Ưä ÅäœÄ ©ä¹עœÄ “X¾A ŠÂ¹ˆJ °N-ÅŒ¢©ð ¦ð©ã-œ¿Eo ®¾ª½-ŸÄLo „çÖ®¾Õ-ÂíÍäa X¾¢œ¿ê’ 'Ÿ¿®¾ªÃÑ. ‚ Æ«Õt© ’¹Êo Æ«Õt.. Ÿ¿Õª½_«ÕtÊÕ “X¾®¾Êo¢ Í䮾Õ¹ׯä¢-Ÿ¿ÕÂ¹× ƒŸä ®¾éªjÊ ®¾¢Ÿ¿-ª½s´¢’à ¦µÇN-®¾Õh¢-šÇª½Õ ÆA-«©Õ. Ÿ¿ÕªÃ_ ¬Áª½-Êo-«-ªÃ“Ōթ æXª½ÕÅî „çj¦µ¼-«¢’à •ª½Õ-X¾Û-Âí¯ä ¨ ÅíNÕtC ªîV©Õ Æ«Õt-„Ã-JE NNŸµ¿ Æ©¢-ÂÃ-ªÃ©ðx Âí©Õ®¾Öh, ªîVÂî ¯çj„䟿u¢ ®¾«Õ-Jp®¾Öh.. «Õ£ÏÇ-@Á-©¢Åà ŌÊt-§ŒÕ-ÅŒy¢Åî ÅŒJ¢-*-¤ò-Åê½Õ. ÍŒŸ¿Õ-«Û©Õ, …Ÿîu’éÕ, „Ãu¤ÄªÃ©¢{Ö X¾{d-ºÇ©ðx ®Ïnª½-X¾œ¿f „ê½Õ Ÿ¿®¾ªÃ X¾¢œ¿’¹ÊÕ ÅŒ«Õ „Ã@ÁxÅî •ª½Õ-X¾Û-Âí-¯ä¢-Ÿ¿ÕÂ¹× ²ñ¢ÅŒ «Ü@ÁxÂ¹× ÅŒª½L „ç@ÁÙh¢-šÇª½Õ. ƒÂ¹ ¨ ¬Áª½-Êo-«-ªÃ-“Ōթðx ‚ÈJ X¶¾Õ{d-„çÕiÊ 'N•-§ŒÕ-Ÿ¿-¬ÁNÕÑ ¯Ãœ¿Õ Æ®¾©Õ ®Ï®¾-©ãjÊ X¾¢œ¿’¹ £¾ÇœÄ-NœË ¯ç©-Âí¢-{Õ¢C. Æ¢Ÿ¿Õê ‚ ®¾ª½-ŸÄ© X¾¢œ¿’¹ Æ¢˜ä ÅŒ«ÕÂ¹Ø ‡¢Åî ƒ†¾d-«Õ¢-{Õ-¯Ãoª½Õ X¾©Õ-«Ûª½Õ 宩-“G-šÌ©Õ. Ÿ¿®¾ªÃ ÅŒ«ÕÂ¹× ¦ð©ã-œ¿Eo èÇcX¾-Âé ®¾«Ö-£¾Éª½¢ Æ¢{Õ-¯Ãoª½Õ «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ ÂÃ©ä° Æ«Öt-ªá©Õ. «ÕJ, ƒ©Ç ‡¯îo ®¾ª½-ŸÄLo, «ÕŸµ¿Õ-ªÃ-ÊÕ-¦µ¼Ö-ÅŒÕLo Æ¢C¢Íä Ÿ¿®¾ªÃ X¾¢œ¿’¹ ’¹ÕJ¢* Âí¢Ÿ¿ª½Õ 宩-“G-šÌ©Õ, Âí¢Ÿ¿ª½Õ ÂÃ©ä° Æ«Öt-ªá©Õ ÅŒ«Õ ƢŌ-ª½¢’ÃEo '«®¾Õ¢-Ÿµ¿-ª½.-¯çšüÑÅî “X¾Åäu-¹¢’à X¾¢ÍŒÕ-¹×-¯Ãoª½Õ.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala